హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / కరెంటు తీగల పై కూర్చునే పక్షులకు షాక్ కొట్టదా ?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కరెంటు తీగల పై కూర్చునే పక్షులకు షాక్ కొట్టదా ?

అడిగి తెలుసుకుందాం ....

మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు. కరెంటు వైర్ల మీద కూర్చునే పక్షులకి షాక్ కొట్టదు! అందుకు రెండు కారణాలున్నాయి. అవేంటంటే....

ఎవరైనా వ్యక్తిగాని, ఏదైనా పక్షికిగాని షాక్ కొట్టాలంటే ఆ జీవి గుండా విద్యుత్తు ప్రవహించాలి. విద్యుత్తు "ఎప్పుడూ తక్కువ నిరోధం ఉండే మార్గం ద్వారా ప్రవహిస్తుంది. ఉదాహరణకి మీరు ఒక చోటుకి వెళ్ళాలనుకోండి. అక్కడికి రెండు దారులున్నాయనుకోండి. ఒక దారిలో ముళ్ళచెట్లు, రాళ్ళు, గుంతలు ఉన్నాయి. పైగా అది కాస్త దూరం. రెండవ దారి చక్కటి రోడ్డు. పైగా బాగా దగ్గర. మీరు ఏ దారి ఎంచుకొంటారు? రెండవదే కదా! అంటే చక్కటి రోడ్డు ఉండే దారినే ఎంచుకొంటారు. మీలాగే విద్యుత్తు కూడా తక్కువ నిరోధం ఉండే దారి గుండా ప్రవహిస్తుంది. అన్ని జీవులు ఎంతో కొంత నిరోధం (Resistance) కలిగి ఉంటాయి. పక్షి మనిషి కన్నా ఎక్కువ నిరోధం కలిగి ఉంటుంది, అందుకని విద్యుత్తు పక్షి గుండా ప్రవహించదు. అది కరెంటు తీగ ద్వారా ప్రవహించడాన్నే ఎంచుకొంటుంది.

రెండవ కారణం చాలా ముఖ్యమైనది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు విద్యుత్తుకి సంబంధించి కొంత అవగాహన ఉండాలి. అప్పుడు గానీ మనకు రెండవ కారణం అర్థం కాదు. విద్యుత్తు అంటే కంటికి కనపడని చిన్న విద్యుదావేశ కణాలు. + ఇలా విద్యుదావేశకణాలు (Charged Particles) ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రవహించడాన్ని కరెంటు (Current) అంటారు.

ఈ విద్యుదావేశ కణాలు ఒక చోట నుండి ఇంకో చోటికి ప్రహించాలంటే ఆ రెండిటి మధ్య పోటెన్షియల్ భేధం (Potential difference) ఉండాలి. ఉదాహరణకి నీరు.. పై నుండి ఇంకో చోటికి ప్రవహించాలంటే వాటి మధ్య తేడా ఉండాలి కదా. నీరు ఎప్పుడూ ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తు (పల్లం) ప్రదేశానికి ప్రవహిస్తుంది కదా! అదే విధంగా విద్యుత్తు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న చోటునుంచి తక్కువ వే పొటాన్షియల్ ఉన్న చోటికి ప్రవహిస్తుంది.

ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకొందాం. మన కి భూమి అన్నింటి కన్నా తక్కువ పొటెన్షియల్ ఉన్న వస్తువు. అందుకని మన టీవీలకు, కంప్యూటర్లకి, ఫ్రిజ్లకి ఒక వైరును భూమిలోకి పెడతాం. దీనిని మనం ఎర్త్ (Earth) అంటాం. ఎందుకంటే ఫ్రిడ్జ్ బాడీలోకి ఒక వేళ విద్యుత్తు ప్రవహిస్తే అది మనలోకి రాకుండా భూమిలోకి వెళ్ళిపోవాలని ఎర్తీ చేస్తాం. అంటే విద్యుత్తు మన ద్వారా ప్రవహించకుండా వైర్ల ద్వారా (Earth wire) భూమిలోకి ప్రవహిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ Resistance కలుగుంటాం. కనుక విద్యుతు వైరు ద్వారా భూమిలోకి పోవడాన్ని ఎంచుకొంటుంది.

ఇక వైరు మీద కూర్చున్న పక్షి రెండు కాళ్ళు ఒకే వైరు మీద పెట్టి గట్టిగా పట్టుకొటుంది. అందుకనే ఆ రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం దాదాపు శూన్యం. కాబట్టి కరెంటు పక్షి గుండా ప్రవహించదు. ఒక వేళ పక్షి కనుక కరెంటు తీగ మీద కూర్చున్నప్పుడు భూమిని తాకో, ఇంకో వైరుక తగిలిందనుకోండి. అప్పుడు కరెంటు పక్షిగుండా ప్రవహించి భూమిలోకి వెళుతుంది. అప్పుడు దానికి షాక్ కొడుతుంది. అంతెందుకు. కరెంటు తీగల్లో ఒకే తీగని గట్టిగా పట్టుకొని భూమి తగలకుండా వేళ్ళాడితే మనకు కూడా కరెంటు షాక్ కొట్టదు.

2.99127906977
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు