పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఈ మాసంలో పుష్పించే వృక్షం

ఈ మాసంలో వచ్చే చెట్లు.

వాహనాలకు డిజిల్ కు బదులుగా వాడే “బయోడిజిల్”ను ఉత్పత్తి చేసే చెట్టు గురించి తెలుసుకుందాం. ‘కరంజ’ అనే ఈ చెట్టు విత్తనాలు నుండి “బయోడిజిల్ ను” తీస్తారు. దీని గురించి అన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలో ప్రస్తావించపడింది. రాత్రి పూట పూస్తుంది కాబట్టి “నక్తాము” అని నెయ్యిలాంటి చిక్కిన నునేనిస్తుంది కాబట్టి “ఘ్రుతపూర” అని పూలు గుత్తలలో పూస్తాయి కాబట్టి పుష్చ్గుచ్చ అని చాలా పేర్లతో సంస్కృతంలో సంబోధిస్తారు. ‘సిరిబిల్ల’ అనే మరో పేరు కూడా ఉంది. హిందీ బెంగాలి మరాటి గుజరాతీలో కరంజా అని తెలుగులో కానుగ లేక పుంగు అని తమిళంలో పుంగ లేక పుంగమ్ అని ఇంగ్లిషులో “ఇండియన్ బీచ్” అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం “పొంగామియా గ్లాబ్రా pongamia glabra – గ్లాబ్రా అంటే లాటిన్ భాషలో నున్నని, వెంట్రుకలు లేనిదని అర్ధం. దీని ఆకులు చాల నునుపుగా, మెరుస్తూ ఉంటాయి. కనుక దీనికి ఈ పేరు పెట్టారు. పొంగామియా ఇండికా లేక పోగామియా పిన్నేటా అని కూడా అనేవారు. పిన్నేటా అంటే ఈక వంటిదని అర్ధం. ఆకులు ఈకలాగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. కనుక ఈ పేరు పెట్టారు. లేగూమినోడే కుటుంబానికి చెందినది.

mar15.jpgభారతదేశం స్ధనియతగా గల ఈ చెట్టు మనదేశ అన్ని రాష్ట్రాల సముద్ర తీరాల వద్ద, నీటి వనరు గల నేలలో, నది తీరాలలో, చిన్న వాగుల వద్ద సహజంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకృతి సహజంగా ఉష్ణోమండల అడవుల్లో తేలిగ్గా పెరుగుతుంది. చైనా, బర్మా, శ్రీలంక, మలయా అర్చిపిలాగో నుండి ఆస్ట్రేలియా వరకు, తూర్పు ఫిజి దేశాల దాక వ్యాప్తి చెందింది,. mar16.jpgనీటి ఎద్దడి ఉన్న ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. ఎప్పుడూ ఆకుపచ్చగా, దట్టంగా పరుచుకొన్న కొమ్మలతో 15-25 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్టును చల్లని నిదా కొరకు దీనిని పెంచటానికి ఆసక్తి చూపుతారు. ఈ చెట్టు ఎప్పుడు చూసినా పచ్చగా చాలా అందంగా ఉంటుంది. ఇంటి ముందు కానుగ చెట్టు కళ్ళకు ఆహ్లాదకరం.

mar17.jpgచెట్టుకొమ్మలు కొంచెం వ్రేలాడుతూ ఉంటాయి. బెరడు మెత్తగా, నున్నగా, తెలుపు బూడిదరంగు లేక లేత గోధుమ రంగుతో ఉండి చిన్న ట్యుబరక్యులతో (Tubercule) కప్పబడి ఉంటుంది. పొడవైన తల్లివేరు అనేక పార్శ్వ వెళ్ళుతో ఉండటం వలన నీటి ఎద్దడిని తట్టుకోనగలుగుతుంది. దట్టమైన కొమ్మలు క్రిందకు వంగి నిదనిస్తాయి కనుక నీటిని ఆవిరి అయిపొకుండా కాపాడుతుంది. ఇంకా వేళ్ళలో స్ధాపక బాక్టీరియాలైన రైబోజియం, బాసిల్లాస్, ప్రజాతుల సహజీవనం చేస్తాయి. ఇవి గాలిలోని నత్రజనిని స్తాపించి మొక్క పోషణకు చాలా ఉపయోగపడుతాయి. ఉప్పు నీటిని తాకిన కూడా వెళ్ళు పెరుగుతాయి. ఈ చెట్టు అన్ని రకాలైన నేలలలో పెరుగుతుంది. వృతవంతా రహిత ఏకాంత సంయుక్త (Petiolate compound leaf) ఆకు 5,7 లేక 9 కోలా ముదురు ఆకుపచ్చ పత్రకాలు (leaflets) కలిగి ఉంటుంది. ఆకు చివర పత్రకము అన్నింటి కంటే పెద్దగా ఉంటుంది. ఆకులను రుద్దుతే చేదు వాసన వస్తుంది., సాధారణంగా పురుగులు అకులోని పత్రహరితాన్ని తినివేయటం వలన మచ్చలు ఏర్పడుతాయి. దీని కారణంగా అకులమీద పత్రహరితాన్ని తినివేయటం వలన మచ్చలు ఏర్పడతాయి. దీని కారణంగా అకులమిదబుడిపెలు కూడా ఏర్పడతాయి. ఒక వేల పురుగుపట్టిన చెట్టు కాడలను క్రొత్త ప్రదేశాల్లో నాటడానికి ఉపయోగిస్తే పురుగు నివారణ చాలా అవసరం. పురుగు పట్టిన ఆకులను దుసివేసి తగులబెట్టాలి.

ఈ చెట్టు మార్చి నెల నుండి మే నెల వరకు పూస్తుంది. పూలు పొడవాటి గుత్తులలో అమరిఉంటాయి. గుత్తులు దట్టమైన ఆకుల మధ్యలో కప్పబడి ఉంటాయి. కొంచెం సువాసననిస్తాయి. ఈ నెలలో చెట్టు ఆకులు రాలిపోతాయి. వెనువెంటనే మొగ్గ తొడిగి పుతకు వస్తుంది. పూలు చిన్నవిగా (1-1.5సెం.మీ) పోట్టికాడతో, తెలుపు, గులాబి రంగు లేక వంకాయ రంగుతో, సువాసనతో పెద్ద పెద్ద గుత్తులతో రాత్రిపుసి ఉదయానికి రాలిపోతాయి. తెల్లవారేసారికి =నేలమీద తీవాచీలాగా అందంగా అలంకరించి నట్లుగా ఉటుంది. పూలు చిన్న రక్షక పత్రలతో వంకాయ్ లేక లిలాక్ రంగు పత్రాలతో 10 కేసరాలతో అందంగా ఉంటాయి. తొమిది కేసరాలు ఒక గుంపుగా ఉంటె ఒకటి మాత్రం విడిగా ఉంటుంది. పూవులో ఒక ఫలదళం మాత్రమే ఉంటుంది. పూవులలో ఫలదీకరణ చెందినా తరువాత మరుసటి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాయలు తయురవుతాయి. కాయలు కోలగా కొంచెం వంకర తిరిగి ఒక గింజ కలిగి ఉంటాయి. 2-3 అంగుళాల పొడవు ఉంటాయి. 5 సవత్సరాల వయసు గల చెట్లు కాయలు కాయటం ప్రారంభించి 60,70 సంవత్సరాల వరకు కాస్తాయి. సంవత్సరానికి ఒక్కొక్క చెట్టు నుండి. 100 కిలోల కాయలు వస్తాయి. కాయలలో 35% శాతం నూనె ఉంటుంది. నూనెకు త్వరగా ఆవిరి కానటువంటి గుణం ఉంది. నూనెలో ముఖ్యంగా గ్లబ్రన్, కరంజ అనే రసాయనాలు ఉన్నాయి. పొంగామియా నూనెను కర్నాటకాలో హాంగ్ నునెగా పిలుస్తారు. ముఖ్యంగా పంపులను నడపటానికి ఈ బయోడీజిల్ ను వాడతారు. 1940 లో హైదరాబాద్ నవాబు అజాంజాహి వస్త్ర మిల్లులను నడపటానికి తినటానికి పనికిరాని ఇటువంటి నునేను వాడి పవరు సరఫరా చేసేవారు. 2003 సంవత్సరంలో హిమాలయ యోగ శాస్త్రీయ అధ్యాత్మిక సంస్ధ ‘’Biofuel Rural department’ రైతులకు దీని గురించి తెలియచేయటానికి పుసుకోంది. అదే సంవత్రంలో భారత ప్రభుత్వం కొన్ని కోట్ల వ్యయంతో 45,000 రైతులను సమీకరించి 20 మిలియన్ల “కరంజా” మొక్కలను నాటించింది. విద్యుచ్చిక్తి సరఫరాలేని గ్రామాలలో పొంగామియా బయో డిజిల్ ను ఉపయోగించి విధి దీపాలను పంపు సేట్లును జనరెటర్లను నడిపిస్తూన్నారు. ఆఫ్రికా దేశాలలో కూడా దిన్ని నూనె కొరకు విరివిగా పెంచుతున్నారు. నూనె ఇంకా వేరే వాటిక కూడా చాలా ఉపయోగపడుతుంది. ల్యుబ్రికేంటుగా, రంగుల్లో, క్రిమిసంహారక మందుల్లో సబ్బుల తయారీలో, తోళ్ళ పరిశ్రమలలో, కొవ్వోత్తుల తయారీలో వాడతారు. పొంగామియా నూనెను transeslerification ద్వారా పొటాషియం హైడ్రాక్సైడ్, మిధనాల్ ను ఉపయోగించి నునేను తీస్తారు.

బయోడిజిలే కాకుండా ఈ చెట్టు భాగాలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వెళ్ళు గనేరియా వ్యాధి, కురుపుల నివారణకు, పళ్ళు తోముకోవటానికి వాడతారు. కాండం, ఆకులు, పూలు, కాయలు, విత్తనాలు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారూ. చరమవ్యాధుల నివారణలో చాలా ఎక్కువగా వాడతారు. ప్రైల్స్, బెరిబెరి, దగ్గు జలుబు, మానసిక చికిత్సకు బెరడు వాడతారు. బెరడును తాడుగా పెనుతారు. ఆకులు వరి పొలాల్లో పచ్చిరోట్టగా (green manure) ఉపయోగపడుతాయి. దీని కలప గట్టిగా, తెల్లగా ఉంటుంది. బొమ్మలు, బండి చక్రాలకు, ఎడ్లబళ్ళకు, పారలు మొదలైన వ్యవసాయ పనిముట్ల తయారికి పనికివస్తుంది. పంట చెరుకుగా, స్తంభాలుగా వాడతారు. గానుగ పుల్లలను వాళ్లు తోముకోవటానికి వాడుతారు. ఈ చెట్టు ఆకులు, పూలు సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగిస్తారు. క్రమక్షయాన్ని (Soil erosion) అరికట్టగలిగే గుణం దీనికి ఉండి. అటవీ వర్ధకం (Aforestation) లో ఈ చెట్టు చాలా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉపయోగపడని పనికిరాని బంజరు భూమిలో అలంకరణ చెట్టుగా నీడ చెట్టుగా పెంచుతారు. కాయలు నూనె తయారికి ఉపయోగిస్తారు. శ్రీలంక టి తోటల్లో గాలిని నియంత్రించడానికి కానుగ చెట్లును నాటుతారు. ఆకులు చెద పురుగును బాగా అరికడతాయి. విత్తనాలు తేలిగ్గా మొలకెత్తుతాయి. కాబట్టి దీని వ్యాప్తి విత్తనాలు ద్వారా జరుగుతుంది.

కానుగ మొక్కలను రోడ్ల వెంబట ఎక్కువగా నాటుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలు చేకరించి మొక్కలని పెంచి అన్ని చోట్లకు సరఫరా చేస్తున్నారు. అటవీ శాక దీనిని చాలా ప్రాముఖ్యం ఇస్తుంది. మన దేశం సంవత్సరానికి 40 మిలియన్ టన్నుల బయోడీజిల్ ను వాడుతుంది. ప్రపంచ దేశాలైన ఉత్తర ఆమేరకా, చైనా, రష్యా, జపాన్ తరువాత భారతదేశానిదే! అందుకని భారతదేశ ప్రభుత్వం వాతావరణ కల్యుషం తక్కువ గల బయోడీజిల్ ఉత్పత్తికై జట్రాపా చెట్లతో పాటు కానుగ చెట్ల పెంచటానికి ప్రోత్సాహం ఇస్తుంది. బయోడిజిల్ ఉత్పత్తికై సహకరిస్తోంది.

ఆధారం: అడుసుమిల్లీ నాగమణి, ఉస్మానియా విశ్వవిద్యాలయం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు