హోమ్ / విద్య / బాలల హక్కులు / బాలల హక్కులపై ఉపాధ్యాయుల కరదీపిక
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాలల హక్కులపై ఉపాధ్యాయుల కరదీపిక

“నా వరకు చదువు నేర్పడంలోనే మానవాళికి ముక్తి అనిపిస్తోంది” అన్న జార్జి బెర్నార్డ్ షా మాటలు మీకు గుర్తుండే ఉండాలి. నాగరికులుగా భారతదేశంలో మనం ఉపాధ్యాయులను భగవంతుని తర్వాత అంతటి అత్యున్నత స్థానంలో నిలబెట్టాం. ఎందుకు ఉంచకూడదు?

“నా వరకు చదువు నేర్పడంలోనే మానవాళికి ముక్తి అనిపిస్తోంది” అన్న జార్జి బెర్నార్డ్ షా మాటలు మీకు గుర్తుండే ఉండాలి. నాగరికులుగా భారతదేశంలో మనం ఉపాధ్యాయులను భగవంతుని తర్వాత అంతటి అత్యున్నత స్థానంలో నిలబెట్టాం. ఎందుకు ఉంచకూడదు?

ఒక వ్యక్తి జీవితంలో గురువు కీలకమైన పాత్రను పోషిస్తారు. పసిపిల్లల మనసులో మంచి ఉపాధ్యాయులు ఒక ప్రముఖ, దైవం ఉండే స్థానాన్ని ఆక్రమిస్తారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు పసిపిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపడమేకాక ఆ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. మీకందరికీ తెలుసు, ప్రతీ సమాజంలోనూ పిల్లలు లైంగికపరమైన హింసలకు గురి అవుతున్నారు. మీ చుట్టూ పరికించి చూడండి. మీకే తెలుస్తుంది. చిన్న పిల్లలు కార్మిక వ్యవస్థలో మగ్గిపోయి, చదువుకు దూరంగా ఉంటున్నారు. వాళ్లలో ఎక్కువమంది వెట్టి చాకిరీ చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను కొట్టడం, పాఠశాల గదులలో ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం లేదా వారి కులాన్ని , మతాన్ని చూసి వారి మధ్య వివక్షత చూపడం, బాలికలను పుట్టనివ్వకపోవడం, లేదా జన్మించగానే ఆ పసికందులను చంపివేయడం, లేదా కుటుంబాలలో, సమాజంలో బాలికైనందువల్ల వివక్షతనెదుర్కోవడం, బాల్య వివాహాలు, మానభంగాలు, అక్రమ సంబంధాలు .......

ఔను, ఎంతోమంది బాలల జీవితాలలో జరుగుతున్నవి ఇవే. వారిలో కొందరు మీ పాఠశాల గదుల్లోనే ఉండవచ్చు.

ఒక ఉపాధ్యాయునిగా అలాంటి బాలబాలికలను చూసినపుడు , వారి గురించి విన్నపుడు మీరేం చేస్తారు?

మీరు.......

 • విధిని నిందిస్తారా ?
 • నేటి పెద్దవారు కూడా వారి బాల్యంలో పిల్లవానిగా అలాటి పరిస్థితులనెదిర్కొని ఉంటారు, కాబట్టి తప్పులేదు అంటారా?
 • అదో సంప్రదాయం, ఆచారం. అందువల్ల మనం ఏమీ చేయలేం అంటారా ?
 • దీనికంతా బీదరికమే కారణం అని బీదరికాన్ని నిందిస్తారా?
 • అవినీతిని నిందిస్తారా?
 • దీనికంతా వారి కుటుంబమే కారణం అని నిందిస్తూ, ఏం చేయకుండా ఊరకుండి పోతారా ?
 • ఒక పిల్ల లేదా పిల్లవాడు మీ విద్యార్ధి కాకపోతే ....
 • పిల్లవాని గూర్చి ఆరాతీసి వారికి నిజంగా రక్షణ అవసరమని భావిస్తారా?
 • ఆధారాలు దొరికేంతదాకా ఆగుతారా ?

లేక, మీరు.....

 • ఆ పిల్లలను సురక్షిత వాతావరణంలో ఉండేలా చూస్తారా?
 • ఆ పిల్లవానితో మాట్లాడతారా?
 • ఆ పిల్లవాని కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రతి పిల్ల/పిల్లవానికీ సురక్షిత బాల్యాన్ని గడిపే హక్కుందనీ, పిల్లలకు బాల్యాన్ని గడిపేలా చూసే బాధ్యత తల్లిదండ్రులదేననీ వారికి నచ్చచెప్తారా?
 • అవసరమైతే ఆ పిల్లలకీ, వారి కుటుంబానికీ సాయం చేస్తారా?
 • ఆ పిల్లల రక్షణని బెదిరించేదేమిటో తెలుసుకొంటారా? పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడం లేదీ వారినుంచి పిల్లలకి రక్షణ కల్పించే చర్యలు తీసుకొంటారా?

అవసరమైతే, ఆపిల్లలకు న్యాయ రక్షణ కల్పించడానికి పోలీసులకో లేక చైల్డ్ లైన్కో రిపోర్టు చేస్తారా?

మీరు ఎలా స్పందిస్తారనేది మీరు మిమ్మల్ని ఎలా భావిస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని మీరు కేవలం ఒక ఉపాధ్యాయునిగా భావిస్తారా లేదా, నాయకులగానో, సారధిగానో, సలహాదారునిగానో, మార్గదర్శకులగానో భావిస్తారా? ఎందుకంటే, నాయకులు సారధి, సలహాదారుడు, మార్గదర్శకులు, రక్షణనిచ్చేవారు సమాజంలో మార్పు తెచ్చేవారిగా, రక్షించి, రక్షణ కల్పించేవారిగా వ్యవహరించాల్సి వస్తుంది.

ఉపాధ్యాయులైన మీరు ఎంతో ప్రముఖులు ఎందుకంటే......

 • పిల్లల సమాజం, వారి చుట్టూ ఉండే వాతావరణం లో మీరొక ముఖ్యమైన అంశం. అందువల్ల వారి హక్కులను తెలియజేయడం, వారిని రక్షించడం మీ కనీస బాధ్యత. మీరే వారికి ఆదర్శం. అందువల్ల మీరే వారికి ప్రమాణాలను నిర్దేశించాలి.
 • విద్యార్థుల పురోభివృద్ధికి, అభివృద్ధికి, బాగోగులు చూడటానికి, సురక్షితంగా ఉండటానికి, వారి ఉపాధ్యాయులుగా మీరే బాధ్యులు.
 • ఉపాధ్యాయులుగా మీకు ఆ బాధ్యత, అధికారం - రెండూ ఉన్నాయి మీరు కేవలం సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పి, ఫలితాలు చూపెట్టే ఉపాధ్యాయుల పాత్రకన్నా మిన్నగా సమాజాన్ని మార్చడానికి కారకులుగా ఉండాలి.

ఈ సమాచారం మీకోసమే తయారుచేయడం జరిగింది. ఇందువల్ల మీరు పిల్లకు సహాయం చేసి, వారిని హింసించే వారినించి వారికి సరైన రక్షణ కల్పించగలరు. న్యాయపరమైన సూచనలనూ ఇందులో మేం అందిస్తున్నా, మీరు న్యాయవాదులనుంచి సరైన సూచనలు పొందడం ఎంతో ముఖ్యం.

పిల్లల హక్కులగూర్చి తెలుసుకోవడం

‘పిల్ల’ లంటే ఎవరు ?

అంతర్జాతీయ చట్టం ప్రకారం 18 ఏళ్ల వయస్సులోపలి వారంతా పిల్లలే. అంతర్జాతీయంగా ఆమోదించబడిన ఈ నిర్వచనం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ (యుఎన్‌సిఆర్‌సి) అనే అంతర్జాతీయ న్యాయ సాధనం ద్వారా చర్చించి, దాదాపు అన్నిదేశాలూ ఆమోదించడం జరిగింది.

భారతదేశం ఎపుడూ 18 ఏళ్ల వయస్సులోపలి వారంతా పిల్లలే అని విశిష్టమైన న్యాయపరమైన గుర్తింపునిస్తూ వచ్చింది. క్లుప్త్తంగా చెప్పాలంటే, 18 ఏళ్లు వచ్చాకనే ఎవరైన సరే ఒటుహక్కు వినియోగించగలరు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలరు, లేదా ఎలాంటి న్యాయపరమైన ఒప్పందాలైనా చేయగలరు. బాల్యవివాహాల చట్టం 1929 ప్రకారం, అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు వచ్చేదాకా పెళ్ళి చేయడం నేరం. అంతే కాదు. 1992లో యుఎన్‌సిఆర్‌సి లో చర్చించి, ఆమోదించాక 18ఏళ్ల పిల్లలు ఏవరైనా సరే వారికి అవసరమైతే ఆయా రాష్ట్రాలు తగిన రక్షణని కల్పించే విధంగా భారతదేశం తన చట్టంలో మార్పును తెచ్చింది. ఐతే, వివిధ చట్టాలు పిల్లలను వివిధ రకాలుగా నిర్వచిస్తున్నాయి. వీటిని యుఎన్‌సిఆర్‌సి కి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ, ఇంతకుముందు చెప్పినట్లు న్యాయపరంగా అమ్మాయిలు 18 ఏళ్లకు, అబ్బాయిలు 21 ఏళ్లకు మాత్రమే పరిపూర్ణ వ్యక్తులుగా గుర్తించడం జరుగుతుంది.

దీని అర్థం ఏమిటంటే, మీ గ్రామం/ పట్టణం/ నగరంలో 18 ఏళ్లలోపు వారంతా పిల్లలుగానే వ్యవహరించడం జరుగుతుంది. వారికి మీ సహాయం, తోడ్పాటు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలను వ్యక్తులుగా నిర్ధారించేది వారి వయస్సే. ఒక వేళ 18 ఏళ్లలోపు పిల్లలు పెళ్లి అయ్యి, వారికి పిల్లలు ఉన్నా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అలాంటివారిని కూడా పిల్లలుగానే గుర్తించడం జరుగుతుంది.

ముఖ్యమైన అంశాలు

 • 18 ఏళ్లలోపు వారంతా పిల్లలే.
 • బాల్యం అనేది మానవజీవనంలో ఒక దశ. బాల్యంలో పిల్లలకు రకరకాల అనుభవాలు కలుగుతాయి. పిల్లలందరినీ హింసలనుంచి, స్వలాభాలకోసం వాడుకో జూసే వారినించి రక్షణ కల్పించాలి.

పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరం?

 • వాతావరణ పరిస్థితుల వల్ల పిల్లలు పెద్దల కన్నా అతి త్వరగా ప్రభావితులౌతారు.

అందువల్ల మిగిలిన వయోజనులకన్నా పిల్లలు ప్రభుత్వ, సమాజాల చర్యాచర్యలకు గురి అవుతారు. అనేక చోట్ల, మన సమాజంతోబాటు పిల్లలనేవారు కేవలం వారి తల్లిదండ్రుల సొత్తు లేదా వారు రాబోయే రోజులకు పౌరులు, వారివల్ల ప్రస్తుతం సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేదు అనే అభిప్రాయం ఉంది.పిల్లలకు కూడా సొంత తెలివి తేటలు ఉంటాయని, అభిప్రాయాలు వెల్లడించగలరనీ, ఎంపిక చేసుకొనే సామర్థ్యం వాళ్లకుంటుందనీ ఎవరూ ఆలోచించడం లేదు. పెద్ద వాళ్లు పిల్లలకు సలహాలిచ్చి నడిపించాల్సింది పోయి, వారి జీవితాలనే నిర్ణయించి శాసిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి ఓట్లు కానీ రాజకీయ ప్రభావం కానీ, ఆర్థిక శక్తి కానీ లేవు. వారి గొంతే ఎక్కడా వినిపించడం లేదు.పిల్లలందరూ సులభంగా హింసలకూ, స్వలాభాలకోసం వాడుకుజూసేవారికీ గురౌతున్నారు.

పిల్లల హక్కులేమిటి?

మన దేశంలో అమలులో ఉండే న్యాయం, చట్టాలు అందరూ అంగీకరించిన అంతర్జాతీయ న్యాయసాధనాలూ కల్పించిన ప్రమాణాలూ, హక్కులూ 18 ఏళలోపు లలోవారందరూ పొందడానికి అర్హులు.

భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగం పిల్లలందరికీ కొన్ని హక్కులు ప్రత్యేకంగా కల్పించింది. వాటిలో కొన్ని :

 • 6-14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్య పొందే హక్కు(ఆర్టికల్ 21 ఏ)
 • 14 ఏళ్ల వయస్సులోపు పిల్లలందరికీ ప్రమాదకరమైన పనులు చేయడం నుండి రక్షణ కల్పించే హక్కు(ఆర్టికల్ 24).హింసలనుంచీ, విధిలేక ఆర్థిక ఇబ్బందులవల్ల వయస్సుకుమించిన పనులలో చేరనీయకుండా పిల్లలకు రక్షణ పొందే హక్కు (ఆర్టికల్ 39(ఇ)).ఆరోగ్యకరమైన సమానావకాశాలు, సౌకర్యాలు పొందే హక్కు, బాల్య స్వేచ్ఛ, గౌరవాలను, బాల్యాన్ని పరిరక్షించడం, అవినీతి, విసర్జనలబారినుంచి పరిరక్షణ(ఆర్టికల్ 39(ఎఫ్)).

ఇవేగాక భారత దేశంలోని ఇతర స్త్రీ, పురుషులతో సమాన పౌరులుగా పిల్లలకు కొన్ని హక్కులున్నాయి:

 • సమానత్వపు హక్కు(ఆర్టికల్ 14).
 • వివక్షతకు గురికాకుండా ఉండే హక్కు(ఆర్టికల్ 15).
 • వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయాన్ని పొందే హక్కు(ఆర్టికల్ 21).
 • అక్రమ రవాణా, వెట్టినుంచి రక్షణపొందే హక్కు(ఆర్టికల్ 23).
 • బలహీన వర్గాలకు సాంఘిక అన్యాయాలనుంచి, అన్యాయంగా వాడుకో జూసే వారి నించి రక్షణ పొందేహక్కు(ఆర్టికల్ 46).

రాష్ట్రాలు ఏమి చేయాలంటే....

 • స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలి(ఆర్టికల్ 15(3)).
 • మైనారిటీలకు రక్షణ కల్పించడం. (ఆర్టికల్ 29 )
 • బలహీన వర్గాలకు విద్యనందించడంలో ప్రోత్సాహాలు కల్పించడం(ఆర్టికల్ 46).
 • పోషక విలువలను, జీవన ప్రమాణాన్ని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం (ఆర్టికల్ 47).

రాజ్యాంగమే కాకుండా, పిల్లల కోసం ఉద్దేశించిన చట్టాలు కూడా ఉన్నాయి. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులుగా, పౌరులుగా వాటన్నింటినీ మీరు తెలుసుకోవడం మంచిది. కింద వివిధ విభాగాల్లో వాటిని, వాటి విశిష్టతనీ తెలియజేయడం జరుగుతోంది.

పిల్లల హక్కులపై యునైటెడ్ నేషన్స్ సమావేశం (యు ఎన్ సిఆర్ సి)
పిల్లల కోసం ఉన్న అన్ని అంతర్జాతీయ చట్టాల్లో బాగా చెప్పుకోదగ్గది పిల్లల హక్కులపై యునైటెడ్ నేషన్స్ సమావేశం చట్టం. దీన్ని క్లుప్తంగా సిఆర్సి అని సూచిస్తారు. దీనికితోడు మన భారత రాజ్యాంగం, చట్టాలు కలిసి బాలలకు ఏఏ హక్కులుండాలో నిర్ణయిస్తాయి.

పిల్లల హక్కులపై యునైటెడ్ నేషన్స్ సమావేశం ఏమిటి?
మానవ హక్కులు వయోబేధం లేకుండా పిల్లతోబాటు ప్రజలందరికీ చెందేది. ఐతే, వారి ప్రత్యేక స్థాయివల్ల పిల్లలకు మరింత అదనపు రక్షణ, మార్గదర్శకత పెద్దలనుంచి అవసరమౌతుంది. పిల్లలకు దీని కోసం వారికంటూ కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. వీటినే పిల్లల హక్కులు గా వ్యవహరిస్తారు. వీటిని యునైటెడ్ నేషన్స్ సమావేశం (సిఆర్సి)లో నిర్ణయించారు.

పిల్లల హక్కులపై యునైటెడ్ నేషన్స్ ఒప్పందంలో చెప్పుకోదగ్గ విశేషాలు

 • 18ఏళ్ల లోపలి వయస్సుగల వారు బాలురైనా, బాలికలైనా, ఒకవేళ అలాంటి వారికి పెళ్లై పిల్లున్నాసరే,వారికి సమానంగా వర్తిస్తుంది.
 • పిల్లల మంచిని దృష్టిలో ఉంచటం, వివక్షత లేకుండటం, పిల్లల అభిప్రాయాలను గౌరవించడం అనే అంశాల ఆధారంగా ఈ ఒప్పందం పనిచేస్తుంది.
 • కుటుంబం యొక్క ఆవశ్యకత, పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి, వారి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది.

ఈ ఒప్పందం లేదా చట్టాన్ని రాష్ట్రాలు గుర్తించి పిల్లందరినీ న్యాయంగా, సమానంగా చూసేట్లు చేస్తుంది.

ఇది నాలుగు రకాల పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులను గురించి సూచిస్తుంది :

 • బతకడం
 • రక్షణ
 • అభివృద్ధి
 • భాగస్వామ్యం

బతికే హక్కు అనేది కింది వాటిని కలిపిస్తాయి.

 • జీవించే హక్కు.
 • అత్తున్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యం.
 • పౌష్టికాహారం.
 • తగిన జీవన ప్రమాణం.
 • పేరు, జాతీయత.

అభివృద్ధి హక్కు అనేది కింది వాటిని కలిపిస్తుంది.
 • విద్య పొందే హక్కు.
 • బాల్యంలో కావాల్సిన రక్షణ, అభివృద్ధి - వాటికి కావలసిన తోడ్పాటు
 • సామాజిక రక్షణ.
 • తీరిక సమయం, విశ్రాంతి పొందడం, సాంస్కృతిక కార్యక్రమాలు - వీటి హక్కు.

రక్షణ హక్కు అనేది కింద చెప్పిన అన్ని రకాల వాటినుంచి స్వేచ్ఛనిస్తుంది.

 • వారి స్వలాభానికి ఇతరులు వాడుకోవడం
 • దుర్వినియోగించడం
 • అమానుషంగా ప్రవర్తించడం లేదా కించపరచడం.
 • నిర్లక్ష్యం.
 • ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక రక్షణ అంటే అత్యవసర పరిస్థితులు, సాయుధ దెబ్బలాటలు, వైకల్యం వగైరా.


భాగస్వామ్య హక్కు అనేది కింది వాటిని కలిపిస్తుంది.

 • పిల్లల అభిప్రాయాలను గౌరవించడం.
 • భావ వ్యక్తీకరణ స్వేచ్చ.
 • సరైన సమాచారాన్ని అందుకోవడం.
 • ఆలోచనా స్వేచ్ఛ, ధర్మాధర్మ వివేచనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ
 • కుటుంబంతో కలిసి జీవించే హక్కు, వగైరా.

దాదాపు అన్ని రక్షణలకు సంబంధించిన హక్కులూ ఈ తక్షణ హక్కుల వర్గానికే చెందుతాయి. అందువల్ల వాటికై వెంటనే తగుచర్య తీసుకొనేలా చూస్తాయి.

 • ప్రగతి శీలక హక్కులు (ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులు) అంటే, ఆరోగ్య, విద్యలకు సంబంధించిన హక్కులూ వస్తాయి. అలాగే, తక్షణ హక్కుల వర్గంలో లేని మిగిలిన హక్కులూ ప్రగతిశీలక హక్కుల కిందే వస్తాయి.


సిఆర్సిలో ఆర్టికల్ 4 కింది వీటిని ఇలా గుర్తించారు :

“ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల విషయానికొస్తే, రాష్ట్ర పార్టీలు వారి వద్ద లభ్యమయ్యే వనరులను గరిష్టంగా, అవసరమైనపుడు వాడుకొనేలా చూడాలి. అవసరమైతే, అంతర్జాతీయంగా లభ్యమయ్యే వనరులనూ వాడుకోవచ్చు”.

ఈ పుస్తకంలో ముఖ్యంగా మనం చిన్నపిల్లలను సంరక్షించే హక్కు, దానిని అమలుచేయడంలో ఉపాధ్యాయల, పాఠశాలల పాత్ర వంటి అంశాలను చర్చించడం జరుగుతోంది.

సూచన : వయస్సు పెరిగే కొద్దీ పిల్లలలో పలువిధాలుగా పరిణతి పొందడం జరుగుతుంది. అంటే, 15 లేదా 16 ఏళ్లు రాగానే వారికి రక్షణ అవసరం లేదని కాదు. ఉదాహరణకు, మన దేశంలో 18 ఏళ్ల వయస్సులోపలి పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, వారిని పనిలోకి పంపడం జరుగుతోంది. అంత మాత్రాన, సమాజం వీరంతా పూర్తి పరిణతి చెందారని భావిస్తూ వారికి రక్షణ తగ్గించకూడదు. వారికి సాధ్యమైనంత ఎక్కువ రక్షణని, అవకాశాలనీ కల్పిస్తూ వారు సరైన రీతిలో జీవితాన్ని ఆరంభించడానికి తోడ్పడాలి.

పరిరక్షణనిచ్చే హక్కు

పిల్లల రక్షణ హక్కు

ఉపాధ్యాయులుగా మీ ప్రాంతంలో పిల్లలందరూ కింద చెప్పిన అన్ని రకాలుగా రక్షణ పొందేలా చూడాలి.

 • ఇతరులు స్వలాభానికి వాడుకోవడం.
 • అగౌరవించడం.
 • అమానుషంగా ప్రవర్తించడం, స్థాయిని తగ్గించేలా ప్రవర్తించడం.
 • నిర్లక్ష్యంగా చూడటం.

సాంఘిక, ఆర్థిక, ప్రాదేశిక స్థితిగతుల వల్ల పిల్లలందరికీ రక్షణ అవసరం. కొందరు పిల్లలు మిగిలిన వారికన్నా ఎక్కువ హానికరమైన స్థితిలో ఉండటంవల్ల వారికి మరింత ప్రత్యేక రక్షణనివ్వాల్సి ఉంటుంది. ఇవి :

 • ఇల్లు లేని పిల్లలు(రోడ్డువేపు ఉండే పిల్లలు, తరమగొట్టబడ్డ వాళ్లు, కాందిశీకులు వగైరా)
 • వలస వచ్చిన పిల్లలు.
 • వీధి పిల్లలు, పారిపోయివచ్చిన పిల్లలు.
 • అనాధ బాలలు, లేదా వదిలివేయబడ్డ పిల్లలు.
 • పనులు చేసే పిల్లలు.
 • బిచ్చమెత్తే పిల్లలు.
 • వ్యభిచారుల పిల్లలు.
 • వ్యభిచారం చేస్తున్న పిల్లలు
 • అక్రమ రవాణాచేయబడిన పిల్లలు.
 • ఖైదులలోని పిల్లలు.
 • ఖైదీల పిల్లలు.
 • గోడవలకు బలైపోయిన పిల్లలు.
 • సహజమైన ఉపద్రవాలకు గురైన పిల్లలు.
 • హెచ్ఐవి, ఎయిడ్స్ గురైన పిల్లలు.
 • ప్రాణాపాయ రోగాలతో అవస్థపడే పిల్లలు.
 • అంగవికలురైన పిల్లలు.
 • షెడ్యూల్డ్ జాతి, తెగల పిల్లలు.
పిల్లల రక్షణలో అపోహలూ, నిజాలూ

అన్ని వర్గాలలోని బాలికలు మరింత త్వరగా హానికి గురౌతారు.

పిల్లల హింస, స్వలాభానికి వాడుకోవడం గురించి కొన్ని జనబాహుళ్యంలో ఉండే అపోహలు కింద ఇవ్వబడ్డాయి:

1. అపోహ: పిల్లలను ఎవరూ హింసించరు, స్వలాభానికి వాడుకోరు. సమాజం వారిని ప్రేమిస్తుంది.

నిజం : నిజమే. పిల్లలను మనం ప్రేమిస్తాం. కానీ, ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యధిక బాల కార్మికులున్నది, లైంగిక హింసలకు గురౌతూన్నది భారతదేశంలోనే. అలాగే, 0 - 6 ఏళ్ల ప్రాయంలో మగ, ఆడ పిల్లల నిష్పత్తి అతి తక్కువగా ఉన్నదీ భారతదేశంలోనే. ఇదంతా అసలు బాలికల మనుగడే కష్టమైపోయిందని చెప్పకనే చెప్పుతున్నాయి. ఆఖరికి ఆడపిల్లలు పసికందులుగా ఉన్నప్పుడే దత్తతకి అమ్మేయడమో లేదా చంపేయడమో జరుగుతోంది. పిల్లల పట్ల నమోదైన నేరాల సంఖ్య ఒక నీచమైన కథను చెబుతోంది. ప్రభుత్వ రికార్డుల సాక్షిగా చెబితే, 2003 లో పిల్లల పట్ల నమోదైన నేరాల సంఖ్య 2002లో నమోదైన దానికన్నా 11.1 శాతం ఎక్కువ. ఇవిగాక చాలా కేసులు నమోదేకాలేదన్నది స్పష్టం.

2. అపోహ: ఇల్లే పిల్లలకు సురక్షితమైన ఆశ్రయం.

నిజం : వారి వారి ఇళ్లలో పిల్లలకు ఎదురయ్యే హింసలు ఇది అపోహే అనడానికి ఆస్కారాన్నిస్తున్నాయి. పిల్లలంటే తల్లిదండ్రులు తమ ఆస్తిగా భావిస్తూ వారిని ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు. తండ్రులు తమ కూతుళ్లను మిత్ర్రులకో, తెలియనివారికో అమ్మేసే సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. లైంగిక హింసలపైన జరిగిన అధ్యయనాల ప్రకారం దగ్గరి బంధువులతో వ్యభిచారం అనేది ఎక్కువగా ఎదురౌతోన్న హింస. పత్రికల్లోని కథనాల ప్రకారం తండ్రి కూతుర్ని బలాత్కారం చేయడం, ఆ కేసులు కోర్టులో రుజువు కావడం వంటి సంఘటనలూ చోటుచేసుకొంటున్నాయి. అపుడే పుట్టిన ఆడబిడ్డలను చంపడం, మూఢాచారాలవల్ల ఆడ పిల్ల లను ఏదేవతకో బలివ్వడం, భారతదేశంలో కొన్ని చోట్ల అమ్మాయిలను దేవతలకీ దేవుళ్లకీ దత్తం చేసే సాంప్రదాయపు ముసుగులో వారిని జోగినులుగా లేదా దేవదాసీలుగా మార్చడం - ఇవన్నీ కూడా గృహాలలో జరిగే హింసల కిందే వస్తాయి. అతి చిన్న వయస్సులో పిల్లలకు పెళ్లి చేయడం అనేది ఏదో పిల్లలపై ప్రేమ కొద్దీ చేయడం లేదు. అలా చేయడం వల్ల వారి ఆలనా పాలనాకయ్యే వ్యయం, బాధ్యత ఇంకొకరిమీదకు నెట్టడమే. స్వయానా వారి పిల్లలకు అనారోగ్యం, రోగస్థితి కలిగినా సరే. లెక్కచేయడం లేదు.

దేశంలో చాలా చోట్ల పిల్లలను విచక్షణారహితంగా కొట్టడమనేదీ ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమైన విషయం. పిల్లల పట్ల నిర్లక్ష్య ధోరణి చూపడమనేది బీదా, గోప్పా ఇళ్లలోనూ సాధారణమైపోయి, ఫలితంగా పిల్లలలో ముఖ్యంగా మానసిక వత్తిడి కి లోనవడం వంటి ప్రవర్తనా సమస్యలు తలెత్తుతున్నాయి.

3. అపోహ : మగ పిల్లల గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. మగ పిల్లలకు రక్షణ అవసరం లేదు.

నిజం : ఆడ పిల్లలలాగే మగ పిల్లలు కూడా భౌతికమైన, మానసికమైన హింసలకు అతి తరచూగా లోనవుతారు. ఆడ పిల్లలకూ మగ పిల్లలకన్నా సమాజంలో తక్కువ స్థాయి ఉండటంవల్ల ఎంతో వేగంగా హింసలకు గురౌతున్నారు. ఐతే, పాఠశాలల్లో, ఇళ్లలో కఠినమైన హింసలకు గురికావడం బాలురలో ఎక్కువ. చాలమంది పనులు చేయడానికి పంపబడ్డం, ఒక్కోసారి ఆ పనులు చేయడానికై అమ్ముడుబోవడం జరుగుతుంటూంది. మరి కొందరు లైంగిక హింసలకు గురౌతూంటారు.

4. అపోహ : అబ్బెబ్బే మా పాఠశాలలో/ గ్రామంలో అలా జరగదు!

నిజం : ప్రతి ఒక్కరూ పిల్లలను హింసించడం ఎక్కడో జరుగుతుందనీ - మా ఇళ్లలో, మా పాఠశాలలో , మా గ్రామంలో లేదా మా ప్రక్క గ్రామంలో జరగదనీ అనుకొంటుంటారు - “అది మన పిల్లలకు కాదు ఎవరికో జరుగుతుంది. బీదవారిలో, పనివాళ్లలో, నిరుద్యోగుల్లో, చదువుకోనివారి కుటుంబాలలో జరుగుతుంది. మధ్య తరగతి కుటుంబాలలో జరగదు. ఇది నగరాల్లో, పట్టణాల్లో జరుగుతుందే కానీ, గ్రామాల్లో కాదు”. ఐతే, నిజం వేరే.అన్ని చోట్లా పిల్లలు హింసలకు గురౌతూనే ఉన్నారు, వారందరికీ రక్షణ కావాలి.

5. అపోహ : అలా హింసించేవారంతా మానసిక రుగ్మతలున్న వారు లేదా మానసిక రోగులు.

నిజం : అందరూ అనుకొన్నట్లు, హింసించేవారంతా మానసిక రుగ్మతలున్న వారు లేదా మానసిక రోగులు కారు. వారంతా సామాన్యులే. ఆరోగ్యంగానే ఉన్న వారే. పిల్లలను లైంగికంగా హింసించేవారంతా వారి చర్యలను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తూంటారు. ఇదీ అలాంటిదే. పిల్లలను అక్రమంగా రవాణాచేసేవారు చాలావరకు ఆయా కుటుంబాలకు సన్నిహితులుగానే ఉంటారు. లేదా వారికి తెలిసిన వారైనా అయి ఉంటారు. వారిపై కుటుంబాలకున్న నమ్మకాన్ని వారు దుర్వినియోగం చేస్తూ అలాంటి వారి పిల్లలను తస్కరిస్తూంటారు.

ఉపాధ్యాయులంతా తెలుసుకోవాల్సిన పిల్లల పరిరక్షణ అంశాలు.

పిల్లలను హింసకు గురిచేయడమనేది సాంఘిక-ఆర్థిక, మత, సాంస్కృతిక, జాతి, జాతిబేధాల సమూహాలు పరంగా జరుగుతాయి. గతంలో ప్రభుత్వం, సాంఘిక సామాజిక సమూహాలు పరిశోధన, పత్రాలు, అస్వభావికంగా జోక్యం చేసుకోవడంవల్ల కింద చెప్పిన కొన్ని పిల్లల సంరక్షణ అంశాలు, ఏ పిల్లల వర్గాలకు ప్రత్యేక రక్షణ కావాలి వంటి విషయాలను వివరించడం జరిగింది.

వివక్షత - అపోహలూ, నిజాలూ

అపోహలు, అపోహలు, మరిన్ని అపోహలూ, - మీకు నిజాలు తెలిస్తే మీకే తేడాలు తెలుస్తాయి!

1. అపోహ: మగ పిల్లవాడు కావాలి, దానికోసం ఐదారుమంది ఆడపిల్లలను కనడం ఎందుకూ?

ఆడ పిల్లలను పెంచడం అంటే పక్కింటివారి తోటలకు నీళ్లు పట్టడమే. వారిని మనం పెంచాలి. రక్షించాలి. పెళ్లిచేయాలి. దానికి కట్నం సిద్ధం చేయాలి. పెళ్లై వెళ్లేదాకా అన్నీ చేయాలి. అదే కొడుకులైతే, కనీసం కుటుంబాన్ని ముందుకు తీసుకెళతారు. తల్లిదండ్రులను ఆఖరి రోజుల్లో బాగా చూసుకొని, వారి కర్మ కాండలు సక్రమంగా నిర్వర్తిస్తారు.

ఆడపిల్లలను చదివించడంలో, వారికి స్వేచ్ఛనిచ్చి పెళ్లయ్యేదాకా వారిష్టమొచ్చినట్లుండటానికి అంగీకరించడంలో అర్థం లేదు. ఇదంతా కుటుంబానికి భారం కలిగించేదే.

నిజం: సమాజంలో ఇంటి పెద్దల ఆధిక్యత ఉన్న చోట్ల ఇలాంటి నమ్మకాలున్నాయి. వీటిని చర్చించాలి. ప్రజలు ఒక అమ్మాయి పెళ్లికి ఖర్చు పెట్టేంత ఖర్చు అబ్బాయి పెళ్లికి పెడతారు. మనలా తెలివైన వారంతా ఆడ పిల్ల పెళ్లిలో ఆమెకు కట్న కానుకలు ఇచ్చి, ఉత్తరోత్తరా ఆస్తిలో వాటా అడగకూడదని చెప్పడానికే ఇదంతా చేస్తాం. అందరూ ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. కట్నం ఇవ్వడం, తీసుకోవడం - రెండూ నేరం. అమ్మాయిలకు ఆస్తిలో భాగం ఇవ్వకపోవడమూ నేరమే.

ఏదైనా, మనం జీవితంలోని నిజాలను అంగీకరించడం నేర్చుకోవాలి. ఒక్క సారి వృద్ధాశ్రమాలకు వెళ్లివస్తే మనకు మన అబ్బాయిలు ఏమాత్రం వాళ్ల తల్లిదండ్రులను వారి ఆఖరి రోజుల్లో పోషిస్తున్నారో తెలుస్తుంది. నిజానికి, పెళ్లైన అమ్మాయిలెంతో మంది వారి తల్లిదండ్రులను వారి ఆఖరి రోజుల్లో పోషించడానికి ముందుకొస్తున్నారని తెలుస్తుంది.

అమ్మాయిలకూ అబ్బాయిల్లాగానే జీవించడానికి, అభివృద్ధికి, రక్షణకీ, భాగస్వామ్యానికీ సమానమైన హక్కుంది. వాటిని నిరాకరించడం అంటే వారిపట్ల లింగ వివక్షత, పేదరికాన్నీ ఎత్తి చూపడమే. వాటిని ప్రోత్సాహించడమే.

కొన్ని శతాబ్దాలుగా అమ్మాయిలు అన్ని రకాల లింగ వివక్షతను ఎదుర్కొంటున్నారు. వాటిలో విద్యారంగం కూడా ఉంది. “ఒక మగవాడికి విద్య నేర్పిస్తే నీవు ఒక వ్యక్తికి విద్య నేర్పించినట్లు. అదే నీవు ఒక స్త్రీకి విద్య నేర్పితే నీవు మొత్తం నాగరికతకే విద్య నేర్పినట్లు!” అన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను మనం ఎపుడూ మర్చిపోతూంటాం.

మన బాలికలకు మనం మంచి ఏదో, చెడు ఏదో అర్థంచేసుకొనెలా, వారు స్వయంగా నిర్ణయాలు చేసుకొనేలా మనం చేసినపుడు, అతి స్వేచ్ఛవంటి అంశాలలో మనకున్న భయాలకి సమాధానాలు అవే దొరుకుతాయి. అది సాధ్యమవ్వాలంటే, ఇతర మనుష్యులకు మల్లే బాలికలకూ కొన్ని హక్కులుంటాయని మనమంతా గుర్తించాలి. బాలికల సంక్షేమం, సంరక్షణలు జాతీయ అంశాలైతే, స్వయంగా హక్కులు లేని బాలికలు మరింత ప్రమాదంలోపడే అవకాశం ఉందన్న అంశాన్ని గమనించడం ఎంతో ముఖ్యం.

మానవ వనరుల అభివృద్ధి నివేధిక 2005 ప్రకారం, “ప్రతి ఏడూ, 12 మిలియన్ల అడపిల్లలు పుడుతున్నారు - వారిలో కనీసం 3 మిలియన్లమంది వారి 15వ పుట్టినరోజు కూడా చూడలేకపోతున్నారు. మూడింట ఒకవంతు ఈ మరణాలు పుట్టిన ఏడాదికే సంభవిస్తున్నాయి. వీటిలో ప్రతీ ఆరో అమ్మాయి మరణమూ కేవలం లింగ వివక్షత వల్లే జరుగుతోందని తెలుస్తోంది”.

2001 జనాభా లెక్కల ప్రకారం, ఈ దేశంలో ప్రతి 1000 మంది మగవాళ్లకీ 933 ఆడవారే ఉన్నారు. ఈ సంఖ్య పిల్లల విషయంలో 1991 జనాభా లెక్కలనించీ మరీ తక్కువౌతూ పోతోంది. 1991లో ప్రతి 1000 బాలురకూ 945 మంది బాలికలుంటే, 2001 నాటికి అది 927కి పడిపోయింది. పంజాబ్(798), హర్యానా(819), హిమాచల్ ప్రదేశ్(896) రాష్ట్రాలలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాజధాని ఢిల్లీలో 1000మంది బాలురకు 900 బాలికలే ఉండటం నేడు చూడవచ్చు. ఈ రాష్ట్రాల అబ్బాయిలు ప్రస్తుతం ఇతర రాష్ట్రాలనుంచి అమ్మాయిలను కొనుక్కొంటున్నారు.

బాల్య వివాహాలు - అపోహలూ, నిజాలూ

అపోహ: బాల్య వివాహాలు మన సంస్కృతిలో భాగం. పెళ్లికాని పిల్లలుంటే వారికి బలాత్కారం , లైంగిక హింసల ప్రమాదం ఎక్కువ. అందువల్ల వారికి త్వరగా పెళ్లి చేసేయడం మంచిది. పైగా పిల్ల వయస్సు పెరిగే కొద్దీ, కట్నం, పిల్లవాడిని వెదకడం –రెండూ సమస్యలే.

నిజం : ఎలాంటి అక్రమానికీ, హానికరమైన చర్యలకూ సంస్కృతి కారణమంటే సరిపోదు. బాల్య వివాహాలు మన సంస్కృతిలో భాగమే ఐతే, బానిసత్వం, మతబేధం, కట్నం, సతి - అన్నీ దానిలోని భాగాలే అని చెప్పాలి. ఐతే అలాంటి హానికరమైన వాటిని నివారించేందుకు మనకు చట్టాలున్నాయి. ఈ చట్టాలన్నీ సమాజంలో వాటి అవసరాల మేరకే అమలులోకి వచ్చాయి. అంటే, సంస్కృతి అనేది స్తబ్దంగా ఉండేది కాదని తేలిపోయింది. పైగా వేర్వేరు ప్రజలు భౌగోళికంగా ఒకేచోటే ఉన్నా వీరికి వేర్వేరు సంస్కృతులున్నాయి. భారతదేశం లో ఎన్నో విభిన్నజాతులు, భాషాపరమైన, మతపరమైన సమూహాలున్నాయి. వారి వారికి వారివారి సంస్కృతి వేరేగా ఉంది. అందువల్ల భారతీయ సంస్కృతి విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అనాదిగా ఎన్నో మార్పులను చూస్తూ వస్తోంది. మనమంతా మన పిల్లలకు రక్షణ అవసరమనే అంశాన్ని అంగీకరిస్తే, మన సంస్కృతులో అది ప్రతిబింబించాలి. నిజానికి సంస్కృతీ పరంగా మనమంతా మన పిల్లలను ప్రేమించి, వారికి సదా రక్షణనిచ్చే ఒక సమాజంగా గుర్తింపు పొందాలి.

బాల్య వివాహాలు అనేవి హక్కుల ఉల్లంఘన అనే సుదీర్ఘ ప్రయాణానికి నాంది పలుకుతాయి. బాల్య వివాహాలు అనేవి ఆడ పిల్లలకి చేసినా, మగ పిల్లలకి చేసినా అవి ఉల్లంఘన కిందే వస్తుంది. ఎంపిక చేసుకొనే హక్కుని కాలరాస్తూ వారి వయస్సుకు మించిన బరువు బాధ్యతలను అంటగడ్తుంది. ఈ విషయంలో అమ్మాయిలు చాలా దీనస్థితిలో ఉన్నారనటంలో సందేహం లేదు. బాల వధువులు యవ్వన వితంతువులై ఎందరో పిల్లల ఆలనా పాలనా చూడాల్సి వస్తోంది.

మీకు తెలుసా?

 • 2001 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 15ఏళ్ల వయస్సులోని 3 లక్షలమంది అమ్మాయిలు ఇప్పటికే కనీసం ఒక బిడ్డకు తల్లులుగా ఉన్నారు.
 • 20 నించి 24 ఏళ్ల వయస్సులోని స్త్రీలకన్నా ఐదు రెట్లు ఎక్కువగా 10 నించి 14 ఏళ్ల వయస్సులోని అమ్మాయిలు గర్భం వల్ల లేదా ప్రసవ సమయాల్లో చనిపోతూంటారు.
 • పిన్న వయస్సులో గర్భం ధరించడం వల్ల ఎక్కువ గర్భస్రావాలు జరుగుతూన్నాయి.
 • పిన్నవయస్సులోనే తల్లులైన అమ్మాయిలకు పుట్టే బిడ్డలు బరువు తక్కువగా ఉండే అవకాశాలెక్కువ.
 • పిన్న వయస్సులోని అమ్మాయిలకు పుట్టిన పిల్లలు ఎక్కువగా పుట్టిన ఏడాదిలోపు మరణించడం జరగవచ్చు.

ఆధారం: యువతుల పరిస్థితి

బాల్య వివాహాలు, అక్రమ రవాణా
 • దేశంలోని లేదా మధ్య తూర్పు దేశంలోని వయస్సు మళ్లిన వారితో పెళ్లి అనే ముసుగులో, సాధారణంగా యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లలను ఏమార్చి వ్యభిచారంతో సహా వివిధ ఆపత్కర పరిస్థితుల్లోకి, నెట్టివేయడం జరుగుతోంది.
 • పెళ్లి అనేది యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లలను వ్యభిచారంలోకీ, కూలిపనిలోకి దింపడానికి ఒక మార్గంగా తయారైంది.

చిన్న వయస్సులోనేపెళ్లి చేస్తే, క్షేమమనీ, రక్షణ ఉంటుందనీ అనుకోవడం తప్పు. నిజానికి కుటుంబాలలో, వ్యక్తులపరంగా అమ్మాయిలపై జరిగే అన్ని రకాల ఘోరాలకీ అదే కారణమౌతోంది. నమ్మమనీ, విధేయతగా ఉండాలనీ పదేపదే చెప్పడం జరుగుతోంది. బాల్య వివాహాలు అంటే, చిన్న పిల్లను బలాత్కారం చేయడమే. ఎందుకంటే, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, మనో వికాసం పిల్లలకు ఆ వయస్సులో రాదు.

బైటవారి నుండి రక్షణ అనేదెట్టి పరిస్థితుల్లోనూ ఏ అవివాహిత/అవివాహిత స్త్రీకీ గ్యారంటీ లేదు. బలాత్కారం, హింసలకు ఏ అవివాహిత/అవివాహిత స్త్రీ కూడా మినహాయింపు కాదు. వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీల పట్ల నానాటికీ పెరిగిపోతున్న నేరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

మన గ్రామంలో ఏమీ తెలియని, చదువుకోని వివాహిత స్త్రీలు బలాత్కారించబడ్డారంటే, అది కేవలం వారు చదువుకోనిదానివల్ల కాదు. అది వారొక కులానికి చెందినవారు కావడమో, లేదా ముఠా తగాదాలు కారణమో కావచ్చు.

చివరగా, వరకట్న సమస్యకు బాల్య వివాహమే సరైన విరుగుడన్నది సరైన ఆలోచన కాదు. మన ముండే పితృస్వామ్య సమాజంలో పెళ్లి కొడుకు కుటుంబానిదే పెళ్లి కూతురు కుటుంబంపైన పైచేయిగా ఉంటోంది. పెళ్లి కూతురు కుటుంబం సదా పెళ్లి కొడుకు కుటుంబ ఆజ్ఞలకు లోబడే ఉండాల్సి వస్తోంది. పెళ్లి సమయంలో వరకట్నం తీసుకోకపోతే, పెళ్లయ్యాక వివిధ రూపాల్లో ఆడపెళ్లి వారిని మగ పెళ్లివారు కోరికలు కోరడం జరుగుతోంది.

బాల కార్మికులు - అపోహలూ, నిజాలూ

అపోహ: బాల కార్మిక సమస్యకు అసలు పరిష్కారమే లేదు. పేద తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపడానికి సుముఖంగా లేదు. దానికన్నా, వారిని ఏదే ఒక చోటికి పనికి పంపి, కొంత డబ్బు సంపాదించి తేవడానికి ఇష్టపడుతూంటారు. ఈ పిల్లకు పనిచేయడం తప్ప మరో మార్గం లేదు. లేకుంటే, వారి కుటుంబాలు ఆకలితో మాడిపోతాయి. అంతేకాక, వారు పనిచేయడం మొదలిడితే భవిష్యత్‌లో అవసరాలకి కావలసిన నైపుణ్యాన్ని పొందుతారు.

నిజం: అలాటి వార్తలను మనం విన్నపుడు, మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎన్ని సమస్యలున్నా, ఎందుకు కొందరు పేదలు వారి పిల్లలను బడికి పంపుతున్నారు, మరికొందరు పంపడం లేదెందుకు. ఇందులో నిజం ఏమిటంటే, వారి స్వలాభం కోసం కొందరు సదా పిల్లలను తమ మాటలు వినేలా చేసుకొంటుంటారు. పేదరికం అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. బాల కార్మిక వ్యవస్థకు సాంఘిక కారణాలు మూలం. వనరులను వాడుకోవడంలోని సాంఘిక అసమానతలవల్ల సామాజికంగా వెనకబడిన కులాలవారు నష్టపోతున్నారు. కుటుంబాలు, వారి పిల్లలూ - అందరూ పనిచేస్తున్నా వారంతా ఆకలితో అలమటించడం మనందరికీ తెలుసు. ఆకలితో అలమటించడమనేది సాంఘిక, ఆర్థిక అసమానతల ఫలితం.

తల్లిదండ్రులందరికీ వారి పిల్లలకు కనీస ప్రాథమిక విద్యని అందించాలనే ఉంటుంది. చదువుకోని తల్లిదండ్రులకు బళ్లలో చేర్పించడానికి ఉండే తతంగం అంతా చాలా సంక్లిష్టంగా తోస్తుంది. పుట్టిన తేదీ, కుల ధృవీకరణ పత్రాల వంటివి పిల్లల నమోదు చేయడంలో పెద్ద అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. పిల్లలకు పాఠ్యాంశాలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా మొదటి తరం పిల్లలు, వారి ఇళ్లలో వారే మొదటిసారిగా చదువుకోవడంవల్ల , వారి తల్లిదండ్రులకు ఏవీ రాకపోవడంవల్ల వారి హోంవర్కులలో తల్లిదండ్రుల సాయం అందక ఇబ్బంది పడటం జరుగుతోంది. శారీరిక శిక్షలు, కుల వివక్షత, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయల లోపం - ఇవి పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉంచుతున్న కొన్ని కారణాలు. బాలికల విషయానికొస్తే, సోదర, సోదరి సంరక్షణాభారం తరచూ వీరికి అడ్డంకి. ఎందుకంటే, గ్రామాల్లో, పట్టణాల్లో సరైన శిశుసంరక్షణా సౌకర్యాలుండవు. అలాగే, లింగ వివక్షత అనేది ప్రజల్లో మరో నాటుకుపోయిన మానసిక భావన.

బడికి వెళ్లకుండా పనికి వెళ్లే పిల్లలు విద్యారాకుండానే , సరైన నైపుణ్యం సంపాదించకుండానే ఆజన్మాంతం ఉండిపోతారు. ఎందుకంటే, పిల్లలను సాధారణంగా ఎలాంటి నైపుణ్యం లేని చాకిరీకే వినియోగిస్తారు. పైగా, సుదీర్ఘమైన పనిగంటలలో కొన్ని చోట్ల అపాయకరమైన రసాయనాలు, తదితర పదార్థాలకు గురికావడంతో పిల్లలు అనారోగ్యాలబారిన పడటమేకాక, అవి వారి అభివృద్ధికి అవరోధంగా ఉన్నాయి.

అసలు బాల కార్మికులుండటమనేదే 6-14 ఏళ్ల మధ్య పిల్లలకు ఉచిత నిర్భంధ విద్య పొందే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేదిగా ఉంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏకి విరుద్ధం.

పిల్లలు పనిలోకి పోకపోతే అది పెద్దలకు అవకాశాన్నిస్తుందన్న అంశాన్ని ఇక్కడ అందరూ గమనించాలి. భారతదేశం లో ఎంతోమంది చదువుకొన్న నిరుద్యోగ యువకులు వారి స్థానంలో ఉపాధి పొందవచ్చు. తద్వారా పిల్లలు తమ హక్కులకు భంగం వాటిల్లకుండా వారి బాల్యాన్ని ఆస్వాదించవచ్చు.

ప్రపంచంలోకెల్లా అత్యధిక బాలకార్మికులున్నది భారతదేశంలోనే. 2001 జనాభా లెక్కల ప్రకారం 5-14 ఏళ్ల వయస్సులో ఉండే పిల్లలు దాదాపు 1.2 కోట్ల మంది వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఐతే, ఎన్జిఓల లెక్కలు ఇంకా ఎక్కువమందే ఉన్నారని తెలుపుతోంది. ఎందుకంటే, చాలా మంది గుర్తింపులేని రంగంలో, చిన్నపాటి గృహ పరిశ్రమల్లో బాలకార్మికులుగా ఎలాంటి వేతనమూ లేకుండా పనిచేస్తున్నారు.

కార్మికులుగా నిత్యం అనేకమంది బాలలను అక్రమంగా తరలించడం జరుగుతోంది. దేశంలో అనేక చోట్ల ఏజంట్లు కాని ఏజంట్లు, మధ్యవర్తులు గ్రామాలకు వచ్చి, ప్రజల వద్ద పైకి శ్రేయోభిలాషులుగా నటిస్తూ, పిల్లలనెత్తుకొనిపోవడం జరుగుతుంది. బీహార్, బెంగాల్ రాష్ట్రాలనుంచి పిల్లలను తెచ్చి కర్ణాటక, ఢిల్లీ లేదీ ముంబైలలో ఎంబ్రాయిడరీ పనులలోనూ, తమిళనాడునుంచి ఉత్తర ప్రదేశ్ కు స్వీట్ల తయారీలోనూ, సూరత్ కు రత్నాల పాలిషింగ్ చేయడానికి వగైరా పనులలో వందలమంది పిల్లలు మధ్య తరగతి కుటుంబాలలో ఇంటిపనులు చేయడానికి వాడబడుతున్నారు.

పిల్లలలో లైంగిక హింస

అపోహ: పిల్లల్లో లైంగిక హింస అనేది మన దేశంలో చాలా అరుదు. ఇదంతా మీడియా చేస్తున్న హంగామా. దానివల్ల మేలుకన్నా కీడే జరుగుతోంది. పిల్లలు లేదా యుక్తవయస్సులోకింకా అడుగిడని పిల్లలు ఊహాలోకంలో విహరిస్తూ, లైంగికంగా ఎవరో హింసిస్తూన్నారని కథలల్లి చెబుతున్నారు. ఏదెట్లున్నా ఇదంతా సరైన వ్యక్తిత్వం లేని చెడ్డ అమ్మాయిలకే జరుగుతుంది.

నిజం: నెలల పిల్లలే కాదు, పుట్టి కొద్ది రోజుల వయస్సున్న పసికందులు కూడా లైంగిక హింసకు గురి అవుతున్నారు. అందులో అమ్మాయిలు మరింత ఎక్కువగా లైంగిక హింసకు గురి అవుతున్నారని ప్రచారంలో ఉన్నా, బాలురూ అంతే తీవ్ర స్థాయిలోలైంగిక హింసకు గురి అవుతున్నారు. మతిస్థిమితంలేని, అంగవైకల్యం ఉన్న పిల్లలు వారికున్న సమస్యలవల్ల చాలా తీవ్రమైన స్థాయిలో లైంగిక హింసకు గురి అవుతున్నారు. లింగ, తరగతి, కులం, జాతి - దేనికీ మినహాయింపు లేకుండా పట్టణాల్లో, గ్రామాల్లోని పిల్లలలో లైంగిక హింస జరుగుతోంది.

పిల్లలు కింద చెప్పిన వాటిలొ ఏదొ ఒక రకంగా లైంగిక హింసకు గురి అయ్యే అవకాశం ఉంది :

 • లైంగికంగా మర్మాంగాలను జొప్పించడం, అంటే బలాత్కారం చేయడం లేదా ఇతర అంగాలని వాడటం.
 • పిల్లలకు నగ్నచిత్రాలను చూపడం, వారిని ప్రేరేపించి అలాంటి చిత్రాలను తయారుచేయడం.
 • ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక వస్తువుతో పిల్లల శరీరాన్ని ఎక్కడంటే అక్కడ తాకడం, లేదా సెక్సు కోరికలను అణుచుకోవడానికి వారిని హత్తుకోవడం.
 • మర్మాంగాలను లేదా వేరే అంగాలని బయటకు చూపి వారిని సెక్సు కోరికలతో వారికి చూపటం.
 • కామ క్రీడలను చూపి ఏదో తెలీని ఆనందాన్ని పొందడం, లేదా ఇద్దరు లేదా ఎక్కువ మంది పిల్లలను ఒకరితోమరొకరిని సెక్సులో పాల్గొనమని రెచ్చగొట్టడం.
 • సెక్సు విషయంగా అర్థంవచ్చేలా రిమార్కులు రాయడం, లేదా పిల్లల పట్ల అసభ్యకరమైన భాషని వాడటం, అసభ్యకరమైన చేష్టలు చేయడం.

కోయంబత్తూరు : ఆడపిల్లలపై లైంగిక హింసలకు పాల్పడ్డాడనే విషయంగా మడుక్కరై నగర సమీపంలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని అరెస్టు చేశారు.

ఒక 8 ఏళ్ల వయస్సున్న 3వతరగతి పిల్లవాడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ప్రధానోపాధ్యాయుని అరెస్టు చేసి లైంగికంగా హింసకు పాల్పడ్డాడనే కాక అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు దాదాపు 100మంది తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ ప్రధానోపాధ్యాయునిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందే ఆ ప్రధానోపాధ్యాయుడు తన పై ఎవరన్నా ఎక్కడన్నా కంప్లైంట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పిల్లలను భయపెట్టాడు.

ఆధారం: పిటిఐ, 25 మార్చి 2005

పిల్లలపట్ల ఎంతో ఆప్యాయంగా ఉన్నట్టు నటిస్తూ, పిల్లల పట్ల హింసాధోరణిని అవలంభిస్తూన్న వ్యక్తి పరంగా అది కాలక్రమంలో ఆత్మనింద, తనపై తనకే అపనమ్మకం కలిగేలా చేస్తుంది.

పిల్లలు తెలిసినవారివల్లే కాదు, ఆగంతకులవల్లా హింసకు గురౌతూంటారు.

పిల్లలు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారిలో 90 శాతం ఆ పిల్లలను శారీరికంగా హింసించేవారుగా ఉంటారు. వారు పిల్లలకు వారిపై ఉండే నమ్మకాన్ని వమ్ముచేస్తూ, తమ స్థానాన్ని అవకాశంగా తీసుకొని దుర్వినియోగం చేస్తారు. చాలా కేసుల్లో పిల్లల తండ్రి, సోదరుడు లేదా సంబంధీకులే ఈ దుర్మార్గానికి ఒడిగడుతూంటారు. దుండగడు కుటుంబంలోనే ఉంటే అది వావికి దారి తీస్తుంది.

లైంగిక హింస మన సమాజంతోబాటే వస్తోంది. అమ్మాయిలను వ్యభిచారగృహాలకు అమ్మివేయడం, లేదా సాంప్రదాయం అనే ముసుగులో ఈ కూపములోకి అమ్మాయిలను లాగే దేవదాసీ వ్యవస్థ లేదా జోగినీ వ్యవస్థ ఇందుకు ఉదాహరణలు. ఐతే ఇటీవలికాలంలో దీని గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. మీడియాలో కొందరు దీన్ని హంగామాగా అన్నా, ఇతోధికంగా రిపోర్టు చేయడం జరుగుతోంది. యువతులలో జరిపిన అనేక అధ్యయనాలలో 75 శాతం వారు తమ చిన్నతనంలో హింసించబడ్డామని చెప్పారు. వాళ్లలో ఎక్కువమంది వారికి బాగా దగ్గరగా ఉన్న వాళ్లవల్లే హింసించ బడ్డామని చెప్పారు. మీడియా చేసేదంతా హంగామా అనేవాళ్లకి ఈ అధ్యయన ఫలితాలంతా అబద్ధాలుగానే ఉంటాయి.

మగవాళ్లు వారి భాగస్వాములతో కాపురం చేస్తూనే పిల్లలపై ఆఘాయిత్యానికి ఒడిగడతారు. అందరూ అనుకొనేలా వీళ్లు మానసిక రోగులేమీ కాదు. నిజానికి వారు సాధారణంగా, విభిన్నంగా ఉంటారు. పిల్లలపై ఆఘాయిత్యానికి ఒడిగట్టినా వారు తమ ప్రవర్తనను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తారు. కొందరు నిర్లక్ష్యంగా అందరూ చూస్తూండగానే పిల్లలను హింసిస్తూ ఉంటారు.

ఇన్ని జరుగుతున్నా పిల్లలు తమపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలను పెద్దవారి దృష్టిలోకి తేవడానికి జంకుతున్నారు. హింసించేవాడు సదా శక్తివంతుడు కావడంవల్ల హింసకు గురయ్యే పిల్లలు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఆ హింసించేది కుటుంబ సభ్యులే ఐతే ఇక చెప్పేదేముంది? తల్లులు తమ పిల్లలు హింసకు గురి అవుతున్నారని తెలిసీ కూడా, తమ నిస్సహాయ స్థితివల్ల ప్రేక్షక పాత్రనే వహించాల్సి వస్తోంది. కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుందేమోనన్న భయం వారిని నిశ్శబ్దంగా ఉండేలా చూస్తోంది. ఇంటి పెద్దలూ, తల్లిదండ్రులూ, సమాజం - అంతా కూడా వారి అసౌకర్యాన్ని పక్కకుపెట్టి పిల్లలపై హింస జరుగుతున్నా ఏమీ జరగటం లేదనే చెప్పడం ఇక్కడ గమనార్హం.

చాలావరకు పిల్లలు చెప్పే హింసాత్మక సంఘటనలు నిజంగా జరిగాయనే నిర్ధారించడం జరుగుతోంది. సమాజం పిల్లలపై లైంగిక హింసలు, వ్యభిచారం, పిల్లల అక్రమ రవాణా - ఇవన్నీ అబద్దాలని కొట్టిపారేయడం తోబాటు ఊహాత్మక సిద్ధాంతం - ఇవన్నీ పిల్లల సమస్యలను పరిష్కరించేదానికి బదులుగా వారినే దోషులుగా చిత్రీకరించడానికి పనికొస్తోంది.

పిల్లలు అమాయకులు. త్వరగా ప్రమాదంలో చిక్కుకొంటారు. వారికి సెక్సు గురించీ, యవ్వనంలో లైంగిక సంపర్కం వంటి విషయాలగురించి ఎలాంటి జ్ఞానమూ ఉండదు. పెద్దల స్పందనలకు ప్రతిస్పందనలేం తెలియజెప్పగలరు? సెక్సు గురించి వారికి తెలియజెప్పాలని పెద్దలు ప్రయత్నించినా వారికేం అర్థం కాదు. కాబట్టి పిల్లలపై వ్యతిరేక ముద్ర వేయడం సబబు కాదు. ఎందుకంటే, ఆఖరికి ఒక వ్యభిచారిని బలాత్కారం ్ చేసినా, రెచ్చగొట్టినా దోషులను శిక్షించడానికి న్యాయ స్థానం ఉంది. కానీ పిల్లల విషయంలో అలా లేదు. అందువల్ల మనం పిల్లలనే తప్పుబట్టడం సబబు కాదు.

పిల్లల విషయానికొస్తే, వారి అనుమతి గురించిన ప్రస్తావనే లేదు. చట్టం ప్రకారం, 16 ఏళ్ల లోపు వయస్సు గల అమ్మాయితో ఎలాంటి సంపర్కమైనా అది బలాత్కారంకిందే వస్తుంది. పిల్లలు అలాంటి సంఘటనలను మన దృష్టికి తెచ్చినపుడు ముందుగా వారిని అనుమానించడం, అవమానించడమే జరుగుతోంది. వారు చెప్పేదంతా అబద్దమనే భావనతోనే పెద్దలున్నారు. కానీ పెద్దలు పిల్లలు చెప్పింది విని, దాన్నిగురించి, పరిష్కారం గురించి నిదానంగా ఆలోచించాలి.

ఆధారం: అర్థమా ? పదార్థమా? పిల్లలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా పనిచేసే ఉపశాఖ, ఎన్జిఓ గ్రూప్ ఫర్ ద కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద ఛైల్డ్, జనవరి 2005.

పిల్లలపై లైంగిక హింసల ప్రభావం
పిల్లలపై ఈ లైంగిక హింసల ప్రభావం స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా ఉంటుంది.

 • పిల్లలపై దేహాలపై భౌతికంగా దెబ్బలు, గాయాలు, గీతలు, వాతలు వగైరా, మర్మాంగాలనించి రక్తం కారడం, లేక ఇతరమైన భౌతికంగా దెబ్బలు తగలడం.
 • పిల్లలు లైంగిక హింసల వల్ల ప్రభావం పొంది భయాందోళనలకు, తప్పుచేసినట్లు, ఒత్తిడికి లోనవడం, మర్మాంగాలు సరిగా పనిచేయకపోవడంవంటి వాటికి లోనై క్రమంగా కుటుంబాలకు దూరమౌతారు.
 • లైంగిక హింసలకు గురైన పిల్లలు పెద్దలతో సంబంధాలు నెలకొల్పుకోవడంలో, లైంగిక సంబంధాలలో ఇబ్బందులను నెదుర్కొంటారు
 • అన్నింటినీ మించి లైంగిక హింసలవల్ల బాధింపబడ్డ పిల్లలు వారి నమ్మకం దెబ్బతిని, తిరిగి మామూలుగా అవడానికి చాలా సమయం పడుతుంది. మానసికంగా వారిని తిరిగి సామాన్య స్థితికి తెస్తేనే వారికి మనుగడ. లేకపోతే, ఒక్కోసారి వాటి ప్రభావం వారి మిగిలిన జీవితాంతం ఉండిపోయి వారి మానవీయ సంబంధాలు దెబ్బతింటుంది.
విద్యావ్యవస్థలో అతిక్రమణలు

అ. శారీరిక శిక్షలు
అపోహ: శారీరిక శిక్షలు ఒక్కోసారి విద్యార్థులను క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియజెప్పడానికి వారిని శిక్షించడానికి తప్పనిసరిగా అవసరమౌతుంది. పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హక్కుంది.

నిజం: కట్టెను వదిలి పిల్లవాడిని చెడగొట్టు అనే వాతావరణంలో పెరిగారు పెద్దలు. మన పెద్దవాళ్లను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలా పెంచారు. కాబట్టి వీరూ అదొక హక్కుగా భావిస్తారు. కానీ, వారి చిన్నతనంలో వారు అనుభవించిన క్షోభను, వారు అనుభవించిన శారీరిక, హేయమైన శిక్షలను మర్చిపోతున్నారు.

పిల్లలలో క్రమశిక్షణ పెంచడానికి తరచూ శారీరిక శిక్షలే మార్గంగా ఎంచుకొంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర పాఠశాల సిబ్బంది వంటి పెద్దలు వేసే శిక్షలను అందుకోవడం తప్ప పిల్లలకు వేరే మార్గం లేదు. దాదాపు అన్ని పాఠశాలలూ పిల్లలను శిక్షించడానికి శారీరిక శిక్షలనే ఆయుధంగా ఎంచుకొంటున్నారు. ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లలను చావబాదుతున్నారు.

క్రమశిక్షణ పేరుతో, పిల్లలు వారి దంతాలు, ఎముకలూ విరగ్గొట్టుకొంటున్నారు. వారి జుట్టును పీకడం వంటి అమానుష చర్యలకు గురి అవుతున్నారు.

శారీరిక శిక్షలంటే, భౌతికమైన బలాన్ని వాడి పిల్లలకు నొప్పి కల్గించడమేగానీ, వారికి ఏకోశానా దెబ్బలు తగిలించడం కాదు. పిల్లలను సరిదిద్దడానికే దాన్ని పరిమితం చేస్తారు.

శారీరిక శిక్షలలో రకాలు
శారీరిక శిక్షలు:
1. పిల్లలచే గోడ కుర్చీ వేయించడం
2. స్కూలుబ్యాగులను తలపై పెట్టుకోమనడం.
3. ఎర్రటి ఎండలో వారిని రోజంతా నిలబెట్టడం.
4. పిల్లలని మోకాలిపై కూచొని పనిచేయమనడం.
5. వారిని బెంచిపై నిలబెట్టడం.
6. వారిని చేతులు పైకెత్తించి నిలబెట్టడం.
7. పెన్సిళ్లను నోటిపై ఉంచుకొని నిలబడమనడం.
8. కాళ్ల కిందనించి చేతులతో చెవులను పట్టుకొమ్మనడం.
9. పిల్లల చేతులను కట్టేయడం.
10. వారిని అదేపనిగా కూచోబెట్టడం, నిలబెట్టడం.
11. వారిని బెత్తంతో కొట్టడం, గిల్లడం.
12. చెవి మెలిపెట్టడం.

మానసికోద్వేగ శిక్షలు:
1. అబ్బాయిని అమ్మాయిచేత, అమ్మాయిని అబ్బాయిచేత చెంపదెబ్బలేయించడం.
2. పిల్లలను తిట్టడం, కొట్టడం, అవమానించడం.
3. పిల్లల చెడు ప్రవర్తననిబట్టి వారికో ముద్రవేయడం, వారిని బడిచుట్టు తిరగమని పంపేయడం.
4. పిల్లలను తరగతిలో వెనక్కివెళ్లి నిలబడి పనులను పూర్తిచేయమని చెప్పడం
5. పిల్లలను బడినించి కొన్నిరోజులు సస్పెండు చేయడం.
6. కాగితంపై ‘నేను మూర్ఖుడ్ని’ అనో ‘నేను గాడిదని’ అనో రాసి, ఆ పిల్లల వీపుకు ఆ కాగితాన్ని అంటించడం. వగైరా.
7. పిల్లలను తాను వెళ్లే అన్ని తరగతులకూ తీసుకెళ్లి అవమానించడం.
8. అబ్బాయిల చొక్కాలను విప్పించడం.

వ్యతిరేక ధోరణులు :
1. విరామ సమయంలో, భోజన సమయంలో పంపకపోవడం.
2. వారిని చీకటి గదిలో బంధించి తాళం వేయడం.
3. తల్లిదండ్రులను పిలిపించడం, లేదా వారినించి పిల్లలను వివరణలిస్తూ ఉత్తరాలు తెమ్మనడం.
4. వారిని ఇళ్లకు పంపడం లేదా బడి గేటుకి బైట నిలబెట్టడం.
5. పిల్లలను తరగతి గదుల్లో నేలపై కూర్చోపెట్టడం.
6. పిల్లలచేత బడి ఆవరణను శుభ్రం చేయించడం.
7. బడి లేదా ఆటస్థలం చుట్టూ పరిగెత్తించడం.
8. ప్రధానోపాధ్యాయుని వద్దకు పిల్లలను పంపడం.
9. పిల్లలచేత పాఠం చెప్పించడం.
10. ఉపాధ్యాయుడొచ్చేదాకా వారిని తరగతిలో నిలబెట్టడం.
11. హెచ్చరించడం, డైరీలో, క్యాలెండర్లో రాయడం.
12. పిల్లవాడికి టీసీ ఇచ్చేస్తానని బెదిరించడం.
13. ఆటపాటలకు పంపకపోవడం.
14. మార్కులు తగ్గించడం.
15. మూడు సార్లు లేటుగా వస్తే దాన్ని ఒక రోజు పూర్తి గైరుహాజరుగా తీసుకోవడం.
16. విపరీతంగా ఇంపోజిషన్ ఇవ్వడం.
17. పిల్లలతో ఫైన్ కట్టించడం.
18. తరగతి గదుల్లోకి అనుమతించకపోవడం.
19. ఒక రోజునుంచి ఒక వారం లేక నెలరోజులు ఒక పిరీయడంతా నేలపై కూచొపెట్టడం.
20. పిల్లల క్రమశిక్షణా రిపోర్టుల్లో బ్లాక్ మార్క్ వేయడం.

ఆధారం: శారీరిక శిక్షలు : పాఠశాలల్లో చిన్న పిల్లల హక్కులను అతిక్రమించడం- రచయిత - ప్రొ. మాడభూషి శ్రీధర్, నాల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

శారీరిక శిక్షలు చిన్న పిల్లలకెలాంటి హాని చేస్తాయి?

పిల్లల మనస్సులపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కసి, భయాందోళనలకు దారితీస్తుంది. అలాంటి శిక్షలకు గురికావడం వల్ల వారిలో ఆగ్రహం, కోపం, ఆత్మన్యూనతాభావం వస్తుంది. తత్ఫలితంగా నిస్సహాయతను చూపుతూ అవమానంతో కుంగిపోయి పిల్లల ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొంటారు. ఇది పిల్లల సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వకపోగా, వారిలో పగ, ప్రతీకారంవంటి వాటిని

పిల్లలు పెద్దలు చేసేదాన్ని అనుకరించవచ్చు. హింసే మంచిదన్న భావన వారిలో కల్గవచ్చు. ఫలితంగా వారి పెద్దలపైనే పిల్లలు దాడికి దిగవచ్చు. చిన్నతనంలో ఇలా హింసలకు గురిఅయిన వారు ఎదిగాక అలాంటి హింసలనే వారి తోటివారిపైనా కుటుంబీకులపైనా ప్రయోగించే అవకాశాలున్నాయి.

శారీరిక శిక్షలనేవి క్రమశిక్షణనేర్పడానికి వాడే మార్గం కాదు. ఇది చాలా అరుదుగా మాత్రమే క్రమశిక్షణలోకి తేవడానికి పనికొస్తుంది. పిల్లల విషయంలో ఇది మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుంది. పిల్లలను దండిస్తే, వారు ఆతప్పును మళ్లీ చేయరనడంలో కొంత నిజం ఉన్నా, అలా దండించడంవల్ల వారికి ఆ విషయాన్ని పూర్తిగా అర్థచేసుకొనే అవకాశాన్ని మాత్రం ఇవ్వదు. నిజం చెప్పాలంటే, దీనివల్ల పిల్లలపై ఇది అనేక దుష్ప్రభావాలనే చూపుతుంది.

చాలామంది వీధి బాలురు, పనిచేసే పిల్లలు తాము ఇంటి నుంచి, కుటుంబాల నుంచి పారిపోవడానికి శారిరిక హింసలే కారణం అని చెప్పారు.

పిల్లల క్రమశిక్షణ హక్కు అనేది వారి అభివృద్ధి హక్కును, పాల్గొనే హక్కులను కాలరాసే విధంగా ఉండకూడదు. నిజానికి పిల్లల పాల్గొనే హక్కు ద్వారానే వారిలో క్రమశిక్షణ నెలకొంటుంది. ఏదెలా ఉన్నా, శారీరిక శిక్షలను ఎలాంటి మతమూ, న్యాయమూ సమర్థించట్లేదు. పిల్లలను మనం నియంత్రించలేకపోయినంత మాత్రాన, పిల్లలను భౌతికంగా హింసించడానికి మనకెలాంటి న్యాయపరమైన, నీతిపరమైన హక్కు లేదు.

 • క్రమశిక్షణ ఎవరో చెబితే రాదు, దాన్ని నేర్చుకోవాల్సిందే.
 • క్రమశిక్షణ అనేది ఒక వైఖరి, లక్షణం, బాధ్యత లేదా కట్టుబాటు.
 • క్రమశిక్షణ అనేది మౌలికంగా అంతర్గతంమైంది. దానిని పాటించమని చెప్పడం భౌతికమైన పని.
పరీక్షల ఒత్తిడి, విద్యార్థుల ఆత్మహత్యలు

అపోహ : భారతీయ విద్యా వ్యవస్థ వల్ల ఉత్పత్తి అయ్యే వారి వైపు ప్రపంచమంతా ఉత్కంఠతో చూస్తోంది. తత్ ఫలితంగా చాలామంది భారతీయ మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇంకా ఇతర ఉద్యోగాలకు వెళ్లేవారు వీరంతా పాశ్చాత్యదేశాల్లో స్థిరపడ్డారు. వారిలో చాలామంది ఇక్కడా జైత్రయాత్రను సాగిస్తున్నారు. కఠోర క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంపొందించే పరీక్షా విధానం వారి విజయాలకు సోపానాలు. తల్లిదండ్రులంతా వారి పిల్లలను చక్కని ఫలితాలనిచ్చే బడుల్లో చేర్చాలనుకొంటున్నారు.
నిజం: ప్రపంచంలో కెల్లా అత్యుత్తమమైన మేధావులను మన భారతదేశం తయారుచేస్తోంది. అందులో సందేహం లేదు. కానీ ఆ ప్రతిభ ఎవరిది? ప్రస్తుత బడుల పనితీరా, విద్యా వ్యవస్థదా లేక అన్ని రకాల కుటుంబ, సమాజ ఒత్తిడులకు తట్టుకొని, ఎంతో శ్రమించి చదివిన పిల్లలదా? విపరీతమైన పోటీ, పిల్లలలో పెరిగిపోతున్న ఆశల ఒత్తిడివల్ల, పాఠశాలల, ఉపాధ్యాయుల మనుగడకు మంచి ఫలితాలను సంపాదించడమనేది ముఖ్యమైపోయింది. అందువల్ల విద్యార్థుల్లో రకరకాల ఒత్తిడులు పెరిగిపోతున్నాయి. వాటిని తట్టుకోలేని ఫలితంగా విద్యార్థులలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . మేధస్సు చనిపోతోంది. మనం ఇప్పటికైనా ఈ నిజాన్ని గుర్తించి కళ్లు తెరవకపోతే, ఎంతోమంది ప్రతిభావంతునైన ఒక తరాన్నే కోల్పోవాల్సి వస్తుంది.

కొందరు విద్యార్థులకు సిబిఎస్సి పరీక్షల తర్వాత జీవితమే లేదు...

సిబిఎస్సి పది, పన్నెండు తరగతుల పరీక్షాఫలితాలను వెల్లడించిన 5 రోజులలోనే దేశ రాజధానిలో కనీసం అర డజను విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వార్తను చదివేసేలోగా పరీక్షల్లో ఫెయిలైన మరెంతమంది ఆత్మహత్యలకు పాల్పడతారో తెలీదు.

విద్యార్థుల్లో పెరిగిపోతున్న ఆత్మహత్యలధోరణి చాలా ప్రమాదకారిగా మారుతోంది. “గతంలో డిప్రెషన్‌ని తెలిసీతెలియని వయస్సుకు ముడిపెట్టేవారు కాదు. ఇపుడిపుడే అతి కొద్దిగా ఆ మార్గంలో ఆలోచిస్తున్నారు” అంటున్నారు డా. జిలోహా. ఆయన జిబి పంత్, మౌలానా ఆజాద్ వైద్యకళాశాలలో సైకియాట్రీ విభాగాధిపతి, ప్రొఫెసర్ కూడా. ఈ సమస్య ఆ వయస్సులోనే ఎక్కువగా ఉంటుంది. తెలిసీతెలియని వయస్సు. అర్థమూ కాదు, ఫెయిలైనందుకు బాధపడకుండా ఉండనూ లేరు.... అంటారు శ్రీమతి శర్మ అనే టెలీ కౌన్సిలర్. ఆమె ఇలా అంటారు “తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ కౌన్సిలింగ్ ప్రాముఖ్యతని తెల్సుకోవాలి. పరీక్షా ఫలితాలే జీవిత పరమావధి కాదు. ప్రపంచానికంతం కాదు. పరీక్షలు పాడుచేసినంత మాత్రాన కుంగిపోవాల్సిన పనేం లేదు. ఈ విషయమే తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ అర్థం చేసుకోవాలి”.

ఆధారం: స్మృతి కక్, ద ట్రిబ్యూన్, చండీగఢ్, ఇండియా, శుక్రవారం, మే 31, 2002,

మంచి ఫలితాలు చూపే పాఠశాలలకే తల్లిదండ్రులు తమ పిల్లలలను పంపాలనుకొంటారు. అందులో సందేహమే లేదు. అంతవరకూ మంచిదే. ఐతే, అది పిల్లవాడి ఉనికికే ప్రమాదకారి ఐతే ఎలా అని ఎవరైనా అడిగితే? ఏపిల్లవాడి తల్లిదండ్రీ అలా జరగడానికి ఒప్పుకోరు. నిజానికి తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ అవసరంమని ఇది చెబుతోంది. కానీ బడిలో ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగితే, అందరు పిటిఏలు పిల్లవాడెంత బాగా చదువుతున్నాడో/ చదవట్లేదో అనేదానిమీదే దృష్టి పెడితే లేక ఉపాధ్యాయులు తోటి విద్యార్థితో ఒక విద్యార్థిని పోల్చడం మానకపోతే, తన విద్యార్థి మనోభావాలను, ఉద్వేగాన్నీ దృష్టిలో ఉంచుకోకపోతే, ఇక పరిస్థితులనెవ్వరూ బాగుచేయలేరు. ఈ విషయంలో పాఠశాలలు తొలి అడుగు వేయాలి. అవసరమైతే, పాఠశాలలే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేయనారంభించాలి

అపోహలూ - నిజాలూ : వీధి బాలురు, పారిపోయివచ్చిన పిల్లలు

అపోహ : కేవలం బీద కుటుంబాల పిలల్లే పారిపోయివచ్చి వీధి బాలలుగా మారతారు. వీధుల్లో నివసించే పిల్లలంతా చెడ్డవారు.
నిజం : ఎలాంటి చిన్నపిల్లలైనా వారిని ఎవరూ పట్టించుకోకపోతే పారిపోవచ్చు. ప్రతివానికీ గౌరవంగా బతికే హక్కుంది. ఏ తల్లిదండ్రైనా, కుటుంబమైనా, బడి లేదా గ్రామం అలా పిల్లల హక్కుకుభంగం కల్గిస్తే, వారు ఆ పిల్లలను కోల్పోవలసి వస్తుంది.

వీధి పిల్లల్లో హెచ్చు శాతం అలా పారిపోయివచ్చినవారే. ఇల్లు వదిలి మెరుగైన జీవితం కోసం లేదా అవకాశాల కోసం లేదీ మెట్రోలపై మోజులో, పెద్దల ఓత్తిడి తట్టుకోలేక లేదీ విద్యా విధానంలోని ఒత్తిడికి తట్టుకోలేక, గృహ హింసలకు తట్టుకోలేక నగరాలకు చేరతారు. నగరాల్లో వారి జీవితం మరింత దుర్భరమైపోతోంది.

వీధి బాలలు చెడ్డవారు కారు. వారున్న స్థితిగతులు మాత్రం బాగాలేవు.
ఈ పిల్లలు రెండుపూటలా పట్టెడు అన్నం సంపాదించుకోలేకపోతున్నారు. పైగా వివిధ రకాల హింసలకు, అవమానాలకూ బలైపోతున్నారు. ఒకసారి వీధిలోపడ్డాక వారు ఇంకొకరి స్వార్థానికీ, రకరకాల సమస్యలకు బలైపోతున్నారు. తమకన్న పెద్ద పిల్లలతోపరిచయం ఏర్పడి కొత్తగా పారిపోయి వచ్చిన పిల్లలు చెత్త ఏరే పనులకు అలవాటైపోతున్నారు. లేదా సులభంగా ఏ పనిదొరికితే దానికి అలవాటుపడుతున్నారు. అదీ లేదంటే అక్రమ మార్గాలు అంటే, జేబులుకొట్టడం, అడుక్కోవడం, మాదకద్రవ్యాలు అమ్మడం వగైరాలకు అలవాటు పడుతున్నారు.

పిల్లలు వారి ఇళ్లనుంచి పారిపోయే దానికి ఎన్నో కారణాలు :

 • మెరుగైన జీవితావకాశాలు లేక పోవడం
 • నగరాల గ్లామర్స్ పై మోజు
 • సమతుల్యుల ఒత్తిడి
 • అనారోగ్యకరమైన కుటుంబ సంబంధాలు
 • వారి తల్లితండ్రులే వదిలేయడం
 • తల్లితండ్రులు లేదా ఉపాధ్యాయులు కొడతారేమోనన్న భయం.
 • లైంగిక హింసలు
 • కుల వివక్షత
 • లింగ వివక్షత
 • అంగ వైకల్యం
 • హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వల్ల వివక్షత

2003-04లో మౌలానా ఆజాద్ కాలేజీ ఢిల్లీలోని ఒక అబ్జర్వేషన్ హోమ్‌లో మగవారిలో లైంగిక హింస ఏమోతాదులో, ఏరకంగా జరుగుతోందో అంచనా వేయడానికి ఒక అధ్యయనం చేసింది. దాని ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆ మగ పిల్లల్లో హెచ్చుశాతం పారిపోయివచ్చినవారే. వారిలో 38.1 % లైంగికహింసలకు గురైనవారే. 61.1% భౌతికంగా గురికాగా, 40.2 % ప్రవర్తనలలో తేడాలొచ్చినట్లు వైద్య పరీక్షలలో తేలింది. బలవంతంగా సెక్సుకు గురైనట్లు 44.4% బాధితులు, 25% బాధితులు సుఖరోగాలకు గురైనట్లు తేలింది. వీరిని హింసించినవారు ఎక్కువ అనామకులే .

అపోహలూ - నిజాలూ : హెచ్ఐవి / ఎయిడ్స్

అపోహ : హెచ్ఐవి / ఎయిడ్స్ అనేది కేవలం పెద్దలకు సంబంధించిన విషయం. పిల్లలకేం సంబంధం లేదు. పిల్లలకు దీనిగురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి / ఎయిడ్స్, పునరుత్పత్తి ఆరోగ్యం, సెక్స్ లాంటి విషయాలగురించి వారికి తెలియజెప్పడంవల్ల వారి మనస్సులు కలుషితమౌతాయి. హెచ్ఐవి / ఎయిడ్స్ ఉన్న కుటుంబాలనుంచి ఎవరన్నా పిల్లలు వచ్చినపుడు వారిని కాస్త దూరంలో ఉంచి హెచ్ఐవి / ఎయిడ్స్ వ్యాపించకుండా జాగ్రత్తపడాలి.

నిజం : హెచ్ఐవి / ఎయిడ్స్ రావడానికి పెద్దా చిన్నా అనిగానీ, వయస్సుతో, రంగుతో, కులంతో, మతంతో, భౌగోళిక స్థితిగతులతో, మంచిచెడులతో నిమిత్తంగానీ లేదు. ఎవరికైనా అది సోకవచ్చు.

హెచ్ఐవి అంటే, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సి వైరస్ అనేది ఎయిడ్స్ కారకం. ఇది ఒక హెచ్ఐవి ఉన్న మనిషితో శారీరిక సంబంధం ఏర్పడ్డపుడు ఆద్రవాలు ద్వారా , పాల ద్వారా తల్లినుండి బిడ్డకు రక్తం ద్వారా మరో వ్యక్తికి సోకుతుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకిన ఇంజక్షన్ సూదులవల్ల, డ్రగ్స్ తీసుకొనే వారి ఇంజక్షన్ సూదులవల్ల, పచ్చబోట్టు వల్ల లేదా దేహాన్ని గుచ్చడంవల్ల ఇది సోకుతుంది.

నేడు మిలియన్ల సంఖ్యలో పిల్లలు హెచ్ఐవి / ఎయిడ్స్ వల్ల బాధపడుతున్నారు. పిల్లలు అనాథలౌతున్నారు. తల్లిదండ్రుల మరణంవల్ల పిల్లలు వారి ప్రేమకు, రక్షణకూ దూరమౌతున్నారు.

తల్లుల నుండి పిల్లలకు ఇది సోకడం సాధారణమైపోగా పిల్లలపై లైంగిక హింసలవల్ల మరింతమంది పిల్లలు హెచ్ఐవి / ఎయిడ్స్ బారిన పడుతున్నారు. పిల్లలలో ఔషధాల దుర్వినియోగం మరో తీవ్రమైన సమస్య. ఇలాంటి పరిస్థితులలోహెచ్ఐవి / ఎయిడ్స్ గురించిన సమాచారం పిల్లలకు దూరంగా ఉంచడం, దానినుంచి వారు తమనుతాము రక్షించుకోవడం ఎలాగో తెలుసుకొనే హక్కును మనం దూరంచేయడం సబబు కాదు.

ఆసియాదేశాల్లో హెచ్ఐవి / ఎయిడ్స్ బాధితులలో భారతదేశానిదే అగ్రస్థానం. తర్వాతి స్థానం చైనాది. యుఎన్ ఎయిడ్స్ ప్రకారం ఇండియాలో 0-14 ఏళ్ల వయస్సులోని 0.16 మిలియన్ల పిల్లలు హెచ్ఐతో బాధపడుతున్నారు.

వార్తాపత్రికల కథనాల ప్రకారం, కేరళలలోని పరపప్నన్గడిలో తండ్రి ఎయిడ్స్ తో మరణించడంవల్ల ప్రభుత్వ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలోకి 6ఏళ్ల బబితా రాజ్‌ని రానీయలేదు. పేరంట్స్-టీచర్ అసోసియేషన్, పాఠశాల యాజమాన్యం ప్రతిఘటించడంతో ప్రభుత్వ అధికారులు ఆ అమ్మాయిని తిరిగి అడ్మిట్ చేసుకోలేదు. స్థానిక ప్రభుత్వం, సాంఘిక సేవా కార్యకర్తలు చొరవ తీసుకొన్నా ఫలితం లేకపోయింది. ఆ అమ్మాయికి ఎయిడ్స్ లేదని మెడికల్ సర్టిఫికేట్ తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలలోకూడా ఆ అమ్మాయిని రానీయలేదు.

ఆధారం: Future Forsaken, Human Rights Watch, pg. 73, 2004

హెచ్ఐవి అనేది ఆ రోగిని తాకినంత మాత్రానో, వారి పక్కన కూచున్నంత మాత్రానో, వారిని వాటేసుకొన్నంత మాత్రానో, వారితో ఆడుకొన్నంతనో మనకు అంటుకోదు.

పిల్లలకు సమాచార హక్కు, భాగస్వామ్య హక్కు అనేవి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అనే సిద్ధాంతాలపై ఆధారపడ్డాయి. అందువల్ల సెక్సువాలిటీ, పునరుత్పత్తిలో ఆరోగ్యం లేదా హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి అంశాలగురించి చర్చించేటపుడు పిల్లల వయస్సును దృష్టిలో ఉంచుకోవాలి. నిజమేమిటంటే, మనం పిల్లలు అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగాలేం. అందువల్ల దానిపై ఎలాంటి చర్చలకూ విముఖత చూపుతాం. లైంగికవిద్య గురించి తెలియజేసే జీవిత నైపుణ్య విద్య ప్రాముఖ్యాన్ని చెప్పేకన్నా మనల్ని మనం సిద్ధపర్చుకోవాలి.

ప్రజలను హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి చైతన్యవంతుల్ని చేయడానికి బదులుగా, గతంలో చాలా పాఠశాలలలో పిల్లలను బడికి రానీకుండా నిషేధించారు. కారణం వారి కుటుంబాలలో ఎవరికో హెచ్ఐవి/ఎయిడ్స్ ఉండిఉండటమో లేక ఎవరికన్నా హెచ్ఐవి పాజిటివ్ సూచనలుండటము. హెచ్ఐవి/ఎయిడ్స్ కారణంగా వారికి మౌలిక సౌకర్యాలను నిషేధించడం అంటే, వారిపట్ల వివక్షత చూపడమే. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, అవివక్షత హక్కులను కల్పిస్తోంది. ఏకారణం చేతైనా అసమానతలను వివక్షతలనూ ప్రోత్సాహించేవారు శిక్షార్హులు.

హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తి గురించి తెలియగానే అతనికి వెంటనే వైద్య సహాయాన్ని అందేలా చూసి, అతను ఎక్కువ రోజులు బతికేలా చూడాలి. అతను ఆ వైరస్ మరొకరికి అంటించకుండా చూడాలి. నిజానికి అలాంటి పిల్లలను బడినుంచి వెలివేస్తే వారి ఆరోగ్యాన్ని చూసేవారుండరు. అది మరింత ప్రమాదకారి. ఏవిధంగానూ వివక్షత చూపడం అనేది సమస్యకు పరిష్కారం కాదు.

అపోహలూ & నిజాలూ - కుల వివక్షత

అపోహ: అంటరానితనం, కులవివక్షత అనేవి నేడు గత చరిత్రగా మిగిలిపోయాయి. ఏదెలా ఉన్నా, దళిత /షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ జాతి విద్యార్థులు వారికున్న రిజర్వేషన్ల మూలంగా ఎలాంటి వివక్షతా లేకుండా హాయిగా ఉన్నారు.

నిజం: ఇది నిజం కాదు. ఒక వ్యక్తికి కులవివక్షతవల్ల హింస చాలా మొదటిదశలోనే ఎదురౌతుంది. వారు వివక్షతను ఎదుర్కోవడానికి స్థలాలుగా బడుల్లో, ఆటస్థలాల్లో, వైద్యశాలల్లో - ఇలా ఎన్నైనా చెప్పుకొంటూ పోవచ్చు. బీదవారిపట్ల, సమాజంలో నిమ్నజాతివారిపట్ల వివక్షతను చూపడాన్ని మనం ఎదుర్కోవాలి. దానికి దళిత /షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ జాతి వారికి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులుండేలా మనం చూడాలి. ముఖ్యంగా వారు విద్యపొందే హక్కు, ఆరోగ్య రక్షణ, బాలకార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలివ్వడం, మరుగుదొడ్లను వారు చేతితో శుభ్రంచేయడంవంటి వాటిని నిషేధించడం ద్వారా సాయపడవచ్చు.

అపోహలూ & నిజాలూ - అంగవైకల్యం

అపోహ: అంగవైకల్యం అనేదొక శాపం. అంగవైకల్యం ఉండే పిల్లల వల్ల ఉపయోగం లేదు. వారు కుటుంబానికి భారం కావడమే కాదు, వారివల్ల ఆర్థికంగా అనుత్పాదకతే. అందువల్ల వారికి విద్య నేర్పడం దండగ. నిజానికి చాలా అంగవైకల్యాలకు నివారణ లేదు.

నిజం: అంగవైకల్యానికీ గతానికీ సంబంధం లేదు. అది తల్లి కడుపులో ఉన్నపుడో లేక సరైన రక్షణలేకపోవడంవల్లో వస్తుంది. ఒక్కోసారి వంశపాపరంపర్యంగా రావచ్చు. అవసరమైనపుడు సరైన వైద్యం అందకపోవడం, సరైన టీకాలు వేయించకపోవడం, ప్రమాదాలు, దెబ్బలు తగలడంవంటి ఇతర కారణాలను మర్చిపోరాదు.

మానసికంగా లేదా భౌతిక (అంగ) వైకల్యం ఉన్న వ్యక్తిపట్ల అంతా సానుభూతి చూపుతారు. ఐతే అతనికీ హక్కులున్నాయన్న సంగతి మాత్రం మనం అందరమూ మర్చిపోతాం. వారికి సానుభూతి కన్నా అనుభూతి శక్తి కావాలి.

తరచూ మనం వైకల్యాన్ని మనం మాయనిమచ్చతో పోలుస్తాం. మానసిక రోగి ఉన్న ఒక కుటుంబాన్ని వెలివేయడమేకాక వారిని సమాజం చిన్నచూపు చూస్తుంది. విద్య అందరికీ ముఖ్యమేకాక, ప్రతి పిల్లవానికీ, వానికి వైకల్యం ఉన్నా సరే, తప్పనిసరిగా విద్య పొందే హక్కుంది. ఎందుకంటే, అది పిల్లవాని అభివృద్ధికి దోహదపడుతుంది. వైకల్యం ఉన్న వారి అవసరాలు వేరేగా ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాలి. అవకాశం ఇస్తే, వారు కూడా జీవనోపాధి కల్పించుకొనే నైపుణ్యాన్ని సంపాదించుకోగలరు. మనం వారికి ఎలాంటి సౌకర్యాలూ ఏర్పర్చకపోతేనే వారి వైకల్యం అనేదొక విషాదగాధగా మిగిలిపోతుంది.

 • 2001 జనాభాలెక్కల ప్రకారం, 0-19 వయో పరిమితిలో ఉన్న పిల్లలలో 1.67 శాతం పిల్లలు వైకల్యంతో అవస్థపడుతున్నారు.
 • ప్లానింగ్ కమీషన్, 10వ పంచవర్ష ప్రణాళికా డాక్యుమెంట్ ప్రకారం, 0.5 నుంచి 1.0 శాతం పిల్లలు మానసికంగా మందగిస్తున్నారు.

వైకల్యం గల పిల్లలకు విద్యా వ్యవస్థలో ఎదురయ్యే సమస్యలు
 • మానసికంగా లేదా భౌతిక (అంగ) వైకల్యం ఉన్న పిల్లలకోసం ప్రత్యేక బడులులేక పోవడం.
 • సాధారణంగా వైకల్యం ఉన్నవారు నెమ్మదిగా నేర్చుకొంటారు. బడులలో వారి కోసం ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఉండాలి. అది జరగడం లేదు.
 • పైస్థానాల్లో ఉండేవారు వీరిపట్ల ప్రేమ చూపడంలేదు. సాధారణంగా మానసికంగా లేదా భౌతిక (అంగ) వైకల్యం ఉన్న పిల్లలను వారు నెమ్మదిగా నేర్చుకోవడంవల్లనో లేక వారి అవయవలోపంవల్లనో అందరూ వారిని వెక్కిరిస్తూంటారు.
 • వైకల్యం ఉన్నవారి కోసం ర్యాంప్‌లు, ప్రత్యేక కుర్చీలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం.

సరైన పద్ధతులలో వారికి శిక్షణనిస్తే వారు బాగా నేర్చుకొని మెరుగైన జీవనోపాధినిపొందగలరు. పైగా, వారి వైకల్యాన్ని సరైన సమయంలో గుర్తించితే , చాలామటుకు వైకల్యాలను నివారిచవచ్చు లేదా తగ్గించవచ్చు.

పోరులు, మానవ నిర్మిత వినాశాలు
ప్రతి బడి, ప్రతి ఉపాధ్యాయుడు పోరు(లేదా యుద్ధం), రాజకీయ అనిశ్చితి, యుద్ధం లేదా సమాజ విపత్తు జరిగిన సందర్భాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణా కల్పించాలి. ఐతే, సమాజం దాన్ని గుర్తించినపుడే అది సాధ్యం.

పిల్లల పరిరక్షణ - చట్టం

ఇంతకుముందే చర్చించినట్లు, పిల్లలకు వారిని స్వార్ధానికి వాడుకొనేవారి నుంచి, ప్రమాదకర పరిస్థితులనుంచి తమని తాము కాపాడుకొనే హక్కుంది. ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఆయా విషయాలకు ఎలా స్పందిచాలో తెలుసుకోవాలి.అది మీరు పిల్లల గురించి వారికెదురయ్యే ప్రమాదకర పరిస్థితులగురించి, న్యాయ చట్టాలలో ఉన్న వాటి పరిష్కారాల గురించి చర్చించినపుడే సాధ్యమౌతుంది.

పిల్లలకు న్యాయ సహాయం, రక్షణా అవసరం కావచ్చు. అది పిల్లవానికి అవసరమైనపుడు లభించనీయకుండా చేయడం అనేది మనమంతా చేస్తున్న సాధారణ తప్పు,

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - సాంఘిక న్యాయం కన్నా కుటుంబం/ సముదాయం/ సమాజం / శక్తివంతమైన రాయబారం - ఇవన్నీ చేసే బెదిరింపులూ, తిరస్కారాల భయం ముఖ్యమా ?

2003 సంవత్సరంలో కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామం నుంచి ఇద్దరు మైనర్లకు వివాహం జరపడాన్ని 5మంది అమ్మాయిలు ఆపగలిగారు. ఆ పెళ్లిని, అమ్మకాన్ని ఆపాలని నిశ్చయించుకొన్నాక వారు వారి ఉపాధ్యాయుడు న్యాయ పరమైన చర్యలు తీసుకొనేలా సాయాన్ని అందించారు. పెళ్లి ఆగిన వారి కుటుంబాల నుంచి, గ్రామ పెద్దలనుంచి, మొత్తం సముదాయంనుంచీ వారికి ప్రతిఘటన ఎదురైంది. ఆ అమ్మాయిలకు వారి కుటుంబాల నుంచే హెచ్చరికలు అందాయి. అడుగడుగునా అడ్డం తగిలారు. మొదట్లో పోలీసులుకూడా సాయంచేయడానికి, నేరస్థులను పట్టుకోడానికి ముందుకు రాలేదు. అన్ని రకాలుగా విఫలం అయ్యేక బడి ఉపాధ్యాయుడు సాయాన్ని అర్థిస్త్తూ స్థానిక మీడియాకు ఉత్తరం రాశాడు. చివరికి పోలీసులు రంగప్రవేశంచేసి ఆ పెళ్లిని ఆపాల్సివచ్చింది. దోషులని శిక్షించారు. ఈ 5 గురు అమ్మాయిలకూ జాతీయ స్థాయిలో ధైర్యసాహసాలకై ఇచ్చే అవార్డు లభించింది. ఇందులో ఆ బడి ఉపాధ్యాయుని పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే, ఆయన సాయం లేనిదే ఆఅమ్మాయిలకు సముదాయంపై ఎలాంటి ప్రతిఘటననీ చూపలేకపోయేవారు. నిజం చెప్పాలంటే, ఆ ఉపాధ్యాయుడు తన ఉద్యోగాన్నే కాదు, ప్రాణాలనీ లెక్క చేయకుండా సాయంచేశాడు. చిన్నపిల్లలను రక్షించాలన్నా తపనే ఆయనచేత ఆ పనిని చేయించింది .

బహుశా ఈ కింది పనులు చేయడంవల్ల మీరు న్యాయపరమైన చర్యలు మొదలెట్టడానికి సాయం చేయవచ్చు:
 • పోలీసులకిగానీ, చైల్డ్ లైన్ కి గానీ తెలియజేయండి.
 • చైల్డ్ లైన్ ఆ పిల్లలకు కౌన్సిలింగ్, న్యాయ సేవలను అందించేలా చూడండి.
 • సమాజాన్ని పోగుచేయండి.
 • సమాచార సాధనాలకు చివరి ఆశగా మాత్రమే రిపోర్టు చేయండి. మీ చట్టాన్ని తెల్సుకోండి.

మూల న్యాయచట్టాలను, అవి హక్కులనెలా కాపాడతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హక్కులనూ, లభ్యమయ్యే న్యాయ పరిరక్షణ వంటివాటి గూర్చి సమగ్రంగా తెలుసుకొంటేనే పిల్లలకు గానీ, వారి పెద్దలకు గానీ సంరక్షకులకిగానీ లేదా సమాజానికిగానీ సర్దిచెప్పడానికి న్యాయపరమైన చర్యలను తీసుకోవడానికి వీలౌతుంది. ఒక్కోసారి పోలీసు/నిర్వహణా యంత్రాంగం కూడా క్లిష్టపరిస్థితులు కల్పించవచ్చు. అలాంటపుడు న్యాయచట్టాలగురించి బాగా అవగాహన కల్గి ఉండటం వల్ల వాటిని సులభంగా అధిగమించవచ్చు.

లింగ నిర్ధారణ - వాంఛిత గర్భస్రావం, ఆడపిల్లలను గర్భంలో/ పుట్టగానే చంపేయడం

పిల్లల లింగ నిర్ధారణ చేసి వాంఛితంగా గర్భస్రావాన్ని కోరుకొనేవారిని న్యాయపరంగా విచారించే ముఖ్యమైన చట్టంగా ప్రీనేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్(రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూస్) యాక్ట్,1994 ప్రవేశ పెట్టారు.

 • ఇది లింగనిర్ధారణ చేసే పద్ధతులను వాడి గర్బస్థ శిశువులపై పరీక్షలు చేసి పిండాన్ని చంపడం, అలాంటివాటికి ప్రచారాన్ని కల్పించడం -వంటివాటిని నిషేధిస్తుంది.
 • ఇది లింగనిర్ధారణ చేసే పద్ధతులను వాడి జన్యుపరమైన వైపరీత్యాలను తెలుసుకోవడానికి లేదా లోపాలను కనుక్కొనేదానికి కొన్ని తప్పని పరిస్థితులలో గుర్తింపున్న సంస్థలను మాత్రమే అనుమతిస్తుంది.
 • ఇది లింగనిర్ధారణ చట్టాన్ని అతిక్రమించి పనిచేసేవారిని శిక్షిస్తుంది.
 • అలాంటి నేరం చేసిన సంఘటనలగురించి ఎవరైనా సరే, ముందు తత్సంబంధిత అధికారులకు సరైన చర్య తీసుకోవడానికి కనీసం 30 రోజులు తక్కువ కాకుండా వ్యవధినిస్తూ, లేదంటే కోర్టుకి ఫిర్యాదు చేస్తామని చెబుతూ ఫిర్యాదు చేయాలి.

ఈ చట్టం కాకుండా ఇండియన్ పీనల్ కోడ్, 1860 లో ఉండే కింది సెక్షన్లు కూడా ముఖ్యమైనవే :

 • ఒక మరణం ఒక వ్యక్తి వల్ల సంభవించినపుడు (సెక్షన్స్ 299, 300)
 • ఒక గర్భవతి తానే గర్భస్రావానికి పాల్పడటం(సెక్షన్ 312)
 • ఒక బిడ్డను పుట్టకుండా చేయడం, పుట్టాక చంపడం వంటి చర్యలకు పాల్పడటం ( సెక్షన్ 315).
 • ఒక పుట్టని బిడ్డను చంపడం(సెక్షన్ 316).
 • 12ఏళ్ల లోపు బిడ్డకు అపాయాన్ని కల్గించడం, లేదా వదిలేయడం(సెక్షన్ 317).
 • ఒక బిడ్డ పుట్టుకను దాచిపెట్టి, రహస్యంగా ఆ బిడ్డ దేహాన్ని మాయం చేయడం(సెక్షన్ 318).

ఇలాంటి నేరాలకు 2ఏళ్లనుంచి జీవితాంతం ఖైదు చేయడం, జరిమానా చెల్లించడం లేదా రెండూ అవకాశం ఉంది.

బాల్య వివాహం

బాల్య వివాహ నిర్భంధ చట్టం, 1929 ప్రకారం 21ఏళ్లలోపు వయస్సున్న మగవారు, 18ఏళ్లలోపు వయస్సున్న ఆడవారిని పిల్లలుగా పరిగణించడం జరుగుతుంది.(సెక్షన్2(ఏ)).

ఈ చట్టం ప్రకారం బాల్య వివాహం జరిపించడానికి దోహదపడిన అనేకులు ఆ పెళ్లి జరిపించడానికి
అనుమతించడం, కుదర్చడం, చేయడం లేదా అందులో పాల్గొనడం వంటి చర్యలకు పాల్పడ్డవారు శిక్షార్హులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 • బాల్య వివాహం చేసుకొనేది మగవాడైతే, అతని వయస్సు 18 ఏళ్లపైబడి, 21 ఏళ్లలోపు ఉంటే 15 రోజుల జైలు శిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు(సెక్షన్ 3).
 • బాల్య వివాహం చేసుకొనేది మగవాడైతే, అతని వయస్సు 21 ఏళ్లపైబడితే, 3నెలల దాకా జైలు శిక్ష , దానితోబాటు జరిమానా విధించవచ్చు(సెక్షన్ 4).
 • బాల్య వివాహం చేసే వ్యక్తి తాను చేస్తున్నది బాల్యవివాహం కాదని రుజువుచేయలేని పక్షంలొ 3 నెలల దాకా జైలు శిక్ష , దానితోబాటు జరిమానా విధించవచ్చు(సెక్షన్ 5).
 • బాల్య వివాహం చేయడానికి తల్లిదండ్రులు లేదా ఆ పిల్లల సంరక్షకులు అనుమతిస్తున్నా , నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారికి శిక్ష విధించవచ్చు(సెక్షన్ 6).

ఒక బాల్య వివాహాన్ని ఆపగలమా?
బాల్య వివాహ నిర్భంధ చట్టం, 1929 ప్రకారం, ఎవరన్నా సరే బాల్య వివాహం జరుగుతోందనిగానీ, జరగబోతోందనిగానీ తెలిసి ఆవిషయాన్ని పోలీసులకు తెలియజేసి దాన్ని ఆపించవచ్చు. పోలీసులు ఆ తర్వాత విచారణ చేపట్టి విషయాన్ని మేజిస్ట్రేట్ కు తెలియజేస్తారు. మేజిస్ట్రేట్ కు ఇన్‌జక్షన్ జారీచేసే అధికారం ఉంటుంది. ఈ ఇన్‌జక్షన్ అనేది బాల్యవివాహాన్ని ఆపడానికి ఇచ్చే ఆదేశం. ఆ కోర్టు ఆదేశాన్ని ధిక్కరించినవారు 3 నెలలదాకా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది లేదా 1000రూపాయల జరిమానా లేదా రెండూ అనుభవించాల్సి వస్తుంది.

ఒక బాల్య వివాహాన్ని తాళికట్టకముందు ఆపేయవచ్చు. ఎందుకంటే, కేవలం వయస్సు లేనంతమాత్రాన పెళ్లిచేసేస్తే అది చట్టప్రకారం న్యాయ సమ్మతం కాకపోయినా అది రద్దు కాదు.

బాల కార్మికులు

పిల్లల(పనిలో తాకట్టు పెట్టడం)చట్టం 1952
ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పనిచేయడం కోసం 15 ఏళ్లలోపు పిల్లలను తాకట్టు పెట్టడం, తద్వారా ఎక్కువ జీతాన్ని లేదా లాభాన్ని ఆశించడం నిషేధించడం జరిగింది. అలాంటి సంఘటనలు జరిగితే, అటు తల్లిదండ్రులను లేదా సంరక్షకులను , ఇటు పనిలోకి పెట్టుకొన్నవారినీ ఇద్దరినీ శిక్షించే అవకాశం ఉంది.

వెట్టిచాకిరీ వ్యవస్థ(నిర్మూలన) చట్టం 1976

తీసుకొన్న అప్పు తిరిగి చెల్లించలేదని ఒక వ్యక్తిని వెట్టి చాకిరీలోకి నెట్టడం నిషేధం. రుణపత్రాలలో ఎలాంటి నిబంధనలూ, ఒప్పందాలూ ఉన్నా వాటిని లెక్కచేయదీ చట్టం. ఎలాంటి నిబంధనాలు పెంచే ఒప్పందాలైనా ఈ చట్టం ప్రకారం చెల్లవు. అలాంటి ఒప్పందాల నుంచి, రుణాబాధల నుంచీ ఆ సదరు వ్యక్తిని విముక్తునిగావిస్తుందీ చట్టం. వెట్టి చాకిరీ చేయమని ఎవరైనా నిర్భంధిస్తే వారు చట్టప్రకారం శిక్షకు గురౌతారు. ఇందులో వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా శిక్షార్హులే.

బాల కార్మిక(నిషేధం, నియంత్రణ)చట్టం 1986
అనేది 14ఏళ్లలోపు పిల్లలను అపాయకరమైన పనులకు నియుక్తించడాన్ని నిషేధిస్తుంది. అలాగే, వివిధ నిరపాయకరమైన పనులకు నియుక్తించడంలో నియంత్రిస్తుంది.

జువెనైల్ న్యాయ (పిల్లల సంరక్షణ, సంక్షేమం)చట్టం 2000
లోని సెక్షన్ 24 ప్రకారం పిల్లలను అపాయకరమైన పనులకు నియుక్తించినా, వారిని నిర్భంధించినా, ఆ పిల్లల ఆదాయాన్ని వారికివ్వక వాడుకొన్నా అలాంటివారిని శిక్షించడం జరుగుతుంది.

వివిధ కార్మికచట్టాలు బాలకార్మికులను నిషేధించడం లేదా వారి పరిస్థితులను మెరుగుపర్చడం, యజమాన్యాన్ని శిక్షించడం వంటి అంశాలగురించి చర్చించాయి. వాటిలో కొన్ని చట్టాలు ఇవి :

 • ఫ్యాక్టరీ చట్టం 1948.
 • ప్లాంటేషన్ లేబర్(చెట్లు నాటే కూలీల) చట్టం 1951.
 • గనుల చట్టం 1952.
 • వ్యాపారస్థుల రవాణా చట్టం 1958.
 • అప్రెంటిస్‌ల చట్టం 1961.
 • మోటారు వాహనాల పనివాళ్ల చట్టం 1961.
 • బీడీ, చుట్టల పనివాళ్ల( ఉపాధి పరిస్థితుల) చట్టం 1966.
 • ప.బె. అంగళ్లు, సంస్థల చట్టం 1963.

మానభంగానికి పాల్పడిన వ్యక్తికి గరిష్టంగా 7 ఏళ్లు జైలు శిక్ష. అయితే, ఒక వేళ 12 ఏళ్ల లోపు అమ్మాయిని గనక ఎవరన్నా మానభంగం చేస్తే, లేదా మానభంగం చేసిన వ్యక్తి ఒక అధికార హోదాలో ఉన్నా(ఆసుపత్రి, చిల్డ్రన్‌హోం, పోలీస్ స్టేషన్ వగైరా) వారి పట్ల శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. బలవంతంగా ఒక పిల్లవాడ్ని సెక్సులో పాల్గొనేలా చేయడమూ మానభంగం కిందకే వచ్చినా, ఇండియన్ పీనల్ కోడ్ లోని మానభంగ చట్టం దాన్ని గుర్తించడం లేదు. సెక్సు వల్ల హాని కలిగించడం లేదా ఇతర మార్గాల్లో ఒక పిల్లవాడికి హాని కల్గించడం ఎలాoటి చట్టం కిందకూ రాకపోయినా, ఐపిసి సెక్షన్ 377 వాటిని అసహజ నేరాలుగా పరిగణిస్తుంది.

పిల్లల అక్రమ రవాణా

పిల్లల అక్రమ రవాణాన్ని అరికట్టడానికై అమలులో ఉన్న న్యాయ, చట్టాలు ఇలా ఉన్నాయి :
ఇండియన్ పీనల్ కోడ్ 1860

 • మోసం, దగా, అపహరణ, తప్పుగా నిరోధించడం, నేరపరమైన బెదిరింపులు, మైనర్ బాలికలను తార్చడం, వారిని వ్యభిచారం కోసం అమ్మడం, కొనడం వంటి నేరాలను చేసేవారిని ఐపిసి శిక్షిస్తుంది .

జువెనైల్ న్యాయ( శిశుసంక్షేమం, రక్షణ) చట్టం 2000

 • ఈ చట్టం అక్రమంగా రవాణా కాబడ్డ పిల్లల సంక్షేమం, రక్షణ, వారి పునరావాస కల్పన, వారి కుటుంబాలకు తిరిగి చేర్చడం వంటి వాటికి సాయపడుతుంది.

పిల్లల అక్రమ రవాణా నివారించడానికై ఉన్న న్యాయ, చట్టాలలో ప్రత్యేక చట్టాలు, స్థానిక చట్టాలలో ఇవి కూడా ఉన్నాయి :

 • ఆంధ్రప్రదేశ్ దేవదాసి(అంకిత నిరోధక) చట్టం1988 లేదా కర్ణాటక దేవదాసి(అంకిత నిరోధక) చట్టం 1982.
 • బొంబాయి బిచ్చ నిరోధక చట్టం 1959.
 • వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం 1976.
 • బాల కార్మిక నిషేధ, క్రమబద్ధీకరణ చట్టం 1986.
 • బాల్య వివాహ నిరోధక చట్టం 1929.
 • పిల్లల సంరక్షణ చట్టం 1890.
 • హిందూ దత్తత, నిర్వహణ చట్టం 1956.
 • అక్రమ రవాణా(నిరోధక) చట్టం 1986.
 • సమాచార పరిజ్ఞాన చట్టం 2000.
 • మత్తు, ఇతర హానికర పదార్థాల అక్రమ రవాణా చట్టం, 1988.
 • షెడ్యూలు జాతులు, కులాల(క్రూరత్వ విరోధక) చట్టం, 1989.
 • మానవ అవయవాల మార్పిడి చట్టం, 1994.
హెచ్ఐవి / ఎయిడ్స్

హెచ్ఐవి/ఎయిడ్స్ పాజిటివ్ గల వారి హక్కుల పరిరక్షణకై న్యాయచట్టాలను రూపొందించేదిశగా పనులు సాగుతున్నాయి. ఐతే, ప్రజలందరికీ కొన్ని ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం ఇచ్చింది. అవి హెచ్ఐవి/ఎయిడ్స్ పాజిటివ్ గల రోగులకీ వర్తిస్తాయి. అవి :

 • అంగీకారాన్ని తెలిపే హక్కు
 • రహస్యాన్ని దాచే హక్కు
 • వివక్షత వ్యతిరేక హక్కు

ముందే అందించిన అంగీకారపు హక్కు
అంగీకారం అనేది స్వచ్ఛందంగా ఉండాలి. దాన్ని పొరబాటుగానే, బెదిరించో, తప్పుగానో, జోక్యంవల్లో లేదా తప్పుగా వ్యక్తీకరించో తీసుకోకూడదు.

అంగీకారం అనేది తెలియజేయాలి. ముఖ్యంగా ఇది వైద్యునికీ, రోగికీ మధ్య చాలా ముఖ్యం. వైద్యునికి అన్నీ తెలుస్తాయి, రోగి ఆయనపై పూర్తి నమ్మకంతో ఉంటాడు. ఎలాటి వైద్య ప్రక్రియలోనైనా, ముందు వైద్యుడు తాను మొదలెట్టబోయే వైద్యంలోని రిస్కులగురించి, ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి రోగికి చెప్పడం జరుగుతుంది. దానివల్ల రోగి ఆ వైద్యానికి అంగీకరించడం, అంగీకరించకపోవడం జరుగుతుంది.

ఇతర అస్వస్థలతో పోలిస్తే హెచ్ఐవి/ఎయిడ్స్ వల్ల వచ్చే సమస్యలు వేరేగా ఉంటాయి. అందువల్ల హెచ్ఐవి పరీక్షలు జరపడానికి ఆ వ్యక్తినించి సమాచారం తెలిపి అంగీకారాన్ని పొందాలి. వేరే పరీక్షలకు అంగీకారం ఉందికదా అని హెచ్ఐవి పరీక్షలను నిర్వహించడానికి లేదు. ఒక వేళ అలా తెలియజేసిన అంగీకారం లేకుండా ఆ రోగిపై హెచ్ఐవి పరీక్షలు జరిగినట్లు తెలిస్తే, వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనాన్ని పొందవచ్చు.
గోప్యంగా ఉంచే హక్కు

ఒక మనిషిపై పూర్తి నమ్మకంతో ఏదన్నా ఒక విషయాన్ని విశ్వాసంతో చెప్పినపుడు ఆ సదరు వ్యక్తి ఆ సమాచారాన్ని అంతే గోప్యంగా ఉంచాలి. అలాకాక ఆ సమాచారాన్ని నలుగురితో పంచుకొంటే అది గోప్యతను ఉల్లంఘించడం కిందకొస్తుంది. వైద్యుడు రోగికి సేవచేయడం ప్రాథమిక చర్య. రోగి చెప్పిన ప్రతీ సమాచారాన్నీ గోప్యంగా ఉంచాలి. అలా గోప్యతను ఉల్లంఘించి రోగి వివరాలను ఎవరికైనా వెల్లడిచేస్తే, ఆ విషయం రోగికి తెలిస్తే వారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కుంది.

సాధారణంగా, హెచ్ఐవి/ ఎయిడ్స్ తో బాధపడే జనాలు(పిఎల్డబ్ల్యుహెచ్ఏలు) కోర్టును ఆశ్రయించడానికి భయపడు తూంటారు. ఎందుకంటే, వారికి హెచ్ఐవి/ ఎయిడ్స్ ఉందన్న విషయం అందరికీ తెలుస్తుందని భయం. ఐతే, అలా కోర్టును ఆశ్రయించినపుడు, వారు సప్రెషన్ ఆఫ్ ఐడెంటిటి అన్న సౌకర్యాన్ని వాడుకొని వారి ని ఎవరూ గుర్తుపట్టకుండా మారుపేరుని వాడవచ్చు. పిఎల్డబ్ల్యుహెచ్ఏలు ఆ లాభదాయకమైన ఎత్తుగడతో, ఎలాంటి వివక్షతా, భయమూ లేకుండా న్యాయాన్ని పొందవచ్చు.


వివక్షత వ్యతిరేక హక్కు

సమానంగా వైద్య చికిత్స పొందే హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఏ వ్యక్తి కూడా లింగ, కుల, మత, జన్మస్థలం వంటి వాటివల్ల సాంఘికంగా, వృత్తిపరంగా, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ నియంత్రణలోని సంస్థల్లో గానీ వివక్షతకి గురికాకుండా న్యాయ చట్టాలున్నాయి.

ప్రజా ఆరోగ్య హక్కు అనేది కూడా ప్రాథమిక హక్కు. ఇది ఒక రాష్ట్రం తన ప్రజలందరికీ అందజేయాల్సిన హక్కు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఒక ఆసుపత్రిలో వైద్యసాయం కోరినపుడు వారికి వైద్యసాయం చేయకుండా ఎవరూ వెనక్కి పంపడానికిలేదు. అలా ఎవరికైనా వైద్యసాయం అందని పక్షంలో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

అలాగే,హెచ్ఐవి ఉన్న వారు ఉద్యోగరీత్యా కూడా వివక్షతకు గురి కాకూడదు. అలా గురై, ఫలితంగా ఒకవేళ వారు ఉద్యోగాన్ని కోల్పోవల్సి వస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు.

హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా , సదరు వ్యక్తికి ఉద్యోగం చేయడానికి ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యా లేనపుడు వారిని ఉద్యోగంనించి తొలగించడానికి లేదు. ఆ విషయం బొంబాయి హైకోర్టు మే 1997లోనే స్పష్టం చేసింది.

1992లో భారత ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ను అన్ని రాష్ట్రాలకూ జారీచేసింది. దానిప్రకారం, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య సంస్థల్లో ఎవరి పట్లా కూడా , ముఖ్యంగా పిఎల్డబ్ల్యుహెచ్ఏలు చికిత్స పొందే విషయంలో వివక్షతను చూపడానికి వీల్లేదు.

ఆధారం: హెచ్ఐవి/ఎయిడ్స్ లో న్యాయ సమస్యలు

శారీరిక శిక్షలు

శారీరిక శిక్షలని పాఠశాలలలో నిషేధించడానిపై ఎలాంటి కేంద్ర ప్రభుత్వ చట్టం లేదు. అయితే, వాటిని నిషేధిస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీలను, చట్టాలను రూపొందించి ప్రవేశ పెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పిల్లలపై హింస గురించి చట్టాన్ని తెచ్చేలా, దానిలో శారీరిక శిక్షను పిల్లలకు విధించడాన్ని నేరంగా పరిగణించే ప్రయత్నంలో ఉంది. ఈ చట్టం అమలులోకి వచ్చేదాకా ప్రస్తుతం అమలులో ఉన్న వాటిని వాడుకోవాలి.

భారత దేశంలో శారీరిక శిక్షలు నిషేధించిన / కొనసాగిస్తున్నరాష్ట్రాలు

రాష్ట్రం

శారీరిక శిక్షలు (నిషేధించారు/ ఉన్నాయి)

చట్టం /పాలసీ

తమిళనాడు

నిషేధించింది

శారీరిక శిక్షను తమిళనాడులో 2003 జూన్ నుంచి తమిళనాడు విద్యారంగ నియమాలు 51 వ నియమంను సర్దుబాటు చేసి నిషేధించారు. దానిప్రకారం పిల్లలను “చక్కదిద్దడంలో భాగం” గా వారిని మానసికంగా, భౌతికంగా బాధించడం నిషేధించారు.

గోవా

నిషేధించింది

గోవా పిల్లల చట్టం 2003 గోవాలో పిల్లలకు శారీరిక శిక్షను నిషేధించారు.

పశ్చిమ బెంగాల్

నిషేధించింది

2004 ఫిబ్రవరిలో కొల్ కత్త ఉన్నత న్యాయస్థానం రాష్ట్రంలోని పాఠశాలలలో బెత్తంతో పిల్లలను కొట్టడం అన్యాయమని చెప్పింది. తపస్ భంజ అనే అడ్వొకేటు ఇదే విషయంగా ఒక పిఐఎల్ ని దాఖలు చేశాడు.

ఆంధ్ర ప్రదేశ్ (హైదరాబాద్)

నిషేధించింది

2002 ఫిబ్రవరి18 నాడు నాటి విద్యాశాఖ కార్యదర్శి ఐవి సుబ్బారావు పిల్లలను శారీరకంగా శిక్షించకుండా ఉండేలా ఒక జీవోను(జివో ఎంఎస్ 16) జారీ చేశారు. అది 1966లో జారీ చేసిన జివో ఎంఎస్ 1188 లోని పిల్లలకు శారీరకంగా శిక్ష విధించే అంశాలకు బదులుగా ఈ జీవో జారీ చేశారు. 2002లో జారీ చేసిన జీవో ప్రకారం, అన్ని విద్యాసంస్థల్లో పిల్లలని శారీరకంగా శిక్షించడాన్ని నిషేధించింది. తద్వారా విద్యా నియమాల్లోని 122వ నియమాన్ని సవరించడం జరిగింది. అతిక్రమించినవారిని పీనల్ కోడ్ కింద కఠినంగా శిక్షించడమూ జరుగుతుంది.

ఢిల్లీ

నిషేధించింది

పిల్లలకి అర్థవంతమైన విద్యనాశించే తల్లిదండ్రుల ఫోరమ్ వేసిన పిటిషన్. ఢిల్లీ పాఠశాల విద్య యాక్టు(1973) కింద ఉండిన శారీరిక శిక్షలను హైకోర్టు కొట్టివేసింది. 2000 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్ట్ ‘ఢిల్లీ పాఠశాల విద్య యాక్టు(1973) కింద ఉన్న శారీరిక శిక్షలను అమానుషంగానూ, పిల్లల పరువుకు భంగంగా’ పేర్కొనింది.

చండీగఢ్

నిషేధించింది

చండీగఢ్ లో పిల్లలకు శారీరిక శిక్షను 1990లలోనే నిషేధించారు.

హిమాచల్ ప్రదేశ్

నిషేధించ నిశ్చయించింది

పిల్లలకు శారీరిక శిక్షను విధించడంవల్ల వైకల్యాలు కలుగుతున్నాయని తెలిసి పిల్లలకు శారీరిక శిక్షలను హిమాచల్ ప్రదేశ్ నిషేధించ నిశ్చయించింది.

గృహ హింస

ప్రస్తుతం గృహ హింసకు మన దేశం లో చట్టం ఉన్నది. ఇది 2005 లో అమలులోకి వచ్చిన సివిల్ చట్టం. ఇది మహిళలు మరియు ఆడ పల్లలకు వర్తిస్తుంది.

ఇంతకు పూర్వం 2000లో జువెనైల్ జస్టిస్ చట్టం(పిల్లల సంక్షేమం, సంరక్షణ), ఎవరి రక్షణలో ఐతే పిల్లలున్నారో పిల్లల పట్ల వారి క్రూరత్వం లేదా వారిపై ఆధిపత్యం చూపడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 14 పిల్లలపట్ల క్రూరంగా ప్రవర్తించేవారికి శిక్ష విధిస్తుంది. ఇక్కడ క్రూరత్వం అంటే, వారిపై దాడిచేయడం, వారిని వదిలేయడం, కావాలని బహిరంగతం చేయడం లేదా నిర్లక్ష్యం చేయడం త ద్వారా పిల్లలలకు భౌతిక లేదా మానసిక క్షోభను కలిగించడం .

కుల వివక్షత

భారత రాజ్యాంగం కింది భరోసాలనిస్తుంది :

 • చట్టం ముందు అందరూ సమానం, దేశంలోని ప్రతివారికీ చట్టాలు సమానమైన రక్షణనివ్వాలి.(ఆర్టికల్ 14).
 • జాతి, కుల, మత, పరంపర, పుట్టిన స్థలం లేదా ఇల్లు- వీటినిబట్టి వివక్షత చూపడం నిషేధించింది.(ఆర్టికల్ 15).
 • జాతి, కుల, మత, పరంపర, పుట్టిన స్థలం లేదా ఇల్లు- వీటినిబట్టి ఉపాధి నివ్వడంలో వివక్షత చూపడం నిషేధించింది.(ఆర్టికల్ 16).
 • అంటరానితనాన్ని నిషేధించింది. అంటరానితనాన్ని ఎవరేవిధంగా పాటించినా అది శిక్షార్హమైన నేరంగా పరిగణించడం జరుగుతుంది(ఆర్టికల్ 17).

అంటరానితనం గురించి ఉద్భోధించేవారిపై, పాటించేవారిపై చర్యను తీసుకొనే దిశగా సివిల్ రైట్స్ యాక్ట్ 1955 తొలి భారతీయ న్యాయ చట్టంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, షెడ్యూల్డ్ జాతివారిని వారి కులం పేరుతో పిలవడం కూడా శిక్షార్హమైన నేరం.

1989లో భారత ప్రభుత్వం షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలు (దుర్మార్గ నిరోధక) చట్టం ప్రవేశ పెట్టింది. ఇది షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల పట్ల వేరే కులాలవారిలో వివిధ రకాల దుర్మార్గాలను చేసేవారిని, వివక్షత చూపేవారిని శిక్షించడానికి ఉద్దేశించింది. ఈ చట్టం కింద వారి కోసం రాష్ట్రాలు జిల్లా స్థాయిలొ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా జరిమానాలను విధించడం చేయవచ్చు.

వీధి, పారిపోయిన పిల్లలు

జువెనైల్ న్యాయ (సంక్షేమం, రక్షణ) చట్టం 2000
జువెనైల్ న్యాయ (సంక్షేమం, రక్షణ) చట్టం 2000 అనేది జువెనైల్స్ లేదా పిల్లలు(ఎవరైతే 18ఏళ్ల లోపు వయస్సున్నవారు) ఉన్నారో వారికోసం ఉద్దేశించిన చట్టం. ఇది వారికై కింది అంశాలపై దృష్టి సారిస్తుంది.

 • సంక్షేమం, రక్షణ అవసరాలు.
 • చట్టంతో సమస్యలు.

జాగ్రత్త, సంరక్షణ కావలసిన పిల్లలు
జాగ్రత్త, సంరక్షణ కావలసిన పిల్లలు అంటే 2(డి) ప్రకారం పిల్లలు

 • ఇళ్లు లేకుండా, జీవనం లేకుండా ఉన్నవారు
 • తల్లిదండ్రులు, సంరక్షకులు పోషించలేకపోతున్నవారు
 • అనాథలు, తల్లిదండ్రులు వదిలేసినవారు, తప్పిపోయినవారు, పారిపోయివచ్చినవారు, విచారణలో సైతం పిల్లల తల్లిదండ్రులు దొరకనివారు
 • అవమానించబడ్డవారు, హింసించబడ్డవారు, లేదీ లైంగికచర్యలకు అన్యాయాలకు బలైపోయినవారు, అలాంటి చర్యలవల్ల ప్రమాదం ఉన్నవారు.
 • మాదకద్రవ్యాల దుర్వినియోగం, రవాణావంటి వాటివల్ల ప్రమాదం ఉన్నవారు.
 • అవమానం పొందినవారు, వాటివల్ల ప్రమాదం ఉన్నవారు.
 • సాయుధ గొడవల్లో, పౌర సంబంధ ఆందోళనల్లో, సహజ విపత్తులలో బాధితులు

పిల్లల సంక్షేమ కమిటీ

 • న్యాయచట్టం ప్రకారం ప్రతి జిల్లాకి లేక జిల్లా సమూహానకి ఒకటి అంతకుమించి పిల్లల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలి. తద్వారా అవసరమైన పిల్లలకు సంబంధించిన సంక్షేమం, రక్షణ, చికిత్స, అభివృద్ధి, పునరావాసం ఏర్పాటు చేయడమేకాకుండా, వారికి ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, వారి మానవీయ హక్కులను కాపాడటం చేయాలి.

కమిటీ ముందు హాజరుపర్చడం

సంక్షేమం, రక్షణ కావలసిన పిల్లలను కమిటీ ముందు ఒక ప్రత్యేక జువెనైల్ పోలీసు యూనిట్ లేదా నిర్ణీత పోలీసు అధికారి , ప్రజా సేవకులు, ఛైల్డ్ లైన్, రాష్ట్రంలో రిజిస్టర్డ్ కాబడ్డ స్వచ్ఛంధ సంస్ధ ల ద్వారా హాజరుపర్చవచ్చు. లేక సంఘసేవకులుగా గుర్తింపున్న వారైనా ఆ పిల్లలను కమిటీ ముందు హాజరుపర్చవచ్చు

పిల్లల సంక్షేమ కమిటీ ఆ పిల్లవాడిని ఒక పిల్లల సంరక్షణ కేంద్రానికి పంపమని ఆజ్ఞాపించవచ్చు. ఆ తర్వాత ఒక సంఘసేవకుని లేదా శిశు సంక్షేమాధికారితో విచారణ జరిపించవచ్చు.

విచారణ పూర్తయ్యాక, ఆ పిల్లవానికి ఎలాంటి సరైన కుటుంబ సాయంలేదనీ, ఆ పిల్లవాడ్ని పునరావాసం అయ్యేదాకా లేక ఆ పిల్లవాడికి 18 ఏళ్లు నిండేదాకా సంరక్షణ కేంద్రంలో ఉంచమని చెబుతుంది.

చట్ట విరుద్ధంగా పనిచేసే పిల్లలు
“చట్ట విరుద్ధంగా పనిచేసే పిల్లలు” అంటే నేరం చేసిన పిల్లలు అని అర్థం.

జువెనైల్ న్యాయ సభ

 • ఒక జిల్లా లేక కొన్ని జిల్లాలకు కలిపి ఒకటి లేదా అంతకుమించి జువెనైల్ న్యాయ సభలని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ సభలు చట్ట విరుద్ధంగా పనిచేసే పిల్లలని విచారించడం, తగిన శిక్షలు వేయడం, బెయిల్ మంజూరు చేయడం, పిల్లల సంక్షేమంకోసం కేసులని ముగించడం వంటి పనులు చేపడతాయి.

మాదక ద్రవ్యాల, పదార్థాల దుర్వినియోగం
మాదకద్రవ్యాల, మానసికోద్వేగ పదార్థాల చట్టం, 1985
ఈ చట్టం అన్నిరకాల మాదకద్రవ్యాల ఉత్పత్తి, దగ్గరుంచుకోవడం, రవాణాచేయడం, అమ్మడం, కొనడం వంటి ఏపనిచేసినా అది అక్రమం, నేరంగా పరిగణిస్తుంది.. అలాంటి మత్తు పదార్థాలను అమ్మినవారు శిక్షార్హులు.

హింసకు పాల్పడ్డా, ఆయుధాలు వాడినా లేక అలాంటి బెదిరింపులు చేసినా అలాంటి వారు దండనార్హులు. అలాంటివాటికి పిల్లలను వాడటం, పాఠశాలల్లో లేదా సామాజిక స్థలాల్లో వారిద్వారా డ్రగ్స్ లభింపజేయడం హెచ్చుదండనలకు కారణమౌతాయి.

మాదకద్రవ్యాల, మానసికోద్వేగ పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం, 1988
ఈ చట్టం ప్రకారం, అన్ని రకాల మాదకద్రవ్యాలను అమ్మడానికి పిల్లలను వాడినవారు శిక్షార్హులు. అలాంటి వారిని నేరస్తులకు సకారిగా లేదా ఈ చట్ట ప్రకారం కుట్రదారులుగా ముద్రవేయడం జరుగుతుంది. .

జువెనైల్ న్యాయ (సంక్షేమం, రక్షణ) చట్టం 2000
సెక్షన్ 2(డి) ప్రకారం, ఏపిల్లవాడైనా ఈ మాదకద్రవ్య వ్యాపారంలోకి లాగబడే ప్రమాదంలో ఉన్నాడనిపిస్తే, అతనిని ‘సంరక్షణ, సంక్షేమం అవసరమైన పిల్లవాని’గా గుర్తించాలి.

చిన్నపిల్లలు బిచ్చమెత్తడం

చిన్నపిల్లలని బలవంతంగా బిచ్చమెత్తడానికి దింపినా లేక దానికి వారు అలవాటు పడిపోయినా కింది చట్టాలు వినియోగించవచ్చు

జువెనైల్ తీర్పు చట్టం 2000

చిన్నపిల్లలని బలవంతంగా బిచ్చమెత్తడానికి దింపినా అది ప్రత్యేక నేరం కింద పరిగణిస్తారు. అది శిక్షార్హం కూడా.(సెక్షన్ 24).

ఏపిల్లవాడైనా హింసకు గురైనా, చిత్రహింసలకు గురైనా, ఎవరన్నా వారి స్వలాభాలకు వాడుకొన్నట్లనిపిస్తే, అతనిని ‘సంరక్షణ, సంక్షేమం అవసరమైన పిల్లవాని’గా జువెనైల్ న్యాయ చట్టం గుర్తిస్తుంది.

ఇండియన్ పీనల్ కోడ్
పిల్లలను అపహరించడం లేదా మైనరు పిల్లలను బిచ్చం ఎత్తడానికి ప్రేరేపించడం ఐపిసి చట్టంలోని సెక్షన్ 363 ఏ కింద శిక్షార్హం.
జువెనైల్ నేరం లేదా న్యాయచట్టాలతో విరోధించే పిల్లలు
నేరాలు చేసే పిల్లలని పెద్దలు నేరం చేస్తే విధించే శిక్షలబారిపడకుండా వారిని న్యాయచట్టాలతో విరోధించే పిల్లలుగా గుర్తిస్తారు తప్ప జువెనైల్ న్యాయచట్టం 2000 కింద దోషులుగా పరిగణించడం జరగదు.

ఈ చట్టం ప్రకారం, న్యాయచట్టాలతో విరోధించే పిల్లలకు బెయిలు పొందే హక్కు ఉంది. ఎందుకంటే, బెయిల్ ఇవ్వడం తప్పనిసరి. కేవలం అది జువెనైల్ ప్రాణానికి ముప్పుంటే తప్ప మిగిలిన అన్ని పరిస్థితుల్లో బెయిలు పొందవచ్చు .

జైలుకు పంపడానికి బదులు కొంత విభిన్న పద్దతిలో ప్రొబేషన్‌పై వారి విడుదలకు న్యాయ సలహాపై అంగీకరిస్తుంది. లేదా వారిని ప్రత్యేక హోమ్ లలో ఉంచుతుంది.

పిల్లలను రక్షించడానికి ఉపాధ్యాయులేం చేయగలరు?

ఎక్కడైనా పిల్లలను నిర్లక్ష్యానికి, అవమానానికి, హింసకు, స్వార్థప్రయోజనాలకు వాడుకోవడం - వంటివానికి గురిచేయవచ్చు. బడి ఆవరణలో కొంత అవమానం జరిగినా, బడి బయట అంటేె ఇంట్లో, ఇతరత్రానే దానిని ఎక్కువగా పిల్లలు చవిచూస్తూంటారు. మీ తరగతి గదిలో పిల్లవాడు బడి బయట జరిగిన నిర్లక్ష్యానికి, అవమానానికి, హింసకు, స్వార్థప్రయోజనాలకు గురి అయ్యి ఉండవచ్చు. దాన్ని మీరు చూసీ నిర్లక్ష్యంగా ఉండలేరు. అలాంటపుడు మీరు తప్పక సాయం చేయాలి. అంటే, మీరు ఒక పిల్లవాడికి ఉంటే సమస్యను గుర్తించగల్గాలి, అపుడే అది సాధ్యం. కొంత సమయాన్ని వెచ్చించి సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దానికి వీలైనంతవరకు పరిష్కార మార్గాలు వెదకాలి.

మీరు ఎపుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటుంది. అదేమిటంటే, మీరు బడి ఆవరణలోనించి బయటకు వచ్చేసినంతమాత్రాన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత ముగిసి పోదు. మీ యొక్క సరైన జోక్యంవల్ల బడి వదిలి వెళ్ళిపోయిన పిల్లవాని జీవితాన్నే మార్చగలరు. దానికోసం మిమ్మల్ని మీరు సమాయుత్తపర్చుకోండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి. వారి కెలాంటి సాయం చేయగలరో చూడండి.

ఒకసారి మానసికంగా మీరు సంసిద్ధులై ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలగడం మొదలెడితే, మీరూహించలేనివిధంగా ఎన్నో పనులు చేయగలరు.

పిల్లలకు మీరు మిత్రునిలాంటి ఉపాధ్యాయులా? అలా ఉండాలంటే మీరు ఇలా చేయాలి
 • పిల్లలకుండే హక్కులను మానవీయ హక్కులని ముందు అర్థం చేసుకోండి. ప్రజల్లో అందరికీ ఆవిధమైన అవగాహననీ కల్పించండి.పాఠశాల విద్యాభివృద్ధి - సామాజిక బాధ్యతమీరు పాఠంచెప్పే తరగతిని పిల్లలు క్రమం తప్పకుండా హాజరవ్వాలనే భావన వారిలో కల్పించండి.
 • మీరు నేర్చుకోవడానికి సంసిద్ధులుకండి.
 • మీరు పిల్లవానికి మిత్రునిగా, వేదాంతిగా, తోడుగా మెలగండి.
 • పిల్లలు తరగతిలో పాఠాలు ఇష్టంగా వినేలా చేయండి. పిల్లలను వారి సందేహాలను చెప్పడాన్ని ప్రోత్సాహిస్తూ, వాటిని నివృత్తిచేయండి.
 • పిల్లలకు సంబంధించిన హింస, నిర్లక్ష్యం, చదువుపై అశ్రద్ధ, బైటకు తెలియరాని వైకల్యం వంటివాటిని గుర్తించగలగాలి.
 • తమ అభిప్రాయాలని, చింతని, భయాన్ని మీతో చెప్పుకోగలిగిన పిల్లలను చేరదీసి చర్చిస్తూ అనుబంధాన్ని పెంచుకోండి.
 • చక్కని శ్రోతగా ఉండండి. ఇంటా, బడిలో పిల్లలు ఎదుర్కొంటున్న అంశాలను, సమస్యలను చర్చించండి. పాలుపంచుకోండి.
 • వారి జీవితాలను చక్కగా ప్రభావితంచేసే విషయాల్లో పిల్లల భాగస్వామ్యాన్ని ప్రోత్సాహించండి.
 • పిల్లల భాగస్వామ్య సామర్థ్యాన్ని సమర్థవంతంగా పెంపొందించండి.
 • బడి అధికారులతో తరచూ పిల్లలకు భేటీ జరిగేలా ఏర్పాటుచేయండి.
 • పిల్లల హక్కుల సమస్యలూ పేరెంట్ టీచర్ మీటింగ్ లలో తల్లిదండ్రులతో చర్చించండి.
 • శారీరిక శిక్షలకు స్వస్తి చెప్పండి. పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి వారిని కౌన్సిలింగ్ చేయడం, వారితో మాట్లాడటం వంటి పద్ధతులను వాడండి.
 • వివక్షతలకు స్వస్తి చెప్పండి. మైనారిటీవంటి అన్ని వర్గాల పిల్లలకూ చేరువయ్యే ప్రయత్నం చేయండి.
 • పనిచేసే పిల్లలు, వీధి బాలలు, లైంగిక హింసలబారిన పడినవారు, గృహహింసకు గురైనవారు లేదా మాదకద్రవ్యాలబారిని పడ్డవారు, న్యాయచట్ట విరుద్ధమైన జువెనైల్స్ వంటి రక్షణ కావలసిన పిల్లలపట్ల వ్యతిరేక ధోరణులకూ స్వస్తి చెప్పండి.
 • మీ ఇంటా, బయటా పిల్లలను పనికిపెట్టుకోవడానికి స్వస్తి చెప్పండి.
 • ప్రజాస్వామికంగా ఉండండి. కానీ అనిర్మాణాత్మకంగా ఉండవద్దు.
 • పిల్లలను బడిలో, సమాజంలో పూర్తి సురక్షితంగా ఉండేలా చూడాలి. అవసరమైతే, పోలీసు సాయం తీసుకోవడానికి, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికీ వెనుకాడకూడదు.
 • పిల్లలను పెద్దల ముందు, సమాజం ముందు వారి అభిప్రాయాలను వెలిబుచ్చడానికి ప్రోత్సాహించండి.
 • పిల్లలను వివిధకార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములుగా చేయండి. వారికి మీ పర్యవేక్షణలో కొన్ని బాధ్యతలను అప్పగించండి.
 • పిల్లలను సమీపంలో ఉండే ప్రదేశాలకు విహార యాత్రలకు, పిక్నిక్లకూ తీసికెళ్లండి.
 • పిల్లలను చర్చల్లో, వాదోపవాదాల్లో ప్రశ్నావళి, తదితర ఉల్లాస కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయండి.
 • ఆడ పిల్లలకు విద్యాభ్యాసాన్ని, వివిధ సృజనాత్మక పనులకు తరగతుల్లో అమ్మాయిలను పాల్గొనేలా చేయండి.
 • అమ్మాయిలెవరైనా బడి మానేశారా, సరిగ్గా రావడం లేదా చెక్ చేస్తూ, వారు అలా చేయకుండా చూడండి.
 • ఉపాధ్యాయులంతా పిల్లల సృజనాత్మక కార్యక్రమాల్లో సాయం చేసి పిల్లకొక రక్షణాకవచంలా ఏర్పాటు చేయండి.
 • మీ పరిశీలనలే చాలా ముఖ్యం. ఎందుకంటే, అవే పిల్లల అభివృద్ధిని అంచనా వేయడానికి సాయపడతాయి. వారివల్ల ఏవన్నా సమస్యలొస్తే, అవి ఎందువల్ల వచ్చాయి వారి సమస్య ఏమిటీ అనేది సులభంగా తెల్సుకోవచ్చు.
 • ఆ తర్వాత చేయాల్సిందేమిటంటే, కుటుంబంలో ఎవరినించైనాగానీ, బంధువలనుంచిగానీ లేదా మిత్రులనించిగానీ ఏవైనా ఒత్తిడులున్నాయా అని ఆరా తీయాలి.
 • పిల్లలతో విడిగా కొంత సమయాన్ని గడపండి. ఎలాటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించకుండా, వారు ఎలాంటి అసౌకర్యాన్ని ఫీలవకుండా ఉండేలా చూసుకోండి.
 • పిల్లలెవరైనా సమస్యలతో వస్తే, వారి సమస్యలను ఒక చిత్రం రూపంలో లేదా కథా రూపంలో లేక నేరుగా మీతో గానీ, బడిలోని కౌన్సిలర్లతోగానీ, సంఘసేవకులతోగానీ, తోటి మిత్రులతోగానీ మాట్లాడేలాగానో సాయం చేయండి.
హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకిన, బారిన పడిన పిల్లవాని హక్కులు ఉల్లఘించడంలేదని ఒక ఉపాధ్యాయునిగా ఎలా నిర్థారించాలి ?
 • పిల్లల పరిపక్వతను బట్టి వారి వయస్సునుబట్టి వారికి లైంగిక విద్యను బోధించాలి.
 • పిల్లలకు హెచ్ఐవ మరియు ఎయిడ్స్ గురించి, అదెలా వ్యాపిస్తుంది, ఒకవ్యక్తినెలా బాధిస్తుంది, దాన్నెలా మనం నిరోధించగలం - వంటి విషయాలను వారికి చెప్పాలి.
 • హెచ్ఐవి మరియు ఎయిడ్స్ తో బాధపడుతున్న పిల్లలు తరగతిలో ఉంటే, వారిని దోషులుగా చూడకండి. పిల్లలమధ్య అలాటి భావాలు కల్గకుండా చూడండి.

పిల్లలకు సురక్షిత వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసి దాన్ని మరింత ధృఢపరిచేలా చూడాలి. దీనికి వివిధ స్థాయిల్లో వారిని భాగస్వాములుగా చేయాలి. అవసరాన్నిబట్టి వారితో మాట్లాడ్డం, భాగస్వామ్యం, పంచుకొన్న విశ్లేషణల ఆధారంగా వారిని ఎంగేజ్ చేయడంవంటివి అవసరం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో సాంప్రదాయక అభివృద్ధి పనులు, పద్ధతులు వాడుకోవాలి. అంటే, మౌలిక సదుపాయాలను పెంపొందించడం, ఫలితాలను విశ్లేషించడం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ వారి స్వాభివృద్ధికై గుర్తించడం వగైరా.

పిల్లల కోసం ప్రభుత్వం ఎలాంటి పథకాలను నిర్వహిస్తోందీ అనేది ఉపాధ్యాయులు బాగా తెల్సుకోవాలి. అవి పిల్లలకేమి ఇస్తున్నాయో తెలుసుకోవాలి. ఆయా పధకాలు ఏఏ పిల్లలకు, కుటుంబాలకు అవసరమో, సాయపడతాయో గుర్తించాలి. ఆయా కుటుంబాల జాబితాను మీకు సమీపంలో ఉన్న బ్లాక్/తాలూకా/మండల్/పంచాయితీ సభ్యులకు లేదా బిడిపిఓకి అందజేయాలి.

పిల్లల పరిరక్షణలో మీకు కిందివారి సహాయం అవసరం :

 • పోలీసులు
 • మీ పంచాయితీ, మునిసిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, సభ్యులు
 • అంగన్ వాడీ కార్యకర్తలు
 • ఏఎన్ఎంలు
 • బ్లాక్, తాలూకా, మండల్, పంచాయితీ సభ్యులు
 • బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్(బిడిఓ), బ్లాక్ డెవలప్మెంట్ పంచాయితీ ఆఫీసర్(బిడిపిఓ).
 • కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్(సిడిఓ), కమ్యూనిటీ డెవలప్మెంట్ పంచాయితీ ఆఫీసర్(సిడిపిఓ).
 • జిల్లా మేజిస్ట్రేటు, జిల్లా కలెక్టరు
 • దగ్గర్లో ఉన్న శిశు సంక్షేమ కమిటీ
 • మీ ప్రాంతంలో ఉండే చైల్డ్ లైన్ సంస్థలు
పిల్లల లైంగిక హింసలను గుర్తించడం

పిల్లలలో యుక్త వయస్కుల్లో లెంగిక హింసల సూచనలు

 

6-11 సంవత్సరాలు

12-17 సంవత్సరాలు

బాలికలు

తోటి పిల్లలతో బహిరంగంగా లైంగిక పరమైన ప్రవర్తనలతో ఉంటారు.

తమకన్నా చిన్న పిల్లలతో లైంగిక పరమైనపనులకు పాల్పడుతూంటా రు.

 

లైంగిక పరమైన అనుభవాలగురించి మాటల్లో వ్యక్తం చేస్తూంటారు.

లైంగిక పరమైన ప్రవర్తనలతో లేదా పూర్తిగా వాటిని విస్మరించే ధోరణి.

 

మర్మాంగాలను తాకుతూండటం, వాటిమీదే ధ్యాస పెట్టడం .

తిండి తినేటపుడు అల్లరిచేస్తూంటారు.

 

పెద్దలతో సంబంధాన్ని అంటగట్టడం.

అపరాధ, అవమాన భావనలనుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేయడం.

 

ఉన్నట్టుండి భయపడటం, లేదా మనుష్యులన్నా, కొన్ని ప్రదేశాలన్నా భయపడటం.

ఇంటినించి పారిపోవడం.

 

వయస్సుకు మించిన లైంగిక పరిజ్ఞానం

నిద్రకు సంబంధించిన సమస్యలు : పీడకలలు, నిద్ర భయాలు.

బాలురు

ఇతర పిల్లలతో బహిరంగంగా లైంగిక పరమైన ప్రవర్తనలతో ఉంటారు.

తమకన్నా చిన్న పిల్లలతో లైంగిక పరమైనపనులకు పాల్పడుతూంటా రు.

ఉన్నట్టుండి భయపడటం, లేదా మనుష్యులన్నా, కొన్ని ప్రదేశాలన్నా భయపడటం.

దాటవేసే ప్రవర్తన

నిద్రకు సంబంధించిన సమస్యలు : పీడకలలు, నిద్ర భయాలు.

నటించడం, రిస్కుతో కూడినప్రవర్తన

ఉన్నట్టుండి తీవ్రంగా ప్రవర్తించడం లేదా నటించడం

అపరాధ, అవమాన భావనలనుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేయడం.

గతంలో శ్రద్ధ ఉన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం.

నిద్రకు సంబంధించిన సమస్యలు : పీడకలలు, నిద్ర భయాలు.దాటవేసే ప్రవర్తన

ముందు జాగ్రత్తలు : పైన సూచించిన ప్రవర్తనలు లేదా గుర్తులు కేవలం కొన్ని మార్గదర్శకాలుగా మాత్రమే పరిగణించాలి. తద్వారా పిల్లలు సమస్యతో ఉండటానికి దానికి లైంగిక హింస కారణం కావచ్చెమోనన్న విషయాన్ని గుర్తించవచ్చు. తొందరపడి ఏదో ఒక అంశాన్ని లేదా ప్రవర్తనని బట్టి లైంగికహింస జరిగిందని నిర్ధారణకి రాకూడదు. మీరు ఎన్ని సూచనలూ, కారణాలూ ఉన్నాయో వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొనే నిర్ధారించాలి.

చిన్న పిల్లలకు ఎప్పుడూ పెద్దవారిని గౌరవించాలనే చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో పెద్దల ప్రవర్తన నచ్చకపోయినా పెద్దలకు కాదు / లేదు అని చెప్పడం జరగదు. అలాంటి సందర్భాల్లో పెద్దలకు కాదు / లేదు అని చెప్పడం నేర్పించాలి.

అంగ వైకల్యం గల పిల్లల గురించి 10 సందేశాలు

1. అంగవైకల్యం ఉన్న పిల్లల పట్ల వ్యతిరేక ధోరణులను మానండి. వారిపట్ల వ్యతిరేకమైన అర్థాలిచ్చే పదాలతో అంటే, ‘వైకల్యం, కుంటివారు, చేతుల్లేనివారు’ వంటి పదాలు వాడకండి. అలా చెప్పేకన్నా భౌతికంగా కదలికలలో లోపం ఉన్న పిల్లవాడు అని చెప్పవచ్చు. మాట్లాడటంలో వినడంలో లోపం గలవారు అని చెప్పవచ్చు. అంతేకానీ చెవిటివాడు వంటి పదాలు వాడకండి. పిచ్చివాడనో మరోకటో అనకుండా మానసికంగా లోపంగల వాడు అని వాడవచ్చు.
2. అంగవైకల్యం ఉన్న పిల్లలందరినీ ఆ వైకల్యం లేని పిల్లలతో సమానంగా చూడండి. ఉదాహరణకు అంగవైకల్యం ఉన్న పిల్లలు అంగవైకల్యం లేనివారికి చదువుచెప్పవచ్చు. అంగవైకల్యం ఉన్న పిల్లలు ఎలాంటి వైకల్యంలేని పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువగా కలుపుగోలుగా ఉండేలా చూడాలి.
3. అంగవైకల్యం ఉన్న పిల్లలను వారిగురించి, వారి భావాలు, అనుభవాలు మొదలైనవాటి గురించి ఎక్కువగా అందరితో చెప్పుకొనే అకాశం కల్గించాలి. అంగవైకల్యం ఉన్న పిల్లలు ఎలాటి వైకల్యంలేని పిల్లలతో కలిసి వివిధ ప్రాజెక్టుల్లో పాల్గొనేలా చేయాలి.
4. పిల్లలని జాగ్రత్తగా చూసి, వారి వైకల్యం ఏమిటో గిర్తించాలి. పిన్న వయస్సులో మందే పరిశీలించి తగిన విధంగా చికిత్స చేయించినట్లయితే, వారి వైకల్యాన్ని మెరుగ్గా నివారించవచ్చు.
5. అంగవైకల్యం ఉన్నట్లు గుర్తించిన పిల్లలను వైద్య పరీక్షలకు గురిచేసి, త్వరగా చర్యలు తీసుకోవాలి.
6. అంగవైకల్యం ఉన్న పిల్లలకు అవసరమైన రీతిలో పాఠాలనీ, పాఠ్యసామగ్రినీ , తరగతి గదులనీ ఎంపిక చేసుకోవాలి. పెద్ద అక్షరాలతో వ్రాయడం, ఆ పిల్లలని ముందు కూచోపెట్టడం, సరిగ్గా నడవలేనివారిని తరగతిగదుల్లో సౌకర్యాంగా ఉండేలా చూడటం వంటివి చేయాలి. వైకల్యాలనుగురించిన పాజిటివ్ ఆలోచలనని పాఠ్యాంశాలతో, ఆటపాటలతో కలిపిచెప్పడం వంటివి చేయాలి.
7. అంగవైకల్యం ఉన్న పిల్లల అవసరాలగురించి వారి తల్లిదండ్రులను చైతన్యవంతులగావించాలి. తల్లిదండ్రులతో కలసి మీటింగుల్లోనూ, విడివిడిగానూ మాట్లాడాలి
8. విసిగిపోయిన తల్లిదండ్రులకి సులభ మైన చిట్కాలను చెప్పి వారిని పిల్లలతో ఎలా నెగ్గుకురావాలో నేర్పాలి. అలాగే, వారికి పిల్లల పట్ల సహనాన్ని నేర్పి, వైకల్యం ఉన్న పిల్లలను హింసించకుండా ఉండటం నేర్పాలి.
9. అంగవైకల్యం ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు ఎలా మెలగాలో గైడ్ చేయాలి. దీనివల్ల పెద్దలకు, పిల్లలకూ ఉపశమనంగా ఉంటుంది.
10. అంగవైకల్యం ఉన్న పిల్లలని పాఠశాలలోని అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా, వారిని పూర్తిస్థాయి సభ్యులుగా నియమించండి.

పిల్లల పరువుని గౌరవించే నిర్మాణాత్మక, క్రమశిక్షణాత్మక పనులను అలవర్చుకోవాలి, ప్రోత్సాహించాలి
 • పిల్లల పరువును గౌరవించండి.
 • మంచి సామాజిక సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వ్యక్తిత్వం అభివృద్ధి చేసుకోవాలి.
 • పిల్లలు చురుగ్గా పాల్గొనడాన్ని ఎక్కువగా ఉండేలా చూడాలి.
 • పిల్లల అభివృద్ధి అవసరాలను, జీవనప్రమాణాన్ని గౌరవించాలి.
 • పిల్లలలో ఆసక్తిపెంచే లక్షణాలను, జీవన అభిప్రాయాన్ని గౌరవించాలి.
 • న్యాయాన్ని, ధర్మాన్ని అందించాలి.
 • ఏకీభావాన్ని పెంపొందించాలి.

ఆధారం: Eliminating Corporal Punishment: The Way Forward to Constructive Child Discipline - యునెస్కో ప్రచురణ

నిజంగా, పాఠశాల వాతావరణాన్ని మార్చడమనేది మీకో పెద్ద సవాలు

మీ పాఠశాల పిల్లలకు అనుకూలంగా ఉంటుందా ? అలా ఉండాలంటే ఇలా చేయాలి :

 • “కర్రను వదలి బాల్యాన్ని రక్షించు” అనేది పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, సమాజానికీ సందేశంగా, కొత్త నినాదం కావాలి.
 • ప్రతిబడిలో మానసికంగా, ఉద్వేగభరిత సమస్యలున్న పిల్లలకు సాయపడటానికి, వారికి, వారి తల్లిదండ్రులకీ సరైన సలహాలు ఇవ్వడానికి ఒక సుశిక్షిత కౌన్సిలర్ ఉండాలి.
 • ప్రతిబడిలోఉన్నతస్థాయిలో, కుటుంబస్థాయిలో, సముదాయ స్థాయిలో ప్రతిస్పందనలు కలిగించేందుకు ఒక సంఘ సేవకుడుండాలి.
 • తరచూ పిటిఏలు ఒక ముఖ్య అంశంగా ఉండాలి. పిటిఏలు ఉపాధ్యాయులకీ, తల్లిదండ్రులకీ ఒక వేదిక కావాలి. తద్వారా కేవలం క్లాసులో మాత్రమే కాక పిల్లలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి దోహదపడాలి.
 • ఉపాధ్యాయులను పిల్లల హక్కుల పరిరక్షణ గురించిన శిక్షణనివ్వడం, చైతన్యవంతులగావించడం అనేది నిత్య కార్యక్రమం కావాలి. ఇది పాఠశాలలు తమ ఉపాధ్యాయులను తరచూ విద్యా శిక్షణా కార్యక్రమాలకు పంపేవిధంగా ఉండాలి.
 • పాఠశాలల్లో పిల్లలకు ఎదురయ్యే సమస్యలను ముందుకు తేవడానికి పిల్లలకు అనువైన వాతావరణాన్ని, అవకాశాలని కల్పించాలి.
 • లైంగిక విద్యను పాఠశాలల్లో జీవన నైపుణ్య విద్యలో భాగంగా, తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాలి.
 • మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను పిల్లలకు బడి ఆవరణలోనే లభ్యమయ్యేలా చూడాలి. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి.
 • చిన్న గదుల్లో, గుడారాల్లో నడిచే పాఠశాలలలో తగినన్ని విరామాలను ఎక్కువగా ఇవ్వాలి.
 • వికలాంగులకు సహాయకారిగా ఉండే మౌలిక సదుపాయాలు, పాఠ్య సామగ్రి ఉన్న బడులు అలాంటి వారికోసం ఎలా స్పందిస్తాయో చెబుతాయి. సాధ్యమైనంతవరకు అలాంటి సదుపాయాలు మీ బడుల్లో ఉండేలా చూడండి. దానికై స్థానికంగా వనరులను సమీకరించండి.
 • బడి ఆవరణలో, చుట్టుపక్కలా ఎక్కడా వ్యాపారస్థులను ఉండనీయకండి.
 • పాఠశాలలు వారి ఉపాధ్యాయులెవ్వరు బాలలను వారి ఇంటిలో పనికిపెట్టుకోకుండా ఉండేలా చూడాలి. తద్వారా బాల కార్మికులను నిరోధించడానికి సమాజానికే ఆదర్శం కావచ్చు.
 • బడి ఆవరణలో, చుట్టుపక్కలా ఎక్కడా మాదక ద్రవ్యాలు వాడకం లేదా ఎలాటి ఇతర నేరాలూ జరక్కుండా చూడటానికి బడిలో పెద్దల బృందాలను ఏర్పాటు చేయడం పాఠశాలలకు మంచి పద్ధతి.
 • క్రమశిక్షణాత్మక విచారణలకోసం, బడిలో లేదా బయట పిల్లలపై లైంగిక హింసలకు పాల్పడే ఉపాధ్యాయులపై లేదా ఇతర సిబ్బందిపై తీసుకొనే చర్యలగురించి మార్గదర్శకాలను రూపొందించి, వాటిని పాటించేలా చూడాలి.
 • బడి ఆవరణలో లింగబేధం, వైకల్యం, కులం, మతం లేదా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వంటి అంశాలవల్ల ఎవరిపట్లైనా వివక్షత చూపినట్లైతే, వారిని శిక్షించడానికి మార్గదర్శకాలు, నియమనిబంధనలూ రూపొందించి పాటించేలా చూడాలి.
 • బడి అధికారులు చిన్నపిల్లల సంరక్షణకై పర్యవేక్షణా బృందం లేదా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దానిలో పిల్లలు, వారి పెద్దలు, పంచాయితీలు/మునిసిపాలిటీలు సభ్యులుగా ఉంటారు. ఈ కేంద్రాలు చిన్నపిల్లలెవరికి సంరక్షణ అవసరమో, వారి జాబితాను తయారుచేసి, నిర్వహిస్తుంది. అవసరమైనపుడు పోలీసులకు లేదా తత్సంబంధ అధికారులకు ఫిర్యాదుచేయడం వంటిపనులు చేస్తుంది.
పిల్లలు పాల్గొనే నేపథ్య ఆధారిత ఆటపాటలు
 • చర్చలు/ వాదోపవాదాలు/ క్విజ్
 • కథలు చెప్పడం
 • పెయింటింగ్, స్థానిక కళలు(ఆయా ప్రాంతాలకే పరిమితమైనవి)
 • వ్యంగ్య నాటికలు / నాటకాలు / రంగ స్థలం
 • కుండలు చేయడం, ఇతర కళలు
 • తోలుబొమ్మల తయారీ
 • ముఖ చిత్రణలు
 • కాగితాలతో కళలు
 • ఛాయాచిత్రణ
 • వనభోజనాలు, విహార యాత్రలు
 • క్రీడలు(ఇండోర్, ఔట్‌డోర్)
 • ప్రదర్శనలు

మంచి ఉపాధ్యాయులు కావాలంటే ఖర్చు పెట్టాల్సిందే, ఐతే అసమర్ధ ఉపాధ్యాయులుంటే ఖర్చు ఇంకా ఎక్కువే - బాబ్ టాల్బర్ట్

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

ఉచిత నిర్బంధ విద్య - ఉపాధ్యాయుల కరదీపిక

ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 - నాణ్యత అంశాలు అనే శీర్షికతో ఉపాధ్యాయుల కరదీపికను రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ, హైదరాబాద్ వారు రూపొందించారు.

విద్య హక్కు చట్టం 2009 లోని అంశాల గురించి పాటశాల విద్యా వ్యవస్థలోని వారందరూ అవగాహన ఏర్పరచుకొని, చట్టంలోని అంశాల అమలుకు కృషి చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా విద్య హక్కు చట్టం 2009 లోని అంశాలు, పని దినాలు, పని గంటలు, బాలల భావవ్యక్తీకరణకు స్వేచ్చ, భయరహిత వాతావరణం, పాటశాల యాజమాన్య సభ్యులు, పాటశాల అభివృద్ధి ప్రణాళిక, నిరంతర సమగ్ర మూల్యాంకనం వంటి అంశాల గురించి ఈ కరదీపికలో చర్చించారు. వీటిని ఆకలింపు చేసుకొని విద్య హక్కు చట్టం 2009 సమర్ధవంతమైన అమలుకు ఈ కరదీపికను ఉపయోగించుకోవచ్చు.

ఈ కరదీపికను వివిధ అంశాల వారీగా ఈ క్రింద గల లింకులలో చూడవచ్చు.

ఆధారము : రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ, హైదరాబాద్

2.95833333333
కర్ణాకర్ మన్నే Aug 13, 2019 09:51 PM

ఉపాధ్యాయులు తమ విధుల పట్ల అవినీతి చేస్తే తెసుకోవాల్సిన చర్యలు వివరాలు సెక్షన్లు

Kavitha Sep 23, 2017 10:03 PM

సార్ దయచేసి నేను ఒకసారి మీతో మాట్లాడాలి వీలైతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బాల్యవివాహాల నిర్మూలన ఎక్కడ జరుగుతుంది దీనికి దీనికి సాక్ష్యం అనంతపురం జిల్లా కదిరి చోటుచేసుకుంది పదవ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల అమ్మాయి ఒక అబ్బాయి నీ ప్రేమించి వివాహానికి సిద్ధమయ్యారు అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అబ్బాయి అమ్మాయి తిరిగి వచ్చారు కానీ వివాహం చేసుకున్నారు వారిద్దరు వయస్సు కేవలం పదమూడు సంవత్సరాలు నా వివాహానికి ఎంత మాత్రం అర్హత లేదు అప్పుడు పోలీస్ వారు జోక్యం చేసుకొని అబ్బాయి అమ్మాయిని ఎన్జీవో home తరలించకుండా పోలీసు వల్ల సూచన మేరకు అబ్బాయికి అమ్మాయికి బయటికి వెళ్లి ఎక్కడైనా గుడిలో పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి పంపించారు ఆ సలహా ఎంత మాత్రం న్యాయం ఇప్పుడు వారు చిన్నవయసులోనే కేవలం పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నారు ఈ సంఘటన జరిగి కేవలం మూడు రోజులు మాత్రమే అయింది ఈ విషయం తెలిసిన ఏ అధికారి యాక్షన్ తీసుకుంటాడు వేచి చూడాలి పోలీసు వారు ఇలా అందరికీ సలహాలు విచ్చుకుంటూ పోతూ ఉంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు న్యాయ మందుకు చట్టం ఎందుకు డబ్బుకోసం లంచాల కోసం ఇలా సమాజాన్ని కాపాడాల్సి కాపాడవలసిన వారు సమాజాన్ని నాశనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఇప్పటికైనా అధికారులు కల్లు తెరిచే ఈ సంఘటన గురించి ఆరా తీయమని వేడుకుంటున్నాను ఈ సంఘటన కదిరి town పోలీస్ స్టేషన్ లో జరిగింది అమ్మాయి పేరు కవిత అబ్బాయి పేరు anil కదిరి నిజాం వలె కాలనీ అబూ బకర్ మస్జిద్ ఎదురుగా తండ్రి పేరు నరసింహులు తల్లి పేరు సరల అధికారులు కళ్లు తెరవండి ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడండి జైహింద్ బాల్య వివాహాలను ఆపండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు