పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఐన్ స్టీన్ ప్రసిద్ద సమీకరణ E=mc2

ఐన్ స్టీన్ ప్రసిద్ద సమీకరణ

ఐన్ స్టీన్ ప్రసిద్ద సమీకరణ (equation) E=mc2 లో శక్తిని కాంతి వేగంతోనే ఎందుకు సంబంధం చేయాలి? m ద్రవ్యరాశి ఉన్న ఆ వస్తువు వేళ్ళే వేగంతోనే సంబంధం (function) చేయాలి కదా?

treeవస్తువు కదిలే వేగాన్ని V అనే అక్షరంతో చూపడం సాధారణం. కదిలే వస్తువులో గతిశక్తి (kinetic energy) ఉంటుంది. కానీ వేగం సమవేగం (uniform velocity) గా ఉన్నట్లయితే అందులో ఉన్న వ్యక్తికి/పరిశీలకుడికి అది కదలనట్లే ఉంటుంది. కాబట్టి అతనికి ఆ వస్తువులోని గతిశక్తి శూన్యంగా తోస్తుంది. శక్తి అంటే పనిని చేసే భౌతిక రాశి. పని అంటేనే నిరోధక బలాన్ని (opposite force) అధిగమించి ద్రవ్యరాశి ఉన్న ఆ వస్తువును కొంత దూరం నేట్టే కార్యకలాపమే! బలం అంటేనే వేగంలో మార్పును కలిగించేది. కాబట్టి వేగంగా వెళ్లే వస్తువులోని గతిశక్తిని ఆ వస్తువేగాన్ని గమనించే వాడే పొందగలడు. అంటే తన స్థావరంతో పోల్చుకుంటే ప్రతిక్షణం స్థానభ్రంశం (displacement) లో మార్పును పొందే (లేదా వేగంగా వెళ్లే) వస్తువులోని వేగాన్ని మార్చందే పని జరగదు. ఆ శక్తి విలవ ½ mv2 అని మీకు కలన గణిత సూత్రాల ద్వారా నిరూపణ (derive) చేయగలము. అది వస్తువు చలనం ద్వారా వస్తువుకు ఇచ్చిన సాపేక్ష శక్తి (relative energy). ఆ శక్తి ఆ వస్తువు బయట ఉన్న పరిశీలకుడికి మాత్రమే లబ్యం అవుతుంది. వసువుకున్న గురుత్వ లక్షణాని (gravitational character)కి కారణమైన ద్రవ్యరాశి వల్ల గురుత్వ క్షేత్రం (gravitational field) లో శక్తి లభ్యమవుతుంది. ఆ విలువను ఆ వస్తువుకున్న స్థితిశక్తి (potential energy) అంటారు. అది క్షేత్రపు బలం మీద, వస్తువుకున్న ద్రవ్యరాశి (mass) మీద ఆదారపడుతుంది. అలాగే విద్యుత్ అవేశం ఉన్న వస్తువును విద్యుత్ క్షేత్రం (electrical field) లో ఉంచినట్లయితే ఆ వస్తువుకు ఆ క్షేత్రం వల్ల అదనపు శక్తి లభ్యమవుతుంది. దాన్ని విద్యూత్ స్థితి శక్తి (electrical potential energy) అంటాము. ఒకవేళ ఆ వస్తువులో కదిలే ఆవేశాల వల్ల అయస్కాంతతత్వం ఉన్నట్లయితే ఆ వస్తువును అయస్కాంత క్షేత్రంలో ఉంచితే దానికి అదనపు స్థితిశక్తి ఒనగూరుతుంది. ఆ స్థితిశక్తిని అయస్కాంత స్థితిశక్తి (magnetic potential) అంటారు.earth ఇలా వస్తువుకున్న గతిశక్తి (kinetic energy), స్థితిశక్తి (potential energy) వస్తువుకున్న ద్రవ్యరాశి. అయస్కాంతతత్వం విద్యుదావేశంతో పాటు వేగం అధారంగా లభ్యం అవుతాయి. ఈ రెండు శక్తులు వస్తువు బయట ఉన్న పరీశీలకుడుకు లభ్యమవుతాయి. ఆ వస్తువు తన గతిశక్తిని, స్థితిశక్తిని ప్రదర్శించే క్రమంలో దాని ద్రవ్యరాశి (mass) లో మార్పు రాదు. వస్తువుకు ద్రవ్యరాశి ఏలా లభ్యమయిందన్నమీమాంస శాస్త్రవేత్తల్ని ఎప్పటినుండో కల్గిస్తున్న ప్రశ్న సాపేక్షంగా వస్తువు కదలకున్నా ఏ క్షేత్రంలోను లేకున్నా అ వస్తువుకు శక్తి ఉండి తీరాలి. ఎందుకంటే ఈ విశ్వంలో ఒక సందర్భంలో జడత్వాన్ని (inertia) కు కారణమైన ద్రవ్యరాశి ఉన్న వస్తు లేదు. వసువు లేకుండా అయస్కాంతతత్వానికి అస్తిత్వం లేదు. అంతేకాదు, కదిలే విద్యుదావేశాలు లేకుండా అయస్కాంతతత్వం రాదు. కాబట్టి వస్తువుకున్న ద్రవ్యరాశి అ వస్తువులోని అంతర్గత శక్తి రూపమే అయి ఉండాలి. చలనంలో లేనిదేది, లేదన్నది కూడా విశ్వవిదితం. ఏది అంటే వస్తువిషయమే కాబట్టి కదిలేది వస్తువే లేదా వస్తుతత్వం మాత్రమేనని ఐన్స్టీన్ వాదించాడు. వస్తువుకున్న జడత్వ ద్రవ్యరాశి కదిలితే ఒక విలువ, కదలక పోతే మరో విలువ ఉంటుందని సూత్రీకించాడు. పరిశీలకుడికి అంటే వేగం ఆధారంగా పరిశీలకుడికి పరిశీలించబడే వసువు ద్రవ్యరాశి మారుతుందని లెక్కలు వేశాడు. కానీ విశ్వంలో శక్తి నిత్యత్వమయి ఉంది. కాబట్టి విశ్వంలోని ద్రవ్వరాశి కూడా శక్తితో పాటే నిత్యత్వమయి ఉంది అని భావించాడు. పరిశీలకుడి దృష్టలో మారుతున్న విశ్వంలో మారని ద్రవ్యరాశి అంటూ వస్తువుకు ఉండాలన్నాడు. దానినే ఆ వస్తువుకున్న నిశ్చల ద్రవ్యరాశి (rest mass) అన్నారు. ఈ విశాల విశ్వంలో పరిశీలకుడి పరిశీలనా విధానం ప్రకారం లేదా పరిశీలనా నిర్ధేశచక్రం (Frame of Reference) లతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విలువతో లెక్కలోకి వచ్చే రాశి శూన్యంలో కాంతి వేగం (c) మాత్రమే ఎంత శక్తి ఖర్చుఅయితే అంతే ద్రవ్యరాశి వచ్చింది కాబట్టి అనులోమానుపాతంగా E, m లు ఉండాలి. మరి అనులోమానుపాత స్థిరాంకం (proportionality constant) ఏదై ఉండాలి? ఎవరికైనా మారనిదే అయి ఉండాలి. అది శూన్యలో కాంతి వేగం లేదా ప్రాథమిక కణాలు అయిన క్వార్కులు, లెప్టాన్లు, బోసాన్లు (ఐన్స్టీన్ కాలంలో వీటి గురించిన అవగాహన స్వల్పం)... ఆంతరంగిక లక్షణాలు మాత్రమే, కాంతి వేగాన్ని ఐన్స్టీన్ అనుపాత స్థిరాంకంగా స్వీకరించాడు. శక్తి మితి (dimension) M L2T-2 కాబట్టి అది E α m ------ E=mc వల్ల వీలుకాదు. E = mc2 ద్వారానే వీలవుతుంది. కాంతి కూడా వస్తువు లేనిదే లేదు. నేడు కాంతిశక్తి కన్నా ద్రవ్యరాశి ఎక్కవ ఉంది. కాబట్టి మహావిస్పోటనం ద్వారా విడుదలైన శక్తి కాంతి రూప శక్తి కాదు. అది ప్రాధమిక కణాలకు ఏర్పడిన విశ్వశక్తి.

2.99047619048
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు