పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతర్వాహిణి

కొన్ని నదులు పైకి కనిపించకుండా భూమి అంతరపొరల్లో ప్రవహిస్తుంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

nov20అనాదిగా ప్రజలు నదీపరీవాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకొన్నారు. ఎందుకంటే నది వారికి వారి పశువులకు త్రాగేందుకు నీరు, వాళ్ళ వ్యవసాయానికి కావలసిన నీరు అందించేది. పురాతన నాగరికతలు అన్ని నదులవొడ్డునే వికసించాయి. ఇవి మనకు పైకి కనిపించే నదులు. కాని కొన్ని నదులు పైకి కనిపించకుండా భూమి అంతరపొరల్లో ప్రవహిస్తుంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మనదేశంలో సరస్వతి అనే నది భూమి లోపల ప్రవహిస్తూ అలహాబాద్ లో గంగా, యమునలతో కలుస్తుందని అంటారు. దీనినే త్రివేణి సంగమం అని కూడా అంటారు. నిజానికి సరస్వతి సింధూ నదికి ఉపనదిగా ఉండేది. కాలక్రమేణ అది థార్ ఎడారిలో కలిసిపోయింది. నిజానికి ఇలా భూమి లోపల నదులు ప్రవహిస్తాయా? అనే సందేహం మనకు కలుగుతుంది.

శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే భూగర్భనదులు నిజానికి వర్షం నీరు భూమిలోకి ఇంకి పెద్ద జలాశయాలుగా ఏర్పడి అవి ప్రవహించగలిగినంత దూరం ప్రవహిస్తుంటాయట. వర్షపునీరు భూమిలోకి ఇంకి లోపలి పొరల్లోకి చేరుతుంది. అక్కడ మరింత వర్షపు నీరు వచ్చి చేరినప్పుడు కొంత వత్తిడి ఏర్పడి భూమి పొరలను తొలిగించుకొంటు ముందుకు ప్రవహిస్తాయట.

భూగర్భ నదులు ఏర్పడాలంటే భూమి పొరల్లో ఉండే పదార్థం ప్రధాన కారణమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూమి పొరలో రంధ్రాలు ఉండడం వల్ల ఈ నీరు సులభంగా ప్రవహిస్తుంటుందని అంటున్నారు.

మనం బావి కోసమో లేక బోరు కోసమో భూమి లోపలి పొరల్లోకి తవ్వి 200 అడుగుల నుండి 500 అడుగుల దాకా బోరు వేస్తే మనకు నీరు వస్తుంది కదా. ఇలా భూమి లోపలి పొరల్లో చేరిన నీరు ప్రవహించడానికి దారి దొరికితే అది భూగర్భనదిగా ఏర్పడుతుంది.

ఈ భూగర్భనదుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి పుట్టుక, ప్రయాణం, ఏ ప్రాంతంలో ఇవి భూమి మీదికి వస్తున్నాయి అనే విషయాలపై పరిశోధనలు జరుపుతున్నారు. భూగర్భనదీ జలాల్లో కొన్ని రకాల రంగు రసాయనాలు కలుపుతారు. ఈ రంగు రసాయనం నీళ్ళకు రంగును ఏర్పరుస్తుంది. ఈ రంగు నీళ్ళు ఏ ప్రాంతంలో భూమి బయటకు వస్తున్నాయో శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు. భలే వున్నాయికదా భూగర్భనదులు.

ఆధారం: సి. ఆనంద్

2.99694189602
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
సంబంధిత అంశాలు
మరిన్ని ...
పైకి వెళ్ళుటకు