অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరంగల్

వరంగల్ భారతదేశంలో తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను 'ఓరుగల్లు' లేదా 'ఓంటికొండ' అని కూడా పిలిచేవారని దీనికి సాక్ష్యాధారంగా ఒక పెద్ద కొండ రాయిమీద ఈ పేర్లు చెక్కి ఉండటం కనిపిస్తుంది. వరంగల్ నగరం వరంగల్ జిల్లాలో ఉంది,దీనితోపాటుగా హన్మకొండ మరియు కాజీపేట్ కూడా ఉన్నాయ్.

వరంగల్ కోట వంటి వివిధ వాస్తుకళా కళాఖండాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి మరియు ప్రోల రాజు (కాకతీయ వంశం యొక్క) ఈ సుందరమైన నగరం నిర్మించారు అని నమ్ముతారు. మార్కో పోలో, ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు, అతని ప్రయాణ డైరీలలో మరియు ఆయన రచనల్లో వరంగల్ గురించి ప్రస్తావించినప్పుడు కాకతీయరాజుల సాంస్కృతిక మరియు పరిపాలన దక్షత గొప్పతనం ప్రతిబింబిస్తాయి.

వరంగల్ ప్రధానంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిఉన్నది మరియు మిరప, పొగాకు, పత్తి, బియ్యం పంటలు ఇక్కడ విస్తృతంగా సాగు చేస్తారు. ఈ నగరంలో కేవలం ఒక మిలియన్ మంది పౌరులు నివసిస్తున్నారు.

చరిత్రపరంగా

ఇంతకు ముందు చెప్పినట్లుగా కాకతీయ రాజులు 12నుండి14వ శతాబ్దం A.D.వరకు వరంగల్ పరిపాలించారు. ప్రతాప రుద్ర యొక్క ఓటమి తరువాత, ముసున్రి నాయక్ ల యాభై సంవత్సరాల చట్టం స్థాపించబడింది. దీనివలన వివిధ నాయక్ రాజుల మధ్య నమ్మకం, సంఘీభావం లేకపోవడం, పరస్పర పోటీ ఏర్పడ్డాయి మరియు నగరం యొక్క పరిపాలనా నియంత్రణను బహమనీలు తీసుకున్నారు.

ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి, 1687 సంవత్సరం లో గోల్ద్కండా సుల్తానేట్ మీద విజయం సాధించాడు. (వరంగల్ ఒక భాగమై ఉంది ) మరియు 1724 వరకు అలానే కొనసాగింది. హైదరాబాద్ స్టేట్ 1724 లో ఉనికిలోకి వచ్చింది మరియు1948 లో వరంగల్ కూడా మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఒక భాగం అయ్యింది. హైదరాబాద్ భారతీయ రాష్ట్రం అయింది మరియు 1956 లో ఈ రాష్ట్రానికి ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఇచ్చివేశారు

వరంగల్ లో సేకరించిన సాక్ష్యాధారాలననుసరించి 12వ శతాబ్దానికి ముందు 'కాకతిపుర' (కాకతీయ రాజుల నుంచి వొచ్చింది) అని వరంగల్ను ప్రత్యామ్నాయంగా పిలిచేవారని అనుకోవొచ్చు.

చుట్టుప్రక్కల ప్రాంతాలు

వరంగల్ నగరానికి గల చారిత్రక ప్రాధాన్యత, అనేక రకాల శిల్పకళ, అభయారణ్యాలు మరియు ఆకట్టుకొనే విధంగా ఉన్న దేవాలయాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.

పాకాల సరస్సు,వరంగల్ కోట,వేయి స్తంభాల గుడి మరియు రాక్ గార్డెన్ మొదలైన ఆకర్షణలను వరంగల్ జిల్లాలో చూడవచ్చు. ఇతర దేవాలయాలు,పద్మాక్షి ఆలయం మరియు భద్రకాళి ఆలయం సమాజంలోని అన్నిరకాల భక్తులను ఆకర్షిస్తూన్నాయి. వరంగల్ ప్లానిటోరియం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఇక్కడ ఇంకా అనేక సరస్సులు,ఉద్యానవనాలు ఉన్నాయి.

వరంగల్ లో రెండు సంవత్సరాలకి ఒకసారి సమ్మక్క-సారక్క జాతర (సమ్మక సారలమ్మ జాతర అని కూడా అంటారు) జరుగుతుంది. ఈ జాతర పది మిల్లియన్ల ప్రజలను ఆకర్షిస్తున్నది. కాకతీయ రాజ్యంలో అమలుపరిచిన అన్యాయమైన చట్టాలను ఎదిరిస్తూ ఒక తల్లి-కూతురు జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగ (జాతర)ను జరుపుకుంటారు. కుంభమేళా తరువాత ఆసియ ఖండంలో రెండవ అతిపెద్ద జాతర ఇది.

ఇక్కడ బతుకమ్మ పండుగను ఒక గొప్ప శైలిలో జరుపుకుంటారు మరియు స్త్రీలు పూలన్నిటినీ కలగలుపు చేసి దేవతను పూజిస్తారు.

ప్రయాణం మరియు వసతి

గవర్నమెంట్ బస్సు సర్వీసులు నగరం అంతటా ఉన్నాయి మరియు అందులో ప్రయాణం కనీస ఖర్చుతో కూడుకున్నది మరియు అన్ని స్థలాలిని పర్యటించవొచ్చు. ఈ నగరంలో ఆటోరిక్షాలు కూడా చాలా చూడవొచ్చు మరియు ప్రయాణ సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచించనక్కరలేదు.ఆటోరిక్షాలు మీటర్ మీద నడవవు,కాబట్టి ప్రయాణానికి ముందే రేటు నిశ్చయించుకొని, నిశ్చింతగా ప్రయానించవొచ్చు.

వరంగల్ నగరం ఎక్కువ ప్రజాదరణ పొందటం వలన పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన నగరంలో వసతి కొద్దిగా కష్టంగానే ఉంటుంది, ముందుగానే వసతిని చూసుకోకపోతే. మధ్యతరగతి హోటళ్ళు గదికి రూ.750 చొప్పున ఏదాది పొడుగునా దొరుకుతాయి. అయినప్పటికీ, ఎండాకాలంలో ఈ గదులు తీసుకోవటం మంచిది కాదు ఎందుకంటే వరంగల్లులో అపరిమితమైన వేడి ఉంటుంది. డీలక్స్ గదికి (ఎయిర్-కండిషన్ తో) రోజుకు సుమారు రూ.1200 చొప్పున దొరుకుతాయి మరియు ఇటువంటి సౌకర్యాలు చాలా వరంగల్ కోట పరిసరాలలో కనిపిస్తాయి. ఎవరైతే రోజుకు 3000-4000 ఖర్చు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారో వారికి లగ్జరీ రిసార్ట్స్ ప్రత్యామ్నాయంగా దొరుకుతాయి. ఇంటర్నెట్ యాక్సెస్, ఒక ఈత కొలను మరియు రెస్టారెంట్లో ఉండే బహుళ వంటకాలు వంటి సౌకర్యాలతో ఈ లగ్జరీ రిసార్ట్స్ ఉంటాయి.

భద్రకాళి దేవాలయం

భద్రకాళి దేవాలయం మన దేశంలో ఉన్న పురాతనమైన గుడులలో ఒకటి. ఇది భద్రకాళి దేవతకు అంకితం చేయబడింది. దీనిని 625 ఏ.డి లో చాళుక్య రాజవంశం యొక్క రాజు పులకేసి II నిర్మించారు అని భావిస్తున్నారు, ఇది భద్రకాళి సరస్సు ఒడ్డున ఉంది. .హిందూ మత పురాణాల ప్రకారం, దేవత భద్రకాళి (లేదా కాళి) ని, తల్లి దేవతగా కొలుస్తారు మరియు ఈ దేవతను ఎనిమిది చేతుల్లో ఆయుధాలతో అలంకరించటం చూడవొచ్చు.

అల-ఉద్ దిన్ ఖిల్జీ మరియు అతని వారసులు పాలనా సమయంలో, ఆలయం శిథిలావస్థలో పడింది కాని, మరల నవీకరణ పనులు 20 వ శతాబ్దం మధ్య భాగంలో పూర్తి చేసారు.చాళుక్య రాజుల నిర్మాణ శైలి చూపే ముఖ్యమైన కట్టడాలలో ఒకటిగా ఉంది.

గుడి చుట్టూ ఉన్న సహజమైన రాళ్ళు మరియు సూర్యాస్తమయంలో కనిపించే ప్రకృతి సౌదర్యాన్ని చూడవలసిందే.

పద్మాక్షి దేవాలయం

పద్మాక్షి దేవాలయం 12వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో కట్టిన ఒక పురాతన నిర్మాణం. ఇది పద్మాక్షి దేవికి అంకితం చేసిన ఒక ఆలయం. ఇది మతపరమైన ప్రకృతి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను,నగరవాసులను ఆకర్షిస్తున్నది.

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీనిమీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూసి, ఇది జైనుల యొక్క స్తూపం అని, జైనుల దేవత క్దలలయకు అంకితం చేసారని ఒక నమ్మకం. సంవత్సరం పొడుగునా వొచ్చే సందర్శకులు ఈ స్తంభం యొక్క ఉపరితలాన్నిచూసి ఆశ్చర్యానందాలతో ఈ కట్టడం వెనుక ఉన్న పనితనాన్ని పొగుడుతుంటారు.

పాకాల సరస్సు

పాకాల సరస్సు ఒక కృత్రిమ (మానవ నిర్మిత) సరస్సు పాకాల అభయారణ్యంలో వరంగల్ నగరానికి దగ్గరగా ఉంది. కాకతీయ రాజు, గణపతిదేవుడు 1213 ఏ.డి. లో నిర్మించారని భావిస్తున్నారు, సరస్సు 30 చ. కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. పర్యాటకులు పాకాల సరస్సు యొక్క సుందర ప్రకృతి దృశ్యాలతో గంటలకొద్దీ గడుపుతారు. ఇది కొండ ప్రాంతం, దట్టమైన అడవుల మధ్యలో ఉంది మరియు ఇక్కడికి సంవత్సరం పొడుగునా వేలకొద్ది ప్రజలు వినోద స్థలంగా సందర్శిస్తారు.

పాకాల సరస్సు తీరము చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది, మరియు వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలం ఇక్కడ చూడవచ్చు. ఈ అభయారణ్యంలో ఛిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగు బంట్లు, కొండచిలువలు మరియు తోడేళ్ళువంటి జంతువులు పర్యాటకుల కన్నుల విందు చేస్తాయి. ఇది అంతా,839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది.

వేయి స్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి ఒక చారిత్రాత్మక హిందూ ఆలయం, ఇక్కడ విష్ణువు, శివుడు మరియు సూర్యుడు మొదలైన దేవతలు ఉన్నారు. కాకతీయ రాజు, రుద్ర దేవ 1163 ఏ.డి. లో దేవాలయం నిర్మించాడు మరియు ఈ మతపరమైన నిర్మాణానికి దివ్యంగా చెక్కబడిన వెయ్యి స్తంభాలును ఉపయోగించారు కాబట్టి దీనికి వేయి స్తంభాల గుడి అనే పేరు వొచ్చింది.

ఈ గుడిలో ఆకట్టుకునే తలుపులు, పైన పేర్కొన్న వేయి స్తంభాలు మరియు శిల్ప కళతో ఉన్న ఆలయ పైకప్పులు-వరంగల్ యొక్క సందర్శన స్థలాలో ఒకటిగా నిలిచింది. వెనకాల ఉన్న హనుమకొండ కొండలు ఈ ఆలయ అందానికి ప్రతీకగా నిలిచాయి. ప్రవేశద్వారం వద్ద ఉన్నఅతిపెద్ద నంది, అత్యంత పాలిష్ చేసిన నల్ల అగ్గిరాయి ఏకశిలా విగ్రహం నుండి చెక్కబడినది అని నమ్ముతారు.

వేయి స్తంభాల గుడి కాకతీయ రాజులకు ఉన్నశిల్పకళా తృష్ణకు ఒక ప్రతీక అని చెప్పవొచ్చు మరియు ఇది దక్షిణ భారతంలోనే చాల పురాతనమైనదని చెప్పవొచ్చు.

వరంగల్ కోట

వరంగల్ నగరంలోఅందరిని నిలువరించే ఆకర్షణలలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199 ఏ.డి. లో కోట భవనం నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 ఏ.డి. లో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి దానిని పూర్తి చేసింది.

ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది,ఈ కోట రెండు గోడలతో ఉన్న నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలను సంచి శైలిలో కలిగిఉన్నది. ఎవరైతే నిర్మాణ ఆసక్తి కలిగి ఉన్నారో, చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నారో ఈ కోటను సందర్శించి ఆ విజ్ఞానాన్ని పొందుతారు మరియు అన్ని వయస్సుల సందర్శకుల ఆదరణ పొందటంలో నిదర్శనంగా ఉంటుంది. ఈ రోజు వరకు కూడా సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు నిర్వచించేందుకు ఉపయోగింఛిన సున్నితమైన రాతి పని మరియు నమూనాలు స్పష్టంగా చూడవచ్చు.

గోవిందరాజుల గుట్ట

గోవిందరాజుల గుట్ట ఒక పవిత్ర స్థలం అని హిందూ మత అభ్యాసకుల విశ్వాసం. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ: కొండ (తెలుగు లో 'గుట్ట') ఎగువన రాముడి దేవాలయం, దిగువన హనుమంతుడి ఆలయం ఒక గొప్ప భక్తుడు అంకితం చేసాడు. ఈ కొండ పైకి ఎక్కడానికి వందల మెట్లు ఉన్నాయి కాని మెట్లు ఎక్కేప్పుడు చాల జాగ్రత్త వహించాలి.

శ్రీ రామనవమి పండుగనాడు,గోవిందరాజుల గుట్ట వేలకొద్ది భక్తులతో కన్నుల పండుగగా ఉంటుంది. విలువైన వస్తువులతో చేసిన ఒక పెద్ద రథం కొండ పైన ఉంది మరియు దీనిని వరంగల్ యొక్క హజారీలు నిర్మించి ఉంటారని నమ్ముతారు.

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్ వరంగల్ ఫోర్ట్ ఆలయానికి దగ్గరగా ఉన్నది మరియు విశ్రాంతి స్థలం కోసం చూసే అనేక సందర్శకులను ఆకర్షిస్తుంది. జింక, సాంబార్, జిరాఫీలు, సింహాలు మరియు లేడి యొక్క రాతి నిర్మాణాలు,ఇంకా అనేకమైనవి రాక్ గార్డెన్ లో చూడవచ్చు. శిల్పుల జీవన శైలి, వారి వ్యాపార శైలి ప్రతిబింబించే కట్టడాలు ఇంకొక నిదర్శనం. వివిధ రకాల గులాబీలు, లిల్లీస్ మరియు ఇతర పూల చెట్లు కూడా ఈ తోటలో ఉన్నాయి.

పిల్లలకు ఆటల మైదానాలు ఉన్నాయి మరియు ఇక్కడ సాయంకాలాలు విపరీతమైన నగర జనసందోహం, పర్యాటకులతో నిండి ఉంటుంది. ప్రకృతి ఆసక్తి ఉన్నవారు లేదా విశ్రాంతి తీసుకునేవారు తప్పనిసరిగా ఈ అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి.

వరంగల్ ప్లానిటోరియం

వరంగల్ ప్లానిటోరియం ( ప్రతాపరుద్ర ప్లానిటోరియం అని కూడా పిలుస్తారు) వరంగల్ లో ఉన్నది మరియు సమాజంలో ఖగోళశాస్త్రం మీద అవగాహన సృష్టించటం దీని లక్ష్యం. ప్రతిరోజు ఇక్కడ విశ్వంలో జరిగే వింతలను, వాస్తావాలను, విద్య మరియు వినోదం కలిపి ప్రదర్శనలను నిర్వహిస్తారు.

వరంగల్ ప్లానిటోరియం ముఖ్యంగా యువ తరంలో, శాస్త్రీయ ఆలోచనలను ప్రస్ఫుటింపచేస్తారు మరియు ఉత్సాహవంతులైన పిల్లలకు ఆదర్శ వినోద యాత్రగా ఉంటుంది. ఎండాకాలంలో మధ్యాహ్న సమయం ప్లానిటోరియంని సందర్శిచటం ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఎండవేడిమిని తప్పించుకోవొచ్చు మరియు సాయంకాలం షో తరువాత బైట తిరగటం మంచిది.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate