హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / 2011 సంవత్సరంలో కనుగొన్న సైన్స్ సంగతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

2011 సంవత్సరంలో కనుగొన్న సైన్స్ సంగతులు

15స్విజర్లాండ్ దేశ జనీవా నగరం వెలుపలున్న అణు పరిశోధనా సంస్థ లార్జ్ హెడ్రాన్ కొల్లైడక్ (Large Hedron Collider) ప్రయోగాన్ని నిర్వహించింది. అక్కడి శాస్తవేత్తలు మనల్ని విభ్రమకు గురిచేసే అనేక విషయాల్ని వెలువరుస్తూ వస్తున్నారు. 2011 లో ద్రవ్యరాశి ఉనికిని మూలంగా నిలిచిన హిగ్స్ బోసాన్ (Higgs Boson) అనే సూక్ష్మాతి సూక్ష్మకణాన్ని గుర్తించారు. దీన్ని కొందరు దైవకణంగా భవిస్తున్నారు.

ఈ ప్రయోగాలు మరోకొత్త ఆవిష్కరణకు దారితీశాయి. “న్యుట్రెనొస్” అనే పదార్థం కాంతి కంటే వేగంగా ప్రయాణించగలదట. ఇది మహా శాస్తవేత్త మిలీనియం మేధావి ఐన్ స్టీన్ ప్రతిపాదిత సిద్ధాంతాన్నే సవాలు చేస్తున్నది. కాంతి వేగాన్ని మించి మరేది ప్రయాణం చేయలేదని మనకు ఐన్స్టీన్ నిరూపణలతో సహా వివరించారు. మరి ఇప్పుడు అది పాతదైపోతుంది. కొత్త నిరూపణ ముందుకొచ్చింది. న్యుట్రెనొస్ కాంతిని మించిన వేగంతో ప్రయాణించగలదు.

అమెరికా దేశ నాసా సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో దిట్ట అని మనందరికి తెలుసు. గత సంవత్సరం నాసా ప్రయోగించిన మెర్క్యూరీ మెసెంజర్ మెట్టమెదటగా బుధగ్రహం యొక్క ఉపరితల వాతావరణ వివరాల్ని కొంత విపులంగా తెలుసుకునే వీలు కలిపించిందట.

రోదసీలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉండే అంగారక గ్రహ విశేషాలు కూడా కొన్ని బయటకొచ్చాయి. అంగారక గ్రహం మీద అత్యంత సూక్ష్మమైన జీవుల ఉనికిని గుర్తించగలిగారట. ఈ ప్రయోగాలకు కర్తలు మార్స్ సైన్స్ లెబోరెటరీ వారు. వీరు తమ ఉపగ్రహం రోవర్ ద్వారా ఈ ప్రయోగాలు నిర్వహించారు. వీరి అంచనాల ప్రకారం అంగారకుని మీద కూడా అపార జలరాసులున్నాయి.

మరో సంచలన ఆవిష్కరణ నాసా ద్వారా జరిగింది. కెప్లర్ టెలిస్కోప్ ద్వారా మన సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహాల్ని కూడా గుర్తించే వీలు కలిగిందట. ఈ పరీశీలన ప్రకారం మనం నివసించే భూమిని పోలిన మరో సౌరకుటుంబ గ్రహంలో నీటి ఆనవాళ్ళు, రాళ్ళురప్పలు, శీతోష్ణ స్థితిగతులు మన భూమితో పోల్చదగినట్లు ఉన్నాయట. దానికి కెప్లర్-10బి గా నాసా పేరు పెట్టింది. ఆ గ్రహం భూమి కన్నా 40 శాతం పెద్దదిగా ఉందట. పరిశోధకులు వెలువరించిన వివరాల ప్రకారం అక్కడ భూమి కన్నా 4 – 5 రేట్లు ద్రవ్యరాశి ఉందట.

వివిధ నక్షత్రాలను కేంద్రంగా చేసుకొని దాదాపు 1235 గ్రహాలు పరిభ్రవిస్తున్నట్లు నాసా తమ పరిశీలన ద్వారా గుర్తించింది. అంతేగాదు రెండు నక్షత్రాలతో అనుసంధానమైన మరో గ్రహాన్ని కూడా నాసా 2011 లో గుర్తించగలిగింది. దానికి  “కంప్లర్-16బి”  అని పేరు పెట్టింది. మళ్ళీ ఇటీవల “కంప్లర్-22బి” అనే మరొక భూమిని పోలిన గ్రహాన్ని కూడా నాసా గుర్తించింది. ఇది కూడా మనం నివసించే సౌరకుంటుంబం బయటే ఉంది.

గత సంవత్సరం శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకే తలమానికం వంటిది. విశ్వతరణ సిద్దాంత ఆవిష్కరణ కాంతి ప్రసరిస్తున్న వేగం ఆధారంగా ప్రపంచ పరిణామక్రమాన్ని నిర్దారించగలిగిన సూత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. దానికి ఈ సంవత్సర నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు.

కృష్ణ విలాలుగా పిలువబడే బ్లాక్ హోల్స్ రహస్యాన్ని ఛేదించే క్రమంలోనే డా. సుబ్రమణ్య చంద్రశేఖరన్, ప్రపంచ ప్రక్యాత వర్తమాన శాస్తవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మనందరికీ దగ్గరయ్యారు. గత సంవత్సరం మరోసారి వీటి మిస్టరీని ఛేదించే ప్రయత్నం జరిగింది. హబుల్ టెలిస్కోపు సహాయంతో నిర్వహించిన పరీక్షల ఆధారంగా అంతరిక్షంలోని ప్రతి నక్షత్ర సమూహానికి కేంద్రకంగా బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు) ఉంటాయని ప్రకటించారు. నక్షత్ర సమూహం ఎంత పెద్దగా ఉంటే బ్లాక్ హోల్ కాడా అంత పెద్దగా ఉంటుందట. పరిమాణంలో అత్యంత పెద్దదైన కృష్ణబిలం 21 బిలియన్ల సూర్యుళ్ళతో సమానమని అర్థమౌతుంది. సుమారు 336 కాంతి సంవత్సరాలుగా రోదసీలో పరిభ్రమించే వేలాది నక్షత్ర సమూహాల్లో కోమా కాన్స్టిలేషన్ ఎంతో, ఎంతో దూరంలో ఉన్నదట. ఇంకా ఎన్.జి.సి 3842 అబెల్ 1367 వంటి కృష్ణ బిలాల వివరాలు తెలియాల్సి ఉందట.

162011లోనే డి ఆక్సీరైబోస్యూక్లిక్ ఆసిడ్ (డిఎన్ఎ) పై ప్రయోగాల ద్వారా దాని మూలాలు తెలిపాయి. 14వ శతాబ్దంలో “బ్లాక్ డెత్” ప్లేగు వ్యాధి లండన్ నగరాన్ని చుట్టుముట్టింది. దానివల్ల సుమారు 2,400 మంది లండన్ టవర్ దగ్గరలో ఉన్న తూర్పు స్మిత్ క్షేత్రంలో సమాధి అయ్యారు. వారి దంతాలను భద్రపరిచారు. వీటి ద్వారా ప్లేగు వ్యాధి సోకడానికి మూలమైన కారణాల్ని తెలిసికొన్నారు. ఆ క్రమంలో మృతుల డిఎన్ఏను డీకోడ్ చేయగలిగే జ్ఞానాన్ని ప్రొదిచేశారు. ఇంత వరకు ఈ డిఎన్ఏ డీకోడింగ్ ఎక్కడా జరగలేదు.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాదిపై అధ్యయనాలు కొత్త విషయాన్ని బయటకు తెచ్చాయి. దానికి మూలం హెచ్.పి.టి.ఎన్ 052 అనే క్షేత్రస్థాయి పరిశోధన. దీని ప్రకారం హెచ్.ఐ.వి సోకిన స్త్రీ, పురుషుల్లో ఒకరు anti retroviral మందులు తీసుకొన్నప్పుడు రెండో వారికి వైరస్ సోకకుండా ఉంటుందట. బ్రెజిల్, భారత్, ధాయ్ లాండ్, అమెరికా, బొట్స్వానా, కెన్యా, మలావి, దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే దేశాల్లో జరిపిన పరిశోధనలు దాన్ని నిర్ధారించాయి. ఇంకా  ప్రయోగాలు నడుస్తూనే ఉన్నాయట.

మానవుడి మూలాల్ని తెలుసుకునే ప్రయత్నాల్లో మరో పురోగమన అడుగు వెయ్యగలిగాం. మనుష్యుల్లో ఎక్కువ మంది ఇప్పటికీ పురాతన తెగల (archaic) డిఎన్ఏ ను కలిగుండటమనేది గుర్తించడం ద్వారా ఇది సాధ్యపడింది. మన పూర్వ మానవాకార జీవులు ఏ విధంగా మనకు వ్యాది నిరోదక లక్షణాన్ని ఇవ్వగలిగాయే తెలిపే ఆధారాలు బయటపడ్డాయి. “ఆస్థలో పితెకుస్ సెడియా” అనే మెదటి మానవ రూపాల అధ్యయనాల ద్వారా ఇది బయటపడ్డది.

కిరణజన్య సంయోగపక్రియ పై జరిపిన ప్రయోగాలు కొత్త కోణాన్ని బయట పెట్టాయి. జపాన్ దేశ శాస్త్రవేత్తలు ఫోటోసిస్టమ్-2 (PS-II) ద్వారా మొక్కల్లో జరిగే ఆక్సీజన్, హైడ్రోజన్ విభజనకు మూలాలు తెలిపారు. అనగా మూల మాంసకృత్తులను గుర్తించారు. తద్వారా భూమ్మీద జీవావరణానికి నేపధ్యం అర్ధమౌతుందట. అంతేగాదు పర్యావరణాన్ని నష్టం కలిగించని ఇంధన శక్తిరూపకల్పనకిది తోడ్పడగలదు.

17సూక్ష్మజీవుల అవరణం అర్ధమయ్యే ప్రయోగాలు కొత్త అంశాన్ని ముందుకు తెచ్చాయి. ప్రతి మనిషిలో ఉండే అన్నవాహిక ఆధారిత బ్యాక్టీరియా విశిష్టతల్ని గుర్తించారు. వాటిల్లో ఒక రకమైతే కీలకమైన మాంసకృత్తులమయమైన మనిషి ఆహారం మీద పెరుగుతుందట. మారొకటైతే కేవలం శాఖాహారులు తినే ఆహారం పైనే బ్రతగ్గలుగుతుంది. ఈ ప్రయోగాల ద్వారా సూక్ష్మజీవులు మనిషి ఆహారానికి ఉన్న చర్యల్ని గుర్తించే వీలు కలిగింది.

అంతర్జాతీయ రసాయన శాస్త్రంగా గుర్తించబడిద 2011 లో రెండు కొత్త మూలకాలు గుర్తించబడ్డాయి. ప్లరోవియం(Fv), విపర్ యోరియంగా వీటిని పిలుస్తున్నారు. ఇవి ఆవర్తన పట్టికలో 114, 115 స్థానాల్ని ఆక్రమించాయి.

ఈ ఆవిష్కరణలు శాస్త్రజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఆశిద్దాం!

2.98744769874
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు