పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతరిక్షంలో ఆహారం

చందమామలో గోరు ముద్దలు తిన్న అస్త్రోనట్స్.

చందమామ రావే జాబిల్లిరావే అని చిన్నప్పుడు 'అమ్మ' చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించింది కదా. మీరైతే గోరుముద్దల అన్నం తిన్నారు. మరి చందమామ పైకి పోయే వ్యోమగాములు (Astronants) ఏ ముద్దలు తింటారు. అసలు ఏమి తింటారు? ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? ఎందుకంటే అంతరిక్షంలో భూకక్ష్యను దాటిన తరువాత గురుత్వాకర్షణ (gravity) వుండదు కదా. భారరహిత స్థితిలో ఆహారం చిందితే అది తేలుతూ అటు ఇటు కదులుతూ వుంటుంది. క్రిందకు పడదు. గ్లాసులో నీరు నిలువదు. నీరు కూడా గాలిలో తేలుతూ వ్రేలాడుతూ వుంటుంది. ఇవి అంతరిక్షనౌక (Space Craft) లో అటు ఇటూ తిరుగుతూ చికాకు కలిగిస్తాయి. అంతేకాక నౌకలోని అనేకరకాల స్విచ్చిలను, సున్నిత పరికరాలను నాశనం చేయవచ్చు. అసలు వ్యోమగాములే నౌకలో భారరహిత స్థితిలో తేలుతూ వుంటారు కదా. అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల (International Space Station) వుంది. ఇందులోని సునీతా విలియమ్స్ లాంటి వ్యోమగాములు రోజుల తరబడి నివాసం చేస్తారు. మరి వీళ్ళు ఏమి తింటారు? ఎలా తింటారు? తెలుసా? రండి తెలుసుకుందాం.

అంతరిక్షంలో తిన్న తొలి ఆహారం ఏమిటో తెలుసా! మెత్తటి నున్నని చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారం టూత్ పేస్ట్ లాంటి ట్యూబ్ లతో తీసుకువెళ్ళి వ్యోమగాములు ఆహారంగా స్వీకరించారు. 1961లో మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు యూరీ గగారిన్ (రష్యాకు చెందిన కాస్మోనాట్) 160 గ్రాముల బరువు కలిగిన 3 ట్యూబ్ లలో పేస్ట్ చేయబడిన ఆహారం (pured meat), చాక్లెట్ సాన్ అంతరిక్షంలో ఆహారంగా తీసుకున్నాడు. అప్పటికి ఉన్న అపోహ ఏమిటంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి ఆహారం నమిలి మింగడం సాధ్యం కాదు అని భావించేవారు.

క్రీ.శ. 1962లో అమెరికా దేశపు మొదటి వ్యోమగామి జాన్ గ్లెన్ (John Glenn) భారరహిత స్థితిలో అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఆయన పై అపోహను పటాపంచలు చేస్తూ ఘనపదార్థాన్ని అంతరిక్షంలో 'తిని నమిలి మింగాడు. దానితో గురుత్వాకర్షణ లేకపోయినా ఆహారం తినే చర్య (peristalsics) కు ఆటంకం లేకుండా అన్నవాహిక (Esophagus) లో ఆహారం వెళుతుందని, సహజసిద్ధమైన ఆహారాన్ని మ్రింగే ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది.

ఈ అనుభవంతో అంతరిక్ష ఆహారంలో మార్పులు వచ్చాయి. ఎండబెట్టి ఫ్రీజ్ చేసిన పొడి కా ఆహారం, గంజిలాంటి ఆహారం పంపేవారు. ఫ్రీజ్ చేసి వేరే ఎండబెట్టి, వండిన ఆహారాన్ని వెంటనే చల్లబరచి పో వ్యాక్యూం గదిలో వుంచి దాని నుండి నీటిని పీల్చేసేవారు. (ఈ ఆహారం ఫ్రిజ్ లో వుంచకపోయినా సంవత్సరాల జీ కొద్ది నిలువ వుంటుంది! దీన్ని ప్రత్యేకమైన ప్లాస్టిక్ సంచులలో అంతరిక్షంలోకి తీసుకుపోయేవారు. పళ్ళను ఎండిపోయినా పొడిగా తినేయవచ్చు. కానీ ఇతర పదార్థాలు పొడిగా తినడం చాలా కష్టగా వ్యోమగాములు ఇబ్బంది పడేవారు. దీనికై నీటి తుపాకి (water gun) ద్వారా నీటిని ప్లాస్టిక్ సంచిలోని ఆహారానికి పంపి, కొన్ని నిమిషాల తరువాత తడి ఆహారాన్ని తినేవారు.

1966లో Gemini III శాటిలైట్ కు చెందిన వ్యోమగామి జాన్యంగ్ తన కమాండర్ కు ఇష్టమని ఎవరికీ తెలీకుండా బీఫ్ శాండ్ విచ్ ని తనతోబాటు తిసుకువెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతో NASA National Aeronatics and Space Administration) అంతరిక్షంలో తీసుకుని ఆహారం పట్ల చాలా నిబంధనలు, జాగ్రత్తలు ఆంక్షలు విధించింది. క్రీ.శ. 1968 నుండి 75 వరకు జరిగిన 'APPOLO' శాటిలైట్ కార్యక్రమాలలో కొత్తగా వ్యోమగాములు వీటిని వేడిచేసుకునే సదుపాయం కల్పించబడింది. దీనివల్ల పొడి ఆహారాన్ని తడి చేసి వేడిగా తినే అదనపు సౌకర్యం Luxury) కలిగింది. దీనివల్ల ఆహారం కాస్త సులభంగా వీర్ణం అయ్యేది. తరువాత స్పూన్-బౌల (చెంచా-గిన్నె) అమరిక గల ప్రత్యేక ప్లాస్టిక్ జిప్ కలిగిన ప్లాస్టిక్ పాత్రను రూపొందించారు. ఈ పాత్రలో ఆహారం వుంచి తడిగా వుండడం వల్ల న్పూనుకు అంటుకుని తినడానికి సులభమైంది.

క్రీ.శ. 1973-74లో NASA అతిపెద అంతరిక్ష ప్రయోగశాల Skylab ను ఏర్పాటుచేసాడు (ఇది 1979లో సముద్రంలో కూలిపోయింది. అదో పెద్ద సంచలన కథనం మీ పెద్దవాక్షను ఎవరినైనా అడగుడి చెబుతారు) అందులో రిఫ్రిజిరేటరు, ఫ్రీజరు ఉంచుకునే సదుపాయం కల్పించబడింది. దాంతో తాపకు, ఇతర ఆహార పదార్థాలు వేడిగా నిల్వ వుంచడం ప్రారంభమైంది. అంటే ఆహారంలో శుద్ధపరచిన మాంసం, ఐస్ క్రీంలు కూడా అంతరిక్షంలో తినడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ స్కైలాబ్లో భోజనశాలలో నేలకు అతికించబడ్డ కుర్చీలు, డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. వ్యోమగాములు కూర్చున్నప్పుడు పైకి లేవకుండా (గురుత్వాకర్షణ వుండదు కదా) కాళ్ళ దగ్గర, తొడల దగ్గర బెల్టుల సాయంతో కుర్చీకి అంటిపెట్టుకుని ఆహారం తినేవారు. పళ్ళేలు టేబుల్ పై వెల్ క్రో (బూట్లకు వుండే ముళ్ళ ముళ్ళ పట్టీ) సహాయంతో అతికించేవారు.

నిల్వ వుంచిన ఆహారం ప్రతి రోజు తినడం వల్ల వ్యోమగాములు నీరసించి పోతారు. బోర్ గా అనిపిస్తుంది. వెగటు కలుగుతుంది. వారికి మసాలా గల ఆహారం తినాలనిపిస్తుంది. అసలే భారరహిత ప్రదేశం (weight lessness) వ్యోమనౌకలో తేలుతూ ఇబ్బంది పడుతూ వాసన, రుచిలేని ఆహారం తింటూ చాలా ఇబ్బంది పడేవారు. అంతేకాక ఆహారం తిన్న తరువాత శుభ్రపరచడం (House keeping) కోసం 90 నిమిషాలు కష్టపడవలసి వచ్చేది.

Sky lab పతనం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల (ISS) ఏర్పాటయింది. ఇందులో వివిధ దేశాల వ్యోమగాములు ప్రయోగాల నిమిత్తం వెళుతుంటారు. కాబట్టి రకరకాల రుచుల ఆహారం అవసరం అయ్యేది. ISS లో గది ఉష్ణోగ్రత వద్యే అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, మాంసం నిల్వ ఉంచేందుకు సదుపాయం వుంది. కాబట్టి వ్యోమగాములు వారి రుచికి తగినట్లు ఆహారం చేసుకునే ఆస్కారం ఏర్పడింది.

అంతరిక్షంలో నీరు త్రాగడానికి ప్రత్యేక ఏర్పాటు వుంటుంది. నీరు అటు ఇటు కారి తిరగకుండా ప్రత్యేకమైన పాకెట్, లోపలి స్ట్రా అమరికతో వుంటాయి. కొన్ని పాకెట్లకు ప్రత్యేకమైన నాజిల్ వుంటుంది. దీనివల్ల ద్రవం నేరుగా నోటిలోకి పోయే సదుపాయం వుంటుంది.

అంతరిక్షంలో తీసుకునే ఆహారం నిర్ణయించడం చాలా కష్టతరం. ఎందుకంటే మొదటగా ఆహారం వ్యోమగామికి మానసికంగా సరిపోయేలా, ఆరోగ్యకరంగా, సులభంగా జీర్ణమయ్యేలా, తిని మింగడానికి అనువుగా వుండాలి. రెండవది సున్న గురుత్వాకర్షణ గల ప్రదేశంలో తినడానికి సులభంగా వుండాలి. ఆహారపు ప్యాకింగ్ తేలికగా వుండి, త్వరగా వడ్డించడానికి, అంతే వేగంగా శుభ్రపరచడానికి అనుకూలంగా వుండాలి. ముక్కలు, తునకలులాగ ఆహారం మిగలకూడదు. అది అంతరిక్షంలో చాలా ప్రమాదం.

aug05.jpgభవిష్యత్తులో అంతరిక్షంలో సుదూర తీరాలకు మార్స్ గ్రహానికి ప్రయాణం చాలా రోజులు పడుతుంది. కాబట్టి వ్యోమగాములు వ్యవసాయదారులుగా, తోటమాలిగా మారవలసి వస్తుంది. అంటే వారికి కావలసిన వేరుశనగ, పూదీనా, కాబేజీ, కూరగాయలు, బియ్యం వారే పండించుకోవలసి వస్తుంది. ఇది వరకే అంతరిక్షంలో మొక్కల పెంపకం మొదలయ్యింది. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై నివాసానికి ఇది నాంది సుమా.

ఆధారం: యుగంధర్ బాబు.

3.01714285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు