హోమ్ / విద్య / బాలల హక్కులు / బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతలు

బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతలు. ప్రస్తుతం మనదేశంలో చాలా మంది బాలలు హక్కులు కోల్పోయి దీనావస్ధలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా మంది బాలబాలికలు అన్ని జిల్లాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం మనదేశంలో చాలా మంది బాలలు హక్కులు కోల్పోయి దీనావస్ధలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా మంది బాలబాలికలు అన్ని జిల్లాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ బాలలు పొలం పనులు, కూలి పనులు, నేత పనులు, ఇంటి పనులు, హొటల్, గ్యారేజీల్లో, గేదేలు, మేకల వద్ద పనులు చేస్తూ నిరంతరం వారి హక్కులను కోల్పోయి జీవిస్తున్నారు.
ఇంట్లో పనివాళ్ళగా లేదా దాబాలు, రెస్టారెంట్లు, హొటళ్ళు, టీ దుకాణాలు లేదా ఇతర వినోద కేంద్రాల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకొనుట 10 అక్టోబరు 2006 నుండి నిషేధించబడింది. పిల్లలను ఈ వృత్తుల్లో ఎవరైనా పెట్టుకుంటే ఒక సంవత్సరం కారాగార శిక్షకు మరియు (లేదా) జరిమానాకు బాధ్యులగుదురు.
పలుచోట్ల బాలల పైన దౌర్జన్యాలు, లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలలు వారి హక్కులను కోల్పోయి వీధుల్లో తిరుగుతున్నారు. గ్రామ పంచాయితీలు బాధ్యత వహించి బాలలందరు బడిలో ఉండేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ బాలల భవిష్యత్తుకు రూపకల్పన చేసి వారి జీవితాలను మెరుగు పరిచేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలి.

 • బాలల హక్కుల సంరక్షణ కోసం గ్రామ పంచాయితీ స్ధాయిలో ఎంపిక చేయబడిన కూలీల ప్రతినిధులు (లేబర్ యూనియన్స్) కార్మిక సంఘాలు, మహిళ మండలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, గ్రామ పంచాయితీ ప్రతినిధులు అంగన్ వాడీ కార్యకర్తలు, సమాజ సేవకులు మరియు బాలల హక్కుల కోసం పాటుపడే యువతకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా బాలల హక్కుల సంరక్షణకు పాటు పడటం.
 • బాలల హక్కుల పరిరక్షణ సంస్ధలు గ్రామంలోని పాఠశాలలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించటంలో మార్గాన్ని ఆలోచింపజేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించుకొనుట.
 • ప్రతి గ్రామ పంచాయితీలో బాలల హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకొనుటకు బాలలకు, యువతకు శిక్షణ ఇచ్చి బాలల సంఘాలను బలోపేతం చేయటం.
 • గ్రామ పంచాయితీ స్ధాయిలో ఉన్న బాలల పక్కుల సంఘాల కార్యక్రమాలు చేపట్టడం మరియు పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా ఆ సంఘ ప్రతినిధులకు శిక్షణలు ఇవ్వడం.
 • బాలల సంఘాలకు, బాలల హక్కులు గురించి ప్రచారం నిర్వహిస్తూ బాలలందరిని స్కూల్ కి వచ్చే విధంగా, బాలల సమస్యలను వారే చర్చించుకుని, వారి అభిప్రాయాలను వ్యక్తపరచుకొనుటకు వేదికలు ఏర్పాటుచేయడం

చట్ట ప్రకారంగా ఈ క్రింద సూచించిన హక్కును వారికి చెందేలా చూడాలి

 • ప్రేమ, నమ్మకం
 • వాత్సల్యము, స్నేహం
 • రక్షణ
 • బాల్యం
 • శిక్షణ
 • పోషణ, వసతి
 • ఆరోగ్యం, పౌష్టికాహారం
 • ఆటపాటలు, మంచితనం
 • భాగస్వామ్యం పొందుట
 • అభిప్రాయాలకు అవకాశం
 • వినోదం, సంతోషం

బాలల హక్కుల సంరక్షణలో గ్రామ పంచాయితీల పాత్ర

 • బాలల చదువు కోసం గ్రామ పంచాయితీలు కృషి చేయాలి.
 • గ్రామ పంచాయితీ గ్రామంలోని అంగన్ వాడి స్కూల్ వివరాలు సేకరించి ఉంచుకోవాలి
 • స్కూల్ బిల్డింగ్, అంగన్ వాడి బిల్డింగ్ సమస్యను గుర్తించి దానిని పూర్తి చేయుటకు ప్రయత్నించాలి.
 • అంగన్ వాడి స్కూల్ కు సంబంధించిన పనులను ఆయా అధికారులతో చర్చించి ఆ పనులను పూర్తి చేయాలి.
 • బాలల హాజరు, టీచర్స్, వాళ్ళ వర్క్ ప్రాబ్లమ్ గురించి అంగన్ వాడి స్కూల్ అభివృద్ధి కమిటీ వాకబు చేస్తుండాలి.
 • గ్రామ పంచాయితీల ద్వారా గ్రామంలోని అంగన్ వాడి పాఠశాలలతో సంబంధాలను పెంపొందించుకోవాలి.
 • బాల కార్మికవ్యవస్ధ లేని పంచాయితీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలి

గ్రామ పంచాయితీలలో బాలల ఆరోగ్యం, రక్షణ - ప్రాధాన్యత ఆరోగ్యం

 • శిశు మరణాలు, అబార్షన్స్, చిన్న బాలల మరణాలను గుర్తించి వాటిని ప్రామాణికంగా తగ్గే విధంగా చూడాలి.
 • బాలలకు ఎటువంటి వ్యాధి రాకుండా నిరోధించేందుకు, అంగ వైకల్యం రాకుండా అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించటంలో ప్రధాన పాత్ర పోషించాలి
 • హెచ్.ఐ.వి / ఎయిడ్స్ ఉన్న బాలల బాగోగులు చూసుకుంటూ సహకరించాలి. ఆ వైరస్ ఇతరులకు సోకకుండా నివారించేందుకు ప్రయత్నించాలి.
 • బాలలందరికి ప్రామిక ఆరోగ్య సేవలు అందేటట్లు బాధ్యత కలిగి ఉండాలి

రక్షణ

 • గ్రామంలోని బాలలందరూ అంగన్ వాడి పాఠశాలలో ఉండేవిధంగా చూడాలి.
 • గ్రామంలోని అంగన్ వాడి వ్యవస్ధను కలిగి ఉండాలి
 • ఆడపిల్లలకు సంరక్షణ గురించి చర్యలు తీసుకోవాలి.
 • బాలల కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో బాలలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి.
 • పంచాయితీ పరిధిలోని బాలలకు సంబంధించిన రక్షణ, ఆరోగ్యం, బాలల హక్కుల సంరక్షణ కోసం స్ధాయి సంఘాలకు సంస్ధలను ఏర్పాటు చేసి సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలి.

గ్రామ పంచాయితీ చేయవలసిన మరియు చేయకూడని పనులు

చేయకూడనివి

చేయదగినవి

 • బాలలను పనికి పంపరాదు
 • ఆడ, మగ తేడా ఉండరాదు
 • బాలలకు ఇంటిపని భారం కాకూడదు.
 • బాలలను నిరుత్సాహపరచరాదు.
 • అంగన్ వాడి బిల్ఢింగ్స్ ను, స్కూల్ బిల్ఢింగ్స్ ను, సొంత కార్యక్రమాలకు ఉపయోగించరాదు
 • స్కూల్ కి వచ్చే నిధులను దుర్వినియోగం చేయరాదు
 • టీచర్లును, అంగన్ వాడి కార్యకర్తలను రాజకీయానికి ఉపయోగించరాదు
 • టీచర్ల చెడు అలవాట్లను ప్రోత్సహించకూడదు.
 • అంగన్ వాడి కార్యకర్తలను, స్కూల్ టీచర్లును గ్రామపంచాయితీ పనులకు ఉపయోగించరాదు
 • సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.
 • స్కూల్ టీచర్లకు స్టాఫ్ రూమ్ లేకుండా ఉండకూడదు.
 • బాలలను అంగన్ వాడికి, పాఠశాలకి తప్పకుండా పంపించండి.
 • ఆడ, మగ తేడా లేకుండా ఇద్దరిని బడికి పంపించడం.
 • బాలలు చదువుకొనుటకు, ఆటలాడుటకు అవకాశం కల్పించాలి.
 • సకాలంలో బాలలకు ప్రోత్సాహన్ని అందించాలి.
 • స్కూల్ బిల్ఢింగ్స్, అంగన్ వాడిలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలి. వాటిని గ్రామ ఆస్తిగా చూసుకోవాలి.
 • స్కూల్ నిధులను స్కూల్ అబివృద్ధి కోసమే ఉపయోగించాలి.
 • వాటిని ఏ టైమ్ లో ఉపయోగించాలో ఆ ఏ టైమ్ లో ఉపయోగించాలి.
 • అంగన్ వాడి కార్యకర్తలు, టీచర్స్ స్కూల్ కు టైమ్ కు వచ్చేలా మరియు నాణ్యమైన విద్యను అందించేలా ప్రోత్సహించాలి.
 • అంగన్ వాడి కార్యకర్తలు, టీచర్స్ స్కూల్ లో ఎప్పుడు బాలలతో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి.
 • అంగన్ వాడి మరియు స్కూల్ సభ తీర్మానంలో బాలల భాగస్వామ్యం ఉండేటట్లు చూడాలి.
 • అన్ని సౌకర్యాలతో ఉండి, అత్యుత్తమ అంగన్ వాడిగా, స్కూల్ గా ఉండేటట్లు చూడాలి.

బాల కార్మికవ్యవస్ధ నిర్మూలనకు ఈ క్రింద తెలిపిన విషయాలు తెలుసుకొని ఉండాలి.

తప్పు

ఒప్పు

 • 14 సం11లలోపు బాలలు పనిలో ఉండవచ్చు.
 • బాల కార్మిక విధానం మంచిపని.
 • ఫ్యాక్టరీ, హాటల్స్, గ్యారేజ్ లు మొదలైన స్ధలాలలో పనిచేసే 14 సం11లలోపు బాలలు బాల కార్మికులు కాదు.
 • బాలలు చిన్నవారు వారికి ఎటువంటి హక్కులు వర్తింపబడవు.
 • రేపటి బాలలే రేపటి పౌరులు
 • కష్టకాలంలో కుటుంబ సమస్యల పరిష్కారం కోసం బాలలచే పని చేయించడం తప్పు కాదు.
 • బాలల సమస్యలతో మనకు పంచాయితీకి సంబంధంలేదు.
 • పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అధిక జనాభా, ఇవి బాల కార్మిక వ్యవస్ధకు కారణం కాదు.
 • బాలలచే పనులు చేయించడం వలన మన కుటుంబం బాగు పడుతుంది.
 • బాలలను రోజువారీ కూలీకి లేదా జీతానికి పంపుట వలన కుటుంబ పరిస్ధితి మెరుగుపడి పేదరికం తగ్గింది.
 • మన సొంత బాలలను మనం మన ఇష్టానుసారం నచ్చిన పనికి పంపవచ్చు. పనికి మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు.
 • 18 సంవత్సరాలు నిండినవారు మాత్రమే పనిలో ఉండాలి.
 • బాల కార్మిక విధానం సమాజ అభివృద్ధికి దూరమాన సమస్య
 • 14 సం11లలోపు బాల అందరూ బడిలోనే ఉండాలి. వారు ఇంటిలోపల, బయట, వేరే ఎక్కడయినా పనిచేసినచో, వారి ఇంటిలో పనిచేసినా కూడా బాల కార్మికులనిపించుకొంటారు. ఇది నిషేధించడం జరిగింది.
 • బాలలకు హక్కులున్నాయి. వాటిని మనం కాపాడాలి. వాటి అమలుకు ప్రోత్సహించాలి.
 • నేటి బాలలే రేపటి పౌరులు
 • ఏ సమయంలో అయినా, ఎటువంటి పరిస్ధితిలో అయినా బాలలచే పని చేయించటం నేరం.
 • 18 సం11లలోపు బాలలందరికీ వారి హక్కులను వారికిచ్చి గౌరవించి వారు అనుభవించే విధంగా చూడాలి. బాల్యంలో ప్రేమ, చదువు, శిక్షణ, రక్షణ, అందించడం ప్రతి పంచాయితీ కర్తవ్యం.
 • బాల కార్మిక వ్యవస్ధకు పేదరికం, నిరుద్యోగం, అధిక జనాభా కారణం.
 • బాలలచే పని చేయించుట వలన ఏ ఒక్క కుటుంబం అభివృద్ధి చెందలేదు.
 • బాలలను రోజువారీ కూలీకి జీతానికి పంపుట వలన ఆ కుటుంబంలో పేదరికం పెరుగుతుంది. సరియైన చదువు, శిక్షణ కోల్పోవడం వలన మంచి అవకాశాలను కోల్పోతారు.
 • మన సొంత పిల్లలను సైతం పని నిమిత్తం వేరేచోటికి పంపకూడదు. అలాగే మన సొంత ఇండ్లలో కూడా పని చేయించుకోకూడదు. వారికి చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.94117647059
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు