హోమ్ / విద్య / బాలల హక్కులు / విద్య - నేటి విద్యా విధానం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విద్య - నేటి విద్యా విధానం

మన దేశంలో ప్రస్తుతం గల విద్య విధానం ఎలా ఉందో, ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలో అనే దానిపై వికాస్ పీడియా భాగస్వామ్యుల స్పందనలు.

మన భారత దేశం

మన భారత దేశం అనేక రకాల భాషలు, మతాలూ, కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు మరియు అనేక రకాల పద్దతులు కలిగిన ఏకైక దేశం మనది.

ప్రపంచంలో మొట్టమొదటి విశ్వ విద్యాలయాన్ని స్థాపించింది మన భారత దేశమే. అందుకు మనమందరం గర్వపడాలి. కాని నేటి మన దేశంలో విద్య ఏవిధంగా నడుస్తుందో మన అందరికి తెలుసు.

పిల్లలకు పూర్తిగా అన్యాయం

పెద్ద విద్యార్థుల సంగతి పక్కకు పెడితే పిల్లలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. సరిగా 5 సంవత్సరాలు నిండని పసి పిల్లలని పాటశాల అనే ఒక బందీ కానాలో చేర్చి అటు తల్లితండ్రులు మరియు ఉపాద్యాయులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

కనీస మానసిక ఎదుగుదల లేని పిల్లలని తమ ముక్కుపచాలారని పిల్లలని తమ బాల్యంకు దూరం చేస్తున్నారు. దీని వల్ల పిల్లల మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని చెప్పినా వాళ్ళు మాత్రం మానరు. పాటశాలలు వినిపించుకోవు. అపురూపమైన, అందమైన బాల్యాన్ని అదిలోనే మొగ్గ ప్రాయం లోనే తొక్కిపడేస్తున్నారు. ఇదీ విద్యా వంతులు, మేధావులు, అందరు ఆలోచించే విషయం అయినా వారి ధోరణి వారిదే. ప్లే స్కూల్స్ లో, కిన్దర్ గార్డెన్ లో పిల్లలు సంతోషంగా గడుపుతారని వారి ఉద్దేశ్యం. కాని ఒక పిల్లవాడు తన కుటుంబంలో అన్ని సాంఘీక పరిపక్వతను, ప్రేమను, ఆనందాన్ని, చురుకుదన్నాన్ని, ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని అన్నిటిని కోల్పోతున్నాడు. కాబట్టి అందరూ కొంచెం శ్రద్ద వహించి పిల్లవానికి తగిన వయస్సు రాగానే స్కూల్ కి పంపాలి. ఇది రానున్న తన భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం.

ఆధారము: దాసరి మల్లికార్జున్

తల్లిదండ్రుల ప్రవర్తన మారాలి

విద్యార్థుల కొరకు ఆలోచిస్తే ముందుగా సమాజంలోని తల్లిదండ్రుల ప్రవర్తన మరియు సమాజంలో చదువుకున్న వ్యక్తులు అవలంబించే విదానాలు, లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరుల పట్ల నడుచుకునే విదానం చాలా ముఖ్యమైనది.
నైతిక ప్రవర్తన బాగుచెయ్యలేకపోతే వ్యవస్థ ఎప్పటికి బాగుపడదు. విపరీతమైన ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు.
మార్పు కావలి, వృత్తి పరమైన నైపుణ్యాలు నేర్పించాలి.

ఆధారము: పెనుమర్తి శ్రీనివాస నరసింహ మూర్తి

ఇంకను బాల కార్మికులు

బాల కార్మికులను బడిలో చేరిపించుటకు ఇప్పుడు అనుసరిస్తున్న చట్టాల వల్ల సరియైన స్పందన రావడము లేదు కావున మంచి వ్యవస్థను తయారుచేయుటకు సలహాలు ఇస్తూ బడికి పోవలసిన పిల్లలను పనిలో పెట్టుకొని వెట్టిచాకిరి చేయుంచుకుంటున్న వారిని కటినంగా శిక్షించిన దాకలాలు ఎక్కడ కనిపించడము లేదు. ఐతే శిక్షలు పడక పోవడము వలన పదే పదే వెట్టి చాకిరీ చేపించుకుంటున్నారు. కావున శిక్షలు అమలు అయ్యె విధముగా చట్టాలు కటినముగా తెస్తూ బాలకార్మికులను బడిలో చేర్పించుటకు ప్రతియొక్క పౌరుడు బాద్యత తీసుకొనుటకు సలహాలను ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.

ముఖ్యంగా ఇటుకలు తయారుచేసే బట్టిలదగ్గర తల్లిదండ్రులు పనిచేయడమే కాకుండా వారి పిల్లలను కూడా బడికి పంపకుండా వేట్టిచాకిరి చేయిస్తున్నారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టిలను నిర్వహిస్తున్న యజమానులకు కూడా పిల్లలను పనిచేయకుండా చదువు కోవాలి అని చెప్పే విధముగా అధికారులు వారిని సంప్రదించి కటినముగా బాద్యత తీసుకునే విధముగా చేయాలని నా యొక్క చిన్న సలహా.

ఆధారము: నతి రమేష్

2.90441176471
ashok. b Nov 21, 2017 07:28 AM

Chaplains bagundi

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు