অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది?

ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది?

a6గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కమ్యూనిటి సైన్సు సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ప్రొఫెసర్ సి.వి.రామన్ 1968 జిసెంబర్ 22న ఆంగ్లంలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులో ధారావాహికగా మీకు అందిస్తున్నాం. ఈ విషయం మీద పరిశోధనకే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది.

ఉపన్యసించేందుకు నన్ను ఓ శాస్త్రీయ విషయాన్ని ఎన్నుకోమన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండానే “ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది?” అనే విషయాన్ని ఎన్నుకున్నాను. తలపైకెత్తి చూస్తే చాలు ఆకాశం అంత కాకపోయినా మబ్బులు లేని చోట నీలంగా ఉంటుంది. ఇప్పటికీ ప్రకృతి దయగలిగినదే. ఆకాశాన్ని చూసేందుకు ప్రయోగశాలకు వెళ్ళనక్కర్లేదు. ప్రయోగశాల అవసరం లేనిదానికి ఇదో మంచి ఉదాహరణ.

a7ఊరికే తలపైకెత్తి ఆకాశాన్ని చూడొచ్చు. ఈ చిన్న కారణంలోనే ఈ విషయాన్నెన్నుకున్నాడు. వైజ్ఞానిక స్పూర్తికి ఇదో మంచి ఉదాహరణ కూడా.  చెవులు రిక్కించి, కళ్ళుతెరచి ఈ ప్రపంచాన్ని గమనిస్తే చాలు మీరు సైన్సును నేర్చుకోవచ్చు. నావరకు నాకు నిజమైన వైజ్ఞానిక సూర్తి ఏమంటే ఎల్లప్పుడు ప్రకృతిని ప్రేమిస్తూ... ఉండడమే నిజానికి ఈ ప్రపంచంలో మనమెక్కడ చూచిన అన్నిరకాల అధ్బుతాలు ప్రకృతిలో కనబడుతుంటాయి. నాకు ప్రతిదానిలోనూ కొంత నమ్మలేనిదిగా అనిపిస్తున్తుంది. మరికొంతయితే అస్సలు నమ్మడం సాద్యంగాడేమో అని అనిపిస్తుంది. అయినా మనందరమూ సరేననుకొని ఒప్పేసుకుంటాం. అలా ఒప్కోకుండా ప్రతిదానిలోను, దానివెనుక ఏముందో తరచి తరచి చూసి, మనం నివసించే ఈ అద్భుత ప్రపంచాన్ని తెలుసుకోవడమే, నా దృష్టిలో అసలైన వైజ్ఞానిక స్పూర్తిసారం. మనం చూచే ప్రతి విషయం కేవలం ఉత్సుకతను రేకెత్తించేది మాత్రమే గాదు. అది మనకొక సవాలు కూడా. మన చుట్టూ ఆవరించి ఉన్న ఓ పెద్ద రహస్యాన్ని ఛేదించాలన్న మనిషి స్పూర్తికే ఓ సవాలు.

మనిషి స్ఫూర్తిక ఎదురైన ఈ సవాలును సైన్సు నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటుంది.డా.,సారాభాయ్ అన్నట్లు నేడు మనముందున్న పెద్ద సమస్య ఏమిటంటే, మన యువత ఈ సవాలును ఎదుర్కొనేటట్లు చెయడమెలా? నేర్చుకోవడం కోసం, కృషి చేయడం కోసం మరొక్కసారి భారతదేశాన్ని జ్ఞాన కేంద్రంగా నిర్మించడమెలా? మీరందరూ ఈ విషయంలో విజయం సాధిస్తారని ఆశిస్తూ నన్ను తిరిగి వెనక్కు నా సమస్య అంటే ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? అనే దానికి వెళ్ళనివ్వండి.

sep16ఈ ప్రశ్నే ఎందుకు వేశానంటే ఇది సులభమైన విషయం కేవలం పైన చూస్తే చాలు ఆకాశం నీలంగా కనబడుతోంది. కాని ఎందుకని నీలంగా ఉంటుంది? ఇందులోని ఆసక్తికరమైనసంగతి ఏంటో తెలుసా? చాలా సాదాసీదాగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. ఆకులు ఎందుకు పచ్చగా ఉంటాయని వృక్షశాస్త్రం తెలిసిన అతనిని అడగండి. అతను “క్లోరోఫిల్, క్రోరోఫిల్” అని సణుగుతాడు. అంతే అయిపోయింది. అన్ని శాస్త్రీయమైన ప్రశ్నలకు సమాధాన్నాన్ని చాలా సులభంగా, క్లుప్తంగా ఇలా ఒకటి రెండు పదాలతో చెప్పి సరిపెట్టవచ్చు. ఆ రకమైన సమాధానంతో పరీక్షలలో ఖచ్చితంగా పాస్ గావచ్చు కాని అని నిజమైన సమాధానం గాదు. నేను ఇంతకముందే చెప్పినట్లు ప్రకృతి యొక్క వైజ్ఞానిక సవాలు ఆలోచించడానికే గాని, కేవలం ఏదో ఒకటి కొనుగొనడానికి మాత్రం గాదు. నిరంతరం ఆలోచించాలి. ప్రకృతి అనే ఈ పెద్ద రహస్యంలోకి చూరి చేధించాలి. “ఎందుకని నీలంగా ఉంటుంది?” ఇందులో రెండు విషయాలున్నాయి. అందుకే చాలా ఆసక్తికరమైనది. ఆకాశం అక్కడ ఉన్నది నేనిక్కడ ఉన్నాడు. నాకది నీలంగా కనబడుతున్నది. మానవ మెదడు, మానవ మేధస్సు ఇవి రెండు ఈ సనస్యవో ఇమిడి ఉన్నాయి. ఈ విషయాన్నిలా పనిపిల్లల ముందుచుదాం. ఎలా అంటే? దీన్ని గురించి ఏ పుస్తకాన్ని చదవవద్దు. మీ టీచరును అడగవద్దు. ఉరికే కూర్చొండి. ఈ సమస్య మీద ఆలోచించే ప్రయత్నం చేయాలి. గతంలో ఈ విషయంపై నిన్నెవరూ ఇబ్బంది పెట్టలేదనుకోవాలి. కూర్చుని ఆలోచించాలి. నీకు నీవే ఈ ప్రశ్న వేసుకోవడం ద్వారా ఎక్కువ ఉత్సాహాన్నిచ్చే విషయాన్ని కనుగొంటావు. నీకు నీవే కనుగొనగలిగే ప్రశ్న అనుకో. నేనిప్పుడు మీ ముందు దీన్ని ఉంచుతాను. ఓ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మంచి మార్గం మరొక చిన్న ప్రశ్న అడగడమే. రాత్రివేళ మనం అన్ని నక్షత్రాలను చూస్తాం. నిర్మలమైన రాత్రివేళ నీవు ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి చూస్తావు. అదే నక్షత్రాలు పగలు కనబడవెందుకుకని? దయచేసి నీకు నీవే ఈ ప్రశ్నను వినయంగా వేసుకో. దీనికి ఒక స్పష్టమైన కారణమున్నది. ఈ భూమి ఓ యువతిలాగా ఓ ముసుగులో దాకొన్నది. ఆ ముసుగే ఆకాశం. ఆ ముసుగు మనచుట్టూ కూడా కప్పేసింది. పగటిపూట నక్షత్రాలను దాచిపెడుతుంది. ఇంతకీ ఆ ముసుగేమిటి? భూమి చుట్టూ ఉన్న వాతావరణం. అదే ముసుగు రాత్రి పూట చాలా పారదర్శకంగా ఉంటుంది. అందుకే కనబడదుకూడా. కనుక రాత్రివేళ చిన్న చిన్న నక్షత్రాలను, పాలపుంత (ఆకాశగంగ)ను చూడగలం. పగటిపూట అదే ముసుగు అపారదర్శకమవుతుంది, కనబడుతుంది. నక్షత్రాలను కనబడనీయకుండా కప్పివేస్తుంది. నన్ను ఇక్కడ మరో విషయాన్ని చెప్పనివ్వండి. పగటిపూట వాతావరణమనే ఓ పెద్ద గాలిస్థంభం గుండా సూర్యకాంతి ప్రయాణిస్తున్నప్పుడు సదరు వాతావరణమే వెలుగుతుంది. కనుక పారదర్శకంగా మారుతుంది. (ఓ రాత్రినేళ మేడమీద వెల్లకిలా పడుకొని ఉన్నావనుకో, నీ కళ్ళెదురుగా కొంచెం పైన ఒక కరెంటు బల్బు వ్రేలాడుతుందనుకో భల్బును ఆర్పివేసినప్పుడు దానివెనుకనున్న నక్షత్రాలను బల్బులో నుంచి చూడగలం. ఆర్పివేసిన బల్బు పారదర్శకం కనుక. అదే బల్బును వెలిగించామనుకోండి. ఆ వెలుగుతున్న బల్బులోంచి అవతలి నక్షత్రాలు కనబడవు. అంటే వెలుగుతున్న బల్బు అపారదర్శకంగా మారింది). ఏ ఇతర దట్టమైన ముసుగులు అంటే మేఘాలు లేనప్పుడు మాత్రమే ఆకాశం నీలంగా మనకు కనబడుతుంది. అంతేకాదు దుమ్ము ధూళి కూడా ఉండకూడదు. దుమ్ముధూళి ఉంటే ఆకాశం నీలంగా కనబడదు. కొన్ని సందర్భాల్లో ఆకాశం నీలంగా లేకపోవడానికి ఇదే కారణం. కనుక ఆకాశం ఎంత శుభ్రంగా ఉంటే అంత నీలంగా ఉంటుంది. కేవలం ఆకాశాన్ని చూచి మనం వాతావరణ స్థితిని అవగాహన చేసుకోవచ్చు.

sep17నాకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. నిండు పున్నమిరాత్రి నిర్మలాకాశాన్ని చూడాలనే ఉత్సూకత మీలో ఎందరికుందో? నాకు తెలియదు. వెన్నెల అనేదు కూడా సూర్యకాంతే. అయితే సూర్యకాంతి చంద్రుని మీదపడి ప్రతిఫలించేదే. మీలో ఎంతమంది నిండు పున్నమారాత్రి నిర్మలాకాశాన్ని నిజంగా పరిశీలించి ఉంటారో నాకు తెలియదు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆకాశం నీలంగా ఉండదు. అది పాలిపోయిన రంగులో ఉంటుంది. ఎండలో ఆకాశం నీలంగా కనిపిస్తుందెందుకని? మరి వెన్నెల్లో నీలంగా కనిపించదెందుకని? చంద్రునికి ప్రదీవన సామర్థ్యం చాలా తక్కువనేది స్పష్టమే. నిండుపున్నమి వెన్నెల, సూర్యకాంతి తీవ్రతల విష్పత్తని గణించేందుకు పెద్ద గణిత శాస్త్రం అవసరంలోదు. ఓ గణిత విద్యార్థి ముందు దీన్ని ఉంచి కూర్చుని సాధించమని అడుగుతున్నాను. చంద్రుడు ఎంత పెద్దవాడు? అతని ద్యుతి వెలుగు ఎంత? ఇదొక చిన్న ఖగోళ సమస్య, ఉడ్డాయింపుగా గణించి చెప్పవచ్చు. వెన్నెల ఎండతో పోల్చితే ఐదులక్షలింట ఒకవంతు మాత్రమే ద్యుతిని కలిగి ఉంటుంది. చాలా చాలా తక్కువ అనిపిస్తుంది కదా. కాని వెన్నెల చాలా ప్రకాశవంతం అనిపిస్తుందిగదా. అయిన ఎందుకని అంత ప్రకాశవంతమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్లు చాలా తక్కువ ప్రదీపన స్థాయిలకు అలవాటు పడినాయి కనుక. కాని నిజానికి వెన్నెల అన్ని నక్షత్రాలను ముసుగులా కప్పేసి కనబడనీయంనంతటి కాంతివంతమసినదేం గాదు. కాన్ని వెన్నెల్లో ఆకాశం నీలిరంగులో మాత్రం కనబడదు. ఈ సూర్యకాంతి చంద్రకాంతుల పోలిక ఒక ముఖ్యమైన వాస్సవాన్ని మన ముందుంచుతుంది. అది మానవ దృష్టి యొక్క ఖచ్చితమైన ప్రాధమికమైన విషయాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి రంగులను గ్రహించేందుకు మనకు హెచ్చుస్థాయి ప్రదీపనం. అవసరం. సూర్యకాంతి ఎక్కువ ద్యుతి... ఎక్కువ ఉండుట వలననే ఆకాశం నీలంగా ఉంటుంది. ఈ సూత్రం బహుశా అనుకున్నంతగా అభినందనకు నోచుకోలేదు. ఎంత ఎక్కువగా ప్రదీమనముంటే అంత కాంతివంతంగా రంగులు కనబడతాయి. సూర్యకాంతి పదిలక్షల వంతుకో కోటివంతుకో తగ్గిపోతే రంగులను గుర్తించే స్పృహ ను కోల్పోతాము. ఇది మానవ దృష్టియొక్క చాలా ముఖ్యమైన ప్రాథామికమైన సత్యం. దీనిని కేవలం పరిశీలించుట ద్వారా ఆలోచించుట ద్వారా అవగాహన చేసుకోగలం. ఇలాంటి వివరణలను ఎన్నింటినైనా ఇచ్చుకుంటూ పోగలను. అలాంటి వివరణ మరొకటి ఉన్నది. అది చిన్న దూరదర్శని ద్వారా ఓరియన్ నెబ్యూలా లోని నక్షత్రాలను చూడడం ద్వారా లబిస్తుంది. ఖగోళ శాస్త్రమంతా చక్కని ఆసక్తికరమైన గొప్ప సైన్స్ లేదనే నా నమ్మకాన్ని మీకిక్కడ ఇప్పుడు చెబుతున్నాను. అదేమంటే ఖగోళశాస్త్ర వాస్తవాలను తెలుసుకోవడానికి కేవలం ఒక మంచి బైనాక్యూలర్ ఉంటేచాలు. అయినా అదే వర్ణపటంలోని (1/40 వ వంతుభాగం) నీలంగా కనబడుతుంది. వర్ణపటంలోని మిగిలిన భాగాన్ని చూడలేము. అదంతా కనుమరుగైపోయినది. అసలక్కర్లేదు. నీలం వర్ణవటంలోని మిగిలిన భాగాన్ని కప్పేసింది. మనం ఎంత కష్టపడి పరిశీలంచినా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు కనబడవు. మనం వాటీని చూడలేము. నీవు కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో పరిశీలించితే పెద్ద మొత్తంలో మేఘాలు కనబడుతాయి. వాటిని క్యుములస్ మేఘాలు అంటారు. మరీ పెద్దవేంకాదు. చిన్నచిన్నవి, గుత్తులు గుత్తలుగా ఉంటాయి. అవి చిన్నగా కదులుతూ ఉంటాయి. అదొక మనోహర దృశ్యం. నీలాకాశంలో ఆ మేఘాలను ఉరికే చూస్తూ గొప్ప తృప్తిని పొందుతుంటాను నేను. ఆసక్తికర విషయమేమిటంటే ఆ క్యుములస్ మేఘాలు కదులుతుంటే ఆకాశం మరింత నీలంగా ఉంటుంది. దీనర్థమేమిటంటే క్యుములస్ మేఘాలు ఏర్పడేటప్పుడు మిగిలిన వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. అవి దుమ్ము ధూళి కమాలను గ్రహించి తెల్లని మేఘాలు ఏర్పడేటట్లు చేస్తాయి. మిగిలిన భాగాన్ని అందంగా శుభ్రంచేస్తాయి. ప్రకాశవంతంమైన తెలుపుకు బదులుగా అందమైన నీలివర్ణాన్ని నీవు చూస్తావు. ప్రేమైకదృశ్యం. దేవతల దృశ్యం. ఈ దృశ్యాన్ని చూసేందుకు కష్టపడనవసరం లేదు. ఇది సర్వసాధారణమైంది కనుక. ఈ పరిసుబ్రం చేసే కార్యక్రమం ఎలా జరిగింది అని మీరు నన్ను అడగవచ్చు. నేను విద్యార్తులను మేఘం అంటే ఏమిటి? అని అడిగినప్పుడు “ఓహో సార్, అదా నీటి ఆవిరి.,” సాధారణ సమాధానమయితే మేఘం నీటి ఆవిరే కాని అలంటిదిగాదు. మేఘాలు కణాలను కలిగి ఉంటాయి. పెద్ద పెద్దరాశపలైన శ్వేత మేఘ మూలికలు నీటి తుంపర్లు నీరు భారమైనది. అయినా ఎందుకని క్రింద పడదు. ఈ నీరు గాలిలో తేలడాన్ని గమనిస్తాము. మీరు చూడండి. ఇదొక కొత్త సమస్య. నేనిప్పటికే ఒక సమస్య నుండి మరొక సమస్య వెళుతున్నాను. ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది? అన్న ప్రశ్న వేసుకున్న తక్షణమే మనకు మనమే మేఘం అంటే ఏమిటి? ఎందుకని గాలిలో తేలుతుంది అని ప్రశ్నించుకుంటూ లోలోతుల్లోకి వెళుతూ భౌతికశాస్త్రంలోని లోతు సమస్యల్లో ప్రయాణిస్తాము. ఆసక్తికర సంగతి ఏమిటంటే ధూళికణాలు లేకుండా మేఘాలు ఏర్పడవు.

చిన్నవో పెద్దవో అలాంటి ధూళికణాలు ఉండాలి. మనం నేర్చుకొనే భాషలో వానిని న్యూక్లియై అంటాము. గాలిలో దుమ్ముధూళి కణాలు లేకుంటే మఘం లేదు, వర్షం లేదు. చూడండి మనం నీలి ఆకాశం నుండి వర్షపు మూలాల్లోకి, వర్షపాతంలోకి వచ్చేశామో. ఒక విషయం మరో కొత్తవిషయంలోకి దారితీస్తుంది ఇదే సైన్స్ యొక్క సారం. సైన్సు నిన్ను ఎక్కడికి తీసుకెళుతుందో అంతదూరం వెళ్ళాలి. అంతేగాని సైన్సు నుండి దూరంగా పారిపోగూడదు. నీవు ఒక ప్రశ్నవేసిన తక్షణం మరొక ప్రశ్న తలెత్తుతుంది. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న అలా అలా ప్రశ్నల పరంపర సాగుతూనే ఉంటుంది.

సమాధానం కనుగొనేలోపు విజ్ఞాన శాస్త్ర రంగమంతా ప్రయాణించాల్సి ఉంటుందని తెలుసుకుంటావు. ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది? అనే ప్రశ్న వేసుకున్నాను గనుకనే నేను మీకు మేఘాలు వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి. మేఘాలేర్పడి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మేఘాలేర్పడడంతో ధూళికణాలు ఇతర న్యూక్లియై లేకుండా  చేయడం వలన ఆకాశం నీలంగా ఉంటుంది. చిట్టచివరకు ఈ సమస్యకు ఇలాంటి సమాధానాన్ని కనుగొన్నాము. ఆకాశం నీలంగా ఉండుటకు కారణం వాతావరణంలో దుమ్ము, న్యూక్లియై లేకుండా ఉండుటవలనే. ఆకాశం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత నీలంగా కనబడుతుంది. అయితే సరిపడినంత కాంతి ఉండాలి. మీరు ప్రశ్నకు సమాధానానికి దగ్గరగా వచ్చారు.

చిన్న దూరదర్శని ద్వారా ఓరియన్ నెబ్యులాలోని నక్షత్రాలను చూడడం ద్వారా లభిస్తుంది. ఖగోళ శాస్త్రమంతా చక్కని ఆసక్తికరమైన గొప్ప సైన్సు  లేదనే నానమ్మ కొన్ని మీకిక్కడ ఇప్పుడు చెబుతున్నాను. చాలామంది తలపైకెత్తి దూరదర్శని ద్వారా ఆకాశాన్ని చూడని వారున్నారనేది చాలా ఆశ్చర్యకరం. అలాంటి వారికి ఒక నమ్మలేని విషయాన్ని చెబుతున్నాను.

అదేమంటే ఖగోళశాస్త్ర వాస్తవాలను తెలుసుకోవడానికి కేవలం ఒక మంచి బైనక్యూలర్ ఉంటేచాలు. ఇది ఓ సాధారణ పరికరం. ఒక బైనాక్యూలర్ ద్వారా ఆకాశాన్ని చూడని వ్యక్తిని విద్యావంతుడిగా పరిగణించలేము. ఎందుకంటే తాను నివసించే విశ్వంలోని అమోఘమైన విషయాన్ని తెలుసుకోలేకపోవడమే. మీరు ఖచ్చితంగా అలా ఆకాశంకేసి చూడాల్సిందే అంతా చూడలేకపోయిన ఏ కొద్దో చూడగలిగినా చాలు. అది ఆత్మను సమున్నతంగా తీర్చిదిద్దుతుంది. ఈ విశ్వెమెంతా గొప్పదో తెలుసుకునేటట్లు చేస్తుంది.

నేను మరలా ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుందనే విషయానికి వస్తాను. నేను మకిప్పుడు ఒక కష్టమైన ప్రశ్న వేస్తాను. వెన్నెల్లో కాకుండా ఎండలో అంటే అధిక వెలుగులో మాత్రమే మనం నీలపు రంగును గ్రహించగలం.

ఎందుకని?

ఆ విషయాన్ని కూడా అటుప్రక్కన పెట్టండి. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది. అనే ప్రశ్నకే వస్తాను. మనందరికి తెలుసు తెల్లని కాంతి ఏడురంగుల మిశ్రమం అని. తెల్లని  కాంతిని వేర్వేరు రంగులుగా విడదీయవచ్చు. ముదురు ఎరుపు ఒకవైపు, దాని తర్వాత లేత ఎరుపు, నారింజ రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ, నీలం, ఉదారంగు ఇలా మొత్తం రంగులను వరుసగా విడదీయవచ్చు.

నేను ఆకాశంలోనికి చూస్తే నీలమే కనబడుతుంది. వర్ణపటంలోని మిగిలిన రంగులేమయినాయి. ఇదే ప్రధాన  ప్రశ్న. ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైంది. మనం సూర్యకాంతిని వర్ణపటంగా అంటే వివిధరంగులుగా విడదీస్తే  అందులోని నీలపు భాగపు తీవ్రత చాలా తక్కువ. ఇది సూర్యకాంతి ద్యుతి (brightness) శక్తి మెత్తంలో 1/40 వ వంతు కన్నా తక్కువే.

అయినా అదే వర్ణపటంలోని (1/40 వ వంతుభాగం) నీలంగా కనబడుతుంది. వర్ణపటంలోని మిగిలిన భాగాన్ని చూడలేము. అదంతా కనుమరుగైపోయినది. అసలక్కడలేదు. నీలం వర్ణపటంలోని మిగిలిన  ప్రాంతాన్ని కప్పేసింది. మనం ఎంత కష్టపడి ప్రయత్నించి పరిశీలించినా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ కనబడవు. మనం వాటిని చూడలేము.

నీవు కొన్ని సందర్భాల్లో ఆకాశాన్ని పరిశీలించితే పెద్దమొత్తంలో మేఘాలు కనబడతాయి. వాటిని క్యుములస్ మేఘాలు అంటారు. మరీ పెద్దవేంగాదు, చిన్నచిన్నవి గుత్తులు గుత్తులుగా ఉంటాయి. అవి చిన్నగా కదులుతూ ఉంటాయి. అదొక మనోహర దృశ్యం. నీలిఆకాశంలో ఆ మేఘాలను ఊరికే చూస్తూ గొప్ప తృప్తిని పొందుతుంటాను నేను. ఆసక్తికర విషయమేమంటే ఆ కుయములస్ మేఘాలు కదులుతుంటే ఆఖాశం మరింత నీలంగా ఉంటుంది. దీనర్థమేమంటే క్యుములస్ మేఘాలు ఏర్పడేటప్పుడు మిగిలిన వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. అవి దుమ్ము ధూళి కణాలను గ్రహించి తెల్లని మేఘాలు ఏర్పడేటట్లు చేస్తాయి. మిగిలిన భాగాన్ని అందంగా శుభ్రంచేస్తాయి.

అందువల్ల ప్రకాశవంతమైన తెలుపుకు బదులుగా అందమైన నీలివర్ణాన్ని నీవు చూస్తావు. ప్రేమైకదృశ్యం. దేవతల దృశ్యం. ఈ దృశ్యాన్ని చూచేందుకు కష్టపడనవసరం లేదు. ఇది సర్వసాధారణమైనది కనుక. ఈ పరిశుభ్రం చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది అని మీరు నన్ను అడగవచ్చు. నేను విద్యార్థులను మేఘం అంటే ఏమిటి? అని అడిగినప్పుడు “ఓహూ సార్! అదా నీటి ఆవిరి”. సాధారణ సమాధానమయితే మేఘం నీటి ఆవిరే కాని అలాంటిది కాదు. మేఘాలు కణాలను కలిగి ఉంటాయి. పెద్ద పెద్దరాశులైన శ్వేత మేఘ మాలికలు నీటి తుంపరలు నీరు భారమైనది. అయినా ఎందుకని క్రింద పడదు. ఆ నీరు గాలిలో తేలడాన్ని గమనిస్తాము.

మీరు చూడండి. ఇదొక కొత్త సమస్య. నేనిప్పటికే ఒక సమస్య నుండి మరొక సమస్యకు వెళుతున్నాను. ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది? అన్న ప్రశ్న వేసుకున్న తక్షణమే మనకు మనమే మేఘం అంటే ఏమిటి? ఎందుకని గాలిలో తేలుతుంది అని ప్రశించుకుంటూ లోలోతుల్లోకి వెళుతూ భౌతికశాస్త్రంలోని లోతు సమస్యల్లో ప్రయాణిస్తాము. ఆసక్తికర సంగతి ఏమిటంటే ధూళికణాలు లేకుండా మేఘాలు ఏర్పడవు.

చిన్నవో పెద్దవో అలాంటి ధూళికణాలు ఉండాలి. మనం నేర్చుకునే భాషలో వానిని న్యూక్లిమై అంటాము. గాలిలో దుమ్ముధూళి కణాలు లేకుంటే మేఘం లేదు వర్షం లేదు. చూడండి ఎలా మనం నీలి ఆకాశం నుండి వర్షపు మూలల్లోకి వర్షపాతంలోకి వచ్చేశామో.

ఒక విషయం మరో కొత్త విషయంలోకి దారితీస్తుంది ఇదే సైన్స్ యొక్క సారం. సైన్సు నిన్ను ఎక్కడికి తీసుకెళుతుందో అంతదూరం వెళ్లాలి. అంతేగానీ సైన్స్ నుండి దూరంగా పారిపోగూడదు. నీవు ఒక ప్రశ్నవేసిన తక్షణం మరొక ప్రశ్న తలెత్తుంది. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న అలా అలా ప్రశ్నల పరంపర సాగుతూనే ఉంటుంది.

సమాధానం కనుగొనేలోపు విజ్ఞాన శాస్త్ర రంగమంతా ప్రయాణించాల్సి ఉంటుందని తెలుసుకుంటావు. ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది అనే ప్రశ్న వేసుకున్నాను గనుకనే నేను మీకు మేఘాల గురించిన ఈ వాస్తవాన్ని చెప్పగలిగాను. మేఘాలు వాతావరణాన్ని చెప్పగలిగాను. మేఘాలు వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి. మేఘాలేర్పడి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మేఘాలేర్పడడంతో ధూళికణాలు ఇతర స్యూక్లియై లేకుండా చేయడం వలన ఆకాశం నీలంగా ఉంటుంది.

చిట్టచివరకు ఈ సమస్యకు ఇలాంటి సమాధానాన్ని కనుగొన్నాము. ఆకాశం నీలంగా ఉండుటకు కారణం వాతావరణంలో దుమ్ము, న్యూక్లియై లేకుండా ఉండుటవలనే. ఆకాశం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత నీలంగా కనబడుతుంది. అయితే సరిపడినంత కాంతి ఉండాలి. మీరు ఈ ప్రశ్నకు సమాధానానికి దగ్గరగా వచ్చారు.

మీరు చూడగలిగినదేమిటి? నీలి ఆకాశాన్ని చూస్తున్నామంటే నిజానికి భూమి వాతావరణాన్ని చూస్తున్నామని. వాతావరణంలోని వాయువులను చూస్తూ ఉన్నామని. వాయువులు కాంతిని విరజిమ్ముతున్నాయి. అందుకని ఆకాశపు నీలికాంతిని మనం చూస్తున్నాము. ఇంత తెలిసినా మనమింకా సమాధానానికి దూరంగానే ఉన్నాము.

మీకు ఇంతకు ముందే చెప్పినట్లు నీలిరంగు సూర్యకాంతిలో 1/40 వంతు మాత్రమే. మరి మిగిలిన సూర్యకాంతి ఏమైనట్లు అదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పొచ్చు. పాకెట్ స్పెక్రోస్కోపుతో మీరు తెల్లని మేఘాన్ని, నీలి ఆకాశాన్ని పోల్చుకొని చూడండి. నీలి ఆకాశపు కాంతి వర్ణపటం (స్పెక్ట్రమ్), తెల్లని మేఘపుకాంతి పర్ణపటం (స్పెక్ర్రమ్), ల మధ్య ఏదైనా తేడాను కొత్తగా గమనించాలంటే చాలా చాలా జాగ్రత్తగా చూడాల్సిందే తెల్లని మేఘపు కాంతి యొక్క ద్యుతి (ట్రైట్ నెస్) ఎక్కువ కాని వర్ణపటాల రీత్యా రెండు ఒకేవిధంగా ఉంటాయి. రెండు వర్ణపటాలు కూడా ఎరుపుతో మొదలై నీలంలో అంతమవుతాయి. కాని ఎంతో కష్టపడి చాలా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండిటి సాపేక్ష (పోల్చుకుంటే) ద్యుతి (వెలుగు)లో కొంత తేడా కనబడుతుంది.

నీవు పసుపు, ఎరుపు రంగులను చూసినప్పుడు సాపేక్షంగా వాటికి అంత ఎక్కువ ద్యుతి (ట్రైట్నెస్) ఉండదు. గుర్తించుకోండి. దీనిని ఊహాత్మకంగా లెక్కిస్తుంన్నాం. ఆకాశకాంతి వర్ణపటంలోని నీలి ఊదా భాగాన్ని, అదే వర్ణపటంలోని ఎరుపు, పసుపు, ఆకుపచ్చ భాగంతో పోల్చుకుంటూ ద్యూతి ని గమనించండి. నీలి ఊదాభాగపు ద్యుతిని గమనించండి. నీలి ఉదా బాగపు ద్యుతి బలంగా ఉంటుంది. ఇంత తెలిసినా నీవింకా సమాధానానికి చాలాదూరంగానే ఉన్నాను. ఎందుకంటే ఈ సమాధానం మిగిలిన పర్ణపట భాగాన్ని మనమెందుకు చూడలేకపోతున్నామో వివరించడం లేదు.

నిజానికి నీలి ఆకాశంలో ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు రంగులు ఉన్నాయి, అవి మంచి ద్యుతిని కలిగివున్నాయి. కాకపోతే నీలికాంతి ద్యుతితో పోల్చితే సాధారణంగా ఉండాల్సిన 40 రెట్లు అధికంగాకపోయినా 10 రేట్లు అదనంగా ఉన్నాయి. మరి మనం నీలపు రంగునెందుకు చూస్తున్నాము. మిగిలిన రంగులనెందుకు చూడలేక పోతున్నాము.

ఇక్కడ మీకు సమాధానం చెప్పేందుకు మరీ కష్టమైన ప్రశ్న ఎదురవుతుంది. ఆకాశకాంతి వర్ణపటంలోని నీలిభాగపు వాస్తవ ద్యుతి అదే వర్ణపటంలోని మిగిలిన భాగపు ద్యుతి ఇంకా తక్కువే ఐనా మనం మిగిలిన వర్ణపటంలోని రంగులను చూడలేము. ఇది అతిసాధారణమే అయినా ఆశ్చర్యకరం. దాటవేయలేని ఈ దృగ్విషయాన్ని మీరు చూచేందుకు ఒక చక్కని చిన్న ప్రోగాన్ని ఒకనాటికి ఇదే సైన్స్ సెంటర్ చేసి చూపిస్తాను.

ఇది మానవ దృష్టి యొక్క అత్యంత ప్రాథమిక విషయం. వర్ణపటంలోని నీలిభాగం తనకున్న బలహీనతలను అధిగమించి వర్ణపటంలోని మిగిలిన రంగులపై ఆధిపత్యాన్ని సాధిస్తుంది. చాలా ముఖ్యమైన విషయం నీలిభాగానికి తనకున్న వాస్తవ ద్యుతి () కొన్ని సందర్భాల్లో అత్యధిక పాత్రను పోషిస్తుంది. ఆ ప్రయోగమిదే. చాలా సులువైనది. ఒక బీకరులో కొద్దిగా నీరు తీసుకోండి. దానిలో కొద్దిగా కాపర్ సల్ఫేట్ ను వేసి కరిగించండి. దానిలో ఎక్కువగా అమ్మోనియాను కలపండి. మీరు క్యుప్రమోనియం ద్రావణాన్ని పొందతారు.

ఈ ద్రావణం చాలా బలమైనది. అది కేవలం గాఢమైన ఉదారంగును ప్రసరింపజేస్తుంది. గాజుబీకరులోని ఈ ద్రావణానికి నీరు కలుపుతూపోండి. దానిలోనుంచి శాంతివంతమైన దీపాన్ని చూడండి క్రింది విషయాలను గమనించండి. గాఢ ఊదారంగు నీలిరంగుగా, నీలిరంగు లేతనీలిరంగుగా మారుతుంది. చివరకు నీలిరంగు స్థిరపడుతుంది. చిట్ట చివరకు అది నీలంగానే వుంటుంది.

ద్రావణం ద్వారా వచ్చిన కాంతి వర్ణపటంలో ఎరుపు ఆకుపచ్చ కాంతులు ప్రసారమైనా పసుపు కాంతి మాత్రం ప్రసారం కాదు. వర్ణపటం ద్వారా చాలాకాంతి వచ్చినా నీలిరంగు మాత్రం చాలాకొద్ది. అయినా అదే కనబడుతుంది. ఇతరకాంతుల్ని చూడలేము. ఎందుకంటే, ద్రావణం ద్వారా వచ్చిన కాంతిలో కుప్రమోనియం వర్ణపటంలోని ముఖ్యమైన పసుపుని మింగేస్తుంది. ఇతర రంగుల్ని అదుపుజేస్తుంది. అందువల్ల నీలివర్ణం మాత్రమే అగుపిస్తుంది.

ఏదైనా వర్ణపటాన్ని తీసుకోండి. పసుపు బలాన్ని తగ్గించండి. అప్పుడు నీలిభాగం ఆధిపత్యం వహిస్తుంది. అది అంతర ధర్మశాస్త్ర వాస్తవం. ఏదైనా రంగు కనబడాలంటే పసుపును తీసివేయాలి. అక్కడ నాకు గౌరవసూచకంగా పరచిన ఎర్ర తివాచీనే తీసుకోండి. వర్ణపటదర్శినితో చూడండి. ముందుగానే చెబుతున్న అందులో పసుపు ఉండదు. ఇతర రంగులకు పసుపు బలమైన శత్రువు. ఎన్నో రంగులూ ఉన్నాయి కదా. ఉదాహరణకు పచ్చని ఆకుని చూడండి. అన్ని ఆకులూ పచ్చగానే ఉంటాయి. కారణం పత్రహిరితం (క్లోరోఫిల్) ఉండడమే కాదు, పత్రహరితమునకు ఎరుపును శోషించే లక్షణము ఉంది. అనుమానమేంలేదు. ఆకు పచ్చగా ఉండడానికి నిజమైన కారణం మాత్రం పసుపురంగును తొలిగించడమే. పసుపురంగు బలాన్ని తగ్గించేందుకు సరిపడా శోషణశక్తి క్లోరోఫిల్ కు ఉంటుంది.

బెంగళూరు బట్టల తయారీకి ముఖ్య ప్రదేశము. 25 – 30 జాకెట్ ముక్కలను కొన్నాడు. తేడోవంతంగా రంగులు కనపడాలంటే వర్ణపటంలో పసుపును ఎంతగా అణచివేయాలో సరిచూసుకొనేందుకు జాకెట్ ముక్కలను కొన్నాను.

వర్ణపట దర్శీనితో (స్పెక్ట్రోస్కోప్)తో వరి పోలాన్ని చూడండి. అత్యద్భుతంగా ఉంటుంది. అది నీలిఆకాశ వర్ణపటంలాగా ఉంటుంది. చూడగానే అందులో మనకు కనబడే తేడా ఒకటే. వర్ణపటంలోని నీలిభాగం తొలిగిపోయి ఉంటుంది. దీనికి కారణం పత్రహరితంలో కెరోటినాయిడ్ అనే వర్ణదం ఉండడమే. మిగిలిన వర్ణపటం అంతా ఒకేలాగా ఉంటుంది. కాని జాగ్రత్తగా గమనిస్తే వరిపొలం రంగుల్లో పసుపు ఉండదు. ఆకుపచ్చని చూడాలంటే పసుపును తొలిగించడం అవసరం. ఎల్లప్పుడు పసుపు ఆధిపత్యం వహిస్తుంది. మరి అదే పసుపును తొలిగిస్తే, నీలివర్ణం ఆధిక్యంలోకి వస్తుంది. అవి రెండు ఒకదానికొకటి విరోధులు.

“రంగులు ప్రకాశవంతంగా కనబడాలంటే వర్ణపటంలోని నీలి ప్రాంతాన్ని అణచివేయాలి.” ఈ ప్రతిపాదన సరైనదో? కాదో? తెలుసుకొనేందుకు...

మొత్తం వర్ణపటాన్ని రెండుగా విడగొట్టండి. ఎక్కడ విడగొట్టాలంటే నీలిభాగం తర్వాత విడగొట్టాలి, మిగిలిన భాగం అంటే ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు అంతా ఇంచుమించు పసుపులాగే ఉంటుంది. ఈ మిగిలిన భాగాన్ని వేరుచేస్తే ఇక మిగిలింది పై నీలిభాగమే. ఆకాశం.

నీలివర్ణానికి నిజమైన వివరణ ఇదే. ఇదే ప్రాముఖ్యత ఎరుపు, ఆకుపచ్చ ఉన్నప్పటుకూ పసుపు తీవ్రత ఎక్కువే. పసుపు తీవ్రతను పూర్తిగా తొలిగించకపోయినా తగ్గించాలి. ఇలా పసుపును తగ్గిస్తే మిగిలినది నీలముగా బాగా అగుపిస్తుంది. అందుకే ఆకాశం నీలంగా అగుపిస్తుంది.

కాబట్టి పసుపును తగ్గించడమే ప్రాధమికం అయితే పసుపు తీవ్రత ఎందుకు తగ్గుతుంది. ఇక్కడ  వివరణ యొక్క రెండోభాగం వస్తుంది. వాతావరణంలోని అణువులు కాంతిని వెదజల్లుతాయి. ఆ కాంతి వెదజల్లినప్పుడు పసుపు రంగు తీవ్రత  తగ్గిపోతుంది. కనుక ఆకాశం వీలముగా కనబడుతుంది.

ఆకులు పచ్చగా ఎందుకుంటాయి? ”క్లోరోఫిల్” అని వృక్షకారుడు క్లుప్తంగా చెబుతాడు. అలాగే నేనుకూడా ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? అని అడిగితే ”వాతావరణంలోని అణువులు కాంతిని వెదజల్లుతాయి కనుక.” అని క్లుప్తంగా చెప్పవచ్చు.

అయితే మీరొక ప్రశ్న నన్నడగవచ్చు. ఎందుకింత ఉపన్యాసం? అని. ఎందుకంటే నా చిట్టి స్నేహితులారా, సైన్సు యొక్క స్పూర్తి చిన్నచిన్న తక్షణ సమాధానాలను కనుగొనడానికి కాదు అని తెలియజేసేందుకే. సైన్స్ స్పూర్తి పరిశోధనల లోలోతుల్లోకి వెళ్ళడమే. దాన్నే మీకు వివరంగా తెలియజేయాలనుకున్నాను. చిన్న చిన్న సమాధానాలకు, రెడీమేడ్ ఆన్సర్స్ కు తృప్తిపడకండి. మీరు చుట్టూరా తేరిపారజూడండి. ఆలోచించండి. రకరకాల ప్రశ్నలు వేయండి. సమస్య చుట్టూ పరిశీలించండి. పరిశోధించండి. పరిశోధించండి – పరిశోధిస్తూనే ఉండండి.

కొంతకాలానికి కొంత సత్యాన్ని కనుగొంటావు కాని అంతిమ సత్యాన్ని చేరుకోలేవు. అంతిమ సత్యం నేనింతకుముందే చెప్పినట్లు “మానవ మెదడు”. అదింకా చాలాచాలా దూరంలోనే ఉన్నది. ఇదే సైన్స్ స్ఫూర్తి. ఓ చిన్నప్రశ్నకు సమాధానం వెతకడం ద్వారా మీకు ఒక వివరణ ఇస్తున్నాను. ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? అనే నా ఉపన్యాసం ఈ విషయంతో ప్రారంభించి ఎంతదూరమైన మాట్లాడుతూనే ఉంటాను. వాతావరణంలోని అణువులు కాంతిని గ్రహించి తర్వాత వెదజల్లడం వలన ఆకాశం వెలుగుతుంది. అందుకే ఆకాశం నీలముగా కనబడుతుంది. ఇదే ఆ తర్వాత నా పరిశోధనయింది. ఈ వివరణను మొదట ఇచ్చిన వ్యక్తి కీ.శే. లార్డ్ రేలి. (కలలు కనడం జీవితంలో ఒక భాగం. అద్భుతమైన కలలు కనడం వాస్తవాన్ని గ్రహించడం గాదు. ముందునే ఉహించడం. నేనొక పరిశోధన చేయబోతున్నాను. పరిశోధన తర్వాత ఒక కొత్త విషయాన్ని కనుగొనలేకపోయినా మనిషిని గట్టి శాస్తీయ కృషి చేయగలిగిన వ్యక్తిగా తయారుచేస్తుంది.

దీన్నే మరోసారి నొక్కి చెప్పాలనుకున్నా. మానవ స్ఫూర్తికి సంపూర్ణంగా అవసరమైనది సైన్సు. కవి ఏం చేస్తాడు? చిత్రకారుడు ఏం చెస్తారు? శిల్పి ఏంజేస్తాడో ఒకసారి పరిశీలిద్దాం. ఓ నల్లరాయిని తీసుకుంటాడు. చెక్కుకుంటూపోతారు. చివరికి ఆ రాతిలో తను కలగన్న రూపాన్ని, స్వప్నాన్ని ఆవిష్కరిస్తాడు. మనమందరం మెచ్చుకుంటాము. ఆ శిల్పాన్ని ఆవిష్కరించేందుకు ఏకాగ్రతతో కూడిన ఎంత కఠోరమైన కృషి దాగి ఉన్నదో ఓ నా చిట్టి స్నేహితులారా, దయచేసి గుర్తించుకోండి. కలకాలం నిలిచి ఉండే కృషి, మనమందరం మెచ్చే కృషి అతడిని అంతగా కష్టపడేటట్లు చేసిందనే విషయాన్ని గ్రహించాలని మిమ్మిల్ని కోరుతున్నాను.

కలలు కనడం జీవితంలో ఓ మంచి భాగం. అవి నిజంగాక పోవచ్చు కానీ ముందుగా ఊహించడం.

రేపు ఒక పరిశోధన చేయాలనుకుంటున్నాను. దానితో ఒక కొత్త విషయాన్ని కనుగొన్నా, కనుగొనలేకపోయినా అది నన్ను గొప్ప కృషి చేసే వ్యక్తిగా నిలుపుతుంది. దీనినే నేను మరొకసారి నొక్కి వక్కాణించదలచుకున్నారు.

సైన్సు మొత్తం అనివార్యమైన మానవస్ఫూర్తి. ఓ కవి ఏం చేస్తాడు? ఓ చిత్రకారుడు ఏం చేస్తాడు? ఓ గొప్పశిల్పి ఏం చేస్తాడు. నల్లరాతిని తీసుకుంటాడు. చెక్కుకుంటూ పోతాడు. మనం అమోఘమైనదిగా మెచ్చుకుంటాం.

కాని ఓ నా యువ మిత్రులారా... శిల్పాన్ని చెక్కడంలో ఎంతో ఏకాగ్రతతో కూడిన కష్టమైన పని ఇమిడి ఉందని గుర్తించుకోండి.

ఈ శిల్పం కలకాలం నిలిచిపోతుందని అందరి మన్ననలను పొందుతుందనే ఆశ ఆ శిల్పిని అంతగా కష్టపడేటట్లు చేసింది.

ఒక మనిషి సైన్స్ పరిశోధనకు అంకితమవడానికీ, ఇతర రంగాల వ్యక్తులు ఆయా రంగాల్లో ఏదైనా సాధించేందుకు అంకితమవడానికి నా దృష్టిలో పెద్ద తేడా లేదు.

జీవితంలో అన్నిటికన్నా గొప్ప విశేషమేమిటి? ఏదో ఒకటి సాధించడం మాత్రమే గాదు. సాంధించాలలనే తపన పడుతూ ఉండడం. అందుకు తగినట్లుగా ప్రయత్నిస్తూ ఉండడం. ఇదే గొప్ప సంతృప్తిని ఇస్తుంది.

ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూ ఉండడం. సాధ్యమైనా కాకపోయిన ఆ ప్రయత్నమే జీవితానికి గొప్ప సార్థకతను ఇస్తుంది. జ్ఞానం పొందడానికీ నీవు తపన పడకపోతే సైన్స్ మనిషివవి కాలేవు. కాకపోతే ఏదో డిపార్టుమెంటులో ఓ ఉద్యోగం, మంచి జీతం పొందగలవు. అందులో నీవు సాధించేందుకు ఏమీ ఉండదు. నెలనెలా జీతం కోసం ఎదురు కోసం ఎదురు చూడడం తప్ప, అదిమాత్రం సైన్సు కానేకాదు. శాస్త్రీయంగా మనిషి చేయవలసిన పని ఏమిటంటే నిజాన్ని కనిపెట్టడం ముందుచూపుతో జ్ఞానాన్ని పొందడం.

ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మరలా వెనక్కు నీలి ఆకాశానికి రావచ్చా? ఇందాకా పూర్తి చేయలేదు. నిజానికి మీకు నిజాయితీగా, వాస్తవంగా చెప్పాలంటే నా ఉపన్యాసాన్ని ప్రారంభించాను అంతే. ఎందుకని గాలి పరమాణువులు కాంతిని వెదజల్లాయి? సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేనిందాక చెప్పాను. వర్ణపటంలోని పొడవాటి తరంగాలు – నేను తరంగదృశా శాస్త్ర భాషను వాడుతున్నాను. పొడవైన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ తరంగాలు గాలిలో వ్యాపించియున్న కాంతిలో తక్కువగా వెదజల్లబడి ఉంటాయి. బలంగా వెదజల్లబడిన రంగులను కన్ను గ్రహిస్తుంది.

ఎందుకని సమాధానం చాలా సులభం. గాలిలోని అణువులు చాలా చిన్నవి. కాంతి తరంగ ధైర్ఫ్యంతో పోల్చిన నమ్మలేనంత చిన్నవి. ఈ విషయాన్ని పెద్ద సరస్సును చూచి అర్థం చేసుకోవచ్చు. ఆ సరస్సు మీద గాలి వీస్తున్నది. తరంగాలు ఏర్పడ్డాయి. చిన్న బెండు ముక్క ఉంటే అది పైకి కిందికి కదలడాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఎందుకని? తరంగ పరిమాణంతో పోల్చితే బెండు పరిమాణం చాలా చిన్నది.

అదే పెద్ద పడవ ఉంటే ఆ తరంగాలు చిన్న బెండు ముక్కను కదిలించినట్లు పడవను కదిలించలేవు. కదలిక పరిమాణం-వస్తువు పరిమాణాల మధ్య గల సంబంధమే వస్తువుపై తరంగ ప్రభావం నిర్దారించబడుతుంది. అలాగే తరంగాలపైన వస్తువు ప్రబావం కూడా నిర్ధారించబడుతుంది. ఈ సూత్రం ఆధారంగా పొట్టి తరంగాలు పొడవు తరంగాల కంటే ఎక్కువగా వెదజల్లబడుతాయి. ప్రయోగశాలల్లో మీరు ఇలాంటి ప్రయోగాలను ఎన్నింటినైనా చేయవచ్చు. అందుకు మీకు గాలి అణువులు అవసరం లేదు. కొద్దిగా నీరు, సబ్బుముక్క ఉంటేచాలు. పొగతో కూడా ఇలాంటి ప్రయోగం చేయవచ్చు. కణాలు చిన్నవిగా ఉంటే చాలు పొట్టి తరంగాలు పొడవు తరంగాల కంటే బాగా వెదజల్లబడతాయి. మంచి నీలి రంగు కనబడాలంటే కణాలు చాలా చాలా చిన్నవిగా ఉండాలి.

అయితే నేనింతకు మునుపు చెప్పినట్లు అవసరమైనంత ప్రదీపనం () ఉండాలి. ప్రదీపనం బలంగా లేకపోతే చాలా పేలవమైన నీలిరంగు మాత్రమే కనపడుతుంది.

నేను నీలిరంగు వెదజల్లబడడం నుండి అణువుల అధ్యయానానికి వచ్చాను. అక్కడ ఈ విషయం ప్రారంభమవుతుంది. అలా అలా సాగుతుంది. నిజానికి 1901 లో ఈ విషయాన్ని ప్రారంభించాను. దృష్టికి సంబంధించినది తప్ప మిగతా నేను మాట్లాడినది చాలా ఆకర్షణీయమైనది. అణువులకు సంబంధించి మాట్లాడాలనే దానిని 1921 నుండి అంటే ఇటీవల చేశాను. ఆ సమయంలో అది పూర్తయినదనుకున్నాను. దృష్టి విభాగం – దృష్టి నాణ్యత – ఈ విషయంలో పెద్ద పాత్ర పోషియ్తుందని నేడు మనకు తెలుసు.

నా ఉపన్యాసం విషయం ఆకాశపు నీలి రంగు కాదు. ఈపాటికే మీకు అవగాహనకు వచ్చి ఉంటుంది. అదే సైన్సు స్ఫూర్తి. సైన్సు అంటే ఏమిటి? సైన్సుని మనదేశంలో ముందుకు ఎలా తీసుకొని పోగలమనుకుంటున్నాము.

గతంలో మన పూర్వీకులంత యోగ్యమైన వారిగా మనం తయారు కాగలమా? అదే నా అసలైన ఉపన్యాసం యొక్క అంశం. శాస్త్రీయ విషయానికి ఇదొక ఆధారం అక్కడే కథ ప్రారంభం అవుతుంది.

కాంతి అణువులతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది. అణువులకేమవుతుంది. అసలు అణువులంటే ఏమిటి? అలా అలా సాగుతూ పోతుంది సైన్సు. సైన్సు ఆగదు. సాగుతూనే ఉంటుంది.

నీవు కనుగొనే కొలదీ, ఇంకా కనుగొనాల్సింది ఉందని తెలుస్తుంది. అదే సైన్సులోని ఆకర్షణ. నీకు ఎదురుపడే ఇతరుల ప్రభావం వలన ఆదుర్థాపడగూడదు. వారిని గురించి పట్టించుకోవద్దు. నిజమైన సారంశమేమిటంటే ఇదొక అంతంలేని అన్వేషణ. ప్రతి కొత్త ఆవిష్కరణ నూతన ఆవిష్కరణకు దారి తీస్తుంది. నూతన సమాధానాల కోసం నూతన ప్రశ్నలు ఉదయిస్తాయి.

ఇంకా ఇప్పుడు నెనింతవరకు మాట్లాడుతున్నాననే అది వాతావరణ శాస్త్రంలో కనీసం కొంతయినా సంబంధం లేకుండా నేను ఈ ఉపన్యాసాన్ని ఇవ్వలేదు. ఆసక్తికరమైన అసలు విషయం వాతావరణ శాస్త్రం కాదు. కాంతి వెదజల్లబడడం. ఈ కాంతి వెదజల్లబడడం అనే విషయం అణువుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి శక్తివంతమైన ఆయుధం. నీవు అణువులను లెక్కించవచ్చు. ప్రయోగశాలలో నీవీ ప్రయోగం చేయవచ్చు. ప్రతి సైన్సు విద్యార్థి చూడాల్సిన ప్రయోగం. ఒక గాజు సీసా, ఫ్లాస్కు, మూత వాటిలో దుమ్ము ధూళి తీసివేయి. సూర్యకాంతి గాని మరేదయినా కాంతి పుంజాన్ని పంపండి. ఈ కాంతి పుంజం గాలి ద్వారా ప్రయాణిస్తుంది. మీరు అప్పుడు గాలిని చూడవచ్చు. గాలి పారదర్శకమైనది కాదు. రంగులేని వాయువు కాదు. ఇది కనబడని పదార్థమేమి కాదు. వెదజల్లబడిన కాంతిలో నీవు గాలిని కనపడేటట్లు చేయగలవు. ఇది చాలా సరళమైన ప్రయోగం. ప్రతి సైన్సు విద్యార్థి తన జీవితకాలంలో కనీసం ఒకసారైన చూడాల్సిందే. నీవు గాలిని చూడగలవు. ఏ వాయువునైనా చూడగలవు. ఏ ఆవిరినైనా చూడగలవు. వెదజల్లబడిన కాంతి శక్తితో విడివిడిగా ఉండే ఏ కణాన్నైనా చూడగలవు. ఎక్కువ కణాలుంటే కాంతి వెదజల్లబడే శక్తి ఎక్కువవుతుంది.

ఆ వెదజల్లబడే శక్తితో అణువుల సంఖ్యను లెక్కించవచ్చు. నేనే “లెక్కించవచ్చు” అంటున్నాను. అంటే ఒకటి, రెండు, మూడు, నాలుగు అని కాదు. భిన్నమైన లెక్కింపు. నేను డబ్బుల నోట్లు ముద్రించే కార్యాలయంలో పని చేసేటప్పుడు అక్కడివారు రూపాయలను లెక్కించేవారు. వారు నోట్ల సంచులను లెక్కించేవారు. ప్రతి సంచిలో 2000 రూపాయల నోట్లు ఉండాలి. అలా నమ్మాల్సిందే. నోట్ల సంచులను గుణించితే కోట్లాది రూపాయలు వచ్చేవి. అలా వాతావరణంలోని గాలి వరమాణువులను లెక్కించవచ్చు. ఇదొక రకమైన అంచనా. అంతకంటే మిన్నగా కేవలం ఒక పరికరం ద్వారా నిజంగా కాంతి వెదజల్లబడడాన్ని చూడవచ్చు. ఒక అణువు పొట్టిదా? పౌడవుదా? గోళాకారంగా వుందా? చతుర్ముఖీయంగా ఉన్నదా? అని తెలుసుకోవచ్చు. నీలి ఆకాశ అధ్యయనం గణనీయమైన పరిశోధనాక్షేత్రం అంతులేని పరిశోధనాక్షేత్రం. తలుపులు తెరిచే ఉంది. ఇంకా పరిశోధించాల్సింది ఉంది.

నీవు పరిశోధించే కొద్ది ఇంకా లోలోతుల్లోకి వెళుతావు. అప్పుడు కాంతి సంగతేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అన్నింటిలోనికి నేనిప్పుడు వెళ్ళలేను. ఎందుకంటే నా ఆలోచనను నేను ముందే చెప్పాను. బాగా తెలిసిన సంగతి అయినా చాలా లోతైన భౌతిక రసాయనశాస్త్ర విషయాలతో మేళవించి ఉంటుందనే విషయం క్లుప్తంగా చెప్పదలిచాను. ఈ రోజు మనం నేర్చుకున్న పాఠం ఇదే. బాగా తెలిసిన నిజం ఏమంటే సైన్సులోని సమస్యలను గుర్తించడానికి పాఠ్యపుస్తకాలను తిరిగేయవలసిన పని లేదు. నీవు కళ్లుతెరుచుకొని నీ చుట్టూ చూడు, పరిష్కరించేందుకు కావలసినన్ని చిక్కులు ఉన్నాయి. పరిష్కరించే చాకచక్యమే నీకు ఉండాలి.

ఏదైనా సాధించే దాకా కొనసాగించే గట్టి మనస్సు ఉండాలి. ఈ పాఠాన్నే నా ముందుండే యువతరానికి చెప్పదలచాను. దీనంతటిలో ఉండే ఉపయోగమేమిటి? ఇక్కడ మరలా నా జీవితతత్వాన్ని నొక్కి చెప్పదలచుకున్నాను. వీటన్నింటి ఉపయోగమేమిటని ఎప్పుడూ అడగవద్దు. నేనింతకుముందే చెప్పాను. ఇది యోగ్యమైన గొప్ప కృషి చేయడం. పరిశీలించుటకు, ఆలోచించుటకు ఉపయోగించుకోవాలి. ఆ శక్తులను మనం బాగా ఉపయోగించుకుంటే అవి రాటుదేలుతాయి. మరింత శక్తివంతమవుతాయి.

చివరకు మనకు ఏదో ఒకటి దొరుకుతుంది. దానితో సమాజం లబ్దిపొందుతుంది. సైన్సు లబ్దిపొందుతుంది. చివరగా శాస్త్రీయజ్ఞానం మానవ జీవితానికి ఉపయోగపడుతుంది.సమస్యలు అవే ఎదురవుతాయి. సైన్సులోని మన చుట్టూ వుండే విషయాలకు సంబంధించినవే. మన చుట్టూ వున్న పర్యావరణంలోని సమస్యతో ఎంతకాలం పని చేసిన ఒక ప్రత్యేక భాగమైన పని అవసరం లేనిది చెప్పలేము. ప్రకృతిలోని విషయాలు అమూర్త విషయాలుగా మొదట కనిపించినా తరువాత మానవ జీవితాన్ని, కార్యకలాపాలను, చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎవ్వరైనా వైజ్ఞానిక కృషిని విలువైనది అని అనుకోకపోతే బాధేస్తుంది.

వైజ్ఞానిక కృషి విలువైనది. ఎందుకంటే మానవ జీవితాన్ని కార్యాచరణకు చాలా విలువైనదని చివరకు రుజువు చేస్తుంది. అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్ర విజ్ఞానశాస్త్రం మన చుట్టూ వున్న సంక్లిష్టతను తొలిగించింది. క్లుప్తంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలు ఏదో ఒకటి కనుగొనాలనే లక్ష్యంతో కష్టపడలేదు. మన జ్ఞానాన్ని అభివృద్ది చేయాలనే ఆశతో పనిచేశారు. శాస్త్రవేత్తలు మానవులకు గొప్పగా తోడ్పడిన వ్యక్తులుగా చివరకు రుజువు చేసుకున్నారు.

రచన: సి.వి. రామన్

ఆధారం: యం.వి. చలపతి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate