অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శారీరక దండన –గ్రహ్యత మరియు పరిణామాలు

పరిచయం

  • పాఠశాలల్లో; సంరక్షణ మరియు అనాధ ఆశ్రమాలలో, మరియు బాల గృహాలు, పిల్లల రక్షణ సంస్థలు; కుటుంబంలోకూడా శారీరక దండన ఉంటుంది. శారీరక శిక్షల ప్రాబల్యం వివిధ అధ్యనాలు మరియు ముద్రణలు మరియు ఎలక్ట్రానిక్ పత్రికా రగం ద్వారా స్పష్టమైంది. శారీరక శిక్షలకు సంబంధిచిన అనేక కేసులు ఉపాధ్యాయులకు జ్ఞానోదయం కలిగించాయి. వీరిలో చాలా మంది ఒప్పుకోక పోవటం వలన గుర్తించబడరు.
  • పాఠశాలలో సామాజిక, ఆర్ధిక, భాషాపరమైన మరియు మతసంబంధ గుర్తింపుల ఆధారంగా వివక్షకు సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలు. వైకల్యం మరియు అనారోగ్యం/వ్యాధి ఆధారంగా వివక్ష.
  • మానసిక దూకుడు (అనగా, ప్రవర్తనను సరిచేయడానికి లేదా నియంత్రించ డానికి మానసికంగా బాధకలిగించేలా ప్రవర్తించటం) భౌతికంగా శిక్షించటం కంటే ఎక్కువగా వ్యాపిస్తుందని నివేదించబడింది.

జ్ఞానము

  1. పిల్లలను దండించడం సాధారణం మరియు ఆమోదయోగ్యమైనదిగా భావిస్తారు – అది కుటుంబంలో లేదా సంస్థలలో కావచ్చు. పిల్లలు సమర్థులుగా మరియు బాధ్యతగల వ్యక్తులుగా పెరిగే క్రమంలో ఇది తప్పనిసరి అని భానిస్తారు.
  2. దీని ప్రభావానికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేక పోయినా మరియు దుష్ప్రభావాల సంబంధం లేకుండా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్దతి అసమసర్థత వలన అయోయమయ పరిస్థితి ఏర్పడుతుంది. అధికారము ఉన్నవారు చేసేది పిల్లలు తప్పుకుండా అంగీకారించేలా చేస్తుంది. ఇది హేతుబద్ధీకరణ సంస్కృతికి దారితీస్తుంది.
  3. వ్యాప్తి ఉండటం వలన పిల్లల శారీరక దండనను సమర్ధించటం అంటే ఆమె/అతని హక్కులను అతిక్రమించటం అని అనుకోరు. శిక్ష బాధించినా, పిల్లలకు అ సంఘటనను నివేదించాలి అని తెలుసుకోలేరు.
  4. అందువలన, శారీరక శిక్షను ప్రేమ, పట్టించకోవటం మరియు రక్షణ అనే ముసుగులో చెబుతారు కాని అది పిల్లలకు బాధకలిగించే చర్య. దీనిని అనుకరించి పిల్లలకు 'సంరక్షణ ఇవ్వంచం' అనే చెప్పి ఎల్లప్పుడూ పిల్లల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నంగా పాఠశాల లేదా ఇతర సంస్థల్లో దీనిని ఉపయోగించటం కనిపిస్తుంది. ఈ భావనను పిల్లలు ఉన్నఅన్ని సంస్థలలో విస్తృతంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది.

శారీరక దండనకు కారణాలు.

  1. శారీరక దండనకు ముఖ్యమైన కారణాలలో ఒకటి ఎమిటంటే చాలామంది "క్రమశిక్షణ" మరియు “కొట్టడం” అవేవి రెండు వేరు వేరు విషయాలని గుర్తించకపోవటం. శారీరక దండన ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించే వారిని ఆపటానికి వాడతారు కాని సానుకూల క్రమశిక్షణ పద్ధతులు పిల్లలను అర్ధంచేసుకొని మరియు శిక్ష భయం లేకుండా ఆమోదయోగ్యమైన ప్రవర్తను మార్చుకోనేలా చేస్తుంది.
  2. మరో ప్రధాన కారణం ఉపాధ్యాయులకు తమ వృత్తిపరమైన శిక్షణ సమయంలో పిల్లలు తప్పుగా ప్రవర్తించినట్లయితే ఎలా సానుకూల పద్ధతిలో వారిని క్రమశిక్షణ ప్రతిబింబించేలా బోధించాలో తెలియచేయరు. వారి ప్రవర్తనల ఆధారం ఉపాధ్యాయుడు తన యొక్క వ్యూహాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అనేక సార్లు, పిల్లల తమ అవసరాలు, అంటే శ్రద్ద చూపటం వంటివి, తీరటం లేదు అని అనుకున్నప్పుడు అల్లరి చేయవచ్చు. పిల్లల అల్లరి వలన కలిగే నిరాశ, మరియు దానిని ఆపడానికి కావలిసిన నైపుణ్యాలు లేకపోవడంతో, కొంత మంది ఉపాధ్యాయులు చిన్న పిల్లలను శారీరకంగా, మానసికంగా లేదా ఇతర రకంగా శిక్షిస్తారు.

శారీరక దండన యొక్క దీర్ఘకాల పరిణామాలు.

  • ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలో ఏ రూపం లేదా రకమైన శిక్ష అయినా పిల్లల పూర్తి సంభావ్య అభివృద్ధి మార్గంలో అడ్డువస్తుందని గుర్తించారు.
  • పెద్దలు శారీరక శిక్ష ఉపయోగించినప్పుడు సంఘర్షణ సమయంలో కొట్టడం ఒక ఆమోదయోగ్యమైన మార్గం అని వారి పిల్లలు అనుకుంటారు. పర్యవసానంగా వారు తల్లిదండ్రులు అయినప్పుడు వారి పిల్లలను ఇంకా ఎక్కువగా కొడతారు. మరియు వారు కొట్టడాన్ని ఆమోదిస్తారు.
  • శారీరక దండన ప్రతికూల శారీరక, మానసిక మరియు విద్యాపరమైన ఫలితాలకు దారితీస్తుంది - తరగతిలో దూకుడు మరియు విధ్వంసక ప్రవర్తన పెరుగుతుంది, విధ్వంసం, తక్కువ మార్కులు రావటం, ఏకాగ్రతలోపం మరియు మోసకారి ప్రవర్తన, పాఠశాల మానేయడం, పాఠశాల ఎగవేత మరియు పాఠశాల భయం, పొగరు, ఆందోళన, శారీరక ఫిర్యాదులు, నిరాశ, ఆత్మహత్య మరియు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ప్రతీకారం - వంటివి మానసికంగా పిల్లలు జీవితంలో మచ్చగా మిగులుతాయి.
  • శిక్షలకు గురి అయిన పిల్లలు తమ సహచరులు మరియు తోబుట్టువులతో దూకుడు సంఘర్షణల ఇష్టపడతారు. వారు అది ఇతరుల హక్కుల ఉల్లంఘనగా పరిగణించరు.
  • దూకుడు మరియు ఆక్రమణ ముందు జీవితంలో తప్పుగా ప్రవర్తించడానికి చిహ్నాలు అవుతాయి. దీనికి మరియు పిల్లల శారీరక శిక్షకు మధ్య సంబంధం ఉంటుంది.
  • మానసిక వేధింపుల వివిధ రూపాల ప్రభావాలు కింద వివరించబడింది.
    • తిట్టడం మరియు మానసిక నిర్లక్ష్య మిశ్రమాలు అత్యంత ఎక్కువగా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి;
    • మానసిక గాయాలు భౌతిక గాయాల కంటే తీవ్రతంగా పిల్లల అభివృధ్ధిలో హానికర ఫలితాల కల్గిస్తాయి;
    • ఇది పిల్లలు మరియు కౌమార దశలోనివారి ప్రవర్తన సమస్యలు సంబంధించిన సూచిక; మరియు
    • భౌతిక దాడులకన్నా మానసిక శిక్ష ఆత్మన్యూన్యతను ఎక్కువ పెంచుతుంది.
  • మానసికమైన వత్తిడి వలన పిల్లలలో స్వీయ మరియు వ్యక్తిగత భద్రతా భావన నాశనమవుతుంది.
  • చిన్న మరియు బహిరంగ రూపాలలో వివక్ష కూడా పిల్లల్లో భావభరిత మరియు మేధో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
  • శారీరక దండన యొక్క హానికరమైన పరిణామాలను గుర్తించడానికి మామూలు వ్యాఖ్య ఏమిటంటే " అన్ని రకాల 'భౌతిక లేదా మానసిక హింస' పిల్లలపై ఏ స్థాయిలో ఉన్నా చట్టబద్ధ హింసకు స్తానంలేదు. శారీరక దండన మరియు ఇతర క్రూరమైన శిక్షలు లేదా అవమానకర రూపాల్లో హింసను తొలగించడానికి తగిన శాసనబద్ధ పరిపాలనా, సామాజిక మరియు విద్యపరమైన చర్యలను దేశం తీసుకోవాలి "

మూలం: బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate