మీకు తెలుసా మన ధేశంలో బాలబాలికల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి భారత శాస్త్ర సాంకేతిక విభాగం వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో మనందరికి తెలిసింది జవహర్ లాల్ నెహ్రూ విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్తులతో బాటు బడి బయట ఉన్న 10 నుండి 17 సంవత్సరాల బాలబాలికలలో సృజనాత్మక పెంపొందించడంతో బాటు వారి చుట్టూ ఉన్న సామాజిక సమస్యలకు వైజ్ఞాన పద్దతిలో పరిష్కారం కనుగొనే సామర్థ్యాన్ని వెలికితీసేది జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ National Children’s Science Congress.
బాలల సైనస్ కాంగ్రెస్ 1990 పూర్వార్థ్యం లో ప్రయోగాత్మకంగా మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో మొదటి సారి 1993లో ఢిల్లీలో జరిగింది. నాటి నుంచి ప్రతియేడాది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మూడంచెలుగా ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ జరుగుతూ ఉంది. జాతీయ స్థాయి పోటీలు ప్రదర్శనలు ప్రతి డిసెంబర్ 27 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నారు. ఇందులోని విజేతలు జనవరి 3 నుంచి 7 వరకు జరిగే సైన్స్ కాంగ్రెస్ Indian Science Congress లో పాల్గొంటారు.
విద్యార్తులను ఏదో ఒక సామాజిక అంశం గురించి ఆలోచించేట్లు చేయడం, ఇందుకు గల కారాణాలను, పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం. దీనికై విశేష పరిశీలనలు, ప్రశ్నా విదానాలు, నమూనాల నిర్మాణం, నమూనాల ఆధారంగా పరిష్రారాలను ఉహించడం, వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషించడం ఫలితాలను రాబట్టడం, కొత్త విషయాలను కనుగొనడం పై ఆసక్తి పెంచడం ప్రధాన ఉద్దేశ్యం.
డిసెంబర్ 31 నాటికి 10 నుండి 14 సంవత్సరాల వయసు (జూనియర్) 14 నుండి 17 సంవత్సరాల వయసు (సీనియర్) బాల శాస్త్రవేత్తలకు (బడికి వెళ్ళేవరు, వెళ్ళనివారు కూడా) ఈ బాలల సైన్స్ కాంగ్రెస్ కు అర్హులు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ప్రెధాన అధ్యాసన అంశాన్ని ఈ కాంగ్రెస్ నిర్ధేశిస్తుంది. దీనికి సంబంధించిన ఉప అంశాలపై బాలబాలికలు ఐదుగురు రలిసి జట్టుగా ఒక ప్రాజెక్టును తయారూ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం 20వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబడుతుంది. ఈ సంవత్సర ప్రధాన అంశం, శక్తి, అన్వేషించు, సక్రమంగీ వినియోగించు, సంరక్షించు.
ఈ అంశాలపై బాలబాలికలను ఉత్సాహపరచవలసిన బాధ్యత ఉపాధ్యాయులది. జిల్లా స్థాయిలో పాల్గొన్న ప్రతి 15 ప్రాజెక్టులలో 1 ప్రాజెక్టు చొప్పున రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న ప్రతి 10కి ఒక ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం జాతీయ స్థాయికి అలహాబాద్ వేదిక. జిల్లాస్తాయి అక్టోబర్ లోనూ రాష్ట్ర స్థాయి నవంబర్ లోనూ జరుగుతాయి.
20వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రధానాంశం శక్తి: అన్వేశించు, సంగ్రహించు, సంరక్షించు. దీనిలో 6 ఉప అంశాలు కలవు.
ఈ అంశాలపైనే విద్యార్థులు జట్లుగా ఏర్పడి ప్రాజెక్ట్ లు రూపొందించి ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ లు విన్నూత్తంగా, సరళంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. నిత్యజీవిత వాస్తవ విషయాన్వేషణ కోసం తమ సమస్యలకు శాస్త్రీయంగా సమాధానాలు, మార్గాలు సూచించగలగాలి. ఈ ప్రాజెక్ట్ ల రూపకల్పనకు విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో పాటు మార్గదర్శకం వహిస్తే విద్యార్థులు నాణ్యమైన ప్రాజెక్టులను పూరొందించగలుగుతారు.
సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టు మూల్యాంకన విదానం (జిల్లా స్థాయి) |
||
క్రమ సం. |
అంశము |
మార్కులు |
1. |
సరికొత్త ఆలోచన మరియు భావన |
10 |
2. |
ఎంచుకున్న ప్రాజెక్టునకు ప్రాధానాంసమునకు సహసందం |
10 |
3. |
సమస్య గురించి అవగాహన |
15 |
4. |
దత్తాంశ సేకరణ & విశ్లేషణ |
15 |
5. |
ప్రయోగాలు మరియు నిర్ధారిత విలువలు |
10 |
6. |
వివరణాత్మక వ్యాఖ్యానం & సమస్య పరిశ్కార ప్రయత్నం |
10 |
7. |
జట్టుగా కృత్యాల నిర్వాహణ |
10 |
8. |
బ్యాక్ గ్రౌండ్ కరక్షన్ |
10 |
9. |
మౌఖిక వ్యక్తీకరణ /లిఖిత రిపోర్టు |
10 |
మొత్తం |
100 |
సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టు మూల్యాంకన విదానం (రాష్ట్ర స్థాయి) |
||
క్రమ సం. |
అంశము |
మార్కులు |
1. |
సరికొత్త ఆలోచన మరియు భావన |
5 |
2. |
ఎంచుకున్న ప్రాజెక్టునకు ప్రాధానాంసమునకు సహసందం |
5 |
3. |
సమస్య గురించి అవగాహన |
15 |
4. |
దత్తాంశ సేకరణ & విశ్లేషణ |
15 |
5. |
ప్రయోగాలు మరియు నిర్ధారిత విలువలు |
10 |
6. |
వివరణాత్మక వ్యాఖ్యానం & సమస్య పరిశ్కార ప్రయత్నం |
15 |
7. |
జట్టుగా కృత్యాల నిర్వాహణ |
5 |
8. |
ప్రాజెక్ట్ కొనసాగింపు చర్చా ప్రణాళికొ |
10 |
|
మౌఖిక వ్యక్తీకరణ /లిఖిత రిపోర్టు |
10 |
9. |
పూర్వస్థాయి నుంచి మెరుగుదల |
10 |
మొత్తం |
100 |
నేటి ఆధునిక ప్రపంచంలో శక్తి వినియోగం లేకుండా మనుగడ సాగించలేము. ప్రపంచ జనాభా రోడురోజుకి పెరుగుతోంది. ఈ కారణంగా శక్తి, ఇంధన ఉత్పత్తి రోజుకు పెంచుకుపోవాల్సి ఉంది.
శక్తి వనరులు: శక్తి వనరులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
సహజ ధన వనరులు సాంప్రదాయేత్తర వనరులు ఎన్నటికీ తరిగిపోవు. అవి సాప్రదాయేత్తర వనరులు ఎన్నటికి తరిగిపోవు. అవి పునరుత్పత్తి అవుతాయి. సాంప్రదాయేత్తర ఇంధన వనరులుకు, ఉదాహరణ సౌరశక్తి. పవన, గాలి శక్తి, సముద్ర అలల శక్తి బయోమాస్ వనరులైన నాచురల్ గ్యాస్, క్రూడాయిల్, బొగ్గు, యూరేనియంలు వినియోగించే కొద్దీ తరిగిపోతాయి. తిరిగి వీటిని పొందలేము.
మానవజీవితంలో సహజ ఇంధన వనరులు మనకు కావలసిన శక్తిని వివిధ రూపాలలో అందిస్తున్నారు. ముఖ్యంగా మనదేసంలో సహజ వనరులైన బొగ్గు, నీరు, ఉపయోగంతోనే మనకు కావలసిన విద్యుదుత్పాదన చేస్తున్నాము.
సహజ వనరులైన బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువును రోజు రోజుకు మనకు కావల్సిన శక్తి వనరులుగా మార్చుకుని వినియోగించుకుంటున్నాం.
ప్రస్తుతం వినియోగిస్తున్న స్థాయిలో ఇకముందు కూడా ఫాజిల్ ఫ్యూయెల్ (శిలాజ ఇంధన వనరులు) వినియోగిస్తే ఉన్న బొగ్గు నిల్వలు సుమారు 100 సంవత్సరాలు, ఆయిల్ నిల్వలు సుమారు 60 సంవత్సరాల వరకు మాత్రమే సరిపోతాయి. కావున భవిష్యత్తు తరాలకు సహజ ఇంధన వనరులు అందుబాటులో ఉండాలంటే మనందరము ఇంధన వినియోగం – పొదుపు వినియోగంపై జాగ్రత్త వహించాలి. దీనికి మార్గం సరిగ్గా ఇంధన సామర్థ్యాన్ని ఉపయోగించడం.
ఇంధన సామర్థ్యం : ఎనర్జీ ఎఫిషియెన్సీ అంటే విద్యూత్ ను ఉపయోగించుకుని పనిచేయు పరికరాలైన లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు మెదలగు వాటిని వినియోగించకపోవటం కాదు, వాటిని వినియోగించుకుంటూ శక్తిని ఇంధనాన్ని ఆదా చేయటం.
ఈ క్రింది టేబుల్ ను గమనించండి
దిని సహాయంతో పాఠశాలలో, ఇంటిలో, కార్యాలయాలలో, పరిశ్రమలలో మొదలగు చోట్ల విద్యుత్ ను ఏ విధంగా వినియోగిస్తున్నారో లెక్కించండి. వారికి సూచనలు ఇవ్వండి. ఉదాహరణకు సాధారణ బల్బులు ఉంపయోగించినప్పుడు వచ్చిన యూనిట్స్ లను CFL బల్బులు ఉపయోగించినప్పుడు వచ్చిన Units లను తెలిపి విద్యుత్ ఆదాను ఖర్చును వివరించి మరల గణించండి, పోల్చండి.
సాధారణంగా మనము ఉపయోగించే కొన్ని గృహోపరకణాల విద్యుత్ వినియోగస్థాయి ఇలా వుంటుంది. |
||||
|
గృహోపకరణము |
కెపాసిటీ (వాట్స్ లో) |
వాడకం (గంటలలో) |
వినియోగం (యూనిట్లలో) |
కూలింగ్ సాధనాలు |
ఎయిర్ కండిషనర్ |
1500 – 2500 |
12 |
8.5 – 14.5/రోజుకు |
ఎయిర్ కూలర్ |
170 |
10 |
1.7/ రోజుకు |
|
ఫ్యాన్ |
60 |
10 |
0.6/ రోజుకు |
|
రిఫ్రిజిరేటర్ |
200 |
24 |
2/ రోజుకు |
|
విద్యుత్ దీపాలు |
సాధారణ బల్బు |
100/60/40 |
5 |
0.5/0.3/0.2/ రోజుకు |
ఫోరోసెంట్ బల్బు |
40/20 |
7 |
0.25/0.15/ రోజుకు |
|
స్లిమ్ ట్యూబ్ |
36 |
7 |
0.26/ రోజుకు |
|
కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ |
7/9/11/13 |
8 |
0.06 – 0.09/ రోజుకు |
|
వాటర్ హీటర్ |
ఇన్స్టెంట్ గీజర్ |
3000 |
1 |
3/గంటకు |
స్టోరేజ్ టైప్ |
2000 |
1 |
2/ గంటకు |
|
ఇమ్మర్షన్ రాడ్ |
1000 |
1 |
1/ గంటకు |
|
హీటింగ్ సాధనాలు |
విద్యుత్ కాటిల్ |
1000-2000 |
1 |
1 – 2/ గంటకు |
హీట్ ప్లేట్ |
1000-1500 |
1 |
0.8/ గంటకు |
|
టోస్టర్ |
800 |
1 |
0.8/ గంటకు |
|
ఐరన్ |
750 |
1 |
0.65/0.75/ గంటకు |
|
ఓవెన్ |
1000 |
1 |
1/ గంటకు |
ఆధారం: వి. గురునాథ రావు