హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / అమావాస్యకు పౌర్ణమికీ పిచ్చివాళ్ళకు పిచ్చి ఎక్కువవుతుందా?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అమావాస్యకు పౌర్ణమికీ పిచ్చివాళ్ళకు పిచ్చి ఎక్కువవుతుందా?

అమావాస్య పౌర్ణమి రోజులలో పిచ్చి ఎక్కువవుతోందను కోవడం కేవలం అపోహ.

మనస్సు అధిదేవత చంద్రుడనీ, బలహీన మనస్సుల మీద చంద్రుని ప్రభావం అధికంగా వుంటుందనీ, అమావాస్య పౌర్ణమిలకు పిచ్చి ఎక్కువ అవుతుందని, ఒక గట్టి నమ్మకం దేశదేశాలలో అనాదిగా కనిపిస్తోంది. పిచ్చి వాడిని లూనటిక్ అనడం కూడా ఇందుకే. లూనా అంటే చంద్రుడు అని అర్థం.

అమావాస్య పౌర్ణమి రోజులలో పిచ్చి ఎక్కువవుతోందను కోవడం కేవలం అపోహ. చంద్రుడికి మానసిక జబ్బులకు ఎలాంటి సంబంధంలేదు. జనం తమ పరిశీలనల నుండి కొన్ని అపోహలు ఏర్పరచుకుంటారు.

“ఎక్యూట్ సైకోసిస్” అనే మానసిక వ్యాధి ప్రారంభమయ్యేటపుడు కాకతాళీయంగా ఆరోజు పౌర్ణమి గానీ, అమవాస్య గానీ అయితే, దానికి జబ్బుకూ లంకె పెడతారు.

“హిస్టీరియా” వ్యాధితో రోగులకు తమ ప్రవృత్తి సగం తెలుస్తుంది. సగం తెలియదు. వీళ్ళకు పౌర్ణమికీ అమావాస్యకూ పిచ్చెక్కువవుతుందనే నమ్మకం వుండడంవల్ల ఆ రోజుల్లో కొంచెం అతిగా ప్రవర్తిస్తారు.

“బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి, 15 రోజులలో ఒకసారి వస్తుంది. ఆ రోజు అమావాస్య పౌర్ణమిలయితే దీనివల్ల పిచ్చి ముదిరిందనుకొంటారు.  Cycling Stage వస్తే తరచూ మానసిక జబ్బులు ఉదృతమవుతుంటాయి. కాకతాళీయంగా ఆ రోజు అమావాస్యగాని పౌర్ణమి గానీ అయితే దానివల్లే పిచ్చి ముదిరిందను కొంటారు. ఇవన్నీ ప్రజలనమ్మకాలే తప్ప పిచ్చివాళ్ళపై చంద్రుడి ప్రభావం ఏమీ వుండదు.

జవాబు టెలిపినవారు: డా..పి.శ్రీనివాసతేజ, న్యూరో సైక్రియాటిస్ట్, పొగతోట, నెల్లూరు.

3.01047120419
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు