జాతీయ సాహస పురస్కారాల కార్యక్రమము పిల్లలు ఎవరైతే తమ విశిష్ట సాహసాలతో ప్రత్యేకతను ప్రదర్శిస్తారో వారికి గుర్తింపును ఇస్తుంది మరియు ఇతర పల్లలు వీరి ఉదాహరణను అనుసరించేలా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. జాతీయ సాహస పురస్కారాలకు 1957లోని ఒక సాహస దృష్టాంతము మూలం.
ఫిబ్రవరి 4, 1958న ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు మొదటి సాహస మరియు సేవా బహుమతిని ఇద్దరు పిల్లలకు బహూకరించారు. అప్పటి నుంచి ఇండియా శిశు సంక్షేమ మండలి ప్రతి సంవత్సరము పిల్లల జాతీయ పురస్కారాలకోసం సమాలోచన చేస్తుంది.
నామనిర్దేశనాలు రాష్ట్ర/కేంద్రపాలిత ఐ.సి.సి.డబ్ల్యూ మండళ్ళు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు , ప్రధాన సంచాలకులు మరియు రాష్ట్ర పోలీసు కమీషనరులతో కలుపుకొని, మరియు కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ఆహ్వానిస్తారు.
నామనిర్దేశనాలు నిర్ణీత వినతి పత్ర రూపంలో తీసుకుంటారు దానిని ఐ.సి.సి.డబ్ల్యూ కార్యాలయం, కొత్త డిల్లీ, నుంచి పొందవచ్చు. వినతి పత్రాలను నమోదు చెసిన ఇద్దరు యోగ్య అధికారులు శిఫారసు చేయాలి. పత్రాన్ని కిందివాటితో కలిపి పంపాలి.
సంఘటన జరిగిన నాటికి పిల్లల వయసు 6 సంవత్సరాల కంటే ఎక్కువ 18సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
ప్రతి సంవత్సరం జులై 1 మరియు జూన్ 30 నడుమ జరిగిన సంఘటనలను పరిశీలిస్తారు. ఎంపిక సంఘం తన విచక్షణతో తేదీని జలై 1 కంటే ముందు మూడ నెలల వరకు సడలించవచ్చు.
వినతి పత్ర సమర్పణ చివర తేది సెప్టంబరు 30
ఐసిసిడబ్ల్యూ నియమించిన ఇండియా రాష్ట్రపతి కార్యదర్శులు, ఇండియా ఉప రాష్ట్రపతి, మానవ వనరుల శాఖ మంత్రులు, మహిళా మరియు శిశు సంక్షేమాభివృద్ధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, సాంఘీక న్యాయం మరియు సాధికారత, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, రైల్వే, రక్షణ, రక్షణ వ్యవహారాలు, కార్మిక, గ్రామీణాభివృద్ధి, సమాచార మరియు ప్రసారాలు, ఏఐఆర్, దూరదర్శను, పోలీసు, కొన్ని ఎన్ జీ ఓలు, అధికారులు మరియు మండలి సభ్యులతో కూడిన ఉన్నత కమిటి ద్వారా ఎంపిక జరుగుతుంది. ఒకసారి తిరస్కరించిన వినతి పత్రాన్ని తిరిగి స్వీకరించరు.
పురస్కారము గెలిచిన వారు ఒక పతకము, ఒక యోగ్యతా పత్రము మరియు నగదును పొందుతారు. లోకోపకార సంస్థలు బహుమతులను ఇస్తాయి.
ఇతర ప్రయోజనాలు: అర్హులైన పురస్కార గ్రహీతలు వారు పాఠశాల చదువు పూర్తి అయ్యే వరకు సహాయాన్ని పొందుతారు. ఐసిసిడబ్ల్యూ ఇంజనీరింగు మరియు వైద్యం లాంటి వృత్తి సంబంధంమైన చదువులు చదువుతున్నవారికి మరియు ఇతరులకు వారి డిగ్రీ పూర్తయ్యే వరకు ఇందిరా గాంధీ ఉపకారవేతన పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇండియా ప్రభుత్వము ఇంజనీరింగు, వైద్య కళాశాలలో మరియు పాలిటెక్నిక్ లలో కొన్ని సీట్లను పురస్కార గ్రహీతలకు కేటాయించింది.
మూలము: ఇండియా శిశు సంక్షేమ మండలి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/24/2020