অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విద్య ఒక ప్రాథమిక హక్కు

ప్రతి భారతీయ పౌరుడికి విద్య ఒక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి.

మనిషి తన తెలివి తేటల్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోడానికి వీలుగా విద్యాభ్యాసం కొనసాగిస్తు వుండాలి. అప్పుడే ఆ మనిషికి మౌలికమైన స్వేచ్ఛ లభిస్తుంది. మానవ హక్కులను  కాపాడుకోవచ్చు. తమ పిల్లలకు ఎటువంటి ప్రాథమిక విద్యను సమకూర్చాలనేది తలిదండ్రులే నిర్ణయించుకునే హక్కు వారికే ప్రథమంగా వుంది.

విద్య ప్రాధమిక హక్కు

అందరికీ విద్య

ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు,యువకులు,వయోజనులందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనేది ఇప్పుడు ఉద్యమ స్థాయిని అందుకుంది. ఈ ఉద్యమాన్ని 1990లో జరిగిన అందరికీ విద్య అనే అంశం మీద ప్రపంచ స్థాయి సమావేశాలలో నిర్ణయించి ప్రారంబించారు.

పదేళ్ల తర్వాత చాలా దేశాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. ఆఫ్రికాలోని సెనిగల్ దేశ రాజధాని డాకార్లో జరిగిన సమావేశానికి వివిధ దేశాల నుండి ప్రతినిధులు వచ్చి 2015 నాటికి అందరికీ విద్య సాధించాలని నిర్ణయించారు. పిల్లలూ, యువకులూ, వయోజనుల కొరకు ఆరు అభ్యాస అవసరాలను గుర్తించారు. ఈ పథకాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి మార్గదర్శి పాత్ర వహిస్తున్న యునెస్కో అంతర్జాతీయంగా సమన్వయ పాత్ర పోషిస్తూ అందరికీ విద్య తగిన ఏర్పాట్లను చేపట్టి నిర్వహిస్తున్నది. ప్రభుత్వాలను, అభివృద్ధి సంస్థలను, పౌరసమాజాన్ని, స్వచ్ఛంద సంస్ధలను, ప్రచార సాధనాలను సమీకరించి సమన్వయ పరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నడుం బిగించింది.

ఇప్పుడు మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్) సాధించడానికి అందరికీ విద్య ఎంతో ప్రయోజన పడుతుందంటున్నారు. ఈ లక్ష్యాల్లో, లక్ష్యం నెంబరు ఒకటి సార్వత్రిక, ప్రాథమిక విద్యకు సంబంధించినవి. లక్ష్యం నెంబరు రెండు విద్యా రంగంలో లింగ వివక్షత లేకుండా సమానతను సాధించడం. ఈ లక్ష్యాలను 2015 నాటికల్లా సాధించి తీరాలన్నది ఒక ముఖ్యమైన ధ్యేయం.

గ్రామీణులందరూ విద్య ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకొని వ్యవహరించాలనేది ప్రధానం.

ఈ క్రింది సమాచారాన్ని ప్రజలందరూ పట్టించుకొని మెలగాలి.

 • ఆడపిల్లలను చదివించాలి.
 • బ్రిడ్జి కోర్సులు ద్వారా బాల కార్మికులకు విద్య అందించాలి
 • షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులవారు, అల్పసంఖ్యాక వర్గాల వారి కందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి.
 • మానసిక, శారీరక, అంగవైకల్యాలు గల - అవిటి, చెవిటి, మూగ, అంధులు - వీరందరికీ విద్యావసతులు కల్పించాలి.
 • మహిళలు చదువుకునేటట్టు ప్రోత్సహించాలి

ఆరు ప్రత్యేక విద్యా లక్ష్యాలు

 • విశేషం గాను, అధికంగా నిర్లక్ష్యానికి గురైన మరియు అణగారిన వర్గాల పిల్లల కొరకు శిశు రక్షణ , పూర్వ ప్రాథమిక విద్యను విస్తృత పరుస్తూ సమగ్రంగా మెరుగుపరచడం.
 • పిల్లలందరు 2015 నాటికి , ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలోగల, మరియు సాంసృతికంగా అల్ప సంఖ్యాక వర్గాలలోని, భిన్న జాతులలోని బాలికలకు పాఠశాలలు అందుబాటులో ఉండడం, నాణ్యమైన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం, దానికి కావలసిన సౌకర్యాలను కల్పించటం.
 • సరైన అభ్యసనం మరియు జీవన నైపుణ్యాలు కార్యక్రమంలో పిల్లలు మరియు వయోజనులు, అందరూ సమానంగా అభ్యసనావసరాలు పొందడం
 • ప్రధానంగా మహిళలకు మరియు వయోజనులందరికీ ప్రాథమిక మరియు నిరంతర విద్య సమానంగా అందించడం ద్వారా 50% అభివృద్దితో మెరుగైన వయోజన విద్యను 2015 నాటికి సాధించడం.
 • ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యలో 2015 నాటికి లింగ వివక్షను తొలగించడం, బాలబాలికలందరికీ నాణ్యమైన విద్యను సమానంగా సాధించడం, మెరుగైన ప్రాథమిక విద్యను సాధించడంలో పూర్తిగాను సమానంగాను బాలికలపై దృష్టి పెట్టి అందించడం.
 • అన్ని విధాలుగా మెరుగుపరచిన నాణ్యమైన విద్యను సాధించడం, వారందరికి ముఖ్యంగా చదవటం, రాయటం, లెక్కించడం మరియు అవసరమగు జీవన నైపుణ్యాలలో గుర్తించదగిన అత్యుత్తమ మైన వాటినన్నింటినీ మరియు కొలవదగిన అభ్యసన ఫలితాలను పొందడం.

బాలల హక్కు చట్టం

ఉచిత నిర్భంద విద్యకు బాలల హక్కు చట్టం 2009. భారత పార్లమెంట్ చేసిన ఈ చట్టం 2009 ఆగష్టు 29న రాష్ట్రపతి ఆమోదం పొందింది.

ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్భంద విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మినహాయించి ఇది భారత దేశమంతటికీ వర్తిస్తుంది.

ఈ బాలల హక్కు చట్టం యొక్క సంపూర్ణ వివరాలు ఇక్కడ జత చేయబడిన పి.డి.ఎఫ్ ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచిత నిర్భంద విద్యకు బాలల హక్కు నిబంధనలు ఆంధ్రప్రదేశ్ 2010

ఈ నిబంధనలను ఉచిత నిర్భంద విద్యకు బాలల హక్కు నిబంధనలు – 2010 అని పిలుస్తారు. ఈ నిబంధనలు 01-04-2010 నుండి అమలులోకి వచ్చాయి.

ఈ చట్టం యొక్క పూర్తి సమాచారం క్రింద జత చేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంది. ఈ పి.డి.ఎఫ్. లో ఈ శీర్షికల సమాచారం అందుబాటులో ఉంది.

బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ, చట్టం ప్రకారం విద్యా వసతుల అందుబాటు, రాష్ట్ర ప్రభుత్వ / స్థానిక ప్రభుత్వ విధులు, స్థానిక అథారిటీ నిర్వహించాల్సిన పిల్లల రికార్డులు, పాటశాల గుర్తింపు, తాత్కాలిక ధృవీకరణ, పాటశాల యాజమాన్య కమిటీ, పాటశాల అభివృద్ధి ప్రణాలిక రూపకల్పన, ప్రైవేటు పాటశాల ఉపాధ్యాయుల వేతనం, అలవెన్సులు, సర్వీసు నిబంధనలు, ఉపాధ్యాయుల విధులు, విద్యార్థి : ఉపాధ్యాయ నిష్పత్తిని కొనసాగించటం, పాట్య ప్రణాళిక, మూల్యాంకన విధానం, విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ విధులు, రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు మరియు విధులు. పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఎందుకు అందరికీ విద్య ముఖ్యమైనది?

ఎనిమిది ( 8 ) మిలీనియమ్ డెవలప్ మెంట్ లక్ష్యాలను ( MDGs) పొందడంలో అందరికీ విద్యా లక్ష్యాలన్నింటినీ సాధించడమనేది క్లిష్టమైనది. ఎందుకంటే ఇది నేరుగా పిల్లవాని/ పిల్ల యొక్క విద్య మరియు ఆరోగ్యం సమకూర్చడం పై ప్రభావం ఉంటుంది. అలాగే అందరికీ విద్య 2015 నాటికి లక్ష్యాలను చేరడానికి బహుళ భాగస్వాములతో కలిసి పనిచేయడం అనే అనుభవం కల్పిస్తుంది. ఇతర మిలీనియమ్ డెవలప్ మెంట్ లక్ష్యాలను ( MDGs) , ఈ శతాబ్దపు అభివృద్ధి లక్ష్యాలు) సమాంతరంగా సాధించవచ్చును. అవేమిటంటే ఆరోగ్యాన్ని మెరుపరచుకోవడం, పరిశుభ్రమైన మంచినీరు అందుబాటు లో ఉంచడం, పేదరికాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, చదువును సాధించడమనే ఈ లక్ష్యాలన్నింటిలోను విద్య క్లిష్టమైనది.

అయినప్పటికినీ, సవాళ్ళు ఉన్నను, అందరికీ విద్య లక్ష్యాలను ఎక్కువగా సాధించడంలో ప్రగతి నిలకడగా కన్పిస్తున్నది. నేడు, ఆర్ధికంగా సామాజికంగా లేదా భౌతిక సవాళ్ళతో బాటు, అధిక సంతానం, హెచ్ ఐ వి /ఎయిడ్స్ బాధితులు, సంఘర్షణలను ఎదుర్కొనేవారు చాలా మంది బడి ఈడు పిల్లలు బడిలో ఉండడంలేదు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో 1990 నుండే పాఠశాల అందుబాటులో ఉండడం మెరుగైనదే, కాని 163 దేశాలలో 47మాత్రం సార్వత్రిక ప్రాథమిక విద్యను (MDG 2)ను సాధించాయి. ఇంకనూ 20 దేశాలు 2015 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడాని ప్రయాణిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. అయిననూ 44 దేశాలలో పెద్ద ఎత్తున సవాళ్ళు ఉన్నాయి. ఇందులో 23 దేశాలు సబ్- సహారన్ ఆఫ్రికాలో ఉన్నాయి. స్వదేశంలోను మరియు అంతర్జాతీయంగా త్వరితగతిలో సంతృప్తికరమైన ప్రయత్నాలు చేస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను 2015 నాటికి సాధించలేకపోవచ్చు.

చదువులో లింగవివక్ష తగ్గినప్పటికిని (MDG 3) పాఠశాలలు అందుబాటులో ఉన్నను, ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పూర్తి చేయడంలో బాలికలు ఇంకను నిర్లక్ష్యానికి గురి అవతున్నారు. ఇటీవల ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలో బాలికల నమోదు పెరిగినప్పటికిని- ముఖ్యంగా సబ్ -సహారన్ ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియాలోని అల్ప ఆదాయ దేశాలు – అందులో 24 దేశాలు లింగ వివక్ష లేకుండా ప్రాథమిక లేదా మాధ్యమిక స్థాయిలో 2015 నాటికి సాధించలేవు. ఇందులో ఎక్కువ దేశాలు (13) సబ్- సహారన్ ఆఫ్రికాలో ఉన్నాయి.

అభ్యసన ఫలితాలు తక్కువగాను, అల్ప నాణ్యతా విద్య ఇంకనూ ఉండడం వలన విద్యా విభాగం తక్కువ స్థాయిలో ఉన్నది. ఉదాహరణకు చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మొదటి గ్రేడులో నమోదైన విద్యార్ధులు చివరి గ్రేడు చదువుకు వచ్చేటప్పటికి 60% కన్నా తక్కువగా ప్రాథమిక పాఠశాలలో ఉంటున్నారు. అదనంగా విద్యార్ధి / ఉపాధ్యాయ నిష్పత్తి చాలా దేశాలలో 40: 1 కి మించి ఉంది. తగిన యోగ్యత లోపించిన ప్రాథమిక ఉపాధ్యాయులూ చాలా మంది ఉన్నారు.

అందరికి విద్యకు సంబంధించిన మరింత సమాచారం కొరకు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2014 - 15 కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు

ప్రాథమిక విద్య:

 • ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక విద్యకు రూ.55,115.10 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.50,136.30 కోట్లుగా ఉంది.
 • ప్రాథమిక విద్య తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఎన్డీయే ప్రభుత్వం పేర్కొంది. తొలిదశలో అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొత్తంగా విద్యారంగానికి గత ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం కేటాయింపులు పెరిగాయి.
 • పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగాలకు రూ.51,828 కోట్లు కేటాయించారు. (విద్యా రంగం మొత్తానికి రూ.68,728 కోట్లు)
 • సర్వశిక్ష అభియాన్‌కు రూ.28,635 కోట్లు.
 • రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు.
 • ఉపాధ్యాయుల్లో ప్రేరణకు, నూతన బోధనా విధానాల అభివృద్ధికి 'పండిట్ మదన్‌మోహన్ మాలవ్య' పేరిట ప్రత్యేక కార్యక్రమం. దీనికి ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించారు.
 • మదర్సాల ఆధునికీకరణకు రూ.100 కోట్లు.
 • పాఠశాలకు వెళ్లాల్సిన 5-11 ఏళ్ల లోపు పిల్లల్లో ప్రపంచవ్యాప్తంగా 5.78 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. వీరిలో మన దేశానికి చెందినవారు 14 లక్షల మంది ఉన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలు అధికంగా ఉన్న తొలి అయిదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.

ఉన్నత విద్య:

 • ఉన్నత విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.25,456 కోట్లు కేటాయించారు. 2013 - 14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.24,485 కోట్లు.
 • దేశంలో కొత్తగా అయిదు ఐఐటీలు, అయిదు ఐఐఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
 • కొత్త ఐఐటీలు జమ్మూ, చత్తీస్‌గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఏర్పాటు చేయనున్నారు.
 • ఐఐఎంలు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు.
 • మధ్యప్రదేశ్‌లో 'జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్' ఏర్పాటు.
 • ఆన్‌లైన్ కోర్సులు, వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు రూ.100 కోట్లు.
 • విద్యా రుణాల నిబంధనల సరళీకరణకు నిర్ణయం.
 • యూపీఎస్‌సీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయింపు.
 • ఉన్నత విద్యలో చేరుతున్న యువతీ యువకుల సంఖ్య 2.7 కోట్లు. దేశంలోని 18-23 ఏళ్ల వయసున్న యువతలో ఇది 17.21 శాతం. 2020 నాటికి ఈ సంఖ్యను 4.5 కోట్లకు (25శాతం) పెంచాలని యూజీసీ ప్రతిపాదించింది.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate