హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఆసక్తికర అంగారక చిరుశకటం, జిజ్ఞాస పొంగారని కుజ శకటం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆసక్తికర అంగారక చిరుశకటం, జిజ్ఞాస పొంగారని కుజ శకటం

మార్స్ క్యూరియాసిటి రోవర్ చాలా సంవత్సరాల పాటు అక్కడ పరిశోధనలు చేసేలా ప్రోగ్రాం చేశారు.

sep1 సౌర కుటుంబంలో మనకు దిగువన ఉన్న శుక్ర గ్రహ మరియు మనకు ఎగువన ఉన్న అంగారక (కుజ) గ్రహం మీదకు క్యూరియాసిటి రోవర్ దిగడాన్ని ఆసక్తికరంగా అబ్బురపడుతూ ఆనందించాం. అంగారక గ్రహం లేదా కుజ గ్రహం మనకు సుమారు ఏడున్నర కోట్ల కి.మీ. దూరంలో ఉంది. అంటే మన భూమికి, సూర్యినికి ఉన్న దూరం (సుమారు 15 కోట్ల కి.మీ.)లో దాదాపు సగం దూరంలో ఎగువన ఉంది. అయితే ఈ గ్రహం మీద అనుకోకుండా ఒక రోజు గడిపితే ఆ రోజు దాదాపు మన భూమి మీద గడిపిన్నంత రోజంతే ఉంటుంది. ఎందుకంటే అంగారక గ్రహపు భ్రమణ కాలం (period of spin) మన లెక్క ప్రకారం 24 గం. 39 ని. 35 సె.లు. అలా అని మన సంవత్సరం కుజగ్రహ సంవత్సరం (పరిభ్రమణకాలం – period of revolution) ఒకటే కాదు. అంగారక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి ప్రదక్షణ చేయటానికి సుమారు రెండు సంవత్సరాలు (ఒక సంవత్సరం, 320 రోజులు, 18 గం. 12 ని.) పడుతుంది.

కుజ గ్రహం మీద రాత్రుళ్ళు ఉష్ణోగ్రత భరించలేనంత చల్లగా (దాదాపు -150oC) ఉన్నా పగలు మాత్రం మనకు ఆహ్లాదకరంగానే ఉంటుంది. (35 oC) ఎన్ని విధాలుగా చూసిన అక్కడ కూడా భూమికి మల్లే జీవం ఉండేందుకు ఆస్కారం ఉంది. కాని ఆనవాళ్లు ఉండడం లేదు. నిజంగా అక్కడ జీవం లేదు.

మరి జీవం ఉండాలంటే సరియైన వాతావరణం, నీరు, ఆహారం పరిస్థితులు ఎన్నో ఉండాలి. పోనీ ఒకసారి మనుషుల్ని పంపి చూసొద్దాం. అంటే అంత వీలయ్యే విషయం కాదాయే. ఎందుకంటే అక్కడికి మన క్యూరియాసిటి రోవర్ ప్రయాణ సమయాన్ని బట్టి చూస్తే మనుషుల్ని అంగారక గ్రహం మీదకు పంపటం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని తెలిసిపోతుంది.

sep2అంతకముందు డిసెంబర్ 4, 1996 నాడు అంగారక గ్రహం మీదకు మార్స్ ఫాధ్ ఫైండర్ (Mars Path-finder)ను NASA వాళ్ళు రాకెట్ల ద్వారా పైకి పంపారు. తీరా అది అంగారక గ్రహాన్ని చేరడానికి సరిగా 7 నెలలు పట్టింది. అంటే అది అంగారక గ్రహం మీద జులై 4, 1997 నాడు దిగింది. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం తదితర అంశాల్ని అన్వేశించే నిమిత్తం అది వెళ్లింది. కాని క్యూరియాసిటి రోవర్ అలాకాదు. దీనికి పెద్ద ప్రణాళికే ఉంది. చాలా సంవత్సరాల పాటు అక్కడ పరిశోధనలు చేసేలా దీన్ని ప్రోగ్రాం చేశారు.

ఇది నవంబర్ 26, 2011 నాడు ప్రయోగించబడింది. అది కుజ గ్రహం చేరడానికి దాదాపు ఎనిమిదిన్నర నెలలు పట్టింది. ఎందుకంటే ఇది మార్గమద్యంలో ఇతర పనులు కూడా కన్ని చేసేలా పురమాయించారు. భూమికి, కుజ గ్రహానికి దూరం కేవలం ఏడున్నర కోట్ల కిలోమీటర్లే ఉన్నా ది సుమారు 56 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. దాని ప్రయాణాన్ని ఆ విధంగా రూపొందించారు. ఎన్నో సార్లు భూమి చుట్టూ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతూ అక్కడికి  చేరింది. చివరకు ఆగష్ట్ 6, 2012 నాడు అంగారక గ్రహం మీదకు అబ్బురంగా దిగింది. మనకిప్పుడు అది రోజుకి ఎన్నో బొమ్మల్ని పంపుతుంది. అక్కడ ఒకప్పుడు నీటి ఆనవాల్ళు ఉన్నట్లు ఆధారాలు కొద్దిగా దొరుకుతున్నాయి. త్వరలో మన దేశం కూడా ISRO సంస్థ ద్వారా అక్కడికి ఉపగ్రహాన్ని (మార్స్ శకటాన్ని) పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మన ప్రధానమంత్రి ప్రకటన కూడా చేశారు.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.01993355482
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు