పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అడగండి చెబుతాం

జవాబులు అడిగి తెల్సుకుందాం.

ప్రశ్న: ముసివుంచిన గదిలో రిఫ్రిజిరేటర్ ను తెరిస్తే ఏమగును?

జవాబు: రిఫ్రిజిరేటర్ ను తెరవకపొయినా ముసివుంచిన గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఒక వస్తువు ఉష్ణోగ్రతను కొంత మేర పెంచడం కన్నా అంతే మేర ఉష్ణోగ్రతను తగ్గించడం కష్టతరం.

ఉదా: మన ఇంట్లో ఓ అరకిలో ఇనుప రాయి ఉందనుకుందాం. దాని ప్రస్తుత ఉష్ణోగ్రత 30౦ c అనుకుందాం.

jan18.jpgఇప్పుడు దానిని 50౦ ఉష్ణోగ్రతకు పెంచాలనుకుందాం. అంటే చేస్తూన్నామన్నమాట. అప్పుడు అవసరమయ్యే విద్యుత్శ్చక్తి విలువ ప్రమాణాలనుకుందాం. ఇప్పుడు అదే అరకిలో ఇనుప రాయి ఉష్ణోగ్రతను ప్రస్తుతమున్న 30౦ c నుంచి 10౦ c జి తగ్గించాలను కుంటున్నామనుకుందాం. అంటే మారే ఉష్ణోగ్ర మళ్ళి 20౦ c మేరకే కదా? మరి ఈ పని తనంత తాను జరగదు. డానికి విద్యుచ్చక్తితో పనిచేసే యంత్రాంగం (Machinery) అవసరం.

ఈ యంత్రాంగాన్ని హీటర్ (Heater) చేస్తుంది. ‘P’ ప్రమాణాలను వాడి చల్లబారిచే కార్యక్రమాన్ని రిఫ్రిజిరేటార్ చేస్తుంది. ఇప్పుడు P, Q లలో దేని విలువ ఎక్కువ? P విలువే Q కన్నా చాలా ఎక్కువ. అంటే (P-Q) మేరకు అధికంగా రిఫ్రిజిరేటార్ పనిచేసేటపుడు విద్యుత్చ్చక్తి (Conversation of Energy) ఉంది కాబట్టి(P-Q) మేర అదనంగా ఖర్చయిన విధ్యత్చ్చక్తి కేవలం ఉష్ణ (Heat) రూపంలో బయటపడుతుంది(Dissipation) రిఫ్రిజిరీర్ ముసి వుంచి అందులో అరకిలో ఇనుప నుంచి వేడిని బయటకి లాగాలి కదా! అది కూడా గదిఒలె వస్తుంది. అంటే రిఫ్రిజిరేటార్ పనిచేస్తున్నపుడు P ప్రమాణాల మేరకు గడిలోకి ఉష్టం వెలువడుతుంది. అంటే గది ఆ మేరకు వేడెక్కుతుంది.

అయితే ప్రశ్నలో గదిలోని రిఫ్రిజిరేటార్ ను తెరిచాము కాబట్టి గదిలోని గాలికూడా రిఫ్రిజిరేటర్ లోకి వెళ్లి చల్లబడాలి కాబట్టి గది ఉష్ణోగ్రత తగ్గుతుందేమోనని అనుకునే అవకాశం ఉంది. కాని రిఫ్రిజిరేటర్ ను తెరిచినా గదిని మాత్రం మూసే వుంచాం కదా! కాబట్టి గదిని X ప్రమాణాల ఉష్ణోగ్రతను తగ్గించడానికైన విద్యుత్ (వేడి) పార్టుకన్నా నికరంగా తగ్గినా వేడి తక్కువ కాబట్టి గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ విషయాలను మీరు పై తరగతుల్లో మరింత విశదంగా “కార్నాట్ సిద్దాంతం” లో తెలుసు కుంటారు.

ప్రశ్న: పంట చేస్తుండగా ప్రెషర్కుక్కర్ లోని పదార్ధాల విషయంలో ఏమి జరుగుతుంది?

జవాబు: ఒక ద్రవపు బాష్చపీడనం (Vapour Pressure), వాతావరణ పీడనం (Atmospheric Pressure)కు సమానమైనప్పుడు ఆ ద్రవం jan19.jpgమరుగు (Boil) తుందని మీరు వినేవుంటారు. అయితే ద్రవపు బాష్చపీడనం ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ పెరుగుతుంది. అయితే వాతావరణ పీడనం స్ధిరంగా ఉన్నట్లయితే ఆ పిడనానికి తన బాష్చపీడనం సమానంయ్యేలా చేసే ఉష్ణోగ్ర తన ప్రస్తుతపు ఉష్ణోగ్రత కన్నా ఎక్కువే ఉంటుంది. ఆ ఉష్నోగ్రతనే ఆ ద్రవపు సాధారణ మరిగే ఉష్ణోగ్రత (Noraml Boiling Point) అంటారు. అది నీటికి 100౦ c ఉష్ణోగ్రత అవసరం. ఒకవేళ బయటి పీడనం 1 ఆట్మాస్పీయర్ ఉన్నపుడు నీటి బాష్చపీడనం కూడా 1 ఆట్మాస్పీయర్ ఉండి కాబట్టి మరగదు. అంటే ఆవిరైపోదు. 100౦ c కన్నా అధిక ఉష్ణోగ్రతకు పెంచితే తప్ప తన బాష్చపీడనం, బయటి పిడనానికి సమానం కాదు. కాబట్టి నీటిని 100౦ c దాటినా మరిగిపోయి అవిరికాకుండా ఉంచాలంటే బయటి పీడనం పెరాలి. ప్రెషర్ కుక్కర్ లో ఇదే జరుగుతుంది. ఆవిరి బయటికి పోలేకపోవడం వల్ల బయటి పీడనం పేరుగుతుంది. అంటే కుక్కర్లోని నీరు, అందులోని దినుసులు 100౦ చ కన్నా అధిక ఉష్ణోగ్రతకు మరగకుండానే చేరుకుంటాయి. తద్వారా దినుసులు బాగా ఉడుకుతాయి. పర్వతాల పీడనం తక్కువ కాబట్టి నీరు 100౦ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దే అవిరవుతుంది. కాబట్టి దినుసులు ఉడకవు.

ప్రశ్న : మానవుడు జన్మించక ముందు భూమి ఎలా ఏర్పడింది?

జవాబు: మానవుడు జన్మించడం కొసం భూమి ఏర్పడలేదు. మతాలూ చెప్పేది ఏమంటే తనకు ఇష్టమైన ప్రాణిని తయారు చేయాలని దేవుడికి బుద్ధి పుట్టిందని, అతను ఉండటం కోసం భూమిని, భిమి మీద చెట్టూ , పుట్టా, ఘన్నూ, గిన్నూ, కర్రా, బుర్రా, ఆలూ, పులూ పుట్టించాడని. అయితే ఇందంతా శుద్ధ సోది. అసలు విషయం ఏమిటింటే భూమి అనియంత్రితంగా ఏర్పడింది. భూమి మీద ఏర్పడిన స్ధితిగతులు, వాతావరణంలోని పరిస్దితులు మానవుడనే జీవ పరిణామక్రమంలో ఏర్పడానికి అనువుగా వున్నాయి. అయితే భూమి పుట్టుకకూ భూమి మీద మొదటి వార్శానికి మధ్య కొన్ని కోట్ల సంవత్సరాల నిడివి వుంది. మొదటి నీటి బిందువుకమొదట జివకరణానికి మధ్య కూడా కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి వుంది. jan20.jpgమొదటి జివకణ అభివృద్ధికి, మానవుడి అవిర్భావానికి మధ్య కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు దొర్లాయి. విశ్వవిర్భావంలో భూమి పుట్టుక ఏ దశలో జరిగిందో మీకు సైన్సు కధల్లో వివరించి ఉన్నాము.

3.05309734513
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు