অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నిజామాబాదు

నిజామాబాద్ పట్టణాన్ని ఇందూరు లేదా ఇంద్రపురి అని కూడా పిలుస్తారు. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాలో ఈ పట్టణం ఒక మునిసిపల్ కార్పొరేషన్ గా కలదు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయాలు నిజామాబాద్ లోనే కలవు. ఇది రాష్ట్రంలో అతి పెద్ద 10వ పట్టణం.

8వ శతాబ్దం లో ఈ పట్టణం ఇంద్ర వల్లభ పంత్య వర్ష ఇంద్ర సోమ అనే రాష్ట్రకూట వంశ రాజు పాలనలో ఉండేది. ఆ రాజు పేరుతో ఈ ప్రదేశాన్ని ఇంద్రపురి అనేవారు. అయితే, సికింద్రాబాద్ మరియు మన్మాడ్ ల మధ్య రైల్వే లైన్ వేయడంతో, ఒక కొత్త రైలు స్టేషన్ గా నిజామాబాద్ ఆవిర్భవించింది. ఈ స్టేషన్ నిజాం ఉల్ ముల్క్ అనే అప్పటి ఆ ప్రాంత పాలకుడి పేరు తో పెట్టారు. నిజామాబాద్ హైదరాబాద్ - ముంబై లైన్ లో ఒక ప్రసిద్ధ రైలు స్టేషన్ కావటం వలన ఆ పేరును నిజామాబాద్ గా మార్చారు.

నిజామాబాద్ నిజాం ఉల్ ముల్క్ పాలనలో చాలా కాలం ఒక స్వర్ణ యుగంగా ఉండేది. అతను ఒక గొప్ప కళా కారుడు. ఫలితంగా అనేక మతపర సంస్థలు అంటే మసీదులు మరియు హిందూ దేవాలయాలు నిర్మించాడు. నిజామాబాద్ జిల్లాలో అనేక పట్టణాలు, గ్రామాలు కలవు. వాటిలో ఆర్మూరు, బోధన, బాన్స్వాడ, కామారెడ్డి వంటివి పేరు పడిన ప్రదేశాలు. బోధన్ పట్టణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కలదు. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ ఆసియా ఖండం లోనే పెద్డ్డది.

విభిన్న సంస్కృతుల సమ్మేళనం

నిజామాబాద్ దాని గొప్ప సాంస్కృతికతలకు చరిత్రకు ప్రసిద్ధి. పట్టణ జనాభాలో హిందువులు,క్రైస్తవులు , ముస్లిములు మరియు సిక్కులు కూడా కలరు. అన్ని మతాలవారు సఖ్యతగా వుంటారు. జండా మరియు నీలకంటేస్వర పండుగలు ఇక్కడ అమిత వైభవంగా జరుపుతారు. జండా పండుగ ఆగష్టు మరియు సెప్టెంబర్ లలో సుమారు 15 రోజుల పాటు నిర్వహిస్థారు. నీలకంటేశ్వర పండుగ, రెండురోజుల పాటు జనవరి లేదా ఫిబ్రవరిలలో చేస్తారు.

నిజామాబాద్ మరియు దాని ఆకర్షణలు

పర్యాటకపరంగా నిజామాబాద్ తెలంగాణ పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో శ్రీ హనుమాన్ టెంపుల్, నీల కంటేశ్వర టెంపుల్, ఖిల్లా రామాలయం టెంపుల్, శ్రీ రఘునాథ టెంపుల్, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ మరియు సరస్వతి టెంపుల్ (బాసర వద్ద) వంటి ప్రముఖ దేవాలయాలు కలవు. ఈ టెంపుల్స్ మాత్రమే కాక, ఇతర చారిత్రక , పురావస్తు, వారసత్వ ప్రదేశాలు కూడా కలవు. ఇక్కడ దోమకొండ కోట కలదు. ఇది నేడు శిధిలాలలో ఉన్నప్పటికీ నిజామాబాద్ గత వైభవం తెలుసుకోడానికి తప్పక చూడాలి . పట్టణంలో మరొక కోట నిజామాబాద్ కోట. ఈ కోట కూడా వినోద, విహారాలకు, పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. పట్టణంలో కల కెంటు మసీదుని అన్ని మతాలవారు దర్శిస్తారు.

చక్కని రవాణా సౌకర్యాలు కల పట్టణం

నిజామాబాద్ ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. దీనిని నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య చూడాలి. వాతావరణం ఈ సమయం లో చాలా ఆహ్లాదంగా వుంటుంది. నిజామాబాద్ ఒక ఉష్ణమండల ప్రాంతం కావడం వలన, వేసవులు వేడిగా ఉంటాయి. ప్రత్యేకించి మే మరియు జూన్ నెలలు అధిక వేడి. వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి. అదే సమయంలో గాలి లో తేమ అధికం అయి ఎంతో అసౌకర్యంగా వుంటుంది.

నిజామాబాద్ దేశం లోని ఇతర భాగాలకు రోడ్ మరియు రైలు మార్గాలలో కలుపబడి వుంది. రోడ్లు బాగా వుంటాయి. ప్రభుత్వ బస్సులు , ప్రైవేటు టాక్సీ లు లభ్యంగా వుంటాయి. టవున్ లో కల రైలు స్టేషన్ నేరుగా దేశంలోని వివిధ నగరాలకు అంటే, హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ మరియు చెన్నై లకు కలుపబడి వుంది. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ సుమారు 200 కి. మీ. ల దూరంలోని హైదరాబాద్ లో కలదు. విమానాశ్రయం నుండి నేరుగా టాక్సీ లలో నిజామాబాద్ చేరుకోవచ్చు.

ఆర్కేయోలాజికల్ మరియు హెరిటేజ్ మ్యూజియం

మానవ అభివృద్ధి కోతుల నుండి మనిషి వరకు ఎలా జరిగిందనేది తెలుసుకోవడానికి పర్యాటకులు ఈ మ్యూజియాన్ని తప్పక చూడాలి. ఈ మ్యూజియం 2001లో స్థాపించారు. దీనిలో మూడు విభాగాలు వుంటాయి. ఆర్కేయోలాజికాల్, స్కల్ప్చురాల్ గేలరీ మరియు బ్రాంజ్ గేలరీ లుగా వుంటాయి.

ప్రతి విభాగం కూడా ఆ పట్టణం పురాతన మరియు, ఆధునిక ఇండియా కు ఏ రకంగా తోడ్పడిందో తెలుపుతుంది. క్రీ. పూ. 50000 నుండి 5000 వరకు మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర వస్తువులు ప్రదర్శించబడ్డాయి. క్రీ. పూ. వేయి సంవత్సరాలు మరియు, క్రీ. శ. 3వ శతాబ్దం నాటి వస్తువులు కూడా కలవు.

ఇక్కడే మీరు వివిధ పాలనల లోని నాణేల సేకరణ కూడా చూడవచ్చు. వీటిలో శాతవాహన, కాకతీయ, మరియు కుతుబ్ షాహీ ఇక్ష్వాకులు కాలం నాటివి కూడా చూడవచ్చు.

దోమకొండ కోట

దోమకొండ కోట దోమకొండ గ్రామంలో కలదు. ఇది నిజామాబాద్ పట్టణానికి 38 కి. మీ. లు , హైదరాబాద్ నగరానికి సుమారు 98 కి. మీ.ల దూరంలో వుంటుంది.

ఈ కోట చారిత్రక అంశాల దృష్ట్యా తెలంగాణా మరియు నిజామాబాద్ లో ప్రసిద్ధి. ఈ కోటను కామినేని వంశ రాజులూ అంటే కమ్మ కులస్తులు సుమారు 400 సంవత్సరాల కిందట నిర్మించారు. కోట వెలుపల అందమైన శివ టెంపుల్ , కాకతీయ రాజులు కట్టించినది కలదు.

నేడు కోట చాల వరకు శిధిలమై వుంది. అయినప్పటికీ ఆ కాలం నాటి అద్భుత శిల్ప వైభవాన్ని ప్రదర్శిస్తుంది. కోట బలంగా, అందంగా వుంటుంది. ఈ కోట నిర్మాణ శైలి లో ముస్లిం మరియు హిందూ శిల్ప తీరు తెన్నులు ఉండటం విశేషం.

నిజాం సాగర్ డాం

నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ డాం మంజీరా నదిపై కలదు. గోదావరి నది ఉప నదులలో మంజీరా ఒకటి. ఈ డాం హైదరాబాద్ కు వాయువ్యంగా వుంటుంది. సుమారు 145 కి. మీ.ల దూరం లో అచ్చంపేట్ మరియు బంజపల్లె ల మధ్య నిజామాబాద్ జిల్లాలో కలదు. రెండు పట్టణాల మధ్యగా సుమారు 3 కి. మీ. ల పొడవున నిజాం సాగర్ డాం నిర్మించారు.

నిజామాబాద్ జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు దీనిని నిర్మించారు. నేడు ఈ డాం దాని పై గల 14 అడుగుల వెడల్పు ట్రాఫిక్ రోడ్ తో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. రోడ్ నుండి అందమైన ప్రకృతి దృశ్యాలు ఎన్నో చూడవచ్చు.

మంచిప్ప

మంచిప్ప నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణానికి దగ్గరగా గల ఒక చిన్న గ్రామం. నిజామాబాద్ నుండి 18 కి. మీ. లు మరియు, జిల్లా ప్రధాన కార్యాలయానికి సుమారు 66 కి. మీ. ల దూరం లో వుంటుంది.

ఇక్కడ కల నారాయణ్ ఖేడ్, బీదర్ మరియు మెదక్ లు ఆకర్షణలు. ఈ ప్రదేశంకు రైలు మరియు రోడ్ మార్గాలు అనుకూలం. నిజామాబాద్ రైలు స్టేషన్ 19 కి. మీ.ల దూరంలోను, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ 210 కి. మీ. ల దూరంలోను కలవు.

నిజామాబాద్ కోట

నిజామాబాద్ కోటకు చారిత్రిక మరియు మతపర ప్రాముఖ్యత కలదు. దీని దూరం హైదరాబాద్ నుండి సుమారు 200 కి. మీ. లు మాత్రమే కనుక పర్యాటకులు తేలికగా దీనిని చేరవచ్చు. ఈ కోట మహారాష్ట్ర సరిహద్దులలో వున్న కారణంగా అక్కడనుండి కూడా పర్యాటకులు వస్తారు.

10 వ శతాబ్దానికి చెందిన ఈ కోట అక్కడ కల ఒక చిన్న కొండపై నిజామాబాద్ పట్టణానికి నైరుతి దిశలో వుంటుంది. రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులు ఈ కోటను నిర్మించారు. ఈ కోట చాలా హుందాగా సుమారు 300 ల మీటర్ల ఎత్తున ఉంటుంది. ఆనాటి వైభవానికి ఉదాహరణగా నిలుస్తుంది. కాలక్రమేణా వివిధ పాలకుల చేతులలో ఈ కోట అనేక నిర్మాణ మార్పులు కూడా పొందింది.

కెంటు మసీదు

కెంటు మసీదు పట్టణ మధ్య భాగం లో కలదు. ఈ మసీదు ముస్లిములకు చాలా పవిత్రమైనది. ముస్లింలు చాలామంది ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి ఉదయం, మధ్యాహ్నం , మరియు సాయంత్రాలు నమాజ్ చేస్తారు.

మసీదు పర్షియా శిల్ప శైలి కి ఉదాహరణగా వుంటుంది. అయితే, దీనిని నిజాములు కట్టించినందున కొంత మేరకు భారతీయ శిల్ప శైలి కూడా కలిగి వుంటుంది. దీని నిర్మాణం లో ఇటాలియన్ మార్బుల్ రాళ్ళని ఉపయోగించారు. ఎన్నో రకాల పర్షియా చిత్రాలు , బోధనలు గోడలపై వ్రాయబడి ఉంటాయి.

శ్రీ రఘునాథ టెంపుల్

నిజామాబాద్ పట్టణంలో కల ఈ దేవాలయం స్థానిక హిందువులకు ప్రేసిద్ధి గాంచినది. ఈ దేవాలయం అన్ని రోజులలోను తెరచి వుండి భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది.

ఈ దేవాలయంలో ప్రధాన దైవం శ్రీరాముడు, సీతా దేవి మరియు లక్ష్మణుడు. లక్ష్మణుడు అరణ్యవాసం సమయంలో రావణుడిని వధించటం లో శ్రీరాముడు కి సహాయం చేసినందువలన ఆయనను కూడా పూజిస్తారని చెపుతారు. సీతా రాముల పరమ భక్తుడైన హనుమంతుడి విగ్రహానికి కూడా ఇక్కడ పూజలు చేస్తారు.

సారంగాపురం హనుమాన్ టెంపుల్

సారంగాపురం హనుమాన్ టెంపుల్ నిజామాబాద్ టవున్ కు సమీపంలో కల సారంగపురం అనే గ్రామంలో కలదు. ఇది దేశం లోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి కనుక భక్తులు చాలామంది వస్తారు. ఒకే రాతి లో హనుమంతుడికి ఒక పెద్ద విగ్రహాన్ని మలచారు. ఈ టెంపుల్ కు సుమారు 425 సంవత్సరాల కిందట సమర్ధ రామదాస్ మహర్షి దీనిని స్థాపించారు. అప్పటి నుండి ఈ గుడి వేలాది భక్తులను ఆకర్షిస్తోంది.

హనుమాన్ దేవునికి ప్రీతి అయిన మంగళ వారాల్లో భక్తులు అధిక సంఖ్య లో వస్తారు. పూజలు నిర్వహిస్తారు.

శ్రీ నీలకంటేశ్వర టెంపుల్

నీలకంటేశ్వర దేవాలయం స్తానికులలోను మరియు బయట నుండి వచ్చే పర్యాటకుల భక్తుల లోను ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ, ప్రత్యేకించి సోమవారాల్లో, భక్తులు అధిక సంఖ్య లో వచ్చి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ శివుడిని నీల కాంతుడు లేదా నీలిరంగు మెడ కలవాడు అంటారు. శివుడు విషం మిన్గాడని, ఆ కారణంగా, ఆయన మెడ నీలం అయిందని చెపుతారు.

ఈ దేవాలయాన్ని శాతవాహన వంశానికి చెందినా శాతకర్ణి II నిర్మించారు. దేవాలయ శిల్పశైలి కొద్దిగా నార్త్ ఇండియా టెంపుల్స్ శైలిలో వుంటుంది. దీనికి కారణం ఆ కాలంలో ఇక్కడ జైనులు ఉండేవారని వారి కొరకు ఇది నిర్మించారని చెపుతారు.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate