অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గుంటూరు

ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతాలు కలవు అవి ఒకటి రాయలసీమ కాగా, రెండవది కోస్తా ఆంద్ర. పూర్వపు రాష్ట్రాన్ని తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లు గా జూన్, 2014 లో, భారత దేశపు పార్లమెంట్, ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం బిల్లు మేరకు విభజించింది.

భౌగొళికత

భౌగోళికంగా, ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపూర్, చిత్తూర్, కడప, కర్నూల్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు కృష్ణ జిల్లాలు కలవు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకత

ఆంధ్ర ప్రదేశ్ లో టూరిజం

రాష్ట్రంలోని యాత్రా స్థలమైన తిరుపతి కి భక్తులు అధిక సంఖ్యలో పర్యటించ డం తో మొదలవుతుంది. తిరుపతి లోని తిరుమల వెంకటేశ్వరా దేవాలయమే కాక ఇంకనూ రాష్ట్రంలో సందర్శించ తగిన అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. వాటిలో కపిల తీర్థం, పులికాట్ సరస్సు వంటివి ప్రసిద్ధి చెందినవి.

ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనేకమంది ప్రసిద్ధ కవులకు, రచయితలకు, కళాకారులకు జన్మస్థలం. ఈ ప్రదేశం, వివిధ సంస్కృతులు కల పాలకుల పాలనలో వుండటంచే వివిధ రీతుల తెలుగు మాట్లాడతారు. కూచిపూడి నాట్య జన్మస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని సాంప్రదాయ కూచిపూడి నాట్యం కు కృష్ణా జిల్లాలో కల కూచిపూడి అనే ఒక చిన్న గ్రామం పుట్టిల్లు. ఆంధ్ర ప్రదేశ్ ఆహారాలు ఆంద్ర ప్రదేశ్ లో ప్రజలకు ప్రధాన ఆహారం వరి అన్నం. ఇతర వంటకాలు దక్షిణ భారత దేశంలోని వంటకాలన్నిటి లోకి అతి ఘాటైనవి. కోస్తా ప్రాంతంలో సముద్రపు ఆహారాలు ప్రసిద్ధి. రాయలసీమ జిల్లాలు దక్షిణ కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు సన్నిహితంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల వంటల రుచులు కూడా కలిగి వుంటాయి. ఈ ప్రాంతంలో బెల్లం మరియు జోన్నలచే తయారు చేయబడే బొరుగు ఉండలు, బియ్యం మరియు బెల్లం తో చేయబడే అరిశలు, మసాల బొరుగులు మరియు రవ లడ్డు లు ఒక ప్రత్యేకత.

రవాణా మరియు అనుసంధానం

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన విమానాశ్రయం విశాఖపట్నం లో కలదు. ఇది కాక, ఇతర స్థానిక విమానాశ్రయాలు విజయవాడ, రాజమండ్రి లలో కూడా కలవు. ఇండియా లోని ఎ నగరం నుండి అయినా ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతానికైనా సరే తేలికగా పర్యటించే రీతిలో ఇక్కడి రవాణా వ్యవస్థ వుంటుంది.

గుంటూరు

బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. హైదరాబాద్ నగరానికి కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు నగరం పరిసరాల్లో ఉన్న పది గ్రామాలని గుంటూరు లో కి కలిపి దీనిని అతి పెద్ద నగరంగా ఈ నగరం యొక్క హద్దులని విస్తరింపచేసారు.

అభ్యాసం మరియు పరిపాలనకి మూల స్థానం అవడం వల్ల ఈ నగరం ఒక ప్రధాన నగరంగా పరిగణించబడుతుంది. రాష్ట్రం లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తించబడిన ఈ నగరం లో ఎన్నో విద్యాసంస్థలు అలాగే పరిపాలనా సంస్థలు ఉన్నాయి.

ప్రాచీనత మరియు నూతనత్వం

గుంటూరు నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 500 ఈ నగరం యొక్క చరిత్ర ఉంది. ఇంత సుదిర్ఘమైన చరిత్ర మూలాలు కలిగిన నగరం ఏదీ దక్షిణ భారత దేశంలో కనబడదు. ఇంతకు పూర్వం భట్టిప్రోలు అనే రాజ్యం ప్రస్తుతం గుంటూరు అనబడే ప్రాంతం లో ఉండేది. ఈ విషయం 922 నుండి 929 ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాలుక్యాన్ రాజు మొదటి అమ్మరాజా కి చెందిన శిల్పాలు అలాగే చెక్కడాలలో నిరూపితమయ్యింది. 1147 నుండి 1158 సమకాలిన ప్రాంతానికి సంబంధించిన శిల్పాలలో గుంటూరు పేరు కూడా చెప్పబడినది. ఈ శిల్పాల ద్వారా గుంటూరు నగరం ఇదివరకు గార్థపూరి అనే సంస్కృత పేరు తో పిలువబడినదని తెలుస్తోంది. గార్థపూరి అంటే చుట్టూ సరస్సులచే కప్పబడిన ప్రాంతం అని అర్ధం.

యూరోపెయన్ ల రాకతో గుంటూరు నగరం యొక్క ఆధునిక చరిత్ర ప్రారంభమయ్యింది. ఇది ఒక కొత్త శకానికి దారి తీసింది. తద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఈ గుంటూరు నగరానికి లభించింది. నిజానికి ఈ నగరం యొక్క అభివృద్దికి ఆశ్చర్యపోయిన ఫ్రెంచ్, వారి సైనికదళాల ప్రధాన కేంద్రంగా 1752 లో గుంటూరు ని ఎంచుకున్నారు. ఆ తరువాత, నిజాముల చేత అలాగే హైదర్ అలీ చేత ఈ నగరం పాలించబడినది. 1788 లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యం గా చేసుకున్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ప్రాంతం ముఖ్య వ్యవసాయక కేంద్రంగా తయారయింది. అందువల్ల 1890 లో రైల్వే ట్రాక్స్ పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ నగరం యొక్క అభివృద్ధి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. గుంటూరు లో సాంకేతిక అభివృద్ధి అలాగే విద్యా అభివృద్ధి తో ఎన్నో దక్షిణ భారత నగరాలు పోటీ పడలేకపోతున్నాయి.

గుంటూరులో పర్యాటక రంగం

ప్రధాన పర్యాటక ఆకర్షణ గా గుంటూరు ప్రాంతాన్ని పరిగణించవచ్చు. కొండవీడు కోట, ఉండవల్లి కేవ్స్, అమరావతి, ఉప్పలపాడు గార్డెన్స్ అలాగే ప్రకాశం బ్యారేజ్ లు గుంటూరులో ఉన్న కొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

రాష్ట్రం లో ఉన్న మరికొన్ని నగరాల లాగానే గుంటూరు లో కూడా ఉష్ణమండల వాతావరణం ఉంది. ఎండాకాలంలో తీవ్రమైన ఎండ, తేలికపాటి శీతాకాలం ఇక్కడ గమనించవచ్చు. వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నుండి భారీ వర్షపాతాన్ని ఇక్కడ గమనించవచ్చు.

గుంటూరులో విమానాశ్రయం లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. దీనికి స్థానిక విమానాశ్రయం 96 కి. మీ. ల దూరంలోని విజయవాడ లో కలదు. రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు నగరాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడున్న రైల్వే స్టేషన్ దేశంలో ని మిగిలిన ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ అలాగే బెంగుళూరు వంటి మెట్రో పోలిటన్ నగరాల నుండి గుంటూరు కి రైళ్ళు అందుబాటులో కలవు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకి అలాగే మిగతా రాష్ట్రం లోని ప్రాంతాలకి ఈ నగరం చక్కగా అనుసంధానమై ఉంది.

గుంటూరు ప్రధాన పర్యాటక మజిలీ కావడం వల్ల పర్యాటక మాసాలలో ఈ ప్రాంతానికి ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. అందువల్ల, పర్యాటకుల అవసరాలను అందుకోవడానికి సుదూరాల నుండి ఎన్నో నూతన రైళ్ళను దక్షిణ రైల్వేశాఖ గుంటూరు నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ నగరంలో రోడ్లని చక్కగా నిర్వహించడం వల్ల ప్రైవేటు వేహికల్ ప్రయాణం కూడా బాగుంటుంది. ఈ నగరానికి తిరిగే బస్సులు ఎన్నో. సాధారణ బస్సుల కంటే డీలక్స్, వోల్వో బస్సుల ధరలు ఎక్కువగా ఉంటాయి.

కొండవీడు ఫోర్ట్

గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి.

ఈ ఫోర్ట్ ని కట్టిన సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గర గా ఉన్న దేవాలయాలు. ఈ దేవాలయాలు ఇతర అనేక దేవాలయాల దారిలో ఉన్నాయి. ఈ కోటకు చేరే దారి ముఖద్వారం , ఈ కోటని నిర్మించిన కొండ దిగువ భాగాన ఉంటుంది. ఈ దారితోబాటు , ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

కోటప్ప కొండ

గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది. కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు.

ఈ గ్రామం చుట్టుతా అనేకే శిఖరాలు ఉన్నపటికీ త్రికుటాచలం లేదా త్రికుటాద్రి అనబడే శిఖరాలు చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ మూడు శిఖరాలు ఈ గ్రామం లో అన్ని వైపులా చక్కగా కనిపిస్తాయి. ఈ శిఖరాలు హిందువుల పౌరాణిక దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులయిన - త్రిమూర్తుల పేరుమీద పిలవబడుతున్నాయి.

దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది.

ప్రకాశం బారేజ్

కృష్ణా నది పైన నిర్మించబడిన బ్రిడ్జి ఈ ప్రకాశం బారేజ్.1223.5 మీటర్ల పొడవున్న ఈ నిర్మాణం గుంటూరు మరియు కృష్ణా జిల్లాలను కలపాలన్న ముఖ్య ఉద్దేశం తో జరిగింది. ఈ బారేజ్ చిన్న చెరువు పైన రోడ్ బ్రిడ్జి గా కూడా ఉపయోగపడుతుంది.ఈ బారేజ్ నుండి వచ్చే మూడు కాలువల వాళ్ళ విజయవాడ నగరం వెనిస్ నగరాన్ని తలపిస్తుంది.

1798 లో మొట్టమొదటి సారి కృష్ణా నది పైన బారేజ్ కట్టాలన్న ఆలోచన వొచ్చింది, కాని కృష్ణా డ్యాం నిర్మాణం మాత్రం 1852 లో ప్రారంభం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ పుర్తవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1956 లో బారేజ్ కట్టాలన్న ఆలోచనని ఆచరణ లో పెట్టారు. గుంటూరు, విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల రైతుల పొలాలకి ప్రధాన నీటి పారుదల వనరు గా ఈ ప్రకాశం బారేజ్ ని పేర్కొనవచ్చు. నిజానికి, ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక వ్యవ్యస్త ఎక్కువగా వ్యవసాయం మీద ఆధార పది ఉండడం వల్ల ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంది.

ఈ బారేజ్ నిర్మాణం వల్ల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన అందమైన సరస్సులు ఎంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

మంగళగిరి

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది.

ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లో నే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతం గా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామి వారికీ పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు.

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.

ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య్హ మాత్రం తగ్గలేదు. పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయం లో నే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి.

అమరావతి

దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంద్ర పాలకులలో మొదటి వారైన సాతవహనలుకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.

గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావాతి లోనే బోధించాడు. దీనికి చారిత్రిక ఆధారాలు వజ్రాయన గ్రంధం లో పొందుపరచబడి వున్నాయి. ఈ కారణంగా అమరావతి పట్టణం క్రి. పూ సుమారు 500 సంవత్సరాల ముందు కూడా కలదని తెలుస్తోంది. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.

కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ పట్టణానికి రోడ్డు, రైలు, లేదా బోటు ల లో తేలికగా చేరవచ్చు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి అమరావతి కి నడుస్తాయి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది.

అమరావతి స్తూప లేదా మహాచైత్య

అమరావతి స్తూపం లేదా మహా చైత్య, అమరావతిలో ఒక గొప్ప ఆకర్షణ. ఈ స్తూపాన్నిబౌద్ధ మతాన్ని అనుసరించిన చక్రవర్తి అశోకుడి కాలం లో నిర్మించారు. తర్వాత చివరికి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి పాటు పట్టాడు. క్రి. పూ. 200 సంవత్సరాల నాటికే స్తూపం నిర్మాణం పూర్తి అయింది. ఈ స్తూపం , దానిపై చెక్కడాలు బుద్ధుడి జీవిత కధను మరియు అతని బోధనలను తెలియ చేస్తుంది. అమరావతి శాతవాహన రాజుల రాజధాని అయినపుడు, ఈ స్తూపాన్ని మరింత బుద్ధుడి జీవిత విశేషాలతో ని ఇతర చిత్రాలతో అలంకరించారు.

అయితే, తదుపరి కాలం లో బౌద్ధ మతం ప్రభావం కోల్పోయినందున ఆ స్తూపం మట్టిలో కప్పబడి వుంది, సుమారు క్రి. పూ. 1796 సంవత్సరంలో ఆ ప్రదేశాన్ని సందర్శించిన కల్నల్ కోలిన్ మెకంజీ చే కనుగొనబడింది. ఒకసారి తవ్వకాలు మొదలైన తర్వాత స్తూపమే కాక దానికి సంబంధించిన అనేక శిల్పాలు కూడా బయట పడ్డాయి. నేడు ఆ స్తూపమే దక్షిణ ఇండియా లో కనుగొనబడిన అశోక పిల్లర్ గా వ్యహరించబడుతోంది.

కృష్ణా నది తీరం

కృష్ణా నది తీరం ఎంతో ఆహ్లాదకరమైన నది తీరం. అమరావతి పట్టణాన్ని కృష్ణా నది ఒడ్డున నిర్మించారు. కనుక ఈ నది, ఆ పట్టణ వాసులకు ఎంతో ప్రాధాన్యత కలిగినది. మానవ నాగరికతలు అనేకం నదీ తీరాల లోనే విలసిల్లి చరిత్రలు సృష్టించినాయనేది ఒక వాస్తవం.

ఈ పట్టణం క్రీస్తు కు ముందే కలదు. కనుక ఈ పట్టణ ప్రజల జీవనంలో కృష్ణా నది శతాబ్దాల పాటు ప్రధాన పాత్ర పోషించింది. ఎంత కాలం గడిచినప్పటికీ ఈ నది విలువలని తగ్గించలేము. అది ఇంకా అమరావతి పట్టణానికి ఒక గొప్ప విలువైన ఆస్తి గా వుంది, వేలాది పర్యాటకులని సంవత్సరం లోని అన్ని కాలాల లోను ఆకర్షిస్తోంది.

ఆర్కియోలాజికాల్ మ్యూజియం

అమరావతి లో కృష్ణా నది కి కుడి వైపున ఆర్కేయోలాజికాల్ మ్యూజియం కలదు. అమరావతి చరిత్ర, దాని సంస్కృతి, ఆనాటి ప్రాంత సాంప్రదాయాలు వంటివి తెలియ జేసే వస్తువులు ఈ మ్యూజియం లో కలవు. అమరావతి లో పుట్టిన కళలకు , మరియు భారతీయ కళలకు చారిత్రక ఆధారాలు ఇస్తోంది. సుమారు 3వ శతాబ్దం లో విలసిల్లిన బౌద్ధ మత శిల్పాలు సైతం ఈ మ్యూజియం లో కలవు.

అమరావతి సాంప్రదాయాలు, పద్మం, పూర్ణ కుంభ వంటివి అమరావతి సాంప్రదాయాని తెలుపుతాయి. ఇవన్నీ ఆ పట్టణ ప్రజల ఆనాటి వైభవోపేత జీవనాన్ని తెలుపుతాయి. అమరావతి పట్టణ చరిత్ర ఆది నుండీ తెలుస్తోంది. అనేక చరిత్ర పుస్తకాలు చది వేకంటే , ఒక్కసారి మ్యూజియం సందర్శిస్తే చాలు, ఎంతో చరిత్ర తెలిసిపోతుంది.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate