অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డైనోసారు

శిలాజాలు

డైనోసార్ల గురించి మనుషులు ఎలా తెలుసుకున్నారో తెలుసుకోవాలంటనే ముందు భూగర్భంలో దొరికే విచిత్రమైన రాతి ఎముకల గురించి తెలుసుకోవాలి.
200 ఏళ్ళ క్రితం వరకు కూడా యూరప్ లోను, అమెరికాలోను ఉండే మనుషులకి ప్రాచీన చరిత్ర గురించి పెద్దగా తెలిసేది కాదు. వాళ్ళకి తెలిసినదాంట్రల్లో ఎన్నో విషయాలు బైబిల్ నుండే వచ్చేవి.
బైబిల్ చదివిన వారు భూమి 6000 ఏళ్నకి పూర్వం సృష్టించబడింది అని నమ్మేవారు. ఆ తరువాత 4,500 ఏళ్ళ క్రితం ఓ పెద్ద వరద వచ్చి అంతా నాశనమైపోయింది అని కూడా బైబిల్ లో ఉంది.
ఆ తరువాత మొల్లగా భూమి కుదుటపడి ప్రస్తుత స్థితికి వచ్చింది. ఎన్నో దేశాలు సాపించబడాయి. 3000 ఏళ్ల క్రితం నుండి జరిగిన చరిత్ర గురించి మనం బైబిల్ కాకుండా ఇతర ఆధారాల నుండీ తెలుసుకోగలుగుతున్నాం.
1700 ల వరకు కూడా ఇంచుమించు అంతా ఇలాగే ఆలోచించేవారు.
భూమి వయసు కేవలం 6000 ఏళ్లే అయితే దాని జీవ రాశులలో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. 2000 ఏళ్ళ క్రితం గ్రీకు శిల్పాలో మనుషులు ఎలా ఉండే వారో ఇప్పుడూ మనుషులు అలాగే ఉన్నారు.  4000 ఏళ్ళ క్రితం ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన చిత్తాలో మనుషులు ఎలా ఉండే వారో ఇప్పుడూ మనుషులు అలాగే ఉన్నారు.
ప్రాచీన రచనలో పేర్కొనబడ కొన్ని జంతువులు - సింహాలు, ఏనుగులు, గొర్రెలు, డేగలు, తేనెటీగలు మొదలైనవి — ఇప్పటికీ ఉన్నాయి.
ఇదిలా ఉండగా భూమి వయసు కేవలం కొన్ని పేల ఏళ్ళు మాత్రమే నన్న భావనని పటూ పంచలు చేసూ ఓ కొత్త విషయం బయటపడింది. మొదటలో అదంత ముఖ్యమైన విషయంలా కనిపించలేదు. అక్కడక్కడా భూమి ని తవ్వితే బయటపడే చిత్రమైన రాతి ముక్కల వల్ల కథ మలుపు తిరిగింది.
పేల ఏళ్నగా మనుషులు భూమిని తవ్వుతున్నారు. మనం వాడుకునే లోహాలు గనుల నుండీ అంటనే భూగర్భం నుండి వస్తాయి.
అలా తవ్వుతుంటే ఒక్కోసారి ఎముకలాగా, గవ్వలాగా కనిపించే రాతి ముక్కలు కనిపించేవి. అయితే కొన్ని సారు. అవి మనకి తెలిసిన జంతువుల ఎముకలాగా, గవ్వలాగా కనిపించేవి కావు.
మరి వీటిని ఏం చెయ్యాలి? గనులు తప్వేవారు వీటి కోసం భూమిని తవ్వడం లేదు. కనుక ఇలాంటివి ఏవైనా కనిపిస్తే వాటిని అవతల పడేసి ఇంకా తవ్వకుంటూ పోయేవారు.
400 వేల ఏళ్ల క్రితం శాస్త్రీయ పద్దతుల్లో గనులని తవ్వే కార్యక్రమానికి పూనుకున్న మొదటి వ్యక్తి జోరీ అగ్రికోలా అనే జర్మన్ దేశసుడు. ఇతడు తన జీవితాంతం గనులని, గనుల నుండి వచ్చే ఖనిజాలని అధ్యయనం చేసూ పోయాడు.
1546లో అతడు రాసిన ది నాచురా ఫాసీలియం అనే పుస్తకం అచ్చయ్యింది. ఈ లాటిన్ మాటకి అర్ధం తవ్వకాల గురించి అని. ఈ పుస్తకంలో అగ్రికోలా మటర్జీని తవ్వి తీసిన ప్రతీ వసువుని ఫాసిల్ అన్నాడు. ఈ ఫాసిల్ అన్న పదం తవ్వకం అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వచ్చింది. (ఈ ఫాసిల్ సే తెలుగులో శిలాజం అంటూ ము.)
అగ్రికోలా ప్రకారం అన్ని రకాల రాళ్ళు, ఎముకలా ఉండేవి కూడా, శిలాజాలే. అప్పట్నుంచి మరి ఎందుచేతనో కేవలం ఎముకలా ఉండే రాళ్ళని, జంతువుల కాలిగురులు, మొదలైన ఆనవాళ్ళు మిగిలిన రాళ్ళని మాత్రమే శిలాజాలు అనడం మొదలెటూరు.
1500 కాలంలో కొ నాడ్ ఫాన్ గె ప్రకృతిని వర్తిస్నూ అతడెన్నో పు వారిలో ఇతడు ప్రథముడు.
ర్ అనే స్విస్ శాస్త్రవేత్త ఉండేవాడు. కాలు రాశాడు. శిలాజాల చిత్తాలు గీసిన
గెస్నర్ కూడా శిలాజాలకి పెద్దగా షాముఖ్యత నివ్వలేదు. అవి ఎముకలాగా ఏర్పడ్డ రాళ్న అనుకున్నాడు అంతే. ప్రకృతి సమస్తాన్నీ వర్ణిస్తున్నాడు కనుక వాటినీ వర్ణిసూ పోయాడు.
మరో వందేళ్ళ తరువాత బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త జాన్ రే మరో మొటు ముందుకి వెళ్ళాడు. చిన్నప్పట్నుంచీ కూడా తనకి అందుబాటలో ఉన్న మొక్కల్ని, జంతువులని అధ్యయనం చేసూ పోయాడు. 1660 లో తను చేసిన మొక్కల వర్తనల గురించి ఓ పుస్తకం ప్రచురించాడు. 40 ఏళ్న పాటు మొక్కల గురించి, జంతువుల గురించి ఇంకా ఇంకా విస్తారంగా రాసూ పోయాడు.
గెస్నర్ లాగా ఇతగాడు కేవలం వాటిని వర్తించి విడిచిపెటులేదు. వివిధ వృక్ష, జంతు జాతులని శాఖలుగా విభజించాడు. మరి జంతువులకి జంతువులకి మధ్య పోలికలు ఉంట్రూయి కదా. అలాగే మొక్కలో కూడా పోలికలు ఉంటూయి. పులులు, సింహాలు, పిల్నులు ఒకలా ఉంటూయి. నక్కలు, తోడేళ్సు, కుక్కలు ఒక మాదిరిగా ఉంటాయి. గొర్రెలు, దూడలు మొదలైన పశువులకి గిటులు ఉంటాయి, గడ్డి తింటూయి కనుక ఒకదాంతో ఒకటి పోలి ఉంటూయి.
రే జంతువులని, మొక్కలని సూక్ష్మంగా అధ్యయనం చెయ్యడం నేర్చుకున్నాడు. అలా రాబటన వివరాలతో ఆ జీవాలు ఒక కోవకి చెందుతాయో లేదో నిర్ణయించడం నేర్చుకున్నాడు.
శిలాజాలని అధ్యనం చేసినప్పుడు మాత్రం అవి కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడలేదని, వాటికి ఎముకలకి మధ్య పోలిక కాకతాళీయంగా జరిగినది కాదని అతడికి అనిపించింది. వివరాలని సూక్ష్మంగా పరిశీలించే అలవాటు ఉన్నవాడు కనుక ఈ రాతి ఎముకలకి, వాస్తవమైన ఎముకలకి మధ్య చాలా ఎక్కువ పోలికలు గమనించగలిగాడు రే.
1691లో రే రాసిన ఓ పుస్తకంలో శిలాజాలు ఎప్పుడో జీవించిన జంతువుల
ఆనవాళ్నన్న భావాన్ని వ్యక్తం చేశాడు. అలా అన్నవారిలో అతడే ప్రథముడు.
పైగా శిలాజాలని పరిశీలించినప్పుడు అవి ఎముకలని పోలినటు అనిపించినా, అవి రేకి తెలిసిన జంతువుల ఎముకలలాగ కనిపించలేదు. కనుక అవి ఎప్పుడో జీవించిన జంతువులకి చెందిన ఎముకలని, అప్పటి
జంతువులు ప్రసుతం మనకి కనిపించే ఎముకలా లేవని రే వాదించాడు. ఆ శిలాజాలకి చెందిన జంతువులేవీ ఇక లేవు. అవి వినష్టమైపోయాయి.
అయితే ఆ రోజులో ప్రాచీన చరిత్ర గురించి చలామణిలో ఉన్న భావాలు ఇలాంటి అవకాశానికి కూడా తావు నిస్తున్నాయి. బహుశ ఏదో పెద్ద ప్రళయం వచ్చి ఆ జంతువులన్నీ నాశనమై ఉండవచ్చు. శిలాజాలో కనిపించే ఎముకలు ప్రళయంలో నాశనమైన జంతువులకి చెందినవి అయ్యుండవచ్చు. అందుకే అవి వినష్టమై ఉండవచ్చు.
రే బతికిన కాలంలోనే నికొలాస్ సెనో అనే డేనిష్ శాస్త్రవేత్త ఉండేవాడు. రే లాగానే ఇతడు కూడా శిలాజాలు ఒకప్పుడు బతికిన జీవాల ఆనవాళ్నని నమ్మాడు.
ఉదాహరణకి ఇతడికి సొరచేప పళ్లని పోలిన శిలాజాలు దొరికాయి. ఆ పోలిక ఎంత సన్నిహితంగా ఉందంటనే అవి కచ్చితంగా సారప పళ్ళే అయ్యుండాలి.
అయితే ఈ శిలాజపు పళ్ళు మాత్రం రాతితో చేయబడి ఉన్నాయి. అయితే శిలాజపు పదారం ఒకప్పుడు ఎముకో, దంతమో, గవ్వలో అయ్యుంటనే ఆ పదారం సానంలో కాలక్రమేణా రాతి పదార్థం వచ్చి ఉండాలి. ఆ పరిణామం జరగడానికి చాలా కాలం పట ఉండాలి. వందలాది సంవత్సరాలుగా ఎముకలు భూస్యాపితమై ఉన్నా అవి రాయిగా మారే ప్రక్రియు ప్రారంభం కూడా కాదు. కనుక ఇలాంటి పరిణామం జరగడానికి కోట్‌ను సంవత్సరాలు పటనీ ఉండాలి.
మరి భూమి వయుసు కేవలం 6000 ఏళ్ళు మాత్రమే అయితే ఈ శిలాజాలు ఎలా ఏర్పడి ఉంటాయి? భూమి వయసు అంతకన్నా ఎక్కువే అయ్యుంటుంది.
1700 లలో కొంత మంది శాస్త్రవేత్తలు భూమి వయసు మరీ అంత ఎక్కువ కాదేమో నని ఆలోచించసాగారు. ఒక పక్క బైబిలు కాదంటూంటే అందుకు వ్యతిరేకంగా ఆలోచించడం సమంజసం కాదనిపించింది వాళ్ళకి.
భూమి వయుసు గురించి శాస్త్రబద్దమైన సిదాంతాన్ని ప్రతిపాదించినవాడు ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త కౌంట్ ద బఫన్. 1745లో అతడు సూర్యుడు ఓ పెద్ద వసువుతో ఢీ కొన్నప్పుడు గ్రహాలు ఉద్బవించి ఉంటాయని సూచించాడు. ఆ తాకిడికి ఎగిరొచ్చిన శకలాలే గ్రహాలు అన్నాడు.
కనుక ఆదిలో సూర్యుడంత ఉషోగ్రత వద్ద ఆరంభమైన భూమి చల్లబడడానికి 75,000 ఏళ్న పటనీ ఉంటుందని అంచనా వేశాడు బఫన్. రమారమి 40,000 ఏళ్నకి పూర్వం సజీవ వృక్ష, జంతు జాతులు ఉత్పన్నం కాదగినంతగా భూమి చల్లబడి ఉంటుందని అంచనా పేశాడు.
బఫన్ సిదాంతాన్ని విన్న వారు దిగ్భాంతి చెందారు. బైబిల్ బోధనకి ఈ వాదన పూర్తిగా చుక్కెదురుగా ఉంది. అంతే కాక భూమి మీద జీవరాశుల ఆయుష్‌ను 40,000 ఏళ్ళు మాత్రమే అంటే అది శిలాజాల సమాచారంతో సరిపోవడం లేదు. కనుక ఈ భూమి, దాని మీద ఉండే జీవరాశులు ఇంకా సుదూరమైన గతం నుండి ఉండి ఉండాలి.

ప్రళయాలు

బఫన్ తరువాత ఇరవై ఏళ్లకి చార్లెస్ బోనే అనే స్విస్ ప్రకృతి శాస్త్రవేత్తకి ఈ సమస్య కి పరిష్కారం కనిపించింది. శిలాజాలకి తగిన వివరణ

ఇవ్వగలిగాడు. భూమి ఆయుషు బాగా పెంచాడు. అయినా బైబిల్ కి ఎదురు వెళ్నకుండా జాగ్రత్తపడాడు!

నిజంగానే భూమి చాలా కాలంగా ఉందనుకుందాం. దాని మీద నానారకాల జీవరాశులూ సంచరించాయి అనుకుందాం. అప్పుడేదో ప్రళయం వచ్చి భూమి మీద జీవరాశులన్నీ నాశమయ్యాయి అనుకుందాం.

కొంత కాలం పాటు భూమి జీవరహితంగా ఉండిపోతుంది. మళ్లీ నూతన జీవనాంకురం జరుగుతుంది. అలా ఎన్నో వేల ఏళ్న సాగుతుంది. మళ్నీ ఏదో ఉత్పాతం జరుగుతుంది. మళ్ళీ జీవ నాశనం జరుగుతుంది. అలా చక్రికంగా పృథ్వీ చరిత్రలో ఎన్నో సార్న జరిగి ఉండవచ్చు.

అలాంటిది ఇటీవల కాలంలో వచ్చిన ప్రళయం 6000 వేల ఏళ్ళ క్రితం జరిగి ఉండవచ్చు. భూమి మీద ఇప్పుడు మనకి కనిపించే జీవజాతులని, మనుషులని కూడా కలుపుకుంటనే, అప్పుడే ఆరంభమై ఉండవచ్చు. కనుక బైబిల్ కథనం గత 6000 ఏళ్లకే పరిమితమై ఉండవచ్చు. అంతకు ముందు జరిగిన ఘట్వూలని బైబిల్ విస్మరించి ఉండవచ్చు.

సువిస్సార పృధ్వీ చరిత్రలో చిటచివరి ప్రళయానికి ముందు జీవించి భూసాపితమైన ప్రాచీన జీవ రాశుల ఆనవాళ్ళే శిలాజాలని వాదించాడు బోసే. అయితే ఆ శిలాజాల వయసు పదుల, వందల, వేల ఏళ్నయి ఉండవచ్చు. కాని వాటికి చరిత్రకి సంబంధం .

అంతే కాక శిలాజాలలో కనిపించే ఎముకలు ప్రసుతం కనిపించే జంతువుల ఎముకలని కొద్దిగా పోలి ఉన్నా, ఆ పోలిక కచ్చితంగా ఎందుకు లేదో కూడా వివరించాడు బోసే. అయినా అసలు ఎందుకు ఉండాలి? గత యుగాల జీవ రాశులు అచ్చం ప్రస్తుతం ఉండే జీవరాశుల లాగా ఉండాల్సిన అవసరం ఏముంది?

ఇదిలా ఉండగా జేమ్స్ హటన్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త అందుకు పూర్తిగా భిన్నమైన సిదాంతాన్ని రూపొందిసూ వచ్చాడు. అతడి ధ్యాస శిలాజాల మీద లేదు. భూమి యొక్క అంతరంగ నిర్మాణం గురించి తెలుసుకోవడం అతడి ధ్యేయం.

చూసుండగానే భూమిలో కొన్నిరకాల మార్పులు రావడం అతడు గమనించాడు. నదులు చిన్న చిన్న మోతాదులో ఉప్పును తీసుకుపోయి సముద్రంలో కలుపుతున్నాయి. ఆ విధంగా సముద్రంలో ఉప్పదనం పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా నదులు బురదని సముద్రంలో కలుపుతుంటాయి. అలా నదిచేత తరలించబడుతున్న బురద నది అటుడుగుకి, నదీ ముఖం వద్ద సముద్రపు అటుడుగుకి చేరుతుంది. అలా ఇంకా ఇంకా ఎక్కువ బురద అడుక్కి చేరుతున్న కొలది అక్కడ వత్తిడికి గటపడి రాయిగా మారుతుంది.

అదే విధంగా అగ్నిపర్వతాల నుండి లావా బయటికి ప్రవహించినప్పుడు మరో రకమైన రాయి ఏర్పడుతుంది. చలారిన లావా గటపడి రాయిగా మారుతుంది. క్రమంగా అలా ఏర్పడ్డ రాయి దటమైన పొరలుగా ఏర్పడుతుంది.

రాఛ్న రూపొందటమే కాదు, బద్దలవుతాయి కూడా. గాలి ప్రభావం చేత, ప్రవహించే నీటి ప్రభావం చేత రాయి ముక్కలు అవుతుంది. ఆ ముక్కలు ఇసుకగా, బంకమటగా మారుతాయి.

-53 మార్పులన్నీ ూనెమ్మదిగా జరుగుతాయి. బురద వలనో, లావా వలనో దటమైన రాతి పొరలు నెమ్మదిగా ఏర్పడతాయి. అలా ఏర్పడ్డ రాయి నుండి నెమ్మదిగా బోలెడంత ఇసుక, బంకమట పుటుకొస్తాయి. ఇంత నెమ్మదిగా మార్పులన్నీ జరగాలంటనే భూమి వయుసు చాలా ఎక్కువే అయ్యుండాలి.

1785లో హటన్ భూమి సిదాంతం అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అందులో భూమి గురించిన తన అభిప్రాయాలన్నీ వెలిబుచ్చాడు. భూమి పుటుక జాడ కూడా తెలీనంత ప్రాచీనమైనది భూమి అని చాట్రూడు ఆ పుస్తకంలో, ప్రళయాలు జరిగినట్ను ఊహించుకోవడానికి అతడి ఆధారాలు కనిపించలేదు. ప్రసుతం మంద గతిలో కనిపిస్తున్న మార్పులే గతంలోనూ జరుగుతూ వచ్చాయి.

ఆ విధంగా 1700 ల చివరి సంవత్సరాలకి భూమి అత్యంత షాచీనమైనదన్న భావనని శాస్త్రవేత్తలు ఒప్పుకోసాగారు. కాని భూమి చరిత్ర ఎటువంటిది? బోసే సూచించనట్ను భూమి గతమంతా ఉత్పాతాలతో దద్దరిల్లిందా? లేదా హటున్ సూచించినట్ను నిదానంగా, నిశాంతంగా సాగిందా?

కొంత కాలం పాటూ హటన్ సిదాంతాలకి పెద్దగా స్పందన రాలేదు. బోనే సిదాంతాలే బాగా చలామణి అయ్యాయి.

దానికి కారణం బోసే సిదాంతానికి బైబిల్ తో పొతు కుదురుతోంది. బైబిల్ ని వ్యతిరేకించకుండా కొన్ని శాస్త్రీయ వాదనలు కూడా అందులో .

ఓ రోడు వెయ్యడానికో, ఓ కాలనీ కట్పుడనికో ఓ కొండని పక్కల పెంట తవ్వినప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? లోపల ఉన్న రాతి పదారం అంతా పొరలు పొరలుగా ఏర్పడి ఉండడం గమనిస్తారు.

ఈ పొరలని వర్ణించిన మొటమొదటి వాడు సైనో, సొరచేప పళ్ళ శిలాజాలని కనుక్కున్నది ఇతడే. 1670 దరిదాపులో ఇతడు ఈ పొరలకి స్చాటూ (స్తరాలు) అని పేరు పెట్నూడు. ఇది పొరలు అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వచ్చింది.

ఆ పొరలకి సైనో స్తరాలు అని పేరు పెటన నాటి నుండి ఓ వందేళ్ళ వరకు పెద్దగా ఏమీ జరగలేదు. తరువాత 1793 లో విలియం స్మిత్ అనబడే వ్యక్తికి ఇంగ్లండ్ లో పల్లె ప్రాంతాల్లో కాలువలు తవ్వించే బాధ్యత అప్పగించబడింది.

నీటికి దారి కల్పించడం కోసం ఎన్నో చోట్ను కొండలని తవ్వాల్సి వచ్చింది. కోయబడ్డ రాయిలో బయటికి కనిపించే పొరలని గమనించాడు స్మిత్ అంతే కాక ఆ స్తరాలలో శిలాజాలు కూడా ఉండడం గమనించాడు. ప్రత్యేక పొరలలో ప్రత్యేక రకాల శిలాజాలు ఉండడం, ఒక పొరలో కనిపించే శిలాజాలు మరో పొరలో కనిపించే శిలాజాలలా ఉండకపోవడం కూడా పసిగట్నూడు.

స్మిత్ పొరలని అనుసరిసూ పోయాడు. కొన్ని చోట్ళ అవి చాలా దూరం విస్తరించి ఉండడం గమనించాడు. అయితే అవి అక్కడక్కడ వంగడం, విచ్ఛిన్నం కావడం జరగొచ్చు. కొన్ని చోట్ను గాలి నీరు ప్రభావం వల్ల వాటిలో తరుగుదల కూడా కనిపించేది. మరి కొన్ని చోటు కొన్ని కిలోమీటర్ల దూరం తరువాత మళ్లీ పొరలు కనిపించేవి. అదే వరుస క్రమంలో, అదే శిలాజాల ఏర్పాటుతో కొంచెం దూరం తరువాత పొరలు మళీ ప్రత్యక్షం అయ్యేవి.

1816లో అచ్చయిన ఇంగ్లండ్ యొక్క భౌగోళిక చిత్రపటం అన్న పుస్తకంలో స్మిత్ ఈ వివరాలన్నీ పొందుపరిచాడు.

స్తరాలు చెప్పే సాక్ష్యాలని ఆసరాగా చేసుకుని బోనే చెప్పిన ఉత్పాత సిదాంతం నిజమేనని వాదించడానికి వీలవుతుంది. చెరువుల, నదుల అడుక్కి చేరి, అక్కడ అధిక పీడనం వల్ల గటపడి రాయిగా మారిన బురదే స్తరాలుగా ఏర్పడుతోంది. ఒక్కొక్క స్తరం ఏర్పడడానికి కోట్‌ను ఏళ్ళు పట ఉండవచ్చు. ఆ తరువాత ఒక్క ప్రళయంతో అంతా మొదటికి రావచ్చు. ఏదో కొత్త రకం బురదతో ఓ కొత్త స్తరం పుటుకురావచ్చు. ఈ స్తరం దాని కింది స్తరానికి భిన్నంగా ఉండవచ్చు.

అప్పుడు కూడా ప్రళయాల మధ్య ఉండే సంధికాలంలో పేరు పేరు రకాల వృక్ష, జంతు జాతులు జీవించి ఉంటనే ఒక్కో స్తరంలోను ఒక్కో రకమైన జీవ రాశులు కనిపిస్తాయి. ఎలాంటి శిలాజాలు ఉన్నాయన్నదాని బటర్టీ స్తరాన్ని గుర్తించడానికి కూడా వీలవుతుంది. స్మిత్ ఆవిష్కరణలకి అప్పుడు అరం చెప్పడానికి వీలవుతుంది.

అ. కింది నుండీ పై కి తన్నుకు వచ్చే ఘాతానికి రాతి పొరలలో చీలిక ఏర్పడుతుంది.

ఆ. పై నున్న పొర తరిగిపోయి కింద నున్న స్తరాలు బహిరతమవుతున్నాయి.

ఇ. చీలిక ఈ. పై పొర తరిగిపోగా కింద కొత్త స్తరాల వరుస కనిపిస్తోంది.

పరిణామం

శిలాజాల మధ్య తేడాలు ఉండడం అంటనే ఏమిటరీ అర్థం? ఆ తేడాలు చాలా సూక్ష్మంగా ఉండొచ్చు. ఈ తేడాల గురించి చర్చించుకోబోయే ముందు జీవరాశుల లక్షణాలని క్షణంగా పరిశీలించాలి. అప్పుడు ఒక మొక్కకి, జంతువుకి మరో మొక్కకి, జంతువుకి మధ్య తేడా తెలుసుకోవచ్చు. చిన్న చిన్న తేడాలు ఎక్కడున్నాయో, పెద్ద పెద్ద తేడాలు ఎక్కడున్నాయో గమనించొచ్చు. అలా శిలాజాలన్నీ అధ్యయనం చేసి అన్నీ ఓ విశ్వజనీనమైన పథకంలో ఎలా ఇమిడిపోతాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇలాంటి ప్రయత్నానికి ప్రారంభం చేసిన వాడు స్వీడెన్ ప్రకృతి శాస్త్రవేత్త కారోలస్ లిన్నేయియస్ 1735లో అతడు తను అంత వరకు అధ్యయనం చేసిన మొక్కల, జంతువుల వివరాలన్నీ పొందుపరిచాడు. వాటిని చాలా వివరంగా వర్ణిస్నూ వర్గీకరించాడు.

మొక్కలో, జంతువులో ఒక్కొక్క రకాన్ని జాతి (Species) అన్నాడు. బాగా పోలికలు ఉన్న జాతులని ఒక దగ్గరికి చేర్చి వాటిని కోవ (genus) అన్నాడు. కనుక ప్రతీ మొక్కకి, జంతువుకి రెండు లాటిన్

పేరు ఇచ్చాడు - ఒకటి కోవకి సంబంధించినది, రెండవది జాతికి సంబంధించినది.

సింహాలు, పులులు, పిల్నులు వివిధ జాతులు. కాని వాటరీ మధ్య సాgూ పోలికలు ఉంటాయి. కనుక అవన్నీ ఫెలిస్ అనే కోవకి చెందినవి. (ఫెలిస్ అంటే లాటిన్ లో పిల్లి అని అర్థం). ఆ విధంగా సింహజాతి ఫెలిస్ లియో, పులుల జాతి ఫెలిస్ టిగ్రిస్, పిల్నుల జాతి ఫెలిస్ డొమెస్టికస్

అయ్యింది.

ఆ విధంగా జాతులకి పేరు పెటడానికి, వాటిని సరైన కోవలో పెట్వుడానికి జాతులని క్షణంగా అధ్యయనం చెయ్యాలి.

ఇంకా పెద్ద బృందాలని కూడా నిర్వచించడానికి వీలవుతుంది. ఉదాహరణకి జుటు, వెచ్చని నెతురు ఉండే జంతువులని స్తన్య జీవులు (క్షీరదాలు అని కూడా) అంటూరు. మీరు, నేను స్తన్య జీవులమే. ఈకలు, వెచ్చటటి నెతురు ఉండేవి పక్షులు. పొలుసులు గలవి, గాలి పీల్చేవి సరీసృపాలు అంటూరు. పొలుసులు గలవి, నీటిని పీల్చేవి చేపలు.

క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, చేపలు - వీటిలో కొన్ని సామాన్య లక్షణాలు ఉన్నాయి. అన్నిటబోను ఎముకలు ఉంటాయి. అందుకే వీటిని సకశేరుకాలు అంటూరు.

ఆ విధంగా లిన్నాయియస్ కల్పించిన జాతులని ఇంకా ఇంకా పెద్ద పెద్ద వరాలలో ఉంచే వ్యవస్థకి ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త జార్చ్ కూవియే ఇంకా మొరుగులు దిదాడు. కూవియే శరీర నిర్మాణ శాస్త్రంలో నిపుణుడు. జంతువుల ఎముకలని, అవయవాలని విశ్లేషించి, వర్గీకరించడం

అతడికి తెలుసు. కొన్ని సార్న జంతువులోని ఓ ఏకైక అవయవం - అది ఓ దంతం కూడా కావచ్చు — ఆధారంగా కూడా జంతువు గురించి ఎన్నో తెలుసుకోవచ్చని కూవియే అర్థం చేసుకున్నాడు.

కూవియే మొక్కలని, జంతువులని ఇంకా పెద్ద బృందాలుగా విభజించాడు. వీటిని వరాలు (ఫైలమ్) అన్నాడు. ఉదాహరణకి దేహానికి ఆధారంగా ఉండే అక్షంలా పని చేసే కణాల దండాన్ని - దీనికి నోటరోకార్త్ అని పేరు - గల వరానికి కారాలూ అని పేరు పెట్నూడు. మనిషి, ఏనుగు, పాము, కప్ప, కాడ్ చేప మొదలైన సకశేరుకాలన్నీ కూడా కార్చాటూ వరానికి (ఫైలమ్ కి) చెందినవే. (సకశేరుకాల పిండాలలో ఉండే నోటరోకార్త్ లే పాణి ఎదిగాక వెన్నెముకగా మారుతాయి.)

సీతాకోకచిలుక, సాలెపురుగు, ఎండ్రకాయ, జెర్రి మొదలైన వన్నీ ఆర్తోపోడా అనే వరానికి చెందుతాయి.

కూవియే ఈ విధమైన వ్యవస్థని రూపొందించిన తరువాత దాన్ని శిలాజాలకి వర్తింపజేశాడు. వర్తమానంలో ఉన్న జీవాలకి శిలాజాలలో ఉన్న జీవాలకి మధ్య అంత సమూలమైన తేడా ఏం లేదని గుర్తించాడు. కారేట్సకి చెందిన శిలాజాలు ఉన్నాయి. వర్తమానంలో ఉన్న కారేట్సకి వాటికి మధ్య పెద్దగా తేడా లేదు. అలాగే ఆర్తోపాడ్ లకి చెందిన శిలాజాలు కూడా ఉన్నాయి.

అలాగని బొత్తిగా తేడాలు లేవని కావు. శిలాజంలో ఉండే కారేట్ అచ్చం ప్రసుతం ఉన్న కారేట్ లా ఉండకపోవచ్చు.

వివిధ రాతి స్తరాలలో ఉన్న శిలాజాల గురించి మరో ముఖ్యమైన విషయం కూడా కనుక్కున్నాడు కూవియే.

ఉదాహరణకి ఒక చోట తవ్విన కొండలో వరుసగా ఒకదాని మీద ఒకటి 5 స్తరాలు ఉన్నాయి అనుకుందాం. సహజంగా మరి అటుడుగున ఉన్నది అతి పురాతనమైనదని అనుకుంటూం. ఆ తరువాత దాని మీద మరో స్తరం, ఆ పై దాని మీద ఇంకో స్తరం ఇలా ఏర్పడి ఉంటూయి. ఉపరితలానికి అతి చేరువగా ఉన్నది అన్నిటవీ కన్నా వయసులో చిన్నది. శిలాజం ఎంత అడుగున ఉన్న స్తరంలో దొరికితే అంత పురాతనమైనది అన్నమాట.

ప్రతీ స్తరంలోను ఆ స్తరానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన శిలాజాలు దొరికాయి. పైపొరలో ఉండే శిలాజాలు ప్రసుతం జీవించే జంతువులని పోలి ఉన్నాయి. లోతుకి పోతున్న కొలది శిలాజాలు ప్రసుతం ఉండే జీవులకి చాలా భిన్నంగా ఉన్నాయి.

అంటే కోటూనుకోట్ను సంవత్సరాల క్రితం, అత్యంత పురాతనమైన స్తరాలు ఏర్పడుతున్న కాలంలో బతికిన జీవరాశులు ప్రసుతం మనకి తెలిసిన జీవరాశుల కన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. అప్పట్నుంచి అత్యంత మందగతిలో మారుతూ ప్రసుతం మనకు తెలిసిన జీవరాశులుగా పరిణామం చెందాయి. ఉపరితలానికి అతి దగ్గరి పొర ఏర్పడే సమయానికి ప్రసుతం మనకి తెలిసిన జీవాలు

ఉద్బవించాయి.

జీవరాశులలో ఇలా మంద గతిలో వచ్చే మార్చుసే పరిణామం అంటూరు. కూవియే పరిశీలనల బటన్నీ పరిణామం జరిగినట అనిపించినా, అసలు కూవియేకే ఆ భావన మీద నమ్మకం లేదు.

జీవరాశులు మారలేదని కూవియేకి గట్న నమ్మకం. బోసే లాగా కుయిపే కూడా ఉత్పాతాలు జరిగాయని, ప్రతీ ఉత్పాతం తరువాత కొత్త జీవరాశి ఉద్భవించిందని నమ్మాడు. కొత్త జీవ రాశులు పుటుకొ చ్చిన ప్రతీ సారి అవి అంతకంతకు వర్తమానంలో ఉండే జీవరూపాలని పోలి ఉంటాయి. అంతే గాని ఒక దశలో ఉండే జీవకోటికి, అంతకు ముందు దశలో ఉండే జీవకోటికి మధ్య ఏ విధమైన సంబంధమూ ఉండదు.

శిలాజాల సాక్షం పెరుగుతున్న కొద్ది ప్రళయంలో జీవరాశులన్నీ తుడిచిపెటుకుపోయే అవకాశం తక్కుపే అనిపించింది. వివిధ స్తరాలలో వివిధ రకాల శిలాజాలు ఉన్నా, తరచు ఒకే రకమైన శిలాజాలు పలు స్తరాలలో ప్రత్యక్షం అవుతుంటాయి. అంటే ఒక తరానికి చెందిన జీవాలు తగినంత కాలం బతికి తదుపరి తరానికి పూర్వీకులుగా పరిణమిసున్నాయి అన్నమాట.

ఈ సంగతులన్నీ గ్రహించిన శాస్త్రవేత్తలు హటన్ చెప్పినటు నెమ్మదిగా, స్థిరంగా సాగే మార్పు మీదే నమ్మకం పెంచుకోసాగారు. అలాంటి వారిలో ముఖ్యుడు చార్లెస్ లయల్ అనే స్కాటలండ్ S చెందిన ဖဲ့S ̧ -

1830, 1833 లకి మధ్య లయల్ భౌగోళిక శాస్త్ర నియమాలు అన్న పేరుతో మూడు పుస్తకాలు ప్రచురించాడు. అందులో ప్రళయాలు జరగలేదని నిరూపించి సాక్ష్యాలన్నీ జాగ్రత్తగా సేకరించి ప్రదర్శించాడు. ప్రాచీన శిలాజాల కాలం నుండి భూమి మీద శిలాజాలు ఉండేవన్న ونوع వాదనని ప్రతిపాదించాడు.

అతి ప్రాచీన శిలాజాలు కోటూనుకో ట్ను సంవత్సరాల వెనకటివి అని నిర్ణయించాడు లయల్ (ఈ అంచనాని సరిగా ఒక శతాబ్దం ముందు బఫన్ చేసిన 40,000 ఏళ్ళ అంచనాతో పోల్చండి). అతని పుస్తకం ఎంత విశ్వసనీయంగా ఉందంటే భూ చరిత్రలో అడపాదపా ప్రళయాలు వచ్చి

జీవ కోటిని నాశనం చేశాయి అన్న భావనని క్రమంగా విస్మరించారు.

1830 ల నుండి భూమి మీద కోటూనుకోట్ను సంవత్సరాలుగా జీవ రాశి అవిచ్ఛిన్నంగా జీవిసూ వచ్చింది అన్న నమ్మకం సార్వత్రికమైన ఆమోదాన్ని పొందింది. జీవ పరిణామాన్ని గురించి ఊహాగానాలు చేసిన శాస్త్రవేత్తలు ప్రాచీన కాలంలోనూ లేకపోలేదు. కాని ఆ విషయాన్ని శాస్త్రబద్దంగా నిరూపించిన వాడు బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ రాబర్స్ డార్విన్

1831లో డార్విన్ 5 ఏళ్న సముద్రయానం మీద బయలుదేరాడు. పెళ్ళిన ప్రతీ చోట మొక్కలని, జంతువులని అధ్యయనం చేసూ వచ్చాడు. లయల్ రాసిన మొదటి పుస్తకాన్ని కాలక్షేపానికి కూడా తీసుకువేళ్ళాడు. ప్రయాణంలో దాన్ని చాలా శ్రద్దగా చదివాడు. భూమి యొక్క అపారమైన ఆయువుని నిరూపించగల ప్రత్యక్ష సాక్ష్యాలని సేకరించాడు. గతంలో జీవాలు చాలా భిన్నంగా ఉండేవని గమనించాడు. కాలక్రమేణా అవి నెమ్మదిగా మారి ప్రస్తుతం మనకి కనిపించే జీవాల పోలిక్షక్షి వచ్చాయి. చివరికి తన అనుభవాన్నంతా జీవరాశుల అవతరణ (The Origin of the Species) . జీవపరిణామాన్ని సమర్ధిసూ తను సేకరించిన సాక్ష్యాలన్నీ అందులో వర్ణించాడు.

తదనంతరం డార్విన్ సిదాంతానికి సమర్తింపుగా మరిన్ని సాక్ష్యాలు దొరికాయి. వాటిలో కొన్ని ఆధారాలు శిలాజాల నుండి దొరికాయి. ఆ సంగతేంట్రలో చూదాం.

ప్రాచీన ప్రాణులు

కూవియే శిలాజాల మీద పనిచేసే కాలానికి అతడికి గొప్ప శిలాజాల నిపుణుడు అన్న పేరు ఉండేది. ఎవరికైనా ఏదైనా చిత్రమైన శిలాజం దొరికితే అతడికి చూబించేవారు.

ఉదాహరణకి అతని వద్దకి ఎవరో ఒకసారి ఒక పెద్ద పంజాకి చెందిన శిలాజాన్ని తెచ్చారు. అది అమెరికాలో దొరికింది. వినష్టమైపోయిన మహా సింహానికి చెందినది అయ్యుంటుందని అంతా అనుకున్నారు.

కూవియే ఆ పంజాని జాగ్రత్తగా పరిశీలించి అది సింహానిది కాదని తేల్చాడు. అంతే కాక ఆ జంతువు అసలు మాంసాహారి కాదని కూడా తేల్చాడు. నిజానికి ఆ పంజా స్నాత్ అనబడే జంతువుకి చెందినది. ఈ స్నాత్ దక్షిణ అమెరికాలో చెట్ను మీద బతుకుతు, ఆకులు అలములు తిని బతికే ఎలుగుబంటును పోలిన జంతువు. ఇవి చెట్ను కొమ్మల నుండి వాటనీ బలమైన పంజాలతో పేలాడుతూ మొల్లగా చెట్నులో సంచరిసూ ఉంటూయి.

కూవియే ఆ పంజా ఓ పెద్ద స్నాత్ ది అని నిశ్చయించాడు. తరువాత అతడు చెప్పిందే నిజమని తేలింది. అమెరికా ఖండాలలో ఒకప్పుడు పెద్ద పెద్ద స్నాత్ లు ఉన్నాయనడానికి నిదర్శనాలు దొరికాయి. అవి ఎంత పెద్దవి అంటనే అవి చెట్ను నుండి పేలాడగలిగేవి కావు. కొన్నయితే 6 మీటర్‌ను పొడవు ఉండి ఏనుగులంత ఉండేవి. అంత పెద్దవి కనుక ఇవి నేల మీద బతికేవి. అందుకే వీటిని నేల స్నాత్ లు అనేవారు. వీటి శాస్త్రనామం మొగాతీరియం. అంటే మహాపాణి అని అర్థం.

ఇలాగే కూవియే వద్దకి మరిన్ని పెద్ద పెద్ద శిలాజపు ఎముకలు తెచ్చారు. వటన్డీ పంజాలు మాత్రమే కావు. ఇతర ఎముకలు కూడా తెచ్చారు.

1766 లో నెథరాండ్ దేశంలో మ్యూస్ నదీ (ఈ నదినే ప్రాచీన రోమన్న మొసా అనేవారు) తీరం వద్ద ఒక రాతి గని ఉండేది. భవనాల నిర్మాణం కోసం అక్కడ రాయి తవ్వి తీసేవారు. అలా రాళ్ళు తవ్వి తీసుంటే అక్కడి కార్మికులకి కొన్ని శిలాజాలు కనిపించాయి.

అదృష్టవశాతు ఆ పక్కనే ఉన్న ఊచ్లో ఉండే వారికి శిలాజాల గురించి తెలుసు. వాళ్సు వచ్చి గనిలో పనిచేసే కార్మికుల వద్ద నుండి శిలాజాలు దక్కించుకున్నారు. అలాగే మరిన్ని ఎముకలు దొరికాయి. 1780 ఓ పెద్ద కపాలం కూడా దొరికింది.

ఆ ఎముకలకి చెందిన జంతువు ఎలాంటనీదై ఉంటుందన్న విషయం మీద తీవ్రమైన వివాదం చెలరేగింది. చివరికి 1795లో ఆ ఎముకలని కూవియుకి పంపారు.

ఇక్కడే సూక్ష్మమైన పరిశీలన ఎంత ముఖ్యమో బయటపడింది. సజీవంగా ఉన్న క్షీరదానికి, సజీవంగా ఉన్న సరీసృపానికి మధ్య తేడా చెప్పడం సులభం. ఎందుకంటనే క్షీరదానికి వెచ్చని నెతురు ఉంటుంది, జట్ను ఉంటుంది, సరీసృపానికి చల్లని నెతురు ఉంటుంది, పొలుసులు ఉంటాయి. కాని రెండు జంతువుల నుండీ కేవలం ఎముకలని చూసి తేడా చెప్పడం ఎలా? చిత్రమేమిటంటనే కేవలం

ఎముకల లక్షణాల బటన్నీ కూడా నిపుణులు ఈ రెండు జంతువుల మధ్య తేడా చెప్పగలరు.

కపాలంలోని ఎముకల విన్యాసాన్ని బట, రాతి గని తవ్వకాలలో దొరికిన శిలాజం ఒక సరీసృపానిదని (బల్నులు, పాములు, తాబేళ్న, మొసళ్న మొదలైనవి ప్రసుతం సజీవంగా ఉన్న సరీసృపాలకి ఉదాహరణలు) క్షీరదానిది కాదని తేల్చి చెప్పాడు కూవియే. శిలాజంలోని అస్తిపంజరాన్ని బటర్టీ అది బల్లి దేనని తేల్చాడు కూవియే.

ఈ ప్రాచీన బల్లి యొక్క కాలి ఎముకలని గమనిస్తే దాని పాదాలు తెడలా వాడబడి ఉండేవని అనిపిస్తుంది. అదో సముద్రపు బల్లి, దానికి మొసాసార్ అని పేరు పెటూరు. అంటే మొసా నదికి చెందిన బల్లి అని అర్హం. ఇది చాలా పెద్ద జంతువు. కొన్ని శిలాజాల బటన్నీ ఈ జంతువు పొడవు 14 మీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటనే ఇంచుమించు తిమింగలం అంత పెద్దది అన్నమాట.

గత యుగాలలో పెద్ద పెద్ద క్షీరదాలు, పెద్ద పెద్ద సరీసృపాలు జీవించేవని నిరూపించాడు కూవియేు.

భూమి మీద ఒకప్పుడు ఇలాంటనీ మహాకాయాలు సంచరించేవన్న వార్త గొప్ప సంచలనం రేపింది. రాక్షసులు, రాకాసిబల్నులు మొదలైన గాధలకి ఆధారం ఇమేనా?

కాదు. ఎందుకంటచే ఈ శిలాజాలు చాలా అటుడుగు పొరల నుండి వచ్చాయి. మనుషుల జాడ కూడా లేని ఎంతో సుదూర గతంలో అవి జీవించాయి. భూమి మీద మనుషులు అవతరించిన నాటికి అవి అదృశ్యమైపోయాయి.

అOునా కూడా ప్రాచీన కాలంలో మనిషికి దొరికిన శిలాజాలే ఈ రాక్షసుల, రాకాసి బల్నుల, భూతాల గాధలకి ఆధారభూతం అయ్యుంటూయి.

సంచలనం కలిగించింది కేవలం ఏద పెద శిలాజాలు మాత్రమే కాదు. చాలా చిన్నదైన ఓ ప్రాచీన శిలాజం గురించి కూవియే విన్నాడు. దానికి నాలుగు కాళ్ళు ఉన్నట్నుగా ఎముకలు ఉన్నాయి. అయితే ముందు కాళ్న చాలా పొడవుగా ఉన్నాయి.

ఈ శిలాజానికి చెందిన చిత్తాలు ఉన్నాయి. కూవియే వాటిని శ్రద్దగా చదివాడు. ఎముకల విన్యాసం మామూలుగా సరీసృపాలలో ఉండేటుగానే ఉంది. కాని మరి ఆ ముందు కాళ్న మాటమేమిటి? ఒక్కొక్క ముందు కాలికి కొసలో 4 పేళ్నని సూచిన్నూ ఎముకలు ఉన్నాయి. వీటిలో మూడు చిన్నవి, సాధారణమైనవి. కాని నాలుగవది మాత్రం చేయి కన్నా పొడవుగా ఉంది. ఆ ఒక్క పేలి వల్లనే చేతి పొడవు అంత ఎక్కువయ్యింది.

మరి ఆ పేలు అంత పొడవు ఎందుకు ఉండాలి? అలాంటనీ పేలికి బలి పాదంలోలా విస్తరించిన చర్మం ఉంటే తప్ప పేలి పొడవు అంత ఎక్కువ కాలేదని ఊహించాడు కూవియే. అలా విస్తరించిన చర్మం రెక్క అయ్యుండొచ్చు. అంటనే తాను అధ్యయనం చేసున్న ప్రాచీన సరీసృపానికి రెక్కలు ఉన్నాయన్నమాట. ఆ రెక్కలతో అది ఎగరగలిగేది అన్నమాట. కూయిపే దానికి టీరోడాక్షిల్ (రెక్క పేలు) అని పేరు పెట్చూడు.

కూవింటేు చెప్పింది గొప్ప సంచలనం సృష్టించింది. సరీసృపాలు ఇప్పుడు లేవు.

కూవింటేు అధ్యయనం చేసిన మొటమొదటి శిలాజం అంత పెద్దది కాదు. కాని కాలక్రమేణా మరింత పెద్ద ఎగిరే సరీసృపాల అస్తిపంజరాలు దొరికాయి. ఈ సరీసృపాల బృందాన్ని టెరోసారు.

అంటూరు. అంటనే రెక్కల బల్నులు అన్నమాట. వీటిలో చివరిది ట్రయెరనోడాన్.

వీటిలో కొన్నిటి రెక్కల పొడవు కొస నుండి కొసకి కొలిస్తే 760 సె.మీ.ల వరకు ఉండవచ్చు. ఇవి సృష్టిలోనే అతి పెద్ద ఎగిరే జంతువులు.

కూయిపే టవీరోడాక్షిల్ ని కనుక్కున్న ఏడాదికి ముందు ఏడాది, మేరీ ఆనింగ్ అనే 12 ఏళ్న పాప దక్షిణ ఇంగ్లండ్ లో తన ఇంటికి దగ్గర్లోని ఓ కొండ చెరియు వద్ద ఓ పెద్ద జంతువుకి చెందిన ఎముకల శిలాజాలని కనుక్కుంది. ఆ శిలాజపు ఎముకల పొడవు 9 మీటర్ల వరకు ఉంది.

ఎముకల విన్యాసం చూస్తే చేప ఎముకల విన్యాసంలా ఉంది. కాని కపాలంలోని ఎముకల విన్యాసాన్ని గమనించగా అది చేప కాదని సముద్రపు సరీసృపం అని రూఢి అయ్యుంది. ఈ నిర్ణయంలో కూయిమే పాత్ర కూడా ఉంది.

సముద్రపు తాబేళ్న, సముద్రపు పాములు మొదలైనవి నేటికీ ఉన్నాయి. కాని చేప ఆకారంలో ఉండే సరీసృపం ఎక్కడా లేదు. మేరీ ఆనింగ్ కనుక్కున్న శిలాజానికి ఇక్ట్యోసార్ అని పేరు పెటూరు. అంటే చేప బల్లి అని అర్హం.

1821 లో అప్పటికే శిలాజాల పేట ఒక వృత్తిగా చేపటన మేరీ ఆనింగ్ మరో సముద్రపు సరీసృపాన్ని కనుక్కుంది. మొసాసార్ లాగానే దీనికీ తెడ లాంటనీ పాదాలు ఉండి, పొడవైన మెడ కూడా ఉంది. దీనికి ప్పెసియోసార్ అని పేరు. (అంటనే ఇంచుమించు బల్లి అని అర్థం). ఇక్ట్యోసార్ తో పోల్చితే ఈ జీవం చేప కన్నా సరీసృపాన్ని ఎక్కువగా పోలి ఉందని అలా పేరు పెటూరు.

అయితే ప్రతీ సందర్భంలోను కూవియే చెప్పింది నిజం అని కాదు. కొన్ని సార్న పొరబాట్ను కూడా చేశాడు.

1822లో గిడియొన్ ఆలెర్నాన్ మాంటెల్ అనే ఇంగ్లండ్ కి చెందిన శిలాజాల పేటగాడు కొన్ని దంతాలు, ఎముకలు కనుక్కున్నాడు. చూడబోతే అవి 6 మీటర్‌ను పొడవు ఉండే జంతువుకి చెందిన వాటిలా .

రాతిలో నిక్షిప్తమై ఉన్న కొన్ని దంతాలని, ఎముకలని బయటికి తీసి కూవియేుకి పంపాడు. కూవియే వాటిని జాగ్రత్తగా పరిశీలించి అవి ఓ పెద్ద క్షీరదానికి చెందినవని అన్నాడు. ఆ పళ్న ఓ ఖడమృగానివని అనుకున్నాడు.

అంత పెద్ద నిపుణుడు చెప్పాడు కనుక ఇక మాంట్రయెల్ ఏం మాటూడలేదు. కాని కొన్నేళ్ళ తరువాత మాంటెల్ కి మరి కొన్ని దంతాలు దొరికాయి. ఆ దంతాలు ఇగువానా అనే సరీసృపం యొక్క దవడ నుండి వచ్చాయి. ఈ ఇగువానా ఉత్తర అమెరికా లోని ఎడారి ప్రాంతాల్లో ఉండే ఓ పెద్ద సరీసృపం.

ఈ పళ్ళు మునుపటి శిలాజపు పళ్న లాగానే ఉన్నాయి కాని, ఈ శిలాజపు పళ్న మరి కొంచెం పెద్దవిగా ఉన్నాయి. మాంటెల్ ఈ

శిలాజానికి ఇగువానొడాన్ అని పేరు పెట్చూడు. అంటే ఇగువానా

దంతాలు అని . తదనంతరం ఇగువానా దంతాలని చూసిన కూవియే మాంటల్ చెప్పిందే నిజమని ఒప్పుకున్నాడు.

ఈ ఇగువానోడాన్ సజీవంగా ఉన్నప్పుడు, పెద్ద భారమైన కంగారూలా, పైన పొలుసులతో, బహుశా ఏనుగు కన్నా పెద్దగా, ఉండేది.

1840 ల కల్నా ఎన్నో శిలాజపు సరీసృపాలు కనుక్కోబడాయి. కపాలంలోని ఎముకల విన్యాసాన్ని బటర్టీ వాటిని వివిధ బృందాలుగా వర్గీకరించారు. ఇక్యోసార్న ఒక ప్రత్యేక బృందానికి చెందినవి. ప్పెసియోసారు. మరో బృందం. టచెరోసారు మూడవ బృందం.

ఈ జీవాలు ప్రత్యేకించి భయంకరమైనవి అని చెప్పడానికి లేదు. ఇక్యోసారు, ప్లెసియోసారు సముద్రపు జీవాలు. అవి నేల మీదకి ఎగబాక లేవు. అవి ప్రసుతం జీవించి ఉన్నా మనుషులకి హాని చెయ్యలేవు. టెరోసార్ను ఎగిరే ప్రాణులు. వీటి పరిమాణం చిన్నది. బహుశ ఇవి గండభేరుండాల కన్నా తక్కువ ప్రమాదకరమైనవేమో.

నేల మీద బతికే సరీసృపాలలో రెండు బృందాలు ఉన్నాయి. కపాలపు ఎముకలు గలవి (టచెరోసార్ల లాంటివి). ఇవి కొంచెం భయంకరమైనవే. వీటిలో కొన్ని భూమి మీద మునుపు ఎన్నడూ జీవించనంత భారీ మాంసాహారులు. వీటి ముందు సింహాలు పిలిపిల్లల లాంటివి అన్నమాట! శాకాహారులైన మరి కొన్ని సరీసృపాలు మరింత పెద్దవి. ఆ రోజులోనే మనం జీవించి ఉన్నట్లయితే పని కటుకుని మనని భక్షించేవి

కావేమో గాని, వాటి కాళ్ళ కింద మనం నుజు నుజ అవుతుంటచే వాటికి చీమ కుటర్టీనటుయినా ఉండదేమో!

1842లో ఈ రెండు రకాల సరీసృపాలకి డైనోసారు అని పేరు పెటూరు.

అంటే రాకాసి బలులు. ఆ పేరు పెట్చనవాడు బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త రిచర్డ్ ఓవెన్.

మొటమొదట కనుగొనబడ్డ డైనోసార్ ఇగువనొడాన్. కూయిపే పొరబడ్డది దీని విషయంలోనే. ఎన్నో అద్భుత విషయాలు కనుక్కున్నా మొటమొదటరీ 3) కనుక్కున్న ఘనత అతడికి దక్కలేదు. e-3 ఘనత మాంట్రయెల్ కి దక్కింది.

సరీసృపాలు వృది చెందాయి

1859లో పరిణామ సిదాంతం మీద డార్విన్ పుస్తకం అచ్చయిన తరువాత డైనోసారు మొదలైన వినష్టమైన జంతువుల మీద మనుషుల ఆసక్తి మరింత పెరిగింది.

డైనోసారు ఎప్పుడో బతికి, నేడు లేని, బృహత్కాయం గల విచిత్రమైన జీవాలు మాత్రమే కావు. సూదీర పరిణామ చరిత్రలో వాటికొక ముఖ్యమైన సానం ఉంది. బృహత్ సరీసృపాల శిలాజాలు అడుగున ఉన్న స్తరాలలో కనిపిస్తే, బృహత్ క్షీరదాల శిలాజాలు పై పొరలలో కనిపించాయి. అంతే కాదు. సరీసృపాల శిలాజాలు దొరికిన ప్రాంతాలో అసలు క్షీరదాల శిలాజాలే లేవు.

క్షీరదాలు లేని కాలంలో సరీసృపాలే నేలని ఏలి ఉండవచ్చేమో! కొన్ని సరీసృపాలు క్రమంగా క్షీరదాలుగా పరిణామం చెంది ఉండవచ్చేమో.

వినష్టమైపోయిన కొన్ని సరీసృపాలు మనకి పూర్వీకులు కావచ్చేమో.

డార్విన్ కాలం నుండీ కూడా చాలా మంది శిలాజపు పేటగాళ్న వీలైనన్ని శిలాజాలని సేకరించడానికి ప్రయత్నిసూ వచ్చారు. శిలాజాలు దొరికిన స్తరాలు ఎంత పాతవో అంచనాలు పేశారు. దొరికిన ప్రతీ శిలాజపు రూపురేఖలని క్షణంగా పరీక్షించారు. అది ఎలాంటి జంతువు నుండి వచ్చిందో నిర్ణయించడానికి ప్రయత్నించారు.

ఇలంటి ప్రయత్నం వల్ల జీవపరిణామం ఎలా జరిగిందో అరం అవుతుంది. కోటూనుకోట్ను సంవత్సరాలుగా జీవరాశులు ఎలా మారుతూ వచ్చాయో ఒక అవగాహన ఏర్పడుతుంది.

జీవపరిణామ చరిత్రను చదవాలంటే శిలాజాలు దొరికే అత్యంత ప్రాచీనమైన స్తరాల వద్ద నుండి మొదలెటూలి. స్తరాలలోని రసాయనాలలో కాలానుగతంగా వచ్చే మార్పులను బటనీ ఆ స్తరాల వయసుని అంచనా వేసే పద్దతులు 1907 వరకు శాస్త్రవేత్తలకి తెలీదు. రసాయనాలలో మార్పు ఎంత వేగంగా జరుగుతుందో వారికి తెలుసు. దాంతో ఎంత మార్పు జరిగిందో లెక్క కటువచ్చు. స్తరాల వయసు అంచనా పేయొచ్చు.

60 కోట్‌ను సంవత్సరాల పూర్వపు రాతిలో అత్యంత ప్రాచీనమైన శిలాజాలు ఉన్నట్ను తెలిసింది. కాని చిత్రమేమిటంటనే అంత ప్రాచీనమైన శిలాజాలు కూడా చాలా సంక్లిష్టమైన జంతువులకి చెందినవి. కనుక అంతకు ముంది మరిన్ని కో ట్ను సంవత్సరాలుగా జీవరాశులు ఉండి ఉండాలి. కాని ఆ పూర్వపు జంతువుల శరీరాలు మొత్తనిపై ఉంటాయి.

శిలాజాలు ఏర్పడటానికి కావలసిన ఎముకలు, గవ్వలు మొదలైన పేవీ వాటి శరీరాలలో ఉండకపోవచ్చు.

అత్యంత ప్రాచీనమైన శిలాజాలు సముద్ర చరాలకి చెందినవి. ప్రస్తుతం ఉన్న జంతు వరాలలో (ఫైలమ్) ఒక్కటి తప్ప మిగతా వన్నీ 60 కో ట్ను ఏళ్న క్రితం కూడా ఉండేవి.

ఆ మినహాయింపు కారేట్ వరం - అంటనే క్షిరదాలు, సరీసృపాలు కలిసిన జీవరాశుల వరం అన్నమాట. మొటమొదటి కారేట్ వరం 50 కోట్‌ను సంవత్సరాల వయసున్న స్తరాలలో దొరికాయి. మరో పది కో ట్ను

సంవత్సరాల తరువాత చేపలాంటి కారేట్ జీవాలు సర్వసామాన్యంగా కనిపించసాగాయి.

ఈ కారేటులో మొదటి దశలో అధికశాతం సముద్ర జీవాలే ఉండేవి. 42.5 కో ట్ను సంవత్సరాల క్రితం వరకు కూడా నేల మీద సంచరించే జీవరాశులు ఇంచు మించు లేవనే చెప్పాలి. మటరీలో బాక్టీరియా ఉండే పేమో, కాని మొక్కలు, జంతువులు ఉండేవి కావు.

సముద్ర జలాలు మాత్రం జీవరాశితో కిటకిట లాడుతుండేవి. పడిలేచే కెరటూలు పొడి నేల మీద జీవ రాశులని దిగవిడుసూ ఉండేవి. ఆ విధంగా సముద్దాలు వెళ్ళగక్కిన జీవరాశులలో కొన్ని నేల మీద బతికి బటు కట, పునరుత్పత్తి చేత వృద్ధి చెందాయి. కాలానుక్రమంగా కోట్నూది సంవత్సరాలుగా నేల మీద ఉన్న జీవరాశులు ఇంకా ఇంకా ఎక్కువ కాలం నేల మీద మనగలిగేటుగా పరిణామం చెందాయి.

మొక్కలు కూడా నేల మీద బతికేవి. ఆ మొక్కలు తిని సాలెపురుగులు, నత్తలు మొదలైన చిన్న చిన్న జీవరాశులు బతికేవి. అలా విస్తరించిన చిన్నారి జీవరాశితో ఖండాలు కిక్కిరిశాయి.

ఎగసి పడే కెరటాల వల్ల కారేట్ను పొడి నేల మీద చిక్కుబడి పోయాయి. లేదంటే చిన్న చిన్న చెరువులలో ఉండే కారేట్ను ఆ చెరువులు ఎండిపోయాక నేల మీద చిక్కుకుపోయాయి. అలాంటప్పుడు అవి నేల మీద గెంతుకుంటూ మరో చెరువును వెదుక్కుంటూ పోవాలి. ఇలాంటి పనిలో మంచి సామర్ష్యం ఉన్నవి బలమైన రెక్కలు (fins) ఉన్న చేపలు. అవి తమ రెక్కల సహాయంతో నేల మీద గెంతుతూ పోగలిగేవి.

కో ట్ను సంవత్సరాల తరువాత ఆ రెక్కలు అసలైన కాళ్పుగా మారాయి.

KWT

చేపలు గాలిలో ఊపిరి తీసుకోగలిగాయి. గుడ్న పెటన్దేవి గాని ఆ గుడ్మకి రక్షణ ఉండేది కాదు. గుడ్ను నీటర్లో పెట్వూలి. నేల మీద పెడితే ఎండిపోయి చచ్చిపోతాయి. ఆ గుడ్లలోంచి వచ్చే చిట జీవాలు ఎదిగిన వరకు నీటర్లోనే ఉండాలి. కాని కాళ్న వచ్చాక నేల మీదకి రాగలిగాయి.

చిన్నతనంలో నీటర్లో ఉంటూ, ఎదిగాక నేల మీద సంచరించే జంతువులని ఉభయచరాలు అంటూరు. మనకిప్పుడు బాగా తెలిసిన ఉభయచరం కప్ప, కప్ప నీటర్లో గుడ్ను పెడుతుంది. గుడ్ను పగిలినప్పుడు తోకకప్పలు (tadpoles) బయటికొస్తాయి. అవి నీటలోనే పెరుగుతాయి. ఒక దశలో ఈ తోకకప్పలకి ఊపిరితితులు, కాళ్న పెంపొందుతాయి. అప్పుడవి నేల మీదకి వస్తాయి.

35 కో ట్ను ఏళ్న క్రితం భూమి మీద జీవించిన అతి పెద్ద జీవాలు ఉభయచరాలే. ఇవి చిన్న చిన్న హాగ్ చేపల లాంటివి కావు సుమా!

కొద్దిగా మొసళ్నలా ఉండే అత్యంత బలిష్టమైన జీవాలివి. వీటిలో కొన్ని 3, 4 మీటర్ల పొడవు ఉండేవి.

ఈ ఉభయ చరాలు నీటికి దగ్గరగా జీవించేవి ఆ నీటల్లో గుడ్ను పెటచొచ్చని. పగిలిన గుడ్ల నుండి బయటికి వచ్చిన సంతతి కొంత కాలం నీటర్ళోనే ఉండాల్సి వచ్చేది. ఆ దశలో అవి నిస్సహాయంగా, రక్షణ లేకుండా బతికేవి.

అప్పుడో మార్పు జరిగింది. కొన్ని ఉభయచరాలు మరింత సురక్షితమైన గుడ్మని పెంపొందించుకో సాగాయి. కొన్ని గుడ చుటూ గవ్వ లాంటి తొడుగు ఏర్పడేది. ఆ గవ్వలోపలి భాగంలో నీరు ఉండేది. దాని వల్ల గుడు ఎండిపోకుండా సజీవంగా ఉండేది. గవ్వలోకి గాలి వచ్చే అవకాశం కూడా ఉండేది. అందువల్ల అప్పుడే పుటన సంతతికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండేది.

అంటనే ఇప్పుడు నేల మీద కూడా గుడ్ను పెట్చువచ్చన్నమాట. సురక్షిత ప్రదేశాల్లో గుడ్ను పెటుకోవచ్చు. లోపల ఎదుగుతున్న పసి జీవం అది గుడు లోపలి భాగాన్ని పూర్తిగా నింపినంతవరకు ఎదగగలదు. అప్పటికే కాళ్ళు, ఊపిరితితులు పెంపొందడం వల్ల ఇక భద్రంగా పొడి లోకంలోకి ప్రవేశించవచ్చు.

అలాంటి గుడ్న పెట జీవాలు ఆ గుడ్న పెట్వుడానికి ఇక జలాశయాలని ఆశ్రయించాల్సిన పని లేదు. ఇవే మొటమొదటి సరీసృపాలు.

ప్రప్రథమ సరీసృపాలు చాలా చిన్నవిగా ఉండేవి. పైగా అవి నీటికే పరిమితమై ఉండేవి కావు. వాటనీ గుడ్న కూడా సురక్షితమైన

ప్రదేశాల్లో ఉండేవి కనుక వీటి సంఖ్య త్వరగానే పెరిగింది. ఉభయచరాలు చేరలేని సుదూర ప్రాంతాలకి ఇవి విస్తరించాయి. భూమి మీద సంచరించే జీవ రాశులో సరీసృపాలు అతి ముఖ్యమైన జాతిగా పరిణమించాయి.

డైనసార్ల యుగం

25 కోట్‌ను ఏళ్న క్రితం సరీసృపాలు భూతలం అంతా వ్యాపించాయి. ఇక్యోసారు, ప్లెసియోసారు వంటి పైతే తిరిగి సముద్రంలోకి వెల్లిపోయాయి. తక్కినవి నేల మీదే మిగిలిపోయాయి. 25 కో ట్ను సంవత్సరాల క్రితం మనం డైనోసారు అనుకునే మొటమొదటి సరీసృపాలు పెంపొందాయి. 20 కో ట్ను ఏళ్న క్రితానికలా డైనోసారు సర్వసామాన్యమైన సరీసృప జాతిగా పరిణమించాయి. వీటిని రెండు వరాలుగా విభజించవచ్చు. ఒక వరానికి చెందిన జంతువులలో ఆధునిక బల్నుల లో ఉండేటువంటి నడి ఎముకల వంటి ఎముకలు ఉండేవి. వాటికి సౌరిశ్చియున్న (బల్లి నడుములు) అని పేరు పెట్చూరు. రెండవ వరానికి పక్షులలో ఉండేలాంటి నడుము ఎముకలు ఉండేవి. వీటిని ఆర్నితిశ్చియున్న (పక్షి నడుములు) అన్నారు.

తొలి డైనోసారు. బలి లాంటి జంతువులు. వెనక కాళ్న మీద లేచి పరిగెత్తేవి. దేహం ముందు భాగం తూలకుండా పెద్ద తోక దన్నుగా ఉండేది. ముందరి కాళ్ను చిన్నవిగా ఉండేవి. వీటిని చేతులా ఉపయోగిస్నూ ఆహారాన్ని అందుకోవడానికి వాడుకునేవేమో! రెండు కాళ్న మీద కనుక పేగంగా పరుగెత్త గలిగేవి. ఆ సామర్ష్యం వాటికి చక్కగా ఉపయోగపడింది. అందువల్ల మాంసాహారులు వేటాడే మృగాన్ని పేగంగా పటుకోగలిగేవి. శాకాహారులు పెంటాడుతున్న మృగాల నుండి సులభంగా తప్పించుకోగలిగేవి.

ఈ సౌరిశ్పియన్ జాతి డైనోసారు పెరిగి పెరిగి 10 కో ట్ను ఏళ్ళ క్రితం వాటి నుండి లీచీరనోసారు (అంటనే పెనుబల్లి) ఉద్బవించాయి. ఇదో పేద కంగారూ లా ఉండేది. తల నుండీ తోక కొస వరకు 15 మీటర్‌ను ఉండేది. 180 సె.మీలు పొడవు ఉన్న తలలో బాకులాంటి 15 సెమీల పళ్ళు ఉండేవి. ఆ తల నేల మీద 6 మీటర్ల ఎతులో ఉండేది. అంటనే అది జిరాఫీ కన్నా పొడవైనది అన్నమాట! దీని బరువు 12 టన్నులు ఉండేది. అంటనే అతి పెద్ద ఏనుగు కన్నా భారమైనది.

లీచీరనోసారస్ లు, ఇతర డైనోసారు నేల మీద సంచరించిన మాంసాహారులలో కెలా అతి పెద్దవి. సౌరిశ్పియన్ డైనోసార్లలో శాకాహారులు కూడా ఉండేవి. అలా చెట్ను తినే డైనోసారు ఎంత పెద్దగా పెరిగిపోయాయంటనే రెండు కాళ్న మీద వాటి బరువు అవి మోసుకోవడం కష్టం అయ్యేది. కనుక ముందు కాళ్ళ మీద కూడా బరువు మోపుకునేవి. వీటిలో కొన్ని ఎప్పుడూ నాలుగు కాళ్న మీదే తిరిగేవి. వాటనీ కాళ్న ఇంటనీ బరువు మొూసే మూలస్తంభాలా పని చేసేవి.

వీటిలో ఒకటి డిపోడోకస్ (అంటనే స్తంభాల జత). ఎందుకంటే దాని ముంగాళ్న, వెనక కాళ్న రెండు స్తంభాల జతలలా ఉండేవి. దీని పొడవైన సన్నని మెడ కొసన బుల్‌ని తల ఉండేది. అవతలి కొసలో సన్నని తోక ఉండేది. మధ్యలో నాలుగు పాదాల మీద మోయబడ్డ భారమైన శరీరం ఉండేది. ముక్కు నుండి తోక కొస వరకు 27 మీటర్‌ను ఉండేది. చరిత్రలో అతి పొడవైన జంతువు ఇదే.

అటువంటిదే మరో డైనోసార్ బాంటరోసారస్ (అంటనే ఉరుము బలి). నేల మీద దాని భారమైన అడుగులు పడుతుంటచే ఉరుములు ఉరుముతున్నట్ను ఉండేదేమో! డిపోడోకస్ అంత పొడవు లేకపోయినా మరింత భారంగా, ఏపుగా ఉండేది. దాని బరువు 30 టన్నుల వరకు ఉండవచ్చు. అంటనే అతి పెద్ద ఏనుగు కన్నా మూడు రెట్ను బరువైనది అన్నమాట.

అన్నిటికన్నా బరుపైనది బాకియోసారస్ (అంటే భుజం బల్లి). ఎందుకంటచే దీని ముందరి కాళ్న, డైనోసార్ల ప్రమాణం బటనీ చూస్తే, బాగా పొడవు గా ఉండేవి. మెడ బాగా పొడవు ఉన్నా, తోక కాస్త్ర చిన్నదే. బరువు కూడా బాగా ఎక్కువే. 50 టన్నుల వరకు ఉండేది. కనుక చరిత్రలో అత్యంత భారమైన నేల జంతువు ఇదే.

అందరికీ బాగా తెలిసిన డైనోసారు. ఈ పెద్ద డైనోసారే. ఎక్కడైనా డైనోసార్ చిత్రం కనిపిస్తే అది మూడువంతులు బోంటరోసారస్ చిత్రమే అయ్యుంటుంది.

1870 లలో కనుగొన బడ్డ ఈ అతి పెద్ద డైనోసార్ల శిలాజపు టెముకలు డైనోసార్ల పరిశోధనా చరిత్రలో కెలా అత్యంత సంచలనాత్మకమైన ఆవిష్కరణలు. ఆ ఆవిష్కరణలు చేసింది అమెరికన్ శిలాజపు పేటగాడు చార్లెస్ ఓత్నియెల్ మార్చ్ ఇతడు ఇంచుమించు 80 కొత్త డైనోసార్ల జాతులని కనుక్కున్నాడు. ఆ రోజులోనే పని చేసిన మరో డైనోసార్ ఆవిష్కారకుడు ఎడ్విన్ బ్రింకర్ కోప్, డైనోసార్ల ఎముకలు ముందు ఎవరు కనుక్కున్నారు అన్న విషయం మీద ఇద్దరూ తరచు కీచులాడుకునేవారు.

రెండవ డైనోసార్ల వరమైన ఆర్నితిశ్చియున్నలో కూడా కొన్ని డైనోసారు. రెండు కాళ్న మీద పరుగెత్తేవి. వీటిలో ఇగువనోడోన్ లు కూడా ఉండేవి. ఇవే మొటమొదట కనుగొనబడ్డ డైనోసారు.

ఈ వరంలో కొన్ని జంతువులకి దటమైన, కఠినమైన ఎముక తొడుగులు ఉండేవి. ఆ కారణం చేత ఇవి అంత సులభంగా కొరుకుడు పడేవి కావు! పైగా వాడిగల కొమ్ములు వాడి శతువును గాయపరిచేవి. ఈ వర్గంలో అత్యంత ప్రముఖమైన తార్కాణాలని కనుక్కున్నవాడు మార్క్

వీటిలో ఒకటి 6 మీటర్‌ను ఉండేది. అది సైగోసారస్ (అంటే చూరు బల్లి). దీని శిలాజపు ఎముకలో ఎన్నో చదునైన పలకలాంటి ఎముకలు దొరికాయి. అందుకే దాని కలా పేరు పెటూరు. మొదట శిలాజపు నిపుణులు ఆ ఎముకలు మృగం యొక్క వీపు మీద కవచకుండలాలలా దానికి రక్షణగా ఏర్పాటై ఉన్నాయేమో అనుకున్నారు. కాని ఎముకల విన్యాసాన్ని ఇంకా క్షణంగా పరిశీలించిన మీదట ఆ ఎముక పలకలు వెన్నెముకకి ఇరు పక్కలా రెండు వరసలుగా నిటూరుగా అమరి ఉన్నాయని తెలిసింది.

సైగోసారస్ తోక చివర కూడా పొడవైన బాకులాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇది శాకాహారి. అయినా కూడా దాని మూపు మీద కవచాల్ల్నంటటి ఎముకలని, తోక చివర ములుకులాంటి ఎముకలని చూసి మాంసాహారులు వాటి దరి చేరడానికి కష్టమయ్యేది. డైనోసార్లలో పేటికీ పెద్ద మొదళ్న లేవు. ముఖ్యంగా సైగోసారస్ కి చాలా చిన్న మొదడు ఉండేది. అది ఏనుగు కన్నా పెద్దదైనా దాని మొదడు పిలిపిల్ల మొదడు కన్నా చిన్నది.

టై సెరాట్రూమ్స్ అని మరో డైనోసార్ ఉండేది. ఆ మాటకి మూడు కొమ్ముల ముఖం అని అర్థం. అది దాని తలతో ఆత్మరక్షణ చేసుకునేది. దాని కపాలం మీద ఎముకల దొంతర లాంటిది ఉండేది. అది మెడ కింది వరకు విస్తరించి ఉండేది. కళ్ళ మీదుగా రెండు పొడవాటి కొమ్ములు ఉండేవి. ముక్కు మీద మూడవ కొమ్ము దేహం పొడవు 6 మీటర్ల వరకు ఉండేది. ఈ టైటనెరాట్రూమ్స్ శాకాహారి. టటిరనోసారస్ కాలంలోనే ఇది కూడా జీవించేది. కొండంత లీటిరనోసారస్ కూడా ఆ

కొమ్ముల దెబ్బకి టై సెరాట్రూప్స్ దరిదాపులోకి కూడా రాగలిగేది కాదు.

బాగా సురక్షితంగా బతికిన డైనోసార్ ఆంకిలోసారస్. అంటనే కలిసి పెరిగిన బల్లి, ఎముక ఫలకాలు దుర్భేద్యమైన కవచంలా దీని వీపు మీద విస్తరించి ఉంటాయి. ఆ కవచానికి రెండు పక్కల ముళ్ళు ఉంటాయి. కవచము, ముళ్న కూడా తోక కొస వరకు విస్తరించి ఉంటాయి. తోక కొస ఒక బలమైన ఎముక దండంలా రూపుదేలి ఉంటుంది. ఆంకిలోసారస్ ఓ సజీవ యుధ ట్రూంక్.

ఈ డైనోసార్లన్నీ ఒకే కాలంలో జీవించలేదు. కొన్ని కోట్‌ను సంవత్సరాలు వృద్ది చెంది చివరికి నాశనమై వినష్టమైపోయాయి. వాటి సాసే ఇతర డైనోసారు వచ్చాయి. ఉదాహరణకి 15 కో ట్ను సంవత్సరాల క్రితం

Cv

సైగోసారస్ జీవించింది. కొన్ని కో ట్ను సంవత్సరాలు అది బాగానే బతికింది. ఆ తరువాత ఆంకిలోసార్, టై టెరాట్రూమ్స్ లు రంగప్రవేశం చేశాయి. సైగోసారస్ కన్నా వీటికి మరిన్ని రక్షక సదుపాయాలు ఉండేవి. ఆ పోటీలో నెగలేక సైగోసారస్ లు క్రమంగా తుడిచిపెటుకుపోయాయి.

7 కో ట్ను ఏళ్న క్రితం డైనోసార్లన్నీ నాశనమయ్యాయి. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఎన్నో సిదాంతాలు ప్రతిపాదించబడాయి. బహుశ వాతావరణం మారిందేమో. మరేవో జంతువులు డైనోసార్ల గుడని తినేసేవేమో. మనకి అర్థం కానిదేదో జరిగింది. అదేంటలో ఎవరికీ తెలీదు.

డైనోసారు చచ్చిపోయాయని మాత్రం కచ్చితంగా తెలుసు. చివరి దశలలో బతికిన డైనోసార్ల ఎముకల శిలాజాలు ఉన్న స్తరం ఒకటి ఉంది. దాని పై స్త్సరంలో డైనోసార్ల శిలాజాలే లేవు. డైనోసారు మాత్రమే కాదు, ప్లెసియోసార్ లు, ఇక్యోసారు వంటి ఇతర మహా సరీసృపాలు కూడా మాయం అయిపోయాయి. రెక్కలు ఉన్న టెరోసారు కూడా చచ్చిపోయాయి. సరీసృపాలు కాని మరిన్ని ముఖ్యమైన జంతు జాతులు కూడా నాశనమైపోయాయి.

పరిణామ సిదాంతంలోనే ఇదొక పెద్ద తీరని చిక్కు సమస్య.

డైనోసార్ తరువాత

అయితే సరీసృపాలు అన్నీ నాశనం కాలేదు. డైనోసార్లలోని రెండు వరాల లోను కొన్ని జంతువులు బతికాయి. వాటి నుండే నేటి మొసళ్న అవతరించాయి. మొసళ్ళు డైనోసారు కావు. కాని ఆ డైనోసార్లకి అతి దగ్గరి బంధువులు.

డైనోసార్ల కన్నా పురాతనమైన తాబేలు వంశం ఇప్పటికీ సజీవంగా ఉంది. అలాగే బల్నులు, పాములు కూడా ఇప్పటికీ జీవిసున్నాయి.

మరి కొన్ని సరీసృపాలు డైనోసార్ల కాలంలోనే రూపాంతరం చెందాయి. అసలు అవి సరీసృపాలు కాకుండా పోయాయి.

15 కో ట్ను సంవత్సరాల క్రితం కొన్ని చిన్న సరీసృపాల శరీరాల మీద పొలుసులు మొలిచాయి. ఇవి దేహానికి అతుక్కోకుండా వినసకర్రలా విస్తరించి ఉండేవి. ఇవే తరువాత ఈకలు అయ్యాయి. 1860లో ఈక వలన ఏర్పడినటుగా కనిపించిన ఓ శిలాజపు గురు కనిపించింది. అది కనుక్కున్న వాడు జర్మన్ శిలాజపు పేటగాడు హర్మన్ ఫాన్ మొయర్. ఆ ఈక గల జంతువుకి ఆర్కియోటెరిక్స్ (పురాతన ఈక)

అని పేరు ఏట్నూడు.

ఆ తరువాత అదే సంవత్సరంలో రాతిలో మరిని ఈకల గురుతులున్న శిలాజపు అస్తిపంజరం కనుగొనబడింది. అది ఒక పక్షికి చెందిన శిలాజం. కాని దానికి సరీసృపం లక్షణాలు కూడా ఉన్నాయి. దాని దవడలలో ಏಳಿುನಲ್ಲಯು. ఆధునిక పక్షులకి అలా ఉండదు. రెక్క బయటకు పొడుచుకు వసూ గో శ్న ఉన్నయి. తోక పక్షితోక లాంటిది కాదు, బల్లితోక లాంటిది.

ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణ. పరిణామ సిదాంతం అంటనే గిటుని వాఛ్న, ఒక జీవ జాతి మరో జీవ జాతిగా మారే పక్షంలో, ఆ మార్పులో మధ్యస్థంగా ఉన్న జీవాల జాడలు ఎందుకు కనిపించవు? అని అడుగుతారు.

ఆర్కియోటెరిక్స్ సరిగా అలాంటి మధ్యగత జీవానికి తార్కాణమే. මඡායි సరీసృపానికి, పక్షికి మధ్యస్థంగా ఉంటుంది. దానికి రెండు రకాల లక్షణాలూ ఉన్నాయి. దాన్ని బటర్షి పక్షులు సరీసృపాల నుండి

పరిణామం చెందాయని తెలుస్తోంది. డైనోసారు మొదలైన పెద్ద సరీసృపాలు చనిపోయాక, ఎన్నో పక్షులు బతికాయి. వాటి నుండే ఆధునిక పక్షులన్నీ ఉద్బవించాయి.

ఇది కాకుండా కొన్ని ఆదిమ సరీసృపాలలో పళ్న పెంపొందాయి. ఇవి నేటి సరీసృపాల కన్నా మరింత సంక్లిష్టంగా ఉంటాయి. వాటి పళ్ళు నేటి క్షీరదాల పళ్ళలా ఉంటాయి. అలాగే ఇతర ఆధునిక క్షీరదాల లక్షణాలెన్నో వీటిలో పెంపొందాయి.

మరి కొన్ని సరీసృపాలకి (ఇవి డైనోసారు కావు సుమా!) జుట్ను మొలిచి నిజమైన క్షీరదాలుగా వికాసం చెందాయి. డైనోసారు భూమిని ఏలిన కాలంలో క్షీరదాలు కూడా ఉండేవి. అయితే అవి అప్పటికి చిన్న పరిమాణం కలిగి, అంత ప్లాముఖ్యత లేని జీవాలు.

కాని డైనోసారు, ఇతర సరీసృపాలు అన్నీ చచ్చిపోయాక బతికి బయటపడ్డ జంతువులో ఈ చిన్న క్షీరదాలు కూడా ఉన్నాయి.

సరీసృపాలతో పెద్దగా పోటీ లేకపోవడం వల్ల అవి బాగా వర్షిల్లి శాఖోపశాఖలుగా విస్తరించాయి. వారిలో క్రొ కూవియు కనుగొన్న మొగాతీరియమ్ వంటివి, బాగా పెద్దవిగా ఉండేవి.

నేల మీద జీవించిన అతి పెద్ద క్షీరదం బెలూచి తీరియమ్ (బెలూచిస్తాన్ మృగం). దాని శిలాజం బెలూచిస్తాన్ లో దొరికింది. అది 3 కో ట్ను క్రితం జీవించిన ఒక విధమైన రైనోసెరస్. దాని భుజాలు నేల మీద నుండీ 5.5 మీటర్‌ను ఉండేవి. తల పై కె తితే నేల మీద నుండి 8.2 మీటర్ల ఎతు వరకు ఉండేది. దాని బరువు 20 టన్నులు ఉండేది.

అంటే ఏనుగు కన్నా రెండు రెట్ను బరువు అన్నమాట. అతి పెద్ద డైనోసార్ బరువులో దీని బరువు సగం ఉండేదన్నమాట.

ఈ భారీ క్షీరదాలు కూడా చాలా మటుకు అంతరించిపోయాయి. సుమారు కో టవీ సంవత్సరాల క్రితం వానర లక్షణాలు పెంపొందించుకున్న కొంచెం చిన్న క్షీరదాలు కూడా బాగా వర్పిల్నాయి. వాటి నుండి వానరాలు, నరాకృతి గల జీవాలు పరిణమించాయి. వాటినే హోమినిడ్ను అంటూరు.

గత పది లక్షల సంవత్సరాలుగా హోమినిడ నుండి క్రమంగా మనను పోలిన జీవాలు పుటుకొచ్చాయి. చివరికి అచ్చం మనలాగే ఉండే జీవి అవతరించింది.

వాటిలో చిటచివర అవతరించిన హోమినిడ్ పేరు హోమో సేపియన్ (అంటనే వివేకం గల మనిషి). హోమినిడ్సలో నేడు భూమి మీద సంచరిస్తున్న ఉపజాతి ఇదొక్కటే. మీరూ, నేను ఆ జాతికి చెందిన వారి మేు.

ఇన్ని కో టూనుకో ట్ను పృధ్వీ చరిత్రలో మనిషి తరువాత అత్యంత ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన జీవాలు ఆ బృహత్ పరిమాణం గల డైనోసారే !

abc© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate