অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఈ మాసంలో పుష్పించే వృక్షం

ఈ మాసంలో పుష్పించే వృక్షం

jan7.jpgసంస్కృతంలో “సహకారము” అనబడే వృక్షం, మహాకవి కాళిదాసు కవిత్వంలా మతైక్కించే తీయని వాసనతో వసంత కాలానికి ప్రతీకగా నిలిచింది. అది మన దేశ జాతియ ఫలం. ఫలాలలో రారాజు. దాని ఆకుల అన్ని శుభకార్యాలలో అలంకారానికి వాడబడేది. ఈ చెట్టు లేకపోతే వనంలో ఎన్ని చెట్లున్నా వృధా అనిపించే చెట్టు. ఈ నెలలో పుయటం చూస్తుంటాం. ఈ పాటికి ఈ చెట్టు, ఏ చెట్టు మీరు గుర్తించే వుండాలే! అదే మన మామిడి!

“గున్నమామిడి చెట్టుమీద గూళ్ళురెండున్నాయి.... మామిడి కొమ్మ మళ్ళి మళ్ళి పుయునులే...” అనే పాటలలో దిన్ని ఎప్పుడు గుర్తించుకుంటారు. తియమామిడి, పులుపుమామిడి, కలక్టరు మామిడి, రసం మామిడి, ముక్కమామిడి, పచ్చడి మామిడి ఒకటేమిటి ఎన్నో రకాలుగా మనకు సుపరించయం. వేసవి కాలంలో పళ్ళు అందించే మామిడి, ఈ నేలనుండి మార్చి వరకు పుష్పస్తుంది. “వేసవికాలంలో అవకాయలేని ఇల్లు, మామిడి పండులేని విందు” మన నుండి రాష్ట్రంలో ఉండదంటే అతిశయోక్తి కాదు.

దీని శాస్త్రయనామం మెంజిఫేరా ఇండికా (Mangnifera indica). అనకార్డియేసి (Anacardiacae) కుటుంబానికి చెందినది. ‘మా’ లేక ‘మాంగాస్’ అని తమిళంలో, హిందీ, బెంగాలిలో ఆమ్ర అని, మరాటిలో అము అని, గుజరాత్ లో అంబో అని మలయాళంలో మావు అని అంటారు. సంస్కృతంలో కూత, రాసా అనే పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తర ప్రపంచ దేశాలలో “మాంగో” అనే పదాన్ని కొంచెం తేడాతో అటు ఇటుగా పలుకుతారు. మామిడి చెట్టు వాణిజ్య, ఆధ్యాత్మిక, వైద్య పరంగా ప్రాముఖ్యత గలిగి ఉంది. వేదాలలో, ఆయుర్వేదంలో “ఫలశ్రేష్ట” గా పేరుపొందింది. విదేశియులు దీనిని “Apple of East” అంటారు. మన దేశానికే కాక పాకిస్ధాన్, ఫిలిఫైన్స్ దేశాలకు కూడా మామిడి జాతీయ ఫలం. బంగ్లాదేశ్ జాతీయ వృక్షం.

నాలుగు వేల సంవత్సరాల నుండి మనదేశంలో ప్రాచుర్యం పొందిన ఈ చెట్టు అసియాదేశాలలో క్రి. పూ. 4-5 శతాబ్దాల్లో ప్రవేశించింది. క్రి.శా. 10 శతాబ్దానికల్లా, తూర్పు ఆఫ్రికాలో, తరువాత దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్, వెస్ట్ఇండీస్, మెక్సికో దేశాలలో అంటే మంచు పడని ప్రదేశాలలో వాతావరణం అనుకూలంగా ఉందొ అక్కడ స్ధిర పడిపాయింది. ఇంకా, ఆస్ట్రేలియా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్దాన్, ఫిలిఫైన్స్, కేరబియన్ దీవులు, కొన్ని ఉత్తర అమెరికా దేశాలలో విరివిగా సాగవుతూ వుండి. సహజంగా హిమాలయ దిగువ ప్రాంతాలు, బీహార్ లోయలు, భాషియా కోడలు, పడమటి కనుమలు, మనరాష్ట్రా అడవులలో పెరుగుతుంది. ఈ ఉష్ణమండల చేట్టుఫలాల రుచి మరిగిన అక్బరుపాదుషా బీహారు రాష్రంలో అనేక వేల చెట్లతో “దర్భంగా” అనే ప్రాంతంలో మామిడి తోపును పెంచాడు.

jan8.jpgప్రస్తుతం పద్మశ్రీ బిరుదుపొందిన హాజీ కలిముల్లాఖాన్ 100 సంవత్సరాల వయసుగల చెట్టుమీద అంట్లుకట్టి 300 రకాలను ఒకే చెట్టుమీద పెంచుతున్నాడు. ఇతని ఈ అరుదైన చెట్టు “లిమ్కాబుక్”లో చోటు చేసుకొంది,. ఇతను క్రొత్త రకాల మామిడిని కనుగొన్నాడు. ఒక విధమైన మెరుపు, రంగు గల నూతన రకానికి బాలివుడ్ తార ఐస్వార్య అని పేరు పెట్టాడు. యింకా డిల్లీ రాష్ట్రపతి భవనంలో 54 రకాల మామిడి పళ్ళు ఇచ్చే చెట్టును తయారు చేశాడు.

ప్రపంచంలో మామిడి పంట మన దేశంలోనే అత్యధికంగా 40 శాతం పండుతుంది. భారతదేశంలో సంవత్సరానికి 10 మలియన్లు టన్నుల ఉత్పత్తి అయితే అందులో ఒక శాతం మాత్రమే గల్ఫ్ దేశాలకు ఎగుమతి జరుగుతుంది. మిగిలిన 99శాతం మనవాళ్లే వాడేస్తారు. మన రాష్ట్ర మామిడి దేశంలో రెండవ స్థానం. మొదటిది ఉత్తరప్రదేశ్. మామిడి రకాలు వేయికి పైగా ఉన్న 20 రకాలు మాత్రమే సాగుచేస్తారు. వాతావరణ పరిస్దితుల ఆధారంగా ఒక్కోక్క రాష్ట్రంలో ఒక్కొరకం సాగుచేస్తారు. మన రాష్ట్రంలో బంగినపల్లి, బెనిషాన్, బెనిషా, సువర్ణరేఖ, నీలం, తోతాపురి, రసాలు, సాగుచేస్తుండగా కర్ణాటక, మధ్యప్రదేశ్ మహారాష్టలో ఆల్ఫోన్ సా (alphanso), ఉత్తర భారతదేశంలో దషరి, లంగ్రా రకాలు ఎక్కువ. మనకు మామిడి పూత, కాత ఉత్తర భరతదేశం కంటే ముందు వస్తుంది. సముద్ర మట్టానికి 1100 అడుగల ఎత్తు ప్రదేశాలలో పెరుగుతుంది. ఉష్ణోగ్రత 24-27c అనుకూలం. వర్షం, మంచు, గాలిలో అత్యధిక తేమ మామిడి పుటకు ప్రతికూలం. పూత కాయలుగా మారేటప్పుడు అధిక ఉష్ణోగ్రత చాలా అనుకూలం. వర్షపాతం 25-250 cm మద్య ఉన్న ప్రాంతాలలో ఎక్కువ పెరుగుతుంది. సాధారణంగా మామిడి వ్యాప్తి అంటుద్వారానే ఎక్కువ. మామిడి టెంకను మొలకెత్తిన తర్వాత 2-4 వారాల మొక్కలకు కావలసిన రకంతో అంటుకట్టి ఉంచుతారు. వర్షకాలంలో మామిడి అంట్లును తిరిగి నాటటానికి అనువైన సమయం.

jan9.jpgమామిడి చెట్టు పచ్చగా ఉటుంది. కొమ్మలు పరుచుకొని దట్టంగా వుండి. రుచికరమైన పళ్ళతో పాటు నీడా కూడా అందిస్తుంది. మామిడి చాలా సంవత్సరాలు బ్రతికే బహువార్షిక మొక్క. 300 ఏళ్ళు అయినా కూడా కాయలు కాస్తుంది. 35-40 మీటర్లు ఎత్తు, 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వేళ్ళు 6 మీటర్లు భూమి లోపలికి చొచ్చుకొని పోతాయి. మామిడి చిగురు ఎర్రగా ఉంటుంది. తరువాత క్రమంగా ఆకుపచ్చగా మారుతుంది. మామిడి చిగురించే సమయంలో కోయిలలు లేత ఆకులను తిని మధురంగా కూస్తాయి. ఈ కాలంలో పూలు గుంపులుగా కొమ్మల చివరన పుస్తాయి. మామిడి పూత వసంతకాలానికి, దేవతలలో మన్మధుడికి ప్రతిరూపంగా తలుస్తారు. ఒక్కొక్క పూల నుండి వేల వరకు ఒక్కక్క చెట్టుకు 10-30 లక్షల పూలు పుస్తాయి. మామిడి చెట్టు సాధారణంగా ఒక్కసారిగా చెట్టంతా పూతతో నిండి తెనేటిగాలను అమితంగా ఆకర్షిస్తాయి. పూలు తెల్లగా చిన్నవిగా ఉండి తియ్యటి వాసనను విరజిమ్మతాయి.

ఒకే పుష్చ విన్యానంలో సంపూర్ణ పుష్పాలు, కేసరయుత పుష్పాలు, 1:4, 2:1 నిష్చత్తిలో ఉంటాయి. సంపూర్ణ పుjan1.jpgస్పాలలో కీలము (style) వంకర ఉంటుంది. కేసరయుత పుష్పాల్లో కీలము ఉండదు. కనుక అందులో ఫలదీకరణ జరగదు. పూలలో 3నుంచి 9రక్షక పత్రాలు, 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఒకే ఒక కేసరము ఫలవంతమైనది. మిగిలిన కేసరాలు మంద్యకేసరాలు. కనుక కొన్ని పూలలో మాత్రమే కాయలు ఏర్పడటానికి అవసరమైన కీలము ఉంటుంది కాబట్టి, కొన్ని పూలు మాత్రమే కాయలుగా మారతాయి.

సంపూర్ణ, ద్విలింగ పూలలో(Bisexual), అండాశయము(ovary), మకరంద గ్రంధులు ఉంటాయి. కేసారం ఈ గ్రంధుల బయట ఉంటుంది. కేసరాలు ఉదయం 8 గంటలలోపు పుప్పొడిని రాలుస్తాయి. పూలు తెల్లవారు జామున వికసించిన వెంటనే పరాగ సంపర్కము జరుగుతుంది. పూలు వికసించిన వెంటనే స్రవించిన మకరందం కీటకాలను ఆకర్షిస్తుంది. కీటకాలు మకరందం (తేనే) కోసం వాలినపుడు పుప్పోడి కిలాగ్రానికి తగిలి పరాగసంపర్కం జరుగుతుంది. కాని కేసరాలు చాలా తక్కువ పుప్పొడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కారణాల వల్ల తెల్లవారుజామున ఎక్కువ మంచుకాని, వర్షంకాని ఉంటే పరాగ సంపర్కం సరిగా జరగదు. కాత తగ్గిపొయి, దిగుబడి మీద చాలా ప్రభావం చూపుతుంది.

jan11.jpgస్వపరాగాసంపర్కం (Self Pollination) జరిగిన దాని కంటే పరపరాగ సంపర్కం (cross Pollination) జరిగితే కాత ఎక్కువగా వుంటుంది. సాధారణంగా 2-3% పూలు మాత్రమే సంపూర్ణపుష్పాలు (అండాశయము, కీలము, కేసరాలు కలిగి పుష్పాలు) కొన్ని రకాలలో 60-70% వరకు ఉంటాయి. అందుకనే చాలాసార్లు మనం పూత చాలా చూసినా కొంచెమే పంట ఉంటుంది. ఫలదికరణం లేనటువంటి పువ్వులే అధికం కాబట్టి పూత విపరీతంగా రాలిపోవటం కూడా సర్వసాధారణం. సంపుర్ణపుష్పాల శాతం పైన పరాగ సంపర్క జరుగుదల పైన, వాతావరణ పరిస్ధితుల ఆధారపడి ఉంటుంది. దీనివల్ల మనం గమనించవలసిందేమంటే పూత బాగా ఉంది కదా అని కాయలు చాలా వస్తాయని అనుకోకూడదు.

పరాగ సంపర్కం బాగా జరగాలంటే తెనేటిగలు ఎక్కువగా ఉంటే మంచిది. తేనే పట్టులను పెంచటం అవసరం. పరాగ సంపర్కం జరిగిన 3-6 నెలలలో కాయలు తయారవుతాయి. ఆకుపచ్చ రంగుతో టెంకగల పళ్ళు వివిధ ఆకారాలతో పండుగా మారే సమయానికి పసుపు నుండి ఎరువు రంగును కలిగి ఉంటాయి. 2 నుండి 9 అంగుళాల పరిమాణంలో, కొన్ని 2 కిలోల బరువు వరకు తూగుతాయి. మామిడి పండుతోలు మందంగా ఉంటుంది. లోపల రసం, పిచు కలిగి ఉంటుంది. మామిడి పండు రుచికి, అందానికీ రంగుకి రారాజు.

మామిడి పండు, బెరడు, ఆకులు అనేక విధాలుగా ఉపయోగపడుతాయి. ఫలరసాల తయారీలో మామిడి ప్రధమస్ధానం. పచ్చివి, పండువి రెండూ పనికివస్తాయి. పాలతో కలిపి తయారుచేసే పానీయంలో బెకరి తినుబడారాలలో మామిడి పండును చాలా వాడతారు. పండ్లుగుజ్జును ఎండబెట్టి నిలువచేస్తారు. అదే మామిడి తాండ్రగా అమ్ముతారు. పచ్చికాయలు ఎండబెట్టి పొడిచేసి పంటకాలలో వాడతారు. పచ్చికాయలతో నిల్వపచ్చళ్ళు తయారుచేస్తారు. ఆవకాయ, మాగాయ ఆంధ్రదేశం ప్రత్యేకతలు.

మామిడిపళ్ళు మంచి పోషక విలువులు గల ఫలం. విటమిన్లు ఎ,సి,కె,లు కెరటనాయిడ్లు, పొటాషియమ్ రాగి లవణాలు ఉంటాయి. ఒమేగా 3-6 పాలి అన్శాచురేడేడ్ (omega 3-6 unsaturated) ఫాటి ఆమ్మాలు కూడా ఉంటాయి. యంటి ఆక్సిడెంట్లు ఎక్కువే. బీటా carotene ఉండడం వలన పండుకు పసువు, కాషాయ రంగు వస్తుంది. పళ్ళతోలు ఆకులలో గల గాలిక్, సిట్రిక్ అమ్మాలు, లైపాల్ అనే పదార్ధం కాన్సరును ఆరికడతాయి. jan12.jpgపచ్చిమమిడిలో పిండిపదార్ధాలు , సిట్రిక్, అజ్సలిక్, మాలిక్, సక్సినిక్ అమ్మాలు ఉంటాయి. ఇవి పిత్తరసం (జీర్ణకారి రసాలు) అధికంగా తయారవటానికి . మామిళ్ళ పళ్ళ రసంతో తేనే, మిరియాలు కలిపి తింటే చర్మం పై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి. మామిడి పండులో పెక్టిన్ పదార్ధం ఎక్కవ. విరేచనాలు అరికట్టే గుణం కలది. పచ్చి మామిడి ముక్కలు ఉడకబెట్టి వేడిగా ఉన్నప్పుడే నీళ్ళు , ఉప్పు కలిపి పానీయంగా త్రాగితే వడదెబ్బ మాయం. దీనికి కారణం విటమిను ‘సి’ మామిడి పళ్ళు ఎక్కువ తింటే విరేచనాలు వస్తాయి. డానికి కారణం మామిడి పండు రసం కాదు, పళ్ళు బాక్టీరియాలతో కలుషిత్యం కావటం వలన విరేచనాలు కలుగుతాయి. ఎక్కువగా తింటే మాత్రం అజీర్ణం ఖాయం. కనుక మామిడి పళ్ళతో పాటు వాముకుడా తినండి. అజీర్ణం రాకుండా కాపాడుకోండి. చేపలు అధికంగా తింటే వచ్చే అజీర్తికి మందు చిన్న పచ్చి మామిడి ముక్క చాలు.

మామిడి పూలు , పండు, టెంక, బెరడును ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయటానికి వాడతారు. ఆకులు కూడా విద్యాపరంగా ముఖ్యమైనవే. మధుమేహం తగ్గిస్తుంది. బెరడు స్త్రీ సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది. మామిడి జిగురు నిప్పుల నివారణకు వాడతారు. మామిడి కర్ర మెత్తగా ఉండి మన్నిక కలది. ‘Package Box’ ల తయారికి టి పెట్టెలకు విరివిగా వాడతారు. మామిడి ఆకుల, పళ్ళు ఆకారాలను వస్త్రాలకు డిజైన్లూగా వేస్తారు.

కొన్ని మామిడికాయల Terpentine వాసనను కలిగి ఉంటాయి. పిలిఫైన్స్ దీవుల్లో కారాబావు మామిడి అతి మధుర ఫలంగా ప్రసిద్ధి పిందింది. మంచి వాసన, Terpentine వాసనలు అసలు లేకుండా ఉండి. అతి తక్కువ పీచుతో అధిక పోషక విలువలు కలిగినది. ఇవి సంవత్సరమంతా దొరుకుతాయి. కాని వేసవికాలంలో వచ్చే పళ్ళకు రుచి ఎక్కువ. ప్రపంచంలో దీని ఉత్పత్తి 35% ఆసియా దేశాలలో ఫిలిఫైన్స్ అత్యధికంగా మామిడిని ఎగుమతి చేసే దేశం.

ప్రపంచంలో అతి పురాతనమైన పెద్దమామిడి చెట్టు ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే తమిళనాడు రాష్టం కాంచిపురంలో వేగావతి నది ఒడ్డును ఏకాంబరేశ్వరాలయంలో ఉండి. దీని వయసు 3,500 సంవత్సరాలని చెబుతారు. స్వతహాగానే 4 రకాల ఆకులతో, 4 రకాల పళ్ళతో చాలా పెద్ద చెట్టుగా పేరు పొందింది. ఈ చెట్టు క్రిందే పేరు పొందింది. ఈ చెట్టు క్రిందే శివ, పార్వతుల పెళ్లి జరిగిందని చెబుతారు.

పట్నం

అనగనగా కూనవరం అనే గ్రామం ఉండేది. పట్టణానికి అరవైమైళ్ళ దూరంలో ఉంది. ఈ గ్రామంలో గోపాలం, నాగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిద్దరూ ఎప్పుడూ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఊరిలొనే ఉండేవారు. ఒకసారి పంట్నం నుంచి ఒకతను పని మీద కూనవరం వచ్చాడు. అనుకోకుండా గోపాలం, నాగయ్యలను కలిశాడు. ఆమాటా, ఈమాటా మాట్లాడుకుంటూ మా పట్నంలో ఎప్పుడైనా చూశారా అని వారిద్దర్నీ అడిగాడు ఆ పట్న వాసి. మా గ్రామానికి అరవై మైళ్ళ దూరంలో ఉన్నందును మేం చూడలేకపోయాం అన్నారు వారు.

ఆ తర్వాత ఒక రోజు నాగయ్య గోపాలం పట్నం వెడదామని నిర్ణయించుకున్నారు. మరునాడు తెల్లవారుజామునే లేని బయలుదేరారు. చాలాసేపు ప్రయాణం చేశారు. పట్టణం ఎప్పుడు వస్తుందో వారికి సరిగా తెలియదు. తెల్లవారింది, ఎండా త్రివత పెరుగుతూ ఉంది. ఇద్దరూ అలసిపోతున్నారు. ఎంతటికీ పట్నం కనిపించలేదు. ఇంకా ఎంత దూరం ఉందోనవి చెట్టు పైకెక్కారూ. పట్నం అచ్చం మన ఊరిలాగే ఉంది అని అన్నాడు నాగయ్య. నాకు అలాగే అనిపించింది అని గోపాలం చెప్పాడు. పట్నణంలో చాలా వింతలు వెశేషాలు ఉంటాయని ఆపట్న వాసి విశేషాలు చెప్పి ఇబ్బంది పెట్టాడు అనుకుంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate