హోమ్ / విద్య / బాలల హక్కులు / జువెనైల్ జస్టిస్ (శిశు సంక్షేమం మరియు రక్షణ) చట్టం, 2015
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జువెనైల్ జస్టిస్ (శిశు సంక్షేమం మరియు రక్షణ) చట్టం, 2015

జువెనైల్ జస్టిస్ (శిశు సంక్షేమం మరయు రక్షణ) చట్టం, 2015; జనవరి 15, 2016 నుండి అమలులోకి వచ్చింది.

జువెనైల్ జస్టిస్ (శిశు సంక్షేమం మరయు రక్షణ) చట్టం, 2015; జనవరి 15, 2016 నుండి అమలులోకి వచ్చింది. మరియు జువెనైల్ జస్టిస్ (శిశు సంక్షేమం మరియు రక్షణ) చట్టం, 2000 రద్దు అయ్యింది. JJ చట్టం 2015, భద్రత మరియు రక్షణ అవసరమైన పిల్లలకు మరియు చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న పిల్లలకు సంబంధంచిన నిబంధలను దృఢపరచడానికి ఉపయోగపడుతుంది.

ముఖ్య అంశాలు

  • ప్రతికూల శబ్దార్ధాలను తొలగించడానికి, పదం "జువెనైల్" ను "పిల్లలు" లేదా 'చట్ట పరమైన వివాదంలో ఉన్న బాలాలు" గా ఈ చట్టంలో మార్పు చేసారు.
  • అనేక కొత్త నిర్వచనాలు చేర్చారు; అనాథ, వదిలి వేసిన పిల్లలు మరియు లొంగిపోయిన పిల్లలు; మరియు చిన్ని, తీవ్రమైన మరియు దుశ్చర్య నేరాలకు పాల్పడిన పిల్లలుగా నిర్వచించారు.
  • జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) అధికారాల పనితీరు, బాధ్యతలను స్పష్టంగా తెలియ జేసారు; జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) ద్వారా విచారణకు సంబంధించి స్పష్టమైన సమయపాలన తెపిపారు; ఈ బిల్లు ప్రతి జిల్లాలో జువెనైల్ జస్టిస్ బోర్డ్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ఏర్పాటును తప్పని సరి చేస్తుంది. ఈ రెండింటిలో కనీసం ఒక మహిళా సభ్యురాలు ఉండాలి.
  • దుశ్చర్యలకు పాల్పడ్డ పదహారు సంవత్సరాలు దాటిన పిల్లలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి - విభాగం 15 కింద, 16-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు దుశ్చర్యలకు పాల్పడితే వారికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. జువెనైల్ జస్టిస్ బోర్డు, ఇలాంటి పిల్లలను ప్రాథమికంగా అంచనా వేసిన తర్వాత, పిల్లల కోర్టుకు (సెషన్ కోర్ట్) కేసులు బదిలీ చేసే ఐచ్చికాన్ని కలిగి ఉంటుంది. విచారణ జరుగుతున్నప్పుడు మరియు విచారణ తర్వాత వారికి 21 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా 'రక్షిత ప్రదేశంలో' ఉంచాలి అని నిబంధనలు ఉన్నాయి. దాని తర్వాత పిల్లల కోర్టు బాలల విశ్లేషణను నిర్వహిస్తుంది. విచారణ తర్వాత పిల్లలు మారారని అంచనాకు వస్తే వరిని పరిశీలనలో ఉంచి విడుదల చేస్తారు. వారు మారలేదిని అనిపిస్తే వారిని మిగితా శిక్ష అనుభవించడానికి జైలుకు పంపిస్తారు. బలాత్కారం మరియు హత్యలాంటి దుశ్చర్యలకు పాల్పడిన బాల నేరస్థులను నిరోధకంగా ఈ చట్టం పనిచేస్తుంది మరియు బాధితుల హక్కులు రక్షించడానికి పని చేస్తుంది.
  • అనాధ, వదిలి వేసిన మరియు లొంగి పోయిన పిల్లల దత్తతను క్రమబద్ధ దత్తతగా మార్చిన ప్రత్యేక కొత్త అధ్యాయం - అనాధ, వదిలివేసిన మరియు లొంగిపోయిన పిల్లల దత్తతను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుత సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (KARA)కు, ఈ ప్రక్రియ మరింత సమర్థవంతంగా పని చేయడానికి, చట్టబద్దతను కల్పించారు. ప్రత్యేక అధ్యాయం (VIII) దత్తత విధానం మరియు దానిని అనుసరించని వారి శిక్షలకు సంబంధించిన వివరణాత్మక నియమాలను అందిస్తుంది. దేశం మరియు దేశాల మద్య దత్తతకు సంబంధించిన నియమాలను, పిల్లవాడి దత్తత సరే అనేది కలిపి, క్రమబద్ధం చేసారు.
  • పిల్లలపై జరిగే క్రొత్త నేరాల చేరిక - ఇప్పటివరకు ఏ ఇతర చట్ట పరిధిలో తగినంతగా లేని పిల్లలపై జరిగే నేరాలను ఈ చట్టంలో చేర్చారు. వీటిలో: పిల్లల అమ్మకం కొనుగోలు, అక్రమ పద్ధతిలో దత్తత, పిల్లల సంరక్షణ సంస్థలలో శారీరక దండన, తీవ్రవాద గ్రూపులలో పిల్లల ఉపయోగం, వికలాంగ పిల్లలపై నేరాలు, అపహరణ మరియు పిల్లలను బలవంతంగా తీసుకు పోవటం ఉన్నాయి.
  • చైల్డ్ కేర్ సంస్థల తప్పనిసరి నమోదు - రాష్ట్ర ప్రభుత్వం లేదా స్వచ్ఛంద లేదా ప్రభుత్వేతర సంస్థల ద్వారా నడపబడుతున్న అన్ని పిల్లల రక్షణ సంస్థలు, పూర్తిగా లేదా పాక్షికంగా పిల్లల నిర్వహన చేస్తున్న సంస్థలు, వారు ప్రభుత్వం నుండి సహాయం తీసుకుంటున్నా తీసుకో పోయినా, తప్పనిసరిగా చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి 6 నెలల లోపల చట్టం కింద నమోదు చేసుకోవాలి. అలా జరగకపోతే చట్టంకఠినమైన చర్యలు తీసుకుంటుంది.
  • అనేక పునరావాస మరియు సామాజిక పునరేకీకరణ చర్యలను చట్టంపరంగా వివాదంలో ఉన్న మరియు భద్రత మరియు రక్షణ అవసరమైన పిల్లలకోసం చేపట్టింది. సంస్థాగత సంరక్షణలో పిల్లలకు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, డి-అడిక్షన్, వ్యాధుల చికిత్స, వృత్తి శిక్షణ, నైపుణ్యం పెంపుదల, జీవితానికి అవసరమైన నైపుణ్య విద్య, కౌన్సిలింగ్, తదితరమైన వాటిని సమాజంలో నిర్మాణాత్మకంగా పని చెయడానికి అందిస్తారు. సంస్థాగతం కాని ఎంపికల రకాలు: పిల్లల శారీరక సంబంధమైన కుటుంబంలో కాకుండా ఇతర కుటుంబ వాతావరణంలో పిల్లలను ఉంచడానికి స్పాన్సర్షిప్ మరియు జాగ్రత్తను తీసుకుంటారు . పిల్లల భద్రతకోసం వాటి ఎంపిక, అర్హుత, ఆమోదం మరియు పర్యవేక్షణ అందిస్తారు.

పూర్తి చట్టాన్ని చూడటానికి, ఇక్కడ క్లిక్కు చేయండి.

మూలం : మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సంబంధిత వనరులు

  1. పిల్లలకు సంబంధించిన చట్టాలు
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు