హోమ్ / విద్య / బాలల ప్రపంచం / జాతీయ పాఠశాల స్ధాయి యెగాసన పోటీల నిభందనలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జాతీయ పాఠశాల స్ధాయి యెగాసన పోటీల నిభందనలు

 1. జాతీయ పాఠశాల స్ధాయి యెగాసన పోటీలు బాలురు మరియు బాలికల కొరకు ప్రత్యేకముగా జరుగుతాయి. పై రెండు విధగాలలో వయస్సును అనుసరించి "మూడు" గ్రూపులుగా జరుగుతాయి.
  • 14 సంవత్సరములలోపు
  • 17 సంవత్సరములలోపు
  • 19 సంవత్సరములలోపు
 2. ప్రతి ఒక్క టీములో అయిదుగురు పోటీదారులు (ఒక రిజర్వుతో కలిపి) ఉంటారు. నలుగురు పోటీదారులు కంటే తక్కువ సభ్యులు ఉన్న టీమును టీము ఛాంపియన్ షిప్ కు, పరిగణనలోనికి తీసుకోరు. కానీ వారి యెక్క ప్రతిభను వ్యక్తి గత స్ధాయిలో పరిగనను లోనికి తీసుకుంటారు టీమ్ ఛాంపియన్ షిప్ కొరకు నలుగురు ఉత్తమ సభ్యుల (పోటీదారులు) మార్కులను లెక్కిస్తారు.
 3. యెగాసన పోటీలలో క్రంద పేర్కొనబడిన ఆసనాలు ఉంటాయి.
 4. గ్రూప్ - ఎ

  • పశ్చియెత్తసనం - గమనిక : మెచ్చెయ్ తప్పనిసరిగా నేలను తాకాలి.
  • సర్వాంగాసనం
  • మత్స్యాసనం
  • ధనురాసనం - గమనిక : పూర్వ ధనురాసనము ప్రదర్షించాలి.
  • అర్ధ మత్స్యేముద్రాసనం
  • ఉత్ధన పాదాసనం.

  గ్రూప్ - బి

  • చక్రాసనం
  • కుక్కుటాసనం
  • శీర్షాసనం
  • భకాసనం
  • భుమాసాసనం
  • పూర్ణ శలభాసనం

  గ్రూప్ - సి

  • సంఖ్యసనం (గమనిక : మేకలూ నేలను తాకకూడదు)
  • వయాగ్రాసనం
  • ఊర్ధ్వ కుక్కుటాసనం
  • ఉత్థితా తిట్టుభాసనం
  • పద్మ మయూరాసనం
  • ఉచిత పాద హస్తాసనం
 5. గ్రూపు - ఎ లో ఉన్న ఆసనాలను సాధన చేయుట మరియు నిలిపి ఉంచవలసిన సమయం క్రంద పేర్కొన విధంగా ఉండాలి. (14 సం.ల. లోపు విధగాము : 1 సెకండ్లు, 17-19 సం.ల. లోపు విభాగము : 2 సెకండ్లు).
 6. గ్రూపు - బి  లో ఉన్న ఆసనాలను సాధన చేయుట మరియు నిలిపి ఉంచవలసిన సమయం. (14 సం.ల. లోపు విధగాము : 15 సెకండ్లు, 17-19 సం.ల. లోపు విభాగము : 30 సెకండ్లు).
 7. గ్రూపు - సి లో ఉన్న ఆసనాలు పై పేర్కొనబడిన వయస్సుల విభాగముల వారు సాధన చేయుట మరియు నిలిపి ఉంచవలసిన సమయం (సమయము : 10 సెకండ్లు).
 8. పోటీ సమయంలో సాధన చేయవలసిన గ్రూప్ - ఎ మరియు గ్రూప్ - బి ఆసనాలను పోటీలు జరుగు ప్రదేశములో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. కానీ "సి" గ్రూపుకు సంబంధించిన ఆసనాలలో ఎదో ఒక ఆసనమును ప్లేయర్ ఎంపిక చేసుకొనవచ్చును. పోటీలలో పాల్గొనే అభ్యర్థులు కనీసము మూడు ఆసనాలను ప్రదర్షించాలి.
 9. ఎ, బి & సి వేయవలసిన మూడు ఆసనాలతో పాటు క్రీడాకారులు ఇతర రెండు ఆసనాలను తమ ఆసక్తి మేరకు ఎంపిక ప్రదర్సించ (సాధన) వచ్చును. మొత్తం "అయిదు" ఆసనాలను క్రీడాకారులు ప్రదర్షించాలి. ప్రతి ఆసనానికి "10" మార్కులు మొత్తం "50" మార్కులకు పోటీ ఉంటుంది.
 10. పరిస్ధితి, అవసరాన్ని బట్టి నిర్వాహక అధికారులు ఆసనాలు సాధన సమయమును తగ్గించవచ్చును. ఉదాహరణకు ఒక ఆసనం సాధన సమయమును "2" నిమిషాల నుండి ఒక నిమిషానికి తగ్గించవచ్చును.  ఎట్టి పరిస్ధితులలోను ఆసనాల సాధన సమయమును  పెంచకూడదు. పైన పేర్కొనబడిన సాధన సమయానికి  సంబంధించిన మార్పులు కనుక ఏమైనా చేసినట్త్లెతే ఆ మార్పులు పాల్గొన్న అందరూ క్రీడాకారులకు వర్తింపచేయాలి.
 11. పోటీ దారులు ఇష్టం మేరుకు (అప్షనల్) ఎంపిక చేసుకున్న ఆసనాల సాధనకు "3 " సార్లు ప్రయత్నించా వచ్చును. కానీ తప్పనిసరి ఆసనాలను ఒక ప్రయత్నములోనే పాదన చేయవలెను.
 12. ఒకసారి ఎంపిక చేసుకున్న (లేక) కేటాయంచబడ్డ ఆసనాలను ఎట్టి పరిస్ధితులలోను మార్పు చేయబడవు.
 13. ఆసనాలు మార్కులు కేటాయంచుటలో ఆసన నిర్మాణము ఆసనము యెక్క స్ధిరత్వము మరియు ఆసనమును నిలిపి యుముచే సమయమును పరిగణనలోనికి తీసుకుంటారు.
 14. ప్రతి ఆసనానికి 10 మార్కులు ఎ మార్కులు ప్రతి ఆసనానికి న్యాయ, నిర్ణేతలచేత క్రంద పేర్కొనబడిన విధముగా కేటాయంచబడతాయి.
  • ఆసనం చివరిదశకు చేరేటప్పడు చూపే ప్రతిభకు 1 మార్కు
  • ఆసనం యెక్క ఖచ్చితమైన భంగిమకు - 4 మార్కులు
  • ఆసనము ఎటువంటి వణకు మరియు  ఒత్తిడి (టెన్షన్) లేకుండా ప్రదర్శనకు - 2 మార్కులు.
  • నిర్ధారిత సమయం వరుకు ఆసనం భంగిమలో ఉన్నందుకు - 2 మార్కులు.
  • భంగిమ నుండి సాధారణ స్ధితికి రావడానికి - 1 మార్కు
 15. పోటీదారు ఎంపిక చేసుకొనే ఐచ్చిక ఆసనాలు కేతగిరీలు ఎ, బి & సి గ్రేడులుగా విభజిస్తారు. "ఎ " గ్రేడు ఆసనాలలో నడుము మరియు మెండెము యెక్క వంగేతత్వము, సమతస్ధితిలో ఉంచగలగటం అనే అంశాలు ఇమిడి ఉంటాయి. వీనిలో అత్యంత క్లిష్టమైన (రిస్క్ ఫ్యాక్టర్) ఆసనాలు ఉంటాయి. (ఉదా : అరచేతులను మాత్రమే నెల పై ఉంచివేసే వృశ్చికాసనము, బి గ్రేడులో కేవలం వంగుతత్వం బేలన్స్ లేకుండా ఉన్న ఆసనాలు ఉంటాయి, ఉదా: డింబసనము, దీపావనము మరియు వృశ్చికాసనము).
 16. న్యాయనిర్ణేతలు రెండు పేనల్స్ గా అనగా ఒక పీనల్ బాలురకు ఒక పీనల్ బాలికలకు ప్రత్యకంగా ఉంటారు. ఒక్కొక్క పీనల్ లో ఒక ప్రధాన న్యాయనిర్ణేత, నలుగురు న్యాయ నిర్ణేతలు ఒక స్కోరర్ మరియు సమయ నిర్ణిత (టైమ్ కీపర్) ఉంటారు.
 17. న్యాయ నిర్ణేత ప్రతి ఆసనానికి స్కోరింగ్ షిట్ మార్కులు వేస్తారు. మరియు మార్కులను బయటకు కానించేటట్లను ప్రదర్శిస్తారు. స్కోరర్ మార్కులను వ్రాసుకొని ప్రకటిస్తారు. ఈ ప్రక్రియను ప్రేక్షకుల (సాక్షలు, స్పెక్టేటర్స్) గమనించవచ్చును.
 18. కార్పాట్ పై ఆసనం సాధన చేసే అభ్యర్థిని, న్యాయనిర్ణేత స్వేచ్ఛగా, పరిశీలించవచ్చును. అవసరం అనుకుంటే మరొకసారి ఆసనాన్ని ప్రదర్సించమని ఆదేశించవచ్చును.
 19. (డ్రస్ దుస్తులు)

 20. ఆసనాలు సాదన చేసేటప్పుడు ట్రాక్ షూట్స్ ను అనుమత్తించారు. వాదులు దుస్తులు (స్లేక్స్) పొట్టి దుస్తులు (బనియన్ లు, నిక్కరు) ఈత దుస్తులు మెదలైన వాటిని అనుమతిస్తారు. పాల్గొన్న అభ్యర్థులందరూ తప్పని సరిగా బిగుతుగా వున్నా ప్లాస్టిక్ తో ఉన్న లో దుస్తులను (అండర్ వేర్) ధరించాలి.
 21. అభ్యర్థులకు సమానంగా మార్కులు వస్తే విజేత ఎంపిక విధానము :
  • సమానంగా మార్కులు ఇద్దరు లేక ముగ్గురికి వస్తే, న్యాయ నిర్ణేతలు అందురు ఇచ్చిన మార్కుల మెత్తమును పరిగణనలోనికి తీసుకుంటారు.
  • ఇంకనూ మార్కులు సమానంగా ఉంటే అభ్యర్థి ఎంచుకున్న ఐచ్చిక ఆసనాలలో పొందిన అత్యధిక మార్కులను బట్టి విజేతను నిర్ణయిస్తారు.
  • ఇంకనూ మార్కులు సమానంగా ఉంటే అభ్యర్థి గ్రూప్ "సి" ఆసనాలలో పొందిన మార్కులను బట్టి విజేతను నిర్ణయిస్తారు.
 22. (ఎ) మొదటి రాయండీ ముగిసిన తరువాత "15" కంటే ఎక్కువ టీములున్నట్లయితే ప్రతిభ ఆధారంగా.
 23. (బి) 10 టీముల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కేవలం ప్రతిభ ఆధారంగా 4 టీములను ఫైనల్ రెండ్ కు ఎంపిక చేస్తారు. (సి) 10 టీములు కన్నా తక్కువ రీములు ఉంటే ఫైనల్ రెండ్ నేరుగా నిర్వహించాబతుంది. మరియు  దీనికి ఫైనల్ కాంపిటీషన్ కు ఉన్న నిబంధనలను అమలు పరుస్తారు.
 24. వ్యక్తిగత విభాగంలో ప్రధాన స్ధానం పొందిన "5" మార్కులు ద్వితీయ స్ధానం పొందినవారికి "3" మార్కులు మరియు తృతీయ స్ధానం పొందిన వారికీ "2" మార్కులు కేటాయిచబడతాయి. టీము విభాగంలో ప్రధాన స్ధానం పొందిన టీము (జుట్టు) 10 మార్కులు, ద్వితీయ సాధన జుట్టు "6"మార్కులు మరియు తృతీయ స్ధానం పొందిన జుట్టు "4" మార్కులు పొందుతారు. అత్యధిక మార్కులు పొందిన రాష్ట్రమును ఛాంపియన్ స్టేట్ గా ప్రకటిస్తారు.
 25. పుట్టినతేది, అర్హత మరియు దృవీకరణ (ప్రాతస్ట్ నాట్) నిబంధనలు "యస్.జి.యఫ్.ఐ" నిబంధనలను అనుసరించి ఉంటాయి.

ఆధారం : ఆరోగ్యవ్యాయామా విద్య

3.09803921569
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు