పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎడారి మొక్కలు

ఎడారి మొక్కల విశేషాలు తెలుసుకుందాం.

may16 ఎడారి అంటే మీరు ఏం ఊహించుకుంటారు? కనుచూపూవేరంతా ఇసుకమేటలు, మాడిపోయే ఎండ, ఎక్కడా కనబడని నీటిజాడ, దాహంతో పిడచకట్టుకుపోయే నోరూ ఇంతేకదూ! కానీ అలాంటి ఇసుకదిబ్బల్లో బతికే ప్రాణులుంటాయని తెలుసా? జంతువుల సంగతి వదిలేయండి ఎడారుల్లో బతికే మొక్కల గురించి మీకేమైనా తెలుసా? అంటే మీ దగ్గర నుంచి తెలుసు “నాగజెముడు, బ్రహ్మజెముడు మొక్కలే కదా! అనే సమాధానం వస్తుంది. అవునా? “మరి అవి నీరులేని ప్రదేశాలలో ఎలా బతికుంటాయి? వాటి జీవన విధానం ఏమిటి?” అని అలోచించారా ఎప్పుడైనా? సరే, మనమిప్పుడు ఎడారిలో బతికే మొక్కల జీవనవిధానం, వాటిలోని రకాల గురించి తెలుసుకుందామా?

మొక్కలకు, నీటికి గల సంబంధాలను అనుసరించి ‘యూజిన్ వార్మింగ్' అనే శాస్త్రవేత్త మొక్కలను మూడు రకాలుగా విభజించాడు.

  1. నీటి మొక్కలు (Hydrophytes)
  2. సాధారణ వాతావరణ మొక్కలు (Mesophytes)
  3. ఎడారి మొక్కలు (Xerophytes)

నీరు లోపించిన జలాభావ పరిస్థితుల్లో లేదా క్రియాత్మకంగా పొడిగా ఉండే నేలలో పెరిగే మొక్కలను 'ఎడారి మొక్కలు' అంటారు. ఎడారి మొక్కలు నీరు అతి తక్కువగా లభించే పరిస్థితుల్లో పెరుగుతాయి. కాబట్టి భూమిలోని లోతైన పొరలలో లభించే నీటిని పీల్చుకోవటానికి పనికొచ్చేలా పొడవైన వేర్లను కలిగి ఉంటాయి. ఎంత పొడవు పెరుగుతాయంటే భూమిపైన పెరిగే కాండం శాఖల కన్నా అనేక రెట్లు ఎక్కువగా భూమిలో పెరుగుతాయి. అందువల్ల వీటిలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. వేర్ల సాధారణంగా బాగా అభివృద్ధి చెందిన దారువు, పోషక తణజాలాలను కలిగి ఉంటాయి. జిల్లేడు మొక్కలో వేరు గట్టిగా కంద మైన కణకుడ్యాలను కలిగి ఉంటాయి. ‘ఆన్పరాగన్' అనే వెక్కలో నీటిని వేళలో నిలవచేసుకుంటాయి. వీటి కణాలు ఆకారంలో పెద్దగా పెరిగి నీటితో నిండి ఉంటాయి.

ఎడారి మొక్కల కాండాలు పొట్టిగా గట్టిగా మందమైన బెరడుతో కప్పబడి ఉంటాయి. కాండాలు సాధారణంగా కేశాలు జిగురుపొరతో కప్పబడి ఉంటాయి. రసభరితం కాని ఎడారి మొక్కల కాండాలలో మందమైన అవభాసిని ఉంటుందది. బాహ్యచర్మం, నాళికా కణజాలాలు మరియు యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.

ఎడారి మొక్కల పత్రాలు చాలా చిన్నవిగా క్షీణించి ఉంటాయి. కొన్ని పత్రాలు కంటకాలుగా కూడా రూపాంతరం చెందుతాయి. 'అమ్మోఫిలా' అనబడే ఇసుక తిన్నెలలో పెరిగే గడ్డి ప్రజాతి మొక్కలలో పత్రాలు మడతబడి చుట్టుకొని ఉంటాయి. తద్వారా దిగబడిన పత్రరంధ్రాలు దాగి ఉండి భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. కెలోట్రాపిస్ మొక్కలో పత్ర ఉపరితలం మెరుస్తూ నున్నగా ఉండి కాంతిని, వేడిని పరావర్తనం చెందిస్తాయి. పెపరోమియా వంటి రసభరిత పత్రాలున్న ఎడారి మొక్కలలో పత్ర బాహ్యచర్మకణాలు నీటిని నిలవచేసుకుంటాయి.

ఎడారి మొక్కలను శరీర ధర్మలక్షణాలు, బాహ్య స్వరూపం, జీవితచక్రం ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు.

  1. అల్ప కాలిక మొక్కలు (Ephemeral plants)
  2. రసభరిత మొక్కలు (Succulent plants)
  3. రసభరితం కాని మొక్కలు (Dry plants).

అల్పకాలిక మొక్కలు జలాభావాన్ని తప్పించుకునే మొక్కలు. ఇవి ఆరు నుంచి ఎనిమిది పారాలలో తమ జీవిత చరిత్రను ముగించుకునే ఏక వార్షికాలు. ఇవి నీటి ఎద్దడిగల . ప్రాంతాలలో పెరుగు తాయి ‘పల్లేరు' ను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.

రసభరితమైన మొక్కలు జలాభావాన్ని నివారిస్తాయి. ఈ మొక్కలు వర్షాకాలంలో కురిసే నీటిని పీల్చుకొని మొక్క భాగాలలో దాచుకుంటాయి. మ్యుసిలేజ్ రూపంలో దాస్తాయి. అందువలన కాండం, పత్రాలు, వేళ్ళు ఉబ్బుగా రసభరితంగా ఉంటాయి. ఇలా దాచుకున్న నీటిని నీరు దొరకని సమయంలో పొదుపుగా వాడుకుంటాయి. వీటిలో నీటిని కాండాలలో దాచుకునే వాటిని 'రసభరిత కాండాలు గల మొక్కలు' అంటారు. బన్షియా, యూఫోర్బియా, తిరుకలై మొదలగు మొక్కలను వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. వీటిని పత్రాలలో దాచుకునే మొక్కలను 'రసభరిత పత్రాలు గల మొక్కలు' అంటారు. బ్రయోఫిల్లమ్, అలోవేరా, అగేవ్ అనే మొక్కలను రసభరిత పత్రాలుగల మొక్కలుగా చెప్పవచ్చు. అలాగే ఆస్పరాగస్, సీబా పాసిప్లోరా మొక్కల్ని రసభరిత వేళ్ళు గల మొక్కలకు ఉదాహరణగా చెబుతారు. మొక్కల మొక్క వేళ్ళ భాగంలో నీటిని దాచుకునే మొక్కల్ని “రసభరిత వేళ్ళు గల మొక్కలు” అంటారు.

ఇక రసభరితం కాని మొక్కలుంటాయి. ఇవి అసలు సిసలు నిజమైన ఎడారి మొక్కలు. ఇవి బహువార్షిక మొక్కలు. ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకోగలవు. కాజురైనా, సీరియమ్, జిజిప్టస్, కెలోట్రాపిస్ మొదలైన మొక్కలు రసభరితం కాని మొక్కలకు ఉదాహరణలు. ఇవి ఎడారి మొక్కల విశేషాలు.

ఆధారం: డా. కందేపి రాణీ ప్రసాద్

2.97609561753
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు