অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆదిలాబాద్

ఆదిలాబాద్ పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఒక పురపాలక పట్టణం. ఆదిలాబాద్ లో జిల్లా ప్రధాన కార్యాలయము ఉంది. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ లో దక్షిణ భారత రాష్ట్ర భాగం. స్థానికుల కధనం ప్రకారం పట్టణానికి బీజాపూర్ పాలకుడు అయిన మొహమ్మద్ ఆదిల్ షా నుంచి ఆ పేరు వచ్చింది.

ఆదిలాబాద్ పలు సంస్కృతులు మరియు మతాలతో కలసి ఉన్న ప్రదేశం మరియు దానికి అందమైన చరిత్ర కూడా ఉన్నది. ఈ ప్రాంతం మౌర్యులు, నాగపూర్ యొక్క భోంస్లే రాజస మరియు మొఘల్ లు ,అనేక ఉత్తర భారత రాజవంశాలు పాలించిన గొప్ప చరిత్ర ను కలిగి ఉంది. ఆదిలాబాద్ ను శాతవాహనులు, వకతకాస్ , రాష్ట్రకూటులు ,కాకతీయ, చాళుక్యులు మరియు బేరార్ యొక్క ఇమాద్ శాహిస్ అనే రాజవంశాలకు చెందిన దక్షిణ భారత పాలకులు కూడా పాలించారు. రెండు వర్గాల మధ్య దాడులు, ఆక్రమణలు ఈ ప్రాంతాన్ని బలహీనం చేసాయి. ఇది మధ్య మరియు దక్షిణ భారతదేశం రెండు సరిహద్దుల లోఉండుట వల్ల మరాఠీ మరియు తెలుగు సంస్కృతుల కలయికగా ఉంటుంది. ఆదిలాబాద్ యొక్క స్థానిక జనాభా రెండు మిశ్రమ సంస్కృతుల సంప్రదాయాలను అనుసరిస్తుంది, కాని ఈ సంప్రదాయాలు ఇప్పుడు ప్రజల దైనందిన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అలాగే, బెంగాలీ, రాజస్థానీ మరియు గుజరాతీ సంస్కృతులకు కూడా ఈ ప్రాంతంలో ప్రాబల్యం ఉందని గుర్తించారు.

ఆదిలాబాద్ స్వర్ణ యుగం

ఆదిలాబాద్ మొఘల్ పాలన సమయంలోనే అత్యధిక ప్రాముఖ్యతను పొందింది. దక్షిణ డౌన్ తన సామ్రాజ్యం కార్యకలాపాలను చూసుకోవడానికి, డెక్కన్ వైస్రాయ్ అని పిలిచే అతని పరిపాలన నుండి ఒక అధికారిగా నియమించబడ్డాడు. ఔరంగజేబ్ పరిపాలన కింద, ఈ ప్రాంతం ప్రధాన ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా మారింది. పట్టణంలో పొరుగు పట్టణాలు మరియు నగరాలతో మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలలో సుగంధ ద్రవ్యాలు, వస్త్రం మరియు ఇతర ఉత్పత్తులను దిగుమతి మరియు ఎగుమతి నిర్వహించేవారు. అతను ఈ క్రమంలో భారతదేశం యొక్క చక్రవర్తిగా గుర్తింపు పొందాడు. దక్షిణ భారతదేశం లోని ఆదిలాబాద్ ప్రాంతాన్ని అతని నియంత్రణలో ఉంచుకున్నాడు.

ఆదిలాబాద్ యొక్క ఆర్థిక పరిస్థితి మంచి స్థితిలో ఉంది. అదే సమయంలో నిజాం డబ్బు కోసం ఈ పరిసర ప్రాంతాలలో వర్తకం చేసాడు.1860 తిరుగుబాటు సమయంలో ఆదిలాబాద్ ప్రజలు, రాంజీ గోండు నాయకత్వంలో దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మళ్ళీ 1940 లో ఆదిలాబాద్ ప్రాంతం, భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో, ముఖ్యమైన పాత్రను పోషించింది.

నేడు ఆదిలాబాద్ తెలంగాణ లో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఆదిలాబాద్ లో సందర్శించవలసిన ప్రదేశాలు కుంతల జలపాతాలు, సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్, కదం ఆనకట్ట, సదర్ముత్ట్ ఆనకట్ట, మహాత్మా గాంధీ పార్క్ మరియు బాసర సరస్వతి దేవాలయం ఉన్నాయి.

అనుకూలమైన నగరము

ఆదిలాబాద్ ను రోడ్డు మరియు రైళ్లు ద్వారా సులభంగా చేరవచ్చు. ఆదిలాబాద్ కు పొరుగు పట్టణాలు మరియు నగరాల నుండి బస్సులు నడపబడుతున్నాయి. ప్రైవేటు బస్సులు మరియు టాక్సీలు ఉంటాయి. హైదరాబాద్ లేదా ముంబై నుండి వచ్చే బస్సులకు డీలక్స్ లేదా ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఉంటాయి..బస్సు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి నెం. 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. పట్టణం సమీపంలో అతిపెద్ద నగరం నాగపూర్ ఉంది. ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్ మీదుగా ఆదిలాబాద్ వస్తారు.ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కూడా నాగపూర్ , తిరుపతి, హైదరాబాద్, నాసిక్ మరియు మరిన్ని ప్రధాన నగరాలకు కలపబడింది. నాసిక్, ముంబై, నాగ్పూర్ మరియు షోలాపూర్ వంటి మహారాష్ట్ర నగరాలు కూడా రైళ్లు ద్వారా ఆదిలాబాద్ కు కలుప బడ్డాయి . పట్టణానికి సమీప విమానాశ్రయాలు నాగపూర్, హైదరాబాద్ ల లో ఉన్నాయి. నాగ్పూర్ విమానాశ్రయం ఒక దేశీయ విమానాశ్రయం ఇది భారతదేశం యొక్క మిగిలిన నగరాలకి అనుసంధానించబడి ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం . భారతదేశం యొక్క ప్రధాన నగరాల నుండి మరియు ప్రపంచంలోని నగరాలకు అనుసంధానించబడి ఉంది.

ఆదిలాబాద్ వేసవికాలాలు మరియు కొద్దిగా చల్లని శీతాకాలంతో కలిసి ఒక ఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంది. వేసవి కాలంలో తేమతో కూడిన వేడి ఉంటుంది.ఈ సమయంలో ఆదిలాబాద్ పర్యటన అంత మంచిది కాదు. ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం ఉంటుంది. దీని ద్వారా ఆనకట్టలు, మరియు రిజర్వాయరులు పట్టణం యొక్క నీటి అవసరాలకు కోసం నిర్మించబడ్డాయి. ఆదిలాబాద్ శీతాకాలంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది,ఈ సమయంలో పర్యటనకు అనువుగా ఉంటుంది. సాయంత్రం మరియు రాత్రి వేళలో కొంచెం ఎక్కువ చల్లగా ఉండుట వల్ల పర్యాటకులు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు మరియు తేలికపాటి కోట్లు వెంట తెచ్చుకోవాలి.

ఆదిలాబాద్ కోట

సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్ ఆదిలాబాద్ పురపాలక పట్టణంలో గలదు మరియు ఒక ప్రపంచ ప్రసిద్ది చెందిన చర్చి కూడా ఉంది. ఈ చర్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యుత్తమ కేథడ్రల్ అంటారు.

సెయింట్ జోసెఫ్ చర్చి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరియు అన్ని మతాల ప్రజలు చర్చి లోపల మాస్ నిర్వాహణ సమయంలో ముఖ్యంగా ఆదివారాలు చర్చి సమావేశమగునప్పుడు మీకు నిజంగా దేవునితో ఉన్న అనుభూతి వస్తుంది. శాంతియుతంగా, ధ్యాన వాతావరణం కలిగి ఉంటుంది.పలు వ్యక్తులు వచ్చి చర్చి వద్ద ప్రార్థన చేసినప్పుడు వారి సమస్యలకు దైవ మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి పరిష్కారం చెప్పుతాడు.

చర్చి బయట ఆకుపచ్చ ఉద్యానవనాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది ధ్యానం లో కూర్చొని లేదా బైబిల్ చదవడం చూడవచ్చు.చర్చిలో నెలకొన్న ప్రశాంతత వల్ల చాలా మంది పర్యాటకులు తీరిక లేకపోయినా తీరిక చేసుకొని వస్తారు.

సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్

సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్ ఆదిలాబాద్ పురపాలక పట్టణంలో గలదు మరియు ఒక ప్రపంచ ప్రసిద్ది చెందిన చర్చి కూడా ఉంది. ఈ చర్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యుత్తమ కేథడ్రల్ అంటారు.

సెయింట్ జోసెఫ్ చర్చి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరియు అన్ని మతాల ప్రజలు చర్చి లోపల మాస్ నిర్వాహణ సమయంలో ముఖ్యంగా ఆదివారాలు చర్చి సమావేశమగునప్పుడు మీకు నిజంగా దేవునితో ఉన్న అనుభూతి వస్తుంది. శాంతియుతంగా, ధ్యాన వాతావరణం కలిగి ఉంటుంది.పలు వ్యక్తులు వచ్చి చర్చి వద్ద ప్రార్థన చేసినప్పుడు వారి సమస్యలకు దైవ మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి పరిష్కారం చెప్పుతాడు.

చర్చి బయట ఆకుపచ్చ ఉద్యానవనాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది ధ్యానం లో కూర్చొని లేదా బైబిల్ చదవడం చూడవచ్చు.చర్చిలో నెలకొన్న ప్రశాంతత వల్ల చాలా మంది పర్యాటకులు తీరిక లేకపోయినా తీరిక చేసుకొని వస్తారు.

బాసర సరస్వతి ఆలయం

బాసర ఆదిలాబాదు జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలానికి చెందిన గ్రామము. బాసర, నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి.

హిందూ మతం పురాణాల ప్రకారం, వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే అప్పుడు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వారు సరస్వతి, లక్ష్మీ మరియు కాళి. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు.

ఈ ఆలయమును చాళుక్య రాజులు నిర్మించారు.శ్రీ పంచమి మరియు నవరాత్రి పండుగలు ఆలయం వద్ద పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము వుంటుంది.

మహాత్మా గాంధీ పార్క్

ఆదిలాబాద్ లో మహాత్మా గాంధీ పార్క్ కు స్థానిక జనాభా మరియు పర్యాటకులు సంవత్సరం పొడుగున వస్తారు. ఈ పార్క్ కు విశ్రాంతి మరియు ప్రశాంతంత కోసం ప్రజలు వస్తూ ఉంటారు. పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఈ పార్క్ లో వాకింగ్, వ్యాయామం వంటివి ముగిశాక విశ్రాంతి తీసుకోవటానికి ప్రశాంత మైన వాతావరణం కూడా ఉంటుంది. ఈ పార్క్ లో అనేక విదేశీ మొక్కలు ఉన్నాయి.

పార్క్ యొక్క మైదానాలు బాగా నిర్వహించబడతాయి, మరియు ఈ పచ్చిక బయళ్ళు లో కూర్చుని పార్క్ యొక్క ప్రశాంత మైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. వాకింగ్ చేశాక కూర్చొని విశ్రాంతి తీసుకోవటానికి బల్లలు కూడా ఉన్నాయి.

పాత తరం వారికీ ఈ పార్క్ చాలా బాగుంటుంది. ఒక పార్క్ రాత్రి 8:30 గం.వరకు తెరచి ఉంటుంది. సందర్శన సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

సదర్మత్ట్ ఆనకట్ట

సదర్మత్ట్ ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతనమైన ఆనకట్ట. ఈ ఆనకట్ట 1891-92 సంవత్సరం లో నిర్మించారు. ఈ అత్యంత పురాతనమైన ఆనకట్ట ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. కద్దం మరియు ఖానాపూర్ మండలాలకు పంటల సేద్యం కోసం గోదావరి నది పై నిర్మించారు.

శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుండి 50 కి.మీ. దూరంలో సదర్మత్ట్ ఆనకట్ట ఉంది. నిజానికి, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తో ఆనకట్ట కలపడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇలా చేయటం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది రైతులకు సాగు నీటి సరఫరా ప్రధానంగా జరుగుతుంది.

ఈ అనకట్ట మరియు చుట్టు ప్రక్కల ప్రదేశాలు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్నాయి. ఆనకట్ట చుట్టూ ప్రక్కల ఆకుపచ్చ గడ్డిభూములు మరియు మెరుపులతో ప్రవహించే వాటర్ ఫాల్స్ కలవు. పర్యాటకులకు ఇక్కడ గడిపితే అసలు టైమే తెలియదు,అంత మైమరచి పోతారు.

కడెం ఆనకట్ట

ఇది కదం ప్రాజెక్ట్ గా బాగా ప్రాచుర్యం పొందినది. కదం ఆనకట్ట కద్దం నది పై నిర్మించారు. కదం నది గోదావరి నది యొక్క ఉప నది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. ఈ ఆనకట్ట ఆదిలాబాద్ పట్టణం నకు చాలా దగ్గరలో ఉంది మరియు గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందింది.

ఆనకట్ట నిర్మాణం 1949 సంవత్సరంలో ప్రారంభమై 1965 వ సంవత్సరంలో పూర్తి చేయబడింది. ఈ ఆనకట్ట ఆదిలాబాద్ జిల్లాలో 25,000 హెక్టార్ల భూమికి సేద్యానికి అందించే ఉద్దేశ్యంతో నిర్మించారు.

నేడు, ఈ ఆనకట్ట ఆదిలాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ప్రసిద్ధ విహారస్థలం మరియు కృత్రిమ పచ్చిక బయళ్ళు మరియు తాజా గాలి విశాలమైన, ఆకుపచ్చని చెట్లు సందర్శకులని బాగా ఆకర్షిస్తుంది. సికింద్రాబాద్ మరియు మన్మాడ్ మధ్య నడిచే మీటర్-గేజ్ రైలు కూడా ఆనకట్ట మీదుగా వెళ్తుంది.

కుంటల జలపాతం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. కుంటాల పేరు వెనుక చరిత్ర చూస్తే....శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కుంతల రానురాను కుంటాలగా మారింది.

జలపాతం చేరాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది. 45 అడుగుల ఎత్తు నుండి కిందికి పడే నీళ్లు వినసొంపైన శబ్దం చేస్తుంటాయి. జలపాతం కిందికి చేరుకొని జలకాలాటలలో..కిలకిల పాటలలో కొద్దిసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు. వర్షా, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే జలపాతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జలకన్య అందాలను దూరం నుంచే ఆస్వాదించాలి. మరీ సమీపంలోకి వెళ్లకూడదు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందాలను తిలకించడానికి వచ్చి హెచ్చరికలు పాటించకుండా మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది. దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది.

పొచ్చెర జలపాతం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న పొచ్చెర జలపాతం ప్రసిద్ధి చెందింది.

చూడముచ్చటగా ఉన్న పొచ్చెర జలపాతం పక్కనే పార్కు ఉంది. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే భలేగా ఉంటుంది. ఆ జలపాతాన్ని చూస్తూ తడవకుండా ఉండడం సాధ్యం కాదేమో!?

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate