హోమ్ / విద్య / బాలల ప్రపంచం / “ఆటలెందుకు?”
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

“ఆటలెందుకు?”

“ఆటలెందుకు?”

ఆటలెందుకు?

atlenduku.jpg

ఈప్రశ్నకి సమాధానం దొరకని ఓ వ్యక్తి

సీగాన పెనుబాంబతో ఆడుకుంటున్న బుడుగుని పిల్చి అడిగాడు.

ఎగాదిగా సీరియస్ గా చూశాడు బుడుగు. పక్కున నవ్వాడు. ఒక్కసారిగా,

“ఇదేం ప్రశ్న?! ఒఠ్ఠి వెంగళప్పాయ ప్రశ్న!

కళ్ళజోడెందుకు?

పలకెందుకు?

చొక్కాకి బొత్తాలెందుకు లాంటి ప్రశ్నలుంటాయి గానీ –

మెడకాయ మీద తలకాయ వున్న వాడెవడైనా ఇంత వెర్రిబాగుల ప్రశ్న అజుగుతాడా? ఆ టలెందుకు?... ఆడుకోవడానికి!!!”

అనేసి తుర్రున పారిపోయాడు.

“అవును కదా!” అని బుర్రగోక్కున్నాడు సదరు వ్యక్తి.

ఇది వరకిట్లో అమ్మలు పాడే దీవెనలాంటి ఓ పాట ఉండేది.

“ఛదువుకో నాయనా చదువుకో తండ్రీ

చదువుకుంటే నాకు సౌఖ్యమబ్బేను

పాడుకో పాడుకో రత్నాల మొలక

తేనె వానలు మమ్ము ముంచుకొచ్చేవి,

ఆడుకో నాయనా ఆడుకో తండ్రీ ఆడుకుంటే

నీకు ఆనందమరయు!”

ఎంత అనురాగపూరితమైన దీవెన!

పిల్లలు ఆడుకోవాలి కాబట్టి ఆటలు!

ఆటలు వాళ్ళ జన్మహక్కు కాబట్టి ఆటలు!

ఆటలు వాళ్ళ ఊపిరి కాబట్టి ఆటలు! ఆటలు వాళ్ళకిష్టం కాబట్టి ఆటలు!

అవును - ఆటలు అచ్చంగా ఆటలకోసమే!

మరే పెద్ద ఉద్దేశ్యాలూ, ప్రయోజనాలూ అక్కర్లేదు.

“ఆటలు ఆటలకోసమేనా?

ఇదో వెంగళప్పాయ సమాధానం కాదూ మరి!?

అదేం కుదరదు. ఏ ప్రయోజనమూ అక్కర్లేదంటే ఎలా?”... అంటారా?

ఐతే సరే... ఒక్క ప్రయోజనమేం ఖర్మ!

భారీ ప్యాకేజీనే ఉంధి.

ఒక్క దెబ్బకి వంద పిట్టలన్నమాట!

చదవండి మరి...

శారీరక అభివృద్ధికి

 • atalenduku2.jpgపిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడానికి.
 • పరుగులెత్తి, ఆడుకునేటప్పుడు గుండె, ఊపిరితిత్తుల వంటి భాగాలు చాలా చురుకుగా పని చేస్తాయి. అందువల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
 • ఆరుబైట సూర్యరశ్మిలో ఆడుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారౌతాయి.
 • కండరాలకు మంచి వ్యాయామం లభించి, పటుత్వం పెరుగుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆటలాడుకునే పిల్లలు అరుదుగా వ్యాధుల బారిన పడతారు.
 • ఆకలి చక్కగా వేస్తుంది. వ్యర్థమైన చిరుతిళ్ళు తగ్గించి, మంచి ఆహారం తినిపించడానికి ఇది చక్కటి మార్గం.
 • ఊబకాయం సమస్య ఉండదు. బద్దకం వదులుతుంది.
 • గెంతడం, కుందడం, జారడం వంటి ఆటల ద్వారా కదలికలలో బ్యాలెన్స్ వస్తుంatalenduku3.jpgది.
 • బంతి, రింగు లాంటివి విసరడం పట్టుకోవడంలో కంటికి - చేతికి సమన్వయం పెరుగుతుంది.
 • చురుకుగా ఉంటారు - చిన్నచిన్న పనులకే అలసట రావడం ఉండదు.

సాంఘికాభివృద్ధికి

 • నలుగురితో మెలిగే తీరు, నైపుణ్యాలు మెరుగుపరచుకోడానికి.
 • ఆటలాడాలంటే ఎలాంటి పిల్లలైనా నలుగురిలో కలవాల్సిందే - ఒక్కరే ఆడుకోలేరు కాబట్టి!
 • కోపం, ఆవేశం, బాధలాంటి ఉద్వేగాలెన్ని కలిగినా, అవన్నీ కాసేపు ప్రక్కన పెట్టి సరుకు పోవాల్సిందే! ఎవరూ నేర్పకుండానే అలవడే నైపుణ్యమిది.
 • ఆటలన్నాక నియమాలు ఉంటాయి. వాటిని పాటించక పోతే జట్టులో స్థానముండదు కనుక నియమాలకు కట్టుబడి ఉండడం అప్రయత్నంగానే అలవాటవుతుంది.
 • atalenduku5.jpgజట్లుగా ఆడే ఆటలలో తప్పనిసరిగా పరస్పరం సహకరించుకుంటారు. ఒక్కరి వల్ల కాదనీ, ఒకరి ఆట ఇతరుల ఆటపైన కూడా ఆధార పడిఉంటుందనీ అర్థమవుతుంది.
 • 'అందరూ కలిసి చెయ్యడం' అనే భావన యొక్క విశిష్టత, అవసరం స్పష్టమౌతాయి.
 • atalenduku6.jpgతరగతి గదుల్లో ఉండే వయోవిభజన (ఒకే వయసు వున్నవారు మాత్రమే ఒక బృందంగా ఉండడం) అనేది సాధారణంగా ఆటలలో ఉండదు. వయస్సుల్లో ఉండే కొద్దిపాటి హెచ్చుతగ్గులు నైపుణ్యానికి పెద్ద విషయం కాదని చెప్పకనే తెలుసుకుంటారు.
 • తమకన్న పెద్ద/చిన్న వారితో కలిసి ఆడడంలో ఎన్నోరకాల సరుబాటు నైపుణ్యాలు అలవడతాయి.
 • ఎదుటి బృందం నైపుణ్యాలను గుర్తించడం, గౌరవించడం, తగిన విధంగా తమను సంసిద్దులుగా చేసుకోవడం ఆటలలో ఒక భాగం.
 • అందరితో కలిసి ఊ్యహరచన చెయ్యడం, ప్రణాళికను వేసుకోవడం దానిని కార్యరూపంలో పెట్టేలా చూడడంలో నాయకత్వ నైపుణ్యాలు అబ్బుతాయి.
 • నాయకుని ఆధ్వర్యంలో బృంద లక్ష్యాలకు అనుగుణంగా పనిచెయ్యడం కూడా!

సృజనాత్మక వ్యక్తీకరణకు

 • atalenduku7.jpgక్రొత్త విషయాలను సరిక్రొత్త పద్ధతిలో ఆలోచించడం పిల్లల సహజగుణం.
 • స్వేచ్చాయుత వాతావరణలో పెరిగే పిల్లలు తాము చేసే పనులలో తమదైన ముద్ర ఉండాలని ప్రయత్నించడం గమనిస్తాం.
 • ఖోఖో, అష్టచెమ్మ, వాలీబాల్ లాంటి పరిచయమున్న నియమనిబంధనలు నిర్దేశించబడిన ఆటలు ఆడడానికి ఇష్టపడినట్లే, క్రొత్త ఆటలను కనిపెట్టడానికి అత్యంత ఉత్సుకతను చూపిస్తారు.
 • పిల్లలు కనిపెట్టిన ఆటలు నియమ నిబంధనలు సరళంగా ఉండి - తప్పనిసరిగా ‘సరదా’గా ఉంటాయి.
 • atalenduku8.jpgమనకు తెలిసిన ఆటలలో నైపుణ్యాల ఆధారంగా గెలుపు ఓటములు ప్రధాన పాత్రవహిస్తే - పిల్లలు సృష్టించిన ఆటలు అందరూ కలిసి నవ్వుకునేలా ఉండి - ఎవరు గెలిచారన్నది తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
 • అందుబాటులో ఉన్న వస్తువులతో, ఉన్న సభ్యులతో, స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి (రాత్రా, పగలా/ఇద్దరా, పదిమందా/ అసలే వస్తువులు లేకపోయినా గానీ) అప్పటికప్పుడు
 • సరిక్రొత్త ఆటను సృష్టించడం (అదీ అందరికీ ఆమోదయోగ్యంగానూ, ఇష్టంగానూ ఉండేలా) ఎంతో సృజనాత్మకత ఉంటేగానీ కుదరని విషయం.
 • అప్పటికప్పుడు సందర్భానికి తగిన మార్పులు, సడలింపులు చేసుకోవడం ప్రజ్ఞతో కూడిన విషయం.పిల్లలకే బహుశా అది సాధ్యం!

భావోద్వేగ వికాసానికి

 • ఉద్వేగాలను నియంత్రణలో వుంచుకునేందుకు...
 • జీవితం భావోద్వేగాల పూరితం. వాటిని అదుపులో ఉంచుకోలేక, వాటిలో కొట్టుకు పోవడం వల్ల పెద్దల జీవితాల్లో ఎన్నో సమస్యలు.
 • నిత్యం యాంత్రికంగా పుస్తకాల తోను, టివిలతోను గడిపే పిల్లలకు రకరకాల భావోద్వేగాల అనుభవం ఉండదు. కాబట్టి సున్నితమనస్కులుగా ఉండడానికి, భావోద్వేగ సమతుల్యం లేకపోవడానికి అవకాశం ఎక్కువ.
 • atalenduku9.jpgఆటలాడేటప్పుడు ఎన్ని రకాల అనుభవాలు!!! గెలుపు ఓటములలో కలిగే సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం, ఆవేశం, కోపం, బాధ, నిరుత్సాహం, ఈర్ష్య. ప్రతి పిల్లవాడు ఈ ఉద్వేగాలనన్నీ అనుభవించాల్సిందే! వాటి నుంచి సమతుల్యంతో వ్యవహరించడం అలవర్చుకోవలసిందే!
 • నిర్దిష్ట నియమ నిబంధనలు కలిగిన ఆటలను చిన్నతనంనుండి ఆడుతూ ఉన్నపిల్లలు పెద్దయ్యాక భావోద్వేగ సమతుల్యతను (Emotional Balance) కలిగి ఉంటారనేది ఒక సామాన్య పరిశీలన, ఆటలలో ఓసారి ఓడిన పిల్లవాడు దాన్ని వదిలి పెట్టెయ్యడం చూడం. తన ఓటమికి కారణాలు వెతుక్కుని మరింత కృషితో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తాడు.
 • atalenduku10.jpgఆటలాడుతూ పెరిగిన పిల్లలు ఓటమికి అతిగా కుంగిపోవడం, ఒక్క గెలుపుతో ఇక చెయ్యాల్సింది లేదన్నట్టు వదిలెయ్యడం చెయ్యరు.
 • ఓటమికి తావే లేదన్నట్టు చిత్రీకరించ బడుతున్న నేటి చదువు, ఉద్యోగాల నేపథ్యంలో ఈ విషయం మరింత ముఖ్యమైనది.
 • ఆటలలో ప్రతి చిన్న వ్యక్తిగత విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చదువులలో నెమ్మదిగా ఉండే పిల్లలకు ఇది అత్యంత అవసరం.
 • తన నైపుణ్యానికి జట్టులో లభించే గుర్తింపు వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది.

మేధోవికాసానికి

 • “ఆటల వల్ల సమయం వృథా, పసి పిల్లలకు ఆటలుకానీ చదువుకోవాల్సిన వయసులో ఆటలు ధ్యాస వుంటే ఇక చదువు సాగినట్టే"
 • "అసలే చదువులో నెమ్మది. ఒకటికి నాలుగు సార్లు చదివితేకానీ బుర్రకెక్కదు. వీడికి ఆటలా? ఆదివారం ఆడుకుంటాడ్లే గంట సేపు ఆడుకునే బదులు ఓ ప్రశ్ననేర్చుకోవచ్చు"
 • చదువులో అంత చురుకు కాని పిల్లల తల్లితండ్రుల అభిప్రాయాలు సాధారణంగా ఇలా ఉంటాయి.
 • ఇది వందశాతం తప్పు, పిల్లలు ఎప్పడో పరిస్థితులు అనుమతించినప్పుడు ఆడుకోవడం కాదు. ప్రతిరోజూ ఆడుకోవాలి - తప్పనిసరిగా!
 • మరి సమయం వృథా కాదా? ఖచ్చితంగా కాదు. రోజుకోగంట ఆటలకి కేటాయించడం వృథా కాదు. కనీస అవసరం!
 • శరీరానికి వ్యాయామాన్నిచ్చే ఆటల వల్ల పిల్లలలో వత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.
 • శారీరకంగా ఆరోగ్యంగా వున్న పిల్లలకే మెదడు చురుకుగా పని చేస్తుందన్నది అందరికీ తెల్సిందే!
 • చదువులో వెనుకబడి వున్న కారణంగా ఆటలకు దూరం చేస్తే చిన్నారులు మరింత కృంగిపోతారు. ఆటలలో వారి నైపుణ్యాలు బహిర్గతమయ్యే అవకాశాలుండడం వల్ల, విజయాలు లభించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, అది చదువులో మెరుగుపడే అవకాశాన్నిస్తుంది.
 • భాష లెక్కలు వంటి విషయాలలో వెనుకబడిన పిల్లలు ఆటల (బోర్డుగేమ్స్) నియమ నిబంధనలను స్వయంగా చదివి అర్థం చేసుకోగలగడం, ఇతరులకు వివరించడం, ఎంతో క్లిష్టమైన విషయాలను, అంకెలను గుర్తు పెట్టుకోవడం, తెలివిగా ఎత్తుగడలు వేయడం చేస్తుంటారు. వీటివల్ల వారి మేధస్సు పదును తేలుతుందని గ్రహించడం మనకు కష్టం కాదు! అటువంటి ఆటలు ఆడనివ్వకపోవడం, వారిని ఆ రకంగా ఆలోచించే అవకాశానికి దూరం చెయ్యడం కదా!

దీనంతటి సారాశం ఏంటంటే...

atalenduku11.jpg24 గంటల్లో ఓ గంట ఆటలకి కేటాయించడానికి ఇంతకంటె ప్రయోజనాలక్కర్లేదేమో! గంటలు గంటలు సెల్ ఫోన్లు, టీ.వీ.లు, కంప్యూటర్లు, పుస్తకాలతో కూర్చునే పసి పిల్లలకు తెలీదు - రేపు 30 ఏళ్ళకే బి.పి. షుగరు లాంటి వ్యాధులు రావచ్చనీ, గుండెజబ్బు లాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉండగలవనీ తెలిసిన పెద్దలుగా “ఆయురారోగ్య ప్రాప్తిరస్తు" అని ఆశీర్వదించడం తోపాటు ఓ గంట సేపు రోజూ ఆడుకోనిద్దాం. వీలైతే మనమూ ఆడుకుందాం!

2.98076923077
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు