పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బిళ్ళగన్నేరు

ఈ మొక్క అంతరించి పోయే ప్రమాదంలో పడినా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అలంకరణ కోసం మందు మొక్కగా పెంచుతున్నారు.

flower2మన పరిసరాల్లో పెరిగే చాలా మొక్కలు ఎంత విలువైనవో మనకు తెలియనే తెలియదు. అటువంటి అతి సాధారణ మొక్కల్లో ఒకటి బిళ్ళ గన్నేరు. ఈ మొక్కను అందరం ఎప్పుడో ఓసారి చూసే ఉంటాం. ఎవరి ప్రమేయం లేకుండా దానంతటదే పెరిగే పూల మొక్క ఇది. రకరకాల అందమైన పూలతో ఈ మొక్క ఎప్పుడు పచ్చగా కనువిందు చేస్తుంటుంది. అందుకేనేమో మనవాళ్ళు సదాబహార్ అని పిలుచుకుంటారు. ఇంగ్లిషులు రోజ్ పెరివింకిల్, కేప్ పేరివింకిల్ (Periwinkle) అని పిలువబడే ఈ చిన్న మొక్క జన్మస్ధానం మడగాస్కర్. ఇక్కడి దక్షిణ అగ్నేయ ప్రాంతాల్లో విస్తరించి వున్న ఈ మొక్కను ఐరోపా దేశస్తులు వివిధ ప్రాంతాలకు తీసుకుపొయారు. వన్యంగా మడగాస్కర్ లో పెరిగే ఈ మొక్క అంతరించి పోయే ప్రమాదంలో పడినా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అలంకరణ కోసం మందు మొక్కగా పెంచుతున్నారు.

దీని శాస్త్రీయ నామము కేధరాంతస్ రోజియస్. దీన్నే వింకా రోజియా (Vinca rosea) లాక్నేరారోసియా అని కూడా వ్యవహరించే వారు. ఇది ఎపోసైనేసి కుటుంబానికి చెందింది. ఇది ఉష్ణమండలపు మొక్క దీని ఎత్తు 7-24 అంగుళాలు. ఆకులు నునుపుగా మెరుస్తూ ఉంటాయి. అండాకారంలో లేక దీర్ఘ అండాకారంలో ఉండే ఆకులు కొండ పై జతలు, జతలుగా ఎదురెందురుగా ఉంటాయి. ఎల్లకాలం ఆకుపచ్చగా ఉండి రకరకాల రంగుల్లో పూలు పుస్తాయి. పూలు తెల్లగా లేదా గులాబీ రంగులో వుండి మధ్య ముదురు ఎరుపు వర్ణంలో ఆకర్షణియంగా ఉంటాయి. వింకా మైనర్ అనే రకం మాత్రం గోడలకు అంటుకుని ఎగబాకుతుంది. పలురకాల వాతావరణాల్లో పెరిగే వివిధ రకాలను కృత్రిమంగ అభివృద్ధి చేశారు. గ్రేప్ కూలర్ అనే శీతల వాతావరణాన్ని తట్టుకుని పెరిగే తెల్లపుల పెప్పర్ మెంట్ కూలర్, పలురంగుల అసిల్లేటన్ ఆల్బస్ రకాలు బిళ్ళగన్నేరులో పేర్కొనదగిన అలంకరణ మొక్క రకాలు. దీనిలో పలు రకాల రాసాయనాలుండటం వల్ల పశువులు తినవు. బిళ్ళ గన్నేరు పెరగటానికి సారవంతమైన నేలలు అవసరం లేదు. అలాగే పెద్దగా నీరు లేకున్నా తట్టుకొని పెరుగుతుంది.

బిళ్ళగన్నేరు ఆకులు, వేర్లు విత్తనాలు వ్యాధి నివారణలో ఉపయోగపడతాయి. దిన్ని ఔషధమొక్కగా అనాదిగా ఉపయోగీస్తూ ఉన్నారు. చైనా సంప్రదాయ వైద్యంలో దీని నుండి తీసిన కషాయాన్ని మలేరియా, మధుమేహం (diabetis) డిమేన్షియా (Dimentia) వంటి వ్యాధుల నివారణలో వినియోగించేవారు. అలాగే మన ఆయుర్వేదంలో కూడా దిన్ని పలురకాల వ్యాధుల నియంత్రణకు ముఖ్యంగా రక్తప్రసరణ సరిచేసేందుకు వాడేవారు. ముక్క బెదురుడు (Nose bleeding) పంటినోప్పి, నోటిలో వచ్చే పొక్కుల నుండి ఉపశమనానికి పై పూతగా వాడతారు. అన్నింటికంటే ప్రధానంగా ఈ మొక్క రక్తపోటు (Blood Pressure) ను తగ్గించడంలో యింకా రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. దీనిలో ఉన్న ప్రధాన రసాయనాలు మెదడుకు సంబంధించిన డెమేన్షియా ను నివారించడంలో ప్రసిద్ధి చెందాయి. రక్తనాళాల్లో కుతపలు (Plaques) ఏర్పడట వలన ఈ వ్యాధి వస్తుంది. దీనితో జ్ఞాపకశక్తి లోపిస్తుంది. ఈ మొక్క రసాయన గుణాల వల్ల దీనికి జ్ఞానపకశాక్తిని పెంచే ఔషదంగా మంచి పేరొచ్చింది. దీని రసాయన గుణాలు ఇటివలి కాలంలో కాన్సర్ నివారణలో బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రధానంగా పిల్లల్లో వచ్చే లుకిమియా (Leukemia) లింఫ్ గ్రంధులకు సంక్రమించే లింఫోమా (Lymphoma) వంటి కాన్సర్ల పై బాగా పనిచేస్తుంది.

ఈ మొక్కలో దాదాపు 400 పైగా అల్కలాయిడ్ రసాయనాలున్నాయని ఉపయోగాపడతాయని తెలిసింది. వీటిలో వింకామైన్ అనేది ప్రదానమైన ఆల్కలాయిడ్. దీనికి రక్తాన్ని పలుచబరిచే గుణం జ్ఞానపకశక్తిని పెంచే గుణం ఉన్నాయి. ఇదే గాక అజ్మాలసిన్ సేర్పెంటైన్, రిసర్పయిన్ వంటి సర్పగంధీ మొక్కలో దొరికే రసాయనాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ ఆల్కలాయిడ్లకు  మత్తునిచ్చే గుణం ఉంది. అందుకే దిన్ని డాక్టర్ల పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా మాత్రమే వాడాలి. గర్భిణి స్త్రీలు దిన్ని వాడకుండా వుంటే మంచిది.

ఇటివలి కాలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాన్సర్ ను నివారించే మరో రెండు అల్కలాయిడ్లు విన్ బ్లాస్టీన్ విన్ క్రిస్టీన్. పరిశోధనల్లో పలు రకాల కణాల విచ్చలవిడి పెరుగుదలను నివారించుతాయని కనుగోన్నారు. అంతేగాక పలురకాల మందులకు లొంగని (multidrug resistant tumers) వ్రణాలను సైతం శక్తివంతంగా నిలువరిస్తాయని నీరూపించబడింది. అందుకే విన్ బ్లాస్టీన్. విన్ క్రిస్టిన్ ల వినోయోగం యాజమాన్య హక్కులకు సంబంధించి పేటెంట్లు పరంగా వివాదాస్పదం అయ్యాయి కూడా. మన సాంప్రదాయ వైద్యాలలో ఎప్పట్నుంచో వాడే ఇటువంటి అనేక ముఖ్యమైన మొక్కలను స్వంతం చేసుకోవాలన్న లాభిపెక్షతో కొన్ని బహుళజాతి కంపెనీలు గాలం వేస్తూన్నాయి. మనమేమో మన చుట్టూ ఉన్న మొక్కల ప్రయోజనం తెలుసుకోక కాలదన్నుకుంటున్నాము. ఇకనుంచి మన వృక్ష సంపద ప్రయోజణాలు తెలుసుకుని కాపాడుకునే ప్రయత్నం చేద్దామా !

ఆధారం: కట్టా సత్యప్రసాద్

2.98511904762
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
సంబంధిత అంశాలు
మరిన్ని ...
పైకి వెళ్ళుటకు