పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఓజోన్ పొరను కాపాడుకుందాం !

ఓజోన్ పొర విశేషాలు

చెకుముకి నేస్తాలూ !

257.jpgపచ్చని చెట్లతో పక్షులు కిలకిలారావాలతో ప్రకృతి సోయగాలతో అనంత జీవకోటితో అలరారుతున్న గ్రహం ఈ మహావిశ్వంలో భూగోళం ఒక్కటే కావడం విశేషం. సౌరకుటుంబంలో ఏ గ్రహానికీ లేని ప్రత్యేకత భూగోళానికి మాత్రమే ఉంది. భూమి చుట్టూ ఓజోన్ వాయువు మేఘాల్లా ఆవరించి సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత (యు.వి రేస్) కిరణాలను అడ్డుగించడం వల్లే భూమి మీద ప్రాణికోటి ఆవిర్భవించింది. మనుగడ సాగించగలుగుతోంది.

మన వికృత చేష్టల వల్ల ఓజోన్ పొర దెబ్బతింటే భూమి నివాస యోగ్య కాకుండా పోతే, మనం పారిపోవడానికి మరో గ్రహమేదీ సిద్దంగా లేదు. అందుకే ఓజోన్ పొరను కాపాడుకోవాలి.

ఎక్కడిదీ ఓజోన్ పొర ?

భూమి చుట్టూ ఆవరించిన వాతావరణం 3 పొరలుగా ఉంటుంది. భూమి నుంచి 50 కి.మీ. ఎత్తు వరకు ట్రోపోస్పియర్ ఆ తర్వాత ఉన్న పొరను అయనోస్పియర్ అంటారు. ఈ స్టాటోస్పియర్ లోనే ఓజోన్ వాయువు వుంటుంది. వాతావరణంలో మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ 3 రూపాల్లో ఉంటుంది.

పరమాణు రూపంలో (O), రెండు పరమాణువులు కలిసిన అణురూపంలో (O 2 ) మూడు పరమాణువులు కలిసిన ఓజోన్ (O 3 ) రూపంలో. ఓజోన్ కున్న ప్రత్యేక లక్షణం వల్ల కాంతిలోని ప్రమాదకర యు.వి. కిరణాలను వడపోసి మనకు అవసరమైన కాంతిని మాత్రమే భూమి మీదకు పంపుతోంది.

యు.వి. కిరణాలు అంటే ?

సూర్యకాంతిలో అపారమైన శక్తి ఉంది. విద్యుత్ అయస్కాంత వర్ణపటంలో కాంతి తరంగదైర్ఘ్యాన్ని బట్టి ఆ కాంతికిరణాల శక్తిని లెక్కిస్తారు. తరంగదైర్ఘ్యాన్ని తక్కువైతే వాటిశక్తి పెరుగుతుంది. తరంగదైర్ఘ్యాన్ని నానోమీటర్స్ లో కొలుస్తారు. ఒక nm, మీ.మీ లో పది లక్షల వంతుకు సమానం.

  • uv- ఎ-320- 400nm మద్య (ప్రమాదకరం కాదు)
  • uv- బి-280- 320 nm మద్య
  • uv- సి-220- 280 nm మద్య
  • uv-బి,సిలను ఓజోన్ పొర గ్రహించి మనల్ని కాపాడుతుంది.

ఓజోన్ పొర ఎందుకు క్షీణిస్తోంది ?

258.jpgమనం ఉపయోగించే ఫ్రిజ్ ల నుండి, ఎ.సి.మిషన్ల నుండి విడుదలయ్యే ఫోరిన్, క్లోరిన్ పరమాణువులు కలిసిన కర్బన సమ్మేళనాలు (cfcs),ఇతర పరిశ్రమల్లో వాడే హాలోజన్ గ్రూపు మూలకాల సమ్మేళనాలైన హాలాన్స్ వాతావరణంలో ఎలాంటి చర్యలకు లోను గాకుండా ఓజోన్ పొరను చేరుకుంటాయి. uv కిరణాల తీవ్రతకు రసాయనికి చర్య జరిపి క్లోరిన్, బ్రోమిన్, ప్లోరిన్ పరమాణువులు విడుదలవుతాయి. ఇవి ఓజోన్ తో చర్య జరిపి దాన్ని ఆక్సిజన్ గా మారుస్తాయి. ఈ చర్యల వలన ఓజోన్ పొర మందం తగ్గుతుంది.

ఓజోన్ పొర క్షీరస్తే ఎదురయ్యే ఇబ్బందులు

259.jpgమానవుల్లో జంతువుల్లో చర్మక్యాన్యర్, కంటిలోని కార్నియా, కటకాలు దెబ్బతిని చూపుపోవడం, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం లాంటి విపరీత పరిణామాలు ఏర్పడుతాయి. మొక్కల్లో ఉత్పరివర్తనాలు ఏర్పడి, మనకు ఉపయోగపడే జాతులు అంతరించిపోయే ప్రమాదముంది.

అంటార్కిటికాలోనే ఓజోన్ పొర ఎందుకు క్షీణించింది ?

ప్రపంచ ఓజోన్ దినోత్సవం 1985 లో అంటార్కిటికా ధృవం వద్ద ఓజోన్ పొర మందం తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్చి 27,1985 న ఈ విషయంపై వియన్నాలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. 1987 సెప్టెంబర్ 16 న ఓజోన్ పొరకు నష్టం కలిగించే పదార్థాల వాడకం తగ్గించాలని ఓ అంతర్జాతీయ తీర్మానం మాంట్రియల్ ల జరిగింది. దీన్ని మాంట్రియల్ తీర్మానం అంటారు. 1992 లో భారతదేశం ఈ ఒప్పందంలో భాగస్వామిగా మారింది. మాంట్రియల్ తీర్మానం జరిగిన సెప్టెంబర్ 16 వ తేదిని అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా జరపాలని 1995 లో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

అప్పటి నుండి సెప్టెంబర్ 16వ తేదిని అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

రచయిత: డా.ఎం.వి.రమణయ్య, నెల్లూరు

3.04545454545
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు