నెల్లూరు నగరం ఆంధ్రప్రదేశ్ లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలోఒకటి. ఈ పట్టణం పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు రాజధాని కూడాను. అది వరలో ఈ జిల్లాను నెల్లూరు జిల్లా అని మాత్రమే పిలిచేవారు. ఈ పట్టణం వివిధ ప్రసిద్ధ దేవాలయాలు మరియు వ్యవసాయ పరంగా ఒక ప్రసిద్ధ కేంద్రంగా కూడా వుంది. నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం లో ఎన్నో రకాల పంటలు పండుతాయి. ఈ నగరం విజయవాడ, తమిళనాడు రాజధాని అయిన చెన్నై ల రహదారి లో వుండటం వలన వ్యాపారం, వాణిజ్యంలకు సంబంధించి ఎంతో ప్రధానమైనది. నగరంలో మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందటం చేత, ఇది ఒక మంచి నగరంగా తయారు అవుతోంది. నెల్లూరుని అనేక రాజ వంశాలు పాలించాయి. అన్నిటికంటే మొదటిది, మౌర్య వంశ పాలన. క్రీ. పూ. ౩ వ శతాబ్దం లో ఇది అశోకుడి సామ్రాజ్యంలో భాగంగా వుండేది. కాలక్రమేణా, ఇది పల్లవులు, తెలుగు చోళులు, శాతవాహనులు ఇంకా ఇతర రాజ వంశాలచే పాలించబడింది. ఈ రాజ వంశాల సంస్కృతి అంతా ఇక్కడి దేవాలయాలు ఇతర ప్రాచీన కట్టడాల శిల్ప శైలి లో కనపడుతుంది. వర్తక, వాణిజ్యాలకు, వ్యవసాయానికి కేంద్రం అవటం మాత్రమే కాక, ఈ నగరం బ్రిటిష్ కాలం నాటి అనేక ప్రాచీన దేవాలయాలు, ఇతర కట్టడాలు కూడా కలిగి వుంది.
నెల్లూరు పట్టణం బ్రిటిష్ పాలనలో చాల ప్రశాంతంగా వుండేది. ఆనాటి స్వాతంత్ర పోరాట ఉద్యమాల నుండి దూరంగా ఉండేది. ఇండియా కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారింది. అక్టోబర్ 1 వ తేది, 1953 వరకు ఇది మద్రాస్ రాష్ట్రం లో భాగంగా వుండేది. దీనిని 1 నవంబర్, 1956 నాడు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేర్చారు. రాష్ట్రావతరణలో ఈ ప్రదేశం విశేషమైన పాత్ర పోషించింది. తెలుగు వాడు, ప్రఖ్యాత దేశభక్తుడు పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. కనుకనే ఈ జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేసారు . పట్టణం లోని ప్రధాన ఆకర్షణలు
నగరంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. నగర సరిహద్దుల్లోనే కల ఈ దేవాలయం సుమారు 600 ఏళ్ల నాటిది. ఈ దేవాలయ గోపురం సుమారు 70 అడుగుల ఎత్తులో వుంది. దీనిని గాలి గోపురం అంటారు. గాలిగోపురం పై భాగంలో ఏడు బంగారు తాపడం కలశాలు వుంటాయి. ఇవి ఈ దేవాలయ ఐశ్వర్యాన్ని చాటి చెపుతాయి. నెల్లూరు లో ఇతర విహార ప్రదేశాలు అంటే మైపాడు బీచ్, పులికాట్ లేక్ కలవు. ఇది వివిధ పక్షి జాతులు కల నేలపట్టు బర్డ్ సాన్క్చురి కి సమీపం. ఈ నగరంలో పురాతన దేవాలయాలు అనేకం కలవు. నగరం మధ్య నుండి సుమారు 13 కి. మీ. ల దూరంలో నరసింహస్వామి టెంపుల్ కలదు. నెల్లూరుకి సమీపం లోని సోమశిల ఒక పిక్నిక్ ప్రదేశం. ఎంతో ప్రశాంతంగా వుంటుంది. చుట్టుపక్కల అడవులు మాయం అవుతూండటంతో నా నాటికి నగర వాతావరణం వేడి అధికమై పోతోంది. మే నెలలో సుమారు 41 డిగ్రీలు గరిష్టంగా వుంటుంది. ఏప్రిల్, మే నెలలలో వేడి గాలులు వీస్తాయి. నెల్లూరు సందర్శనకు చలికాలం అనువైనది. ఈ ప్రదేశం చెన్నైకి సమీపం గా సుమారు 200 కి. మీ.ల దూరంలో కలదు. నెల్లూరుకు హైదరాబాద్ నగరం సుమారు 450 కి. మీ. ల దూరంలో కలదు.
అద్దాల మంటపం రంగనాథ స్వామి టెంపుల్ లోపల కలదు.
ఇది చాల ప్రసిద్ధి చెందినది. చక్కటి పనితనం తో నిర్మించారు. భక్తులకు ఈ మిర్రర్ హాల్ ఆసక్తి కరంగా వుంటుంది. పని వారి అద్దాల పని నైపున్యతకు ఆశ్చర్య పడవలసిందే. అనేక అద్దాలలో భక్తులు ప్రధాన దైవం అయిన శ్రీ రంగనాదుని చూసి పూజించి ఆనందిస్తారు.
బారా షహీద్ దర్గా, నెల్లూరు సమీపం లోని సూళ్ళూరు పేట లో కలదు. దీనిని 12 మంది మృతవీరుల పేరుతో నిర్మించారు. ఈ దర్గా దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని చెపుతారు. ఈ దర్గాలో మొహర్రం ఉత్సవాలు అతి ఘనంగా జరుగుతాయి. మరో వేడుకగా మూడు రోజుల పాటు రొట్టెల పండుగ అని కూడా చేస్తారు.
ఈ దర్గా సముద్ర తీరానికి సుమారు అయిదు కి. మీ. ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ దర్గాని అమావాస్య నాడు సందర్శించటం మంచిదని చెపుతారు.
మైపాడు బీచ్ నెల్లూరుకు 22 కి. మీ. ల దూరంలో కలదు. రోడ్డు మార్గం అనుకూలమే. నెల్లూరు నుండి తేలికగా ప్రయాణించవచ్చు. బీచ్ ప్రాంతం పొడవుగా వుండి అనేక రిసార్ట్ లు మరియు హోటళ్ళు వుంటాయి.
బీచ్ ప్రశాంతంగా వుండి సాయంకాలం 6 గం. వరకు తెరచి వుంటుంది. బీచ్ లో సూర్యాస్తమయం చాలా బాగుంటుంది. నెల్లూరు నుండి మైపాడుకు బస్సులు తరచుగా నడుస్తాయి. బీచ్ ప్రాంతం ఎంతో అందంగా వుండి, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
నరసింహ స్వామి దేవాలయం పట్టణానికి సుమారు 13 కి. మీ. ల దూరం లో కలదు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి ప్రధాన దైవం ఆయన నాల్గవ అవతారమైన నరసింహ స్వామి ఇక్కడ పూజించబడతాడు. దీనిని వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ అని కూడా అంటారు.
ఈ దేవాలయం పై అనేక నమ్మకాలు కలవు. పిల్లలు లేని వారికి ఇక్కడ కల సంతాన వృక్షం, సంతానం కలిగిస్తుందని, పాము లేదా తెలు కాటు వేస్తె, కొండి కసులి హుండీ నయం చేస్తుందని చెపుతారు. ఇక్కడే మరో చిన్న గుడి మాత ఆది లక్ష్మి పేరిట కలదు. నెల్లూరులో వుంటే మీరు తప్పక ఈ దేవాలయాన్ని సందర్శించాలి.
నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. దీనికి చెన్నై మరియు, నెల్లూరుల నుండి చేరవచ్చు. ఇక్కడకు చెన్నై 50 కి. మీ.ల దూరం మాత్రమె వుంటుంది. ఈ శాంక్చురి ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా కలదు.
లిటిల్ కర్మోరంట్, పెయింటెడ్ స్తోర్క్, వైట్ ఇబిస్, స్పాటే డ్ బిల్లెద్ పెలికన్ వంటివి చూడవచ్చు. ఈ సంక్చురిని చూచేందుకు అక్టోబర్ మరియు మార్చ్ నెలలు అనుకూలం. ఈ సమయాలలో చాలా జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటాయి.
నెల్లూరు సమీపంలో ప్రసిద్ధి చెందినా పులికాట్ సరస్సు సుమారు 350 కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి ఉంది. అరుదైన వలస పక్షి జాతులకు నిలయంగా వుంటుంది. ఒరిస్సా లోని చిలకా లేక్ తర్వాత ఇది రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ ప్రదేశం శ్రీ హరి కోట ద్వీపం అనే పేరుతో బంగాళాఖాతం నుండి వేరుపడినది.
పులికాట్ సరస్సు పర్యాటకులకు చక్కటి పిక్నిక్ ప్రదేశం. ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. సంవత్సరంలో చాలా భాగం పక్షి సందర్శకులు ఇక్కడకు వస్తారు. లేక్ లో బోటు విహారం కూడా చేయవచ్చు. ఇక్కడి మత్స్య కారుల వద్దనుండి రూ.500 కు ఒక బోటు అద్దెకు తీసుకొని, సరస్సు అంతా చుట్టి రావచ్చు. ఇక్కడ వాటర్ ఫౌల్, పెలికన్లు, హేరన్లు, ఫ్లమింగోలు వంటి పక్షులు తరచుగా కనపడతాయి.
పాటూరు అనేది ఒక గ్రామం పేరు. ఇక్కడ హ్యాండ్ లూం చీరలు, ఇతర చేతి పనుల వస్తువులు తయారవుతాయి. ఈ గ్రామం కోవూరు, దామరమడుగు ల మధ్య కలదు. పాతూరు ప్రసిద్ధ తెలుగు కవి తిక్కన్న సోమయాజి జన్మస్థలం. ఆయన ఇక్కడ అనేక ఏళ్ళు జీవించి మరణించాడు. పాటూరు కోవూరు నుండి 4 కి. మీ. ల దూరం వుంటుంది.
దూరం నెల్లూరు నుండి 10 కి. మీ. లు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సుమారు 354 కి. మీ. లు. దూరంలో వుంటుంది. ఆకర్షణీయంగా వుండే ఈ చిన్న గ్రామాన్ని నెల్లూరు వచ్చే పర్యాటకులు తప్పక చూసి ఆనందిస్తారు.
శ్రీ రంగనాయక దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరులో కలదు. ఈ దేవాలయంలో విష్ణు మూర్తిని రంగనాథుడుగా పూజిస్తారు. ఈ గుడిని తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం లేదా రంగనాయకులు దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని సుమారు క్రీ.శ. 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇది పెన్నా నది ఒడ్డున కలదు.
ఈ ప్రదేశంపై అనేక పురాణ గాధలు కలవు. స్థానికుల మేరకు కాశ్యప మహర్షి ఇక్కడ పౌండరీక యాగాన్ని చేసాడని, దేముడు మహర్షి యాగానికి మెచ్చి ఆశీర్వదిన్చాడని చెపుతారు. దేవాలయ శిల్ప శైలి పల్లవుల శిల్ప శైలి కలిగి వుంటుంది. దీని గాలిగోపురం సుమారు 70 అడుగుల ఎత్తు కలిగి, 10 బంగారు పూత గల పాత్రలని పై భాగం లో కలిగి వుంటుంది. ఈ పాత్రలని కలసాలు అని అంటారు. నెల్లూరు లో ఈ గోపురం ఒక ప్రధాన ఆకర్షణ. నెల్లూరు చేరితే చాలు, మీరు ఇక్కడకు తేలికగా రావచ్చు.
ఈ దేవాలయం నెల్లూరు నగరానికి సుమారు 30 కి. మీ. ల దూరంలో కలదు.
దీనినే రామ తీర్ధం అని కూడా అంటారు. ఈ గుడి లో శివుడు ప్రధాన దైవం. ఆయనకు తోడు దేవతగా కామాక్షమ్మ వుంటుంది. ఇక్కడే విగ్నేశ్వరుడు, సుబ్రహ్మన్యేశ్వరుడు కూడా పూజించబడతారు. ఈ గుడి బ్రిటిష్ పాలకుల కాలం నాటిది. చక్కటి శిల్ప తీరు, పనితనం కలిగి వుంది. దీనిని రాష్ట్ర రహదారి లో తేలికగా చేరవచ్చు.
సోమశిల ప్రాంతం నెల్లూరుకు 75 కి. మీ.ల దూరం లో కలదు. అత్రుపల్లి నుండి పొడలకూర్ వెళ్ళే మార్గం లో కలదు. రోడ్డు మార్గం చాల వరకు బాగుంటుంది. ఇక్కడి రిజర్వాయర్ పర్యాటకులు తప్పక చూడదగినది. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా వుంటుంది. సోమశిలకు వెళ్ళే మార్గంలో సుమారు 15 గ్రామాలు కలవు. షేరింగ్ ఆటోలలో ఈ ప్రాంతం అతి తక్కువ ఖర్చులో చేరుకోవచ్చు.
రిజర్వాయర్ ని పర్యాటకులు అనుమతి లేకనే అన్ని రోజులలో చూడవచ్చు. సోమశిల పర్యాటకులకు మరియు స్థానికులకు ఒక చిన్న పిక్నిక్ ప్రదేశం గా వుంటుంది. రోడ్డు మార్గం జనసంచారం లేక వెళ్లేందుకు తేలికగా వుంటుంది.
ఆధారము: నేటివ్ ప్లానెట్.కం
చివరిసారిగా మార్పు చేయబడిన : 2/17/2020