పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎక్కిళ్ళు

ఎక్కిళ్ళు మన ప్రయత్నం లేకుండా, మన కంట్రోల్ లేకుండా వస్తుంటాయి కదూ.

j28మనలో అందరికీ ఎక్కిళ్ళు వచ్చిన అనుభవం ఉండే ఉంటుంది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు పొట్ట లోపలికి పోవడం గొంతులోనుంచి మన ప్రమేయం లేకుండానే ఒక రకమైన శబ్దం రావడం జరిగిపోతుంది. మనకొచ్చే, ఆవలింత, తుమ్ము, ఎక్కిళ్ళు లాంటివి మనకు సంబంధం లేకుండా మన ప్రయత్నం లేకుండా ఇంకా చెప్పాలంటే మన కంట్రోల్ లేకుండా వస్తుంటాయి కదూ. అసలు ఎక్కిళ్ళు అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తుంటాయి?

ఎక్కిళ్ళు సామాన్యంగా మనం ఎక్కువ ఘాటుగా (మాసాలాతో చేసిన) ఉండే ఆహార పదార్థం తిన్న తరువాత గానీ లేక ఎక్కువ మెతాదులో భోజనం చేసిన తరువాత గానీ వస్తుంటాయి. అవి మొదలైన తరువాత ఐదు ఆరు నిమిషాల దాకా వస్తుంటాయి. j29తరువాత వాటికవే తగ్గిపోతాయి. మనకు కడుపులో ఛాతీ భాగాన్నీ, పొట్ట భాగాన్ని వేరు చేస్తూ డయాఫ్రం అనే పొర ఉంటుంది. ఇది పైకి క్రిందకు కదులుతుంటుంది. మనం ఉపిరి పీల్చినప్పుడు డయాఫ్రం కిందకు సాగి గాలి మన ఉపిరితిత్తుల్లోకి వచ్చేలా చేస్తుంది. అలాగే ఉపిరి వదిలేటప్పుడు అది పైకి ముడుచుకొని గాలి బైటకు వెళ్ళేలా చేస్తుంది. ఈ విధంగా డయాఫ్రం కదలిక వల్ల మనం ఉపిరి పీల్చి వదులుతుంటాం. కాని ఒక్కోసారి ఈ డయాఫ్రం కదలికలో మార్పు వచ్చి మన ఉపిరితో సంబంధం లేకుండా జరుగుతుంది. అలాంటప్పుడు మనకు ఎక్కిళ్ళు వస్తాయి. డయాఫ్రం వేగంగా పైకి కదలడం వల్ల ఉపిరితిత్తుల్లోని గాలి అంతే వేగంగా బయటకు రావడం వల్ల మన స్వరపేటికపై ఒత్తిడి పడి శబ్దం బయటకు వస్తుంది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని భయపెట్టే అబద్ధం చెబితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అని అంటుంటారు. కొందరు చక్కెర (పంచదార) నాలుక క్రింద ఉంచుకొంటే తగ్గిపోతాయి అంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కొండ ఎత్తు నుండి దుమికితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అంటారు. ఏది ఏమైన వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎక్కిళ్ళు ఆగకుండా గంటకన్నా ఎక్కువ సేపు వస్తుంటే వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది.

ఆధారం: సి.హెచ్. ఆనంద్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు