పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కంచర గాడిద

జిబ్రాకి ఈ చారలు ఒక రకమైన రక్షక ఏర్పాటు అని తేల్చారు శాస్త్రజ్ఞులు.

zebraమీరు జూకి ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ జంతువులను సంరక్షించి పిల్లలకి చూపించే ఏర్పాట్లు చేసుంటారు. పులి, సింహం, చిరుత, మొసలి, నీటి ఏనుగు ఇలాంటివి పూర్తిగా బోనులో వేసి కనపడేలా ఉంచుతారు. జింకలు, దుప్పులు, జిరాఫీ. జిబ్రా(కంచర గాడిద) లాంటి వాటిని ఒక ప్రదేశంలో వదిలేసి అవి వెళ్ళిపోకుండా కంచే కట్టి ఉంచుతారు. మనం వీటిని చూసినప్పుడు మనందరిలో కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. ఉదాహరణకి కంచర గాడిదను చూస్తే ఈ చారలు ఎందుకున్నాయి? అనిపిస్తుంది కదూ? శాస్త్రజ్ఞాలకి కూడా ఈ అనుమానం వచ్చినట్టుంది. వాళ్ళు దీని మీద పరిశోధనలు చేసారు. వాళ్ళ పరిశోధనలో తేలిన విషయం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళేమంటారంటే జిబ్రాకి ఈ చారలు ఒక రకమైన రక్షక ఏర్పాటు అని తేల్చారు. మన మిలటరీ వాళ్ళు యుద్ధ సమయంలో వేసుకొనే దుస్తులు గమనించారా? పచ్చ, నలుపు, మట్టిరంగు మచ్చలంటే చొక్క, ప్యాంటు వేసుకుంటారు కదూ. ఎందుకంటే శత్రుసైన్యానికి కనపడకుండా చెట్ల మధ్య దాక్కొనడానికి ఈ రకమైన దుస్తులు వేసుకొంటారు. అదే విధంగా జిబ్రా మీద ఈ చారలు ఉండటం వల్ల వాటిని వేటాడే సింహాలకి ఇవి కనపడవట! నలుపు జిబ్రా మీద ఈ నలుపు తెలపు చారలుండడం వల్ల ప్రకృతిలో కలిసిపొయి ఒక జంతువులా కనపడదు. ఇంకో విషయం ఏంటంటే జిబ్రాలు ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. వాటిని తినే సింహాలు కూడా అఫ్రికాలోనే ఎక్కువగా ఉన్నాయనుకోండి. జిబ్రాలకి ఒక అలవాటుంది. అదేంటంటే అవి ఎప్పుడూ ఒంటరిగా వుండవు. గుంపులు గుంపులుగా జీవిస్తుంటాయి. గుంపుగా వెళ్తున జిబ్రాలను సింహాలు అసలు కనిపెట్టలేవు. ఎందుకంటే చారలుచారలుగా ఒక గుంపు వెళ్తుంటే అవి జిబ్రాలని వాటికి అర్ధం కావు. ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్పాలి. మనిషి వేలిముద్రల్లాగా ఏ రెండు జిబ్రాలకి ఒకే రకమైన చారలుండవు. మనం జిబ్రాని చూసి తెల్లగాడిద మీద నల్లని చారలున్నాయి అనికూడా అనుకొంటాం. కాని ఆఫ్రికన్లు నల్లని గాడిదమీద తెల్లని చారలున్నాయి అనుకుంటారట. ఎంతైనా అఫ్రికన్లు నల్లజాతి వారని నిరూపించుకొన్నారు కదూ!

ఆధారం: సి.హెచ్. ఆనంద్

3.00293255132
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు