హోమ్ / విద్య / బాలల ప్రపంచం / జంతు ప్రదర్శనశాలలు అవసరమా?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జంతు ప్రదర్శనశాలలు అవసరమా?

జంతువులను సంరక్షించాల్సిన అవసరాన్ని మన బాధ్యతను తెలుసుకుందాం.

లక్ష్యం

జంతువులను సంరక్షించాల్సిన అవసరాన్ని మన బాధ్యతను తెలుసుకుందాం.

నేపథ్యం

జంతువుల సంరక్షణ, పరిశోధన మరియు చైతన్యాన్ని కలిగించటంతోపాటు జంతువులకు సంబంధించిన వివిధ రకాల సమాచారం ప్రజలను తెలియజేయడం కొరకు జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయబడినాయి. చాలా సందర్భాలలో కొన్ని రకాల జంతువులను వాటి సహజ వాతావరణంలో చూడడం ప్రమాదం కాబట్టి ప్రభుత్వం అటువంటి చర్యలను నిషేధించింది. మరి కొన్ని సందర్భాలలో కొన్ని రకాల జంతువులు మన రాష్టం లేదా దేశంలో ఉండకపోవచ్చు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో దొరికే జంతువులను మనం జంతు ప్రదర్శనశాలలో మాత్రమే చూడవచ్చు. అయితే మనలో చాలామంది ముఖ్యంగా పిల్లలు జంతుప్రదర్శనశాలను కాలక్షేపం, వినోదం మరియు వేడుకగా భావిస్తున్నాం

పద్ధతి

  1. జంతు ప్రదర్శనశాలల గురించిన సమాచారం సేకరించండి. వాటిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు, ఎలా కలిగిందో తెలుసుకోండి.
  2. భారతదేశంలో ఉండే అనేక ప్రధానమైన జంతుప్రదర్శనశాలలను గుర్తించి అవి ఎందుకు అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయో తెలుసుకోండి.
  3. సమీపంలోని జంతుప్రదర్శనశాలను సందర్శించి జంతువుల ప్రవర్తన, వాటిని ఉంచడానికి ఏర్పాటు, అవి ఎదుర్కొంటున్న సమస్యలను అర్థంచేసుకొనే ప్రయత్నం చేయండి,
  4. జంతుప్రదర్శనశాలలో ఉంచిన జంతువుల సమస్యలను గురించి సంరక్షకుడు లేదా అధికారుల నుండి సమాచారాన్ని తెలుసుకోండి.
  5. జంతుప్రదర్శనశాలలో నిర్వహిస్తున్న వివిధ పరిశోధనల గురించి తెలుసుకోండి.
  6. జంతుప్రదర్శనశాల ఆవశ్యకతపై కనీసం 50 మంది వ్యక్తుల నుండి అభిప్రాయాలు సేకరించండి.

ముగింపు

మన సంతోషం కోసం జంతుజాలాన్ని బంధించి ఉంచడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం.జంతు

ప్రదర్శనశాలల్లో జరుగుతున్నది ఇందుకు పెద్దగా భిన్నం కానప్పటికి అక్కడి ఉద్దేశ్యం ప్రదర్శించడం మాత్రం కాదు. అందువల్ల వాటిని జంతు సంరక్షణశాలలుగా పిలవవలసిన అవసరం ఉంది. మనం ఏదైనా జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినపుడు అక్కడి వాతావరణాన్ని ఆటంకపరచకూడదు. మనం తిని పారవేసే ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లను తప్పనిసరిగా ఏదైనా సంచిలో ఉంచి చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి. జంతువులను దూరంగా ఉండి చూడాలే తప్ప వాటిని తాకడం, లాగడం వంటి పనులు చేయరాదు. కూర జంతువులకు దూరంగా ఉండడం మంచిది. జంతుశాలలలోనే కాకుండా జంతువుల ఉనికిని కాపాడడానికి మన ఊరు కూడా అనువైనదే. మన ఊరి చుట్టుపక్కల ఉన్న చెలకల్లో, చేలల్లో తిరుగాడే పక్షులు, కుందేళ్ళు, పాములు మొదలైన వాటిని చంపకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత.

జంతుప్రదర్శనశాలను సందర్శించినపుడు సేకరించిన అభిప్రాయాలు, ఇతర ఆలోచనలతో కలిపి నివేదిక తయారుచేయండి. నివేదికపై మీ తరగతిలో చర్చించండి.

తదుపరి చర్యలు

1. జంతుప్రదర్శన శాలలు, జాతీయ ఉధ్యానవనాలను దృష్టిలో ఉంచుకొని జంతువుల హక్కులపై మీ పాఠశాలలో

ఒక చర్చను నిర్వహించండి.

2. జంతుప్రదర్శన శాలలు ఉండాలా, వద్దా? అనే అంశంపై ఒక చర్చను నిర్వహించండి.

 

ఆధారము: http://apscert.gov.in/

3.08163265306
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు