పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆకులతో సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా ?

ఆకులతో ఫోన్ ఛార్జ్ చేయలేము.

262.jpgఒరేయ్ వినయ్ బాబాయి సెల్ ఫోన్ పాడైపోతుందిరా రావి, వేప ఆకుల్ని సెల్ ఫోన్ల్ కి263.jpg దూరుస్తున్న తన తమ్ముణ్ణి మందలించింది. వినీల.

రావి, వేప, ఆకుల్తో సెల్ ఫోన్ చార్జ్ అవుతుంది తెలుసా ? ఇక మన బాబాయి ఫోన్ కి కరెంట్ చార్జర్ అవసరమేలేదు. ఈ ఆకులతోనే చార్జ్ చేసేస్తా నువ్వు టి.వి.9 లో, పేపర్లలో వార్తలు చూడలేదా...అన్నాడు వినయ్ అక్క కంటే తనకే ఎక్కువ తెలుసని వాడి ఫోజులు ఇంతలో వాళ్ళ బాబాయ్ మధుసూదన్ ఇంటి కొచ్చాడు. ఆయన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. పిల్లలడిగే చొప్పదంటు ప్రశ్నలన్నింటికీ చాలా ఓపిగ్గా వివరాలు చెబుతుంటాడు. పిల్లలతో చాలా చనువుగా వుంటాడు. వినీల 10 వతరగతి, వినయ్ 8 వ తరగతి చదువుతున్నారు.

బాబాయ్ నువ్వేమో సెల్ ఫోన్ మరిచిపోయి కాలేజీ కెళ్ళావా... వినయ్ నీ సెల్ ఫోన్లో కి ఆకుల్ని దూరుస్తున్నాడు సెల్ చార్జ్ అవుతుందట. సెల్ ఫోన్ చార్జ్ అయ్యాక ఈ వింతను చూసి బాబాయి నన్ను మెచ్చుకుంటాడు అంటున్నాడు బాబాయికి పిర్యాదు చేసింది వినీల. మదుసూదన్ నవ్వుకున్నాడు. ఎవరో పనిలేని వాళ్ళు చేసే ప్రచారం మీకూ తలకెక్కిందన్నమాట. రేయ్ వినయ్ ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు నువ్వు ఆ ఆకులన్నా తీసుకుని మేడపైకి రా .. అంటూ సెల్ ఫోన్ తో తన రూమ్ కెళ్ళాడు. మధుసూదన్.

వినీల, వినయ్ లు మేడపైకి చేరుతున్నారు. బాబాయ్ ఆకులతో చార్జింగ్ గురించి చెప్పబోతున్నారని వాళ్ళకు తెలిసిపోయింది. వినీల బాబాయికి కాఫీ అందించింది. మధు కాఫీ అమ్మా వినీల... స్కూల్లో ఎలక్ట్రిసిటీ చాప్టర్ చెప్పేశారా ఇంకా లేదా ? అన్నాడు. ఇప్పుడే చెబుతున్నారు బాబాయ్ అంది వినీల.

సరే మనం ఆకుల్లో ఏ పాటి విద్యుత్తు లక్షణాలున్నాయో ప్రయోగం చేసి చూద్దాం. ఆ అల్మారాలో మల్టీ మీటర్ ఉంది. ఇలా తీసుకురా.. అన్నాడు. వినీల మల్టీమీటర్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. వినయ్ రావి ఆకు తెచ్చి ముందు దీంతోనే ప్రయోగం చేద్దాం. అన్నాడు. సరే అలాగే అంటూ మదు మల్టీ మీటర్ టెర్మినల్స్ ను రావి ఆకు ఈ నేలపై రెండు చోట్ల గుచ్చాడు. వినీల, వినయ్ లు కళ్ళార్పకుండా మల్టీ మీటర్ నే చూస్తున్నారు. సూచిక కదిలింది. 40 వద్ద ఆగింది. మదు టెర్మినల్స్ ను ఆకు మీద మరోపాయింట్ కు మార్చాడు. 60 వద్దకు సూచిక చేరుకుంది. అదిగో విద్యుత్ కదిలింది నేను చెప్పలేదా... అంటూ అరిచాడు వినయ్.

మనకు ఈ మీటర్ తెలిపేది మిల్లీ ఓల్టులో పొటెన్షియల్ భేదం. జీవ సంబంధ పదార్థాలో కెలక్రోలైట్స్ ఉండడం వల్ల మనకు కొద్దిగా విద్యుత్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆకుల్లో 40 నుండి 60 మిల్లీ వోల్టుల పొటెన్షియల్ భేదం మాత్రమే ఉంది. సెల్ ఫోన్ చార్జ్ కావాలంటే కనీసం 3700 మిల్లీ వోల్టుల పొటెన్షియల్ భేదం అవసరం. నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహించినట్లు విద్యుత్ ఎక్కువ పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ కు మాత్రమే ప్రవహిస్తుంది. సెల్ ఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయినపుడు దాంట్లో 100 మి.వో. కంటె తక్కువ 99 లేదా 98 మి.వో విద్యుత్ ఉంటుంది. కాబట్టి ఆకుల్లోని వోల్జేజ్ సెల్ ఫోన్ ను చార్జ్ చేసే అవకాశం లేదు. అన్నాడు మధుసూదన్.

విద్యుత్ మరో లక్షణమైన ప్రవాహవేగాన్ని కొలుద్దాం రండి... వినయ్ ఈ సారి నువ్వే ఆంపియర్స్ కొలవాలి అంటూ టెర్మినల్స్ ఇచ్చి ఆకులపై ఉంచమన్నారు. వినయ్ ఆతృతగా ఆకుపై టెర్మినల్స్ ఉంచి మార్చి మార్చి చూసాడు. అయినా మిల్లీ ఆంపియర్ కంటే ఎక్కువ కరెంట్ నమోదుకాలేదు. సెల్ ఫోన్ చార్జ్ చేయాలంటే 250-500 వ్లిఈ ఆంపియర్ల విద్యుత్ అవసరం. కాబట్టి ఆకుల్లో ఇంత శక్తి లేదని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. అన్నాడు. మధు. మరో ముఖ్యమైన విషయం ఆకుల్లోనే కాదు మీరు మల్టీమీటర్ టెర్మినల్స్ పట్టుకొన్నామనుకో ఎలక్ట్రిక్ ఓల్జేజ్ కనిపిస్తుంది. ఆకులు, కాయలు, మానవశరీరం లాంటివి విద్యుత్ ను ప్రసరింప జేస్తాయి. కాని ఇవి విద్యుత్ జనకాలు కావు. కాబట్టి ఇవి సెల్ ఫోన్ చార్జ్ చేయలేవు.

సెల్ ఫోన్ లో బ్యాటరీ ఉంచే కాపర్ ప్లేట్ పై ఆకులు తుంచి వుంచితే దానిలోని లవణాలు కాపర్ లో చర్య జరిపి కొద్దిగా విద్యుత్ జనిస్తుంది. కాపర్ స్లేట్ పై ఉప్పు నీళ్ళు వేసినా ఇలాగే జరుగుతుంది. దీనివల్ల ఫోన్ చెడిపోయే అవకాశం ఉంది. దీన్ని చూసి కొంతమంది ఆకులతో సెల్ ఫోన్ చార్జ్ అవుతుందని ప్రచారం చేసి ఉండొచ్చు. అంటూ వివరించాడు. మదుసూధన్ రావు.

బాబాయ్ జన విజ్ఞాన వేదిక కూడా ఇదంతా సూడోసైన్స్ అనీ సైన్స్ సూత్రాలకు విరుద్ధమైన ఇలాంటి వదంతులు నమ్మొద్దని పత్రికల ద్వారా తెలిపారు అంది వినీల చాలా విషయాలు చెప్పారు థాంక్స్ బాబాయ్ అంటూ వినీల, వినయ్ లు మేడదిగి వెళ్ళిపోయారు.

రచయిత: జి. కామయ్య, నెల్లూరు

2.99056603774
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు