অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కడప

రాయలసీమ ప్రాంతం లో ఉన్న మునిసిపల్ నగరం అయిన కడప, దక్షిణ భారత దేశ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ దక్షిణ మధ్య ప్రాంతం లో ఉంది. వాకిలి, ద్వారం, ప్రవేశ మార్గం అనబడే అర్ధాలు వచ్చే తెలుగు పదం 'గడప' నుండి కడప అనే పేరు ఈ నగరానికి వచ్చింది. కడపకి పశ్చిమవైపున ఉన్న పవిత్ర క్షేత్రం మైన తిరుమల కి ఈ నగరం ప్రవేశ మార్గం గా ఉండడం వల్ల ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. 2010 ఆంగ్లం లో Cuddapah అనబడే ఈ పట్టణం వర్ణక్రమాన్ని Kadapa గా మార్చారు.

హైదరాబాద్ నగరం నుండి ఈ నగరం 412 కిలోమీటర్ల దూరం లో ఉంది. పెన్నా నదికి అతి సమీపంలో ఈ నగరం ఉంది. నల్లమల ఇంకా పాలకొండ నడుమ ఈ నగరం ఉంది.

చోళ సామ్రాజ్యంలో ముఖ్య భాగంగా ఈ నగరం పదకొండు నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్యలో పరిగణించబడింది. పద్నాలుగవ శతాబ్దం తరువాత, ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో కలిసిపోయింది. దాదాపు రెండు శతాబ్దాలు విజయనగర సామ్రాజ్యం మొత్తం గండికోట నాయకుల చేత పరిపాలింపబడింది. విజయనగర చక్రవర్తుల యొక్క గవర్నర్స్ గా వ్యవహిరించిన ఈ నాయకులు ఈ ప్రాంతం లో అనేకమైన టాంకులు అలాగే ఆలయాలు నిర్మించారు. కడప, 1565 లో గోల్కొండ ముస్లిం రాజులచేత ఆక్రమించుకోబడినది. ఎన్నో ద్రోహమైన చర్యల ద్వారా అప్పటి రాజైన చిన్న తిమ్మ నాయుడు ని ఓడించి గండికోట ని మీర్ జుమ్లా ఆక్రమించాడు. ఆ తరువాత, ఖుతుబ్ షాహీ పరిపాలకుడైన నేక్నం ఖాన్ కడప యొక్క సరిహద్దుల్ని విస్తరింపచేసి వాటిని నేక్నామాబాద్ గా పిలిచేవాడు. అయినప్పటికీ, చరిత్రకి సంబంధించిన విషయాల గురించి తెలియచేసేటప్పుడు చరిత్రకారులు 'నేక్నామాబాద్ నిజాములు' అని ప్రస్తావించడం కంటే 'కడప నిజాములు' గా నే ప్రస్తావిస్తారు. మసీదులు, దర్గాలు నిర్మించడం ద్వారా నవాబులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మరియు నిర్మాణ కళల కు ఏంతో దోహదపడ్డారు.

సుమారు 1800 సంవత్సరం సమకాలీన సమయంలో, బ్రిటిష్ వారు కడప ని వారి అధీనం లో కి తీసుకుని, వారి నలుగురు అధీన కలేక్టోరేట్స్ లో ఒకరికి ఈ ప్రాంతాన్ని ప్రధాన కార్యాలయంగా మార్చారు. ఈ ప్రాంతానికి ప్రధాన కలెక్టర్ అయిన సర్ థామస్ మున్రోనేతృత్వంలో ఈ ప్రధాన కార్యాలయం ఉండేది. మూడు చర్చిలని ఈ నగరం లో బ్రిటిష్ వారు నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ నగరం మున్సిసిపాల్ కార్పొరేషన్ లో భాగం అయ్యింది.

కిష్కిందకాండ

హిందూ మత ఇతిహాసమైన రామాయణం ప్రకారం, రామాయణం లోని ఏడు కాండల లో ఒకటైన కిష్కిందకాండ భాగం కడప జిల్లాలో ఉన్న వొంటిమిట్ట అనే ప్రాంతంలో జరిగింది. కడప ప్రధాన నగరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వొంటిమిట్ట నగరం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రసిద్ది చెందిన గండి అనే గ్రామం కడప కి సమీపంలో ఉంది. హనుమంతునికి అంకితమివ్వబడిన ఈ ఆలయంలో ఉన్న హనుమంతుల వారి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీ రాముల వారే స్వయంగా మలచారని భక్తుల నమ్మకం. బాణాలు కొన్ని ఉపయోగించి హనుమంతుల వారి విగ్రహాన్ని ఒక రాతిపై శ్రీ రాములవారు మలచారని అంటారు. సీతమ్మ వారిని కనిపెట్టినందుకు హనుమంతులవారికి గౌరవార్ధం శ్రీ రాముడు ఈ విగ్రహాన్ని మలచారని అంటారు.

దీనిని రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక మజిలీ గా ప్రస్తుత కాలంలో కడప ని పేర్కొనవచ్చు. అమీన్ పీర్ దర్గా, భగవాన్ మహావీర్ మ్యూజియం, చాంద్ ఫిరా గుంబద్, దెవునికడప ఇంకా మసీద్-ఎ-అజాం వంటి ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి.

ఏడాది పొడవునా ఉష్ణ వాతావరణం ఈ ప్రాంతం లో ఉంటుంది. తీవ్రమయిన ఎండాకాలం, పాక్షికంగా ఉండే శీతాకాలం తో పాటు మూడు నెలల కాలం వరకు ఉండే వర్షాకాలం లో నమోదయ్యే సాధారణ వర్షపాతాలు ఈ కడప ప్రత్యేకత.

వాయు, రైలు, రోడ్డు మార్గం ద్వారా కడపకి సులభంగా చేరుకోవచ్చు. నగరం నడిబొడ్డు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ నగరంలో దేశీయ విమానాశ్రయం ఉంది. ముంబై - చెన్నై లైన్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో అనేక రైళ్ళు తరచుగా వస్తూ ఉంటాయి. చక్కటి రోడ్డు రవాణా మార్గం ద్వారా ఈ నగరం రాష్ట్రం లో ని మిగతా నగరాలకు అనుసంధానమై ఉంది. కడపకి చేరుకునేందుకు, క్యాబ్స్ అలాగే బస్సులు అందుబాటులో కలవు.

అమీన్ పీర్ దర్గా

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలచే సందర్శింపబడే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. పర్యాటకులు అలాగే స్థానికులు ఈ మందిరానికి విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని మరియు అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తారు. ఈ మందిరంలో ఈ సాధువుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్ధించడం ద్వారా కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం.

ఈ ఇద్దరు సాధువుల వారసులు కూడా ఈ మందిరంలో పనిచేస్తున్నారు. వేరే సిబ్బంది నుండి వీరిని గుర్తించేందుకు సులువుగా కాషాయ దుస్తులు వీరు ధరిస్తారు. కాషాయ రంగు టోపీ ల నే ఈ ఇద్దరు సాధువుల యొక్క భక్తులు ధరిస్తారు. ప్రవక్త మహమ్మద్ యొక్క వారసుడు పీరుల్లహ్ హుస్సేన్ అని ఎక్కువ మంది నమ్మకం. భారత దేశం లో ని అన్ని సూఫీ సాధువుల దర్గాలని సందర్శించే ఇతను అజ్మీరు విన్నపం వల్ల కడప లో స్థిరపడ్డారు.

భగవాన్ మహావీర్ మ్యూజియం

1982 లో నిర్మింపబడిన ఈ భగవాన్ మహావీర్ మ్యూజియం కడప లో తప్పక సందర్శించవలసిన ప్రాంతం. ఈ మ్యుజియం , నిర్మాణం కోసం భారీ విరాళాలు జైన్ సంఘం ఏర్పాటు చేసింది. ప్రాచీన కళాకృతులు అలాగే జైన మతానికి సంబంధించిన నిర్మాణ కళ లు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.

ఈ మ్యూజియం లో రాతి నుండి చెక్కబడిన శిల్పాలు, కాంస్యం తో తయారు చేయబడిన చిహ్నాలు, మట్టితో చేయబడిన బొమ్మలు, శాసనాలతో ఉన్న రాళ్ళు ఇలా ఎన్నో ఈ మ్యూజియం లో గమనించవచ్చు. ఇవన్నీ భారత దేశం లో జైన మతం వృద్ది చెందుతున్న సమయంలోని ప్రాచీన కాలానికి చెందినవి. క్రీస్తు శకం అయిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు పట్టణాలుగా వర్ధిల్లిన నందలూర్, గుండ్లూరు, తిమ్మాయపాలెం, అత్తిరాల, మంతమపంపల్లీ, పోలి, కొలతుర్, అలాగే మరెన్నో ప్రాంతాలనుండి సేకరించిన వస్తువులను ఈ మ్యూజియం లో గమనించవచ్చు. పురావస్తు శాఖ తవ్వ కాలలో బయట పడిన కళాకృతులని భగవాన్ మహావీర్ మ్యూజియం లో భద్రపరిచేందుకు కడపకి తీసుకువచ్చారు.

ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు, జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం, శివుని తలపై నుండి కాకుండా పక్క నుండి పారుతున్న గంగతో శివుని విగ్రహం వంటి కొన్ని అరుదైన కళాకృతులు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.

దెవునికడప

హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన దెవునికడప అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తిరుమల తిరుపతి దేవుని యొక్క ఆశీస్సులు కోరుకునే భక్తులు వారి తీర్ధయాత్ర లు పూర్తి అయినట్టుగా భావించాలంటే తప్పకుండా ఈ దేవుని కడపని సందర్శించవలసిందే.

తిరుమల తొలి గడప దేవుని కడప గా ప్రాచుర్యం పొందింది దేవుని కడప. విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్షీ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. గురు కృపాచార్య చేత ఈ ఆలయం లో వెంకటేశ్వర స్వామీ వారి విగ్రహం ప్రతిష్టింపబడినది. అందువల్ల పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడినది. కృపావతి క్షేత్రంగా ఆ కాలం లో ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.

అన్నమాచార్యుల వారిని అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మొదట ప్రార్ధించిన తరువాత తిరుపతి ప్రయాణానికి యాత్రికులు పయనమవుతారు. పూజలు చెయ్యడానికి ఏంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. వారం పొడవునా ఈ ఆలయం భక్తుల సందర్శనతో కిటకిట లాడుతూనే ఉంటుంది. శనివారాలు అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.

చాంద్ ఫిరా గుంబద్

సయ్యద్ షా మొహమ్మద్ హుస్సెఇన్ కి సంబంధించిన సమాధి, కడప లో ఉన్న ఈ చాంద్ ఫిరా గుంబద్. నగరానికి నడిబోడ్డులో ఉండడం వలన ఈ సమాధిని సందర్శించడం తేలికే. ఈ భవనం యొక్క నిర్మాణం మరియు ఆకృతి లో ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. చదరపు ఆకారం లో ఉన్న ఈ భవనం మధ్యలో ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఈ భవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు సమాధులకి రక్షణగా ఉంటాయి. లోపల బయటా ఈ భవనం అందంగా అలంకరించబడినది. ఈ భవనం వద్ద ఉన్న పిట్ట గోడ చిత్రవిచిత్రమైన నమూనాల తో కప్పబడి ఉన్నది.

నిజాముల కాలం నాటి నిర్మాణ శైలి కి ఈ సమాధి ఒక చక్కటి ఉదాహరణ. ఈ సమాధులు ఉన్న ఎత్తైన గోడలని చూడడానికి ఏంతో మంది పర్యాటకులు అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. లోపల బయటా అందంగా ఉండే ఈ మసీదుని సందర్శించేందుకు ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తారు. స్థానిక ఇస్లాం జనాభాలో ఈ ప్రాంతం అత్యంత ప్రసిద్ధి చెందినది.

మసీద్ - ఎ- అజాం

17 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ మసీదు - ఎ- అజాం అనబడే అద్భుతమైన మసీదు కడప లో ఉంది. గండికోట కి అతి సమీపం లో ఈ మాస్క్ ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పాలనలో ఉన్న కాలంలో కడప లో ఈ మాస్క్ నిర్మింపబడినదని చరిత్రకారుల నమ్మకం. అందువల్ల, ఎన్నో పెర్షియన్ శిలా శాసనాలు ఈ మాస్క్ గోడలపై కనబడతాయి.

కడపలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ మసీదుకి ఏంతో మంది ముస్లిం భక్తులు విచ్చేసి నమాజ్ లేదా ప్రార్ధనలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే కాకుండా, అందమైన నిర్మాణ శైలితో కూడా ఈ మసీదు ఎందరినో ఆకట్టుకుంటోంది. మొఘల్ కాలం యొక్క నిర్మాణ శైలి ఈ మసీదు నిర్మాణంలో గమనించవచ్చు. పెర్షియన్ నిర్మాణాల ఆరాధకుడైన ఔరంగజేబ్ వల్ల పెర్షియన్ శైలి యొక్క నిర్మాణ శైలి తో ఇక్కడి నిర్మాణం ప్రభావితమయింది. ఔరంగజేబ్ కాలం లో ఉత్తర భారత దేశం లో నిర్మింప బడిన ఇతర మసీదుల తో ఈ మాస్క్ కి పోలికలు ఉన్నాయి.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate