హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / అగ్గి పై నడిచేవారు వారి కాళ్లు కాలకుండా ఎలా నడువగలుగుతారు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అగ్గి పై నడిచేవారు వారి కాళ్లు కాలకుండా ఎలా నడువగలుగుతారు?

అగ్ని గుండాలపై నడిచే వాళ్ళు ముందుగా కాళ్లను బాగా నీటితో కడుగుతారు.

అగ్ని గుండాలపై నడిచే వాళ్ళు ముందుగా కాళ్లను బాగా నీటితో కడుగుతారు. పాదాల మీద ఉన్న నీటి తడి ఆరకముందే నిప్పులపై నడుస్తారు. నిప్పులకు పాదాలకు మధ్య నీటి పొర ఒక ఉష్ణ కవచం లాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే నీరు అధమ ఉష్ణ వాహకము పైగా నిప్పుల నుంచి వచ్చే వేడి పాదాలకు చేరి పాదాలకు గాయం కానీయకుండా ఆ వేడిని నీటి పొర గ్రహించి ఆవిరి కావడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు మనిషి అరికాలి చర్మము కొద్దిగా మందంగా ఉండడం వల్ల కాస్తంత వేడిని భరించగలదు. దీనికి తోడు అగ్ని గుండాల మీద నడిచే వాళ్లు చాలా ఆదరాబాదరగా, వడి వడిగా నిప్పులను దాటుతారు. కాబట్టి కాళ్లుకాలే వ్యవధి కూడా ఉండదు. అంతే తప్ప నిప్పులపై నడవగలగడం వెనుక ఏ మంత్రశక్తి అతీంద్రియ శక్తులు, మహత్యాలు లేవు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు