తెలంగాణ లోని మెదక్ జిల్లాలో మెదక్ ఒక పురపాలక సంఘం పట్టణం. ఇది రాజధాని నగరం హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదక్ కు సంబంధించి చాల ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అసలు పేరు సిద్దాపురం కాగా తర్వాతి కాలంలో గుల్షనాబాద్ గా మారిందని విశ్వసిస్తారు. కాకతీయ వంశ పాలనలో ఈ పట్టణం ఎంతో పురోగతిని సాధించింది. వాస్తవానికి కాకతీయల రాజు ప్రతాప రుద్రుడు మెదక్ ను ఎటువంటి దాడుల నుండి అయిన సంరక్షించడానికి చుట్టూ ఒక కోట ప్రహరిను నిర్మించాడు. మెతుకుదుర్గం అనే ఈ కోట ప్రహరిని చిన్న కొండ మీద నిర్మించారు. స్థానికులలో మెతుకుసీమగా ఇది ప్రసిద్ది చెందింది. మెతుకు అంటే వండిన బియ్యపు గింజ అని తెలుగులో అర్ధం.
ఎంతో ఆనందోత్సాహాలతో ఇక్కడ జరుపుకొనే అనేక పండుగల వలన మెదక్ పరిసరాలలోని పట్టణాలు, నగరాలలో చాల ప్రసిద్ది చెందింది. వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని పండుగలను ఈ ప్రాంతంలో జరుపుకొంటారు, చాలామంది ప్రజలు దూరప్రాంతాల నుండి విస్తృతంగా ఈ పండుగలలో పాల్గొనడానికి వస్తారు. పెద్ద సంఖ్యలో జరుపుకొనే బతుకమ్మ పండుగ ఈ పట్టణంలో చాల ప్రసిద్ధ పండుగ. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఈ పండుగను కేవలం స్త్రీలు మాత్రమే జరుపుకొంటారు. గౌరీ దేవిని పూజించే ఈ పండుగను నవరాత్రి సమయంలో జరుపుకొంటారు. తెలంగాణా ప్రాంతంలో ఈ దేవతను బతుకమ్మగా పూజిస్తారు. ఈ పదానికి అర్ధం వాస్తవానికి సజీవంగా రమ్మని దేవతను ఆహ్వానించడం. బతుకమ్మ పండుగ శరదృతువులో తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. దసరాకు ఒక రోజు ముందు ఈ ఉత్సవాలు సమాప్తమౌతాయి.
మెదక్ చాల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా అవడంతో ఈ పట్టణానికి అనేక మంది ప్రజలు ప్రక్క రాష్ట్రాల నుండి వస్తారు. సాయిబాబా భక్తులు నిర్మించిన ఒక దేవాలయం ఈ పట్టణంలో ఉంది. మెదక్ దగ్గరలో చిన్న గ్రామం గొట్టం గుట్టలో ఒక అందమైన సరస్సు, అనేక అందమైన దేవాలయాలు ఉన్నాయి. పక్షులు, వన్య మృగాలు ఉండే పోచారం అడవి, వన్యప్రాణి అభయారణ్య౦ యువ పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది, కాని ఒకప్పుడు హైదరాబాద్ నిజాం నవాబులకు ఇది వేటాడే ప్రదేశంగా ఉపయోగపడేది.
చాల ప్రసిద్ది చెందిన వేరొక పర్యాటక కేంద్రం సింగూర్ డాం, ఇది స్థానిక ప్రజలకు విహారయాత్రకు ప్రసిద్ధ కేంద్రం. మెదక్ పట్టణానికి అతి దగ్గరలో ఉండటం వలన నిజాంసాగర్ డామ్ కూడా తరుచుగా సందర్శించే విహార యాత్ర కేంద్రం. ఈ డామ్ ను మంజీరా నది పై నిర్మించారు. మంజీర వన్యప్రాణి, పక్షుల అభయారణ్యం మెదక్ పట్టణానికి చాల దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం మొసళ్ళకు దేశంలోనే ప్రసిద్ది. ఈ అభయారణ్య౦ అనేక వలస పక్షులకు నివాసం, సీజన్లో సందర్శిస్తే మీరు వీటిలో అనేక రకాలను చూడవచ్చు.
మెదక్ లో చుట్టుపక్కల అనేక చారిత్రిక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీ సరస్వతి క్షేత్ర దేవాలయం, వేలుపుగొండ శ్రీ తు౦బురనాథ దేవాలయం, ఏడుపాయల దుర్గాభవాని గుడి ఎంతో ప్రసిద్ది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు మెదక్ పట్టణానికి విచ్చేయడానికి ఈ దేవాలయాలు ఒక కారణం. పండుగల సమయంలో పోటెత్తే లెక్కలేనంత మంది భక్తులు, పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించే పనిలో ఈ పట్టణం సతమతమౌతుంది. ఈ పట్టణంలో హిందువుల జనాభా ఎక్కువైనప్పటికీ అన్ని పండుగలను అదే విధమైన భక్తి, ఆరాధనతో జరుపుకొంటారు. ఈ పట్టణం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం కావడం ఒక చిన్న అద్భుతంగా ఉంటుంది.
దుర్గ భవానికి చెందిన ఏడుపాయల దుర్గ భవాని గుడి, మెదక్ పట్టణంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరలో ఉంది. దుర్గ మాత దేవాలయానికే కాక ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రత్యేక అమరిక గల రాళ్ళకు ప్రసిద్ది. వేరొక ప్రాంతంలో కలిసే మంజీరా నది ఏడు ప్రవాహాలుగా చీలిపోయేది కూడా ఈ ప్రాంతం లోనే. తెలుగు పదం ఏడుపాయలు అంటే ఏడు ప్రవాహాలు అని అర్ధం.
ఒక పురాణ గాథ ప్రకారం మహాభారత కాలం లో అర్జునుని మనవడు జనమేజయుడు తన తండ్రిని ఒక శాపం నుండి విముక్తుడ్ని చేయడానికి సర్పయాగం లేదా పవిత్రాగ్నిలో సర్పాలను వదిలే యాగాన్ని చేశాడు. ఈ సర్పయాగం ఈ దేవాలయ ప్రాంతంలో చేశాడు. వంతెన నిర్మించ దలచినప్పుడు మంజీరా నది లోపలి పొరలలో ఒక మందమైన బూడిద పొర కనబడిందని తెలుపుతారు.
శివరాత్రి రోజున జరిగే ఉత్సవం జాతరకు లక్షలాది మంది భక్తులు పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా విచ్చేస్తారు.
మెదక్ కోట- నగరాన్ని ఆక్రమణదారుల నుండి రక్షించడానికి కాకతీయ పాలకులు నిర్మించిన ఒక పురాతన ప్రహరి కోట. ఈ కోట మెదక్ లో హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతాపరుద్ర మహారాజు 12వ శతాబ్ద౦లో నిర్మించినదిగా భావించే దీనిని మెతుకు దుర్గం అని కూడా పిలుస్తారు.
కాకతీయ పాలకులకు, వారి తర్వాత చాలా కాలానికి రాజ్యం చేసిన కుతుబ్ షాహిలకు కూడా ఈ కోట నియంత్రణా కేంద్రంగా ఉండేది. కుతుబ్ షాహి పాలకులు ఈ కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును 17వ శతాబ్ద౦లో నిర్మించారు. ఈ కోట చారిత్రిక పరంగానే కాక పురావస్తు పరంగా కూడా గుర్తించదగినది. స్థానిక ప్రజల హృదయాలలో ఇది ఒక గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ఈ కోట నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో బాటుగా పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.
మెదక్ చర్చి ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ పట్టణం లో ఉంది. 1947 సంవత్సరం నుండి అదే కేథడ్రాల్ లో ఉన్న ఈ చర్చి మెదక్ డయోసీస్ వారికి చెందినది. మెథడిస్ట్ క్రిస్టియన్లు నిర్మించిన ఈ చర్చిని 1924 లో “నా దేవునికి నా ఉత్తమం” అనే నినాదాన్ని అనుసరించే రెవరాండ్ చార్లెస్ వాకర్ ప్రోస్నేట్ ఏర్పాటు చేశారు. ఈ చర్చిని అంకిత మిచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది క్రిస్టియన్లు ఈ చర్చిని సందర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పెద్ద చర్చి అనే పేరును కూడా ఇది కల్గి ఉంది.
గోతిక్ పునరుజ్జీవన తరహాలో కట్టిన ఈ చర్చికి 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవు ఉన్న కేథడ్రాల్ ఉంది. అతి పెద్దగా ఉండే ఈ కేథడ్రాల్ ఒకేసారి 5,000 మంది ప్రజలకు వసతి కల్పించ గలదు. బ్రిటన్ నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసిన ఆరు వేర్వేరు రంగుల మొసాయిక్ టైల్స్ ఈ చర్చిలో ఉన్నాయి. ఈ చర్చికి చెందిన గచ్చు పనిని బాంబే నుండి వచ్చిన ఇటలీ తాపీ పని వారి ద్వారా చేయించారు.
క్రీస్తు జీవితంలో జననం, శిలువ, స్వర్గారోహణా లను వర్ణించే అద్దకపు గాజు కిటికీలు ఈ చర్చి లోని ఒక అందమైన అంశం.
పోచారం అభయారణ్యం మెదక్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దురదృష్టవశాత్తూ, ఈ అభయారణ్యానికి చేరడానికి ఏ విధమైన ప్రభుత్వ రవాణా సౌకర్యం లేదు. మీరు ఒక ప్రైవేట్ బస్సు లేదా ఒక స్వంత వాహనం ద్వార ఈ ప్రాంతానికి చేరవచ్చు.
పురాతన కాలంలో హైదరాబాద్ నిజం నవాబులు ఈ ప్రాంతాన్ని ఒక వేట మైదానంగా ఉపయోగించారు. తర్వాతి కాలంలో 20వ శతాబ్దపు మధ్యలో దీనిని ఈ ప్రాంతపు వన్య ప్రాణుల కోసం రక్షిత ప్రాంతంగా మార్చారు. అల్లైర్ డాం నిర్మించినప్పుడు కట్టిన పోచారం సరస్సు పేరు ఈ అభయారణ్యానికి పెట్టారు.
ఈ అభయారణ్య౦లో అపారమైన వృక్ష, జంతు జాతులున్నాయి. అడవి కుక్కలు, తోడేళ్ళు, చిరుతలు, అడవి పిల్లులు, జింకలు, లేళ్ళు, ఎలుగుబంట్లు వంటి జంతువులను ఈ అభయారణ్యపు అడవిలో చూడవచ్చు. ఈ అభయారణ్యానికి ఓపెన్ బిల్ల్ద్ కొంగలు, పట్టి వంటి తల ఉన్న బాతులు, బ్రాహ్మినీ బాతులు వంటి వలస పక్షులు ప్రతి ఏడాది వస్తాయి.
పర్యావరణ పర్యాటక కేంద్రంలో ఐదు రకాల లేళ్ళు, జింకలను పర్యాటకులు చూడగలగటం పర్యాటక రంగంలో ఒక ఆసక్తికర అంశం. నవంబర్ నుండి జనవరి వరకు ఉన్న కాలం పోచారం సందర్శనకు ఉత్తమమైనది.
ఆధారము: నేటివ్ ప్లానెట్.కం