పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉరికంబం నీడలో రాకెట్ డిజైన్

మృత్యుచ్చాయలు ముసురుకొంటున్న వేళ ఒక మహావిష్కరణ ఇలా పురుడు పోసుకోంది.

aug6అది 1881 ఏప్రిల్ 7వ తేది. రెండవ అలెగ్జాండర్ జార్ ను బాంబు విసిరి చంపినందుకు టెర్రరిస్టులు పై విచారణ జరుగుతోంది. బాంబు విసిరిన వాడు రిస్సాకఫ్. బాంబునెలా ప్రయోగించాలో నేర్పిన వాడు కిబాల్చిచ్.

క్రాస్ ఎగ్జామీనేషన్ జరుగుతోంది. నేరం నిర్ధారణ కాక తప్పదని తెలిసిపోతూనే ఉంది. ఎం జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్టే బెరంగా కోర్టులో తమాషా చూడ్డానికి వచ్చినట్టే ఉంది అతని వాలకం. ఒకవైపు నేరారోపణ పత్రం చదువుతుంటే అతి ముఖ్యమైన తన పనిని చెడగోడుతున్నట్టు విసుగ్గా ఉంది అతని ధోరణి.

ఇంతలో పేలుడు పదార్ధాల నిపుణుదు వచ్చాడు. తన అభిప్రాయాన్ని వివరించడం మొదలు పెట్టాడు. అంతే ఒక్క క్షణంతో కిబాల్చిన్ ముఖం దేధిప్యమానంగా వెలిగిపోయింది. బాంబు తాలూకుప్యూజు తయారీలో తనకు కొన్ని సందేహలున్నాయి. అవన్నీ ఆ నిపుణున్ని ఒక్కొక్కటిగా అడుగుతున్నాడు కిబల్చిచ్.

aug7కోర్టు వాతావరణమంతా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎన్నో  నిగూడమైన శాస్త్రసాంకేతిక విషయాలు నిపుణులూ కిబాల్చిచ్ వాదించుకొంటున్నారు. చూస్తే అది కోర్టులా లేదు. కేసులా లేదు. ఏదో మహాపండితుల గోష్టిలా ఉంది. నిపుణుడు ఏవేవో గ్రంధాల్ని ఉటంకిస్తున్నాడు. కిబల్చిచ్ కి తాను ఆ వివరాలున్న శాస్త్ర గ్రంధం చదవలేకపోయానని ఎంతో విచారం ఉంది.

చివరకు నిపుణుడు జార్ చక్రవర్తిపై విసిరిన బాంబు అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తయారైందని కోర్టుకు నివేదించినప్పుడు మన కిబాల్చిచ్ ముఖం వేయిరేకుల పద్మంలా వికసించింది. అతని ఉత్సాహం కట్టలు తెంచుకొంది. ఆ నిపుణుడితో కృతజ్ఞతపూర్వకంగా ధ్యాంక్యూ అంటూ కరచాలనం చేశాడు.

ముద్దాయిలు ఆరుగురికి ఉరిశిక్ష పడింది. వారిలో మన కిబాల్చిచ్ కూడా ఉన్నాడు. అతనికి ఉరి శిక్ష పడడం కన్నా అతని శాస్త్ర పాండిత్యం ప్రముఖ వార్తగా పత్రికల ద్వారా ప్రకిపాయింది. ఒక మహా మేధావి ఉరికంబం ఎక్కుతున్నాడని ఎక్కడ లేని సానుభూతి ఆందోళనా వ్యక్తం కాసాగాయి.

aug8ఉరిశిక్ష పడినా కిబల్చిచ్ ముఖంలో పిసరంత చింతైనా లేదు. ఏదో దీర్ఘ ఆలోచనల్లో అయన మునిగితేలుతున్నాదు. ఈ లోకంలో లేడు. ఇంతలో అతన్ని కలుసుకునేందుకు ప్రభుత్వ లాయరు వచ్చాడు. కన్నీళ్ళు కక్కుకొంటూ ఏమైనా కావాలా ఉన్నాడు. ఇప్పుడు కిబాల్చిచ్ కుమిలిపోవడం లేదు. నిర్వికారంగా రానుకోవడానికి కాగితాలూ, కలమూ కావాలి అన్నాడు ముక్తసరిగా. అవి వచ్చేశాయి.

పేజిలకు పేజీలే కిబాల్చిచ్ ఏదో రాస్తూన్నాడు. డిజైన్లు వేస్తూన్నాడు. అంతా పూర్తిచేసి దానికి రాకెట్టు విమానపు డిజైన్ అని పేరు పెట్టాడు. దాన్ని భద్రంగా నిపుణుల కమిటికి అప్పగించాలని కోరాడు. లాయరు ఆ కాగితాల కట్టను జైలు అధికారికి అప్పజెప్పాడు.

కిబాల్చిచ్ తన కర్తవ్యం పూర్తి చేసుకొన్న అపరిమిత సంతృప్తితో చిరునవ్వుతో ఉరికంబం ఎక్కాడు. అతని కధ విషాదగాధగా అలా మిగిలిపోయింది.

అప్పటికి అతనికి ఎనలేని గౌరవాదరాలు దేశమంతా గౌరవాదరాలు దేశమంతా ఉన్నై. ఈ రాకెట్టు విమానం విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా ? గగ్గోలు కాదూ ! అందుకే కిబాల్చిచ్ పత్రాల్ని భధ్రంగా రికార్డులో పెట్టి తాళం వేశారు. 37 ఏళ్ళ తర్వాత 1918 లో సోవియట్ అధికార్లు జైలు రికార్డుల్ని తిరగేస్తున్నప్పుడు ఈ పత్రాలు బయటపడ్డాయి. ఇంతకూ వాటిలో ఏముంది ?

ఓ అద్భుతమైన రాకెట్ డిజైన్ అందులో ఉంది . కిబాల్చిచ్ డిజైను చేసిన ఈ రాకెట్టు విమానం మధ్యలో మంట గది ఉంటుంది. అందులోకి పేలుడు గుళికలు వరుసగా వస్తూ పేలుతూ ఉంటాయి. ప్రతిక్రియ వల్ల విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. ఆ తర్వాత నాజిలును పక్కకు వంచడం ద్వారా విమానం భూ సమాంతరంగా ప్రయాణిస్తుంది. మందు గుళికల సైజును మార్చడం  ద్వారా గాని మంట గడిలోకి అవి ప్రవేశించే రేటును తగ్గించడం ద్వారా గానీ విమాన వేగాన్ని మార్చవచ్చు. ఇదీ ఇందులో సారాంశం.

అప్పటిదాకా ఇంజనీర్లకు అందుబాటులో ఉన్న శక్తులు మూడు వాటిలో ఆవిరిశక్తి చాలా బరువైంది. స్ప్రింగు శక్తి చాలా బలహినమైంది. రసాయన ఇంధన శక్తి రాకెట్టుకు అనుకూలమైందని భావిస్తున్న కాలంలో ఈ రాకెట్ డిజైన్ ని కిబాల్చిచ్ రూపొందించాడు.

రాకెట్ నిర్మాణ శకంలో ఒక మహాద్భుత కీలక ఘట్టం ఇలా ఉరికొయ్య నీడలో నాంది ప్రస్తావన చేసుకొంది! మృత్యుచ్చాయలు ముసురుకొంటున్న వేళ ఒక మహావిష్కరణ ఇలా పురుడు పోసుకోంది.

ఆధారం: వి.బాలసుబ్రమణ్యం

3.01169590643
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు