హోమ్ / విద్య / బాలల ప్రపంచం / పర్యావరణ విద్య
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పర్యావరణ విద్య

పర్యావరణ విద్య.

ప్రకృతిలోని పంచభూతాలతో (గాలి, నీరు, నేల, వేడి, ఆకాశం, వాతావరణంలోను) మననివాసం, నమచుట్టూ, ఉండే పరిసరాలు, మనబడి, బడి చుట్టుపక్కల ఉండే పరిసరాలు, అలాగే మన గ్రామం, మండలం, జిల్లా, దేశం, చెట్లు, జంతువులు, పశుపోషదులు, కొండలు, నదులు, సముద్రాలూ ఒకటేమిటి ఇవి అన్ని కలిపితే మన పర్యావరణం అంటాం.

మానవ హతికి భూమి, నీరు గాలి అనే మూడు ముఖ్యవనరులు అందుబాటులో ఉంటాయి. జనాభా, వనరులు, పర్యావరణం మధ్య పరస్పర సంబంధాలు చాలా క్లిష్టమైనవి. పెరుగుతున్న జనాభా మౌలికవసరాలను తిర్చుదాం అనేది ఆరోగ్యమైన పర్యావరణం మీద ఆధారపడి వుంటుంది.

మర్యావరణం మానవ ఉనికికి, జీవనానికి మాత్రమే కాదు, అభివృద్ధికి కూడా మూలాధారం. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన సమస్త ముడిపదార్ధాలేకాక (ఖనిజాలు, వృక్ష జంతు వుత్పత్తులు), అవసరమైన సేవలు (వర్షపాతం, నెలలోని పోషకాలు, గాలి పునరుద్ధరణ) పర్యావరణం నుంచే అందుతాయి.

ఒక దేశం లేదా ప్రాంతం యెక్క అభివృద్ధి గురించి చెప్పాలన్న అంచనా వేయాలన్న అక్కడి రోడ్లు, కట్టడాలు, డ్యామ్ లు, పరిశ్రమలు, ఉద్యోగ, వ్యాపార అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీటివల్ల వస్తువు, సేవల ఉత్పత్తి, సరఫరా సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమాలు, పర్యావరణంలో వనరులను అధికంగా వెలికితీయడమేకాక హానికరమైన పదార్ధాలను విడుదల చేస్తున్నాయి.

ఉత్పత్తి, సేవల వినియెగం అధికం కావడాన్ని, కట్టడాలను, నిర్మాణాలను అభివృద్ధిగా పరిగణిస్తున్నారే తప్ప, సహజవనరుల సంరక్షణను, మెరుగుదలను, దానికి అవసరమైన అవగాహన కల్పించడాన్ని అభివృద్ధికి అవసరమైన ఒక ముఖ్య అంశంగా గుర్తించడంలేదు. పర్యావరణం షిణీంచిపోవడం లేదా కలుషితం కావడం వంటి వాటిని బశిష్యత్తులో అభివృద్ధిని కుంటుపరిచేవిగా పరిగణించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా నేడు గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పోరా తరిగిపోవడం, జీవన వైవిద్యం అంతరించపోవడం వంటి పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటున్నాం. అంతేకాక గాలి, నీరు, నేల కాలుష్యం, నెలకోత, ఆవాసాలు దెబ్బతినడం వంటి స్ధానిక సమస్యలు ప్రజల్ని సతమతం చేస్తున్నాయి. కావు, పర్యావరణం, ఆవాసాలు, పర్యావరణ సమస్యల పై అవగాహనా కలిగించుటకు; పర్యావరణ సమస్యలు - అభివృద్ధి సమస్యలు రెండు విభిన్నంకావని, రెంటికి మధ్యగల సంబంధాన్ని గుర్తించేలా, విద్యార్థులకు 9, 10 తరగతులలో పనివిద్య - ప్రధానాంశం.

ప్రకృతి రీత్యా మారె బూతువులు, కాలాలను బట్టి పెరిగే వృషలు సహజంగా ఉండే నదులు, సముద్రాలూ, కొండలు వేటికవే ప్రత్యేక లక్షణాలను కల్గిఉంటాయి. పర్యావరణంలో మనుగడ సాగించే జీవులన్నీ సమఠుల్యాన్ని పాటిస్తాయి. కానీ మనిషి తాను చేసే స్వార్ధపూరిత పనులవల్ల పర్యావరణాన్ని కాలుష్యపరుస్తున్నాడు.

మన పాఠశాల, నివసించే ఇల్లు, చుట్టుపక్కల ప్రదేశాలు, గ్రామాన్ని పరిశీలించినట్లయితే మనమే విధింగా ఆహ్లాదకర వాతావరణం కల్పించగలమే చూడవచ్చు. మొక్కలను పరిరశించడం, మొక్కలను పెంచడం, పెరటితోట ఏర్పాటు, గ్రామాలలో కొంత స్ధలాన్ని ఉద్యానవనాభివృద్దికి,  పట్టణాలలో కొన్ని కూడళ్ళలో చెట్ల పెంపకం చేపట్టడం వంటివి.

మన పాఠశాలలోని ఆవరణలో చెట్లను పెంచడం, వర్షాకాలంలో కొత్త మొక్కలని నాటడం, విత్తనాలు జల్లడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పాఠశాల చూడముచ్చటగా ఉండడమేకాక చల్లని గాలిని ప్రథంత వాతావరణాన్ని కల్పిస్తుంది. పిల్లలు బడికి రావడానికి ఆనందంగా, అహెలోదకామ్రంగాను ఉండే వాతావరణంలో ఆకర్షితులవుతారు.

బడితోట పెంపకంలో తీసుకునే సోపానాలు, జాగ్రత్తలు మెళకువలు గురించి విద్యార్థులకు తెలియజేయాలి. బడి ఆవరణలో ప్రహరీ చుట్టూ వేసే పెద్ద మొక్కలు వాటిని పశువుల బారినుండి రాశించడానికి కంచె ఏర్పాటు చేయడం. నీటిపారుదల ఏర్పాటు వంటివి విద్యార్థులకు చెప్పాలి. ఏ ఏ మొక్కలను పెంచాలో నిర్ణయంచుకోవాలి. బడి ప్రారంభంనుండి బడి మూసివేసే రోజు వరకు విద్యాసంవత్సరంలో బడితోటకు చేపట్టవలసిన కార్యాచరణాన్ని పూర్తిచేయాలి.

పర్యావరణం - కాలుష్యం

"ఉండకూడని పదార్ధం ఉండకూడని పరిమాణంలో ఉండకూడని చోటులో ఉండడమే కాలుష్యం" గాలి, నీరు, శుబ్ధ కాలుష్యాలతో మన నిత్యజీవితంలో అనేక బాధలు పొందుతున్నాం. ఆరోగ్యం పాడవుతుంది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం పూర్తిస్ధాయిలో దెబ్బతిమ్టుంది. ప్లాస్టిక్ సంచులలో ఆహార పదార్ధాలను ఉపయేగించిన తర్వాత బయట చేత్తులో వేసినప్పుడు పశువులు వాటిని నేరుగా తీసుకోవడంవల్ల వాటి జీర్ణాశయంలో ప్లాస్టిక్ పేరుకుపోయి అంతరంగ వ్యవస్దలం పాడైపోయి వాటి మరణానికి కారణమవుతుంది.

అలాగే భూమిలో పడవేసిన ప్లాస్టిక్ పదార్ధాలు ఎంతోకాలం వరకు అలాగే ఉండడంవల్ల భూమి పై ప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది. మురుగునీటి కాల్వలలోను, మంచినీటి చెరువుల్లోని ఇవి చేరి నీటి ప్రవాహానికి ఆటంకపరుస్తాయి. ముంపులు వస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించని ప్లాస్టిక్ వస్తువులలో నిల్వచేసిన ఆహారపదార్ధాలు విషపూరిత రసాయనాలతో కలుస్తాయి. వ్యర్ధపదార్ధాలను మరల మరల శుద్ధిచేసి ఎరువుల రూపంలో వాడేటట్లుగా ప్లాస్టిక్ వినయేగపడదు.

ప్లాస్టిక్ వినయేగించకపోవడమే దీనికి పరిష్కారం. క్రమానుగత చర్యల ద్వారా భూమిలో కలిసిపోయే వస్తువుల వినియెగాన్ని ప్రోత్సహించాలి. నిరాడంబరంగా జీవించడం, పొదుపుగా వాస్తు వినియెగం చేయాలి. వస్తూత్పత్తులు పెంచాలి. వదిన వాటిని వేరొక రూపంలో మార్చుకునే ప్రక్రియలు చేయాలి.

మనమేం చేయాలి

చెట్లను పెంచడం, వేసుకునే దుస్తుల్లో మార్పులు, ద్రవపదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం, సముద్ర తీరా ప్రాంతాల్లో అడ్డుకట్టలు, గోడలు మెదలైనవి నిర్మించడం ద్వారా వాతావరణ వైపరీత్యాల నుండి రక్షణ. తుఫాను / వరదల హెచ్చరిక వ్యవస్ధను మెరుగుపరచడం, మారుతున్న బూతువులకు అనుగుణంగా పంటలను పండించడం. జంతువులు, రాశులు అనుకూలమైన ప్రదేశాలకు వలస వెళ్ళడానికి వీలుగా ఆ మార్గాలను సంరసించడం, మెరుగుదారచడం, నీటిని సమర్ధవంతంగా వినియెగించడం ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరకు ప్రయత్నం చేయడం, సండ్రదాయేతర ఇంధన వనరులను వినియెగించుకోవడం.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాలలో ఈ క్రైంద కార్యక్రమాలు నిర్వహించాలి.

బడితోట

ఒక్కొక్క కోపానంగా పనులు చేసుకోవాలి. ముందుగా స్ధలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసిన స్ధలాన్ని తవ్వ గుల్లబారేటట్లు చూసుకోవాలి. విత్తనములు సేకరణం, నాలను దున్నిన ప్రాంతాన్ని మాదులుగా చూసుకోవాలి. ప్రతి మదిలోని కావలసిన నారు వేసుకోవాలి. వచ్చిన నారును సిద్దంచేసిన మదిలో నాటుకోవాలి. వేర్వేరు నరులకు వేర్వేరు ప్రాంతాలను ఎన్నుకోవాలి. ఆ మొక్కలను సురాశితంగా ఉంచడం కోసం కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఏపుగా బలంగా పెరగడానికి సహజసిద్ధమైన ఎరువులను వాడాలి. సేంద్రియ ఎరువులకొరకు కంపోస్టు ఎరువును బడిలోనే సిద్ధం చేసుకోవాలి. అటవీశాఖ ఉద్యానవన విద్యాగం వారి ఉచిత మొక్కల పంపిణీని సద్వినియాగం చేసుకోవాలి. పూలు, కాయలు ఇచ్చే మొక్కల సంరక్షణ భాధ్యతను ప్రతి తరగత విద్యార్థిని / విద్యార్థులకు జట్లుగా నియమించి నిర్వహింపచేయాలి. నీటిని పారించడానికి, నీటిని పోయడానికి కూడా విద్యార్థి జుట్టు కృత్యంగా చేయాలి.

వారానికి ఒక తరగతి కేటాయంచిన కాలనిర్ణయ పట్టిక ప్రకారం బాధ్యతలను ప్రతి ఒక్కతరగతి విద్యార్థి చేసేటట్లు చూడాలి. ఏ తరగత వారికి ఏ మొక్కల బాధ్యత పెట్టారో యేక్కలు ఉన్న ప్రదేశానికి ఆ తరగతి పేరు, విద్యార్థిపేర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలి. అంటే విద్యార్థులు తరగతి వారీగా జట్లలో ప్రతి మొక్కను దత్తత తీసుకునేటట్లు ప్రణాలికను రూపొందించుకోవాలి. ఆయా తరగతి ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ఈ తోటపని నిర్వహణ ఉండాలి. నీటి పారుదల కొరకు బడిలో బోరింగ్ ఏర్పాటు / నీటితొట్టె / మున్సిపల్ వాటర్ వచ్చే ఏర్పాటును కల్పించుకోవాలి. నీటి గొట్టాల ద్వారా మొక్కలకు నీరు అందేటట్లు చూడాలి, బడి పని దినములలో విద్యార్థులు చేసే పనులకు తరగతి నాటకాన్ని నియమించాలి. బడి సెలవు దినాలలో ప్రత్యక ఏర్పాట్లు, చేసుకోవడం తప్పనిసరి. సెలవులలో బడి చుట్టపక్కల, బడికి దగ్గరగా గల విద్యార్థులను ఈ పనిని అప్పచెప్పడం, గ్రామాలలోని కొంతమంది యువకులకు యవజన సంఘాలద్వారా భాద్యతనివ్వడం. సమాజ భాగస్వామ్యంతో ఈ తోటపని నిర్వహణ నిర్విగ్నిగా కొనసాగగలడు.

కంపోస్ట్ ఎరువు తయారీ

బడిలో వచ్చే చెత్తను వినియగించి కంపోస్ట్ ఎరువు తయారుచేయవచ్చు. తరగతిగదిని పరిశుభ్రంగా ఉంచడంలోను పాఠశాల ఆవరణను శుభ్రంచేయడంలోనూ తడి, పొడి చెత్తలు ఉంటాయి. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి, బడిలో ఒక మూలా ఆవరణలో గోతిని తవ్వి తాడిచెత్తను అందులోవేసి మట్టిపారవేసి, మరల చెత్తను, మట్టిపారేసు కప్పి ఉంచుతూ కోతిని మట్టితో కప్పివేసినట్లయితే కొద్దికాలానికే అది కుళ్ళి సహజమైన ఎరువుగా మారుతుంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ముందుగా మన బడిలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మరుగు దొడ్డలో నీటివాడకం పరిశుభ్రంగా ఉండేట్లుట్లు చూడాలి. మురుగు ప్రదేశాలలో డి.డి.టి. వేయడం . రాములు పెరగకుండా మురుగు కుంతలలో కిరసనాయిలు జల్లడం వంటిని చేయాలి.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధనా శిక్షణ సంస్ధ

2.94117647059
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు