పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆటల సంబరాలు - ఒలంపిక్ క్రీడలు

ఆటలు, క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

sportsహాయ్ ! చిన్నారాలూ !

ఆటలంటే మీ కిష్టం కదూ కానీ ఇప్పుడు సూళ్లల్లో ఆటలు ఆడించటమే లేదు. అసలు చాలా సూళ్లల్లో ఆడుకునేందుకు గ్రౌండే లేదు. అయినా మీకు ఆడుకోడానికి టైమేది !

ఉదయం స్కూలుకెళ్ళినప్పుటి నుండి స్కూలు వదిలేదాకా క్లాసులో పాఠాలే పాఠాలు.

మళ్ళీ సాయంత్రం ట్యూషన్, రాత్రికి హోమ్ వర్క్, మళ్ళీ ఉదయం ట్యూషన్ - స్కూలు - ట్సూషన్ - హోమ్ వర్క్ ఆదివారం కూడా స్పెషల్ క్లాసులు, వీకెండ్ టెస్టులు ఇలా జీవితం పుస్తకాల్లో, పాఠాల్లో పరీక్షల్లో గడిచిపోతుంది. కదూ

సాయంత్రం కాసేపు ఆటలాడుకుంటే మీరు పొందగలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదిగదా ఆటలవల్ల శరీరం, మనమూ ఎదుగుతామనీ, చదివింది అర్థంచేసుకొనే శక్తి పెరుగుతుందనీ మనందరికీ తెలుసు.

ఆటలకింత ప్రాధాన్యత ఉంది కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా వాటికి ఎంతో ప్రోత్సాహమూ ఉంది.

అంతర్జాతీయ క్రీడలకు తల మానికమైన ఒలింపిక్స్ ఆటలు ఆగష్టు 13 నుండి. ఏథెన్స్ నగరంలో జరగబోతున్నాయి. మనలో చాలా మందికి ఒలంపిక్స్ పేరు తెలుసుగానీ దాని చరిత్ర తెలియదు కదూ.

athensక్రీస్తు పూర్వం 776 లో గ్రీస్ దేశంలోని ఒలంపియాలో పెద్ద ఎత్తున క్రీడలు జరిగాయి. ఒలంపియాలో మొదట ఆటలు జరిపారు కాబట్టి వీటికి ఒలింపిక్స్ అని పేరు పెట్టారు. ఆ క్రీడల్లో అందరూ మగవారే పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఆటగాళ్ళు ఏవిధమైన దుస్తులూ ధరించకుండా నగ్నంగా ఆడేవాళ్ళు. అది ఆనాటి నియమం. అందుకనే ఆనాటి ఒలింపిక్స్ లో స్త్రీలను ఆడడానికి గాని చూడడానికి గాని అనుమతించే వాళ్ళు కాదు.

ఆ రోజుల్లో చిన్నచిన్న రాజ్యాలుండేవి. ఎక్కువగా యుద్ధాలు జరుగుతుండేవి. కాని ఆటలు జరిగేటప్పుడు మాత్రం అందరూ శాంతిని పాటించేవారు. ఆటలు అన్ని జాతులను అన్ని దేశాలను ఒక్క దగ్గరకు చేర్చేవి. అందరిలో స్నేహ భావాన్ని పెంపొందిచేవి. యుద్ధాలలో ప్రజల్ని చంపి, విజయోత్సవాలు జరుపుకోవడం కంటే, ఆటల్లో గెల్చి తమదేశ కీర్తి, ప్రతిష్టలు పెంచడానికి ఎక్కువ మంది ముందుకొచ్చేవారు. అప్పుడు కూడా నాలుగేళ్ల కోసారి ఈ ఆటలు జరిపేవారు. కాని గ్రీస్ ని రోమన్ రాజులు పాలించేటపుడు ఈ ఆటలు ఆపేశారు. క్రీ.పూ. 393లో ఇవి ఆగి పోయాయి.

తరువాత క్రీ.శ. 1875 ఒలంపియా స్టేడియం బయటపడడంతో ఒలింపిక్ ఆటల చరిత్ర వెలుగులో కొచ్చింది. ఎప్పుడో శాతాబ్దాలకింద ఆగిపోయిన ఒలంపిక్ ఆటలని మళ్ళీ మొదలు పెట్టారని ప్రయత్నం చేసింది బేరన్ పియరిడీ కోబర్టిన్. ఆయన ఎన్నో కష్టాలు కోర్చి ఎంతమందిలో ఒప్పించి మళ్ళీ గ్రీస్ లోని ఏథెన్స్ నగరంలో 1896 ఆధునికి ఒలంపిక్ ప్రారంభించాడు. నాటి నుండి నేటి వరకు ప్రతి 4 సంవత్సరాలకి ఒలంపిక్ క్రీడలు నిరాటంకంగా జరుగుతున్నాయి. 1896 లో 13 దేశాలనుండి 79 మంది అథ్లెట్లు ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. ఈనాడు 200 దేశాల నుండి 11000 మంది ఆటగాళ్ళు పాల్గొనబోతున్నారు. ఆధునిక ఒలంపిక్ ప్రారంభించబడిన ఏథెన్స్ నగరం ఈ ఏడాది ఒలంపిక్స్ కు వేదిక కావడం విశేషం.

sportstwoఒలంపిక్స్ లో మహిళలకు ప్రవేశం లేదనుకున్నాం. గదా 1912 ల జరిగిన ఒలంపిక్ క్రీడలలో మొదటిసారిగా స్త్రీలకు ప్రవేశం కల్పించారు. యాంట్ వర్ప్ లో 1920 లో జరిగిన ఒలంపిక్స్ క్రీడలలో మొదటిసారి ఒలంపిక్ జెండాని ప్రవేశ పెట్టారు. తెల్లని బట్టమీద 5 ఖండాలు (అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా) గుర్తుగా 5 రంగుల ఒక దానితో ఒకటి పెనవేసుకొన్నట్సు ఉండే నీలం, పసుపు నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల ఒలంపిక్ ఎంబ్లం తయారు చేశారు.

ఒలంపిక్ క్రీడలు చాలా ఖర్చుతో కూడినవి. ఇప్పటి దాకా ఈ ఆటలు సంపన్న దేశాలు మాత్రమే జరిపాయి. మన భారతదేశం ఒలంపిక్ జరుపుతామని అంతర్జాతీయ ఒలంపిక్ అసోసియేషన్ కి దరఖాస్తు పెట్టుకొంది. మన ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉంది.

మనదేశంలో ఇంకా చాలా గ్రామాలకి కరెంటు లేదు. రహదారులు లేవు. మంచినీటి సౌకర్యంలేదు. సగం మందికి ఇంకా చదువు నేర్పలేదు. మనం ముందు మన గ్రామాలకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. మన పాఠశాలల్లో ఆటస్థలాలు ఇతర వసతులు ఏర్పాటు చేసి పిల్లల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఒలంపిక్స్ జరుపుతున్న దేశాలుకు ధీటుగా మన దేశాన్ని పెట్టుకోవలి. అంతేగాని ఒలంపిక్స్ జరిపేసి మనంకూడా సంపన్న దేశాల సరసన చేరిపోయాం అనుకుంటే పొరపాటు.

ఈ సారి ఏథెన్స్ లో జరగపోతున్న ఒలంపిక్స్ గ్రాడలు విజయవంతం కావాలని ఆశిద్దాం ?

2.99456521739
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు