অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి.

బాల కార్మిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసి చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేయమని 1979 లో గురుపాదస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని వివరణాత్మకమైన సిఫారసులను కూడా ఆ కమిటీ చేసింది. దారిద్ర్యం కొనసాగుతున్నంతవరకూ బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం అసాధ్యమన్నారు. కాగా దాన్ని చట్టపరంగా నిర్మూలించడమనేది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే  బాలకార్మిక వ్యవస్థ తీవ్రస్థాయిలో కొనసాగుచున్నచో ఆయా ప్రాంతాలలో దానిని నిర్మూలనా చేసే ప్రయత్నం చేయడమే కర్తవ్యమని అంటూ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టాలన్నారు. పనిచేసే పిల్లల సమస్యల్ని భిన్న కోణాల నుంచి అధ్యయనం చేయాలన్నారు.

గురుపాదస్వామి సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ(నిషేధం-నియంత్రణ) అనే చట్టం 1986 లో సిద్ధం చేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తించి వాటిలో పిల్లలు పనిచేయడం నిషేధించింది. మరి కొన్నింటిలో పనిచేసే పరిస్థితుల్ని చట్ట ప్రకారం నియంత్రించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ చట్ట ప్రకారం బాలకార్మిక సాంకేతిక సలహా సమితిని ఏర్పాటు చేసి ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలను గుర్తింపజేసి జాబితాను విస్తరింప చేశారు.

ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987 లో రూపొందించారు. దీని ప్రకారం క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఆయా ప్రమాదకరమైన వృత్తుల్లో పని చేసే పిల్లలకు మొట్ట మొదట పునరావాస సదుపాయం కల్పించారు. బాలకార్మికుల జానాభా లెక్కలు తీయడానికి ఏర్పాట్లు చేశారు.

బ్రిడ్జి  కోర్సులు

ఎమ్.వి.ఫౌండేషన్ వారు మరొక విధమైన ఏర్పాటు చేశారు. బడి మానేసిన పిల్లలకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేసి వారికి విద్యాబుద్ధులు చెప్పి మామూలు పాఠశాలల్లో బాలకార్మికులు వయసుకు తగిన తరగతుల్లో ప్రవేశించుటకు ఏర్పాట్లు చేశారు. బాలకార్మికులు సజావుగా మామూలు పాఠశాలల్లో చేరడంలో ఈ విధానం చాల జయప్రదమైంది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధమ్, సినీ-ఆశ, లోక్ జుంబుష్ వంటి స్వచ్ఛంద సంస్థలు చేపట్టి కొనసాగించడం గమనార్హం.

బాలకార్మిక వ్యవస్ధకు కారణాలు

జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనాప్రకారం బాలలు పనులలోకి నెట్టబడుతున్నారు. ఎందుచేతనంటే వారు సులువుగా దోపిడికి గురౌతారు.  బాలలు విరుద్ధమైన  మరియు వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయుటకు సాధారణంగా మొట్టమొదటి కారణం పేదరికం. జనాభా పెరుగుదల, చౌకైన పనివారు,  చట్టాలను అమలుపరచనందు వల్ల, తల్లితండ్రులు తమ పిల్లలను బడికి పంపుటకు ఇష్టపడకపోవడము (పిల్లలను పనికి పంపితే తమ ఆర్ధికపరిస్ధితి మెరుగవుతుందనే ఉద్దేశంతో) మరియు గ్రామీణప్రాంతాలలోని అతిపేదరికం కూడా బాలకార్మిక వ్యవస్ధకు కారణాలు. పిల్లలు పనికి వెళ్తేనే ఆ కుటుంబానికే జీవనాధారమైనపుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు?

ఏమి చేస్తే బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలించబడుతుంది

బాలకార్మికవ్యవస్ధ  నిర్మూలనకై డబ్భైఆరు బాలకార్మిక పథకాలతో  1,50,000 బాలలకు,  జాతీయబాలకార్మిక పథకంలో మంజూరు చేయబడ్డాయి.  సుమారు 1,05,000 పిల్లలు ప్రత్యేక బడులలో చేర్పించబడ్డారు.  బాలకార్మిక మంత్రిత్వ శాఖ ప్రణాళికాసంఘాన్ని సుమారు 1500 కోట్లరుపాయలతో  ప్రస్తుతం 250 జిల్లాలకు బదులుగా 600 జిల్లాలకు జాతీయబాల కార్మిక పథకంలో విస్తరించుటకుగాను మంజూరు చేయమని అడిగింది.  57 అతి ప్రమాదకర పరిశ్రమలలో పనిచేయుచున్న బాలలు, హొటళ్ళు మరియు ఇళ్ళల్లో పనిచేయుచున్న (9-14 సంవత్సరాల మధ్య వయస్సున్న) పిల్లలు ఈ పథకంలో చేర్పించబడ్డారు.  ప్రభుత్వ పథకాలైన అందరికీ విద్యావిధానం (సర్వశిక్షాభియాన్) అమలు చేయబడుచున్నది.

రాష్ట్రం జిల్లాలు మంజూరుచేయ బడిన స్కూల్స్ ప్రతిపాదించిన పిల్లలు వాస్తవంగానడప బడుచున్న స్కూల్స్ లబ్ధిపొందిన పిల్లలు
ఆంధ్రప్రదేశ్ 20 807 43550 610 36249
బీహార్ 08 174 12200 173 10094
గుజరాత్ 02 040 2000 023 1254
కర్ణాటక 03 100 5000 024 1200
మధ్యప్రదేశ్ 05 138 9800 087 6524
మహారాష్ట్ర 02 074 3700 024 1200
ఒరిస్సా 16 430 33000 239 14972
రాజస్తాన్ 02 060 3000 054 2700
తమిళనాడు 08 379 19500 307 14684
ఉత్తరప్రదేశ్ 04 150 11500 105 7488
పశ్చిమ బెంగాల్ 04 219 12000 164 8250
మొత్తము 76 2571 155250 1810 104615

జాతీయ బాలకార్మిక పథకం పరిదిలో అమలుకాబడినవి.

భారతదేశంలో గల బాల కార్మిక వ్యతిరేక జాతీయ శాసనాలు - విధానాలు

శాసనసభః రాష్ట్ర కార్యాచరణ విధానంలో భారత రాజ్యాంగం (జనవరి 26, 1950) ద్వారా అనేక ప్రకరణాలలో ప్రాధమిక హక్కులు, ఆదేశ సూత్రాలకు స్థానం కల్పించబడింది.
24 ప్రకరణం: పదునాల్గేండ్లలోపు బాలలను కర్మాగారాలలో, గనులలో, ఇంక ఏ ఇతర ప్రమాదకర పనులలో  కూడ ఎవ్వరూ ఉంచరాదు.
39- ప్రకరణం: కార్మికులయిన స్త్రీ, పురుష, బాలల ఆరోగ్యాన్ని కాపాడడానికి వారికి గల ఆర్ధిక అవసరాలను ఆసరా చేసుకొని వారిని  తగని వృత్తులలో నియమించుట,  వారిని అగౌరవపరచుట, బలవంతం చేయుట నిషేధం.
39-ఎఫ్ ప్రకరణం: ఆరోగ్యపరంగా  అవకాశాలను కల్పించి తగిన స్వేచ్ఛ, గౌరవం ఇవ్వడం, పసితనాన్ని రక్షించడం,  యువత నడవడిక, నైతికతకు రక్షణ కల్పించడం.

45వ ప్రకరణం : పదునాల్గేండ్ల బాలలందరూ ఉచిత నిర్బంధ విద్యను పొందే ప్రాధమిక హక్కు రాజ్యాంగం కల్పించింది.  రాష్ట్రాలు తమకృషితో 10 సంవత్సరాల కాలవ్యవధిలోనే  ఈ హక్కును  బాలలందరూ పొందే వీలును కల్పించాలి|

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడ బాలకార్మిక అంశంపై శాసనాలు చేసినాయి. రెండు స్ధాయిలలో శాసనాలు కల్పించిన పౌరహక్కులు ఉన్నాయి.

ప్రధాన జాతీయ శాసనాలు ఈ క్రింద వాటిని కలిగి ఉంటాయి:

1986 బాలకార్మిక (నిషేధం, క్రమబద్దీకరణ) చట్టం:

13 రకాల వృత్తులు , 57 ఉత్పత్తుల జాబితా ఈ చట్టంలో పేర్కొనబడింది|  ఈ వృత్తులలో, ఉత్పత్తులలో పనిచేయడం పిల్లల ఆరోగ్యానికి మనుగడకు హానికరం కాబట్టి    వీటిల్లో పదునాల్గేండ్లలోపు బాలల చేత పని చేయించడం ఈ చట్టం నిషేధించింది.

1948, కర్మాగారాల చట్టం ప్రకారం: పదునాల్గేండ్లలోపు బాలలు పనిచేయడం నిషేధించింది.  వైద్యాధికారి అధికారికంగా ఇచ్చిన ధృవీకరణం పత్రం ఉంటేనే కౌమార దశలోగల పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల బాలలను పనిలో పెట్టుకోవచ్చు.  పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలల పని కాలాన్ని గం|| 4.30 ని||లు నిర్దేశిస్తూ, రాత్రి పని గంటలను నిషేధించింది.
1996 సం|| లో అత్యున్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పు నందు భారత దేశంలో బాలకార్మికతకు వ్యతిరేకంగా న్యాయ సంబంధ వ్యాజ్యంలో చేయవలసిన చర్యను ఆదేశించింది.  ఈ ఆదేశాన్ననుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదకర ఉత్పత్తులు, వృత్తులలో పనిచేస్తున్న బాలలను గుర్తించి, వారిని పని నుండి తప్పించి, నాణ్యమైన విద్యవారికి అందేటట్లు చూడడం.
బాలకార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన యజమానుల వద్ద నుండి రాబట్టిన ధనంతో బాలకార్మిక పునరావాస సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని న్యాయస్ధానం ఆదేశించింది.

భారత దేశం సంధి సంతకాలు చేసిన అంశాలుః

 • అంతర్జాతీయ కార్మిక వ్యవస్ధ - ఐ.ఎల్.ఒ శక్తివంతమైన కార్మిక సమావేశం ( సంఖ్య 29 )

 • అంతర్జాతీయ కార్మిక వ్యవస్ధ - ఐ.ఎల్.ఒ శక్తివంతమైన కార్మిక సమావేశం రద్దు ( సంఖ్య 105 )(ఒడంబడిక)

 • బాలల హక్కులపై ఐక్యరాజ్యాల సమావేశం ( సి.ఆర్.సి)

ప్రభుత్వ కార్యాచరణ విధానాలు - కార్యక్రమాలు :

భారత దేశపు అభివృద్ధి లక్ష్యాలు, వ్యూహాల ఆచరణ ను జాతీయ బాల కార్మిక విధానం 1987లో స్వీకరించింది.  భారత దేశపు రాజ్యాంగంతో రాష్ట్ర విధానం అనుసరించవలసిన  ఆదేశ సూత్రాలను జాతీయ బాలకార్మిక విధానం పునురుద్ఘాటించింది.

ఎక్కడ వీలైతే అక్కడ బాలలకు లాభదాయకమైన సామాన్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలి.  పథకమాధారంగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి . దినసరి వేతనం వాస్తవ విరుద్ధ వేతనాలతో అధిక శాతంలో ఏ ప్రాంతాలలొపనిచేస్తున్నా రో వారి కోసం ఈ చర్యలు చేపట్టాలి.

జాతీయ బాలకార్మిక విధానం ( ఎన్.సి.ఎల్.పి) ఆచరించ దగిన బాలకార్మిక చట్టం - 1986 (నిషేధం - క్రమబద్దీకరణ) ద్వారా కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ అమలు చేయు చున్న ఎన్.సి.ఎల్.పి ద్వారా జాతీయ బాలకార్మిక పథకాలను ఏర్పాటు చేసి, బాలకార్మిక పునరావాసం 1988 నుండి కలిపిస్తోంది. తొలుత పారిశ్రమిక ప్రత్యేకతగా, సాంప్రదాయక బాలకార్మికత గల నిర్దిష్ట పరిశ్రమలను లక్ష్యంగా చేసుకొని, పనిచేస్తున్న బాలలకు పునరావాసం కల్పించడం.

రాజ్యాంగ ఆదేశాన్ని ఫలవంతం  చేయడం లో నిబద్ధిత కూర్పుతో 1994 లో ఎన్.సి.ఎల్.పి ల ను విస్తృతి పరచి, సాంప్రదాయక బాలకార్మికతగల నిర్దిష్ట జిల్లాలలో ప్రమాదకర వృత్తులలో పనిచేస్తున్న బాలలకు పునరావాసం కల్పించడం. ఎన్.సి.ఎల్.పి ల వ్యూహాలలో బాలకార్మికుల కొరకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచడం ద్వారా అనియత విద్య, పూర్వ వృత్తి నైపుణ్యాలపై శిక్షణ అదనపు ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పన, ప్రజావగాహన పెంపు, సేకరణ నిర్వహణ, మూల్యాంకనం ఉంటాయి.

ఎన్.సి.ఎల్.పి లను నిర్వహించడంలో ప్రభుత్వం అనుభవాన్ని గడించింది, అనేక సంవత్సరాలు ఫలవంతమైన అంశంగా     9వ పంచవర్ష ప్రణాళిక (1997-02) వరకు ఈ పధకం విస్త్రతపరచి కొనసాగించబడింది.  ప్రమాదకర పరిశ్రమలలో అనగా గాజు పరిశ్రమ, చేతి గాజుల తయారీ, పలకల పరిశ్రమ, అగ్గిపుల్లలు, బాణాసంచా, రత్నాల తయారీలలో పనిచేస్తున్న బాలకార్మికులకు పునరావాసాన్ని కల్పించడంలో 100 ఎన్.సి.ఎల్.పి లు భారత దేశమంతటా ప్రారంభమైనాయి.

9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం రూ..2.5 బిలియన్లు (యునైటెడ్స్టేట్స్, సుమారు 57 మిలియన్ డాలర్లు) బడ్జెట్ ను కేటయించింది.

భారత ప్రభుత్వం ఇంకనూ అదనంగా 150 జిల్లాలకు ఈ పధకాన్ని విస్తృత పరచి నిబద్ధతగా నడపడంలో రూ. 6 బిలియన్ల (యునైటెడ్ స్టేట్స్ సుమారు 130 మిలియన్ల డాలర్లు) బడ్జెట్ను పెంచింది, ఈ మొత్తాన్ని 10వ పంచవర్ష ప్రణాళిక (2003/07)కు కేటాయించింది.

భారత దేశపు అభివృద్ధి లక్ష్యాలు, వ్యూహాల ఆచరణ ను జాతీయ బాల కార్మిక విధానం 1987లో స్వీకరించింది.  భారత దేశపు రాజ్యాంగంతో రాష్ట్ర విధానం అనుసరించవలసిన  ఆదేశ సూత్రాలను జాతీయ బాలకార్మిక విధానం పునురుద్ఘాటించింది.

ఎక్కడ వీలైతే అక్కడ బాలలకు లాభదాయకమైన సామాన్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలి.  పథకమాధారంగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి . దినసరి వేతనం వాస్తవ విరుద్ధ వేతనాలతో అధిక శాతంలో ఏ ప్రాంతాలలొపనిచేస్తున్నా రో వారి కోసం ఈ చర్యలు చేపట్టాలి.

జాతీయ బాలకార్మిక విధానం ( ఎన్.సి.ఎల్.పి) ఆచరించ దగిన బాలకార్మిక చట్టం - 1986 (నిషేధం - క్రమబద్దీకరణ) ద్వారా కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ అమలు చేయు చున్న ఎన్.సి.ఎల్.పి ద్వారా జాతీయ బాలకార్మిక పథకాలను ఏర్పాటు చేసి, బాలకార్మిక పునరావాసం 1988 నుండి కలిపిస్తోంది. తొలుత పారిశ్రమిక ప్రత్యేకతగా, సాంప్రదాయక బాలకార్మికత గల నిర్దిష్ట పరిశ్రమలను లక్ష్యంగా చేసుకొని, పనిచేస్తున్న బాలలకు పునరావాసం కల్పించడం.

రాజ్యాంగ ఆదేశాన్ని ఫలవంతం  చేయడం లో నిబద్ధిత కూర్పుతో 1994 లో ఎన్.సి.ఎల్.పి ల ను విస్తృతి పరచి, సాంప్రదాయక బాలకార్మికతగల నిర్దిష్ట జిల్లాలలో ప్రమాదకర వృత్తులలో పనిచేస్తున్న బాలలకు పునరావాసం కల్పించడం. ఎన్.సి.ఎల్.పి ల వ్యూహాలలో బాలకార్మికుల కొరకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచడం ద్వారా అనియత విద్య, పూర్వ వృత్తి నైపుణ్యాలపై శిక్షణ అదనపు ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పన, ప్రజావగాహన పెంపు, సేకరణ నిర్వహణ, మూల్యాంకనం ఉంటాయి.

ఎన్.సి.ఎల్.పి లను నిర్వహించడంలో ప్రభుత్వం అనుభవాన్ని గడించింది, అనేక సంవత్సరాలు ఫలవంతమైన అంశంగా     9వ పంచవర్ష ప్రణాళిక (1997-02) వరకు ఈ పధకం విస్త్రతపరచి కొనసాగించబడింది.  ప్రమాదకర పరిశ్రమలలో అనగా గాజు పరిశ్రమ, చేతి గాజుల తయారీ, పలకల పరిశ్రమ, అగ్గిపుల్లలు, బాణాసంచా, రత్నాల తయారీలలో పనిచేస్తున్న బాలకార్మికులకు పునరావాసాన్ని కల్పించడంలో 100 ఎన్.సి.ఎల్.పి లు భారత దేశమంతటా ప్రారంభమైనాయి.

9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం రూ..2.5 బిలియన్లు (యునైటెడ్స్టేట్స్, సుమారు 57 మిలియన్ డాలర్లు) బడ్జెట్ ను కేటయించింది.

భారత ప్రభుత్వం ఇంకనూ అదనంగా 150 జిల్లాలకు ఈ పధకాన్ని విస్తృత పరచి నిబద్ధతగా నడపడంలో రూ. 6 బిలియన్ల (యునైటెడ్ స్టేట్స్ సుమారు 130 మిలియన్ల డాలర్లు) బడ్జెట్ను పెంచింది, ఈ మొత్తాన్ని 10వ పంచవర్ష ప్రణాళిక (2003/07)కు కేటాయించింది.

జాతీయ సంస్ధల విరాళం:

అనేక జాతీయ సంస్ధలు అవి ఏవంటే , వివి గిరి జాతీయ కార్మిక సంస్ధ (వి.వి.జి.ఎన్.ఎల్.ఐ), జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్ధ (ఎన్.ఐ.ఆర్.డి) మరికొన్ని రాష్ట్ర స్ధాయి సంస్ధలు శిక్షణ, అభివృద్ధి సామర్ధ్యాలను ఇవ్వడంలో ప్రధాన ప్రాత్ర వహిస్తున్నాయి.ఈ సంస్ధలు ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక పరీక్షాధికారులకు ,పంచాయతీరాజ్ అధికారులకు ,జాతీయ బాలకార్మిక పథక సంచాలకులకు,        స్వచ్ఛంద సంస్ధల నాయకులకు శిక్షణను సామర్ధ్యాభివృద్దిని అందించేటందుకు ప్రముఖ  పాత్రవహిస్తాయి.
పరిశోధన, సర్వేలలో, ప్రతి స్పందించడంలో, ప్రజావగాహనను పెంచడం, బాలకార్మిక అంశాల పై చర్చించడం వంటి విషయాలలో గుర్తింపదగిన సేవలను అందిస్తున్నాయ.

బాల్యం - పిల్లల హక్కు

పిల్లలకై  పని భారం వద్దు !
బాల్య వివాహాలను అరికడదాం !

“పిల్లలందరూ పనిలో కాదు - బడిలో ఉండాలి” అనే నినాదంపై అందరూ కలిసి “పనిచేస్తే ప్రస్తుతం మన ముందున్న పెద్ద సమస్య అయిన “బాలకార్మిక వ్యవస్థ” ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. అప్పడు పిల్లలు వారి బాల్యపు హక్కు ను ఆదనంగా గడుపుతారు.

మనకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు

బాల కార్మికుల సమస్య మన దేశంలో ఎంత తీవ్రంగా వుంది?

ప్రపంచంలో అతి పెద్ద బాలకార్మిక సైన్యం గల ఘనత మన దేశానిదే. ఒక అంచనా ప్రకారం చాకిరీకి బాల్యాన్ని బలి పెడుతున్న మొత్తం ప్రపంచ బాలల్లో మనదేశం పిల్లలు మూడవ వంతు.... దీనివల్ల తలెత్తే దుష్పరిణామాలు లెక్కలేనన్ని. మన దేశంలోని 50 శాతం పిల్లలు తమ బాల్యపు హక్కును పోగొట్టుకొని విద్యాగంధం లేని బాల కార్మికులుగా మారుతున్నారు. వాళ్ళ సహజ సామర్థ్యాలను వెలికి తీసుకొనే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇలాంటి దుస్థితిగల ఏ దేశమూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు.

మన దేశంలో ఎంతమంది బాల కార్మికులున్నారు?

బాల కార్మికులుగా మనం ఎవర్ని నిర్వచిస్తున్నామన్న దాన్ని బట్టి ఈ సంఖ్య వుంటుంది. “ప్రమాదకర” పరిశ్రమల్లో 20 లక్షల మంది పిల్లలు పనిచేస్తున్నారని ఒక అంచనా. కూలి డబ్బు సంపాదించే పిల్లలందరిని  లెక్కిస్తే ఈ సంఖ్య ప్రభుత్వ అంచనా ప్రకారమే. ఒక కోటి డెబ్భై లక్షలు....ఇలాంటి పిల్లల సంఖ్య నాలుగుకోట్లని స్వతంత్ర వర్గాలు చెపుతున్నాయి. బడికిరాని పిల్లలందరూ బాల కార్మికులే అని మనం నిర్వహించుకొంటే ఈ సంఖ్య అక్షరాలా పదికోట్లు కావచ్చు.

తివాచీనేత, గాజు పరిశ్రమ, అగ్గిపెట్టెల తయారీ లాంటి ప్రమాదకర పరిశ్రమలలో పనిచేసే పిల్లల గురించి మనకు తెలుసు. మరి ఈ మిగిలిన బాల కార్మికులందరూ ఎక్కడున్నట్టు?

అసలు సంగతి ఇక్కడే వుంది. మన విధాన నిర్ణేతలు ఈ సంఖ్య పట్ల ఎందుకింత నిరాసకంగా వున్నారంటే దానికో కారణం వుంది. వాళ్ళు ఎంతమందికి సాయం అందించ దల్చుకొన్నారో అంతమందినే బాల కార్మికులుగా చూపుతున్నారు. వాళ్ళు ప్రమాదకర పరిశ్రమల్లోని బాల కార్మికుల్ని మాత్రమే పట్టించుకోదలిస్తే వాళ్ళకు 20 లక్షల మంది తప్ప మిగతా బాల కార్మికులు కనిపించరు. నిజానికి మన బాల కార్మికుల్లో 85 శాతం వ్యవసాయంలోనూ దాని అనుబంధ పనుల్లోనూ వున్నారు. పరిశ్రమల్లో పనిచేసే పిల్లలూ, వీధుల్లో తిరుగాడే పిల్లలూ, హోటళ్ళు తదితర చిన్న వాటిలో పనిచేసే పిల్లలూ మనకు కన్పించే బాల కార్మికులు మాత్రమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా మొత్తం బాల కార్మికుల్లో వీళ్ళ శాతం చాలా తక్కువ. మనం వ్యవసాయ రంగంలోని బాల కార్మికుల్ని పూర్తిగా విస్మరించాం. స్వాతంత్రం వచ్చి ఏభై ఏళ్ళు గడిచినా బాల కార్మిక సమస్యా పరిష్కారంలో మనం ఏ మాత్రం ముందడుగు వెయ్యలేకపోవడానికి ఈ దృష్టిలోపమే మూల కారణం.

ఇలా విస్మరించడానికి కారణం ఏమిటి ?

దీనికి చాలా కారణాలున్నాయి. పేద వర్గాల పిల్లల చర్చ వచ్చినపుడల్లా మన విధాన  నిర్ణేతలు వాళ్ళు పనిచెయ్యక తప్పదు గదా.... అనేట్లు ఆలోచిస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఆ పిల్లల సంపాదన మీద ఆధారపడి వుండబట్టే వాళ్ళు పని చెయ్యడం తప్పనిసరి అవుతోంది. ఈ పిల్లలందర్నీ పని మాన్పిస్తే వాళ్ళ కుటుంబాలు ఆకలితో మలమలలాడిపోతాయి. కాబట్టి బాలకార్మిక సమస్య అనేదొక చేదు నిజం. ఇదీ వీరి ఆలోచనా తీరు. పిల్లలు పని చెయ్యడం తప్పనిసరి. దీన్ని మనం మార్చలేము అన్న ధోరణే బాల కార్మికుల పట్ల మన పాలసీల్ని ప్రభావితం చేస్తున్న ప్రధానాంశం. అందుకే మనం మొదట అత్యంత దోపిడీకి గురవుతున్న పిల్లల్ని పని నుంచి తొలగిస్తే చాలుననే నిర్ణయానికి వచ్చాము. ప్రమాదకర పరిశ్రమల్లోని పిల్లల్ని మాత్రమే పట్టించుకోవడం ప్రారంభించాము. వాళ్ళు స్పష్టంగా మన కళ్ళకు కన్పిస్తారు కాబట్టి మన పని సులభమవుతుంది. కూడా. ఎప్పుడు మనం దీన్ని మాత్రమే ప్రధానాంశంగా భావించామో సహజంగానే ఇతర రంగాల బాలకార్మికులందర్నీ విస్మరించినట్లుయింది. ప్రధానంగా వ్యవసాయ రంగంలోని బాలకార్మికులు మన అజండాలో లేకుండా పొయ్యారు.

మరో కారణమేమంటే ఇలాంటి పిల్లల సంఖ్యను చూచి మన విధాన నిర్ణేతలు బెంబేలు పడిపొయ్యారు. వ్యవసాయరంగంలోని బాల కార్మికులందర్నీ తొలగిస్తే ఇంకేమైనా  వుందా ? అని జంకిపోయ్యారు. వీళ్ళింకేం చేస్తారు మరి ?ఇక వీళ్ళు చెయ్యగల్గిందల్లా వ్యవసాయ రంగం లోని కార్మిక వ్యవస్దని సమర్దించడం. లేకుంటే ఇదో సమస్యే కానట్లు విస్మరించడం. కాకుంటే వీళ్ళుని బాల కార్మికులుగా గుర్తించ కుండా దాటవెయ్యడం. ఇంకో అడుగు ముందు కేసి ఈ పిల్లలు పని చెయ్యడం వీళ్ళ మంచికే అని సూత్రీకరించడం. లక్షణంగా వీళ్ళు అదే పనిచేసి చేతులు దులుపుకొన్నారు.

విద్యారంగంలో తగినంత పెట్టుబడి పెట్టడానికి నిరాకరించడం కూడా ఈ విస్మరణకు ఓ మూల కారణం. వ్యవసాయ రంగం లోని బాల కార్మికుల్ని బాల కార్మికులే కాదన్నట్టు వదిలెయ్యడం, ఈ పరిస్థితి తప్పనిసరి అని సూత్రీకరించడం దాట వెయ్యడాన్ని సమర్థించుకోవడానికి అద్భుతమైన సాకులుగా ఉపయోగపడుతున్నాయి.

నిరుపేద కుటుంబాలు బతుకులీడ్వడం కోసం తమ పిల్లల సంపాదన మీద ఆధారపడాల్సిన దుస్థితి లేదంటారా? ఈ వాదనలో తప్పేముంది?

ఇదొక సాంప్రదాయక పేదరికం వాదన. ప్రశ్నను మనం ఎలా వేస్తే జవాబు అలా వస్తుంది. ఈ ప్రశ్నా అంతే. ఒక కుటుంబం కటిక దరిద్రంలో కుమిలిపోతూ దిక్కు తోచకుండా అల్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పనికి పంపడం అవసరం కాదా ? అని ప్రశ్నిస్తే జవాబు అవును అనే రావచ్చు. అలా గాక ఇప్పుడు పిల్లల్ని పనిలో పెడుతున్న తల్లిదండ్రులందరూ వాళ్ళ సంపాదన లేకుండా బతకలేనంత పేదరికంలో మగ్గుతున్నారా ? కాదు. అని ప్రశ్నిస్తే ఏం జవాబు వస్తుంది ? కాదు అని స్పష్టంగా రాదూ ?  భారతదేశపు బాల కార్మిక వ్యవస్థలోని అత్యంత  విషాదాంశం ఏమంటే పనిచేసే ప్రతి బిడ్డా వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే పని చేస్తోందని తేలిగ్గా మన పాలసీ నిర్ణేతలు నిర్దారణకు రావడం, పేదరికం వాదనలోని అంతర్లీనాంశమిదే. ఇంతకంటే వాస్తవదూరం మరేదీ వుండదు.

పేదరికం వాదనలో పసలేదని మనం సులభంగా  పసిగట్టవచ్చు. ఇదే నిజమైతే మన గ్రామాల్లోని అత్యంత నిరుపేద పిల్లలు బడికి దూరమై పనిలోకి వెళ్ళాలి. కానీ ఎంతో నిరు పేదలు బళ్ళో వుండగా వాళ్ళకంటే బాగా మెరుగ్గా వున్న వాళ్ళ పిల్లలు పని చేస్తుండటం మనం కళ్ళారా చూస్తున్నాం.

కాబట్టి దీనికి ఆర్థికేతర కారణాలు చాలా వున్నాయి. సంప్రదాయం, నిరక్షరాస్యత వల్ల తల్లిదండ్రుల్లోని అజ్ఞానం, ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడం మొద్దు బారిన ప్రభుత్వ యంత్రాంగం లాంటివి పేదలు పిల్లల్ని బడికి పంపండంలో గానీ, పనికి పంపడంలో గానీ చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయి. పేదరికం వాదన వీటినన్నిటినీ వదిలేసి కేవలం అర్థికాంశాల్నే పట్టుకొని వేలాడుతోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కార్యక్రమాల్ని లోతుగా పరిశీలిస్తే ఈ “పేదరికం వాదన” లో పస లేదని తేలిపోతుంది. బాధ్యత నుంచి తప్పుకోడానికి ప్రభుత్వ యంత్రాంగానికిదొక పెద్ద సాకుగా కూడా తయారైంది. పేదరికంలాంటి వాస్తవ సమస్య పరిష్కారం కాకుండా బాల కార్మికుల్ని తాకడం సైతం సాధ్యం కాదని లక్షణంగా చేతులు దులుపుకొనేందుకు మన విద్యారంగం, కార్మికరంగం లాంటి ప్రముఖ ప్రభుత్వ శాఖలకీ వాదం అమోఘంగా ఉపయోగపడుతోంది కూడా....

బాలకార్మిక వ్యవస్థకూ ప్రాథమిక విద్యకూ ఉన్న లింకు ఏమిటి?

మనం ముందు చూచినట్టు బాలకార్మిక వ్యవస్థ పట్ల పలువురుకి పలురకాల అభిప్రాయాలున్నాయి. పలు రకాల దృష్టి కోణాలున్నాయి, కొందరు కూలి సంపాదించే పని చేసే పిల్లల్నే బాల కార్మికులుగా పరిగణిస్తున్నారు. తివాచీనేత, అగ్గిపెట్టెల తయారీ, గాజు పరిశ్రమల్లాంటి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే పిల్లల పైనే దృష్టి పెట్టి మిగతా వారిని పట్టించుకోని వారూ ఉన్నారు. కొందరైతే కుటుంబ వాతావరణంలో చేసే పనులు చెడ్డవేమీ కాదనీ మంచివేననీ భావిస్తునారు. “చాకిరీ” ని తప్ప “పనుల్ని” వ్యతిరేకించాల్సిన అవసరం లేదని వీరి  అభిప్రాయం.

నిజానికి పిల్లల పని, పిల్లల చాకిరీ, ప్రమాదకర శ్రమలాంటి విభజనలన్నీ అసలు సమస్యను ప్రక్కదారి పట్టించేవే. మగ్గం మీద పని చెయ్యడం కన్నా తక్కువ ప్రమాదకరమా ? తమ గొర్రెల్ని మేపుకొంటే అది పిల్లలపనీ, కూలికి ఎవరి గొర్రెల్నినో మేపితే అది పిల్లలచాకిరీ అవుతాయా ? ఒకవేళ ఎక్కువ కూలి ముడుతూ, మంచి సదుపాయాలుంటే అప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరు నిర్థారిస్తారు ? నీళ్ళు మొయ్యడం, పిల్లల్ని ఎత్తుకోవడం ఏ తరహా శ్రమ కిందికి వస్తాయి ? చాలా మంది దృష్టిలో ఇది శ్రమ కాదు. వాళ్ళు బాల కార్మికులే కాదు. ఇలా ఆలోచించబట్టి, పని లేకుండా బడికి పోకుండా వుండే మరో పిల్లల  వర్గం మన విధాన నిర్ణేతలకు కన్పిస్తోంది. వీళ్ళని ఎక్కడా లేని పిల్లలంటూ కొత్త జాబితాలో వాళ్ళు చేర్చారు.

ఇలా ప్రక్కల పనిని విభజించి వర్గీకరించడం పరమ కృత్రిమం. ఇది సమస్యను పరిష్కరించకపోగా మరింత సంక్లిష్టం చేస్తుంది. పిల్లలు చేసే ప్రతి పనీ శ్రమే. పనిచేసే ప్రతి బిడ్డా బాలకార్మికుడే అనేదే న్యాయమైన వాదం. ఇలా చూస్తే అప్పుడు  మనకు గ్రామీణ భారతదేశంలో బడికి పోకుండా పనీపాటా లేకుండా వుండేపిల్లలే కన్పించరు. బడికిపోని పిల్లలు రేపోమాపో పనిచెయ్యక తప్పదు. అప్పుడు మనకు రెండు రకాల పిల్లలే కన్పిస్తారు. ఒకరు శ్రమించే పిల్లలు అంటే బాల కార్మికులు, మరొకరు పూర్తిగా బడిలో చదువుకొనేవారు. ఈ పునాది మీదనే బడికిపోని ప్రతి బిడ్డా బాలకార్మికుడే అనే తాత్వికాంశం ఆధారపడి వుంది.

ఇలా మనం ఒప్పుకొన్నప్పుడు ప్రతి బిడ్డకూ బాల్యం ఒక హక్కు. తాను వికసించడానికి, తన సామర్థాన్ని వెలికి తీసుకొనడానికి గల అన్ని అవకాశాల్ని వినియోగించుకోవడం అతని హక్కు. పని అది ఏ రూపంలో వున్నా సరే బిడ్డకు గల ఈ హక్కును కాలరాచేదే తప్ప మరొకటి కాదు.పూర్తి స్థాయిలో బడిలో, చదువుకొనే పిల్లలు మాత్రమే చాకిరీకి దూరంగా వున్నట్టు లెక్క అని మనం నమ్మితే పిల్లల్ని పూర్తిగా బడిలో వుంచినప్పుడు మాత్రమే వాళ్ళ బాల్యపు హక్కు పరిరక్షింపబడుతుందని మనం అంగీకరించాల్సి వుంటుంది. అప్పుడు బాల్యపు హక్కును కాపాడ్డం, బాల కార్మికవ్యస్థను నిర్మూలించడం, అందరికీ చదువు నేర్పడం - ఇవన్నీ ఒకే గొలుసుకొని లింకులుగా మనకు కన్పిస్తాయి. వీటిలో ఒకదాన్ని విస్మరించి మరోదాన్ని పట్టుకోవడం వల్ల సమస్య ఏ మాత్రం పరిష్కారం కాదనీ, ఆ ప్రయత్నం విఫలమై తీరుతుందనీ అర్థమవుతుంది.

ఇలాంటి కృషిలోని అనుభవాలు ఏమి చెపుతున్నాయి? తల్లిదండ్రుల్ని ఎలా ఒప్పించగల్గుతున్నారు?

సమాజంలోని అట్టడుగు వర్గాల తల్లి దండ్రులు సైతం తమ పిల్లల్ని పన మాన్పించి బడికి పంపడమే గాదు చదువుకొనే ఈ పిల్లల కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి, తమ సమయాన్ని వెచ్చించడానికి ఏమాత్రం వెనకాడ్డం లేదనేది ప్రత్యక్షానుభవం. తమ పిల్లలు బడిలో కొంచెం మెరుగ్గా వున్నట్టు కన్పించినప్పుడల్లా పిల్లలు అప్పటిదాకా మేపుతున్న గొర్రెల్ని, మేకల్ని అమ్మేసిన తల్లిదండ్రులు కోకొల్లలు. పిల్లలు చేస్తున్న పనుల్ని ఇంట్లోని పెద్దలో, తల్లిదండ్రులో పంచుకోవడం కూడా సర్వ సాధారణాంశం. తల్లి మీద కొంచెం ఎక్కువ భారం పడడం ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరి అవుతోంది. అయినా ఎక్కడో తప్ప దీనికి తల్లుల నుంచి వ్యతిరేకత కల్పించడం లేదు.  పని మాన్పించి తర్వాత బడిలోకి చేర్చే ముందు నిర్వహించే బ్రిడ్జికోర్సుల్ని చూస్తే తల్లిదండ్రులు ఎంత అద్భుతంగా మారిపోతారో తెలుస్తుంది. ఒకసారి తల్లిదండ్రులకు తమ బిడ్డలు చదువులో రాణించగలరన్న నమ్మకమే కుదిరితే, తమ పిల్లల సామర్థ్యాలు బహిర్గతం కావడం కంట బడితే ఇక వాళ్ళని పనికి పంపించాలని వాళ్ళు అనుకొనే అనుకోరు. అప్పుడు వాళ్ళు బిడ్డలకీ మరింత మంచి తిండి పెట్టాలని చూస్తారు. క్యాంపులకు వచ్చినప్పుడు బహుమతులు తీసుకొని వస్తారు. తమ పిల్లలతో ఫోటోలకు దిగాలని ముచ్చట పడతారు. పిల్లల సంపాదనని వదులుకోవడమే గాదు వాళ్ళకోసం తమ సంపాదన నుంచి మరింత వెచ్చించడానికి ముందు కొస్తారు..

మరి ఇదంతా ఇంత సులభమైతే పిల్లల్ని పనికెందుకు పంపుతున్నట్టు? పిల్లలంతా బడిలోనే ఎందుకు లేనట్టు?

ఈ సమస్యకున్న కొన్ని పార్శ్వాలు మాత్రమే సరళమైనవి. పిల్లల్ని తల్లిదండ్రులు బడికి పంపాలనుకొంటున్నారనేదీ, బడికి పంపగలరనేదీ ఒక వాస్తవం. ఈ అంశం ఈ సమస్య కున్న సరళతర పార్శ్వాల్లో ఒకటి. కానీ ఇందులో సంక్లిష్టాంశాలూ లేకపోలేదు. మొట్టమొదటి మనం గుర్తించాల్సిందేమంటే మన నిరుపేద వర్గాల తల్లిదండ్రులు - ముఖ్యంగా గ్రామాల్లో తరతరాలుగా వ్యవసాయ కూలీలుగా వున్న వారందరూ  నిరక్షరాస్యులే. పనికి బదులు పిల్లల్ని బడికి పంపడమంటే వాళ్ళ జీవితంలో అది ఓ విప్లవాత్మక ఘట్టం. తరాల తరబడి వాళ్ళు తమ పిల్లల్ని వీలున్నంత చిన్న వయస్సు లో పనిలో పెట్టడమే అన్నిటికన్నా మంచి పని అని నమ్మినవాళ్లు. విద్య అనేది ఎప్పుడూ వాళ్ల ఆర్ధిక అజండాలో లేదు. పట్టణ మధ్య తరగతి తల్లిదండ్రులు ఆలోచనలకిది సరిగ్గా విరుద్ధం, తమ బిడ్డల్ని పనిలోకి పంపడం వీళ్ళు ఊహించనైనా లేరు. చదివించుకోవడం వీళ్ళకు సహజం మధ్య తరగతి తల్లిదండ్రులకు పిల్లల్ని బడిలో చేర్చడానికి ఎవరిని కల వాలో తెలుసు. ఏం చెయ్యాలో తెలుసు. అన్నిటి కంటే మించి తమ పిల్లల్ని పనిలోకి పంపితే ఏమవుతుందో మరీ బాగా తెలుసు.

దీన్ని మన గ్రామీణ నిరుపేద తల్లిదండ్రుల పరిస్థితితో పోల్చి చూడండి. తమ పిల్లల్ని బడిలో చేర్చాలంటే వాళ్ళెన్ని కష్టాలు గట్టెక్కాలి ? పుట్టినతేదీ ఒక సమస్య. ఆ తర్వాత కులం సర్టిఫికెటు, అటుపైన పుస్తకాలు, డ్రస్సులు, కాలం కలిసిరాక ఆగస్టులో బడికి పోవల్సివస్తే జులైలోనే అడ్మిషన్లు పూర్తయి పొయ్యాయని టీచర్లు చెపుతారు. కొంచెం స్కూలు వయస్సు దాటాక బడిలోకి అడుగు పెట్టాలనుకొనే వాళ్ళకి ప్రత్యేకంగా నాలుగు ముక్కలు  చెప్పి పై క్లాసు లో కూచోబెట్టే అవకాశమే మన బడిలో లేదు. తనకంటే చిన్నపిల్లల మధ్య ఆ ఒకటవ తరగతిలో కూచోవాల్సిందే. అదెంత ఎగతాళిగా వుంటుందో ఎందరికెరుక ? ఒక్క మాటలో చెప్పాలంటే  మన బడిలో బిడ్డను చేర్చడం కంటే ఒక భూస్వామి దగ్గర బిడ్డను వెట్టిచాకిరీకి పెట్టడమే సులువు. అతిశయోక్తిగా కన్పించవచ్చుగానీ మన  పేద తల్లిదండ్రుల విషయంలో ఇదిఅక్షర సత్యం.

ఇక ఎలాగో ఒకలాగున బిడ్డను బళ్ళో చేరిస్తే ఉపాధ్యాయుడి ధోరణి తల్లిదండ్రులకే మాత్రం అంతుపట్టదు. ఆయనిచ్చే ఇంటిపని ఎలా చెయ్యించాలో వాళ్ళకి తెలియదు. టీచరు అదీ ఇదీ తెమ్మంటాడు. అవి తెచ్చి పిల్లల కివ్వడం వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. టీచర్ల క్కూడా ఎంత మోతాదులో చెప్పాలో తెలీదు. తరచుగా హేతురహితంగా వ్యవహరిస్తుంటారు. ఫలితం ఏమిటి ? పెద్ద సంఖ్యలో మన పిల్లలు బడి నుంచి జారిపోవడం కాదు తరిమి వేయబడ్డం జరుగుతోంది. తరగతిలో పిల్లల్ని ఎలా కుదించాలో కూడా టీచర్లకు బాగా తెలుసు. దానికి వాళ్ళ దగ్గర చాలా పద్ధతులున్నాయి. హాజరు పిలిచేపుడు పేరు చదవకుండటం కూడా ఆ బిడ్డకూ, ఆ బిడ్డ తల్లిదండ్రులకూ ఎంత ఇబ్బంది కల్గిస్తుందో చెప్పలేము. ఒక కొత్త పుస్తకం కొనుక్కొని రమ్మనో, కొత్త పద్యం నేర్చుకొని రమ్మనో చెప్పడం కావచ్చు. సంవత్సరం చివర  మీ బిడ్డ ఉండాల్సినట్టుగా లేడని మొహం మీద చెప్పడం కావచ్చు. ఆ బిడ్డను బడి నుంచి గెంటెయ్యడానికి ఇలాంటిది ప్రతీదీ కారణవుతుంది. టీచర్లతో జరిపిన ఒక వర్క్ షాపులో ఇలా పిల్లల్ని కుదించే పద్ధతులన్నీ క్రోడీకరిస్తే ఆ లిస్టు చేంతాడంత అయింది.

ఒకవేళ బడిలో చేరిన బిడ్డా, చేర్పించిన తల్లిదండ్రులూ ఈ దాడినంతా  ఎలాగో ఒక లాగున తట్టుకొని నిలబడ్డా ఊళ్ళో వాతావరణం మాత్రం వాళ్ళని వెనక్కు లాగుతూనే వుంటుంది. తరతరాలుగా  తాము చేస్తున్న పనినే చెయ్యమని, పిల్లల్ని పనికి పంపడమే మంచిదని లోలోపల కెలికేలా చేస్తుంటుంది.

అంటే బాలకార్మిక వ్యవస్థకూ, పేదరికానికీ సంబంధం లేదని దీనర్థమా?

పేదరికానికీ బాల కార్మిక వ్యవస్థకూ సంబంధం వుంది. అయితే పేదరికం వల్ల వచ్చే ఇతర సమస్యల్లాగా కేవలం ఆర్థిక దుస్థితి వల్ల తప్పనిసరై నెత్తి మీద బడ్డ సమస్య మాత్రం కాదిది. మనం పేదల్ని వాళ్ళ మానాన వాళ్ళను వదిలేశామనడానికి బాల కార్మికవ్యవస్థా, నిరక్షరాస్యతా నిదర్శనాలు. తేల్చి చెప్పాలంటే బాల కార్మికవ్యవస్థ పేదరికం వల్ల ఉత్పన్నమైన సమస్య కాదు పేదల సమస్య.

విద్యను నిర్భంధం చెయ్యాలంటారా?

విద్యను నిర్బంధం చేస్తే దీన్ని అమలు చేసే అధికారులు నిరుపేద తల్లిదండ్రుల్ని అనవసరంగా వేధిస్తారని నిర్భంధ విద్యను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. బతుకు తెరువు కోసం తప్పని సరై పిల్లలు పని చెయ్యాల్సి  వస్తున్న దుస్థితిలో ఇలాంటి  చట్టాలు లేనిపోని కష్టాలు తెచ్చిపెడతాయని చాలామంది వాదిస్తున్నారు. కానీ అడ్డడుగు అనుభవం దీనికి భిన్నంగా వుంది. ఎలాగూ తల్లిదండ్రులు తమ బిడ్డలు చదువు కోవాలనే  కోరుకొంటున్నారు. కాబట్టి ఈ సమస్యే తలెత్తదు. పైగా ఇలాంటి చట్టం ఎంతైనా ఆహ్వానించదగింది.  గత ప్రభుత్వాలు అందరికీ విద్యను ఏ మాత్రం పట్టించుకోకపోవడం, తగినన్ని స్కూళ్ళు పెట్టి తగినంత మంది  టీచర్లను నిమమించకపోవడం లాంటి అంశాల్ని ఇది ముందుకు తెస్తుంది. అసలు సమస్యను బయటపెడుతుంది. అందరికీ చదువునందించడం కోసం  కావాల్సిన ఏర్పాట్లనీ ప్రభుత్వం చేసి తీరాలని డిమాండు చేసేవారికి ఇలాంటి చట్టం ఆయుధంగా  ఉపయోగపడుతుంది కూడా.

మరిప్పుడు మనం చెయ్యాల్సింది ఏమిటి?

మనం పునాది  నుంచి ప్రారంభించాలి. తమ పిల్లలకు మరింత మంచి భవిష్యత్తు చదువు ద్వారానే దక్కుతుందన్న విశ్వాసాన్ని దరిమిలా పిల్లల చదువుకోసం ఒక బలమైన కోరికను తల్లిదండ్రుల్లో రగిలించాలి.  బాల కార్మిక సమస్య  పరిష్కారానికిదొక్కటే మార్గం. పని నుంచి మాన్పించి బడిలో పిల్లల్ని  చేర్పించాలనే ఉద్యమానికి ముందు ఏ బిడ్డా పని చెయ్యకూడదని  సమాజం అంగీకరించాలి. సమాజాన్ని ఒప్పించడమంటే తల్లిదండ్రుల్ని,  ఒప్పించడం మాత్రమే కాదు.  యజమానుల్ని, అభిప్రాయాల్ని మలిచే వారిని, ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధుల్ని, పెద్దల్ని, యువకుల్ని, టీచర్లని ప్రతి  ఒక్కరినీ  ఒప్పించినపుడే  సమాజాన్ని ఒప్పించినట్లవుతుంది.  బాల కార్మిక సమస్యను దాని నిర్మూలనకు తాము చెయ్యదగ్గ కృషిని  సమాజంలోని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొనేలా చెయ్యాలి. పిల్లల తల్లిదండ్రులనే కాదు మొత్తం సమాజానికి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించబడిన రోజు  ఎంతటి ఫలితాలు దక్కుతాయో ప్రతి ఒక్కరికీ వివరించాలి.

ఒకసారి పిల్లల్ని పనికి పంపించడం మంచిది గాదనీ, అది తప్పనిసరి అవసరం కాదనీ ఒప్పిస్తే పిల్లల్ని బడిలో చేర్చడం దానికదే జరుగుతుంది. అప్పుడు బడి నుంచి సమాజం ఎక్కువ ఫలాన్ని ఆశిస్తుంది.. దాని వెనువెంట సమాజం బడిని గురించి పట్టించుకోవడమూ పెరుగుతుంది. విద్యాబోధనలో వాసి దానంతట అదే రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డ అవసరాలు తీర్చడానికి తగ్గట్టుగా పాఠశాల బాధ్యతలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. బడి తనకు తాను ఓ క్రమంలో  నిలదొక్కుకొనే వరకు బడి అవసరాల బాధ్యతను సమాజం తన భుజాన వేసుకొంటుంది.

అందరికీ విద్య కోసం ముందు బడి పెట్టి ఆ తర్వాత పిల్లల్ని బడిలో చేర్చే క్రమం ఇందులో వుండదు. ముందు డిమాండు సృష్టించి తర్వాత బడిని అందుబాటులోకి తేవడం ఈ వ్యవహారంలోని ప్రత్యేకత. ఈ వ్యవహారంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే మనం ముందుకు తెచ్చే డిమాండు. సమాజం మొదట పిల్లలు పని చెయ్యరాదని తీర్మానించుకొని, తర్వాత తమ పిల్లల సర్వతో ముఖ వికాసానికి తగినట్టుగా పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం మన లక్ష్యంగా వుండాలి. ఈ వ్యూహాన్ని నడిపేందుకు తగినట్లు మన కార్యక్రమాలన్నీ వుండాలి.

మన పాఠశాలల చదువు గ్రామీణ పిల్లల అవసరానికి ఏ మాత్రం అనుగుణంగా వుంది? ఇప్పటికే చదువు కొన్న నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా వుంటే మళ్ళీ మనం పిల్లలందర్నీ ఇదే బడికి పొమ్మని ప్రోత్సాహించడంలో అర్థమేముంది? దీనికంటె ఏదైనా వృత్తివిద్యల్ని పెడితే మన సమాజమూ పిల్లలూ ఈ నిరుద్యోగ సమస్య నుండి బయటపడతారేమో....

మన చదువులు ఎంత అసంబద్ధమైన వనే చర్చ మొదలు పెట్టాలంటే చాలా అంశాల్ని స్పృశించాల్సి వుంటుంది. కానీ ఈ అసంబద్ధత చాకిరీతో సతమతమవుతున్న పిల్లల్ని బడిలోకి చేర్చాలన్నప్పుడే ఎందుకు ముందుకు వస్తున్నట్టు? బడి బయట వున్న పిల్లల్ని బడిలోకి తెస్తున్నప్పుడే ఎందుకీ చర్చ మొదలవుతున్నట్టు? ఎంతోకాలం నుంచి మన పాఠశాలలు, మన విద్యావ్యవస్థ కావల్సినంత అసంబద్ధతను అందరి మీదా రుద్దుతున్నాయి. సుప్రసిద్ధ డూన్ స్కూలు అయినాసరే మన కనుగుణమైన విద్యనే అందిస్తోందని ఎవరైనా చెప్పగలరా? ఇప్పటి దాకా పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రులెవ్వరికీ ఈ అసంబద్ధత కన్పించలేదే. తమ పిల్లల్ని దీనివల్ల బడి మాన్పించినట్టు ఎక్కడా మనం ఎరుగమే. సుసంబద్ధమైన విద్య నేర్పే బడి దొరక్క పిల్లల్ని పనికి పంపినట్లు ఎక్కడా ఒక్క దాఖలా కూడా లేదే. మరి బాల కార్మికుల్ని బడిలో చేర్చాలన్నపుడే చదువులు అసంబద్ధంగా వున్నాయన్న చర్చ ఎందుకు  వస్తున్నట్టు?

జీవితాన్ని సుసంపన్నం చేసే విద్యను గురించి మాట్లాడదలుచుకొంచే మన విద్యా వ్యవస్థను మొత్తం తరచి చూడాల్సి వుంటుంది. అంతేగానీ బడికి దూరమైన పిల్లల్ని బడిలోకి తెచ్చే సందర్భంలో  ఈ సాకును ముందుకు తేవడం దుర్మార్గం. మరోస్థాయిలో చర్చ జరగాల్సిన మరో అంశాల్ని ఇక్కడకు తీసుకొని రావడం అర్థరహితం.
పనిని తప్పించి బాల్యపు హక్కును పరిరక్షించేదిగా, నిలబెట్టేదిగా మనం పాఠశాలను చూడాలి. ఇది రెండవ అంశం. బడి కుండాల్సిన నిజమైన లక్షణం ఇక్కడే  వ్యక్తమవుతుంది. పిల్లవాడిని ఉత్పాదకుణ్ణిగా మార్చేలా  మన పాఠ శాలలు ముఖ్యంగా మన గ్రామీణ పాఠశాలలు  లేవనే మరో ఆరోపణ కూడా తరచుగా మనం వింటుంటాం. లేబర్ మార్కెట్లో ప్రవేశించడాని కెంతో అవసరమైన పని నేర్చకపోవడం వల్ల ఆ కుటుంబానికి మన పాఠశాలలు ఎంతో నష్టం కల్గిస్తున్నాయనే విమర్శా వుంది. కాబట్టి చదువుతూ సంపాదించు అనే నినాదంతో వృత్తివిద్యలు స్కూళ్ళలో పెట్టాలనే వాళ్ళున్నారు. వరికోతల్లాంటి ముమ్మరమైన వ్యవసాయ పనుల్లో కుటుంబాలకు తోడ్పడేందుకు వీలుగా స్కూళ్ళకు సెలవులియ్యాలనే వారూ వున్నారు. ఇవన్నీ మన పాఠశాల లోపాలని వాళ్ళ అభిప్రాయం.

వాస్తవానికి మనం లోతుగా చూస్తే ఈ లోపాలను బట్టే పాఠశాలల్ని సమర్థించాల్సి వుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పనిలో పెట్టేందుకు వృత్తి విద్య లోపాయికారిగా ఉపకరించడం తప్ప వొరగబెడుతున్నదేమీ లేదు. ఇక మంచి వ్యవసాయ సీజన్లో స్కూళ్ళు పెట్టడమంటారా ? స్కూలు పని పిల్లల్ని చాకిరీకి దూరం చెయ్యడమే అయినప్పుడు ఈ సీజన్లో స్కూళ్ళు పూర్తిస్థాయిలో పని చెయ్యడమే సరైంది. పిల్లలు చాకిరీ చెయ్యడాన్ని పాఠశాల ఎప్పుడూ సమర్థించదు. ఇది పాఠశాలని నిందించాల్సిన అంశం కాదు. ప్రశంసించాల్సిన అంశం.

అన్నిటికంటే  పాఠశాల మాత్రమే పిల్లల్ని ప్రత్యేకంగా పట్టించుకొనే ఏకైక సంస్థ. దీని ప్రాధాన్యత ఇందులోనే వుందని మనం గుర్తించాలి.

దీన్నిబట్టి అంతిమంగా మనం ఏ నిర్ధారణకు రావచ్చంటే బాల కార్మికవ్యవస్థను నిర్మూలించాలనుకొన్నప్పుడు మన విద్యలోని సంబద్ధతా, మన పాఠశాలల స్వభావమూ అనే వాటికి ఏ ప్రాధాన్యతా లేదు. మనం గుర్తించాల్సిన ఒకే ఒక అంశం బిడ్డ చాకిరీ నుంచి విముక్తుడవు తున్నాడా లేదా అనేదే....

అనేక అడ్డంకుల్ని అధిగమించి శృంఖలాలు తెంచుకొన్నవాళ్ళు  మొదటితరం చదువు కొన్నవాళ్ళు. నిజానికి చదువులు సంబద్ధమైనవో కావో నిర్ణయించుకొనే అర్హత వాళ్ళకి మాత్రమే వుంది. చదువు నేర్చుకొన్నాక ఒకవేళ పని దొరక్కపోతే నేను నిరక్షరాస్యుడిగానే వుంటే బాగుండేదనే వాళ్ళు మనకెక్కడా విద్య అందించకపోవచ్చుగానీ మనిషిని మనిషిగా వెన్నెముక మీద నిలబెట్టేది మాత్రం చదువే. దీన్ని అందరం అంగీకరించాలి.

సాంప్రదాయక కుటుంబ వృత్తి నైపుణ్యాల్ని పిల్లలకందించడం మంచిది కాదంటారా?

సాంప్రదాయక చేతివృత్తుల్ని కీర్తించే ధోరణి ఒకటుంది. ఈ వృత్తులు శతాబ్దాల తరబడి మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను కాపాడాయనీ, ఆధునిక వృత్తులకీ శక్తి లేదనీ కొందరు వాదిస్తున్నారు.  అందువల్ల పసితనంలోనే ఈ కుటుంబ వృత్తి వీలున్నంత త్వరగా నేర్పడం మంచిదని, అందువల్ల ఆ వృత్తి నైపుణ్యం సహజంగా పిల్లలకి అలవడుతుందని వీరు భావిస్తున్నారు. దీనివల్ల పిల్లలు అనవసరమైన చదువుల కోసం శ్రమ పడకుండా  ఉత్పాదక పౌరులుగా తయారై  బతుకుతెరువు చూచుకోగలరని వీళ్ళు నమ్ముతున్నారు.

ఈ దృక్పథం అంతిమంగా చెప్పేదే మంటే  పిల్లలు తమ కుటుంబవృత్తిని కొనసాగించడం మంచిదని.... కొన్ని కులాల్ని కొన్ని వృత్తులకు పరిమితం చేసిన  సాంప్రదాయక సామాజిక వ్యవస్థకిది  ఇంకా ప్రాణం పొయ్యడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తుంది... కుమ్మరి బిడ్డ కుండలు చెయ్యడానికి, సాలెబిడ్డ నేత నేర్చుకోడానికీ దారితీసి వాళ్ళ నక్కడే ముడుచుకుపొయ్యేలా చెయ్యడానికి దోహదపడుతుంది. తన వృత్తిని, తన జీవన విధానాన్ని తాను నిర్ణయించుకొనే అవకాశాన్ని ఇది చిన్నతనంలోనే హరించి వేస్తుంది.

నిజానికి మన గ్రామాల్లో అనేక చేతి వృత్తిదార్లు తమ సాంప్రదాయక వృత్తుల్ని విడిచిపెట్టి ఇతర వృత్తుల్లో, రంగాల్లో ఎంతో ఉన్నత శిఖరాలకెళ్ళిన దృష్టాంతాల్ని పై దృక్పథం చూడ నిరాకరిస్తోంది. ఇలాంటి వాళ్ళు పాట వృత్తుల్లోనే మగ్గిపొయ్యి వుంటే ఎందుకూ కొరగానివారయ్యే వారు. సరైన సమయంలో ఆచితూచి తనకేం కావాలో ఎన్నుకోగలిగే శక్తి సామర్థ్యాల నిచ్చేది నిజమైన విద్య. ఉపాధి హామీ పేరిట పనికోసం చదువు నుంచి దూరం చేస్తే తన భవిష్యత్తును నిర్ణయించుకొనే శక్తి సామర్థ్యాల్ని వ్యక్తి కోల్పోతాడని మనం గ్రహించాలి. చిన్నప్పుడే కుటుంబ వృత్తి పని నేర్పితే చాలా వేగంగా పిల్లలు నైపుణ్యం సంపాదిస్తారనడం లోనూ వాస్తవం లేదు. ఒక స్థాయి విద్య నేర్చాక 12-14 ఏళ్ళ  తర్వాత అయితే పిల్లలు వృత్తిలో ఎంతో సంపాదిస్తారనేందుకెన్నో దృష్టాంతాలున్నాయి. చిన్న వయస్సులోనే పిల్లల్ని పనిలోకి దించాలనే ఈ దృక్పథంలో వున్నదంతా ఎలా సమర్థులైన కార్మికుల్ని తయారు చెయ్యాలా అన్నదే తప్ప మరేమీ కాదు. బాల్యం బిడ్డను కార్మికుణ్ణిగా మార్చే పరిణామ క్రమదశ అనే ఈ  దృక్పథం  చివరికి సమాజాన్ని రెండు వర్గాలుగా విభజిస్తుంది. వయస్సు వచ్చింత తర్వాత జీవితపు సవాళ్ళను ఎదుర్కోగల్గేలా తమ పిల్లల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులొక  వర్గం. వీలున్నంత తొందరగా బాల్యంలోనే తమ పిల్లల్ని పనిలో పెట్టి సమాజానికి బరువు కాకుండా జాగ్రత్త పడాల్సిన తల్లిదండ్రులు మరోవర్గం. ఇలా వాదించేవాళ్ళు తమ పిల్లల్ని బడికి పంపేటపుడు ఎప్పూడూ రెండో ఆలోచన చెయ్యరు. తమ పిల్లలకు కుటుంబ వృత్తులు నేర్పించడానికి ఎప్పుడూ పూనుకోరు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, అందరికీ విద్య నందించడానికీ గతంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలెలాంటివి?

మనం ముందు చెప్పుకొన్న పేదరికం వాదన చదువుల్లోని అసంబద్ధతా చర్చ గత ప్రభుత్వ పథకాల రచనలో కీలకపాత్ర పోషించాయి. పిల్లలు పనిచేయడం ఒక చేదు నిజంగా భావించడం వల్ల ప్రమాదకర పరిశ్రమల్లోని పిల్లలవరకే ఈ పథకాలు వర్తించాయి.  శాసనాలూ అలానే తయారయ్యాయి. కుటుంబ పరిధిలో పనిచేసే పిల్లలు బాలకార్మిక నిరోధ చట్టం పరిధి లోకిరారు. అందువల్ల అధికార లెక్కల్లో 17 మిలియన్లు బాల కార్మికులన్నట్టు చెప్పినా పథకాలు మాత్రం 20 లక్షల మంది పిల్లలనే లక్ష్యంగా పెట్టుకొన్నాయి. పని నుంచి తమ పిల్లల్ని మాన్పించి బడికి పంపినందుకు తల్లిదండ్రులకు నష్ట పరిహారం ఇవ్వడం మీద ఈ పథకాలు ఆధారపడ్డాయి.. సమస్యలోని కీలకాంశాల్ని ఇవి పట్టించుకొన్న పాపాన పోలేదు.

ఈ పథకాల్లోని ప్రధానమైన లోపాలు ఏమిటి?

గత పాలసీల పథకాలన్నీ బాల కార్మికులకు సంబంధించిగానీ, అందరికీ చదువుకు సంబంధించిగానీ,  కేవలం వ్యతిరేక భావనల ఆధారంగా రూపొందినవి. పేదప్రజలు పిల్లల్ని పని నుంచి తప్పించలేరు. బడిలోకి పంపలేరు. తల్లిదండ్రుల దృష్టిలో ఈ చదువులు అర్థం లేనివి. అందువల్ల పాఠశాల విద్య ఈ పిల్లలకు పనికి రాదు.  ఇవీ ఈ పాలసీల్ని నడిపించిన వ్యతిరేక భావనలు.

ఈ దృక్పథం పేదవాళ్ళు తమ పిల్లల్ని ఎంతో యిష్టంగా బడికి పంపుతున్న వాస్తవాన్ని గానీ, దీనికోసం ఎన్నో త్యాగాలు చేస్తుండడాన్ని గానీ, చదువు ద్వారా తమ పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా వుంటుందని వాళ్ళు నమ్ముతుండడాన్ని గానీ చూడ నిరాకరిస్తోంది.

ఫలితంగా బాలకార్మిక సమస్యను సమగ్రంగా చూడకుండా ప్రభుత్వం ముక్కలు చేసి చూడనారంభించింది. అందువల్ల ఇది ఘోరంగా విఫలమైంది. ఒకవేళ ఈ ఫథకాలు కొందరు బాలకార్మికుల్ని విముక్తి చేసినా వాళ్ళ స్థానంలో మళ్ళీ కొత్తవారు క్షణాల్లో వచ్చి చేరుతున్నారు.

ఈ పథకాలేవీ స్కూలు పరిధిని దాటి సమాజంలోనికి, కుటుంబంలోకి చొచ్చుకెళ్ళ లేక పొయాయి. అందువల్ల బాగా విజయవంతమైన ప్రభుత్వ పథకాలు కూడా బడిలోకి పిల్లల్ని ప్రభావితం చెయ్యడం తప్ప పనిలోని పిల్లల్ని తాకలేకపోయ్యాయి.

మరి మంచి పథకం ఎలా వుంటాలి...

బాలకార్మికుల్ని, విద్యనూ పట్టించుకొనే పథకమైనా మొదట సానుకూలాంశాలపై ఆధారపడాలి. సరిగా ప్రోత్సహిస్తే నిరుపేదలు కూడా తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం చదువును కోరుకొంటారని ఒప్పుకోవాలి.  ఇందు కోసం పని మాన్పించి బడిలో పెట్టడమే గాదు తమ పిల్లలకోసం త్యాగాలు కూడా చేస్తారని మనం గుర్తించాలి. ఎంత హేతుబద్ధంగా వున్నట్టు కన్పించినా సరే పిల్లలు పని చెయ్యడం అనేదాన్ని నిర్ద్వింద్వంగా తిరస్కరించాలి. పేదరికం వాదనని తోసిపుచ్చాలి. ఏ పనైనా పిల్లల బాల్యపు హక్కును హరించేదే గాబట్టి వాళ్ళు చేసే పనుల్ని విభజించడం కేవలం పండిత తర్కమే తప్ప మరొకటి కాదనీ, దీంతో పిల్లలకే మాత్రం సంబంధం లేదనీ, దీంతో పిల్లలకేమాత్రం సంబంధం లేదనీ అంగీకరించాలి. అంతేకాదు బడికిపోని ప్రతి బిడ్డా బాల కార్మికుడేననీ నమ్మాలి. పని నుంచి మాన్పించడం పూర్తిస్థాయి విద్యార్థిగా బడిలో బదువు నేర్పడం రెండూ ఒకే సమస్యకు గల రెండు పార్శ్వలనీ, వీటిని వేర్వేరుగా చూడ్డం సరికాదనీ కూడా విశ్వసించాలి. ముందు ఈ ప్రాధమికాంశాలు వొంటబడితే తర్వాత కార్యక్రమం అందునుంచే పుట్టుకొస్తుంది.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనుకొంటే మొదట పిల్లలు పని చెయ్యరాదనే నిబంధనను సమాజం విధించుకోవాలి. మనం చేపట్టే పథకానికది తప్పనిసరి శ్రీకారం. సానుకూల అంశాల ప్రాతిప్రాదికగా కార్యక్రమం ప్రారంభించడం  ఇందుకోసమే.

ఈ మెట్టు ఎక్కాక ఆ ఏరియాలో పని చేస్తున్న పిల్లలందరికీ లేదా బడికిరాని పిల్లలం దరికీ ఉపకరించేలా కార్యక్రమం రూపొందించుకోవాలి. సమాజం తనకు తాను విధించుకొన్న నిబంధనే అందరి పిల్లల్ని చదివించేలా చేస్తుంది.

తర్వాత ప్రతి వయో గ్రూపుకు తగినట్టు వ్యూహ రచన చేసుకోవాలి. అందరూ ఒకే సారి స్పందించకపోవచ్చుగానీ అంతదాకా పథకం ప్రారంభించకుండా వుండనక్కరలేదు. పాఠశాల సమాజంగానే అప్పుడు  కేంద్ర  బిందువుతుంది.  దానిపాత్ర  ఊహించనంతగా పెరుగుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరినీ కదిలించడం నిరంతరం జరుగుతూ వుండాలి. తప్పని సరిగా యువకుల్ని సమీకరించాలి.  బడికి వెళ్ళకుండా చదువు నేర్చుకొన్న మొదటితరంలోని యువకులు ఈ ఉద్యమంలో ముందుండేలా చూడాలి.

ఈ అన్ని అంశాల్ని కార్యక్రమంలో ఎలా ఇముడ్చుకోవాలి..

సానుకూలాంశాలపై కార్యక్రమ రూపకల్పన, తల్లదండ్రులపై, పిల్లల్ని, చదివించుకోవాలన్న వారి కోరికపై విశ్వాసం, దీనికిగల పేదల శక్తి సామర్థ్యాలపై నమ్మకం, బడి మాత్రమే పని నుంచి మాన్పించిన పిల్లల్ని ఇముఢ్చుకొనగలదన్న దృక్పథం మార్గదర్శక సూత్రాలుగా మనం పెట్టుకోవాలి. ఎక్కడా వీటిపై రాజీ పడకూడదు.

సమాజం తనకు తాను బాలకార్మిక వ్యవస్థపై ఒక నిబంధన విధించుకోవాలనుకొంటున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున మొదట దీనికై చర్చ ప్రారంభించాలి. దీనికి ముగింపుగా బడి బయటవున్న పిల్లలందరినీ ప్రతిగ్రామంలో సర్వేచెయ్యాలి. దీనికోసం మొదట మన సిబ్బంది పైనే ఆధారపడవచ్చు. కానీ గ్రామ యువకుల్ని ముందుంచుకోవాలని మాత్రం మనం మరిచి పోకూడదు. ముందు ప్రాథమిక చర్చ సమాజం తో జరగాలి. తర్వాత ప్రభుత్వ సాయం కోరాలి.

సహజంగానే ఇప్పుడొక కమిటీ అవసరమవుతుంది. ఇది ఆసక్తిగల వ్యక్తులతో ఏర్పడాలి. గ్రామస్థాయిలో ఈ సమస్యను పరిష్కరించుకొనేందుకు ఏం చెయ్యాలో చర్చించుకోవాలి.  ఒక క్రమంలో పలు సమావేశాల్లో వరసగా అనేకాంశాలు చర్చించాల్సి వుంటుంది. పిల్లల్ని పని మాన్పించడం, అందరూ భాగస్వాములు కావడం, గ్రామపెద్దల పాత్రా, పాఠశాల పాత్రా ఉపాధ్యాయుడి పాత్రా- వీటిలో ఎవరు ఏం చెయ్యగలరనేది చర్చకు రావాలి. చివరకు ప్రభుత్వ సాయంతో ఒక ప్రణాళిక తయారు కావాలి.

ఈ ప్రణాళికలో తప్పనిసరిగా రెండు ప్రధానాంశాలుండాలి. మొదటిది  బడికి బయట గల  పిల్లలందర్నీ లక్ష్యంగా ఇది వుంచుకోవడం. రెండోది ప్రతి ఒక్కరూ చెయ్యవల్సిన బాధ్యత స్పష్టంగా నిర్దేశించడం. పాఠశాలతో సమన్వయం, ప్రజానీకంతో సమావేశాలు, పిల్లల్ని పనిలో పెట్టుకొన్న యజమానులతో చర్చలు, పాఠశాల వసతుల కోసం అధికార్లనూ అనధికార్లను సంప్రదించడం ఇవన్నీ కమిటీలోని వారు చెయ్యాల్సిన పనులు. మొత్తం పిల్లల లిస్టు తయారయ్యాక మన ప్రణాళిక ప్రతి బిడ్డకూ తగినట్టుగా వుండాలి.

ఈ దశలో ఎదురయ్యే ప్రధాన సమస్య స్కూల్లో తగినంతమంది టీచర్లు లేకపోయడం తర్వాత అవసరమయ్యేది బడిలో  చేర్చిన పిల్లల్ని పర్యవేక్షించడం. ప్రజలు ఎక్కువ టీచర్ల కోసం ఒత్తిడి తేవాలి. ఈ లోగా విద్యా వలెంటీర్లను నియమించుకోవాలి. మొదటితరం చదువుకొన్న యువకులు పాఠశాలలో విద్య నేర్పడానికి గానీ, తల్లిదండ్రుల్ని ఒప్పించి పిల్లల్ని బడికి తీసుకొని రావడానికిగానీ ఎంతో చక్కగా ఉపయోగపడతారు.

వలెంటీర్లను పిల్లలు బడిలో చేరక ముందు నుంచే చేతినిండా పని వుంటుంది. ప్రోత్సాహకులూ, పిల్లల్ని పని నుంచి మాన్పించి తెచ్చే వాళ్ళూ వాళ్ళే అవుతారు. దీనికోసం వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఏ పిల్లల్ని నేరుగా బడిలో చేర్చాలి, ఎవర్ని ఒక స్థాయికి చెప్పించిన తర్వాత మాత్రమే చేర్చాలి అనేది వీళ్ళే నిర్ణయిస్తారు. సాధారణంగా
8-11 మధ్య వయస్సు పిల్లలకు బ్రిడ్జి కోర్సు రెసిడెన్సియల్ గా గానీ, పాఠశాలల్లో గానీ పెట్టి తర్వాత వాళ్ళను బడిలో చేరుస్తారు. ఈ పిల్లలు బడిలో మళ్ళీ ఒకటో తరగతి నుంచి మొదలు పెట్టకుండా కొంత నేర్చుకొని వయసుకు తగ్గ తరగతిలో చేరడానికి ఈ కోర్సులు ఉపకరిస్తాయి. 12-14 సంవత్సరాలు పిల్లలకయితే 18-24 నెలల కోర్సుల్ని రెసిడెన్షియల్ గా నిర్వహించి నేరుగా 7వ తరగతి పరీక్ష రాయించడం జరుగుతుంటుంది.

ఇలా చేసేపుడు  ప్రతిదశలోనూ మనం చెయ్యాల్సిన విధులు చాలా వుంటాయి. పిల్లలకు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఓపిగ్గా సలహాలివ్వాలి. అధికార్లను కదిలించాలి. నిధులు సమీకరించుకోవాలి. అధికార్లను కలపాలి. యజమానుల్ని ఒప్పించాలి. రకరకాల ప్రచారాలతో ఇవన్నీ పూర్తి చెయ్యాల్సి వుంటుంది. ప్రదర్శనలూ, ఊరేగింపులు  ప్రజలతో సమావేశాలు లాంటివి దీనికి ఉపకరిస్తాయి.

సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఈ కార్యక్రమంలోని అంశాలివి.

 • మన దృక్పథానికి సంబంధించి ప్రాథమికాంశాల పట్ల అవగాహన స్పష్టంగా  వుండాలి.
 • పిల్లలు పని చెయ్యరాదనే సూత్రాన్ని అంగీకరించేలా సమాజాన్ని సమాయత్వం చెయ్యాలి.
 • దీనికోసం సమాజం ఆధారంగా పనిచేసే ప్రక్రియల్ని రూపొందించుకోవాలి.
 • ఒక ఉమ్మడి అంగీకారానికి వచ్చాక పని ప్రారంభించాలి.
 • గ్రామంలోని పిల్లలందరినీ కవర్ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. పర్యవేక్షణా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి.
 • వయోగ్రూపుల్ని బట్టి పలు వ్యూహాల్ని ఎన్నుకోవాలి.
 • ఈ క్రమంలో దీనికి సహకరించే సంస్థలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. పాఠశాల ప్రాధాన్యతను గుర్తించి తీరాలి. ఈ సంస్థల్ని పటిష్టం చేసుకొనేందుకు తగినట్టుగా ఈ కార్యక్రమం సాగాలి.
 • ఈ అంశాలన్నిటినీ దృష్టిలో వుంచుకొని కార్యక్రమం ప్రారంభించాలి. నిరంతరం కొనసాగించాలి.
 • ఒక కమిటీ రూపంలో ఒక యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి. ఇది ప్రతి దశలోనూ ప్రగతిని సమీక్షించాలి. పిల్లల్ని పని నుంచి మాన్పించేపుడు వచ్చే ప్రతి సమస్యనూ ఇది పట్టించుకోవాలి.
 • బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, అందరికీ విద్యను అందించేందుకు ఉద్దేశించిన విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఇతర కార్యక్రమాల కంటే ఇది ఎలా భిన్నమైంది.

  ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ పేదరికాన్ని, విద్యలోని అసంబద్దతనూ ముందుకు తెస్తున్నాయి. అలాగే సమగ్ర దృక్పథం కూడా ఇక్కడ కొరవడుతోంది. అందువల్ల బాల కార్మికుల్లోని అత్యంత దోపిడీకి గురవుతున్న ఒకానొక వర్గానికే ఇవి పరిమితమవుతున్నాయి. అన్ని రకాల బాల కార్మికుల్ని విముక్తి చెయ్యాలి. అనే ఆశయంతో ఇవి లేవు. ఎక్కువ సందర్భాల్లో తమ పిల్లల్ని బడికి పంపినందుకు ఆర్థిక సాయం చెయ్యడమో,  స్వయం ఉపాధిలాంటి ప్రోత్సాహకాలివ్వడమో ఇవి చేస్తున్నాయి. తల్లిదండ్రుల్లో పిల్లల్ని పని నుంచి మార్పించి బడికి పంపాలనే తపన వుందని ఇవి అంగీకరించడం లేదు. ఒక పని నుంచి మాన్పించి మరో పనిలో  పెట్టే పథకాలు కొన్ని వున్నాయి.  ఈపనికి మరింత ఉపయోగపడే వృత్తి విద్య అని పేరు పెట్టారు. చదువుతూనే సంపాదించడం అనే లేబిల్ దీనికి  తగించారు. బాల్యం అనేది పిల్లల్ని పనిలోపెట్టి సంపాదించడం నేర్పే దశ అనే దృక్పథం మీద ఆధారపడ్డ కార్యక్రమం ఇది.  బాల కార్మికులకు యూనియన్లు పెట్టి తమంతటతాము నిలబడేలా కృషి చేసే వారూ వున్నారు. పిల్లల్ని పని మాన్పించడం అనే అంశం ఇందులో లేదు. అందువల్ల బాలకార్మిక వ్యావస్థా నిర్మూలనకూ దీనికూ సంబంధం లేదు.

  ఇక అందరికీ విద్య దగ్గరికొచ్చే పరిస్థితిని మన పాలసీ నిర్ణేతలు తమ దృక్పథం నుంచి విశ్లేషించారు. కొన్ని పరిష్కారాల్ని వెతికి కొన్ని కార్యక్రమాల్ని రూపొందించారు. పై నుంచి కిందికి దించడం తప్ప ప్రజల నుంచి ఒక డిమాండును సృష్టించడం, దాని కనుగుణంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిండం ఇందులో లేనలేదు. వీళ్ళనుకొన్న పరిష్కారాలు సరైనవే కావచ్చు. కానీ తమ ఆకాంక్షలకు తగినట్టు ఇవి ఉన్నాయని సమాజం మొదట అంగీకరించాలి. గదా...

  ప్రభుత్వం కానీ, స్వచ్ఛందసంస్థలు గానీ ఇప్పటిదాకా చేపట్టింది. అనియత విద్యా కార్యక్రమం. బిడ్డ పని కూడా చెయ్యాలని, మనం చెప్పే చదువు అతని పనికి అంతరాయం కల్గించేదిగా వుండరాదనీ అనియత విద్య నమ్ముతుంది.

  అలాగే నిర్భంధ విద్యను తెస్తే ఇది పేదల్ని వేధించే దిశకు వెళ్తుతుందని ఆ ప్రయత్నం అడుగుకూడా ముందుకు వెళ్ళకుండా ఆగిపోయింది. అసలు సమస్య వేరే వుంది. ఈ చట్టం తెస్తే దీన్ని అమలు చెయ్యడానికి ఎన్నో వసతులు, నిధులు కావాలి. అందుకే ఈ చట్టాన్ని వెనక్కు నెట్టారు.

  ఈ తరహా కార్యక్రమానికి ఎంత పెట్టుబడి అవసరం...

  మన పాలనా వ్యవస్థలో మండలం జనాభా 35-40 వేలు వుండొచ్చు. సగటున ప్రతి మండలంలో 5000 మంది బడికి వెళ్ళే పిల్లలూ, 5000 మంది బడికి పోని పిల్లలూ వుంటారు. అయిదేళ్ళు దాటిన 5000 మంది పిల్లల్ని ఒక ఏడాది బడిలో పెట్టి చదివించడానికి ఒక అంచనా మేరకు సుమారు 40 లక్షల రూపాయలు అంటే అవసరం. 5 ఏళ్ళకు రెండు కోట్లు అవసరం. అంటే పిల్లవాడికి ఏడాదికి రూ. 800 లన్న మాట. 1200 మండలాలకు కలిపి. రూ.2400 కోట్లు కావాల్సి వుంటుంది.,

  అదనపు స్కూళ్ళ స్థాపన కోసం, అదనపు టీచర్ల నియామకం కోసం ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చును ఇందులో చేర్చలేదు. వాలెంటీర్లకూ, సమీకరణాకూ అవసరమైన ఖర్చులే ఇక్కడ లెక్కకు వచ్చాయి.

  మరొకటి కూడా గుర్తుంచుకోవాలి. ఒకసారి మన లక్ష్యంలో క్లిష్టమైన భాగం పూర్తయితే అలాంటి పిల్లల్ని మనం బడిలో చేర్చితే సమీకరణావసరాలు  అంత పెద్దగా వుండవు. అప్పుడు ఖర్చు బాగా తగ్గిపోతుంది

  బాల కార్మికులూ - చదువులూ

  ప్రపంచంలో  బడికెళ్ళని పిల్లల్లో ఎక్కువ మంది మన దేశం వాళ్ళే. పసితనంలోనే పనిలోకి కూరుకుపోతున్నవాళ్ళలో ఎక్కువ మంది మనవాళ్ళే. పనీ - చదువూ ఈ రెంటి మధ్యా వున్న సంబంధాన్ని మనలో చాలా మంది అంగీకరిస్తారు. సమస్య ఇంత స్పష్టంగా వున్నా మన విద్యావిధాన పత్రాల్లో బాలకార్మికుల్ని గురించి అడపాదడపా తడమడంతప్ప ఎక్కడా అంతకు మించి కన్పించదు. ఎందువల్ల ...

  బాలకార్మిక వ్యవస్థను రూపుమాపగలమన్న నమ్మకం మనకు లేకపోవడమే దీనిక్కారణం. మరో ప్రపంచం  ఒకటి వస్తే మరో వసంత కాలపు ప్రభావితం వస్తే అప్పుడు మాత్రమే  దీన్ని పరిష్కరించగలమనీ మనం నమ్ముతున్నాం.

  పేదరికం కారణమా..

  పాపం ప్రజలు నిరుపేదలు. వాళ్ళకి పిల్లల సంపాదన  చాలా అవసరం బాలకార్మికులు లేనిరోజూ రావాలంటే ముందు ఈ పేదరికం పోవాలి. ఉన్నట్టుండి. పిల్లలందర్నీ పని నుంచి లాగిస్తే ఈ పేదలు ఆకలితో మలమల లాడిపోతారు. అనేది మన వాదాల్లో ఒక వాదం. ఇది పేదరికం మీద ఆధారపడ్డ వాదం. ఎక్కువ మందికిది  సహించినట్టుగా వుండొచ్చు గానీ ఇదొక దిక్కుమాలిన వాదం.

  ఎంతోమంది నిరుపేదలు తమ పిల్లల్ని బడికి పంపుతుండటం , అంతకంటే ఆర్థికంగా మెరుగ్గా వున్న వాళ్ళు కూడా తమ పిల్లల్ని బడికి పంపకపోవడం మన గ్రామాల్లో మనం చూస్తూనే వున్నాం. దీన్ని మనమెలా అర్థం చేసుకోవాలి.... ఒకానొక దారిద్య్రరేఖ దాటితే పిల్లలందర్నీ బడికి పంపాల్సిన తప్పనిసరి పరిస్థితి తల్లిదండ్రులకి వస్తుందని ఎలా పేదరికాన్ని నిర్వచించగలం.... ఇదంతా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపుకోవాలన్న తపన మీద ఆధారపడి వుంటుంది.  ఎలా పేదరికాన్ని నిర్వహించగలం.... ఇదంతా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపుకోవాలన్న తపన వున్నవారు. మనం వూహించిన దానికంటే ఎంతో పేదరికంలో వున్నా  తమ పిల్లల్ని బడికి  పంపుతారు. కాబట్టి సమస్య పేదరికానిది కాదు. బాలకార్మిక సమస్యను మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే బడిలో చేరే పిల్లలు ఎందుకు చేరడం లేదు అని మనం పరిశీలించారు.
  మనం పేదరికపు వాదాన్ని నమ్ముతున్నాం. గాబట్టి  పేదరికం వల్లనే పిల్లలు పని చేస్తున్నారని భావిస్తున్నాం. నిజానికి పేదరికానికీ పిల్లల పనికీ సంబంధం మనం అనుకొన్నంత లేదు. కేరళలో అందరికీ చదువెలా సాధ్యమైంది అంటే మనం అదొక  ప్రత్యేక పరిస్థితి అంటాం. మరి హిమాచల్ ప్రదేశ్ లో కూడా సాధించారు గదా అంటె అక్కడి వాళ్ళంతా సైన్యంలో చేరతారని సమాధానం చెపుతాం. రంగారెడ్డి జిల్లాను ప్రస్తావిస్తే అది చాలా చిన్న ప్రాంతమని సన్నాయి. నొక్కులు నొక్కుతాం. అంతే తప్ప మనం వాస్తవాన్ని చూడ్డానికి మాత్రం ఒప్పుకోం.

  మన దేశంలో ఇంతమంది పిల్లలు గొడ్డు చాకిరీకి ఎందుకు బలవుతున్నారు...బడి కెందుకు దూరమవుతున్నారు... దీని మూలాల్ని మనం తరచి చూడలేక పోతున్నాం. అర్థం చేసుకోలేకపోతున్నాం.

 • తమ పిల్లల కోసమే పాఠశాలున్నాయనీ, ప్రభుత్వం, వాళ్ళ కోసమే  వాటిని పెట్టిందనీ పేదల దగ్గరికెళ్ళి ఓపిగ్గా ఎవరు చెప్పారు... వాళ్ళు పిల్లల్ని బడికి పంపదల్చుకొంటే ప్రభుత్వం ఎంతైనా సాయపడుతుందని ఎవరు వివరించారు... పిల్లల్ని పనికి పంపడం మంచిది కాదని తల్లిదండ్రులర్థం చేసుకొనేందుకు మన మెవరం స్నేహహస్తం అందించాం ?
 • తరతరాల నుంచి చాకిరీ చెయ్యడం తమ భాగ్యమన్నట్టు పేదలకి ఎక్కించాం.  చదువుకొంటే పిల్లలు ఎందుకూ కొరగాకుండా పోతారని నమ్మేలా చేశాగదూ.
 • బడికి పంపడం కన్నా ఏదో ఒక మోతుబరి దగ్గరి పనికి పెట్టడమో , వెట్టిచాకిరీ అయినా చెయ్యించడమో తేలికగా కన్పించే దుస్థితి కాదా మనది?
 • మన బడిలో అడుగు పెడుతున్న బిడ్డ ఆ కుటుంబం నుంచి  మొట్టమొదట బడికొస్తున్న బిడ్డ. ఈ స్పృహ మన టీచర్ల కెందరికి వుంది.. మన వ్యవస్థకీ స్పృహ ఎంత మాత్రముంది?
 • అన్నిటి కంటె ఘోరం. పదేళ్ళ బిడ్డ ఇప్పుడు బడి కొస్తానంటే మనం ఆరేళ్ళ పిల్లల మధ్య ఒకటో తరగతిలో కూర్చో బెడతాం. ఇంతకంటే మరో ఏర్పాటు  మన దగ్గరేమైనా వుందా?
 • నిజానికి పేద పిల్లలందర్నీ బడికి పంపేలా మన వ్యవస్థను మనమెప్పుడూ సరళ తరం చెయ్యలేదు. అనుకూలంగా మలచలేదు. ఈ పేదలకి పిల్లల్ని బడికి పంపడం ఇష్టం లేదు. అని తీర్మానంచేసి చేతులు మనం దులిపేసుకొంటున్నాం. ( ఈ పని చాలా సులభం కదూ).

  మన చదువులు పనికిమాలినవా?

  ఇక రెండో వాదం మన చదువుల స్వభావం. గురించి, మనం బడిలో నేర్పుతున్న చదువులు అర్థం లేనివనీ, పనికిమాలినవనీ దీనికన్నా పని నేర్చుకోవడం మేలనీ  ఈ వాదన సారాంశం. ఇది మరో దివాళాకోరువాదం.

  మనం నేర్పుతున్న చదువులకీ జీవితానికీ అంతంతమాత్రం సంబంధమేనని ఒప్పు కొందాం. మరి ఈ విషయం అన్ని చదువులకూ,  అన్ని స్కూళ్ళకూ., అందరి పిల్లలకూ వర్తిస్తుంది. కదా అలా చూస్తే మన హైదరాబాద్ పబ్లిక్ స్కూలూ, రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మండలం ధోబీపేట ఎలిమెంటరీ స్కూలూ దొందూ దొందే.... మరి పనిచేసే పిల్లలకీ మాత్రం ఈ చదువులు ఉన్నట్టుండి ఎందుకు పనికిరాని వైపొయ్యాయి.... ఈ పనికిమాలిన చదువులన్నీ అర్థవంతమైన వయ్యేరోజు వచ్చినప్పుడే మన పిల్లల్ని మళ్ళీ బడిలో చేరుద్దాం. అప్పటిదాకా పనిలో పెడదాం. దీనికి ఒప్పుకొంటారా...

  ప్రస్తుత బాల కార్మికులందరూ పెరిగి మళ్ళీ బాలకార్మికుల తల్లిదండ్రులుగా మారి వాళ్ళపిల్లల్ని చాకిరీలోకి దింపాలని కొంపదీసి మనం కోరుకోవడం లేదుగదా... ఈ దుస్థితి ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలని జీవితంతో ముడిపడ్డ చదువులనే వాదాన్ని ఎత్తుకో లేదు గదా...

  ఈ వాదంలో భాగంగానే మనం అనియత  విద్యను ప్రారంభించాం. ఇందులో అయితే వీళ్ళు ఎంచక్కా చదువుకోవచ్చు. ఎంచక్కా పని చేసుకోవచ్చు. చదువుతూ సంపాదించుకోండి అనే నినాదంతో వృత్తి విద్యలు కూడా మొదలెట్టాం. అంటే మనం అసలు పాఠశాలలకు వంకలు పెట్టి పిల్లల్ని అక్కడి నుంచి దూరం చేస్తున్నామన్నమాట. మన వాదాలు చాలా గమ్మత్తుగా వుంటాయి.

 • మన స్కూళ్ళు అర్థంలేని చదువులు నేర్పుతున్నాయి. పేదవాళ్ళని మంచి పని వాళ్ళుగా శ్రమ జీవన సౌందర్యారాధకులుగా మార్చలేకపోతున్నాయి.
 • అవి వ్యవసాయం ముమ్మరంగా జరిగే రోజుల్లో పని చేస్తాయి. ఈ బడి వేళలు మన పేదలకి ఏ మాత్రం సరిపోవు.
 • ఈ వాదల్లోని అద్భుతం ఏమంటే పిల్లల్ని పనిలోకి పోనీకుండా పాడు చేస్తున్నాయని  పాఠశాలల్ని తప్పు పడతాయి. ఇంతకంటే దిక్కుమాలిన వాదం వుంటుందా... స్కూళ్ళు పిల్లల్ని చాకిరీ నుంచి  విముక్తి  చెయ్యడానికి గానీ చాకిరీకి సహకరించడానికా... ఇదెక్కడి వితండవాదం..  అంటే మనం నిర్మూలించాలను కొన్నిది బాలకార్మిక  వ్యవస్థను కాదు మన స్కూళ్ళను. (అవున్లెండి బాలకార్మిక వ్యవస్థ ఈ పేదరికం వున్నంతకాలం వుంటుందని మనం ముందుగానే సిద్ధాంతీకరించుకొన్నాంగా).

  ఐక్యరాజ్య  సమితి పిల్లల హక్కుల సమ్మేళనంలో సగర్వంగా సంతకం చేసిన ఘనులం మనం. ఎంతకైనా తగుదుం మరి...

  ఇక నిర్భంధ విద్యను గురించి మనమేమంటున్నాం.?

  నిర్భంధంగా పిల్లలకి చదువు చెప్పించడమంటే పేదల్ని హింసించడమేనని మనం ఏళ్ళ తరబడి ఆత్మవంచన చేసుకొన్నాం. ఇలా హింసించబడే పిల్లలెవరు.... ఇప్పటిదాకా మనం ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపితే ఆకలి మంటలతో అలమటించి పోతారని సానుభూతి వర్షం కురిపించామో వారు.

  ఈ పిల్లలందరికీ చదువు చెప్పించడానికి ప్రభుత్వానికి ఆర్ధికస్థోమత ఎక్కడ వుంది అని కూడా మనం వాపోతున్నాం. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చాలన్నా అంశం పై చట్టసభల్లో జరిగే ఏ చర్యల్ని చూసినా ప్రభుత్వం  దాన్ని భరించలేదనే వాదనే మనకు కన్పిస్తుంది. ఈ సాకు మరీ విచిత్రమైంది.

  మనం ఇంత ఖర్చు పెట్టలేము గాబట్టి నిర్భంధ విద్యను చట్టం చెయ్యలేమంటే దీని అర్థం ఏమిటి... ప్రజల నుంచి విద్య కోసం డిమాండు వుందనీ దాన్ని మనం తీర్చే స్థితిలో లేమనేగదా... ఇప్పటిదాకా మనం తల్లిదండ్రుల్ని హింసించడం న్యాయం గాదన్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని బాధపెట్టడం న్యాయం కాదంటున్నామా... అసలు కిటుకు ఇక్కడుందా...

  ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరం పిల్లలందరూ చదువుకోవాలని ఢంకా భజాయించి  చెపుతున్నాం. అయితే నిర్బంధవిద్యను మాత్రం మనమెవ్వరం ఒప్పుకోం. అంటే దీనర్థమేమిటి? మనకు పిల్లలందరూ చదువుకోవాలనే కోరికైతే కావల్సినంత వుంది. ఆ బాధ్యతను నెత్తికెత్తుకోడానికి మాత్రమెవ్వరం సిద్ధపడం... అంతేగదూ...

  అంటే దీనర్థం బాలకార్మిక వ్యవస్థా, చదువులూ - పేదరికమూ ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధంలేనివని కాదు. సంబంధం ఖచ్చితంగా వుంది. అయితే ఇంతకాలం మనం నమ్ముతున్న సంప్రదాయ అర్థంలో మాత్రం కాదు.

  పేదలు తమక్కావల్సింది పొందే అవకాశం మన సమాజంలో అంతంతమాత్రంగా వుందనడానికి మన చదువులు మరో ఉదాహరణ పేదలు ఏ మాత్రం ఉపయోగించుకొనే విధంగా మన వ్యవస్థ లేదనడానికి ఇంకో నిదర్శనం. మన చదువులు పనికిమాలినవనీ, అవి పేదలకేమాత్రం ఉపయోగపడవనీ, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమయ్యే పని కాదని మనం చేసే గుడ్డి వాదనల్ని బలపరచడానికి  మాత్రం మన వ్యవస్థ చక్కగా ఉపయోగపడుతుంది. పేదలు తమ హక్కును ఇలా కోల్పోతున్నారు. నిజానికిది పేదరికం సమస్య గాదు. పేదల సమస్య.

  మరిప్పుడు మనమేం చెయ్యాలి.

  మొట్టమొదట మనం ఎంత లోతుగా కూరుకుపొయ్యామో గుర్తించాలి. ఇంతమంది బాల కార్మికులతో, ఇంతటి నిరక్షరాస్యతతో ఏ దేశమూ చెప్పుకోదగ్గ ఏ విజయమూ ఇప్పటికీ సాధించిన దాఖలాలు లేవని మనం గుర్తించాలి. మనం చేపట్టిన ప్రతి కార్యక్రమం (జన్మ భూమి తో సహా) ఇంత తక్కువ ఫలితాలివ్వడానికి  నిరక్షరాస్యతే మూలకారణమని మనం ఒప్పు కోవాలి.

  పారిశ్రామికంగా మనం ప్రపంచంలోనే మూడవ పెద్దశక్తిగా ఎదిగాం. కానీ నిరక్షరాస్యతలో, బాలకార్మికల్లో మనం ఎంత హీనస్థితిలో వున్నామో కూడా గుర్తించాలి.

  మన దేశంలోని కొన్ని ప్రాంతాలు ప్రపంచంలోని అతి నికృష్ట ప్రాంతాలతో పోల్చితే మరింత నికృష్టంగా వున్నాయని మనం మనసారా అంగీకరించాలి. రూవాండా, బురుండి, లాంటి సబ్ సహారా దేశాలు సైతం మనదేశపు కొన్ని ప్రాంతాలతో పోలిస్తే మెరుగ్గా వున్నాయని మనం గుర్తించాలి.

  మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే.

  నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ ఒకే నాణేనికి బొమ్మా బొరుసులు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించకుండా అందరికీ విద్యను ఎన్నటికీ అందించజాలం. మన గ్రామీణ పాఠశాలలో ఒక బిడ్డ బడిలో చేరిందంటే దానర్థం ఒక బిడ్డ బండచాకిరీ  నుంచి బయటపడ్డమేనని మనం గుర్తించాలి. పిల్లలందరూ బడిలో వుండాలని మనం చెపితే సరిపోదు.   ఏ బిడ్డా చాకిరీ చెయ్యకూడదని మనం చెప్పాలి. ఇది మరింత బలంగా, మరింత విప్లవాత్మకంగా, మరింత అర్థవంతంగా వుంటుంది.

  పిల్లలందరికీ చదువు చెప్పించాలని కోరుతున్నామంటే మొదట  ఏ బిడ్డా ఇక పని చెయ్యగూడదన్న నిబంధనని సమాజం విధించుకోవాలి. దీన్ని వీలున్నన్ని  పద్ధతులతో అమలు జరపాలి. ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఈ విధానాన్ని అంగీకరించాలి. ( దీనికోసం జన్మ భూమిని వాడుకోవచ్చు. 5-14 సంవత్సరాల పిల్లలందరూ బడిలో చదువుకొంటున్నారని ఏ గ్రామమైనా చెప్పుకోగల్గితే అదొక గొప్ప విజయంగా గుర్తించవచ్చు.)

  అలాగే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి పిల్లలందరికీ చదువు చెప్పించే కార్యక్రమం 5-14 సంవత్సరాల పిల్లలందరికీ ఒకేసారి చేపట్టేదిగా వుండాలి. అంటే 5-14 సంవత్సరాల పిల్లలందరినీ ఒకే మొత్తంగా చూడాలి. ప్రమాదకర  శ్రమ చేసేవారు, కట్టు బానిసలు, వీధిపిల్లలు ఇలా వాళ్ళని ముక్కలు చెయ్యడం సరిగాదు. బాలకార్మికుల్లో 85 శాతం వ్యవసాయ పనుల్లో వున్నారని మనం మరిచిపోకూడదు.

  వయస్సు మీరిన పిల్లలు మనబడిలో చేరడానికి వస్తే వారికి ప్రత్యేక ఏర్పాటుండాలి. దాని కనుగుణంగా  మనబడి మారాలి.

  ప్రధానంగా మన ముందున్న సమస్యబడి బయట వున్న పిల్లల్ని బడిలోకి రప్పించడం. ఇప్పటికే బడిలో వున్న పిల్లల్ని, ఏం చేద్దామన్నది కాదు. విద్యలో నాణ్యత, పరీక్షల్లో మంచి ఫలితాలు ఇవన్నీ తర్వాతి అంశాలు. ఉపాధ్యాయుల పని విధానాన్ని వాళ్ళు సాధించిన పరీక్షా ఫలితాన్ని బట్టి కాదు వాళ్ళు తమ పాఠశాలల్లో ఎంత మంది పిల్లల్ని జారిపోనీకుండా నిలబెట్టారనేదాన్ని బట్టి బేరీజు వెయ్యాలి. అట్లని బడిలో పని మానెయ్యడానికిదొక సాకు కాకూడదు. వాస్తవానికి పరీక్షల్లో పాస్ చేయించడం కన్నా పిల్లలందర్నీ బడిలో కొనసాగేలా చెయ్యడం కష్టంతో కూడిన పని.

  అన్నిటికంటే ముఖ్యం  ఈ కార్యక్రమానికి కావల్సింది సమాజ సహకారం. ఇదే. దీని అసలైన బలం. మంచి అధికారం యంత్రాంగంతో ఇది జరుగుతుందనుకోవడం వట్టి భ్రమ. సమాజ భాగస్వామ్యం కోసం చేసే కృషి వల్ల ఫలితాలు కొంత ఆలస్యంగా కన్పించవచ్చు. అయినా ఇందులో మనం రాజీ పడకూడదు. మొత్తం కార్యక్రమంలో ప్రతి దశలోనూ సమాజాన్ని భాగస్వామిని చెయ్యాలి.

  పిల్లలందర్నీ ఒకేసారి చదివించడానికి ఎంత ఖర్చవుతుందన్న లెక్కలతో మనం సతమతం కావల్సిన పనిలేదు. ఇది మంచిదీ అత్యవసరమైనదీ అసలు నిధులు వాటికవే పరుగెత్తి వస్తాయి. అనియత విద్యతో సహా విద్యారంగం నుంచి, బాలకార్మిక ప్రాజెక్టులతో సహా కార్మిక శాఖ, నుంచి, మళ్ళీ బడికి తో సహా సాంఘీక సంక్షేమ శాఖ నుంచి, మహిళా శిశు సంక్షేమం నుంచి, కుటుంబ సంక్షేమం  నుంచి, బాలికాభివృద్ది నిధుల నుంచి మనం వనరుల్ని సమీకరించుకోవచ్చు.

  మనం పిల్లలందరికీ చదువును ఇంతగా కోరుతున్నాం కాబట్టి 80-90 శాతం పిల్లలు బడిలో వున్న ప్రాంతాల్లోనైనా  మొదట విద్యను నిర్భంధం చేద్దాం. ఈ అవకాశం  ప్రస్తుత చట్టాల్లో లేకుంటే తెద్దాం.

  ఎన్నైనా చెప్పండి. పిల్లలందరికీ చదువు, బాలకార్మిక వ్యవస్థా నిర్మూలన ఇవి మనం చెయ్యగలం. ఇది సాధ్యం అని మనం మొదట నమ్మాలి. ఇది అన్నిటికంటె మొదటి అవసరం.

  నిరక్షరాస్యత - భారతీయ వైరుధ్యం

  మనల్ని కలవరపెడుతూ, వదిలిపెట్టకుండా వెంటాడుతున్న అన్ని సమస్యలకు మూలం మన నిరక్షరాస్యతలో వుంది. అనేక రాష్ట్రాలు ఈ నిరక్షరాస్యతలో కొట్టుమిట్టాడుతున్నాయి. మన సగటు అక్షరాస్యత కేవలం 52 శాతం. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఈ విషయంలో మనం అగాధంలో వున్నా. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత వుందంటే దానిక్కారణం దేశంలోని కొన్ని రాష్ట్రాలు చాలా బాగా అక్షరాస్యత సాధించడం తప్ప మరేమీ కాదు. బీహారే కాదు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా సగటు అక్షరాస్యతకు కిందనే పడివున్నాయి. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాల కంటే పెద్దవి ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు.  అక్షరాస్యతలో ప్రపంచంలోని అతి నికృష్ట స్థితిలో వున్న ప్రాంతాలకేమీ తీసిపోవు. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే వున్నారన్న ఖ్యాతి మనకు దక్కింది. ఇక సాధారణ విద్య దగ్గరికొస్తే మనంత హీన స్థితిలో ఏ దేశమూ లేదు.

  మనలో చాలా మందికి ఇందులో వింత ఏమీ కన్పించదు. మనది పేదదేశం. పేదలు పాపం ఎలా చదువుకోగలరు.  వారి శక్తి ఎంత ఇదీ మన సమాధానం. అంటే మన. దృష్టిలో చదువొక విలాసం. దాన్ని మన పేదలు అందుకోలేరు. మరొవైపు నుంచి చూస్తే ఎందరో మంచి ఇంజనీర్లు అవుతున్నారు. కంప్యూటర్ నిపుణులవుతున్నారు. ఇతర సాంకేతిక నిపుణులవుతున్నారు. కీలకరంగాల్లో భారతీయులు ఏ దేశస్తుల కన్నా సిలికాన్ వ్యాలీలో భారతయులు ఆధిపత్యమే ఎక్కువ. అంతేకాదు. అమెరికాలో గానీ ఇతర దేశాల్లో గానీ గల చాలా కంప్యూటర్ పరిశ్రమల్ని భారతీయులే నిర్వహిస్తున్నారు.

  విదేశాల్లో సంపాదిస్తున్నవారు మన మధ్య తరగతి కుటుంబాల నిండా వున్నారన్నది ప్రస్తుత వాస్తవం.. ఇలా చూస్తే ఏమనిపిస్తుంది... మన విద్యారంగంలో ఏ లోపమూ లేదన్పిస్తుంది. చాలామందికి చదువుకొనే శక్తి లేదు. వీళ్ళు చదువలేక పోతున్నారు. తప్ప వ్యవస్థలో లోపమేముంది... అన్పిస్తుంది.

  కానీ కొంచెం పరిశీలించి చూడండి. మనకన్నా పేదదేశాలెన్నో మనకంటె ఎంతో అక్షరాస్యతను సాధించాయి, మనకు సమానం గాను ఇంకా తక్కువగాను మనకు సమానం గాను తక్కువగానూ జి.డి.పి. గల ఉగాండా, టాంజానియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపభ్లిక్, నైజీరియా లాంటి దేశాలు కూడా మన కంటేఅక్షరాస్యతలో ముందున్నాయి.  అక్షరాస్యతను వెనుకబడ్డ దేశాలతో పోల్చి మనల్ని  మనం చూసుకొంటే మన స్థితి ఎంత దౌర్భాగ్యంగా వుందో అర్థమవుతుంది. అక్షరాస్యత విషయంలో మనం పోటీపడుతున్నది కంప్యూటర్ సామ్రాట్టయిన అమెరికాతో కాదు గదా కనీసం అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, ఆసియా  దేశాలతో  కూడా కాదు మనం పోటీ పడుతున్నది రువాండా. బురుండి, నైగర్, చాద్, బుర్కినా ఫోసో, బెనిన్ లాంటి దేశాలతో మన విద్యావంతులు ఈ దేశాల పేర్లు ఎప్పుడైనా విన్నారా... వీటి గురించి వారికే మైనా తెలుసా.... కనీసం మ్యాప్ లో వాటిని గుర్తించనైనా గుర్తించగలరా.... ఇవి ఎలాంటి దేశాలు.... ఇవన్నీ ప్రపంచంలోనే అతి విస్సారమైన ఎందుకూ కొరగాని ప్రాంతాలు. ఆఫ్రికాలోని సబ్. సహారా ప్రాంతదేశాలు వీటిలో చాలా దేశాలు రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుండేవి. నిరంతరం అంతర్యుద్దాలతో సతమతమవుతుండేవి. శిథిలావస్థలో గల ఆర్థిక దుస్థితి వీటిది. ఇక కరువుకాటకాలంటారా వీటిని వెన్నంటే వుంటాయి. ఇలా చెపుతున్నామంటే ఈ దేశ ప్రజల్ని కించపరచడానికిక్కాదు. ఈ విషయ పరిస్థితుల్ని వాళ్ళు ఎలా వెనక్కు నెట్టగలిగారో తక్కువ చేసి చెప్పడమూ కాదు. వీళ్ళు అక్షరాస్యతలో వెనకబడి వుండటానికి ఒక న్యాయమైన కారణమైనా వుందని చెప్పడానికే కానీ మనకలాంటి సాకు ఏముంది.

  మనకు అద్భుతమైన ప్రజాస్వామ్య ముందని బోరలు విప్పుకొని చెప్పుకొంటున్నాం. అపురూపమైన సహజ వనరులున్నాయను కొంటున్నాం. అత్యున్నత సాంకేతిక నిపుణుల్ని తయారుచేసే విద్యావ్యవస్థ, ఆర్థికస్థితీ వున్నవనీ గర్విస్తున్నాం. ఆహారం లాంటి అత్యవసర రంగాల్లో మనం స్వయంసమృద్ధి సాధించామని కూడా ఆర్భాటంగా ప్రకటించుకొంటున్నాం. మరి మళ్ళీ మనం వెనుకటి ప్రశ్న వేసుకొంటే అక్షరాస్యతలో మాత్రం మనం ఇంత వెనుకబడి ఎందుకున్నట్టు.. దాన్ని మాత్రం మనం ఎందుకు సాధించలేకపోయినట్టు.

  మన విద్యావేత్తలు దీన్ని పరిపరివిధాలా విశ్లేషించారు. కొందరు పేదరికాన్ని తప్పు పట్టారు. మరికొందరు విద్యావ్యవస్థ సరిగా లేదన్నారు. ఇంకొందరు విద్యారంగానికి తగినన్ని నిధుల కేటాయింపు లేదంటున్నారు. మరి కేరళ, మిజోరం, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అంత ప్రగతిని ఎలా సాధించాయి అంటే వాటిక్కారణాల్ని బోలెడు వెతికి చెప్పుతున్నారు.

  ఈ విశ్లేషణలన్నిటినీ పరిశీలిస్తే మన కొకటి మాత్రం అంతర్లీనంగా కన్పిస్తుంది. విస్తారమైన ప్రజానీకానికి విద్య, అక్షరాస్యత అందక పోవడాన్ని మనం మౌనంగా అంగీకరిస్తున్నాం. మన సమాజంలోని కొన్ని  వర్గాలకు ఈ చదువు సరిపడదు అని మనకు అంతర్గత  నమ్మకం వుంది. మన సమూజమూ, మన విద్యావ్యవస్థా కూడా ఈ నమ్మకాన్ని దట్టించుకొని వున్నాయి. అందువల్లనే మనలో చాలామంది ఒక వ్యవసాయ కార్మికుడికి, బాలకార్మికుడికి చదువుతో ఏం పని వుందని ప్రశ్నిస్తుండటం  మనం చూస్తూన్నాం. ఈ చదువు వల్ల వాళ్ళకేమైనా ఉద్యోగాలొస్తాయా.. ఆదాయాలు పెరుగుతాయా.. ఏం వొరగబెడతాయీ చదువులు వాళ్ళకి అనే సవాళ్ళు వీరి నుంచి ఎదురవుతుండటం చూస్తున్నాం. ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానం లేదుగాబట్టి ఈ చదువులు వీళ్ళకక్కరకు రావండీ. అనే అంతరార్థమే మిగులుతుంది.

  అంటే దీనికర్థం ఏమిటి... వాళ్ళకీ చదువు అనవసరం. దానివల్ల వాళ్ళకి వొరిగే దేమీ వుండదు. అసలు వాళ్ళ పరిస్థితులకు చదువు సరిపడదు. అసలు వాళ్ళు చదువు ల్లేకున్నా ఎంతో రాణించగలరు. బతకగలరు.

  ఇలాంటి ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది. దీనివల్ల ఇంత విస్తృత జనభాహుళ్యానికి   విద్య లేకపోవడం మనకే మాత్రం ఆందోళన కల్గించే అంశమే కాకుండాపోతుంది. ఈ విద్యాగంధం లేనివాళ్ళంతో  అసలు విద్య అవసరం లేనివాళ్ళు. ఈ విద్య తమకు విద్య అవసరం లేనివాళ్ళు. ఈ విద్య తమకు పనికి రాదని తీర్మానించుకొన్న వాళ్ళు. అన్న భావన లోకి మనం వెళ్ళిపొయ్యామన్నమాట. దీనివల్ల ఏం జరిగింది. ఏం జరిగిందంటే మనం నిరక్షరాస్యతా సమస్యను పరిష్కరించడానికి పట్టుదలతో కూడిన గట్టి ప్రయత్నానికి పూనుకోనే లేదు.

  వాస్తవానికి ఈ విచిత్రధోరణి మనకు కొత్తేమీ కాదు. తరాల తరబడి వున్నదే. మన శ్రామికుల పట్ల, ప్రత్యేకించి గ్రామీణ శ్రామికుల పట్ల ధోరణి దాదాపు వ్యవస్థీకృతమై పోయింది. మనది కులం మీద ఆధారపడ్డ వికృత సమాజ వ్యవస్థ. కొన్ని వర్గాలు ఎప్పటికీ  చాకిరీ మాత్రమే చేస్తుండాలి. కొందరు ప్రత్యేకించి వ్యవసాయరంగ శ్రామికులు ఆ వృత్తులకే పరిమితం కావాలి. వాళ్ళకి చదువులు శుద్ద. దండగ అనే పరిస్థితిని, ధోరణిని శతాబ్దాల తరబడి మన సామాజిక వ్యవస్థ పెంచి పోషించింది. విద్యారంగంలోనూ,  అక్షరాస్యతలోనూ మన ఈ దుస్థితికి కారణం ఈ ధోరణీ, ఈ బావజాలం, ఇలా మనం మౌనంగా  సహించినట్టుగా సమాధానపడ్డం.

  తన సమాజంలోని ఒక వర్గానికి విద్య అవసరం లేదని తీర్మానించుకొన్న ఏ దేశమూ నిరక్షరాస్యతను నిర్మూలించలేదు. మనం చదువు అనవసరం అని దూరంగా నెట్టిన వర్గం నిజానికి చాలా దేశాల జనాభాల కంటె ఎంతో పెద్దది. అందువల్ల భారతదేశంలోనూ అందరికీ విద్య అందాలంటే ముందు మనం ఈ ధోరణి నుంచి బయటపడాలి. ఇంతకాలం ఏ వర్గాలకు  విద్య అనవసరమని మనం నమ్ముతున్నామో వాళ్ళకు విద్య అత్యవసరమని మనం ముందుగా అంగీకరించాలి. మిగిలినన్నీ తర్వాత. ముందు కావల్సింది ఇది.

  నాన్ డిటెక్షన్ విధానాన్ని అర్థం చేసుకొందాం

  ఈ మధ్య కాలంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులతో కొన్ని సమావేశాల్లో వివిధ అంశాలపైన నేను చర్చిస్తున్నాము. ఈ సమావేశాల్లో ఒకటి రెండు అంశాలు ప్రముఖంగా నా దృష్టికి వచ్చాయి. వాటికి సంబంధించి ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను.

  అన్నింటికన్నా ముఖ్యంగా పట్టించుకోవాల్సిన అంశం కొత్త ప్రమోషన్ విధానం. విద్యార్థి సాధించిన స్థాయిలో నిమిత్తం లేకుండా ప్రమోషన్ ఇవ్వవలసి రావడం వల్ల ప్రస్తుతం అంతంత మాత్రమే ఉన్న విద్యా ప్రమాణాలు మరింత దిగజారుతాయేమోనన్న ఆందోళన కొందరిలో కన్పిస్తోంది. ఈ సమస్యకు సంబంధించి సూటిగా కొందరు అడగాలనుకొని అడగని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేముందు  అసలు ఈ  డిటెక్షన్ విధానం ఎలా, ఎప్పుడు అమల్లోకి వచ్చిందో వివరించాల్సిన అవసరం ఉంది.

  ఒక తరగతి నుండి పై  తరగతికి నిలుపుదల లేకుండా ప్రమోషన్ ఇవ్వాలనేది కొత్త విధానమేమీ కాదు. దాదాపు 30 సంవత్సారాల క్రితం 1972 లో అమలులోకి వచ్చిన నియమం. ఇది ఇన్నేళ్ళపాటు అమలులో ఉన్న ఈ విధానంలో ప్రస్తుతం కొన్ని స్పల్పమైన  మార్పులు మాత్రమే చోటు చేసుకొన్నాయి. అంతే .... ఈ స్వల్పమైన మార్పులకు కూడా ఉన్న కొద్దిపాటి కారణాలలో మొదటిది నిరర్థకమైన వ్యయాన్ని తగ్గించడం. నిరర్థకమైన ఖర్చులంటే ఏమిటి ....  మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకొంటే గత జనాభా లెక్కల ప్రకారం 5-9 సంవత్సరాల మధ్య వయస్సులోని (ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య అనుకోవచ్చు) పిల్లల సంఖ్య సుమారు 70 లక్షలు. కాని అన్ని పాఠశాలల్లోనూ 1-5 తరగతుల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 90 లక్షలు వస్తోంది. జనాభా లెక్కల్లోలేని, అదనంగా కన్పిస్తున్న ఈ 20 లక్షల మంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు... వెంటనే మనకు అర్థమయ్యేదేమిటంటే ఈ 20 లక్షల మంది వివిధ తరగతుల్లో ప్రమోషన్ పొందనివారు. అదనంగా ఉండిపోయిన ఈ 20 లక్షలమందికి 1:40 నిష్పత్తిలో 50 వేల మంది ఉపాధ్యాయులు కావాలి. 60 లక్షల కిలోల బియ్యం కావాలి. పాఠ్య పుస్తకాలు, మిగిలిన అవసరాలు తీర్చాలి. ఇదే మనం మాట్లాడుతున్న నిరర్థక వ్యయం. అవసరంలేని ఈ ఖర్చులు తగ్గించాలంటే విద్యార్థులకు ప్రమోషన్ ఇవ్వకుండా నిలుపుదల చేసే విధానానికి వీలైనంత వరకు స్వస్తి పలకాలి.

  మనం విద్యార్థికి ప్రమోషన్ ఇవ్వకుండా అదే తరగతిలో నిలుపుదల చేయడానికి చెప్పే సులభమైన కారణం ఆ విద్యార్థికి పై తరగతిలో చేరడానికి తగినన్ని విద్యా ప్రమాణాలు లేవనడం. ఈ మాటతో ఉపాధ్యాయులు తమమీద బాధ్యతను విద్యార్థుల మీదికి నెట్టి వేస్తున్నారు. నిజానికి ఉపాధ్యాయుడు తను చేయవలసిన కృషి, చేయవలసిన పద్ధతిలో చేసి ఉంటే ప్రాథమిక స్థాయిలో పిల్లలను తగినంత విద్యా ప్రమాణాలు లేవనే సాకుతో ఫెయిల్ చేసే అవకాశం ఏర్పడదు. మనకు మనం  తరచి చూసుకొంటే ఇటువంటి సందర్భాలలో ఫెయిల్ అవుతున్నది. విద్యార్థులు కాదు. మన విద్యా విధానం. ఈ వాస్తవాన్ని  మనం అంగీకరించక తప్పదు.

  విద్యా సంవత్సరం చివరలో మనం పెట్టే పరీక్షల్లో ఒక విద్యార్థి విద్యా ప్రమాణాలు సాధించలేదనే కారణంతో మనం పై తరగతికి పంపకుండా నిలుపుదల చేయడం న్యాయమే అనుకుంటే అదేపని మనం పరీక్ష పెట్టిన ప్రతి మారూ ఎందుకు చేయం... ఉదాహరణకు పిల్లలకు మనం త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తాం. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థిని ఇంకో మూడునెలల పాటు ఈ పాఠాలే చదువు అని అనం. ఎందుకు అనడం లేదు... ఎందుకంటే ఈ మూడునెలల పాటు పరీక్షలు  పెట్టటంలో మన ఉద్దేశ్యం విద్యార్ధి  ఏ అంశంలో బలంగా ఉన్నాడా..... ఎక్కడ బలహీనంగా ఉన్నాడు. అని తెలుసుకోవడం మాత్రమే. ఒక అబ్బాయి లెక్కల్లో తక్కువ  మార్కులు  తెచ్చుకొంటే తరువాత వచ్చే మూడునెలల్లో అతని పట్ల ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని మనకు తెలుస్తుంది. వార్షిక పరీక్షలు కూడా అంతేకదా. త్రైమాసిక పరీక్షలపట్ల మనకు ఎటువంటి దృష్టి ఉందో సంవత్సరాంతపు  పరీక్షల పట్ల కూడా అదే దృష్టిని చూపెడితే నాన్  డిటెన్షన్ విధానం నూటికి నూరుపాళ్ళు అర్థవంతంగానే కనబడుతుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం విద్యార్థిస్థాయికి అత్యంత ప్రాధాన్యత  ఇచ్చి వీణ్ణి పాస్ చేయలా  ఫెయిల్ చేయాలా అనే తర్జనభర్జనలు పడ కుండా వార్షిక పరీక్షలను త్రైమాసిక పరీక్షల్లాగానే విద్యార్థి ఏ సబ్జక్ట్ లో ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడానికి మాత్రేమ ఉపయోగించుకొంటే ఒకటి నుండి ఐదువరకు అన్నీ ఒకే తరగతిలాగా, విద్యార్థి  దాటవలసిన ఒక స్థాయిలాగా మనకు కనబడుతుంది. ఒక్కో తరగతికి ఒక్కో సంవత్సరం అని లెక్కలు కట్టుకొంటూ పోయే మన దృష్టిమారాలి. సంవత్సరానికి కేలండర్ లో ఉండే ప్రాధాన్యత ఇక్కడ మనం  ఇవ్వకూడదు.

  ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు నేర్చుకొనే స్థాయిలలో విపరీతమైన తేడాలు ఉండడానికి  కారణం వారు ఎక్కడనుండి, ఎటువంటి వాతావరణం నుండి వచ్చారు.  అనేదానిపైన ఆధారపడి ఉంటుంది. వారి మానసిక నైపుణ్యాలకు వారు నేర్చుకోవడానికి ఒక పొంతన ఉండదు.  కొందరు తొందరగా నేర్చుకొంటారు. కొందరు వెనుకబడతారు. ప్రాథమికస్థాయి దాటేటప్పటికి మానసిక  నైపుణ్యాలు, నేర్చుకొనే స్థాయిలు రెండూ ఒక పద్ధతిలో ఉంటాయి. మన నూతన  నాన్  డిటెక్షన్  విధానం  ఈ సున్నితమైన విషయాలను గుర్తించడం వల్లనే అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో విద్యా విషయకంగా ముందున్న అన్ని దేశాలు  ఇదే నాన్ డిటెన్షన్  విధానాన్ని అనుసరిస్తున్నాయి.  ఈ విధానాన్ని బలపరచే మరో కీలక మైన  అంశం ఫెయిలైన విద్యార్థి  ప్రమోషన్ పొందిన విద్యార్ధికన్నా డ్రాపౌట్ కావడానికి అవకాశం ఎక్కువ. ఈ సత్యానికి ఎన్నో నిరూపణలు ఉన్నాయి. సార్వత్రిక ప్రాథమిక విద్యను  సాధించే దిశలో ప్రయాణం చేస్తున్న మనం విద్యార్థిని అదే తరగతిలో నిలుపుదల చేసే పద్ధతికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

  మీరు సూటిగా అడగాలనుకొనే కొన్ని ప్రశ్నలు - వాటికి సమాధానాలు

  నాన్ డిటెన్షన్ విధానంతో విద్యా ప్రమాణాలు పడిపోవా?

  ఈ ప్రశ్నను మనం మరో రూపంలో చూడాలి. దాదాపు అన్ని  జిల్లాల్లోనూ  జరిపిన కోహార్ట్ విశ్లేషణ ప్రకారం ఐదు సంవత్సరాల క్రితం ఒకటవ తరగతిలో  100 మంది  విద్యార్థులు ఉంటే ప్రస్తుతం ఐదవ తరగతిలో 65 మంది కూడా ఉండటం లేదు. నాన్ డిటెన్షన్ విధానం మనకున్నా దానిని మనం సమర్థవంతంగా అమలుపరచడం లేదనే  విషయం  దీంతో మనకర్థమవుతోంది. మనం ఇన్నేళ్ళుగా అనుసరిస్తున్న మన విధానం విద్యా ప్రమాణాలు మెరుగుపడడానికి దోహదం  చేసిందా... మీ ప్రశ్నకు మీరే సమధానం  వెదుక్కోండి.

  ఒకటవ తరగతిలో 50 శాతం మందికి పైగా పిల్లలు డిటెక్షన్ కు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. అంతమందిని ఒకటవ తరగతిలోనే ఆపడానికి మనం ఆశించే గొప్ప విద్యా ప్రమాణాలు ఏమిటి... ఒకటవ తరగతి బోధనలో మనం ప్రత్యేక దృష్టిని ఎన్నడైనా  సాధించామా... నూతనమైన బోధనా ప్రక్రియలను ఎన్నడైనా  ఆచరించామా... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన  స్థితిలో  మనం ఉన్నామా... సాధారణంగా ప్రతి ఒక్కరూ తేల్చి చెప్పేది ఏమిటంటే ఒకటవ తరగతిలో ఎక్కడా బోధనే జరగడం లేదని. మన విధానంలోని లోపాలను పక్కన పెట్టి విద్యార్థులను డిటెక్షన్ ద్వారా శిక్షించడం న్యాయంకాదు.

  డిటెక్షన్ ద్వారా విద్యా ప్రమాణాలు ఎన్నటికీ మెరుగుపడవు. అలా జరిగిన సందర్భాలు ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా లేవు. బోధనా నైపుణ్యాలు పెరిగినప్పుడే, అవసరమైన, నూతనమైన బోధనా ప్రక్రియలను అవలంభించినప్పుడే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. విద్యార్థి స్థాయిని నిరంతరం అంచనా  వేస్తూ అతని అవసరాలను తీర్చే దిశలో మన బోధన సాగిస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.

  రెండవ తరగతికి తగిన వయస్సు లేకపోవడం వల్ల ఒకటవ  తరగతిలో ఎక్కువ మంది పిల్లలను డిటైన్ చేస్తున్నారు. తగిన వయస్సు లేనప్పుడు వారికి రెండవ తరగతికి ప్రమోషన్ ఎలా ఇవ్వాలి ?

  మూడేళ్ళో నాలుగేళ్ళో ఉన్న పిల్లలను రెండవ తరగతిలో తీసుకెళ్ళి కూర్చోబెట్ట మని మూర్ఖంగా మన విద్యావిధానం చెప్పడం లేదు. ఒకటవ తరగతిలో తక్కువ వయస్సు పిల్లలు లేకపోతే రెండవ తరగతిలో ఆ సమస్య ఎందుకు వస్తుంది... కాబట్టి ఇక్కడ సమస్యకాని  సమస్య మన ముందుకు రావడానికి కారణం నాన్ డిటెక్షన్ విధానం కాదు. సమస్యను సృష్టించింది మనమే. తల్లిదండ్రుల ఒత్తిడి అనే కారణంతో అంగన్ వాడి సెంటర్ లోనో, ఇ.సి.ఇ. సెంటర్ లోనో ఉండాల్సిన  తక్కువ వయస్సు పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చుకొంటున్నాం.

  అటెన్ డెన్స్ రిజిస్టర్ లో పిల్లల పేర్లు రాయిస్తే 3 కిలోల బియ్యం వస్తుంది కదా అని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు వస్తారని అంటారు. ఇది నిజమైతే ఈ ఒత్తిడికి ఉపాధ్యాయుడు లొంగకూడదు. కొన్ని సందర్బాలలో చిన్నపిల్లలను చేర్చుకోకపోతే వారి సంరక్షణ  అనే  మిషతో పెద్దపిల్లలు బడికి వెళ్ళకుండా ఆగిపోతారు. పర్యవసానం డ్రాపౌట్స్ ఎక్కువ  కావడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే తక్కువ వయస్సు పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్  ఏర్పాటుచేసి వారి పేర్లు విడిగా ఒకటవ తరగతి విద్యార్థుల లిస్టుతో సంబంధం లేకుండా నమోదు చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం వల్ల అవసరం ఉన్న వారికి బియ్యం ఇవ్వవచ్చు. సంవత్సరాంతంలో ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఈ జాబితాను పక్కన పెట్టవచ్చు. ఇచ్చిన ఆదేశాలను సరిగా అనుసరించకపోవడం వల్లనే ఇదొక సమస్యగా మన ముందుకు వస్తోంది. ఇప్పటికైనా రెండవ తరగతిలో తక్కువ జాబితాలోకి మార్చుకోవచ్చు. ఈ మొత్తం విధానమంతా ఆశించేది  ఏ తరగతిలోనైనా  ఆ తరగతికి తగిన వయస్సు పిల్లలు మాత్రమే నమోదు కావడం.

  చాల జిల్లాల్లో ఒక పాఠశాలలో ఉన్న మొత్తం పిల్లల్లో సగం మంది ఒకటవ తరగతి లోనే ఉంటారు. అంటే ఒకటవ తరగతి పిల్లల సంఖ్య రెండు, మూడు, నాలుగు, ఐదు తరగతుల మొత్తం సంఖ్య ఒకటవుతుంది. ఇది ఆందోళన కలిగించే పరిస్థితి. తప్పుదారి పట్టిందే లెక్కలు  చూపడం  వలన ఈ గందరగోళ స్థితి ఏర్పడుతోంది.

  జనవరిలోనో, ఫిబ్రవరిలోనో ఐదేళ్లు నిండే పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చుకొంటే& వాళ్ళ పరిస్థితి ఏమిటి...

  ప్రస్తుతం అమలులో ఉన్న ఆదేశాల ప్రకారం ఏ విద్యార్థి అయినా  తను తరగతిలో చేరినప్పటి  నుండి విద్యా సంవత్సరం పూర్తి అయ్యేలోపల గడిచే పనిదినాల్లో 60 శాతం హాజరైతే  ప్రమోషన్ కు అర్హుడు. ఒకటవ తరగతిలో కేవలం పదిహైను రోజులు మాత్రమే హాజరైన విద్యార్థులు కూడా ప్రమోషన్ కు అర్హులవుతున్నారు.

  ఇది కూడా మనం కష్టపడి కల్పించుకొన్న సమస్య. ఇంతకుమునుపు చెప్పినట్లు తరగతికి తగిన వయస్సుకన్నా తక్కువ వయస్సు పిల్లలను చేర్చుకోవడం మన విధానం కాదు. విద్యార్థికి తరగతికి తగిన వయస్సు ఉండాలి. ఇక్కడ సమస్య ముందుకు రావడానికి కారణం ఆదేశాలను సరిగా అర్థం చేసుకోకపోవడమే.  విద్యా సంవత్సరంలో ఆగష్టు 31 వ తేది లోపల ఐదు సంవత్సరాలు పూర్తి కాని విద్యార్థి  తక్కువ వయస్సు జాబితాలోకి వస్తాడు. అలాంటివారి కోసం ఒక ప్రత్యేకమైన సెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తే వారికి ప్రమోషన్ ఇవ్వాలా వద్దా అనే సమస్య రాదు. పైన వివరించిన అంశాలను స్పష్టంగా అర్థం చేసుకొంటే మనం చేసిన పొరపాట్లు ఏమిటో తెలిస్తాయి.  ఇప్పటికిప్పుడైనా  వాటిని సవరించుకొనే ప్రయత్నాలు చేయవచ్చు.

  బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన - చర్చించాల్సిన అంశాలు

 • పిల్లలు కార్మికులుగా వుంటే ?
 • పెద్దలకు కూలీ దొరకడం కష్టం.
  పిల్లలు వారి బాల్యపు హక్కును పోగొట్టుకుంటారు.
  కూలీ డిమాండు తగ్గిపోతుంది.
  దురలవాట్లకు దగ్గరవ్వడం.

 • బాలలు వారి హక్కులను అనుభవించక పోతే ?
 • శారీరక ఎదుగుదల తగ్గిపోతుంది.
  బాల్యపు స్వేచ్ఛను కోల్పోతారు.
  అందరితో సమానంగా ఉండలేరు.

 • పిల్లలు రోజూ సక్రమంగా బడికి హాజరు కాకపోతే ?
 • మానసిక ఎదుగుదల వుండదు.
  బాలకార్మికులుగా మారుతారు.
  జ్ఞానం (తెలివి) అభివృద్ధి జరగదు.
  తరగతి  ఉత్తీర్ణులు కాలేక పోవడం మరియు బాలకార్మికులుగా మారడం.

 • చిన్న పిల్లలకు బాల్యంలోనే పెళ్ళి చేస్తే ?
 • ప్రసవించే సమయంలో ఇబ్బందులు.
  పుట్టే శిశువులు బలహీనంగా, అంగవైకల్యంగా పుడతారు.
  అనారోగ్య కారణాలకు గురి అవుతారు.
  జీవించే జీవన ప్రమాణం (కాలం) తగ్గిపోతుంది.
  శిశుమరణాలు సంభవించడం జరుగుతుంది.
  శారీరక బాధకు గురి అవుతారు.

 • పాఠశాల వసతులు గురించి ఆలోచించక పోతే ?
 • ఒకే గదిలో అన్ని తరగతులు నిర్వహించడం.
  అందరూ బడికి రాకపోతే వసతులు రావడం కష్టం.
  పిల్లలపై ఉపాధ్యాయులకు శ్రద్ధ తగ్గిపోవడం.
  ఉత్తీర్ణతా శాతం తగ్గిపోవడం.
  పిల్లలు సక్రమంగా పాఠశాలకు హాజలు కాలేక పోవడం.
  ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా రావడానికి ఇష్టం లేకపోవడం.
  బోధన పద్ధతులు సక్రమంగా లేకపోవడం మరియు బోధించాలనే ఆలోచన తగ్గడం.

 • నష్టం ఎవరికి ?
 • ప్రభుత్వానికా !
  ఉపాధ్యాయులకా !
  విద్యాకమిటీలకా !
  తల్లిదండ్రులకా !
  అధికారులకా !
  పిల్లలకా !

 • మరి ఇంకెవరికీ నష్టం ?
 • ఇలాంటివి అన్నీ జరగకుండా అరికట్టాలంటే సమాజానికి మన పాత్ర ఎలా వుండాలి ?
  సమాజాన్ని బాగు చేయాలంటే యువత ముందు ఉండాలి.
  పెద్దలందరూ కలిసి వీరికి సహకారాన్ని అందించాలి.

  ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

  బాలకార్మిక వ్యవస్థ

  విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన తర్వాత బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ ఉండటానికి వీల్లేదు. ఆర్థిక కారణాల వల్ల ఏ బిడ్డా బడి వెలుపల ఉండరాదని విద్యా హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. మధ్యలో బడి మానేయకూడదు. అంటే ఏ రూపంలోనైనా బాల కార్మిక వ్యవస్థకు అవకాశం లేదు. అందుకే బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టాన్ని తక్షణం సవరించి 'నియంత్రణ అనే పదాన్ని తీసివేయాలి. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో ఇళ్లల్లో పనిచేసే బాలకార్మికుల సంఖ్య పెరుగుతోందని జాతీయ బాలల హక్కుల కమిషన్ జరిపిన తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

  అందుకే అన్ని రకాల బాలకార్మిక వ్యవస్థలు చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రమాదకర పరిస్థితుల్లో ఉండే బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తోంది. ఇతర రంగాల్లోని బాలకార్మిక వ్యవస్థనూ నియంత్రించాలని చెబుతోంది. కానీ, విద్యా హక్కు చట్టం వచ్చాక ఈ తేడాను చూపడానికి కూడా వీల్లేదు.

  అంచనాలు

  2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 25.2 కోట్ల మంది పిల్లలున్నారు. వీరిలో సుమారు 1.26 కోట్లమంది బాలకార్మికులు. అసంఘటిత రంగంలో బాల కార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఉదాహరణకు ఇళ్లలో పనిచేసే బాలలు. వాస్తవానికి అనేక సందర్భాల్లో బాలకార్మిక వ్యవస్థ ప్రభుత్వ లెక్కల్లోకి రాదని కూడా జాతీయ బాలల హక్కుల కమిషన్ పేర్కొంటోంది.

  యునిసెఫ్ ప్రకారం దాదాపు సగంమంది; ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడి మానేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55% షెడ్యూల్డ్ తెగల్లో 63% దాకా ఉందని అంచనా. బడి మానేసిన ప్రతి పిల్లవాడూ అనివార్యంగా బాలకార్మికుడిగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఫలితంగా బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. 2005 నాటికి జాతీయ బాలల కార్యాచరణలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ నిషేధంతోపాటు బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఈ లక్ష్య సాధనలో విఫలమయ్యాం. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అందమైన బాల్యాన్ని లేకుండా చేయడం అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన.

  విద్యాహక్కు చట్టం

  బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలన్నా లేదా బాల్యవివాహాలను పూర్తిగా నిషేధించాలన్నా ముందు జరగాల్సింది సార్వత్రిక ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడం. అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో మానేసిన వారిని తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారింది. విద్యా హక్కు చట్టం హామీ ఇచ్చినవిధంగా వీరందరికీ వాళ్ల వయసుకు తగిన తరగతిలో చేర్పించి విద్యనందించడమూ ఒక సవాలే. మధ్యలో బడిమానేయకుండా చూడటానికి ఎనిమిదో తరగతి వరకూ పిల్లలకు డిటెన్షన్ పద్ధతి ఉండకూడదని; వీరిని సమగ్ర, నిరంతర మూల్యాంకన పద్ధతి ద్వారా పరీక్షించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యమైన విద్యనందించడం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరమైన స్థాయిలో చదువు నేర్చుకుని, తర్వాతి తరగతిలోకి ప్రవేశించగలిగేలా చేయాల్సిన బాధ్యత పాఠశాలపై ఉంటుందనీ చట్టం పేర్కొంటోంది. బాలలు బాలకార్మికులుగా మారకుండా చేసేందుకు విద్కాహక్కు చట్టంలో అనేక ఇతర నిబంధనలూ ఉన్నాయి. ఉదాహరణకు ఒకపూట బడి ఉండకుండా ఏటా తప్పనిసరిగా బడి నడవాల్సిన రోజులను, రోజూ బడి నడపాల్సిన సమయాన్ని చట్టం నిర్దేశిస్తోంది. విద్యా సంవత్సరంలో ఏ సమయంలో వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. అవసరమైన అదనపు శిక్షణ ఇవ్వాలి. దండన లేని బోధన అందించాలి. బడిలో ఉండాల్సిన పిల్లలు అందులో చేరకపోవడానికి, మధ్యలో బడి మానేసి బయట ఉండటానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది. అవి: తల్లిదండ్రుల పేదరికం, సామాజిక వెనకబాటుతనం; పిల్లలకు అనుకూలంగా లేని బోధనాంశాలు, బోధనా ప్రణాళిక.

  చట్టపరమైన రక్షణ

  భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. వయసుకు తగని ఆర్థిక కార్యకలాపాలు, వృత్తుల్లో పని చేయకుండా భారత రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తోంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి భారత ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదటిది: బాల కార్మిక చట్టాల అమలు; రెండోది: బాలల సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, అమలు; మూడోది: బాల కార్మిక వ్యవస్థ అధికంగా ఉన్న ప్రదేశాలు, రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథకాలను అమలు చేయడం. 1986లో చేసిన బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులుండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు.

  ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఆయా రంగాల్లో బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. అవి: తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు. 2010లో సర్కస్‌లలో, ఏనుగుల సంరక్షణలో కూడా బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుమును విధించడానికి సెక్షన్ 14 వీలు కల్పిస్తోంది. దీంట్లో జైలుశిక్ష విధించడానికి నిబంధనలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి.

  2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 1.26 కోట్లమంది బాలబాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఉన్నారు. అంటే బాలకార్మికులుగా ఉన్నారు. వీరిలో 12 లక్షలమంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. చట్టం నిషేధించిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 2004-05లో జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం దేశంలో 89 లక్షల మంది బాలకార్మికులున్నారు. 2009-10లో జరిగిన జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో 49.84 లక్షలమంది 5 నుంచి 14 ఏళ్ల వయసున్న పని చేసే పిల్లలు ఉన్నట్లు అంచనా. బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టాన్ని పూర్తిగా సవరించి అన్నిరకాల బాలకార్మిక వ్యవస్థలను నిషేధించడానికి భారత ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో వివరించింది.

  బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం కింద 1997-98 నుంచి 2008-09 మధ్యకాలంలో దేశం మొత్తం మీద 3583327 తనిఖీలు నిర్వహించారు. వీటిలో 2.45 లక్షల ఉల్లంఘనలను గుర్తించి, 90932 విచారణలు జరిపారు. వీటిలో 24829 కేసుల్లో శిక్షలు విధించారు.

  జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు

  బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో అతిముఖ్యమైన పథకం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు (ఎన్‌సీఎల్పీ). దీన్ని భారత ప్రభుత్వం 1988లో మొదటగా బాలకార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో ప్రారంభించింది. పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 250 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం ఇది 266 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పని నుంచి విముక్తి కల్పించిన పిల్లలకు పునరావాసాన్ని అందించడం. అలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలల్లో చేరుస్తారు. వారికి బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యను అందిస్తారు.

  వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. వీరికి ఉపకారవేతనం, ఆరోగ్య, రక్షణ సదుపాయాలు కూడా లభిస్తాయి. ఇప్పటి వరకూ ఇలాంటి పదివేలకు పైగా ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారు. వీటిలో అయిదు లక్షల మంది పిల్లలు చేరారు. ప్రస్తుతం దేశంలో 8020 జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు ప్రత్యేక పాఠశాలలున్నాయి. వీటిలో 4 లక్షల మంది పిల్లలు చేరారు. ఈ ప్రాజెక్టు కింద 6.47 లక్షల మంది పిల్లలను ప్రత్యేక శిక్షణ అనంతరం సాధారణ పాఠశాలల్లో చేర్చారు. పదకొండో ప్రణాళికలో ఈ ప్రాజెక్టుకు రూ.625 కోట్లు కేటాయించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో ప్రాజెక్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలేవైనా పునరావాస ప్రాజెక్టులను నిర్వహిస్తే వాటికి అయ్యే ఖర్చులో 75 శాతం మేరకు కేంద్రం సమకూరుస్తుంది. తల్లిదండ్రుల సంరక్షణ లేని బాలకార్మికులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సమీకృత బాలల రక్షణ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు.

  కుటుంబాలపైనా శ్రద్ధ

  బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం కుటుంబాల పేదరికమని అనేక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల బాలకార్మికులను పని నుంచి విముక్తులను చేసి, వారికి పునరావాసం కల్పిస్తున్నారు. వారి కుటుంబాలకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద సహకారాన్ని అందించే చర్యలు చేపట్టారు. ఉదాహరణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కూడా ఇతోధికంగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ కార్మికసంఘం, అమెరికా ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ కూడా భారత ప్రభుత్వ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలకు సహకారాన్ని అందిస్తున్నాయి.

  బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన, దీర్ఘకాల కృషి అవసరం. చట్టాలు సమగ్రంగా ఉండేలా చూడాలి. ఈ చట్టాల అమలుకు అవసరమైన పటిష్ట యంత్రాంగం ఉండాలి.

  రాజకీయ చిత్తశుద్ధి లేనిదే బాలకార్మిక వ్యవస్థను తొలగించలేం. బాలకార్మిక చట్టంతోపాటు విద్యాహక్కు చట్టం లాంటి వాటినీ సమర్థంగా అమలు చేయాలి. దీంతోపాటు బాలల సమగ్ర అభివృద్ధికి, రక్షణకు కార్యాచరణ ప్రణాళికను రచించి అమలు చేయాలి. దీంట్లో భాగంగా బాలకార్మికుల తల్లిదండ్రులపై కూడా దృష్టి సారించాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించాలి.

  బాలల హక్కులు

  • ప్రతి సంవత్సరం నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం

  గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .

  • పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబరు 20 న ) బాలల హక్కుల పరిరక్షణ గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


  మంచీ చెడూ పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి? అనుకోవచ్చు! కానీ సమాజంలో బలహీనులూ, దోపిడీకి గురయ్యే వారిలో పిల్లలూ వున్నారు. పిల్లలను దోచుకునే పెద్దలున్న చోట చిన్నారులకు హక్కులుండడం తప్పనిసరి. ఈ కారణంచేతే ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కులకోసం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. చైల్డ్‌ రైట్స్‌ కన్వెన్షన్‌ (సిఆర్‌సి)గా పేర్కొనే ఈ ఒప్పందం గురించి అందులో పేర్కొన్న హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి నవంబర్‌ 20వ తేదీని బాలల హక్కుల దినోత్సవంగా నిర్ణయించింది. ఆ హక్కులేంటంటే ...-జీవించడం, అభివృద్ధి చెందడం -సముచితమైన జీవన ప్రమాణాలు, ఉత్తమ ఆరోగ్య ప్రమాణాలు, సమర్థవంతమైన ఆరోగ్య సేవలు -అంగవికలురైన పక్షంలో ప్రత్యేక సంరక్షణ -వ్యక్తి గౌరవానికి భంగం కలగకుండా తమ పనులు తామే చేసుకునేలా సమాజంలో వారు క్రియాశీలురుగా వుండేలా తీర్చిదిద్దడం -సాంఘిక భద్రత-అపహరణల నుంచి రక్షణ -చక్కటి వాతావరణంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు -ఉచిత ప్రాథమిక విద్య -పిల్లల వ్యక్తిత్వ, ప్రతిభ, మానసిక శారీరక సామర్థ్యం పూర్తిస్థాయిలో వికసించేటటువంటి చదువు -యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలవంటి అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి దూరమైనప్పుడు, చట్టంతో సంఘర్షణ చేయాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక రక్షణ హక్కు -బాల కార్మిక సమస్య, మత్తు పదార్థాల దుర్వినియోగం, లైంగిక దోపిడీ, పిల్లలను అమ్మడం, అపహరించడం, వ్యభిచారంలోకి దింపడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రత్యేక రక్షణ ....కోరే హక్కు పిల్లలకుంది.

  • బాలల హక్కులు చరిత్ర... తీర్మానాలు.


  బాలల హక్కుల ను గుర్తించడం 1924లో నానాజాతి సమితి మానవహక్కుల ప్రకటనతో ప్రారంభమైందని భావించవచ్చు. పిల్లల బానిసత్వానికి, బాలకార్మిక వ్యవస్థకు, పిల్లల వ్యభిచారానికి, విక్రయానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో పిలుపు ఇవ్వడం బాలల హక్కులకు నాందిగా నాడు పలువురు అభిప్రాయపడ్డారు. తదుపరి ఐక్యరాజ్యసమితి బాలలహక్కుల పై 1959లో ప్రకటన చేసింది. 1979వ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. 1989 నవంబరులో బాలల హక్కుల పరి రక్షణ పై సమావేశం నిర్వహించి ఆమోదించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం. 1990 సెప్టెంబరులో బాలల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్య సమితి ప్రపంచ సదస్సు నిర్వహించింది. 1992లో చైల్డ్‌ రైట్స్‌ కన్వెన్షన్‌ పై భారత్‌ కూడా సంతకం చేసింది. దీనిని సంక్షిప్తంగా ''సి.ఆర్‌.సి'' అంటారు.

  ప్రతిపాదనలు, హక్కులు
  మానవ జాతి చరిత్రలో సి.ఆర్‌.సి ఒక మైలు రాయి వంటిది. పిల్లలకు ఇవ్వాల్సిన గౌరవం, కల్సించాల్సిన రక్షణ, అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు అన్నీ ఇందులో ఉన్నాయి. సి.అర్‌.సి లో ఉన్న 54 నిబంధనలను నాలుగు రకాలుగా విభజించారు. తొలివర్గం ''సర్వైవల్‌ రైట్స్‌'' ఇవివారి ఉనికికి సంబంధించిన హక్కులు. రెండోరకం హక్కులు అభివృద్ధికి చెందిన ''డెవలప్‌మెంట్‌ రైట్స్‌'' మూడో రకం హక్కులు పరిరక్షణ అంటే ''ప్రోటెక్షన్‌ రైట్స్‌'' ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన ఈ హక్కుల పై 160 దేశాలు సంతకాలు చేశాయి. భారతదేశం 1992 డిసెంబరు 11న ఆమోదిస్తూ సంతకం చేసింది. మనదేశం ఆమోదించిన హక్కులు గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాము.
  బాలల హక్కులు
  18 సంవత్సరాలలోపు బాలందరికీ ఈ హక్కులు వర్తిస్థాయి. సమానత్వం, కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లను చూపరాదు. బాలల ప్రయోజనాలు బాలల హక్కుల కార్యా చరణను చేపట్టినప్పుడు వారి సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి. హక్కుల అమలుకై తీర్మానాలు, గుర్తించిన హక్కుల అమలుకి శాసన పరమైన, పాలనా పరమైన కార్యక్రమాలు చేపట్టాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి వుండటం, తల్లిదండ్రలతో కలిసి జీవించడం బాలల హక్కు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, వ్యభిచార వృత్తి లో దించడం, జీతాలకు పెట్టడం నేరం. బాలలు వారి అభిప్రాయాలను పాటలు, బొమ్మలు, ఆటలు, రచనల ద్వారా వ్యక్తం చేయవచ్చు. బాలలు తమకు నచ్చిన మతాన్ని కలిగివుండవచ్చు, తమ వృద్ధికై సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
  బాలలకు విజ్ఞానాన్ని అందిచడానికి ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఆబాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా,దౌర్జన్యం చేసినా, వేధించినా నేరం. బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్ధులుగా మారిన బాలలకు మానవతతో సాయం చేయాలి. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన వారి వృద్థికి, వారిలో ఆత్మ విశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
  బాలలు ఆరోగ్యంగా జీవించే హక్కు వుంది, సామాజిక భద్రత పోందే హక్కువుంది. ఉచిత నిర్బంధ విద్యను పొందడం బాలల హక్కు. బాలలకు విశ్రాంతిగా వుండే హక్కువుంది. ఆటలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే హక్కువుంది. ప్రమాదకరమైన పనులు గనుల్లో, పేలుడు పదార్ధాల తయారీలో, హోటళ్ళలో బాలల్ని పని చేయించరాదు. మాధక ద్రవ్యాల నుండి బాలలను దూరం చేయాలి. వారికి అందుబాటులో వుంచడం, వారి ద్వారా తెెప్పించు కోవడం నేరం.
  బాలల్ని నిర్భంధించరాదు.లైంగిక ధూషణ చేయరాదు. బాలల సంక్షేమానికై దోపిడి ఏ రూపంలో వున్నా ప్రభుత్వాలు నిషేధించాలి. 18 సంవత్సరాలలోపు వయస్సు బాలల్ని విడుదల చేయటానికి వీలులేని నేరాలకు ఉరి శిక్షగాని, యావజ్జీవ శిక్షగాని విధించరాదు. దేశంలో గాని, అంతర్జాతీయంగా గాని బాలలకు ఇంత కంటే మెరుగైన హక్కులను అందించే చట్టాలు ఉంటే ఆ హక్కులను పొందటానికీ బాలలకు హక్కు ఉంది. ఇవి బాలల హక్కులపై ఐక్య రాజ్యసమితి ఒడంబడిక యొక్క సంక్షిప్త రూపం.

  మన దేశంలో పిల్లల స్ధితిగతులు....
  దేశంలో పుట్టిన 12 మిలియన్ల బాలికల్లో 3 మిలియన్ల మంది తమ 15వ పుట్టిన రోజును, ఒకమిలియన్‌ మంది తమ మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే మరణిస్తున్నారు, లింగ విచక్షణ వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక చావుకి గురవుతుంది. 50% బాలబాలికలకు పోషకాహారం అందడం లేదు. బాలురలో 5 గురిలో ఒకరు, బాలికలలో ఇద్దరిలో ఒకరు పోషకాహారం పొందడం లేదు. ఇక 2 సం|| వయస్సు లోపు శిశువులలో 58% మందికి పూర్తిగా వాక్సి నేషన్‌ అందడం లేదు. 24% పిల్లలకి ఎలాంటి వాక్సినేషన్‌ ఇవ్వలేదు. దేశంలో 60% పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. దేశంలోని వ్యాపార లైంగిక వ్యక్తుల్లో 40% బాల బాలికలే. ''ఇంటర్‌ నేషనల్‌ సెంటర్‌ ఆన్‌ లేబర్‌'' నివేదిక ప్రకారం దేశంలో 25 మిలియన్లు నుంచి 30 మిలియన్ల వరకు బాల కార్మికులున్నారు. దేశంలో 50% బాలలు పాఠశాలలకే వెళ్ళడంలేదు. ఇలా చెప్పుకొంటూ పొతేే దేశంలో బాలల జీవితం కన్నీటిమయం.
  అందరూ స్పందించాలి :
  నేటి బాలలే రేపటి పౌరులు. నవభారత నిర్మాతలు. ఈ మాటలు వినడానికి వింపుగా వున్నాయి. కాని పైన వివరించిన స్థితిగతులు పరిశీలిస్తే రేపటి పౌరులకు మనం ఇస్తున్న ప్రోత్సాహం ఇదా? యని ఆలోచించక తప్పదు. ప్రపంచంలో మరే దేశంలో లేనంత పెద్ద సంఖ్యలో పిల్లలున్న దేశం మనదే. దేశంలో నేడు 18 సంవత్స రాలలోపు వున్న వారి సంఖ్య 45 కోట్లు. ఇటువంటి యవతరాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచి ఆరోగ్యకరమైన పౌరులుగా తీర్చి దిద్దాల్సిన భాధ్యత అందరిపై ఉన్నది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు సకాలంలో వాక్సినేషన్‌ ఇప్పించాలి. విద్యను అందించాలి. ప్రభుత్వం ఆర్యోగ్య, విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి. సమాజంలోని అందరూ బాలల సంక్షేమం తమ సంక్షేమంగా భావించి సంవత్సరంలో ఒక్కరోజు తమ సంపాదనను పిల్లల సంక్షేమానికి విరాళంగా ఇవ్వాలి. 'నేటి బాలలే రేపటి పౌరులు'' అనేది నినాదం కాకుండా విధానంగా మారితే దేశంలో బాలల జీవితం ఆనందదాయకం. మరి ఆరోజుకై అందరం స్పందిద్ధాం..... చేయూత నిద్ధాం....

  ఆధారము: ఈనాడు  © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
  English to Hindi Transliterate