పరమాణు నిర్మాణం
పదార్ధము అతిచిన్న కణాలచేత నిర్మితం అవుతుంది. ఈ కణాల మద్య దూరము, కణాల మధ్య ఉండే ఆకర్షణ బలాలు పదార్ధ స్థితిని బట్టి మారతాయి. వీటిని అనుసరించి పదార్ధ స్థితులను మూడు రకాలుగా వర్గీకరించవచ్యును.
- ఘనస్థితి
- ద్రవస్థితి
- వాయుస్థితి
ఘనపదార్ధాలు
- ఘనపదార్ధాలలో అణువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది.
- అణువుల మద్య ఆకర్షణ బలాలు అధికంగా ఉంటాయి.
- నియమిత ఆకారము, ఘనపరిమాణము ఉండి స్థలాన్ని ఆక్రమిస్తాయి.
- ఘనపదార్ధాలు నియమిత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తాయి.
- ఘనపదార్ధాలను మరల మెత్తని ఘనపదార్ధాలు, కుప్పగా పోయగల ఘనపదార్ధాలు, కుప్పగా పోయలేని ఘనపదార్ధాలు అని వర్గీకరించవచ్చును.
ద్రవపదార్ధాలు
- ద్రవపదార్ధాలలోని అణువుల మధ్య దూరం ఘనపదార్ధాలకంటే ఎక్కువగానూ, వాయు పదార్దాల కంటే తక్కువగాను ఉంటుంది.
- అణువుల మధ్య ఆకర్షణ బలం ఘనపదార్ధాలకంటే తక్కువగానూ, వాయు పదార్దాలకంటే ఎక్కువగానూ ఉంటుంది.
- ప్రవహించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
- నిర్ధిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.
- నిర్ధిష్ట ఆకారాన్ని కలిగి ఉండవు. ఏ పాత్రలోపోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి.
- ఒత్తిడిన కలిగించి ఘనపరిమాణాన్ని తగ్గించే ప్రక్రియను సంపీడ్యత అంటారు.
- ఒత్తిడిని కలిగించి ద్రవపదార్ధాల ఘనపరిమాణాన్ని మార్చలేము కనుక వీటిని అసంపీడ్యాలు అంటారు.
వాయు పదార్ధాలు
- సాపేక్షంగా అణువుల మధ్య దూరం ఎక్కువగానూ, ఆకర్షణా బలాలు అత్యల్పంగానూ ఉన్న పదార్ధాలు వాయు పదార్ధాలు.
- వాయు పదార్దాలకు నిర్ధిష్ట ఆకారం, ఘనపరిమాణం ఉండదు.
- వాయు పదార్ధాల్లోని కణాలు నిరంతరం స్వేచ్చగా చలిస్తూ ఉంటాయి.
స్థితిమార్పు
- ఉష్ణోగ్రతను మార్చడం ద్వారా పదార్ధాలను ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చవచ్చును.
- ఉదాహరణకు మంచునువేడి చేసినపుడు ద్రవస్థితి (నీరు) లోకి మారుతుంది. నీటిని మరింత వేడిచేసినట్లయితే వాయు (భాష్ప) (ఆవిరి) స్థితిలోకి మారుతుంది.
పరమాణువు - అణువు
- పదార్ధము అతిచిన్నవైన అణువులు, పరమాణువులచేత నిర్మితం అని కణాదుడు ''వైశేషిక సూత్ర''అనే పుస్తకం లో భారతీయ మహర్షి చెప్పెను.
- పదార్ధము పరమాణువుల చేత నిర్మితము అని డెమోక్రటిస్ అనే గ్రీకు శాస్ర్తవేత్త చెప్పెను.
- పదార్ధములోని అతిచిన భాగాన్ని పరమాణువు అని పిలిచారు. కారణం పరమాణువు (ఆటం) అనే పదం గ్రీకు పదం నుంచి అవిర్భవించింది. గ్రీకు భాషలో ఈ పదానికి అర్ధం విభజింపవీలుకానిది అని.
డాల్టన్ పరమాణు సిద్ధాంతం
- పదార్ధము అతి చిన్న కణాలచేత నిర్మితమవుతుంది.
- ఈ చిన్న కణాలను పరమాణువులు అని పిలుస్తారు
- పరమాణువు విభజింప వీలుకాదు.
- ఒక మూలకానికి చెందిన పరమాణువులు అన్ని ఒకేలా ఉంటాయి.
- వేరు వేరు మూలకాలకు చెందిన పరమాణువులు వేరువేరుగా ఉంటాయి.
- పరమాణువులే రసాయన చర్యలలో పాల్గొంటాయి.
- పరమాణువుల కలయిక వలన సంయోగ పరమాణువులు ఏర్పడతాయి.
పరమాణువులోని మౌలిక కణాల ఆవిర్భావం
- పరమాణువులోని మౌలిక కణాల గూర్చిన పరిశోధనలకు 1878లో క్రూక్స్ జరిపిన ప్రయోగాలతో బీజం పడింది.
- క్రూక్స్ ఉత్సర్గనాళం అనే పరికరాన్ని తయారు చేశారు.
- రెండు వైపులా మూయబడిన ఒక గాజు గొట్టం రెండు చివరలా రెండు ఎలక్ర్టోడుల అమర్చబడి, లోపలి గాలి పీడనాన్ని మార్చడానికి ఒక వాయు రేచక యంత్రంతో కూడిన అమరికయే ఉత్సర్గనాళం.
- దీనిలో గరిష్టంగా 10,000వోల్టుల విద్యుత్‌ను, 0.001mm పీడనాన్ని కలిగించవచ్చు.
- 0.001 mm పీడనం వద్ద క్రూక్స్ ఆకుపచ్చని రంగు చారలను గమనించెను.
ఋణ ధృవకిరణాలు
- 1897వ సంవత్సరంలో జేజే.థామ్సన్ అనే శాస్ర్తవేత్త క్రూక్స్ ఉత్సర్గనాళికతో చేసిన ప్రయోగాలలో భాగంగా ఋణ ధృవకిరణాల ఉనికిని గుర్తించారు.
- ఋణ ధృవ కిరణాలు ఉత్సర్గనాళంలోని ఋణ ధృవం నుంచి ధన ధృవం వైపుకు ప్రయాణిస్తాయి.
- ఇవి జింకుసల్ఫైడ్ తెరమీద ప్రతిదీప్తిని కలుగచేస్తాయి.
- ఋణ ధృవ కిరణాలు ఋజుమార్గంలో ప్రయాణం చేస్తాయి.
- విద్యుత్ క్షేత్రంలో ఆనోడువైపుకు ప్రయాణిస్తాయి.
- అయస్కాంత క్షేత్రంలో కాథోడు వైపుకు ప్రయాణిస్తాయి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.