పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కటిల్ ఫిష్

కటిల్ ఫిష్ గురించి తెలుసుకుందాం.

mar32.jpgసముద్రాలలో చాలా విచిత్రమైన జంతువులుంటాయి. కటిల్ ఫిష్ వాటిల్లో ఒకటిగా చెప్పవచ్చు. దీనికి చాలా పెద్ద గుండె ఉంటుంది నిజానికి దీనికి మూడు గుండెలు ఉంటాయి. ఈ మూడింటిలో రెండు గుండెలు దాని రక్తాన్ని మొప్పల్లోకి పంపు చేస్తుంటాయి. మూడవది రక్తాన్ని మిగత భాగాలకి పంపు చేస్తుంది.mar31.jpg దీనికి రక్తం నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే దీని రక్తంలో రాగి ఉంటుంది. నిజానికి కటిల్ ఫిష్ ని చేప అని అంటారు కాని అది చేప కాదు. అది అక్టోపస్ జాతికి చెందినది. వీటిని సెఫలోపాప్స్ అంటారు. అంటే తలనే పాదాలుగా ఉపయోగించే జంతువులు అన్నమాట. తలకిందులుగా కదలడం వీటికి అలవాటు. సముద్ర గర్భంలో జీవించడానికి అనువుగా ఉంటుంది వీటి శరీరం. ఇవి తమ శరీర రంగుని మార్చగలుగుతాయి. mar30.jpgశత్రవులు వచ్చినప్పుడు శరీరం రంగు అరైసరాల రంగులో కలిసి పోయి శత్రువులకు కనపడకుండా ఉండిపోతాయి. ఇవి నత్త జాతికి చెందిన జంతువులను తమకన్నా చిన్న చేపలను ఆహారంగా తీసుకొంటాయి. తమ ఆహారాన్ని ఆకర్షించే విధంగా కూడా ఇవి తమ రంగులు మారుస్తుంటాయి. వీటి చర్మంలో రంగులు కలిగించే తిత్తులు ఉంటాయి. ఒక్కసారి శత్రువుల దాడి నుండి తప్పించుకోనేందుకు ఈ తిత్తులు నల్లటి పదార్ధాన్ని పిచ్చికారి చేస్తాయి. శత్రువులకు కళ్ళు కనపడకుండా పోతుంది. అప్పుడు ఇవి శత్రువు నుండి దొరక్కుండా పారిపోతాయి. భలే విచిత్రమైన జంతువు కదూ!

3.0037593985
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు