హోమ్ / విద్య / బాలల ప్రపంచం / పౌష్టికాహార విద్య
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పౌష్టికాహార విద్య

పౌష్టికాహార విద్య.

భారతదేశం ప్రధానంగా వ్యవసాయకదేశం. భిన్న జాతులు, తెగులు, మతాలు, కులాల వారీగా ప్రజలు జీవిస్తున్నారు. రకరకాల పులా కదంబమాలవలెనే భారతీయత అనే సూత్రంలో భారతదేశ ప్రజలందరూ ముడివేయబడ్డారు.

మరి భారతీయ జీవన విధానంలో ఆహారం ప్రముఖపాత్ర వహిస్తుంది. దేశ, ప్రాంత, కులాల వారీగా విభిన్న ఆహారపుటలవాట్లు ఉన్నాయి. సహజసిద్ధంగా లభించే ఆహారం. ఆయాప్రాంతాలలో, కలల్లో లభించే పదార్ధాల పై ఆహారపు అలవాట్లు ఏర్పడ్డాయి.

జీవన పోరాటంలో ఆహారం కోసం జరిఫైనవే ఎక్కువగా చరితలో కన్పిస్తాయి. శాఖకురాలు, మాంసాహారం తీసుకువే వారిలో పూర్తి శాకాహారులు కొందరు, మిశ్రమహారులు మరికొందరు ఉంటారు.

వరి అన్నం, గోధుమ, రొట్టె, జొన్న, సజ్జ, రాగి రొట్టెలు ప్రధాన ఆహారంగాను, ఆకుకూరలు, కూరగాయలు మెదలైనవి వాటిలో కలుపుకు తినేవిగాను ఉంటాయి. అంతేగాకుండా పాపుసింహాలలో కందులు. మినప. పెసర, శనగ ఏదేని ఒక పప్పును కూడా వండుకుంటాము.

వండి తినేవి కొన్ని, అలాగే వండకుండానే పచ్చిగా తినేవి (అరటి, జమ, యాపిల్, బత్తాయ్య్ మొదలగు పండ్లు) ఎండు గింజలు (బాదాం, జీడిపప్పు, కిస్ మిస్ మెదలైనవి) పశువులనుండి లభించే పాలు, పాల సంబంధిత పదార్ధాలు తీసుకుంటాము.

నువెనిచ్చే నూనె గింజలు (పల్లీలు, నువ్వులు, ఆవాలు మొదలగునవి) వాటి ఉత్పత్తులను కూడా ఆహారంగా తీసుకుంటాము.

మనం తీసుకువే ఆహారం మిశ్రమాహారంగాను, మన శరీరపు ఎదుగుదలకు బలానికి అభివృద్ధికి కావలసిన పోషకాలతో కూడినదై ఉండాలి. ఈ ఆహారపదార్ధాల నుంచి పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్ధాలు, ఖనిజ లవణాలు లభిస్తాయి. మాంసాహారానికి సంబంధించి, గుడ్లు, చేపలు, మాంసం మెదలైన వాటినుండి కావలసిన పోషకాలు లభిస్తాయి.

విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఆదుకోవాలి. ఉత్సాహంగా చురుకుగా ప్రతి పనిలోనూ పాల్గొనాలంటే వారు తీసుకువే ఆహారం బలవర్ధమైనదిగా ఉండాలి.

ఆహారపు వనరులు

ఆదిమానవుడి ప్రకృతిలో లభించే ఆహారాన్ని వేటాడడం, సేకరించడం ద్వారా భూమిలో దొరికే దుంపలను ఆహారంగా తీసుకునేవాడు. నాగరికత పెరిగినకొద్దీ పచ్చిగా తినే దఃసనుండి పాడించుకొని, సాగుచేసే పద్దతులను వినియెగించి వండుకుని తినే అలవాటుగా మార్చుకున్నాడు. పశువులను మచ్చిత చేసుకొని వాటి నుండి మాంసాన్ని పాలసంబంధిత పదార్ధాలను వినియెగించుకోవడం నేర్చుకున్నాడు.

నిల్వచేసుకుని వినియెగించుకునే విడిగానాలను అవలంచించడం ద్వారా ఆహారపదార్ధాలను భద్రపరచి వాడుకుంటూన్నాడు. మనకంటే అన్ని వినియెగంలోకి వచ్చాయి. సంతలు, అంగళ్ళు రవాణాసౌకర్యాలు అభివృద్ధి చెందడంవల్ల దూరప్రాంతాలనుండి కూడా దొరకని ఆహారం తినే వీలుకలుగుతుంది.

ప్రకృతిలో సహజసిద్ధంగా కొన్ని మొక్కలు పొలాల్లో పెరుగుతుంటాయి. ఆ మొక్కల చిగుళ్ళు పల్లెల్లో వండుకోవడం సర్వసాధారణం. పొన్నగంటి, పిండికూర, దేవవారికురా, పెద్దపల్లెరుగాయల కూర, తుమ్మికురా, చింతచిగురు మెదలైనవి. అలాగే మునగాకు, చింతచిగురును కూడా ఆహారంగా తీసుకుంటాం, ఎక్కువ డబ్బుతో ఆహార పదార్ధాన్ని కొని త్తింటేనే గొప్పగా భివించకుండా చౌకగా లభించే పోషక విలువలు గల ఆహారాన్ని తినడానికి ఆసక్తిని పెంచుకోవాలి.

ఈ అధ్యాయంలో పిల్లలకు లభించే వనరు. వండుకుని తివేని, వండకుండా తినేవి. సహజంగా దొరికేవి, వండించకుండానే ప్రకృతిలో ఖర్చులేకుండా దొరికేవి. తినేపదార్ధాల గురించి తెలుసుకోవడం, విల్వలు, భద్రపరిచే విధానాలు, పానీయాలు తయారీలు వంటివి తెలుసుకుంటారు.

పోషకాహారాన్ని నిల్వచేయడం

నిల్వచేయడం అనేది మన సంస్కృతిలో భాగం. ప్రతి ఇంటిలోనూ ఈ విషయాలు వారసత్వంగా, ఆచారంగా ఉంటాయి. మన గ్రామీణులు ఆహారపదార్ధాలను నిల్వచేయడం అనేది అలవాటుగా చేస్తారు. దీనివలన స్వయం సమృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా పట్టణాలలోని, నగరాలలోని ధర్నాలు, హర్తాళ్లులాంటివి సంభవించినప్పుడు ఈ నిల్వ ఆహారపదార్ధాలను నీవియెగించుకోవచ్చును.

పరిసర ప్రాంతాలకనుగుణంగా పంటలు పండుతాయి. కాలానుగుణంగా పండే ఆహారధాన్యాలు పప్పుధాన్యాలు మన ప్రాంతంలో దొరికే ఆహారాలను కావలసినప్పుడు వినియెగించుకోవాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. నిల్వచేయడం  ఈ కింది విధంగా ఉంటుంది.

  1. వండిన పదార్ధాలను పదవంకుండా కొన్ని గంటలపాటు లేదా ఒక రోజు వ్యవధిలో నిల్వ / తాజాగా ఉంచడం కోసం.
  2. చాలాకాలం అంటే ఏడాది అంతకంటే ఎక్కువకాలం నిల్వచేసే పంతగింజలు.
  3. పచ్చళ్ళు, పొదలు, వరుగులు, అప్పడాలు, జాం లు, పంద్లరసాలు మొదలగు వాటిని నిల్వచేయడం.

వండిన పదార్ధాలను చేసిపోకుండా ఉంచాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలను మెళకువలను తీసుకోవాలి. తగినంత నీరు పోసి ఉడికించడం, ఉడుకుతున్నపుడు పాత్రలపై ముఠాలు పెట్టడం, పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచడం, తగినంత ఉప్పు, కరం వేయడం చేయాలి. మాటిమాటికి వేడి చేయరాదు.

భద్రపరచడానికి ఉపయెగించే పాత్రలు - కుండలు, జాడీలు, డబ్బాలు మొదలగునవి పొడిగా ఉంచాలి. ముఠాలను గాలిచొరకుండా బిగించాలి. చింతపండు వంటి వాటిలో గింజలను తీసివేసి ఎండలోబెట్టి చల్లారాక డబ్బాలలో ఉంచాలి. మిరపకాయలు వంటి వాటిని కూడా తేమలేకుండా ఎండలో ఉంచి వేడి తగ్గిన తర్వాత తగిన పాత్రలలో, ముఠాలు బిగించి ఉంచాలి. అలాగే బియ్యం, పప్పులు తగిన జాగ్రత్తలతో నిల్వచేసుకోవాలి.

పచ్చళ్ళకు నాణ్యమైన పదార్ధాలను మాత్రమే వినియెగించి తగినంత ఉప్పు, కరం, నూనెను వినియెగించి భద్రపరచుకోవాలి. వడియాలు, అప్పడాలవంటి వారిని నిల్వచేయడంలో ఏ పదార్ధాలైతే పాడవకుండా ఎక్కువ కలం ఉంటాయే వాటితో మాత్రమే తయారుచేసుకోవాలి.

పండ్లరసాలను, జాం లను తయారుచేయడంలో మెళకువలను పారించి భద్రపరచుకోవాలి. ధాన్యాలను గుణాలు, గేదెలు, కుండలు, వడ్లపూరిల వంటి వాటిలో నిప్వచేస్తారు.

అవసరాలకనుగుణంగా ఆహారపదార్ధాలను ఉపయెగించుకోవడానికి లభించే కాలంలోని కొన్ని కూరగాయలను కాడిని ముక్కలుగా చేసి ఉప్పుతో ఉరివేసి తర్వాత ఆరబెట్టి నిప్వచేస్తారు.

ఈ నిల్వ పదార్ధాలను ఆహారపదార్ధాల విరివిగా దొరకని కాలంలోనూ, చౌకగా దొరకనప్పుడు, విందులు, నీహార సమయములలో వేడుకలలోను వినియెగించుకుంటాము.

ఆహారపదార్ధాల పై అవగాహన  కొరకు మాత్రమేగాక శ్రమజీవనం, శ్రామికగౌరవం పెంపొందడానికి విద్యార్థుల ద్వారా కొన్ని మొక్కలను ఆకుకూరలను అలంకరణగా - ప్రత్యేక రోజులు, జాతీయ దినాలలోను ప్రదర్మించడానికి వీలుగా ఆయా రోజులకు నెలరోజులు ముందుగానే దేవగతం వంటి పాత్రలను మట్టిలో రాసిన చోట ధనియాలు, మెంతులు, నవధాన్యాల వంటి వాటిని జల్లి మెలకలొచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోవడం, వేర్పడం చేయాలి. తదుపరి బాగా ఎదిగిని ఆయా ఆకుకూరలను జట్లు పిల్లలచే కట్టలుగా కట్టించడం చేయాలి. పోషక విలువలను తెలపాలి.

మనం తినే ఆహారం - మన ఆరోగ్యం పై జాగ్రత్తలు - కీలకాంశాలు

వండడానికి ముందు గింజధాన్యాలను మాటిమాటికి కడగకండి. కూరగాయలను కడిగాక ముక్కలుగా తరగండి. ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువ సేపు నానబెట్టకండి. వండిన తర్వాత మిగిలిన నీటిని చారు, పులుసు వంటి వాటిలో వినియెగించండి. ఆహారం వండుతున్నప్పుడు గిన్నె పై మూత పెట్టండి. ఆవిరితో, ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం మంచిది. పప్పులు, కూరగాయలను వండడానికి సోడాను వాడకండి. వాడిగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడిచేయకండి. ఆహార పదార్ధాలను నమ్మకమైన చోటనుండి బాగా పరీక్ష చేసిన తర్వాత కొనండి. వాడడానికి ముందు పండ్లను శుభ్రంగా కడగండి. ఆహారపదార్ధాలను, వండిన ఆహారాన్ని కూడా సరియైన విధంగా నిల్వఉంచి, సుష్మాక్రములు, ఎలుకలు, కీటకాల బారినుండి కావడండీ. శారీరక పరిశభ్రత పాటిస్తూ ఆహారం నిల్వచేసే వందే ప్రదేశాలను శుభ్రంగా సురాశితంగా ఉంచండి.

బజారులో దొరికే నిల్వ ఆహారపదార్ధాలలో రసాయన పదార్ధాలు, వాసననిచ్చే కొన్ని కృత్రిమ రంగులు ఉంటాయి. వీటి వాడకాన్ని ప్రోత్సహించరాదు. బజారులో ఎక్కువకాలం నిల్వ ఉంది. బాగా శుద్ధిచేసి తాయారు చేయబడిన కొవ్వుశాతం, ఉప్పు, చక్కెరలు అధికంగా ఉన్న పదార్ధాలను తినడాన్ని ప్రోత్సహించరాదు. పట్టణ ప్రాంతాల్లో అధికంగాను, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగాను ఇవి లభిస్తున్నాయి. కోకోకోలా వంటి శీతలపానీయాలను తాగడాన్ని ఆటంకపరచాలి. పోషక విలువలు తక్కువ. కేలరీల విలువలుకుని పదార్ధాలు చూడడానికి ఆకర్షణీయమైన రాంఫులలో ఉండే పదార్ధాలను తినదాన్నని తగ్గించాలి.

ప్యాకేజి చేయబడ్డ పదార్ధాన్ని వాడేముందు రెఫర్ పై దాన్ని నిల్వచేయదగిన కాలం, అందులో చేర్చబడ్డ ఇతర పదార్ధాలను గురించి సమాచారాన్ని చూసి మాత్రమే వినియెగించండి.

పాల ఉత్పత్తలు, రెడీమిక్స్ లు కంపాషనరి మిఠాయిలు, బేకరీ, ఉదయం పూత ఫలహారాలు, తమథిసి వేయబడ్డ పదార్ధాలు డబ్బాలలో నిల్వచేసిన ప్రాసెస్ చేయబడి పదార్ధాలను బోజమా సమయంలో తినకూడదు.

తినడానికి సిద్ధంగా ఉండే రూపంలో ఇంటిలో తయారుచేసునే పద్దతులను సులభతరం చేయడానికి సాంకేతికమైన మార్పలతో రూపొందించబడిన పదార్ధాలను ప్రాసెస్ చేయబడ్డ ఆహారపదార్ధాలు అంటారు.

రోజువారీ ద్రవ అవసరాలకు ఆరోగ్యకరమైన సురశిత మంచినీటిని త్రాగాలి. కలుషిత నీరు అని అనుమానమున్నప్పుడు వాటిని మరగకాచి వడబోసి చల్లార్చి తాగాలి.

సాంప్రదాయికంగా ఇళ్ళలో తయారుచేయబడ్డ ఆహారాన్ని తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారంగా మిశ్రమ దినుసులతో చేసిన వంటకాలను పిల్లలు తినేటట్లు చూడాలి.

జొన్న, గోధుమ, బెల్లం, వేరుశనగ, నువ్వులు, నెయ్యేవంటి వాటితో కలిపినవి. పెసర / కంది / బియ్యం / గోధుమ కలిపినా వంటకం మెదలైనవి. కూరగాయల సుప్, జవలు కూరగాయలు, ఆకుకూరల రసాలు, రాగి  జావా మెదలైనవి ఇవ్వాలి.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధనా శిక్షణ సంస్ధ

3.04347826087
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు