పాఠశాలల నిశ్చయాత్మక చర్యల కోసం మార్గదర్శకాలు
పాఠశాలల్లో కష్టమైన పరిస్థితుల ప్రస్తావన
- పిల్లలులోని కొన్ని ప్రవర్తనలను సమస్యాత్మకంగా పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు అనుకుంటారు. దానిని సరి చేయడానికి వారు వివిధ స్థాయిల్లో శిక్షిస్తుంటారు. పాఠశాలల్లో ఉత్పన్నమయ్యే కొన్ని ఇటువంటి పరిస్థితుల్లో కింద తెలప బడ్డాయి:
- ఆలస్యంగా రావటం , పరిశుభ్రత నిబంధనల అనుగుణంగా లేక పోయటం - ఉదా సమయానికి పాఠశాలకు రాకపోవటం, ఏకరీతి వస్త్రాలు లేకపోవటం మొ .;
- పాఠ్య విషయాలకు సంబంధించిన సమస్యలు - ఉదా: అసంపూర్తిగా ఇంటి పని, అంచనా కంటే తక్కువ విద్యా ప్రదర్శన, పుస్తకం మర్చిపోవటం మొదలైనవి.;
- పిల్లలు పాఠశాల అధికారుల తరగతి అంచనాలను చేరుకోలేక పోవటం - ఉదా: అశ్రద్ధ, తరగతి లో మాట్లాడటం, మొదలైనవి .;
- ప్రవర్తన సమస్య - ఉదా: ఇతర పిల్లలను తరగతిలో ఆటంకపరచటం, అబద్ధాలడటం, దొంగిలించడం మొదలైనవి.;
- అభ్యంతరకర ప్రవర్తన, ఇతరులకు హాని కలిగించటం లాంటివి - ఉదా, వేధింపులు, తోటివారి పట్ల దూకుడు, దొంగిలించడం (ఇతరుల హక్కులను ఉల్లంఘించటం), పగలగొట్టడం, మొదలైనవి
- పరిస్థితుల (i) నుంచి (iii) సరిచేయటం గురువు పరిధిలో ఉండాలి.
- పరిస్థితుల్లో (iv) మరియు (v) పాఠశాల పరిస్థితి పాఠశాల ప్రోటాకాల్ ను పాఠించాలి. పాఠశాల ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయాలి. పాఠశాల ఉన్నతాధికారులకు మరియు తల్లిదండ్రులకు వెంటనే సమాచారాన్ని అందించాలి. సమస్య పరిష్కార ప్రయత్న సంతృప్తికరంగా లేకపోతే, తల్లిదండ్రులు, ఒక ప్రవీణున్ని (పిల్లల మరియు శిశు మనోరోగ వైద్యుడు లేదా కౌన్సిలర్) కాలవాలని సూచించాలి.
- శిశు మనోరోగ వైద్యుడు లేదా కౌన్సెలర్ పిల్లలు సానుకూల ఆత్మగౌరవంతో స్వీయ క్రమశిక్షణ అభివృద్ధికి సహాయపడే ప్రవర్తనను తెలుసుకోవడానికి సహాయం చేయాలి. పాఠశాల సలహాదారు నమ్మకాన్ని పెంపొందిచే నైపుణ్యాలు కలిగి ఉండాలి. అతను/ఆమె పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడానికి పిల్లలు, అతని/ఆమె తల్లిదండ్రులు మరియు పిల్లల ఉహధ్యాయులతో మాట్లాడుతూ ఉండాలి. కౌన్సిలర్ దగ్గరికి పిల్లలను పంపే ముందు తల్లిదండ్రులను విశ్వాసంలోకి తీసుకోవాలి. పాఠశాల సలహాదారు గురువు మరియు సిబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వివిధ తరగతులలో విద్యార్థులుతో కార్య గోష్ఠి నిర్వహించాలి. అంతర్గత సలహాదారులతో పాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల జాబితాలో ఉన్న పేరుగాంచిన సలహాదారులు/మానసిక ఆరోగ్య నిపుణులు కలిసే స్వేచ్ఛ ఉండాలి. పాఠశాల కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కోసం ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణులను ఆహ్వానించి కార్య గోష్ఠులను నిర్వహించాలి.
పిల్లలతో సానుకూల చర్చలకు మార్గదర్శకాలు
- భౌతిక శిక్ష సాధారణంగా తీవ్ర పరిస్థితులలో ఉపయోగించేదిగా చెప్పబడుతుంది. ఉదాహరణకు – బెదిరింటం, శారీరక నష్టం, ఆస్తి నాశనం, విధ్వంసం, లైంగిక వేధింపులు, టూయాంటును ఆడటం, పాఠశాలకు తీసుకురాకూడని వస్తునులను తీసుకురావటం వంటి నియమాలను పాటించకపోవటం, రెచ్చగొట్టడం/బెదిరింపు మొదలైనవి. ఇవే సమస్యలు గల ఇద్దరు పిల్లలు వివిధ రకాల నేపథ్యాల నుంచి రావచ్చు – ఒకరు శాంతంగా ఉండే కుటుంబం ఎవరైతే కొంచె అల్లరి అంగీకరించొచ్చు అనుకుంటారు. మరొక కుటుంబం దానిని హాస్యంగా తీసుకునేది. పిల్లల ప్రవర్తనకు సంబంధించిన సందర్భం ప్రకారం పిల్లలను గమనించవలసి ఉంటుంది.
- పాఠశాల నియమాలకు మొదటిదాని ప్రతిస్పందన వర్సెస్ పునరావృత సమస్యల ఆధారంగా ప్రతిస్పందన ప్రోటోకాల్ ఉండాలి. పిల్లల సూచనలకు యాజమాన్యం ప్రతిస్పందించాలి. దీనికి, జీవిత నైపుణ్యాల కార్యక్రమాల వంటి నివారణ చర్యలను చెపట్టండం ద్వారా మొత్తం ప్రభావం పెరుగుతుంది.
- ఒక కష్ట పరిస్థితిని విద్యార్థి/కుటుంబ, గురువు/పాఠశాల మరియు విద్యార్ధి కౌన్సిల్ మధ్య త్రికోణీకరణ ప్రక్రియ ద్వారా పరిష్కరించవచ్చు. మరింత క్లిష్ట పరిస్థితిలో అది క్రమశిక్షణ సమస్య కాకుండా మానసిక సమస్యకు సంబంధించి ఉండవచ్చు. దానిని ప్రొఫెషనలు సలహా అవసరమవుతుంది.
- క్రింది మార్గదర్శకాలను వైద్యం ఆధారంగా సూచించబడ్డాయి. ప్రవర్తనా రుగ్మతల కుటుంబంగల వారికి వైద్యపరమైన ఏర్పాట్లలో మానసిక ఆరోగ్య నిపుణుల చికిత్సా వ్యూహాలపై ఆధారపడి చికిత్య ఉంటుంది. ఇవి సాధారణంగా కనబడినా, నిలకడగా అమలు చేసినప్పుడు సమర్థవంతమైన ఫలితాలను ఇస్తాయి:
- పిల్లల ప్రవర్తన మరియు పరిణామాలు గురించి ఒక అంగీకారానికి రావటం;
- పిల్లలు ఏకాభిప్రాయంతో నిబంధనలు మరియు మార్గదర్శకాలను తయారుచేయటం;
- ప్రతి పిల్లల సకారాత్మక ప్రవర్తనపై దృష్టి కేంద్రీకరించడం మరియు ప్రశంసించడం;
- అనుకూల ప్రవర్తన ప్రోత్సహించడానికి వివిధ వ్యూహాలు ఉపయోగించడం;
- ఎప్పుడూ మరొక పిల్లలతో పనితీరును పోల్చకండి;
- పరిమితులు తెలిపటం మరియు సరిహద్దుల స్పష్టత ఇవ్వంటం;
- పిల్లలకు, ఏ ఇతర ప్రతిస్పందనకంటే ముందు, వివరణ ఇవ్వడానికి అవకాశం అందించడం;
- స్పందనకు ముందు ఒక హెచ్చరిక లేదా అవకాశం ఇవ్వడం;
- చురుకుగా వినటం, ప్రశాంతంగా ఉండటం మరియు సమస్యాత్మకమైన లేదా అప్రియమైన ప్రవర్తన గల పిల్లలనుంచి ఇతర పిల్లల భద్రతకు భరోసా ఇవ్వటం;
- తల్లిదండ్రులు, పిల్లల మరియు కౌన్సిలర్/మానసిక వైద్యుడు సంప్రదించి 'తీవ్ర లేదా సమస్యాత్మక ప్రవర్తన'ను పరిశ్కరించాలి;
- పిల్లల విశ్రాంతి వ్యూహాన్ని చర్చించటం (పిల్లలతో) మరియు అనుసరించటం.
పిల్లలతో సానుకూల చర్చలు - కొన్ని ఉదాహరణలు
సానుకూల దృష్టిని నిలపండి
- పిల్లలతో మంచిగా ఉండటం మరియు మాటలతో అభినందింటం.
- చాలా కష్ట పరిస్థితులో కూడా ప్రతి పిల్లల సకారాత్మకతపై ధ్యానం పెట్టండి
- మంచి ప్రయత్నాలు ఏవైతే విజయవంతంకాలేదో గుర్తించండి
- ఎప్పుడూ ఇతర పిల్లలతో పనితీరును సరిపోల్చకండి కానీ పిల్లల యొక్క మునుపటి ప్రయత్నాన్ని చూడండి
- ప్రేరణ అవార్డు చార్ట్ (చిన్న పిల్లలకు) లేదా సత్ప్రవర్తనకు అదనపు పాయింట్లు లేదా అదనపు మార్కులు ఉపయోగించండి.
- నిజాయితీ, దయ, బాధ్యత మొదలైనవి చూపిన పిల్లలకు పురస్కారాలు ఇవ్వండి
- ముందు పని పూర్తి చేసిన పిల్లలకు అదనపు పనులు అందిస్తూ, అదనపు సమయం మరియు ఉత్పాదకత అవసరమయిన పిల్లలతో పని చేయించండి.
చిన్న సంఘటనలు లేదా లోపాలను విస్మరించు
- ఇది ఉత్తమ వ్యూహం; సమస్యతో కూడుకున్న పరిస్థితి స్వల్పకాలంలోనే వేగంగా అదృశ్యమవుతుంది
స్పష్టమైన పరిమితులు నిర్ణయించు
- పిల్లల తరగతిలోని ప్రవర్తనను అంచనాలను వివరంగా తెలియచేయండి
- ' మీరు అవసరం .. అని కాకుండా నాకు ... మీరు అవసరం' అనే మాటలను ఉపయోగించండి
- స్పష్టమైన ఆదేశాలను ఇవ్వండి, ఉదాహరణకు, 'నిశ్శబ్దంగా ఉండండి' బదులుగా 'మంచిగా ఉండండి'
- ' మానుకోండి ' ఆదేశాలను వాడకండి
- పిల్లలు స్పష్టమైన పరిమితులు ఏర్పాటు చేసుకొనేలా చూడాలి
- ఒక 'స్పస్టమైన మరియు ప్రశాంత' పద్ధతిని ఉపయోగించండి - కోపిష్టి గొంతును నివారించండి.
ప్రవర్తన కొనసాగితే
- పిల్లలతో మాట్లాడి వారికి ఇచ్చిన ప్రోత్సాహకాలను తిరిగి తీసుకొండి. (ఇది పిల్లలు తమ అధికారాన్ని ఉంచుకోడానికి మంచి ప్రవర్తన అనుసరించడానికి ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఇది శిక్ష కిందికి రాదు.) ఒక నిర్దిష్ట ప్రవర్తన సంభవించినప్పుడు తీసుకొనే చర్యల ప్రణాళికకు సంబంధించి ఏకాభిప్రాయం కొరకు పిల్లలతో బాగా ముందుగా పరిణామాలు చర్చించండి.
- నకారాత్మక బలము తగినంతగా ఉండాలి మరియు సరగా ఉండాలి
- ఇది స్థిరంగా ఉపయోగించాలి
పిల్లలకు సహాయం అవసరం శిక్ష కాదని గుర్తించండి
- పిల్లల స్వభావానికి తలిదండ్రుల వాతావరణ శైలి కారణం కావచ్చు; ఇల్లు మరియు పాఠశాల వద్ద క్రమశిక్షణా నమూనాలు; వైవాహిక జీవనం, గృహ హింస వంటి వత్తిడి. అనేక మంది పిల్లలు విద్యా, సామాజిక మరియు వ్యక్తిగత సంబంధాల పరంగా పాఠశాల డిమాండ్లకు తయారుగా లేరు. అందవల్ల పిల్లల అంతర్లీన భావోద్వేగ సమస్యలను తెలుసుకొనడానికి ప్రయత్నించండి. పిల్లల అల్లిరి ప్రవర్తనకు కారణాలను తెలుసుకోవటం ముఖ్యం. దీనికి వివిధ నేపథ్యాల పిల్లల మానసిక సాంఘిక నైపుణ్యాలను మరియు అవకాశాలను అందించడం అవసరం. పెద్దవాళ్లు పిల్లల వివిధ మానసిక-సామాజిక మరియు జాతి కారణాలవలన ఉండే పిల్లల ప్రవర్తన సమస్యలను చూసేటప్పుడు ఇది పిల్లలకు శిక్షకాదు సహాయం అవసరమని తెలుస్తుంది.
హక్కులు మరియు బోధన కమ్యూనిటీ యొక్క చేతనత్వం
- ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సంబంధం మెరుగు పరిచే ప్రణాళికలో నివారణా వ్యూహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలల్లో పిల్లల స్నేహ పూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించాలి. శారీరక దండన, మానసిక వేధింపులు, వివక్షలకు సంబందించి పాఠశాల వ్యవస్థలకు మార్గదర్శకాలు మరియు సాయం అందించాలి. కష్ట పరిస్థితుల్లో చేయవలసిన ప్రత్యామ్నాయలకు సమర్థవంతమైన వ్యూహాలను అందించటం ఒక మంచి అనుభవాన్ని పిల్లలకు అందించడానికి అవసరం. ఈ క్రమంలో, ఉపాధ్యాయులు వారి అనుభవాలను పంచుకోండి మరియు ఇతరుల నుండి తెలుసుకోవడానికి మరియు నిపుణుల నుండి తెలుసుకోవడానికి నిత్యం/ఆవర్తన కార్యగోష్ఠులను నిర్వహించాలి. అయితే, శారీరక శిక్ష పూర్తిగా ముగిసేలా చూడంటం ప్రస్తుతం ఒక తక్షణ బాధ్యత. దీని కోసం స్పష్టమైన ఆంక్షలు, ఉండాలి, ఇది హక్కులను గౌరవించే సంస్థలుగా పాఠశాలలు మారటానికి అనివార్యంగా మరియు చాలా సమయం తీసుకొనే ప్రక్రియ.
- RTE చట్టం, 2009 సూచించిన విధంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులు మరియు గురువుల నిష్పత్తి సరిగా ఉండాలి. లేక పోతే కిక్కిరిసిన తరగతి గదుల వలన పిల్లలను అదుపు చేయడానికి శారీరక దండనను ఉపయోగించే అవకాశం ఉంటుంది.
హక్కుల మరియు పాఠశాల పిల్లలకు చేతనత్వం
- పిల్లలు ఇష్టపడి పాల్గోనేలా చేసిన దానికి మంచి ఫలితాలు రావాలి. ఇవి ఏకపక్ష, యాదృచ్ఛిక, అనూహ్య నిర్ణయాలు కంటే మెరుగైన తుది ఫలితంగా ఉండాలి. నివారణ మరియు రక్షణ నిర్ధారించడానికి చేతనత్వం వచ్చేలాగా ప్రక్రియలపై దృష్టి మారుతుంది.
- మార్గదర్శకాలు పిల్లలతో ఏకాభిప్రాయంతో పాఠశాల వ్యవస్థలకు అనుకూలంగా ఉండాలి. నిబంధనల కూర్పు ప్రక్రియల్లో పిల్లలకు కలపటం వలన వారి భయాలను చర్చించడానికి వారికి అవకాశం ఉంటుంది. వివిధ కోణాల్లో సమస్యలు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. వారిపై నిబంధనలు విధించే బదులుగా నిబంధనలు అనుసరించేలా నిబద్ధత స్ఫూర్తిని ఉత్పత్తి చేస్తుంది.
బహుళ క్రమశిక్షణా జోక్యం అవసరం
- పిల్లలను శిక్షించటం ఒక రంగానికి సంబంధించినది కాదు కాబట్టి బహుళ రంగ సూచనలను తీసుకోవలసి ఉంది. మానసిక నిపుణులు, విద్యావేత్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు మరియు పిల్లలు ఇందులో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలి. వారి సహాయ సహకారాలు పిల్లల మంచి ప్రవర్తనకు సహాయపడతాయి.
అనుకూల చర్చలు - జీవిత నైపుణ్యాల విద్య
- జీవిత నైపుణ్యాల విద్య పాఠశాల పాఠ్యాంశాల్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలి.
- జీవిత నైపుణ్యాల విద్యను ఒక వైద్యంగా వాడుకోవాలి. ఇది పిల్లల కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు మెరుగు పరచడానికి సహాయపడుతుంది. జీవించగలిగే అలాగే స్వీయ నిర్వహణ నైపుణ్యాలు, తాదాత్మ్యం, నిర్ణయాధికారం మరియు సందిగ్ధ ఆలోచనా నైపుణ్యాలను రూపొందించటానికి ఉపయోగ పడుతుంది. నైపుణ్యాల మధ్య పరస్పర సహాయం మీడియా విధానాలు మరియు ఆరోగ్య సేవలు ఇతర వ్యూహాల మద్దతుకు శక్తివంతమైన ప్రవర్తనా ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది.
- జీవిత నైపుణ్యాల విద్య ఆత్మగౌరవం, దూకుడు, మత్తుపదార్థాల దుర్వినియోగం, విద్యలో ఆచరణాత్మకత లేకపోవడం, నిర్ణయాధికారం, సమస్యా పూరణం, భావోద్వేగాలు ఒత్తిడి, విజయవంతమవకపోవటం కమ్యూనికేషన్ నైపుణ్యాలు - సంధాన/తిరస్కరణ నైపుణ్యాలు, నేర్పులు, సృజనాత్మక ఆలోచన, క్లిష్టమైన ఆలోచనా, ఆత్మజ్ఞానం నైపుణ్యాలు - హక్కులు, ప్రభావాలు, విలువలు, వైఖరులు, బలాలు మరియు బలహీనతల అవగాహన వంటి సమస్యలను చర్చించేలా ఉండాలి.
- తగిన జీవన నైపుణ్యాలు విద్య అమలు పిల్లల ప్రవర్తనలో దీర్ఘకాలిక ప్రభావాలు కలిగి మెరుగుదలకు దారి తీయాలి.
- థియేటర్, వర్ణనలు, కధా మరియు కళాత్మకమైనటువంటివి పిల్లలు నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ వాడుకలోని పద్ధతి పిల్లలు మంచి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలను ఇందులో పాల్గొనేలా చేస్తుంది. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ప్రక్రియ యొక్క లక్ష్యం వారి అంతర్గత మరియు బాహ్య అణచివేతల నుండి విముక్తి పొందటం. అందువలన ఇది వారి జీవితాలను, మరియు వారు నివసించే సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడాలి
పాఠశాల నిర్వహణ / పరిపాలన పాత్ర
- పాఠశాలతో సంబంధం ఉన్న అందరు సిబ్బంది ఈ మార్గదర్శకాలకు లోబడి ఉండాలి.
- అందరు పిల్లలు తమ హక్కులను చట్టం ప్రకారం కలిగి ఉండేలా సిబ్బంది చూడాలి.
- పిల్లలుతో మరియు పిల్లల మధ్య పరస్పర మాటల రూపాలను ఈ లక్ష్యం వైపు దృష్టి సారించేలా చేయాలి. అందరు సిబ్బంది అందరు పిల్లలతో ఒకే పద్ధతిలో మసలుకోవాలి మరియు వారు పాఠశాలలో ఉండడానికి మరియు తమ సామర్థ్యాన్ని తెలుసుకోలా చేయడానికి ప్రోత్సహించాలి.
- RTE లక్ష్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయులు సంరక్షకులు కారు. ఇతర మాటలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క పాత్రను పోషించ కూడదు.
- ఎటువంటి భౌతిక శిక్ష అనుమతి ఉండకూడదు.
- ఎటువంటి మానసిక వేధింపులు అనుమతి ఉండకూడదు. లింగ, కుల, వర్గ, వైకల్యం, మొదలైన వాటి ఆధారంగా తేడాలను అనుమతించకూడదు.
- శారీరక శిక్ష, మానసిక వేధింపులు లేదా వివక్ష లాంటి ఏదైనా చిక్కులు వచ్చిన్నప్పుడు, పిల్లలపై దాని ప్రభావం తక్కువగా ఉండానికి ఒక నిర్ణీత కాలపరిమితిలో దానిని పరిష్కరించాలి.
- భయం, గాయం, అసూయ మరియు వివక్షత వంటివి లేని వాతావరణాన్ని సృష్టించడానికి అందరు సిబ్బంది బాధ్యత వహించాలి.
- పాఠశాలలో పిల్లలతో వ్యవహరించే టప్పుడు వారు కూడా కలిసి ఉన్నట్టు మరియు రక్షణ కలిగి ఉన్నట్టు అనిపించేలా చెయాలి. పిల్లలకు కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంచాలి.
అభ్యాసానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించటం అలాగే చేతనత్వం సృష్టించడానికి మార్గదర్శకాలు
- అందరు పిల్లలు భౌతిక శిక్షలు, దాడుల , మానసిక వేధింపులు, వివక్షలకు వ్యతిరేకంగా మాట్లాడటం మరియు దానిని అధికారులకు తెలియచేసే హక్కు కలిగి ఉన్నారని వారికి సమాచారం మరియు ప్రచారం చేయాలి. వారికి ఫిర్యాదులు చేయడానికి విశ్వాసం ఇవ్వాలి మరియు పాఠశాల శిక్షను ఒక 'సాధారణ' విషయంగా అంగీకరించనివ్వవద్దు.
- గురువు మరియు పరిపాలన ప్రవర్తన పిల్లలకు కలివిడి, సంరక్షణ మరియు పెంపుదల నమ్మకాన్ని కలిగించాలి.
- పిల్లల హక్కులను తెలుసుకోవడానికి, అర్థంచేసుకోవడానికి మరియు విద్యా హక్కు స్పూర్తిని తెలుసుకోవడానికి సాధారణ శిక్షణా కార్యక్రమాలను ఉపాధ్యాయులు మరియు విద్యా నిర్వాహకులకు పాఠశాల నిర్వహకులు మరియు విద్యాపరమైన పరిపాలనలో అధికారులకు కల్పించాని. హక్కు ఆధారిత విద్యా విధానం భౌతిక శిక్ష, మానసిక వేధింపులు, వివక్ష నిషేధించేందుకు అత్యవసరం.
- పిల్లల దురవస్థలను అర్థం చేసుకోవడానిక ఉపాధ్యాయులకు ఈ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలి.
- ప్రభుత్వ, ఎయిడెడ్ లేదా ప్రైవేట్ పాఠశాలలో పని చెస్తున్న ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహకులకు మరియు ప్రభుత్వ జిల్లా అధికారారికి లిఖితపూర్వకంగా తాము 'భౌతిక శిక్ష, మానసిక వేధింపులు, వివక్ష' లాంటివాటిలో ఎవైతే న్యాయపరంగా ఆటంకాలు కలిగిస్తాయో వాటికి పాల్పడమని తెలియచేయాలి.
- అన్ని పాఠశాలలు భౌతిక శిక్షలు, మానసిక వేధింపులు, వివక్షలపై వార్షిక సామాజిక ఆడిట్ నిర్వహించాలి. దీనిని అధికారులు, తల్లిదండ్రులు మరియు పౌర సమాజానికి నికి అందుబాటులో ఉంచాలి. ఈ ఆడిట్ విద్యా సంవత్సరం ముగిసేలోగా జరగాలి మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ ముందు అందరికి అందుబాటులో ఉంచాలి.
- పాఠశాల యాజమాన్యం ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందరు తల్లిదండ్రులతో సాధారణ సమావేశం అలాగే పాఠశాల నిర్వాహక సంఘాలు (SMCs) తో సమావేశం RTE కింద నిర్వహించాలని ఆదేశాలను జారీ చేయాలి. ఇది పాఠశాల విద్య కమిటీలు లేదా మాతృసంస్థ గురువు సంఘాలు ( SMCs మార్గదర్శకాలు లేకాపోతె) NCPCR సూచనల ప్రకారం నిర్వహించాలి. ఇంకా ఇది పాఠశాలల్లో పిల్లలు మరియు వారి హక్కులను సంరక్షించుకునే విధంగా ఉండాలి.
- శారీరక దండన లేని వాతావరణం కల్పించడ మనేది తప్పనిసరి ఎందుకంటే కొత్త RTE కింద పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్యం గుర్తింపు/నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వడానికి ఇది ఒక షరతుగా ఉంది. ఒక పాఠశాలకు గుర్తింపు ఇవ్వడానికి కూడా ఇది ఒక ముఖ్య షరతు. అలాగే 'శారీరక శిక్షా పద్ధతి' పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు ఇచ్చిన గుర్తింపు/(NOC)ని ఉపసంహరించుకోనేలా నియమాలు మరియు నిబంధనల ఫ్రేమ్ లలో ఉండాలి. నియమాల ప్రభావం గురించి తెలుసుకోవడానికి ఒక నిర్ణీత కాలపరిమితి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సవరణలు ద్వారా సమీక్షించాలి.
పిల్లలు ఒక వాయిస్ ఇవ్వాడానికి మరియు సానుకూల వాతావరణం సృష్టించే ప్రక్రియలో నిమగ్నం అవడానికి అవసరమైన పద్ధతులు మరియు ప్రక్రియలకు మార్గదర్శకాలు
- వ్యక్తిగతంగా మరియు అజ్ఞాతంగా వారి ఫిర్యాదు వ్యక్తం చేయటానికి యంత్రాంగాన్ని పిల్లలకు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల బాక్సులను పాఠశాలలో స్థాపించాలి మరియు ఒక యంత్రాంగాన్ని దానిని పరిష్కరించేందుకు అభివృద్ధి చేయాలి. పిల్లల లేదా తలిదండ్రుల గోప్యతను రక్షించాలి. ఉదాహరణకు మీడియా ఇతర సంస్థలతో ఫిర్యాదులను/మనోవేదన వివరాలను పంచుకునే టప్పుడు.
- ఇది అన్ని వయసుల పిల్లలు సానుకూలంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించడానికి 'తరగతి బాల సభ' ను ఏర్పాటు చేయటం పాఠశాల అధికారుల బాధ్యత.
- ఇతర విధులతో పాటు విద్యార్ధి సంఘం పిల్లలకు హక్కులు మరియు విద్యా హక్కు ఉల్లంఘించకుండా ఉండటానికి సంకేతాలను మరియు నియమాలను ఖరారు చేయాలి.
- స్పస్టమైన ప్రాథమిక పత్రాలను విద్యార్థులు మరియు/లేదా తల్లిదండ్రులు మనోవేదనలు చెప్పటం కోసం పాఠశాలలు రూపొందించాలి.
- శారీరక దండన యొక్క కేసులు చూసేటందుకు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ప్రతి పాఠశాలలో ఒక శారీరక దండన పర్యవేక్షణ సెల్ (CPMC)ను ఉంచాలి. ఈ కమిటీలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు తల్లిదండ్రులు (తల్లిదండ్రులచే ఎన్నికయినవారు), ఒక వైద్యుడు (అందుబాటులో ఉండే చోట) ఒక న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నామినేట్ అయి ఉండాలి, ఒక స్వతంత్ర కౌన్సిలర్, స్థానిక స్వతంత్ర బాలల హక్కుల లేదా మహిళ హక్కుల కార్యకర్త (స్థానిక తహసిల్దార్ / BDO ప్యానెల్ నుండి సిఫార్సు చేసిన వారినుంచి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా నియమించబడిన వారు) మరియు తరగతిలో ఎంచుకోబడిన ఇద్దరు పిల్లలు వారు పెద్ద తరగతి కాని వారు అయి ఉండాలి. దీనికి కారణం పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఈ పనులలో పడకూడదు. ఉదాహరణకు, 5 తరగతులను కలిగిన పాఠశాలలో క్లాస్ 5 నుండి 2 విద్యార్థులు కావచ్చు; ఒక పాఠశాలలో క్లాస్ 8 నుంచి 2 విద్యార్థులు, క్లాస్ 10 వరకు తరగతులను కలిగి ఒక పాఠశాల అయతే, ఇది 9 వ తరగతి నుండి 2 విద్యార్థులు మరియు క్లాస్ పాఠశాల 12 వ తరగతి వరకు ఉంటే 11 వ తరగతి విద్యార్ధి ఉండాలి./li>
- CPMC పాత్ర:
- శారీరక దండన, బాలలపై లైంగిక వేధింపు, మానసిక వేధింపులు, వివక్ష లాంటి వాటిని వినడానికి ఏలాంటి ఆలస్యం చేయకూడదు వీలైతే అదే రోజు దానిని వినాలి. ఎలాంటి ఆలస్య అయినా సాక్ష్యాలను మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందకేటే పిల్లలు పాఠశాల/ఉపాధ్యాయుల కమ్యూనిటీ యొక్క నిర్బంధంలో ఉంటారని గమనించాలి, వారు ప్రభావానికి గురికావచ్చు. విద్యార్థి/తండ్రి/గురువు/సిబ్బంది ఫిర్యాదులు చేసినందుకు వేధింపులకు లోనుకాకుండా చూడాలి;
- విద్యార్థులు మీడియా/పోలీసు/చట్ట లేదా ఏ ఇతర అధికార కోర్టు ముందు పాఠశాల అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి బలవంతంగా/ప్రభావితం కాకుంటా చూడాలి;
- శారీరక దండన, బాలలపై లైంగిక వేధింపు, మానసిక వేధింపులు, వివక్ష నివారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారా అని చూడాలి;
- అటువంటి సంఘటనలు ఒక పాఠశాలలో జరిగి నప్పుడు 'బాధిత పిల్లల ఎల్లప్పుడూ ఈ కమిటీ సంరక్షణ పర్యవేక్షణలో ఉంటారు. వీరికి వీలైనంత వెగంగా సహాయం చేయాలి - వైద్య మరియు మానసిక - మరియు దెబ్బలకు అవసరమైన చికిత్స లాంటివి;
- CPMC సిఫారసుల సంఘటన జరిగిన 48 గంటల్లో జిల్లా స్థాయి అధికారులకు, తాలూకాలోని/జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక కాపీని వివరాలతో పాటు పంపాలి.
- ప్రాధమిక పరిహారానికి (పిల్లలు మరియు కుటుంబం CPMC చర్యలతో ఏకీభవించారు), ద్వితీయ పరిహారానికి (అర్థం, CPMC రిపోర్టు పిల్లల మరియు అతని/ఆమె కుటుంబం అంగీకరించలేదు. వాళ్లు జిల్లా స్థాయిలో అధికారులతో మాట్లాడాలని అనుకుంటున్నారు).
- తల్లిదండ్రులు ఎటువంటి చట్టపరమైన చర్యను అవసరం లేదని తెలిపినా కూటా CPMC ద్వారా వారు ప్రశ్నించబడతారు.
- సమస్యలు పాఠశాల స్థాయిలో తీరకపోతే క్లాజ్ 8 మార్గదర్శకాల అనుసరించాలి.
మూలం: బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/11/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.