অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నిత్యజీవితంలో విజ్ఞాన శాస్త్రం A

నిత్యజీవితంలో విజ్ఞాన శాస్త్రం A

 1. ప్ర: పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?
 2. ప్ర: నున్నటి చదునైన ప్రదేశాల్లో కూడా ఉడుము సులభంగా పరుగెత్తడమే కాకుండా గట్టిగా పట్టుకుని ఉండగలదు. ఇదెలా సాధ్యం?
 3. ప్ర:సోలార్ బ్యాటరీ ఎలా పని చేస్తుంది?
 4. ప్ర: వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?
 5. ప్ర : గాయం ఎలా మానుతుంది ?
 6. ప్ర: జిరాక్స్‌ యంత్రం ఎలా పనిచేస్తుంది?
 7. ప్ర: గ్రహణాలు ఎలా ఏర్పడతాయి?
 8. ప్ర: కొందరి కళ్లు నీలం రంగులో ఉంటాయి. ఎందుకు?
 9. ప్ర: శూన్యంలో మంట ఎలా ప్రవర్తిస్తుంది?
 10. ప్ర : వరదలు ముందే ఎలా పసిగడతారు?
 11. ప్ర:ఫూల్స్ డే ఎలా ఏర్పడింది?
 12. ప్ర: శత్రువుల బారి నుంచి తేనెటీగలు తమను తాము ఎలా రక్షించుకుంటాయి?
 13. ప్ర: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?
 14. ప్ర: కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి?
 15. ప్ర: తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది? How is Cyclone forming ?, తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?
 16. ప్ర: గాయాలను వైద్యులు హైడ్రోజన్‌ పెరాక్సైడుతో లేదా స్పిరిట్‌తో శుభ్రపరుస్తారు. ఎందుకు?
 17. ఫ్ర : ఆకాశములో మెరుపులు ఎలా వస్తాయి?
 18. ప్ర: ఆక్సిజన్ ఎలా ఏర్పడింది?
 19. ప్ర: ప్లాస్టిక్‌ను ఎలా తయారు చేస్తారు?
 20. ప్ర: వర్షం ఎలా ఏర్పడుతుంది? దాని వెనుక ఉన్న ప్రకృతి మార్పులు ఏమిటి?
 21. ప్ర: ద్వీపాలు ఎలా ఏర్పడతాయి?
 22. ప్ర: wifi సాంకేతికత గురించి విన్నాను. అదెలా పనిచేస్తుంది?
 23. ప్ర: జనవరి కి ఆపేరు ఎలా వచ్చింది?
 24. ప్ర: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?
 25. ప్ర : మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?
 26. ప్ర: ఆక్సిజన్‌ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు?
 27. ప్ర: మన శరీరంలో ఎన్ని కణాలుంటాయి? కణం ఎంత పరిమాణంలో ఉంటుంది?
 28. ప్ర: పాదరసం తయారీ ఎలా జరుగుతుంది?
 29. ప్ర : మనము కొన్న బంగారం లో అసలెంత కొసరెంత?
 30. ప్ర : చీము ఎందుకు వస్తుంది?
 31. ప్ర: ఇసుక ఎలా ఏర్పడుతుంది?
 32. ప్ర: నక్షత్రాలు, సూర్యుడు ఎలా ఏర్పడ్డాయి?
 33. ప్ర: ఒకోసారి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఇది ఎలా పని చేస్తుంది?
 34. ప్ర: గుడ్లలో పిండ రూపంలో ఉండే పక్షిపిల్లలు ఎలా శ్వాసిస్తాయి?
 35. ప్ర: కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్‌ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?
 36. ప్ర: మిణుగురు పురుగుల ఆహారం ఏమిటి? ఎలా సంపాదించుకుంటాయి?
 37. ప్ర: శూన్యంగా ఉండే రోదసిలో అంతరిక్ష యాత్రికులు గాలిని ఎలా పీలుస్తారు?
 38. ప్ర: పక్షులు, కొన్ని జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటాయి?
 39. ప్ర: రాత్రి హాయిగా నిద్ర పోవాలంటే ఏమి చేయాలి?
 40. ప్ర: బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?
 41. ప్ర: పిడుగు ఎలా ఏర్పడుతుంది ?
 42. ప్ర: పిడుగు పాటు షాక్ నుండి తప్పించుకునే మార్గాలేమయినా ఉన్నాయా?
 43. ప్ర: ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలను ఎలా గుర్తిస్తారు?

ప్ర: పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?

జవాబు: చలికాలంలో రాత్రివేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము.
చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు.

ప్ర: నున్నటి చదునైన ప్రదేశాల్లో కూడా ఉడుము సులభంగా పరుగెత్తడమే కాకుండా గట్టిగా పట్టుకుని ఉండగలదు. ఇదెలా సాధ్యం?

జవాబు: ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. ఈ కుటుంబంలో ఉన్న ఒకే ప్రజాతి వరానస్.ఉడుము గాజులాంటి నున్నటి తలాలపై కూడా నిట్టనిలువుగా పరుగెత్త గలదు. పైకప్పులను గట్టిగా పట్టుకుని స్థిరంగా ఉండగలదు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన మెత్తలే (pads) ఇందుకు కారణం. వీటిపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బొడిపెలు (bulges) ఉంటాయి. ఈ సూక్ష్మ వెంట్రుకల రాపిడి వల్ల దుర్బల స్థిర విద్యుత్‌ బలాలు (weak electrostatic forces) ఉత్పన్నమై అవి తలానికి అంటుకుని పోతాయి. ఒకో బొడిపె అతుక్కునే బలం (adhesive force) తక్కువే అయినా, వేలాది బొడిపెల వల్ల ఉత్పన్నమయ్యే బలం ఎక్కువవడంతో ఉడుము గట్టి పట్టును కలిగి ఉంటుంది. ఇలా దాని నాలుగు పాదాల వల్ల కలిగే బలం వల్ల దాదాపు 140 కిలోల బరువును కూడా లాగుతూ నిలువుగా ఎగబాకగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుములకు తాళ్లను కట్టి వాటిని పట్టుకుని కోట గోడలను ఎక్కేవారు. 'ఉడుము పట్టు' వ్యవహారికంగా మారడానికి ఇదే కారణం.
ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,హైదరాబాద్

ప్ర:సోలార్ బ్యాటరీ ఎలా పని చేస్తుంది?

సూర్యని కాంతి శక్తిని విద్యుచ్చక్తి గా మార్చడమే సౌర ఘటాల (SolarBataries) పని . ఆ విద్యుత్ ను ఏ ప్రయోజనము కోసం వాడతామనే విసయాన్ని బట్టి అవి పనిచేసే విధానము కుడా మారుతుంది . కొన్ని సౌరఘటాలు ఎప్పటికప్పుడు కాంతి శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తూ పరికరాలను నడిపిస్తుంటాయి . కేవలం తక్కువ మోతాదు విద్యుత్ మాత్రమే అవ సరమయ్యే కాలిక్యులేటర్లు ,డిజిటల్ గడియారాల్లాంటివి ఈ విధానం లో పనిచేస్తాయి . చీకటిలో ఇవి పని చేయవు . ఇక ఎక్కువ విద్యుత్ కావాల్సిన బల్బులు , యంత్రాలు , టార్చిలైట్లు , వీదిలైట్లు పని చేయాలంటే తొలుత కాంతి శక్తిని చాలా గంటల పాటు విధుత్ శక్తి గా మారుస్తూ నిలువున్చుకునే విధానాని వాడతారు . సినికాన్ వంటి పదార్ధాలలోని ఎలక్ట్రాన్లు కాంతి శక్తివల్ల ఉత్తేజితమై ఒక శక్తి స్థాయి నుంచి పైశక్తి స్థాయికి మారుతూ ధన , రుణ విద్యుత్దావేశాల్ని ఏర్పరచ గలవు . ఇలాంటి ఘటాలను వందలాదిగా వరుసగా కలపడం ద్వారా కొంత మోతాదులో ''విద్యుత్ పోటన్సియాల్'' ఏర్పడుతుంది .

ప్ర: వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?

జవాబు: కూల్‌డ్రింక్‌ సీసాలో స్ట్రాను పెట్టి పీల్చితే ఏం జరుగుతుందో వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో కూడా అదే జరుగుతుంది. స్ట్రాను పీల్చినప్పుడు అందులోని మొత్తం గాలి ఖాళీ అవడం వల్ల అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలోకి బయటి గాలి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నంలో సీసాలోని కూల్‌డ్రింక్‌ను కూడా అందులోకి తోస్తుంది. అలా డ్రింక్‌ నోట్లోకి చేరుతుంది. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుందనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది. విద్యుత్‌ శక్తితో పనిచేసే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు అందులోని మోటారు పనిచేసి ఒక ఫ్యాన్‌ గిరగిరా తిరుగుతుంది. అది క్లీనర్‌ గొట్టంలో ఉండే గాలిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి బయట ఉండే గాలి వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ గాలితో పాటే అక్కడ ఉండే దుమ్ము, ధూళి లోపలికి చేరడంతో ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. అలా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లోపలికి చేరిన వ్యర్థాలను ఆ తర్వాత దులిపేసి తిరిగి దానిని వాడకానికి సిద్ధంగా ఉంచుతారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర : గాయం ఎలా మానుతుంది ?

జ : గాయము తగలనానే దెబ్బతిన్న రక్తనాళాలు కుచించుకుపోయి రక్తస్రావము ను తగ్గింస్తాయి . ఈలోగా రక్తము గడ్డకట్టి గాయం చివరల గట్టిపదేలా చేస్తాయి. తెల్ల రక్తనణాలు వచ్చి గాయం లోకి ప్రవేశించే సూక్ష్మజీవులను నిరోధిస్తాయి  తరువాత  చర్మము లోపలి ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలు గాయము ప్రాంతానికి చేరి కొత్తకణజాలాలను ఉత్పత్తిచేయడం మొదలుపెడతాయి.
చర్మకణాలు విభజనచెంది కొత్త కణాలు ఉత్పత్తిచేసి గాయం పైనంతా వ్యాప్తిచెందడం మొదలుపెడతాయి. అప్పుడు పైభాగాన నల్లగా కట్టిన చెక్కు వంటిది రాలిపడిపోతుంది.

ప్ర: జిరాక్స్‌ యంత్రం ఎలా పనిచేస్తుంది?

జవాబు: ఏ డాక్యుమెంటుకైనా నకలును సృష్టించే యంత్రాన్ని జిరాక్స్‌ (xerox)యంత్రం అంటారు. ఇందులో క్షణాల్లో జరిగే అద్భుతాన్ని తెలుసుకోవాలంటే ఒక భౌతిక శాస్త్ర సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.
గాలి వూదిన బెలూన్‌ను రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కల్ని ఆకర్షిస్తుంది. దీనికి కారణం బెలూన్‌ ఉపరితలంపై స్థిర విద్యుత్‌ (static electricity) ఏర్పడడమే. విద్యుదావేశాలు (electric charges) రెండు రకాలు. ధనావేశం(positive charge) ఒకటైతే, రుణావేశం (negative charge) మరొకటి. భిన్న ఆవేశాలు ఆకర్షించుకుంటాయని తెలుసుకదా? ఈ సూత్రంపైనే జిరాక్స్‌ యంత్రం పనిచేస్తుంది.
ఈ యంత్రంలోని ఓ ప్రత్యేకమైన డ్రమ్ము బెలూన్‌లాగే పనిచేస్తుంది. అంటే దానిపై స్థిరవిద్యుత్‌ను కలిగించవచ్చన్నమాట. ఇంకా ఈ యంత్రంలో ఉండే టోనర్‌లో అతి సన్నని నల్లటి పొడి ఉంటుంది. స్థిరవిద్యుత్‌ ఏర్పడిన డ్రమ్ము ఈ నల్లటి పొడిని ఆకర్షిస్తుంది. డ్రమ్ముపై అక్కడక్కడ మాత్రమే స్థిరవిద్యుత్‌ ఏర్పడేలా చేయవచ్చు. అప్పుడు ఆయా ప్రాంతాలు మాత్రమే నల్లటి పొడిని ఆకర్షిస్తాయి. అలా డ్రమ్ముపైన మనకు కావలసిన విధంగా స్థిరవిద్యుత్‌తో కూడిన ఒక ప్రతిబింబాన్ని ఏర్పరచే వీలుంటుంది. అంటే ఒక డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడ మాత్రమే స్థిరవిద్యుత్‌ ఏర్పడి నల్లటి పొడి అంటుకునే విధంగా డ్రమ్మును మార్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ డ్రమ్ము ద్వారా ముద్రితమయ్యే కాగితంపై ఆ డాక్యుమెంటు నకలు యధాతధంగా వస్తుంది. డ్రమ్ముపై మనం అనుకున్న చోటనే స్థిరవిద్యుత్‌ ఏర్పడేలా చేయడానికి కాంతి తోడ్పడుతుంది. అందుకే ఈ యంత్రాన్ని 'ఫొటో కాపీయర్‌' అని కూడా అంటారు.
డ్రమ్ముని ఫొటోవిద్యుత్‌ వాహక (photo conductive) పదార్థం (కాడ్మియం లేదా సెలీనియం)తో నింపుతారు. కాంతి ప్రసరించినప్పుడు ఈ డ్రమ్ము ఉపరితలమంతా ధనావేశం ఏర్పడుతుంది. యంత్రంలో మనం ఒక డాక్యుమెంటును పెట్టినప్పుడు దానిపై శక్తివంతమైన కాంతి కిరణాలు ప్రసరించే ఏర్పాటు ఉంటుంది. అవి డాక్యుమెంటులోని తెల్లని ప్రాంతాల ద్వారా పరావర్తనం చెంది డ్రమ్ము మీద పడతాయి. ఆ కిరణాలు పడిన ప్రాంతాల్లో మాత్రం డ్రమ్ములోని పదార్థం నుంచి ఎలక్ట్రాన్లు వెలువడి డ్రమ్ము ఉపరితలంపై ఆయా ప్రాంతాల్లో ఉన్న ధనావేశాన్ని తటస్థపరుస్తాయి. ఫలితంగా డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లని అక్షరాలు, చిత్రాలు ఉన్నాయో, అక్కడక్కడ మాత్రమే డ్రమ్ముపై ధనావేశం నిలిచి ఉండి, ఆ ప్రాంతాలే టోనర్‌లోని నల్లని పొడిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఆ డ్రమ్ము ఉపరితలం మీదుగా వేరే తెల్ల కాగితాన్ని ప్రయాణించేలా చేయడం వల్ల టోనర్‌ పొడి కాగితంపై అంటుకుంటుంది. కాగితం బయటకి వచ్చే మార్గంలో ఉండే ఉష్ణవిభాగం ద్వారా కలిగే అత్యధిక వేడి వల్ల ఆ పొడి కాగితానికి గాఢంగా అంటుకుపోయి నకలు కాపీ ముద్రితమై బయటకు వస్తుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ప్ర: గ్రహణాలు ఎలా ఏర్పడతాయి?

సూర్యుడు ,చంద్రుడు , భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినపుడే గ్రహణాలు ఏర్పడుతాయి . చంద్ర గ్రహణము పౌర్ణమి నాడు , సూర్య గ్రహణము అమావాస్య నాడు ఏర్పడతాయి . కాంతి పడిన ప్రతి వస్తువుకి నీడ ఏర్పడుతుంది . . అంతరిక్షములో సూర్యుని కాంతి భూమి ,చంద్రుల పై పడినపుడు వాటి నీడలు కుడా అలాగే ఏర్పడతాయి కాని ఆ నీడపడే చోటుకి ఏ వస్తువు (గోడలు లాంటివి ) ఉండవు కావున ఆవి కనిపించవు . . . ఈ నీడలు వల్లే గ్రహణాలు ఏర్పడుతాయి .
చంద్ర గ్రహణము : భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే , ఆ భూమి చంద్రుడి తో సహా సూర్యుని చుట్టూ తిరుగుతోంది . ఇలా తిరిగే భూమి పై సూర్యకాంతి నిరంతరము పడుతూనే ఉంటుంది . ఆ కంటి పడే ప్రాంతాల్లో పగలని , పడని ప్రాంతాల్లో రాత్రని అనుకుంటాం ,.. సూర్య కంటి పడినపుడు భూమికి వెనక దాని నీడ ఏర్పడుతుంది . . . కాని అక్కడంతా అంతరిక్షము కాబట్టి ఏమీ కనబడదు , ఆ నీడ పడే ప్రాంతం లోకి చంద్రుడు వచ్చాడనుకోండి .. ఆ చద్రుడే ఓ గోడలా అడ్డు ఉండడము తో భూమి నీడ దానిపై పడుతుంది . ఆ నీడ పాడుచున్నప్రనటం మేర చంద్రుడు కనిపించదు ... కాబట్టి దాన్నే చంద్రగ్రహణము అనుకుంటాము
సూర్య గ్రహణము :
భూమి పైకి సూర్య కంటి పడుతున్నపుడు ఆ కంటికి అడ్డుగా చంద్రుడు వచ్చదుకోండి ... అప్పుడు చద్రుడి నీడ ఏర్పడి అది భూమి మీద పడుతుంది . భూమి పై ఆ నీడ పరుచుకున్న ప్రాంతం లో ఉన్నవారు తలెత్తి పైకి చుస్తే సూర్యుడు కొంత భాగము కనిపించడు , అదే సూర్య గ్రహణము అంటాము . చంద్రుదు కనిపించని రోజు అమావాస్య అవుతుంది .
భూమి నుంచి చంద్రు ఉన్న దూరానికి సరిగ్గా 400 రెట్లు దూరాన సూర్యుడు ఉన్నాడు .. .అంతేకాకుండా చంద్రుడు వ్యాసానికి సరిగా 400 రెట్లు పెద్దదిగా సూర్యుడి వ్యాసము ఉన్నది . అందుకే భూమి నుంచి చంద్రుడు , సూర్యుడు ఒకే పరిమాణము లో కనిపిస్తాయి .

ప్ర: కొందరి కళ్లు నీలం రంగులో ఉంటాయి. ఎందుకు?

జవాబు: కంటి గుడ్డులోని వర్ణకాలు (Pigments) కంటి రంగును నిర్ణయిస్తాయి. మెలానిన్‌ అనే జీవ రసాయన ద్రవ పదార్థ పరిమాణాన్ని బట్టి కంటి రంగు లేత నీలం రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లగానో, బంగారు రంగులోనో ఉండే పాశ్చాత్యుల కళ్లు ఈ మెలానిన్‌ను తక్కువ శాతంలో ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వారి కంటి గుడ్డుపై పతనమయ్యే కాంతి నుండి నీలం రంగు ఎక్కువగా పరావర్తనం చెందుతుంది. అందువల్ల వారి కళ్లు నీలం రంగులో కనపడతాయి. మెలానిన్‌ పరిమాణం ఎక్కువయ్యే కొలదీ కంటి రంగు పరిధి ఆకుపచ్చ నుంచి గోధుమరంగు వరకు ఉంటుంది.
కంటి రంగును జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. ఈ విషయమై శాస్త్రజ్ఞులు ఇంతవరకు ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాకపోయినా, ప్రపంచంలో నీలం రంగు కన్నా, ఆకుపచ్చరంగు, ముదురు గోధుమ రంగు కళ్లు ఉండే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నీలం రంగు కళ్లు కలవారు ఉత్తర ఐరోపాలో ఎక్కువగా ఉంటే, మిగతా ప్రపంచంలో గోధుమరంగు కళ్లు కలవారే ఎక్కువ. ప్రతి పదిలక్షల మందిలో ఒకరికి కుడి కన్ను ఒక రంగులో ఉంటే, ఎడమకన్ను మరో రంగులో ఉంటుంది.జన్యుపరంగా వచ్చే ఈ పరిస్థితిని 'హైడ్రో క్రోమియా' అంటారు.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైద్రాబా

ప్ర: శూన్యంలో మంట ఎలా ప్రవర్తిస్తుంది?

 • గురుత్వాకర్షణ శక్తి శూన్యం గా ఉన్న ప్రదేశం లో మంటలు వ్యాపించవు ... సరికదా ఆరిపోవును . మంట నుంచి కాంతి , ఉష్ణము , కార్బండై ఆక్శైడ్(carbondiaxide) ,నీటి ఆవిరి వెలువడుతాయి . ఉష్ణం వల్ల కలిగిన దహన చర్య తో కార్బండై ఆక్శైడ్ , నీటి ఆవిరి వ్యాకొచిస్తాయి . . . దాంతో వాటి సాంద్రత తగీ అవే తేలికై మంట పైభాగం నుంచి వాతావరణం లోకి చేరుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్లవనము(buoyancy), సంవహనము (convection) అనే భౌతిక చర్యలు ఉంటాయి . ఆ విధంగా మంట లోపలి భాగం లో ఖాళీ ఏర్పడటం తో ఆ ప్రదేశానికి వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడుకున్న గాలి చేరుకుంటుంది . ఆక్షిజన్ వల్ల మంట తీవ్రత మరీ ఉద్రుతమవుతుంది . . కాని సాన్ద్రతల తేడాల వల్ల తేలికైన పదార్ధాలు పైకి పోవడానికి గురుత్వశక్తి తోడ్పాటు అవసరము . కాబట్టి శూన్య గురుత్వం ఉన్నా ప్రదేశం లో ప్లవన, సంవహన చర్యలు జరుగవు ...
 • ఫలితంగా వేడెక్కి వ్యాకోచించిన కార్బండై ఆక్శైడ్ , నీటిఆవిరి మంట పైభాగం నుంచి వాతావరణం లోకి పోకుండా మంట చుట్టూ గుమికూడడం వల్ల వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడిన గాలి మంటను చేరుకోలేదు ... దాంతో దహన చర్య సరిగా జరగకపోవడం తో చివరకు మంట కాస్తా ఆరిపోవును . అతి తక్కువగా గురుత్వ శక్తి ఉండే ప్రదేశాలలో మంట ఒక చిన్న గోళాకార రూపం లోకి కుచించికొని పోవడం తో వంట వ్యాపించదు . అందువల్లే రోదసీలో పయనించే అంతరిక్ష నౌక లో అగ్ని ప్రమాదాలు సంభవించిన అవి నలుమూలలకు వ్యాపించవు .

ప్ర : వరదలు ముందే ఎలా పసిగడతారు?

జ : వరద హెచ్చరికలు ఇచ్చి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడము జరుగుతూ ఉంటుంది. . ఇందుకోసము ఒక వ్యవస్థ  నిరంతరము నదుల ప్రవాహాలను గమనిస్తూఉంటుంది.  నదీ పరీవాహక ప్రాంతాలలోని వర్షపాతము కొలవడం , వివిధప్రాంతాలలో నదీ నీటిమట్టం తీసుకుని ఎప్పుడు , ఏ ప్రాంతములో , ఎంత వరద ఉధృతం ఉంటుందో అంచనావేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తారు. నదుల పొడవునా అబ్జర్వేషన్‌ పాయింట్లు ఉంటాయి. సమగ్ర సమాచారమంతా క్రోడీకరించి తదనుగుణముగా హచ్చరికలు జారీచేయడము జరుగుతుంది. ఇది అంతా ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి . . దానికోసము ఉద్యోగస్తులు ఉంటారు.

ప్ర:ఫూల్స్ డే ఎలా ఏర్పడింది?

జ: : ఏప్రిల్ ఒకటిన ఒకరిని ఫూల్ చేసి ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్ చేయడానికి పేటెంట్ ఉన్న రోజు.అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం ... నిజమని నమ్మేస్తే ఫూల్‌ అంటూ గేలిచేయడం ఏప్రిల్‌ ఫస్ట్‌ ప్రత్యేకత. ఆల్‌ ఫూల్స్‌ డే పేరుతో దీన్ని ప్రపంచ మంతటా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటున్నారు.
పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో ఏప్రిల్‌ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. నూతన సంవత్సరం ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పదిరోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహించుకునేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒకరికి మరోకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే 1582లో రాజైన చార్లెస్‌-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవా లని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్టున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటి నుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టప డక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యధా విధిగా ఏప్రిల్‌ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపు కున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్‌ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్‌ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్‌ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటప ట్టించేవారు. అంతే కాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్‌ ఫిష్‌ అంటూ అల్లరి పెట్టేవారు.
ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్‌ ఫూల్స్‌ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమె రికా, బ్రిటన్‌, స్కాట్లండ్‌ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచ మంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్‌ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రానురాను ప్రాక్టికల్‌ జోక్స్‌ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్‌ జోక్స్‌ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోకి సైతం పాకిపోయింది.

ప్ర: శత్రువుల బారి నుంచి తేనెటీగలు తమను తాము ఎలా రక్షించుకుంటాయి?

జవాబు: తేనెటీగ ఏ జీవినైనా కుడితే దాని కొండె ఆ జీవి దేహంలో చిక్కుకుపోతుంది. దానిని వదిలించుకునే ప్రయాసలో తేనెటీగ చనిపోతుంది. అందువల్ల శత్రువుల బారి నుంచి తప్పించుకోడానికి తేనెటీగలు మరో విచిత్రమైన పద్ధతిని అవలంబిస్తాయి. ఉష్ణశక్తిని ఉత్పన్నం చేసే ఈ ప్రక్రియను 'థెర్మో బాలింగ్‌' అంటారు. తేనెటీగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉండగలవు. అదే వాటి శత్రువులైన కందిరీగలాంటి కీటకాలు అంతటి వేడిమిని తట్టుకోలేవు. అందువల్ల శత్రువులు వచ్చినప్పుడు తేనెటీగలు అత్యంత వేగంగా తమ రెక్కలను, కండరాలను కంపింపచేయడం మొదలెడతాయి. తద్వారా వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రత దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడు వరకు పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేని కీటకాలు మరణిస్తాయి. ఈ విద్యతో తేనెటీగలు తమ పట్టుపై ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులు పెరగకుండా కూడా చేస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

జవాబు: స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: కీటకాలు శీతాకాలంలో చలిబారి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటాయి?

జవాబు: మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పడిపోగానే ఆ మార్పులకు అనుగుణంగానే కీటకాలు తమ శరీర ధర్మాలను సర్దుబాటు చేసుకోవడంతో వాటి జీవసంబంధిత ధర్మాలన్నీ (vital functions) శూన్యదశకు చేరుకుంటాయి. ఈ దశలో అవి ఒక సురక్షిత ప్రదేశాన్ని చేరుకొని గుడ్లు లేక లార్వా రూపంలో ఉండే తమ సంతానాన్ని చలి బారి నుండి కాపాడుకుని ఆ తర్వాత వచ్చే వసంత కాలంలో జీవించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాయి. గుడ్లు లేక లార్వా దశలో ఉన్న కీటకాలు తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్ని కీటకాల లార్వాలు శీతాకాలంలో సరస్సులలో గడ్డకట్టకుండా ఉండే నీటి లోతుల్లో సురక్షితంగా ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత పరిసరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌

ప్ర: తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది? How is Cyclone forming ?, తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?

జ : అక్టోబరు - నవంబరు నెలలు వచ్చే సరికి తుఫాన్లు వస్తాయేమోనన్న భయం మన రాస్ట్రములో ఉంటుంది . అతి వేగముతో గాలులు , భారీ వర్షాలు తీవ్రనస్టాన్ని కలిగిస్తాయి. ఇది ప్రతిఏటా జరుగుతునే ఉంటుంది.
భూగోళము మీద అన్నిప్రాంతాలూ ఒకేలా ఉండక ఎత్తుపల్లాలు కల్గిఉన్నట్లే గాలిలో పీడనపరంగా అక్కడక్కడా అల్పపీడనము గల ప్రాంతాలు ఏర్పడతాయి. పల్లపు ప్రాంతాలలోకి నీరు ప్రవహించినట్లే అల్పపీడనము ప్రాంతాలాలోకి అన్నిదిక్కుల నుండి గాలి అతివేగంగా వీస్తుంది . అలా ఏర్పడిన వాయుగుండము సుడులు తురుగుతూ వేగం పుంజుకుని తీరము వైపు పయనిస్తుంది . వాతారణములోని తేమ భూమిపైనున్న చల్లని ప్రదేశాలకు తాకి వర్షముగా కురుస్తుంది . వేగము గా వీచే గాలితోకూడిన వర్షమే తుఫాను (cyclone).

ప్ర: గాయాలను వైద్యులు హైడ్రోజన్‌ పెరాక్సైడుతో లేదా స్పిరిట్‌తో శుభ్రపరుస్తారు. ఎందుకు?

జవాబు: గాయాలు తగిలినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స అది పుండుగా మారకుండా చూడడం. పుండు అంటే గాయం చేసిన దారి గుండా బయట ఉన్న సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడమే. అలా అవి చొరబడకుండా చూడడానికి, అప్పటికే గాయంపై చేరిన వాటిని నాశనం చేయడానికి కొన్ని రసాయనాలతో శుభ్రపరుస్తారు. సాధారణంగా ఏకకణ జీవులుగా ఉండే సూక్ష్మజీవులు తమ కణాల్లోంచి నీరు పోయినా, ఆ కణద్రవంలో ఉన్న జీవరసాయనాలు చెదిరిపోయినా బతకలేవు. హైడ్రోజన్‌ పెరాక్సైడుతో గాయాలను కడిగినప్పుడు అది విచ్ఛిత్తి చెందడం ద్వారా వెలువడే ఆక్సిజన్‌ సూక్ష్మజీవుల జీవరసాయనాలతో చర్య జరిపి, వాటిని పనిచేయకుండా చేస్తుంది. అలాగే స్పిరిట్‌లో ప్రధానంగా ఉండే ఆల్కహాలు గాయాల దగ్గరున్న నీటిని, సూక్ష్మజీవుల జీవరసాయనాలను లాగేసి వాటి అభివృద్ధిని నాశనం చేస్తుంది తద్వారా సూక్ష్మజీవులు చస్తాయి.
-ప్రొ .ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ,-జనవిజ్ఞానవేదిక.

ఫ్ర : ఆకాశములో మెరుపులు ఎలా వస్తాయి?

జవాబు : ఆకాశములో గాలిలో కలిగే ఘర్షణ వల్ల మేఘాలలో విద్యుదావేశం ఏర్పడుతుంది . మేఘాలలో విద్యుదావేశం అధికమైనప్పుడు అది ఒక మేఘం నుండి  మరో తక్కువ విద్యుదావేశమున్న మేఘం పైకి దూకుతుంది. అలా దూకుతున్న విద్యుదావేశము తో శక్తివంతమైన కాంతి వెలువడుతుంది.అదే మనకు కనిపించే మెరుపు . మేఘాలలో విద్యుత్ ఆవేశము కొన్ని సందర్భాలలో భూమిమీదికి దుముకుతుంది . దానినే పిడుగు అంటాం .  పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు.  ఆ పిడుగు వేడికి , తాకిడికి  అడ్డువచ్చిన మనుషులు చెట్లు కాలి మసి అయిపోతాయి. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు.

ప్ర: ఆక్సిజన్ ఎలా ఏర్పడింది?

జ: భూమి ఎప్పుడు ఏర్పడిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ సుమారు 6,000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఏర్పడిన సుమారు 3,000 మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవరాశులు పుట్టిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అధిక వేడి వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం వాతావరణంలోని మార్పులకు విస్ఫోటనం చెంది చల్లబడి, ఘనీభవించి భూగోళంగా ఉద్భవించింది. సముద్రంలోని అట్టడుగున ఉన్న రసాయనాలను బట్టి మొదట్లో గాలిలో రకరకాల విషపూరిత వాయువులు ఉన్నాయని ఆ వాయువులన్నీ పరస్పర చర్య జరపటం వల్ల ఆక్సిజన్ వాయువు పుట్టిందని తెలుస్తోంది.

ప్ర: ప్లాస్టిక్‌ను ఎలా తయారు చేస్తారు?

జవాబు: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్‌ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్‌'. ప్లాస్టిక్‌ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం 'ముడి నూనె' (క్రూడ్‌ ఆయిల్‌). ప్లాస్టిక్‌ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్‌ ఆయిల్‌'ను వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కార్మాగారం (ఆయిల్‌ రిఫైనరీ)లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్‌ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్‌' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్‌ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ప్ర: వర్షం ఎలా ఏర్పడుతుంది? దాని వెనుక ఉన్న ప్రకృతి మార్పులు ఏమిటి?

జవాబు: ఆకాశంలోని మేఘాల నుంచి వర్షం కురుస్తుందని తెలిసిందే కానీ, దాని వెనుక ఒక సుదీర్ఘమైన, క్లిష్టమైన వాతావరణ ప్రక్రియ ఉంది. వేసవి కాలంలో సరస్సులు, నదులు, సముద్రాలలోని నీరు సూర్యరశ్మి వల్ల ఆవిరిగా మారి వాతావరణంలోని గాలిలో కలిసిపోతుంది. నీటి ఆవిరి గాలి కన్నా తేలిక కావడంతో అది భూమి నుంచి పైకి ఆకాశంలోకి పైపైకి లేస్తుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రత కొంచెం తగ్గినా నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు వేడి ప్రదేశాల నుండి చల్లని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు గాలి లోని ధూళి కణాలపై నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మ బిందువులు ఏర్పడుతాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూ నీటి బిందువుల పరిమాణం ఎక్కువై, భూమ్యాకర్షణ శక్తికి లోనై కిందకి పడడం మొదలవుతుంది. మేఘాలలోని సూక్ష్మమైన మంచు కణాల చుట్టూ కూడా నీటి ఆవిరి ఘనీభవించి వర్షం పడే అవకాశం ఉంది. మేఘాలలో మెరుపుల వల్ల ఏర్పడే అయాన్లపై కూడా నీటి ఆవిరి ఘనీభవిస్తుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: ద్వీపాలు ఎలా ఏర్పడతాయి?

జ: నాలుగు దిక్కులా నీరున్న భూభాగాన్ని ద్వీపం('Island) అంటారు. ద్వీపాలనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. ాలక్రమములో ప్రధాన ఖండమునుండి విడిపోయిన చిన్న భూభాగము ద్వీపంగా తయారవుతుంది. లోతట్టు భూమికి మధ్యలో వున్నభాగము సముద్రమట్టం పెరిగి మునిగిపోతే ఒక ద్వీపం ఏర్పడవచ్చు.సముద్రములోని అగ్నిపర్వతాలు బద్దలైనపుడు పైకి ఎగిసిపడిన లావా నెమ్మదిగా ఒకచోట పేరుకుని ద్వీపం గా రూపు దిద్దుకుంటాయి. ప్రధాన నదులు సముద్రములోకి తెస్తున్న ఇసుక మేట వేయడం ద్వారా కూడా కొత్త ద్వీపం ఏర్పడుతుంది. శ్రీలంక ద్వీపము కాలక్రమేనా భారత ఖండము నుండి విడిపోయినదే .

ప్ర: wifi సాంకేతికత గురించి విన్నాను. అదెలా పనిచేస్తుంది?

జవాబు: wifi అంటే wireless fidelityకి సంక్షిప్త రూపం (abbreviation) గా భావించాలి. ఇప్పుడెవరూ ఇంటర్‌నెట్‌ అంటే ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ అనే పెద్ద పేరుకు సంక్షిప్త రూపంగా భావించనట్టే, వైఫై కూడా అలాగే అలవాటైపోయింది. తీగల (wires) తో సంధానించాల్సిన అవసరం లేకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, సెల్‌ఫోన్లు, కెమేరాలు, వీడియోలు, టీవీల్లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిస్తంత్రీ పద్ధతి (wireless mode)లో సంధానం చేయడానికి ఈ సాంకేతికతను వాడుతున్నారు. సాధారణంగా ఒకే ప్రదేశంలో ఉండే పరికరాలను వైఫై సర్వర్‌ ద్వారా అనుసంధానం చేస్తారు. ఆయా పరికరాలు ఈ సాంకేతికతను వాడడానికి అనుకూలంగా తయారైనవై ఉండాలి. ఇలాంటి సర్వర్‌ను హాట్‌స్పాట్‌ లేదా యాక్సెస్‌ పాయింట్‌ అంటారు. దీని చుట్టూ సుమారు 20 మీటర్ల పరిధిలోని పరికరాలను అనుసంధానం చేయడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ను సహాయంతో మైక్రోవేవ్‌ తరంగాల ద్వారా నెలకొల్పుతారు. ఇలా సంధానించిన పరికరాల మధ్య సమాచార మార్పిడి వీలవుతుంది. అంటే తీగలు లేకుండానే ఆయా పరికరాలను పనిచేయించడం సాధ్యమవుతుందన్నమాట.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ప్ర: జనవరి కి ఆపేరు ఎలా వచ్చింది?

నెలల పేర్లు చెప్పమంటే... జనవరితోనే మొదలు పెడతాం కాని ఒకప్పుడు... ఈ నెల లేనేలేదు .
జనవరి మొదటి తేదీ రాగానే కొత్త ఏడాది వేడుకలను చేసుకుంటున్నాం. కానీ నెలలు ఏర్పడిన తర్వాత చాలా ఏళ్ల వరకు జనవరి అనే నెలే లేదు. జనవరి లేకపోతే మరి కొత్త సంవత్సరం ఎప్పుడు ఆరంభమయ్యేది? మార్చి 1న. ఆ రోజునే ప్రపంచమంతా కొత్త ఏడాదిని స్వాగతించేది. మరి జనవరి నెల ఎలా వచ్చింది? ఎవరు ప్రవేశపెట్టారు?

ఇప్పుడు మనం వాడుతున్న 12 నెలల క్యాలండర్‌ని గ్రెగరియన్‌ క్యాలెండర్‌ అంటారు. దీనికి ముందు అనేక రకాల క్యాలెండర్లు ఉండేవి. వాటిల్లో ముఖ్యమైనది రోమన్‌ క్యాలెండర్‌. ఇందులో 10 నెలలే ఉండేవి. జనవరి, ఫిబ్రవరి ఉండేవి కావు. మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. క్రీస్తు పూర్వం 700 శతాబ్దంలో రోమ్‌ను 'నుమా పాంటిలియస్‌' అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతడే ఏడాదిని 12 నెలలుగా విభజించి, జనవరి, ఫిబ్రవరి నెలలను కలిపాడు. దాంతో కొత్త ఏడాది ప్రారంభమయ్యే తేది జనవరి 1గా మారింది. మొదటి నెలకి ఏ పేరు పెట్టాలో ఆలోచించి నుమా చక్రవర్తి 'జానస్‌' అనే రోమన్‌ దేవుడి పేరు మీద 'జానారిస్‌' అని పెట్టాడు. వాడుక భాషలో అది జనవరిగా మారింది. అయితే నుమా జనవరికి 30 రోజుల్నే కేటాయించాడు. క్రీ.పూ. 46వ శతాబ్దంలో రోమ్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ మరో రోజును కలిపి 31 రోజుల నెలగా జనవరిని మార్చాడు. తరువాత 15వ శతాబ్దంలో ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగారియన్‌ క్యాలెండర్‌ రూపొందింది. ఇది కూడా జనవరిని మొదటినెలగానే కొనసాగించింది.

ఇంతకీ జనవరికి 'జానస్‌' దేవుడి పేరునే ఎందుకు పెట్టాలి? మనకి వినాయకుడు ఎలాగో రోమన్లకు జానస్‌ అలాగ. ఏదైనా పని ప్రారంభించే ముందు వాళ్లు జానస్‌కు మొక్కేవారు. ఈ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం గతాన్ని, మరొకటి భవిష్యత్తును సూచిస్తుందని చెబుతారు. ఆరంభానికి, అంతానికి కూడా ఈయనే మూలమని నమ్ముతారు.ఓసారి రోమ్‌ను స్థాపించిన 'రోమ్యులస్‌' చక్రవర్తిని, అతని పరివారాన్ని పొరుగు రాజ్యపురాణి సబైన్‌ ఎత్తుకుపోతుంది. అప్పుడు జానస్‌ దేవుడు వారిపై అగ్నిపర్వతంలోని లావాను వెదజల్లి కాపాడాడనేది కథ.

ప్ర: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

జవాబు: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసంతోనే కాకుండా, ద్రాక్షరసం నుంచి తయారు చేసే 'వినిగర్‌'తో కూడా తొలగించవచ్చు. కుళాయిలపై వాటిలో ప్రవహించే నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్ల వల్ల ఏర్పడే లవణాల మూలంగా తెల్లని సున్నపు మరకలు ఏర్పడతాయి. ఉప్పునీటిలో ఈ లవణాల శాతం అధికంగా ఉంటుంది. కుళాయిలపై నీటి అణువులు భాష్పీభవనం చెందిన తర్వాత ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని ఏ రసాయనిక ద్రావకం ద్వారానైనా తొలగించవచ్చు. కానీ అతి గాఢత కలిగిన ఆ ద్రావకాల వల్ల రసాయనిక చర్యలు జరిగి కుళాయిలు తయారయిన లోహాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ కుళాయిలపై సున్నపు మరకలు పడిన ప్రదేశాలను అతి తక్కువ గాఢత ఉండే నిమ్మరసం లేక వినిగర్‌తో రుద్దితే, నిమ్మరసంలోని సిట్రిక్‌ ఆమ్లం, వినిగర్‌లో ఉండే ఎసిటిక్‌ ఆమ్లం, ఆ కుళాయిలకు అంటుకుపోయిన తెల్లటి సున్నపు మరకలను అంటే ఆ లవణాలను తొలగిస్తాయి. తర్వాత ఆ ప్రదేశాలను నీటితో కడిగితే, కుళాయిలు మునుపటి లాగే మెరుస్తుంటాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర : మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?

జ : ఎంతో సాధన చేసినా మనిషి రెండు నిమిషాల కన్నా ఊపిరి బిగబట్టలేడు  . ప్రతిక్షణము ఊపిరిసాగితేనే మనిషి జీవిస్తాడు . సాధారణముగా 30 సెకెండ్లు ఊపిరి ఆపుకోగలం . అది దాటిందా మెదడు స్పందించడం మొదలు పెడ్తుంది. , కళ్ళు తిరిగి నట్లు అవుతాయి.  నీటమునిగి ఈత కొట్టేవారు సాధన ద్వారా కొంచం ఎక్కువసేపు ఊపిరి బిగపట్టి ఉండగలరు .
ఊపిరి బిగపట్టడము మంచిది కాదు ... మెదడుకి రక్తం సరఫరా తగ్గి దెబ్బతింటుంది.

ప్ర: ఆక్సిజన్‌ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు?

జవాబు: ఒక వ్యక్తి ఆక్సిజన్‌ లేకుండా కొన్ని నిమిషాలు మాత్రమే జీవించగలడు. కారణం మెదడులోని కణాలకు ఆక్సిజన్‌ ఎంతో అవసరం. శరీరపు బరువులో మెదడు బరువు 2 శాతమే అయినప్పటికీ, ఒక వ్యక్తి పీల్చుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్ని మెదడే గ్రహిస్తుంది. కాబట్టి దేహానికి రక్తం అందించే ఆక్సిజన్‌ సరఫరా కొన్ని నిమిషాలు ఆగిపోయినా మెదడు స్తంభించిపోతుంది. మెదడు నిర్వర్తించే ప్రక్రియలన్నీ నిలిచిపోవడంతో మరణం సంభవిస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన 8 నుంచి 10 సెకన్లలోనే స్పృహ కోల్పోతాడు. అయితే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, దేహం వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణం తక్కవగా ఉంటుంది కాబట్టి మెదడులోని కణాలు ఎక్కువ సేపు జీవించి ఉండగలవు. ఈ అంశాన్ని బట్టే వైద్యులు గుండెమార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేసేప్పుడు ఉపయోగిస్తారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ప్ర: మన శరీరంలో ఎన్ని కణాలుంటాయి? కణం ఎంత పరిమాణంలో ఉంటుంది?

జవాబు: ఒక సాధారణ మనిషిలో సుమారు 10 వేల కోట్లు నుంచి వంద లక్షల కోట్లు వరకు జీవకణాలుంటాయి. ఒకో కణం పరిమాణం శాస్త్రీయ పరిభాషలో 10 మైక్రాన్లు ఉంటుంది. ఒక మిల్లీమీటరులో వెయ్యో వంతు భాగాన్ని లేదా మీటరులో పదిలక్షలవ వంతు భాగాన్ని మైక్రాన్‌ అంటారు. ఇక బరువు విషయానికి వస్తే మిల్లీగ్రాములో పదిలక్షలవ వంతు ద్రవ్యరాశి మాత్రమే ఒకో కణం తూగుతుంది. రాబర్ట్‌ హుక్‌ అనే శాస్త్రవేత్త 1665లో సూక్ష్మదర్శిని సాయంతో కణాలను కనుగొన్నాడు. స్కీడన్‌, ష్వాన్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1839లో జీవానికి ప్రాథమిక ప్రమాణం కణాలే అని తేల్చారు. దీన్నే కణసిద్ధాంతం అంటారు. ఏయే కణాలు ఎంతెంత కాలం మన్నుతాయన్న విషయం ఆయా కణాల తత్వాన్ని బట్టి ఉంటుంది. చర్మం మీద కణాలు చాలా తొందరగా పోయి కొత్తవి వస్తుంటాయి. రక్తకణాలు కొన్ని రోజుల పాటు ఉండగలవు. అదే మెదడు కణాలు, నాడీ కణాలు ఎక్కువ కాలం (దాదాపు దశాబ్దాల వరకు) ఉంటాయి. గుండె కణాలు కూడా చాలా కాలమే ఉంటాయి.

ప్ర: పాదరసం తయారీ ఎలా జరుగుతుంది?

జవాబు: సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహమూలకం (metallic elements) పాదరసమే. పాదరస పరమాణువులో ఉన్న 80 ఎలక్ట్రాన్లన్నీ జతకూడి ఉండడం వల్లనే పాదరసం ద్రవ రూపంలో ఉంటుందనీ తేలిగ్గా వాయురూపంలోకి వెళ్తుందని రసాయనిక శాస్త్రం చెబుతుంది. పాదరసాన్ని భారమితి రక్తపీడన మాపనం, ఉష్ణమాపనం (థర్మోమీటర్‌), విద్యుత్తు బల్బులు, విద్యుద్రసాయనిక పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నా ఇది కాలుష్య కారిణి. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థం. దీనికి బంగారంలాంటి లోహాలను కరిగించుకొనే లక్షణం ఉంది. పాదరసం అరుదుగా మాత్రమే దొరుకుతుంది. ప్రత్యక్షంగా లోహరూపంలో కాకుండా సిన్నబార్‌ అనే మెర్కురిక్‌ సల్ఫైడు, ఖనిజంగా పాదరసం లభిస్తోంది. ప్రధానంగా చైనా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, అమెరికా, కెనడా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఈ లోహాన్ని గాలిలో వేడిచేయడం ద్వారా గంధకం భాగాన్ని తొలగించి పాదరసాన్ని వెలికితీస్తారు.
పాదరసం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరింతగా తెలుస్తుండడం వల్ల దాని వినియోగాన్ని చాలా దేశాలు నియంత్రిస్తున్నాయి.

ప్ర : మనము కొన్న బంగారం లో అసలెంత కొసరెంత?

జ : మనము కొన్న బంగారు ఆభరణాలలో తులం బరువుగల ఏ ఆబరణము లోనూ స్వచ్చమైన 24 కారెట్ల (karats) బంగారము తులం ఉండదు .. .. .. ఎందుకంటే పూర్తి స్వచ్చమైన బంగారం తో ఆభరణాన్ని తయారుచేయరు . అలా చేస్తే ఆ నగలు ధరించడానికి అనువుగా ఉండవు . అందుకే స్వచ్చమైన బంగారముతో ఎతర లోహాల్ని మిశ్రమం చేస్తారు. దాంతో ఆభరణానికి గట్టిదనం వస్తుంది. మిశ్రమం చేసే లోహాన్ని బట్టి రంగూ మారుతుంది. ఇతర లోహాల్ని కలిపి ఆబరణం చేయడం వరకూ ఓకె ... కాని ఇతర లోహాలను ఎంత శాతం కలుపుతున్నారన్నదె చాలా ముఖ్యము.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారాన్ని " ట్రాయ్ ఔన్స్ " లలో తూస్తారు . ఔన్స్ బంగారము అంటే సరిగా 31.1034768 గ్రాములు. కొంచెం క్లుప్తం గా 31.103 గ్రాములు . భారతదేశములో బంగారాన్ని తులాలలో తూచడం ఆనవాయితీ . తులం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. తులం బంగారమంటే  11.664 గ్రాములు. ఈ తులాలు బదులుగా ఇప్పుడు మెట్రిక్ కొలమానము '' గ్రాములు'' లో వాడకం అలవాటైనది.
బంగారం స్వచ్చత .. అంటే ఫైన్నెస్ (finess) కారట్ల (karats)పేరుతో తెలయజేస్తారు. విలువైన రాళ్ళ బరువును carat రూపం లో తూస్తారు. బంగారం స్వచ్చతను karat రూపం లో పేర్కొంటారు. ఈ రెండూ ఒకేలా ఉన్నా వాటి విలువలు వేరు. 24 కారట్ల బంగారం అంటే నూటికి నూరు శాతము సంపూర్ణ స్వచ్చమైనది.

కారట్

ఫైన్ నెస్

బంగారం %

24

1000

100

22

916. 7

91. 67

18

750

75

14

583. 3

58. 3

10

416. 7

41. 67

9

375

37. 5

ప్ర : చీము ఎందుకు వస్తుంది?

జ : గాయము తగిలితే రక్తము కారుతుంది . తదుపరి రక్తము గడ్డకట్టి రక్తప్రవాహము ఆగిపోయేలోగానే గాయమైన ప్రాంతము లోకి పలు సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. ఆ సూక్ష్మజీవులు శరీరములో చేరి దెబ్బతీయకుండా చూసే బాద్యత రక్తములోని తెల్లరక్తకణాలది. ఇవి సూక్ష్మజీవులతొ చేసే పోరాతములో కొన్ని తెల్లరక్త కణాలు మరణిస్తాయి. వీటితోపాటు గాయం ప్రాంతములోని మృతకణాలు జతకూడుతాయి. ఇదంతా బయటకు పోయే ప్రయత్నమే చీము కారడము . లిక్విడ్ ప్యూరిన్‌(liquid purin) అనే ద్రవముతో పాటు మృతకణాలు బయటికి పంపబడతాయి. ఆ ద్రవము పసుపు రంగులో ఉంటుంది. . కాబట్టి చీము పసుపు రంగులో ఉండును .

ప్ర: ఇసుక ఎలా ఏర్పడుతుంది?

జవాబు: మన భూమిపై ఉండే నేలలోని ఒక అంశం ఇసుక. ఇసుక సముద్రతీరాల్లో, ఎడారుల్లో 0.06 మిల్లీమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల వ్యాసం గల రేణువుల రూపంలో విడివిడిగా ఉంటుంది. భూమిపై ఉండే ప్రతి 'శిల' (rock) వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొలదీ అరుగుదలకు లోనవుతూ నిదానంగా వివిధ పదార్థాలుగా విడిపోతుంది. ప్రకృతి సహజమైన వర్షం, గాలి మంచు, వడగళ్ల ప్రభావం వల్ల పెద్ద శిలలు కూడా ముక్కచెక్కలవుతాయి. అవి ఎంత సూక్ష్మమైన భాగాలుగా మారినా వాటి రసాయనిక ధర్మాలలో మార్పు ఉండదు. కాని వాతావరణంలో అప్రయత్నంగా సంభవించే ఆసిడ్‌ వర్షాల లాంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలా భాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం, ఐరన్‌ ఆక్సైడ్‌లుగా, సిలికాన్‌గా మార్పు చెందుతాయి. మారిపోయిన కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే, మరో రెండుభాగాలు ఇసుక (లేక quartz), స్లిట్‌గా మిగిలిపోతాయి. ఈ విధంగా శిలలు రూపాంతరం చెందడంలో గురుత్వశక్తుల ప్రమేయం కూడా ఉంటుంది. అలా ఏర్పడిన బంకమన్ను, స్లిట్‌, ఇసుక ఒకటిగా కలిసిపోయి 'లోమ్‌' అనే పదార్థం ఏర్పడుతుంది. శిల, లోమ్‌ రూపం సంతరించుకోవడానికి లక్షలాది సంవత్సరాలు పడుతుంది.
భూభాగం సముద్రపు అలల వల్ల కోతకు గురయినప్పుడు వేగంగా వీచే గాలుల ప్రభావం కూడా తోడవడంతో లోమ్‌ సముద్రపు లోతుల్లోకి చేరుకొని అక్కడి భూభాగం పై పరుచుకుంటుంది. అక్కడ నీటి వేగం ధాటికి లోమ్‌ మళ్లీ బంకమన్ను, స్లిట్‌, ఇసుకలుగా విడిపోతుంది. బంకమన్ను, స్లిట్‌ లోతుగా, నిశ్చలంగా ఉండే సముద్రపు అడుగుభాగానికి అంటుకొని పోతాయి. అన్నిటికన్నా ఎక్కువ పరిమాణంలో ఏర్పడిన ఇసుక సముద్రపు అలల ద్వారా తీరానికి కొట్టుకొని రావడం వల్ల సముద్రపు తీరాల్లో ఇసుక ఎక్కువ మేర పరుచుకుంటుంది. అలా ఏర్పడినవే సముద్ర తీరాలు, బీచ్‌లు. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది కూడా శిలలు విచ్ఛిన్నమవడం వల్లే.

ప్ర: నక్షత్రాలు, సూర్యుడు ఎలా ఏర్పడ్డాయి?

జవాబు: రోదసీ (Space)అంతా దట్టమైన వాయువులు, ధూళితో కూడిన మేఘాలు వ్యాపించి ఉంటాయి. వీటిని 'నెబ్యుల్లా' అంటారు. ఈ మేఘాల్లో 99 శాతం హైడ్రోజన్‌, కొద్దిపాటి వాయువులు, సూక్ష్మహిమ కణాలు, కాస్మిక్‌ ధూళి ఉంటాయి. ఈ వాయు ధూళి మేఘాల ఉష్ణోగ్రత మైనస్‌ 263 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుదించుకుపోతుంటాయి. దాంతో వాటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎంత ఎక్కువగా కుదించుకుపోతే అంత ఎక్కువ వేడి పుడుతుంది. ఈ చర్య కొనసాగడం వల్ల వాయు-ధూళి మేఘాల మధ్య భాగంలో ఉష్ణోగ్రత పది మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. సరిగ్గా ఆ స్థితిలోకే అక్కడి హైడ్రోజన్‌ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది. ఈ సంయోగం వల్ల ఉత్పన్నమైన అత్యధిక శక్తి కాంతి రూపంలో ఉంటుంది. అదే నక్షత్రం, దీని మధ్య భాగం నుంచి కాంతి కిరణాలు బయటకు దూసుకుపోతుంటాయి.
విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఒక సామాన్య నక్షత్రం. అంతకు ముందున్న ఒక నక్షత్రం పేలిపోగా మిగిలిన వాయువు నుంచి రూపొందిన నక్షత్రమే సూర్యుడు. భూమికి దగ్గరగా ఉంటాడు కాబట్టి అంత పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: ఒకోసారి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఇది ఎలా పని చేస్తుంది?

జవాబు: గుంపులుగా చేరి అలజడి సృష్టించే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు (tear gas) ను ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది కాబట్టే దీనికాపేరు. యుద్ధాల్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని యుద్ధవాయువు అని కూడా అంటారు.
బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనాలను తుపాకుల వంటి ఆయుధాల్లో కూరి పేల్చడం ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాల్లో ఉంటుంది. ఆల్ఫా క్లోరా సిటెటోఫినోన(Alpha Choraceteto Phenone) అనే రసాయనం ఘన రూపంలోను, ఇథైల్‌ అయోడో ఎసిటేట్‌ (Ethyl Iodo Acetate) ద్రవరూపంలోను ఉంటాయి.
బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్పగ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లల్లో మంట పుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై నీరు ఎక్కువగా చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. కొద్ది సేపటికి తగ్గిపోతాయి.
బాష్పవాయువుకు గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితో కానీ, బోరిక్‌ యాసిడ్‌ ద్రవంతో కానీ కడగాలి. సోడియం బై కార్బొనేట్‌ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే కోసిన ఉల్లిపాయల ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు. అవి బాష్పవాయువును పీల్చుకుని కళ్లపై అంత ప్రభావం చూపవు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ప్ర: గుడ్లలో పిండ రూపంలో ఉండే పక్షిపిల్లలు ఎలా శ్వాసిస్తాయి?

జ: పక్షుల గుడ్లపై ఉండే పెంకు (shell)గాలి ప్రవేశించడానికి అడ్డంకి కాదు. దాంట్లో మన కంటికి కనబడని అతి సన్నని రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాయువులు లోపలికి, వెలుపలకు వ్యాపిస్తూనే ఉంటాయి. గుడ్లలో ఉండే పక్షి పిల్లల పిండాలకు వూపిరితిత్తులంటూ ఏమీ ఉండవు. కానీ ఆ పిండాన్ని అంటుకొని పెరుగుతూ ఉండే ఆంత్రం (పేగు)కు అనుసంధానమై 'ఎలనాటిస్‌' (Allanotis)అనే పలుచని పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే పక్షి పిండం శ్వాసిస్తుంది. ఈ పొర టమోటా సాస్‌లాగా ఒక మడతపై మరొకటి పరుచుకొని వలలోని అల్లికలాగా సున్నితమైన రక్తనాళాలు కలిగి ఉంటుంది. వాతావరణంలోని ఆక్సిజన్‌ ఈ రక్తనాళాల ద్వారా వెలుపల నుండి గుడ్డులోకి ప్రవేశిస్తుంది. అలాగే లోపల నుండి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వెలుపలికి పోతుంది.
ఈ 'ఎలనాటిస్‌', సృష్టి ఆరంభంలో ప్రాణులు సముద్రాల నుండి భూమిపైకి వచ్చి రూపాంతరం చెందడంతో ప్రముఖ పాత్ర వహించింది. చేపలు, ఉభయచరాలైన కప్పల వంటి ప్రాణుల గుడ్లలో ఇది ఉండదు. కాని పక్షులు, పాకుడు జంతువులైన పాముల గుడ్లలో ఉంటుంది. పాలిచ్చే ప్రాణులు, ముఖ్యంగా మానవులలో ఈ ఎలనాటిస్‌ బొడ్డుతాడు (Umbilical cord) రూపంలో వృద్ధి చేందుతుంది.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌

ప్ర: కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్‌ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?

జవాబు: కృత్రిమ శ్వాస అందించడంలో కీలకమైనవి ఆక్సిజన్‌ వెంటిలేటర్లే. మామూలు సిలిండర్లలో పెద్ద పనితనం ఏమీ లేదు. చిన్న వాల్వ్‌ పిన్నును తెరవడం, రెగ్యులేటర్ల ద్వారా సిలిండర్లలోని గాలిని ఒకే దిశలో ఆశించిన పీడనంలో బయటకు పంపడం మినహా వాటిలో మరే తతంగం లేదు. కానీ ఆక్సిజన్‌ వెంటిలేటర్లు వేరు. ఎవరికయినా అత్యవసర చికిత్స అవసరమైనపుడు, ఊపిరితిత్తుల పనితనం స్తంభించిపోయినపుడు, కోమాలోకి వెళ్లినపుడు కృత్రిమంగా శ్వాస ప్రక్రియను నిర్వహించాలి. అలాంటి సందర్భాలలో సిలిండర్లలో ఉన్న ఆక్సిజన్‌ను తగు మోతాదులో తగిన పీడనంలో రోగి ముక్కు లేదా నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. సాధారణంగా ఇలా కృత్రిమంగా పంపే ఆక్సిజన్‌ (ఒక్కోసారి నైట్రోజన్‌లో కలిసి) పీడనం బయటి వాతావరణ పీడనం కన్నా హెచ్చుగా ఉండడం వల్ల బలవంతంగానే ఆక్సిజన్‌ లోపలికి వెళ్లి రోగి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. అదే సమయంలో అధిక పీడనం వల్ల వ్యాకోచించిన ఊపిరితిత్తుల ప్రోద్బలంతో పేషెంటు ఉదర వితానం (diaphragm)కూడా వ్యాకోచిస్తుంది. ఇది ఉచ్ఛ్వాస ప్రక్రియ (inspiration).ఈ దశకాగానే ప్రత్యేకమైన వాయు సరఫరా పద్ధతుల ద్వారా గాలిని పంపడం నిలుపు చేస్తారు. అప్పుడు ఉదరవితానం సంకోచించడం ద్వారా నిశ్వాస ప్రక్రియ (expiration)జరుగుతుంది. అపుడు విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడు, నీటి ఆవిరి మరో మార్గం ద్వారా గాల్లో కలుస్తాయి. ఇలా ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియనే కృత్రిమ శ్వాస క్రియ అంటారు. ఈ విధానంలో ఉపయోగపడే పరికరాల్ని వెంటిలేటర్లు అంటారు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)

ప్ర: మిణుగురు పురుగుల ఆహారం ఏమిటి? ఎలా సంపాదించుకుంటాయి?

జవాబు: మిణుగురు పురుగులు నిజానికి పురుగులు కావు. మాంసాహార లార్వా జాతికి సంబంధించిన చిన్నపాటి ఈగలు. ఈ లార్వా మూడు మిల్లీమీటర్ల వరకు పెరిగి తేమ ప్రదేశాలైన గుహలు, రాళ్లు, చెట్ల ఆకుల అంచుల్లో ముడుచుకుని నివసిస్తూ ఉంటాయి. ఇవి వాటి ఆహారాన్ని సంపాదించుకోడానికి ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబిస్తాయి. తాము నివసించే చోటును అంటిపెట్టుకుని తమ శరీరాల నుంచి ఒకరకమైన ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవం సాలెపురుగు దారాల్లాగా మారి పైనుంచి వేలాడతూ ఉంటాయి. తడిగా, అంటుకుపోయే విధంగా ఇలాంటి దారాలను వదిలాక ఈ మిణుగురు పురుగులు తమ శరీరాలలో నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి. ఆ వెలుగుకు ఆకర్షితమైన చిన్న పురుగులు అక్కడకి వచ్చి, అక్కడి దారాలకు అతక్కుపోతాయి. మిణుగురులు వాటిని చుట్టుకుపోయి నిదానంగా భక్షిస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: శూన్యంగా ఉండే రోదసిలో అంతరిక్ష యాత్రికులు గాలిని ఎలా పీలుస్తారు?

జవాబు: వ్యోమనౌకలో ఉండే తక్కువ ప్రదేశంలో 3 నుంచి 6 మంది వ్యోమగాములు ఉండటంతో గాలి పీల్చుకునే విషయంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల అక్కడ వారు క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండటానికి వ్యోమనౌకలో ECLSS (environmental control and life support systems) అనే వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో నీటి నిర్వహణ (వ్యర్థమైన, మూత్రరూపంలోని నీటిని తొలగించడం), కేబిన్‌లో ఉత్పన్నమయే కార్బన్‌డైఆక్సైడ్‌, అమోనియా, మీథేన్‌ లాంటి వాయువులను తొలగించడానికి కావలసిన పీడనం, ఉష్ణోగ్రత, తేమను నియంత్రించడం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ ఉంటాయి.
వ్యోమనౌకలో ఉన్న వారు పీల్చుకోవడానికి కావలసిన గాలి (ఆక్సిజన్‌) రెండు మార్గాలలో లభిస్తుంది. ఒకటి నీటి నుంచి విద్యుత్‌ విశ్లేషణ ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయడం. నీటిలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండటంతో ఈ ప్రక్రియ ద్వారా విడుదలయిన ఆక్సిజన్‌ను శ్వాసించడానికి ఉపయోగించి, హైడ్రోజన్‌ను రోదసిలోకి వదిలేస్తారు. మరో మార్గం వ్యోమనౌక వెలుపలి భాగంలో అమర్చిన టాంక్‌లో పీడనంతో ఉన్న ఆక్సిజన్‌ నుంచి కావలసిన మేరకు ఆక్సిజన్‌ను తీసుకోవడం.
వ్యోమనౌక నుంచి వెలుపలికి వచ్చి రోదసిలో ప్రయోగాలు చేసే వారికి ప్రత్యేకమైన 'స్పేస్‌ సూట్లు' ఉంటాయి. వాటిలో వారు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్‌ను విడుదల చేసే ఏర్పాట్లు ఉంటాయి. అందులో ఉండే 'పెర్‌క్లోరేట్‌ కాండిల్స్‌' అనే పరికరంలో ఉండే లోహాలు రసాయనిక చర్యల ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: పక్షులు, కొన్ని జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటాయి?

జవాబు: పక్షుల శరీర ఉష్ణోగ్రతలు ఏ కాలంలోనైనా స్థిరంగా ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతలను జీవక్రియల ద్వారా ఒక పద్ధతిలో నియంత్రించుకుంటాయి. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనపుడు వాటికుండే ఈకలను శరీరానికి అతి దగ్గరగా సమతలంలో ఉండేటట్లు తెచ్చుకుంటాయి. దాంతో ఈకలకు, శరీరానికి మధ్య గాలి ఉండకపోవడంతో ఉష్ణ వికిరణం ద్వారా శరీరంలో ఎక్కువైన ఉష్ణం వెలుపలకు పోవడమేకాకుండా వెలుపలి ఉష్ణం శరీరంలోకి చొరబడదు. చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్పత్తి చేసే చెమట, శరీర ఉష్ణం వల్ల ఆవిరవడంతో, శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పక్షులు తమ శరీరంపై ఉన్న ఈకలను బాగా పైకి లేపి వెలుపలి గాలిని శరీరం మధ్య నింపేసుకోవడం ద్వారా శరీరం నుంచి ఉష్ణం వెలుపలికి పోకుండా తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి.
కుక్కల లాంటి జీవులు వేసవిలో వాటి నాలుకలు వెలుపలకు చాపి వగరుస్తూ ఉండటం ద్వారా నాలుకలపై ఉండే లాలాజలం, వూపిరితిత్తులలోని తేమ ఆవిరి అయ్యేలా చూసుకుంటాయి. తద్వారా ఏర్పడిన చల్లదనం వాటి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. చలికాలంలో ఈ జంతువుల శరీరంలోని ఉష్ణం వాటి శరీరానికి దగ్గరగా ఉండే గాలిని వేడి చేయడంతో, అలా ఏర్పడిన వేడి గాలి పొర, వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా ఒక నిరోధకం లాగా పనిచేస్తుంది. ఆ విధంగా చలికాలంలో కూడా వాటి శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: రాత్రి హాయిగా నిద్ర పోవాలంటే ఏమి చేయాలి?

జ : నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము .
మంచి నిద్ర రావడానికి ఈ క్రింది చూచనలు పాటించాలి :

 • రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
 • రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు
 • రాత్రి ఆలస్యము (చాలా పొద్దుపోయిన తర్వాత) గా ఆహారం తినకూడదు.
 • రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
 • పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
 • పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
 • పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
 • పదుకునే సమయానికి గంట ముందు టెలివిజన్‌ ఆపెయ్యాలి -టి.వి , కంప్యూటర్ లో వచ్చే వెలుగు , రంగులు కళ్ళను, మెదడును ఇబ్బంది పెడతాయి , మెదడు ఉత్తేజ పడడం , ఎడ్రినల్ హార్మోను ఉప్ప్తత్తి దీనికి కారణము ,
 • నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి - సెక్ష్ నవలలు , డిటెక్తివ్ పుస్తకాలు చదువరాదు .. ఇవి మెదడును ఉత్తేజపరచి ఎడ్రినాలిన్‌ , నార్ ఎడ్రినాలిన్‌ ఉప్పత్తి అయి నిద్ర రానివ్వవు ,
 • నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
 • సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.
 • శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
 • ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.
 • పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.
 • మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

ప్రశ్న: రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది?
జవాబు: వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది.
బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది. ఈ మధ్య ఈ పరికరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పరికరాలు మత్తు పానీయం స్థాయిని అంకెల్లో చూసిస్తే, మరో కొన్ని రంగులు మార్పు ద్వారా చూపిస్తాయి.
- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

ప్ర: బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?

జ : లోషన్లు , పౌడర్లు , మురికి వంటి వాటికారణముగా బంగారు ఆభరణాల పై నెమ్మదిగా పల్చని పొరలాంటిది ఏర్పడి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది . తగిన జాగ్రత్తలు ద్వారా మెరుపును తిరిగి తీసుకురావచ్చును .

 • ఒక పాత్రలో సగం దాకా గోరువెచ్చని నీరు పోసి రెండు టేబుల్ స్పూన్లు వాషింగ్ లిక్విడ్ కలిపి ఆభరణాలను 30 నిముషాల సేపు నానబెట్టి టూత్ బ్రెష్ తో సున్నితముగా బ్రెష్ చేయాలి . గోరువెచ్చని నీటిలో కడిగి మెత్తని కాటన్‌ గుడ్డ తో తుడవాలి. ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుంది
 • అమ్మోనియా + నీరు సమపాళ్ళలో తీసుకుని ఆభరణాలను 20 నిమిషాలు నానబెట్టి టూత్ బ్రెష్ తో స్క్రబ్ చేయాలి. ట్యాప్ కింద కడిగి వస్త్రము తో తుడవాలి.
 • స్కికా ఉండే టూత్ పేస్ట్ తో ఆభరణాలు క్లీన్‌ చేయకూడదు . సిలికా వల్ల మెరుపునిచ్చే ఫినిషింగ్ దెబ్బతింటుంది . కొంతకాలానికి బంగారు ఆభరణల వన్నె తగ్గిపోయి పేలవం గా కనిపిస్తాయి.
 • చింత పండు రసములో బంగారు ఆబరణాలు 30 నిమిషాలు నానబెట్టి ... టూత్ బ్రెష తో క్లీన్‌ చేసి మెత్తటి గుడ్డ తో తుడిస్తే దగదగ మెరుస్తా్యి . దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వలన మురికి పోయి బంగారము మెరుస్తాయి .

ప్రశ్న: పిడుగు ప్రమాదాలను ఎలా నివారించాకోవాచు?

మేఘాలు ఒరిపిడివల్ల వాటిలో విద్యుదావేశం పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల వాటిమీద విద్యుత్ పీడనం బాగా పెరిగిపోతుంది. ఇది నేలమీదకు దూకాలంటే గాలి అడ్డుగా నిలుస్తుంది. ఈ విద్యుత్ పీడనం అనేక వందల కోట్ల వోల్టులకు పెరగడంతో గాలి పరమాణువుల మీది ఎలక్ట్రానులను పీకేస్తుంది. దానితో గాలి అయాన్లు తయారై తనగుండా విద్యుత్‌ను ప్రవహించేందుకు అనుకూలతను కల్గిస్తుంది. విద్యుత్ ప్రవాహానికి గాలి సన్నని దారిని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఈ దారిగుండా విద్యుత్ అనేక లక్షల ఆంపియర్ల బలం గలది ప్రవహిస్తుంది. ఫలితంగా దారిలోని ఉష్ణోగ్రత 15వేల నుండి 20వేల డిగ్రీల సెలిసియస్‌కు పెరిగిపోతుంది. దీనివల్ల మెరుపులు వస్తాయి. ఈ వేడివల్ల గాలి వ్యాకోచించి బాంబు పేలినంత చప్పుడవుతుంది. ఈ వేడికి చెట్లు కాలిపోతాయి. ఇళ్లు కూలిపోతాయి. జంతువులు ఈ విద్యుత్ ప్రవాహపు షాకుకు చచ్చిపోతాయి. దీనినే మనం పిడుగు అని పిలుస్తాం.
శబ్దం నుండి రక్షణ :
ఉరుముల వల్ల, పిడుగుల వల్ల వచ్చే శబ్దం చాలా ఎక్కకువగా ఉంటుంది. ఆ శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారని తెలుసుగా! పిడుగులు పడ్డప్పుడు వచ్చే ధ్వని తీవ్రత కొన్ని లక్షల డెసిబెల్స్‌ వరకూ వుంటుంది. అంత పెద్ద పెద్ద శబ్దాల వల్ల శాశ్వతంగా చెముడు వచ్చే ప్రమాదముంది. ఆ శబ్దాలకు కర్ణభేరి బ్రద్దలయ్యే ప్రమాదముంది. దాని నుండి తప్పించుకోవాలంటే చెవులన్నా మూసుకో వాలి. లేదా...నోరన్నా తెరవాలి! నోరు తెరిస్తే...ఆ శబ్దం చెవి నుండి నోటి ద్వారా విస్తరించి ప్రమాదం తప్పుంది. కనుక కర్ణభేరి సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అందుకనే పిడుగు పడినప్పుడు ''అర్జునా... ఫల్గుణా'' అని పిలిచి పిడుగుపాటు నుండి చెవిటి వాళ్లమయ్యే అవకాశం నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

ప్ర: పిడుగు ఎలా ఏర్పడుతుంది ?

''నీటితో నిండిన భారమైన రెండు మేఘాల మధ్య రాపిడి వల్ల ఏర్పడిన విద్యుత్‌ ఆవేశాన్ని మెరుపు అంటాం. ఆ మెరుపు భూమిని తాకడాన్ని 'పిడుగు' అని పిలుస్తాం. పిడుగుపాటు ఎంత తీవ్రంగా ఉంటుందంటే...దాని విద్యుత్‌ తీవ్రత వల్ల గాలిలో ఏర్పడే ఉష్ణము 54,000 డిగ్రీ ఫారెన్‌ హీట్‌ ఉష్ణోగ్రత కావచ్చు. మన శరీర ఉష్ణోగ్రతను ఫారెన్‌ హీట్‌లోనే కొలుస్తారు.మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ .అంత ఉష్ణోగ్రతతో పిడుగు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వ్యాకోచం చెందు తుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం వలన ఏర్పడే పెద్ద శబ్దమే ఉరుము. అది పిడుగుపాటును సూచి స్తుంది
1994వ సంవత్సరంలో నవంబర్‌ రెండవ తేదీన ఈజిప్ట్‌లోని డురుంకా వద్ద పెట్రోలు ఇంధనాన్ని తీసుకువెళ్తున్న రైలును పిడుగు తాకింది. రైలు పట్టాలు తప్పింది. అందులోని ఇంధనం అంటుకుని దగ్గర ఉన్న సైనిక డిపో వద్ద పేలుడు సంభవించింది. దారిలో ఉన్న ఇళ్లన్నిటినీ రెండుగా చీల్చివేసింది.''

ప్ర: పిడుగు పాటు షాక్ నుండి తప్పించుకునే మార్గాలేమయినా ఉన్నాయా?

పూర్వం ప్రతీ ఊరిలో ఓ దేవాలయం ఉండేది. దాని ముందు రాగి, ఇత్తడి లాంటి లోహాలతో చేసిన ధ్వజస్తంభం ఉండేది. సాధా రణంగా ఉరుములు, మెరుపులు ఏర్పడిన తరువాత ఎత్తైన ప్రదేశాలలో వున్న విద్యుత్‌ వాహనాల ద్వారా భూమిని చేరుకొని తటస్థమౌతాయి. రాగి,ఇత్తడి మొదలగు లోహాల రేకుల వల్ల ఉరుములు ఆకర్షింపబడతాయి. విద్యుదావేశం ఇళ్లపై పడకుండా ధ్వజస్తంభం ద్వారా భూమిని చేరుకుంటుంది. అందుచేతే మనకు ప్రమాదం ఉండదు కనుక ఊరిలోని ఇళ్లకు గానీ మనుషులకు గానీ ప్రమాదాలు తప్పిపోతాయి. అలాంటి ధ్వజస్తంభాలు ఊరిని పిడుగుల బారి నుండి రక్షిస్తాయి. ఇప్పుడు ఎత్తైన భవనాలలో ఇటు వంటి నిర్మాణాలే ఏర్పాటు చేస్తున్నారు. పూర్వీకులు ఏర్పాటు చేయించి ధ్వజస్తంభాలలో ఎంత మానవతా దృక్పథం వుందో మనకు తెలుస్తుంది గదూ. ఆ విధంగా పిడుగుల నుండి ఊరు రక్షింపబడు తుంది. ధ్వజస్తంభం ఉండడం నిజంగా ఊరికి మేలే!
పిడుగులు వస్తాయనే అనుమానము ఉన్నప్పుడు ఇల్లలోని కరంటు అపేయాలి . అలా చేయకపోతే ఎక్కువ ఒల్టేజ్ ఉన్న విద్యుత్ తీగల ద్వారా ప్రవహించి .ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు ఉదా: టి.వి , రేడియో,కంప్యూటర్లు , లైట్లు , ఫ్రిజ్ లు మునంగునవి కాలిపోతాయి . అందుకే ముందు జాగ్రత్త గా కరంటు డిపార్ట్ మెంట్ వారు లైన్‌ కరంటు ఆపేస్తారు .

ప్ర: ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలను ఎలా గుర్తిస్తారు?

జవాబు: వేలి ముద్రలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. డిజిటల్‌ పద్ధతిలో పనిచేసే ఇది వేలిముద్రల సమాచారాన్ని వివిధ కోణాల్లో సేకరించి కంప్యూటర్‌లో భద్రపరుస్తుంది. ఈ పరికరానికి ఉండే సెన్సార్‌ ముందు చేతి వేళ్లను ఉంచుతారు. అందులో ఉండే మైక్రోచిప్‌లో ఉష్ణశక్తికి స్పందించే ఒక పొర ఉంటుంది. ఇది దాదాపు 14,000 ప్రతిబింబాలను నమోదు చేయగలుగుతుంది. చేతి వేళ్లలోని స్వల్పమైన ఉష్ణశక్తి హెచ్చుతగ్గులను సైతం ఈ యంత్రం గుర్తించి వాటిని అనేక అంశాలుగా నమోదు చేస్తుంది. వేలిముద్రల్లో ఉండే రేఖల ఎత్తుపల్లాలన్నీ ఒక వరస క్రమంలో నమోదు అవుతాయి. ఇలా ఒక వేలిముద్ర ప్రతిబింబం ద్వారా దాదాపు 50 నుంచి 100 అంశాలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. పరికరంలో ఉండే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఈ అంశాలన్నింటినీ సక్రమమైన రీతిలో అమర్చి ఒక సమగ్రమైన ప్రతిబింబాన్ని కంప్యూటర్‌ తెరపై ప్రదర్శించేలా ఏర్పాటు ఉంటుంది. సేకరించిన సమాచారాన్నంతటినీ డిజిటల్‌ కోడ్‌ రూపంలో భద్రపరుస్తారు.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ఆధారము: డా: వందనా శేషగిరిరావు గారి బ్లాగు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate