'పావలా పనికి రూపాయి బాడుగ’ అనే సామెత వినే ఉంటావు, ఒక వ్యక్తికి ఓ పని జరగాలి, అది జరిగితే అతనికి పావలా (25 పైసలు) లభిస్తుందనుకొందాం. దాన్ని జరపడానికి అతనికి రూపాయి ఖర్చయిందనుకొందాం, వెరసి నష్టమే కదా! అలాగే నీటి కొరత సమస్య అనేది సబబే! అయితే దాన్ని నీటి వనరుల ద్వారా పరిష్కరించుకోవడమే సరియైన మార్గం! (వాటర్ బాటిల్ కు) 12 రూపాయలు ఉంటుంది. ఇది అన్యాయమే అనుకొంటున్నాము. ఈ లీటరు నీటిని ప్రయోగశాలలో నీవు చెప్పిన పద్దతిలో 2H2 + 02→ 2H2O అనే విధంగా త్రాగే నాణ్యతలో తయారు చేయడానికి కనీసం రూ. 25,000/- ఖర్చవుతుంది. ఎందుకంటే రసాయనిక చర్యలు కాగితం మీద వ్రాసినంత సరళంగా జరగవు. మూలకాలు వాయు రూపంలో ఉంటాయి. వాటి ధర బాగానే ఉంటుంది. వాటిని సిలిండర్లలో నిల్వ ఉంచాలి. ఈ సిలిండర్ల ధర చాలా ఎక్కువ. వాటిని అలా కలిపేస్తే ఇలా చర్య జరిగి, అలా నీరు వచ్చేయదు.
హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య చర్య ఉష్ణగతిక శాస్త్ర నియమాల (Law of Thermo Dynamics) ను అనుసరించి ప్రారంభించడానికి ఎంతో ఉత్తేజక శక్తి అవసరం. అందుకోసం వీటి మధ్య చర్యను విద్యుదుత్పర్గం (Electrical discharge) Spark Plug ద్వారా ప్రారంభించాలి. ప్రారంభమయిన తర్వాత ఇది పెద్ద విస్ఫోటనం జరిగే అత్యంత వేగవంతమయిన చర్య. ఎంత వేగమంటే అక్కడున్న పాత్రలు కూడా పగిలిపోగలవు, అందుకనీ చర్యను ఒక క్రమ పద్ధతిలో మెల్లమెల్లగా జరపాలి. దానికి కొన్ని సాధనాలు, పరికరాలు, పద్ధతులు అవసరం. తీరా నీరు తయారయినా వెదట వాయు రూపంలో తయారవుతుంది. దీన్ని ద్రవీభవించటానికి అవకాశాలు ఇవ్వాలి, ఆ తర్వాత ఈ నీటిలో తగిన మోతాదులో లవణాలు కలపాలి. అప్పుడది. త్రాగడానికి అనువుగా ఉంటుంది. (ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.) అందుకే సైన్సు సూత్రాలు, సైంటిస్టులు మాత్రమే సైన్సు కాదు, సైన్సుతో పాటు టెక్నాలజీ, వీటికి తోడు మానవుల పాత్ర (శ్రామికులు ఎక్కువ) ఉంటుంది,
ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య