బాలలపై వేధింపులు పై అధ్యయనం- స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007, ఇండియాలో చేసిన ఒక సర్వేలో బాలలు ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు మరియు అత్యాచారానికి గురౌతున్నారని తెలియజేసింది. ఈ వేధింపులు భౌతిక, లైంగిక మరియు మనస్సుకు సంబందించినవి.
ఈ అధ్యయనంలో ఈక్రింది విధమైన వాస్తవాలు వెలుగు చూసాయి
భౌతిక వేధింపు
- ప్రతి ముగ్గురి పిల్లలలో ఇద్దరు శ్రమదోపిడికి గురౌతున్నారు.
- 69% శ్రమదోపిడికి గురౌతున్న పిల్లలలో 54.68% బాలురే.
- 50% పైగా పిల్లలు ఒకటి లేదా పలురకాలైన శ్రమదోపిడికి గురౌతున్నారు.
- కుటుంబపరంగా శ్రమదోపిడికి గురౌతున్న పిల్లలలో 88.60% తమ తల్లితండ్రుల ద్వారానే శ్రమదోపిడికి గురౌతున్నారు.
- మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీలలో స్ధిరంగా ఎక్కువ శాతం పలు రకాలుగా బాలలు శ్రమదోపిడికి గురౌతున్నారు.
- 50.20% బాలలు వారానికి ఏడు రోజులు పని చేస్తున్నారు.
లైంగిక వేధింపులు
- 53.22% బాలలు ఒకటి లేదా పలురకాలైన లైంగికఅత్యాచారాన్ని ఎదుర్కొన్నవారే.
- ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీలలో బాలలు మరియు బాలికలు ఎక్కువ శాతం లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు.
- 21.90 % బాలలు తీవ్రమైన లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు మరియు 50.76 శాతము ఇతర లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు.
- ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీలలో అత్యధిక శాతం బాలలు లైంగిక అత్యాచారానికి గురౌతున్నారు.
- 50% లైంగిక అత్యాచారాలు పిల్లలకు బాగా నమ్మకమున్న వారు మరియు బాధ్యతతెలిసినవారే చేయుచున్నారు.
మానసిక వేధింపులు మరియు బాలికల పట్ల నిర్లక్ష్యం
- ప్రతి రెండవ పిల్లవాడు మానసిక వేధింపు కి గురౌతున్నాడు.
- మానసిక వేధింపులు విషయంలో బాలబాలికలు సమానస్ధాయిలో ఉన్నారు.
- 83% కేసులలో తల్లితండ్రులే నిందితులు.
- 48.40% బాలికలు తాము బాలురుగా పుట్టి వుంటే బాగుండునని కోరుకుంటున్నారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.