অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఈ మాసంలో పుష్పించే వృక్షం “ఔషధాలయం”

ఈ మాసంలో పుష్పించే వృక్షం “ఔషధాలయం”

mt1“సర్వరోగనివారిణి”. ఇంటింటా పల్లె పల్లెలో ఔషధాలయం మన వేపచెట్టు సంస్కృతంలో అరిష్ట అంటే సంపూర్ణమైనది నశింపనిది పరిపూర్ణమైనది, నింబ అంటే మంచి ఆరోగ్యం ఇచ్చేదని, “పించుమిద” అంటే కుఘ్ట మొదలైన చర్మవ్యాధులను అరికట్టేదని అర్ధం. వేపను శాస్త్రీయంగా ఆజాడిరిక్టా ఇండికా (Azadirachta indica) అంటారు. మీలమేసి (Meliaceae) కుటుంబానికి చెందినది. తెలుగులో వేము, వేప, వెంపు, ఇంగ్లిషు లో నీమ్ (Neem) లేక ఇండియన్ లిలాక్, బెంగాలిలో నిమ్, నిమ, మలయాళంలో అర్యవేప్పు, ఒరియాలో నింబ, మరాటిలో కడినింబ, అరబ్బీలో నీబ్ లేక మార్గోసా, కన్నడలో బెవు, కొంకిణిలో కోడునిచ్, శ్రీలంకలో కోహమ్ బో , తమిళంలో వెంబు, బర్మాలో తమర్, వియత్నాంలో స్కాబన్, నౌడా, అన్డో, స్పానిషలో పరైసో తూర్పు ఆఫ్రికా దేశాలలో మౌరుబైని అంటారు,. పర్షియా భాషలో దీనిని “ఆజా- డర్ క్ట్” అంటే పవిత్రమైనదని అర్ధం. శాస్త్రీయంగా ఈ పేరునే వాడారు. ఇలా ప్రపంచ దేశాలలో చాలా పేర్లతో పిలుస్తారు.

mt2క్రీ.పూ. 4వ శతాబ్దంలో వేప చెట్టు గుణాలు. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో వివరించబడింది. సుహృత సంహిత చరక సంహిత వంటి మన ప్రాచీన ఆయుర్వేదంలో గ్రంధస్ధం చేయబడి దీని వాడకానికి మనమే హక్కుదారులు అన్నదానికి రుజువులున్నాయి. మనదేశంలో వేపచెట్టు ప్రతి భాగాన్ని 4000 వేల సంవత్సరాల నుండి విద్యానికి వాడుతున్నారు. తినటానికి పనికిరాని వేపనూనె మందుగా పనికి వచ్చేదిగా ప్రసిద్ధి చెందినది. అడవులు, వ్యవసాయం గురించి వ్రాయబడిన సంస్కృతి గ్రంధం ఉపవినోదని లో పశువుల రోగాల నివారణిగా మృత్తిక సారాన్ని కాపాడటానికి వేపను వదమన్నారు. 6వ శతాబ్దంలో వరాహిమిహిరలోని బృహిత్సంహిత భాగంలో వేపచేట్టును అన్ని పరిసర ప్రాంతాలలో నాటమన్నారు. యనాని వైద్యులు దీనిని “షహర్-ఇ-మునారక్” అన్నారు. అంటే పవిత్రమైన చెట్టు. పర్షియా (ఇప్పటి టర్కీదేశం) మేధావులు దీనిని భారతదేశ ఉచిత వృక్షంగా వర్ణించారు. భూమి మీద అమృతం చుక్కలుపడితే అది వేపచేట్టుగా మొలిచిందని పురాణాలలో కధలుగా వ్రాశారు. చాలా విధాలుగా పనికివస్తుంది కాబట్టి ఆర్యుల వైద్య దేవుడైన ధన్వంతరి గా వేపనే అనుకొంటారు. ఎవరైతే వేపచెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నాగా చేరుకొంటారట! రామాయణంలో రాముడు పంచవటిలో ఉన్నట్లు చెబుతారు. మారేడు, బిల్వ సమీ, రావి, వేప. ఈ ఐదుచేట్లు ఉంటె పెద్ద వనంతో సమాసం.

వీటిలో వేపకుడా ఉందంటే ఈ చెట్టు ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. పంచవటి చెట్ల క్రింద కూర్చుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచనలు సరియైన రీతిలో ఉంటాయంటారు. దీనికి కారణం ఆ ప్రదేశంలో అచెట్ల నుండి చాలా ఎక్కువ ఆక్సిజన్ వేలువడటమే!

వేపాకు పచ్చడి తన ఆరోగ్య రహస్యం అని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. దీని అన్నిభాగాలు చాలా చేదుగా ఉంటాయి. చేదు గురించి చెప్పాలంటే వేపను మించి మరో ఉదాహరణ దొరకదు. ఈ చేదు అనటానికి కారణం .

“వేము చేక్కదిన్న విశారోగములు పాయు దేహకాంతి కలుగు దృడము కలుగు తినగ దినగానదియే తీయగా నుండును విశ్వదాభిరామ వినురవేమ”

ఈ పద్యంలో వేపచెట్టు ప్రాముఖ్యతను యోగి వేమన తేలికగా అర్ధం అయేవిధంగా తన శతకంలో పద్యరూపంలో వ్రాశాడు.

ఆరోగ్యపరంగా వేప చాలా మంచి కలుగచేస్తుంది. కాబట్టి మనదేశంలో ఉగాది పండుగ రోజున వేప పూవును పచ్చడి చేసి తప్పక తింటారు. సంవత్సరానికి ఒక్కసారైనా వేప పువు తింటే చాలా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మిక ఈ అలవాటుగా మారింది. ఈ ఔషధ మొక్క శిశిరఋతువులో ఆకులురాల్చి వనంత కాలం రాగానే చిగురులతో , ఆహ్లాదకరమైన మెరిసే ఆకుపచ్చని ఆకులతో మత్తేక్కించే సువాసన భరిత పూలతో తెలుగువారి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. ఇది మన రాష్టం జాతీయ వృక్షం కూడా !

వేప భారదేశం మైన్మార్, బంగ్లాదేశ్ శ్రీలంకల, మలేసియా , పాకిస్ధాన్ మొదలైన ఉష్ణ, అర్ధ ఉష్ణమండల ప్రాంతాలలో స్ధానీ యతను కలిగి ఉంది. మన దేశం నుండి వేర్ దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికా, దక్షణ ఆమెరికా దేశాలలో కూడా దీనిని పెంచుతున్నారు. తూర్పు ఆఫ్రికా దేశంలో దీనిని మారునైని అంటారు. అంటే 40 రకాలైన వ్యాధులను తగ్గిస్తుందని అర్ధం. మనదేశంలో వేపచెట్టులేని రాష్ట్రం లేదు.

వేపచెట్టుకు త్వరగాపెరిగే గుణం కలదు 50-65 అడుగుల ఎత్తు వరకు పేరుగుతుంది. కొన్ని చోట్ల 115-130 అడుగుల వరకు కూడా పెరగవచ్చు. నీటి ఎద్దడి ఎదురైతే వెంటనే ఆకులు రాల్చి వేస్తుంది. వెనువెంటనే పచ్చటి ఆకులతో నిండిపోతుంది. ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి నీడ చెట్టుగా అన్నిచోట్ల నాటుతారు. ముఖ్యంగా దేవాలయాలలో పెంచుతారు. కొమ్మలు వెడల్పుగా వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా కొమ్మలు గుండ్రంగా పరచుకొని 60-65 అడగుల వెడల్పు ఆక్రమించు కొంటాయి.

కొమ్మల చివర ఆకులు కాడతో ఎదురుబోదురుగా ఉంటాయి. బహుదళయుత ఆకులు 8-16 అంగుళాల పొడవు 8-14 పత్రకాలు (Leaflets) కలిగి ఉంటాయి. ఆకులు గుంపుగా ఉంటాయి. పత్రకాల అంచులు రంపం మాదిరిగా ఉంటాయి. లేత చిగుళ్ళు రాగి రంగంలో ఉంటాయి.

మార్చి నుండి మే నెలలో ఉగాది పండుగ సయయానికి పూలు గుత్తులుగా వేలాడుతూ అందంగా అలంకరించినట్లుగా కనబడతాయి. ఒత్తుగా ఉన్న పుష్చ కనబడతుంది. ఒక్కొక్క గుత్తిలో 150-250 పూల వరకు ఉంటాయి. పూలు లేత ఆకుపచ్చ, కొంచెం తెలుపురంగులో ఉండి క్రిమ్ రంగుగా కనబడతాయి . ద్విలింగాపుష్పాలు, పురుష పుష్పాలు ఒకే పుష్పవిన్యాసంలో ఉంటాయి. ఒక్కొక్క పూవులో 5 చిన్న రక్షక పత్రాలు లె౩త ఆకుపచ్చ క్రిమ్ రంగుతో గరిటె ఆకారం గల 5 సన్నని సున్నితమైన ఆకర్షణ పత్రాలు ఉంటాయి. 10 కేసరాలు గొట్టం ఆకారంలో కలిసి ఉంటాయి. కేసరదండాలు గొట్టం లోపలికి ఉంటాయి. అండాశంయం 3 కిలాగ్రాలతో కేసర గొట్టం లోపలికి ఉంటుంది. మే నెలలో పరాగ సంపర్కం జరిగిన తరువాత కాయలు తయారవుతాయి.

వేపకాయలు ఆకుపచ్చగా కోలగా ఒక అంగుళం పరిమాణంలో ఉంటాయి. పండిన కాయలు పసుపురంగులో మెత్తటి గుజ్జుతో 1 లేక 2 గింజలు కలిగి పళ్ళుగా మారుతాయి. వేప పళ్ళను పక్షులు చాలా ఇష్టంగా తింటాయి. గుజ్జు తియ్యగా, కొంచెం చేదుగా ఉంటుంది.. సువాసనగా ఉంటాయి. పక్షులు పళ్ళును తిన్న తరువాత గింజలను రెట్టతోపాటు వదులుతాయి. పక్షులు పళ్ళను తిన్న తరువాత గింజలను రెట్టతోపాటు వదులుతాయి. ఈ విధంగా పక్షులు వేప గింజల వ్యాప్తికి ఉపయోగపడతాయి. గింజలు వెంటనే మొలకెత్తుతాయి. బాగా చల్లని నీటిలో నానబెడతారు. తరువాత గింజలను సంచులలో భద్రపరుస్తారు. మధ్యలో గాలి సోకేటట్లు ఏర్పాటు చేస్తారు. 5000 గింజలు ఒక కిలో బరువు ఉంటాయి. మట్టి కుండలో కొద్దిగా తేమ ఉంటె 3 నెలల తరువాత తాజా గింజల్లో ఎక్కువ శాతం మొలకెత్తుతాయి.

ఈ చెట్టుకు గల ప్రాముఖ్యం వల్ల నర్సరిలలో పెంచటానికి అనేక విధాలైన పద్ధతులను అనుసరిస్తూన్నారు. అటవీ శాఖ వారు అన్ని ప్రదేశాలలో  వేపచెట్టు పెంపకానికి మొక్కలు సరఫరా చేస్తూన్నారు. 1993 నుండి నిమ్ ఫౌండషన్ వారు వేపచెట్టు వ్యాప్తికై చాలా పాటు పడుతున్నారు. వర్షపాతం 400-1200 మి.మి ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది. ఉష్ణోగ్రత 50 C ఉన్నా కూడా తట్టుకొంటుంది. మంచు గడ్డ కట్టే ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. కాని రాళ్ళు, క్షార నేలలో తక్కువ మట్టి పొర ఉన్నటువంటి, ఇంకా సున్నపు రాళ్ళు గల ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతుంది.

కాల్షియం గనుల వద్ద ఆమ్లగుణం ఉన్న మట్టిని మధ్యస్ధ pH-7 కి మారుస్తుంది. ఆకులలో కొద్దిగా క్షరగుణం ఉంటుంది కాబట్టి రాలిన ఆకులు ఆమ్లం గుణం ఉన్న నేలలో pH తగ్గించి సారవంతం చేస్తుంది. పర్యావరణంలో బొగ్గుపులును వాయువును తగ్గించి ప్రాణవాయువును పెంచుటానికి, ఉష్ణోగ్రతను నియం త్రించటానికి, వాతావరణంలో విషవయువులను, విష పదార్ధాలను పిల్చుకోనటానికి ఉపయోగ పడుతుంది. వాతావరణ కాలుష్యాన్ని తట్టుకొనే గుణం కలది. మృత్తిక సారాన్ని కాపాడుతుంది. Lead దుమ్ము, CO2 సల్ఫర్ ఆక్సైడ్ లను పిల్చుకోగలుగుతుంది.

ఒక వేళ కాలుష్యం వల్ల ఆకులు రాలిపోతే వెంటనే చిగురించి పచ్చదనంతో నిండిపోతుంది. ఎక్కువ ఆకులు ఎక్కువ పచ్చదనమై శాల్యం ఉండటం వలన CO2 ని ఎక్కువగా తీసుకోని కిరణజన్యసంయోగక్రియుకు వాడుకొంటుంది. అశోక చక్రవర్తి చింత మధుకా చెట్లతోపాటు రోడ్ల వెంబట నీడ కోసం వేపచెట్లను నాటించాడు. ఇప్పటికి నీడ కోసం వేపను పెంచటానికి అందరూ ఇష్టపడతారు. National Environmental Engineering Research Institute వారు 1996 లో పట్టణ పరిశ్రమ ప్రాంతాలలో వేపచెట్టు కాలుష్యాన్ని అరికట్టటంలో సమర్ధత కలిగి ఉందన్నారు. అడవుల పెంపకంలో వేప చెట్టు నాటటానికి అనేక సంస్ధల వారు నడుంకట్టారు.

వేపచేట్టులో అన్ని బాగాలు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. పురుగులు దరిచేరకుండా ఉంటాయని ఆకులను గుమ్మాలకు వ్రేలాలాడదీస్తారు. వేపాకులు నీళ్ళలో వేసి స్నానం చేస్తారు చర్మవ్యాధులకు ఈ పద్ధతి ద్వారా చికిత్స చేస్తారు. పురుగుల నుండి రక్షణగా పసిపిల్లలను వేపాకుల మీద పడుకోబెడతారు. ఆకులు వర్మి కంపోస్టు తయారీలో ఉపయోగపడతాయి. వేడి చేసిన ఆకులను వాపులను తగ్గించటానికి వాడతారు. ఆకులు పురుగులను (దోమలు మొదలైనవి) దరిచేరనియదు ఏ రకమైన చర్మ వ్యాధి పచ్చినా, ఆటలమ్మ, పొంగు లాంటివి సోకిన వారిని వేప ఆకుల పక్క మీద వేసి పడుకోబేడతారు. వ్యాధులు తొందరగా తగ్గుతాయని, తరువాత త్వరగా కోలుకుంటారని నమ్మకం.

గాలిని శుభ్రపరిచే గుణం వేపాకు కలదని మన రాష్ట్రంలో భావిస్తారు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణ వాయువును వదులుతుంది. కాబట్టి ఈ నమ్మకానికి ఇదే కారణం కావచ్చు. వేపచెట్టు దగ్గర ఉంటె చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే పల్లె చుట్టూ వేప చెట్లున్నాయో ఆ పల్లెలో జ్వరాలు రాలేదు. ఈ చెట్లు లేని చోట జ్వరాలు వచ్చాయని శాస్త్రీయంగా ఋజువు చేశారు.

అనాది నుండి తక్కువ ఖర్చుతో తేలికైన సాంకేతిక పద్దతులతో వేపనునేను తీస్తూన్నారు. పురుగులను అరికట్టటానికి నూనెను ఎక్కువగా వాడతారు. వేజ్పనునే . ఆకులు, బెరడు నుండి తీసిన కాషాయం పొడి అన్నీ కూడా కిటకనాశిని, శిలింధ్ర నాశిని సుక్ష్మజివి నాశినిగా వాడతారు. ధాన్యాలు, పప్పులు మొదలకైనవాటిలో పురుగులు పట్టకుండా ఉండటానికి వేపాకులుగాని, నూనెగాని వాడతారు. పశువులు , గుర్రాలు, ఏనుగులతో సహా కురుపులు, దెబ్బలు, కడుపులో పురుగులు చర్మవ్యాధులు తగ్గటానికి వేపబెరాడు, ఆకులు, కాయలు విత్తనాలు వాడుతున్నారు. బోదకాలు నివారణకు పూల నుండి తీసిన కషాయాన్ని వాడతారు. దగ్గు, జలుబు, జ్వరం ముఖ్యంగా మలేరియా నివారణకు బెరడు నంచి తీసిన మందు బాగా పనిచేస్తుంది. కళ్ళ జబ్బులకు ఆకుల నుండి తీసిన పదార్ధాలు మంచి మందు. అలాగే కడుపులోని నులిపురుగులను నియంత్రిస్తుంది.

గింజల నుండి నునేతిసిన తరువాత మిగిలిన వేప పిండి దాణాగా పనికొస్తుంది. ఇంకా వ్యవసాయంలో ఎరువుగా కూడా వాడతారు. వేప పిండి భూసారాన్ని సంరక్షిస్తు పంటలను చీడపిడల నుండి రక్షిస్తుంది. పచ్చి కొమ్మలను పళ్ళతోముకోవటానికి వాడతారు. Tooth brush లాగా వేప పుల్ల పళ్ళుకు బలం చేకురిస్తుంది. చెడువాసనను అరికడుతుంది. టూట్ పేస్ట్ తయారీలో  వేపది ప్రముఖపాత్ర వేపను ఉపయోగించి తయారుచేసాన సబ్బులు అనేకంగా మార్కెట్టులో దొరుకుతున్నాయి. బెరడు ఎలర్జికి విరుగుడు. వేప కర్రకు తొందరగా పురుగు పట్టదు. వ్యవసాయ పనిముట్లు బండ్లు, పడవలు, బొమ్మలు, గృహోపకరణ వస్తువుల తయారీలో వేప కర్రను వాడుతున్నారు. బెరడును పొడిచేసి కాని, ఆకులు నూరి ముద్దగా కాని తయారు చేసి కురుపులను, ప్రాణాలను తగ్గించటానికి అన్ని ప్రాంతాల పల్లెలలో దివ్యఔషధంగా వాడతారు. ఉత్తర భారతదేశంలో ఖాసి కొండల ప్రాంతంలో విరోచనాలు అరికట్టటానకి క్షయవ్యాధిని తగ్గించటానికి గింజలను పళ్ళను విరివిగా ఉపయోగస్తారు.

వేప పూల నుండి తయారయిన తేనే చాలా శ్రేష్ఠమైనది. కంచెం చేదు రుచితోఉండి కాంతి చూపును కాపాడుతుంది. వేప జిగురును పేపరు, వస్త్ర, అలంకరణ వస్తువుల తయారీలో వాడతారు. సేంద్రియ వ్యవసాయంలో వేప ఉత్పత్తులును వదినంతగా మంరి దేనినీ వాడరు. వేప ఆకుల నుండి తయారుచేసిన టి ఆరోగ్యకరమైనది. ఒక కప్పునీళ్ళలో ¼ కప్పు ఆకులను 5 నిమిషాలు మరగబెట్టి తాగితే మధుమేఘం, జ్వరం, క్షయవ్యాధి, మూత్రపిండాల వ్యాధులు, కిళ్ళనెప్పులు, కడుపులో పురుగులు, చర్మవ్యాధులు అన్ని తగ్గుతాయి. సౌందర్య సాధన సమాగ్రిలో, వస్త్ర పరిశ్రమాలో, షాంపులో, రబ్బరు తయారీలో, మందులలో వేపాకు ప్రత్యేకస్ధానం వుంది. తలలో పెలను అరికట్టడానికి వేప నూనెకు తిరుగులేదు. మిధేన్ గ్యాస్ తయారీలో గింజల గుజ్జును వాడతారు.

మనదేశంలో దాదాపు రెండు కోట్ల వేప చెట్టున్నట్లు అంచనా. వేప భాగాలను పోగుచేయటం, అమ్మటం వీటితో అనేక ఉత్పత్తులు తయారు చేయటం ఒక పద్ధతిలో జరుగుతుంది. వేప గింజల సేకరణ అనేక గ్రామీణ ప్రజలకు ఉపాధి. ఒక సంవత్సరంలో 5,40,000 టన్నుల వేపనునేను తయారు చేస్తూన్నారు. 4,25,000 టన్నుల వేపపిండి తయారవుతుంది. క్రిమిసంహారక మందులుగా 2,000 టన్నుల వేపనునేను వాడుతున్నారు. సంవత్సరానికి 1000-2000 కోట్ల రూపాయల వ్యాపారం వేప ఉత్పత్తుల పై జరుగుతుంది. ప్రపంచంలో 25-30 % శాతం వేప గింజలు మనదేశం నుండి పోగు చేస్తున్నారు.

వేపకు అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పేటెంటు హక్కులకై ప్రయత్నాలు జరిగాయి. 1995 లో European Patent Office (EPO) యునైటెడ్ డిపార్టుమెంట్  ఆఫ్ అగ్రికల్చర్ (USDA) వారు W.R Grace and Company వారికి వేప నుండి తయారు సెసేపద్ధాతిని శిలింధ్ర నాశనిగా వాడటానికి పేటెంట్ హక్కులను ఇచ్చింది. భారత ప్రభుత్వం దానిని మనదేశంలో 2వేల సంవత్సరాల నుండి వాడుతున్నారనీ ఆ పేటెంట్ హక్కులను రద్దు చేయమని కోరింది. అమెరికన్లు దీని తయారీ ఏ శాస్త్రవిజ్ఞాన జర్నల్ లో అచ్చుకాలే దాని వాదించినా EPO మాత్రం 2000 సంవత్సరంలో పేటెంట్ పరిధి నుంచి శీలింద్ర నాశిని పద్దతిని మినహాయించి భారతదేశానికి సరైన వాదనగా గుర్తించింది. వేప ఉత్పత్తుల పై అమెరికా 54, జపాను 35, ఆస్ట్రేలియా 23, ఇండియా 14 పేటెంట్ హక్కుల సంపాందించాయి.

ఇంత చరిత్ర కలిగి, అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టె వేపచేట్టును పుజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు. ఈ చెట్టు మనదేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది. వేప చేట్టుంటే “మహలక్ష్మి” అంటారు . ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదేవిధంగా వేప చెట్టును కాపాడుకుందాం. చేపచెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఇది “ఔషధాలయం” కాక మరేమిటి !

ఆధారం: అదునుపల్లి నాగమణి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate