లైంగిక వేధింపులతో సహా శారీరక దండన యొక్క అన్ని రూపాలు పిల్లలకు హాని కలిగిస్తాయి. ప్రస్తుతం, భారత చట్టంలో పిల్లల శారీరక దండన యొక్క శాసనబద్ధ నిర్వచనం లేదు. శారీరక దండన నిర్వచనం సూచన ప్రాయంగా ఉంటేనే మంచిది. ఆర్ టి ఇ చట్టం, 2009 యొక్క నిబంధనలకు అనుగుణంగా, శారీరక శిక్షను భౌతిక శిక్ష, మానసిక వేధింపులు మరియు వివక్షలుగా వర్గీకరించారు.
భౌతిక దండన
- పిల్లలకు నొప్పికల్గించటం, కొట్టడం/గాయ పరచటం మరియు అసౌకర్యం కలిగించే ఏ చర్య అయినా, అది చిన్నదైనా సరే, భౌతిక దండన అని అర్థం చేసుకోవచ్చు. క్రింద కొన్ని భౌతిక దండన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి:
- చిన్న పిల్లలను శారీరకంగా హాని కలిగించే టటువంటి కొట్టడం, తన్నడం, గిల్లటం, నొక్కడం, ఎత్తిపొడుపు, జుట్టు పట్టడం, చెవులు పిండటం, దెబ్బవేయడం, ఎవస్తువుతోనైనా తట్టటం (కట్టె, కర్ర, షూ, సుద్ద, దులిపే బట్ట, బెల్ట్, కొరడా, విద్యుత్ షాక్ ఇవ్వడం లాగడం మొదలైనవి);
- పిల్లలకు ఒక అసౌకర్యమైన స్థలంలో ఉంచటం (బెంచీ మీద, గోడకుర్చీ, మోకాళ్లపై ఒక కుర్చీ లాంటి స్థానంలో గోడకు వ్యతిరేకంగా తలపై పాఠశాల సంచీ పెట్టి నిలబెట్టడం, కాళ్ళ గుండా చెవులు పట్టుకునేలా చేయటం) మొదలైనవి;
- ఏదైనా బలవంతంగా మింగేలా చేయటం (ఉదాహరణకు: ఉతికే సబ్బు, మట్టి, సుద్ద, వేడి ద్రవాలు మొదలైనవి);
- తరగతిలో, లైబ్రరీలో, టాయిలెట్ లేదా పాఠశాలలోని ఇరుకు ప్రదేశంలో నిర్భందించటం.
మానసిక వేధింపులు
పిల్లల విద్యా మరియు మానసిక ఆరోగ్యానికి హానికలిగించే వాటిని శారీరకమైనవి కాని వేధింపులుగా గుర్తిస్తారు. అలాంటి వాటిని కొన్ని కింద ఉదహరించారు:
- పిల్లలను బాధించే లేదా గౌరవం తగ్గించే వ్యంగ్యం;
- పేర్లు పెట్టి పిలిచి అవమానకర విశేషణాలు మరియు భయపెట్టడం;
- నినాదాలు అంటించడం, పిల్లలతో అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయటం;
- పిల్లల నేపధ్యం లేదా వారి స్థితి లేదా వారి తల్లిదండ్రుల ఉద్యోగం లేదా కులానికి సంబంధించి పిల్లలను ఎగతాలి చేయటం;
- పిల్లల ఆరోగ్య స్థితి లేదా కుటుంబీకులకు సంబంధించి ఆరోగ్య స్థితిని ఎగతాళి చేయటం - ముఖ్యంగా HIV / AIDS మరియు క్షయ వంటి జబ్బులున్నప్పుడు;
- ఉపాధ్యాయులు అంచనావేసిన దానికంటే తక్కువగా చదువుతున్న పిల్లలను వారి అసమర్థతను అవమానించటం;
- ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించకుండా చదువులో క్రమశిక్షణ కోసం దండించటం. అలాంటి పిల్లలలో చదవలేక పోవటం, శ్రద్ధ లేకపోవటం, సచేతన క్రమరాహిత్యం, తేలికపాటి అభివృద్ధి ఆలస్యం మొదలైనటువంటి పరిస్థితులు ఉంటాయి;
- పిల్లలను సరిచేయడానికి శిక్షాత్మక చర్యలు ఉపయోగించటం మరియు అతనికి/ఆమెను మొండివాళ్లని అనటం; అతి క్రియాశీలత కలిగి ఏకాగ్రత లోపం ఉన్న పిల్లలు చదువులో పేలవంగా ఉండటమే కాకుండా తరగతిలో వీరి ప్రవర్తనలను నియంత్రించటం కష్టం;
- వారి పనితీరును మెరుగు పరచు కోవడానికి పిల్లలను 'అవమానించటం' తో చైతన్య పరచడానిక ప్రయత్నించటం;
- నత్తిగా మాట్లాడటం వంటి శారీరక సమస్యలు లేదా మాట్లాడటానికి సంబంధిచిన రుగ్మత వంటి అభివృధ్ధి సమస్యలు గల పిల్లలను ఎగతాళి చేయటం.
పక్షపాతం
ఆమె/అతని కులం/లింగం, వృత్తి లేదా ప్రాంతం మరియు 25% రిజర్వేషన్ల క్రింద ఫీజులు చెల్లించని సమూహాలు లేదా సమాజంలోని బలహీన వర్గాల పట్ల దురభిప్రాయంతోకూడిన ప్రవవర్తనను RTE, 2009 పక్షపాతంగా గుర్తించింది; అది కనబకుండా లేదా స్పస్టంగా ఉండవచ్చు; తెలిసేలా ఉండవచ్చు లేదా కపటంతో ఉండవచ్చు. క్రిందిని వాటిలో కొన్ని ఉదాహరణలు:
- ఒక సామాజిక సమూహానికి లేదా లింగానికి సంబంధించి లేదా సామర్థ్యం/వైకల్యం వంటి వాటికి సంబంధించిన సామాజిక వ్యవహారాలు మరియు నమ్మకాలను పాఠశాలలోకి తీసుకురావటం;
- కులం, సమాజం, లింగం లేదా పక్షపాతం ఆధారంగా పాఠశాలల్లో వివిధ విధులు మరియు కూర్చొనే ప్రదేశాలను కేటాయించడం (ఉదాహరణకు, కులాన్ని బట్టి మరుగుదొడ్లు శుభ్రం చేసేపని అప్పగించటం, లింగాన్ని బట్టి టీ తయారి విధిని అప్పగించటం); RTE కింద 25% రిజర్వేషన్ సీట్ల ద్వారా ప్రవేశం పోందినందుకు; లేదా ఏదైనా నిర్దేశించిన ఫీజు చెల్లించనందుకు;
- కుల లేదా కమ్యూనిటీ పక్షపాతాల ఆధారంగా విద్యా సామర్థ్యాలపై వ్యాఖ్యానించటం;
- మధ్యాహ్న భోజనం లేదా లైబ్రరీ పుస్తకాలు లేదా యూనిఫారాలు లేదా క్రీడలు సౌకర్యాలను ఒక పిల్లవాడు లేదా పిల్లల సమూహం హానికి కులం, కమ్యూనిటీ, మతం లేదా లింగం ఆధారంగా అంచేయకపోవటం;
- ఉద్దేశపూర్వక/నిరంకుశ నిర్లక్ష్యం.
ఐక్యరాజ్యసమితి నిర్వచనము.
ఈ క్రింది విధంగా బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కమిటీ శారీరక శిక్షను నిర్వచిస్తుంది: "కార్పోరల్" లేదా "భౌతిక" శిక్ష అంటే నొప్పి కలిగించడానికి లేదా అసౌకర్యాన్ని కలిగించడానకి శారీరక శక్తిని, కొంచెం అయినా సరె, ఉపయోగించటం. పిల్లలను కొట్టడం ఇందులో ఎక్కువగా ( "దెబ్బవేయడం", "చెంపదెబ్బ కొట్టడం", "పిరుదులపై కొట్టడం") ఉంటుంది, చెయ్యితో గాని లేదా ఏదైనా వస్థువుతోగాని - కొరడా, కర్ర, బెల్ట్, షూ, చెక్క స్పూన్, మొదలైనవి. వీటితే పాటు వేరేవికూడా ఇందులోకి వస్తాయి, ఉదాహరణకు, తన్నటం, ఉపటం లేదా పిల్లలను తోసేయటం, గీరటం, గుచ్చటం, వెంట్రుకలను లాగటం, పిల్లలను అసౌకర్య స్థానాల్లో బలవంతంగా ఉండడం, కాల్చటం, మండించడం లేక బలవంతంగా అంటించటం (ఉదాహరణకు, పిల్లల మొహంపై నీల్లు చల్లటం లేదా వేడి ద్రవ్యాలను మింగించటం). ఈ కమిటీ అభిప్రాయంలో ప్రకారం శారీరక దండన రోజు రోజుకు అవమానకరంగా మారుతుంది. అదనంగా, భౌతిక శిక్షలు కాని రూపాలలో కూడా ఇది ఉంది. ఇదికూడా క్రూరమైనది మరియు అవమానకరమైనది. అందువలన అవి మామూలు వాటితో పోల్చలేము. అవి, ఉదాహరణకు, చిన్న బుచ్చుకొనేలా చేయటం, అవమానించటం, అప్రతిష్ఠపాలు చేయటం, పశువులుగా బెదిరించటం, భయపెట్టడం లేదా వేళాకోళంగా ప్రవర్తించటం. అంతేకాక, కమిటీ శారీరక దండన వివిధ సందర్బాలలో విధిస్తుంటారని గుర్తించింది: శారీరక దండన ఇతర క్రూరమైన లేదా అవమానకర రూపాల్లో ఇల్లు, పాఠశాలలు మిరియు విద్యాసంస్థలో ఉంది. వీటికి న్యాయస్థానాల తీర్పులు ఇచ్చాయి మరియు శిక్షా కూడా విదించాయి. - బాల కార్మిక పరిస్థితుల్లో, మరియు సమాజంలో.
ఈ నిర్వచనం ఒక మాపకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది అనేక రకాలుగా ఉన్న శారీరక శిక్ష రూపాలు ఉద్ఘాటిస్తుంది. అది శారీరక శిక్ష యొక్క పూర్తి స్పెక్ట్రంను అమరుస్తుంది. పిల్లలకు వ్యతిరేకంగా భౌతిక శక్తిని ఎవరూ ఆమోదించరు.
మూలం: బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్.